16. ఉత్తరవాయువూ, ఏతెంచుము దక్షిణవాయువూ, వేంచేయుము నా ఉద్యానవనముమీద విసరుడి దాని పరిమళములు వ్యాపింపజేయుడి నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేంచేయును గాక తనకిష్టమైన ఫలముల నతడు భుజించునుగాక.
ఈ మాట అంటున్నది పెండ్లి కొడుకే. ఎందుకంటే “నా ఉద్యానవనం” అంటున్నాడు. గాలి పవిత్రాత్మకు చక్కని సాదృశ్యం (యోహాను 3:8 – హీబ్రూలోను, గ్రీకులోను, గాలి, ఊపిరి, ఆత్మ, ఈ మూడు పదాలు ఒకటే). దేవుని ఆత్మ సంఘంలో వీస్తూ ఉన్నప్పుడే దానిలోని పరిమళం వ్యాపిస్తుంది.
“నా ప్రియుడు”– వధువు ప్రేమ నిండిన మనస్సుతో ఆయన్ను ఆహ్వానిస్తుంది. ఇదే వరుని ప్రేమకు తగిన ప్రతిస్పందన.