Genesis - ఆదికాండము 26 | View All

1. అబ్రాహాము దినములలో వచ్చిన మొదటి కరవు గాక మరియొక కరవు ఆ దేశములో వచ్చెను. అప్పడు ఇస్సాకు గెరారులోనున్న ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు నొద్దకు వెళ్లెను.

1. abraahaamu dinamulalō vachina modaṭi karavu gaaka mariyoka karavu aa dheshamulō vacchenu. Appaḍu issaaku geraarulōnunna philishtheeyula raajaina abeemeleku noddhaku veḷlenu.

2. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై నీవు ఐగుప్తులోనికి వెళ్లక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము.

2. akkaḍa yehōvaa athaniki pratyakshamai neevu aigupthulōniki veḷlaka nēnu neethoo cheppu dheshamandu nivasin̄chumu.

3. ఈ దేశమందు పరవాసివై యుండుము. నేను నీకు తోడైయుండి నిన్ను ఆశీర్వదించెదను;
హెబ్రీయులకు 11:9

3. ee dheshamandu paravaasivai yuṇḍumu. Nēnu neeku thooḍaiyuṇḍi ninnu aasheervadhin̄chedanu;

4. ఏలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నియు ఇచ్చి, నీ తండ్రియైన అబ్రాహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి, ఆకాశ నక్షత్రములవలె నీ సంతానమును విస్తరింపచేసి ఈ దేశములన్నియు నీ సంతానమునకు ఇచ్చెదను. నీ సంతానమువలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదింపబడుదురు.
అపో. కార్యములు 3:25

4. yēlayanagaa neekunu nee santhaanamunakunu ee dheshamulanniyu ichi, nee thaṇḍriyaina abraahaamuthoo nēnu chesina pramaaṇamu neravērchi, aakaasha nakshatramulavale nee santhaanamunu vistharimpachesi ee dheshamulanniyu nee santhaanamunaku icchedanu. nee santhaanamuvalana samastha bhoolōkamulōni samastha janulu aasheervadhimpabaḍuduru.

5. ఏలయనగా అబ్రాహాము నా మాట విని నేను విధించిన దాని నా ఆజ్ఞ లను నా కట్టడలను నా నియమములను గైకొనెనని చెప్పెను.

5. yēlayanagaa abraahaamu naa maaṭa vini nēnu vidhin̄china daani naa aagna lanu naa kaṭṭaḍalanu naa niyamamulanu gaikonenani cheppenu.

6. ఇస్సాకు గెరారులో నివసించెను.

6. issaaku geraarulō nivasin̄chenu.

7. ఆ చోటి మనుష్యులు అతని భార్యను చూచి- ఆమె యెవరని అడిగినప్పుడు అతడుఆమె నా సహోదరి అని చెప్పెను; ఎందుకనగా- రిబ్కా చక్కనిది గనుక ఈ చోటి మనుష్యులు ఆమె నిమిత్తము నన్ను చంపుదురేమో అనుకొని తన భార్య అని చెప్పుటకు భయపడెను.

7. aa chooṭi manushyulu athani bhaaryanu chuchi- aame yevarani aḍiginappuḍu athaḍu'aame naa sahōdari ani cheppenu; endukanagaa- ribkaa chakkanidi ganuka ee chooṭi manushyulu aame nimitthamu nannu champudurēmō anukoni thana bhaarya ani cheppuṭaku bhayapaḍenu.

8. అక్కడ అతడు చాలా దినములుండిన తరువాత ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు కిటికీలో నుండి చూచినప్పుడు ఇస్సాకు తన భార్యయైన రిబ్కాతో సరసమాడుట కనబడెను.

8. akkaḍa athaḍu chaalaa dinamuluṇḍina tharuvaatha philishtheeyula raajaina abeemeleku kiṭikeelō nuṇḍi chuchinappuḍu issaaku thana bhaaryayaina ribkaathoo sarasamaaḍuṭa kanabaḍenu.

9. అప్పుడు అబీమెలెకు ఇస్సాకును పిలిపించి ఇదిగో ఆమె నీ భార్యయేఆమె నా సహోదరి అని యేల చెప్పితివని అడుగగా ఇస్సాకుఆమెను బట్టి నేను చనిపోవుదు నేమో అనుకొంటినని అతనితో చెప్పెను.

9. appuḍu abeemeleku issaakunu pilipin̄chi idigō aame nee bhaaryayē'aame naa sahōdari ani yēla cheppithivani aḍugagaa issaaku'aamenu baṭṭi nēnu chanipōvudu nēmō anukoṇṭinani athanithoo cheppenu.

10. అందుకు అబీమెలెకు నీవు మాకు చేసిన యీ పని యేమి? ఈ జనులలో ఎవడైన ఆమెతో నిర్భయముగా శయనించవచ్చునే. అప్పుడు నీవు మామీదికి పాతకము తెచ్చిపెట్టు వాడవుగదా అనెను.

10. anduku abeemeleku neevu maaku chesina yee pani yēmi? ee janulalō evaḍaina aamethoo nirbhayamugaa shayanin̄chavachunē. Appuḍu neevu maameediki paathakamu techipeṭṭu vaaḍavugadaa anenu.

11. అబీమెలెకుఈ మనుష్యుని జోలికైనను ఇతని భార్య జోలికైనను వెళ్లు వాడు నిశ్చయముగా మరణశిక్ష పొందునని తన ప్రజల కందరికి ఆజ్ఞాపింపగా

11. abeemeleku'ee manushyuni jōlikainanu ithani bhaarya jōlikainanu veḷlu vaaḍu nishchayamugaa maraṇashiksha pondunani thana prajala kandariki aagnaapimpagaa

12. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతలు ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయెను.

12. issaaku aa dheshamandunnavaaḍai vitthanamu vēsi aa samvatsaramu nooranthalu phalamu pondhenu. Yehōvaa athanini aasheervadhin̄chenu ganuka aa manushyuḍu goppavaaḍaayenu.

13. అతడు మిక్కిలి గొప్పవాడగువరకు క్రమ క్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చెను.

13. athaḍu mikkili goppavaaḍaguvaraku krama kramamugaa abhivruddhi ponduchu vacchenu.

14. అతనికి గొఱ్ఱెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహ మును కలిగినందున ఫిలిష్తీయులు అతనియందు అసూయ పడిరి.

14. athaniki gorrela aasthiyu goḍla aasthiyu daasulu goppa samooha munu kaliginanduna philishtheeyulu athaniyandu asooya paḍiri.

15. అతని తండ్రియైన అబ్రాహాము దినములలో అతని తండ్రి దాసులు త్రవ్విన బావులన్నిటిని ఫిలిష్తీయులు మన్ను పోసి పూడ్చివేసిరి.

15. athani thaṇḍriyaina abraahaamu dinamulalō athani thaṇḍri daasulu travvina baavulanniṭini philishtheeyulu mannu pōsi pooḍchivēsiri.

16. అబీమెలెకు నీవు మాకంటె బహు బలము గలవాడవు గనుక మాయొద్దనుండి వెళ్లిపొమ్మని ఇస్సాకు తో చెప్పగా

16. abeemeleku neevu maakaṇṭe bahu balamu galavaaḍavu ganuka maayoddhanuṇḍi veḷlipommani issaaku thoo cheppagaa

17. ఇస్సాకు అక్కడనుండి వెళ్లి గెరారు లోయలో గుడారము వేసికొని అక్కడ నివసించెను.

17. issaaku akkaḍanuṇḍi veḷli geraaru lōyalō guḍaaramu vēsikoni akkaḍa nivasin̄chenu.

18. అప్పుడు తన తండ్రియైన అబ్రాహాము దినములలో త్రవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించెను; ఏలయనగా అబ్రా హాము మృతిబొందిన తరువాత ఫిలిష్తీయులు వాటిని పూడ్చివేసిరి. అతడు తన తండ్రి వాటికి పెట్టిన పేళ్ల చొప్పున తిరిగి వాటికి పేర్లు పెట్టెను.

18. appuḍu thana thaṇḍriyaina abraahaamu dinamulalō travvina neeḷla baavulu issaaku thirigi travvin̄chenu; yēlayanagaa abraa haamu mruthibondina tharuvaatha philishtheeyulu vaaṭini pooḍchivēsiri. Athaḍu thana thaṇḍri vaaṭiki peṭṭina pēḷla choppuna thirigi vaaṭiki pērlu peṭṭenu.

19. మరియఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవ్వగా జెలలుగల నీళ్లబావి దొరికెను.

19. mariyu issaaku daasulu aa lōyalō travvagaa jelalugala neeḷlabaavi dorikenu.

20. అప్పుడు గెరారు కాపరులు ఇస్సాకు కాపరులతో జగడమాడి ఈ నీరు మాదే అని చెప్పిరి గనుక వారు తనతో కలహించినందున అతడు ఆ బావికి ఏశెకు అను పేరు పెట్టెను.

20. appuḍu geraaru kaaparulu issaaku kaaparulathoo jagaḍamaaḍi ee neeru maadhe ani cheppiri ganuka vaaru thanathoo kalahin̄chinanduna athaḍu aa baaviki ēsheku anu pēru peṭṭenu.

21. వారు మరియొక బావి త్రవ్వినప్పుడు దానికొరకును జగడమాడిరి గనుక దానికి శిత్నా అను పేరు పెట్టెను.

21. vaaru mariyoka baavi travvinappuḍu daanikorakunu jagaḍamaaḍiri ganuka daaniki shitnaa anu pēru peṭṭenu.

22. అతడు అక్కడనుండి వెళ్లి మరియొక బావి త్రవ్వించెను. దాని విషయమై వారు జగడ మాడలేదు గనుక అతడు ఇప్పుడు యెహోవా మనకు ఎడము కలుగజేసియున్నాడు గనుక యీ దేశమందు అభివృద్ధి పొందుదుమనుకొని దానికి రహెబోతు అను పేరు పెట్టెను.

22. athaḍu akkaḍanuṇḍi veḷli mariyoka baavi travvin̄chenu. daani vishayamai vaaru jagaḍa maaḍalēdu ganuka athaḍu ippuḍu yehōvaa manaku eḍamu kalugajēsiyunnaaḍu ganuka yee dheshamandu abhivruddhi pondudumanukoni daaniki rahebōthu anu pēru peṭṭenu.

23. అక్కడనుండి అతడు బెయేరషెబాకు వెళ్లెను.

23. akkaḍanuṇḍi athaḍu beyērshebaaku veḷlenu.

24. ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను నీ తండ్రియైన అబ్రాహాము దేవుడను, నేను నీకు తోడైయున్నాను గనుక భయపడకుము; నా దాసుడైన అబ్రాహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపచేసెదనని చెప్పెను.

24. aa raatriyē yehōvaa athaniki pratyakshamai nēnu nee thaṇḍriyaina abraahaamu dhevuḍanu, nēnu neeku thooḍaiyunnaanu ganuka bhayapaḍakumu; naa daasuḍaina abraahaamunu baṭṭi ninnu aasheervadhin̄chi nee santhaanamunu vistharimpachesedhanani cheppenu.

25. అక్కడ అతడొక బలిపీఠము కట్టించి యెహోవా నామమున ప్రార్థనచేసి అక్కడ తన గుడారము వేసెను. అప్పుడు ఇస్సాకు దాసులు అక్కడ బావి త్రవ్విరి.

25. akkaḍa athaḍoka balipeeṭhamu kaṭṭin̄chi yehōvaa naamamuna praarthanachesi akkaḍa thana guḍaaramu vēsenu. Appuḍu issaaku daasulu akkaḍa baavi travviri.

26. అంతట అబీమెలెకును అతని స్నేహితుడైన అహుజతును అతని సేనాధిపతియైన ఫీకోలును గెరారునుండి అతనియొద్దకు వచ్చిరి.

26. anthaṭa abeemelekunu athani snēhithuḍaina ahujathunu athani sēnaadhipathiyaina pheekōlunu geraarunuṇḍi athaniyoddhaku vachiri.

27. ఇస్సాకుమీరు నామీద పగపట్టి మీయొద్దనుండి నన్ను పంపివేసిన తరువాత ఎందునిమిత్తము నా యొద్దకు వచ్చియున్నారని వారినడుగగా

27. issaakumeeru naameeda pagapaṭṭi meeyoddhanuṇḍi nannu pampivēsina tharuvaatha endunimitthamu naa yoddhaku vachiyunnaarani vaarinaḍugagaa

28. వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడైయుండుట చూచితివిు గనుక మనకు, అనగా మాకును నీకును మధ్య నొక ప్రమాణముండవలె ననియు

28. vaaru nishchayamugaa yehōvaa neeku thooḍaiyuṇḍuṭa chuchithivi ganuka manaku, anagaa maakunu neekunu madhya noka pramaaṇamuṇḍavale naniyu

29. మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమియు చేయక నిన్ను సమాధానముగా పంపి వేసితివిు గనుక నీవును మాకు కీడుచేయకుండునట్లు నీతో నిబంధన చేసికొందుమనియు అనుకొంటిమి; ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదము పొందిన వాడవనిరి.

29. mēmu ninnu muṭṭaka neeku mēlē thappa marēmiyu cheyaka ninnu samaadhaanamugaa pampi vēsithivi ganuka neevunu maaku keeḍucheyakuṇḍunaṭlu neethoo nibandhana chesikondumaniyu anukoṇṭimi; ippuḍu neevu yehōvaa aasheervaadamu pondina vaaḍavaniri.

30. అతడు వారికి విందుచేయగా వారు అన్నపానములు పుచ్చు కొనిరి.

30. athaḍu vaariki vinducheyagaa vaaru annapaanamulu puchu koniri.

31. తెల్లవారినప్పుడు వారు లేచి ఒకనితో ఒకడు ప్రమాణము చేసికొనిరి; తరువాత ఇస్సాకు వారిని సాగనంపగా వారు అతని యొద్దనుండి సమాధానముగా వెళ్లిరి.

31. tellavaarinappuḍu vaaru lēchi okanithoo okaḍu pramaaṇamu chesikoniri; tharuvaatha issaaku vaarini saaganampagaa vaaru athani yoddhanuṇḍi samaadhaanamugaa veḷliri.

32. ఆ దినమందే ఇస్సాకు దాసులు వచ్చి తాము త్రవ్విన బావినిగూర్చి అతనికి తెలియచేసి మాకు నీళ్లు కనబడినవని చెప్పిరి గనుక

32. aa dinamandhe issaaku daasulu vachi thaamu travvina baavinigoorchi athaniki teliyachesi maaku neeḷlu kanabaḍinavani cheppiri ganuka

33. దానికి షేబ అను పేరు పెట్టెను. కాబట్టి నేటి వరకు ఆ ఊరి పేరు బెయేరషెబా.

33. daaniki shēba anu pēru peṭṭenu. Kaabaṭṭi nēṭi varaku aa oori pēru beyērshebaa.

34. ఏశావు నలువది సంవత్సరములవాడైనప్పుడు హిత్తీయుడైన బేయేరీ కుమార్తెయగు యహూదీతును హిత్తీయుడైన ఏలోను కుమార్తెయగు బాశెమతును పెండ్లిచేసికొనెను.

34. ēshaavu naluvadhi samvatsaramulavaaḍainappuḍu hittheeyuḍaina bēyēree kumaartheyagu yahoodeethunu hittheeyuḍaina ēlōnu kumaartheyagu baashemathunu peṇḍlichesikonenu.

35. వీరు ఇస్సాకునకును రిబ్కాకును మనోవేదన కలుగజేసిరి.

35. veeru issaakunakunu ribkaakunu manōvēdhana kalugajēsiri.


Shortcut Links
ఆదికాండము - Genesis : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |

Support & Donate Us | Google Play Store | సజీవ వాహిని - Sajeeva Vahini 2009-2023. info@sajeevavahini.com
Sajeeva Vahini, Hyderabad & Chennai, India. SajeevaVahini.org Email: , . Whatsapp: 8898 318 318 or call us: +918898318318
Content on this website is prepared manually by Sajeeva Vahini, India. Our Content is free and open to use for any kind of distrubution. We request to carry a physical bible to churches rather than using bible on mobile or tablets. Please email any information for any suspected content/audio subject to piracy/copyright act on this website can be considered/removed. Which can help us to improve better. Note: we dont have any data/content related to Life Way Study Bible as a part of Sajeeva Vahini Notes or Verse Explanations.