ఇక్కడ వాడిన హీబ్రూ పదం పెళ్ళి కానివారికి పుట్టిన పిల్లవాడు అని అర్థం ఇవ్వదనీ, పెళ్ళి అయినవారు చేసిన వ్యభిచారం వల్ల, లేదా వరుడు కానివారితో వ్యభిచారం వల్ల పుట్టిన పిల్లవాడు అనే అర్థాన్నే ఇస్తుందనీ కొందరు హీబ్రూ పండితుల అభిప్రాయం – అంటే లేవీ 18, 20 అధ్యాయాల్లో ఉన్న చట్టాలను బట్టి నిషేధం అయిన సంబంధం వల్ల పుట్టిన పిల్లవాడు అన్నమాట (అంటే ఉదా: తండ్రి కూతురు, లేక అన్న చెల్లెళ్ళ మొదలైన సంబంధాల వల్ల పుట్టిన పిల్లలు). ఇలాంటి సంబంధం ఎక్కడైనా కనిపిస్తే 10 తరాల వరకూ దాని ఫలితాలను అనుభవించాలి (నిర్గమకాండము 20:5 నిర్గమకాండము 34:7 పోల్చిచూడండి). ఈ ఆజ్ఞద్వారా ఇలాంటి పాపం తన దృష్టిలో ఎంత ఘోరమైనదో దేవుడు చెప్తున్నాడు.