Genesis - ఆదికాండము 42 | View All

1. ధాన్యము ఐగుప్తులో నున్నదని యాకోబు తెలిసికొనినప్పుడు మీరేల ఒకరి ముఖము ఒకరు చూచుచున్నారని తన కుమారులతో అనెను.

1. Now Jacob, hearing that there was grain in Egypt, said to his sons, Why are you looking at one another?

2. మరియు అతడు - చూడుడి, ఐగుప్తులో ధాన్యమున్నదని వింటిని, మనము చావక బ్రదుకునట్లు మీరు అక్కడికి వెళ్లి మనకొరకు అక్కడనుండి ధాన్యము కొనుక్కొని రండని చెప్పగా
అపో. కార్యములు 7:12

2. And he said, I have had news that there is grain in Egypt: go down there and get grain for us, so that life and not death may be ours.

3. యోసేపు పదిమంది అన్నలు ఐగుప్తులో ధాన్యము కొనబోయిరి.

3. So Joseph's ten brothers went down to get grain from Egypt.

4. అయినను - ఇతనికి హాని సంభవించునేమో అని యాకోబు యోసేపు తమ్ముడగు బెన్యామీనును అతని అన్నలతో పంపినవాడు కాడు.

4. But Jacob did not send Benjamin, Joseph's brother, with them, for fear, as he said, that some evil might come to him.

5. కరవు కనాను దేశములో ఉండెను గనుక ధాన్యము కొనవచ్చిన వారితోకూడ ఇశ్రాయేలు కుమారులును వచ్చిరి.
అపో. కార్యములు 7:11

5. And the sons of Israel came with all the others to get grain: for they were very short of food in the land of Canaan.

6. అప్పుడు యోసేపు ఆ దేశమంతటిమీద అధికారియై యుండెను. అతడే ఆ దేశ ప్రజలందరికిని ధాన్యమమ్మకము చేయువాడు గనుక యోసేపు సహోదరులు వచ్చి ముఖములు నేలను మోపి అతనికి వందనము చేసిరి.

6. Now Joseph was ruler over all the land, and it was he who gave out the grain to all the people of the land; and Joseph's brothers came before him and went down on their faces to the earth.

7. యోసేపు తన సహోదరులను చూచి వారిని గురుతుపట్టి వారికి అన్యునివలె కనబడి వారితో కఠినముగా మాటలాడి - మీరెక్కడనుండి వచ్చితిరని అడిగెను. అందుకు వారు - ఆహారము కొనుటకు కనాను దేశమునుండి వచ్చితి మనిరి.

7. And when Joseph saw his brothers, it was clear to him who they were, but he made himself strange to them, and talking roughly to them, said, Where do you come from? And they said, From the land of Canaan, to get food.

8. యోసేపు తన సహోదరులను గురుతు పట్టెను గాని వారతని గురుతు పట్టలేదు.

8. Now though Joseph saw that these were his brothers, they had no idea who he was.

9. యోసేపు వారిని గూర్చి తాను కనిన కలలు జ్ఞాపకము చేసికొని - మీరు వేగులవారు ఈ దేశముగుట్టు తెలిసికొన వచ్చితిరని వారితోననగా

9. Then the memory of his dreams about them came back to Joseph, and he said to them, You have come secretly to see how poor the land is.

10. వారు లేదు ప్రభువా, నీ దాసులమైన మేము ఆహారము కొనుటకే వచ్చితివిు;

10. And they said to him, Not so, my lord: your servants have come with money to get food.

11. మేమందరము ఒక్క మనుష్యుని కుమారులము; మేము యథార్థవంతులమేగాని నీ దాసులమైన మేము వేగులవారము కామని అతనితో చెప్పిరి.

11. We are all one man's sons, we are true men; we have not come with any secret purpose.

12. అయితే అతడు - లేదు, ఈ దేశము గుట్టు తెలిసి కొనుటకై వచ్చితిరని వారితో అనెను.

12. And he said to them, No, but you have come to see how poor the land is.

13. అందుకు వారు - నీ దాసులమైన మేము పండ్రెండుమంది సహోదరులము, కనాను దేశములోనున్న ఒక్క మనుష్యుని కుమారులము; ఇదిగో కనిష్ఠుడు నేడు మా తండ్రియొద్ద ఉన్నాడు; ఒకడు లేడు అని ఉత్తరమిచ్చిరి.

13. Then they said, We your servants are twelve brothers, sons of one man in the land of Canaan; the youngest of us is now with our father, and one is dead.

14. అయితే యోసేపు - మీరు వేగులవారని నేను మీతో చెప్పినమాట నిజమే.

14. And Joseph said, It is as I said; you have come with some secret purpose;

15. దీనివలన మీ నిజము తెలియబడును; ఫరో జీవము తోడు, మీ తమ్ముడు ఇక్కడికి వచ్చితేనే గాని మీరిక్కడనుండి వెళ్లకూడదు.

15. But in this way will you be put to the test: by the life of Pharaoh, you will not go away from this place till your youngest brother comes here.

16. మీ తమ్ముని తీసికొని వచ్చుటకు మీలో ఒకని పంపుడి; అయితే మీరు బంధింపబడి యుందురు. అట్లు మీలో సత్యమున్నదో లేదో మీ మాటలు శోధింపబడును; లేనియెడల ఫరో జీవముతోడు, మీరు వేగుల వారని చెప్పి

16. Send one of your number to get your brother, and the rest of you will be kept in prison, so that your words may be tested to see if you are true; if not, by the life of Pharaoh, your purpose is certainly secret.

17. వారిని మూడు దినములు చెరసాలలో వేయించెను.

17. So he put them in prison for three days.

18. మూడవ దినమున యోసేపు వారిని చూచి నేను దేవునికి భయపడువాడను; మీరు బ్రదుకునట్లు దీని చేయుడి.

18. And on the third day Joseph said to them, Do this, if you would keep your lives: for I am a god-fearing man:

19. మీరు యథార్థవంతులైతిరా మీ సహోదరులలో ఒకడు ఈ చెరసాలలో బంధింపబడవలెను; మీరు వెళ్లి మీ కుటుంబముల కరవు తీరుటకు ధాన్యము తీసికొని పోవుడి.

19. If you are true men, let one of you be kept in prison, while you go and take grain for the needs of your families;

20. మీ తమ్ముని నా యొద్దకు తీసికొని రండి; అట్లు మీ మాటలు సత్యమైనట్టు కనబడును గనుక మీరు చావరని చెప్పెను. వారట్లు చేసిరి.

20. And come back to me with your youngest brother, so that your words may be seen to be true, and you will not be put to death. This is what you are to do.

21. అప్పుడు వారు నిశ్చయముగా మన సహోదరుని యెడల మనము చేసిన అపరాధమునకు శిక్ష పొందుచున్నాము. అతడు మనలను బతిమాలు కొనినప్పుడు మనము అతని వేదన చూచియు వినకపోతిమి;అందువలన ఈ వేదన మనకు వచ్చెదనని ఒకనితో ఒకడు మాటలాడుకొనిరి .

21. And they said to one another, Truly, we did wrong to our brother, for we saw his grief of mind, and we did not give ear to his prayers; that is why this trouble has come on us.

22. మరియరూబేను ఈ చిన్నవానియెడల పాపము చేయకుడని నేను మీతో చెప్పలేదా? అయినను మీరు వినరైతిరి గనుక అతని రక్తాపరాధము మనమీద మోపబడుచున్నదని వారి కుత్తర మిచ్చెను.

22. And Reuben said to them, Did I not say to you, Do the child no wrong? but you gave no attention; so now, punishment has come on us for his blood.

23. అయితే ద్విభాషి వారి మధ్య నుండెను గనుక తన మాట యోసేపు గ్రహించెనని వారు తెలిసికొనలేదు.

23. They were not conscious that the sense of their words was clear to Joseph, for he had been talking to them through one who had knowledge of their language.

24. అతడు వారియొద్దనుండి అవతలకు పోయి యేడ్చి, మరల వారియొద్దకు వచ్చి వారితో మాటలాడి, వారిలో షిమ్యోనును పట్టుకొని వారి కన్నుల ఎదుట అతని బంధించెను.

24. And turning away from them, he was overcome with weeping; then he went on talking to them again and took Simeon and put chains on him before their eyes.

25. మరియయోసేపు వారి గోనెలను ధాన్యముతో నింపుటకును, ఎవరి రూకలు వారి గోనెలో తిరిగి ఉంచుటకును, ప్రయాణము కొరకు భోజనపదార్థములు వారికిచ్చుటకును ఆజ్ఞ ఇచ్చెను. అతడు వారియెడల నిట్లు జరిగించెను.

25. Then Joseph gave orders for their bags to be made full of grain, and for every man's money to be put back into his bag, and for food to be given them for the journey: which was done.

26. వారు తాము కొనిన ధాన్యమును తమ గాడిదల మీద ఎక్కించుకొని అక్కడనుండి వెళ్లిపోయిరి.

26. Then they put the bags of grain on their asses and went away.

27. అయితే వారు దిగిన చోట ఒకడు తన గాడిదకు మేత పెట్టుటకై తన గోనె విప్పినప్పుడు అతని రూకలు కనబడెను, అవి అతని గోనెమూతిలో ఉండెను.

27. Now at their night's resting-place one of them, opening his bag to give his ass some food, saw his money in the mouth of the bag.

28. అప్పుడతడు - నా రూకలు తిరిగి యిచ్చివేసినారు. ఇదిగో ఇవి నా గోనె లోనే ఉన్నవని తన సహోదరులతో చెప్పెను. అంతట వారు గుండె చెదిరిపోయినవారై జడిసి - ఇదేమిటి? దేవుడు మనకిట్లు చేసెనని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి.

28. And he said to his brothers, My money has been given back: it is in my bag; then their hearts became full of fear, and turning to one another they said, What is this which God has done to us?

29. వారు కనాను దేశమందున్న తమ తండ్రియైన యాకోబు నొద్దకు వచ్చి తమకు సంభవించినది యావత్తును అతనికి తెలియ చేసిరి.

29. So when they came to Jacob their father, in the land of Canaan, they gave him an account of all their experiences, saying,

30. ఎట్లనగా - ఆ దేశమునకు ప్రభువైనవాడు మాతో కఠినముగా మాటలాడి, మేము ఆ దేశమును వేగుచూడ వచ్చినవారమని అనుకొనెను.

30. The man who is the ruler of the country was rough with us and put us in prison, saying that we had come with a secret evil purpose.

31. అప్పుడు మేము యథార్థవంతులము, వేగులవారము కాము.

31. And we said to him, We are true men, we have no evil designs;

32. పండ్రెండుమంది సహోదరులము, ఒక్కతండ్రి కుమారులము, ఒకడు లేడు, మా తమ్ముడు నేడు కనాను దేశమందు మా తండ్రియొద్ద ఉన్నాడని అతనితో చెప్పితివిు.

32. We are twelve brothers, sons of our father; one is dead, and the youngest is now with our father in the land of Canaan.

33. అందుకు ఆ దేశపు ప్రభువు మమ్మును చూచి మీరు యథార్థవంతులని దీనివలన నేను తెలిసికొందును. మీ సహోదరులలో ఒకనిని నాయొద్ద విడిచిపెట్టి మీ కుటుంబములకు కరవు తీరునట్లు

33. And the ruler of the land said, In this way I may be certain that you are true men; let one of you be kept here with me, while you go and take grain for the needs of your families;

34. నాయొద్దకు ఆ చిన్నవాని తోడుకొనిరండి. అప్పుడు మీరు యథార్థవంతులే గాని వేగులవారు కారని నేను తెలిసికొని మీ సహోదరుని మీకప్పగించెదను; అప్పుడు మీరు ఈ దేశమందు వ్యాపారము చేసికొనవచ్చునని చెప్పెననిరి.

34. And come back to me with your youngest brother: then I will be certain that you are true men, and I will give your brother back to you and let you do trade in the land.

35. వారు తమ గోనెలను కుమ్మరించినప్పుడు ఎవరి రూకల మూట వారి గోనెలో ఉండెను. వారును వారి తండ్రియు ఆ రూకల మూటలు చూచి భయపడిరి.

35. And when they took the grain out of their bags, it was seen that every man's parcel of money was in his bag; and when they and their father saw the money, they were full of fear.

36. అప్పుడు వారి తండ్రియైన యాకోబు వారిని చూచి మీరు నన్ను పుత్రహీనునిగా చేయుచున్నారు; యోసేపు లేడు; షిమ్యోను లేడు; మీరు బెన్యామీనును కూడ తీసికొనపోవుదురు; ఇవన్నియు నాకు ప్రతికూలముగా ఉన్నవని వారితో చెప్పెను.

36. And Jacob their father said to them, You have taken my children from me: Joseph is gone and Simeon is gone, and now you would take Benjamin away; all these things have come on me.

37. అందుకు రూబేను - నేనతని నీయొద్దకు తీసికొని రానియెడల నా యిద్దరు కుమారులను నీవు చంపవచ్చును; అతని నా చేతికప్పగించుము, అతని మరల నీయొద్దకు తీసికొని వచ్చి అప్పగించెదనని తన తండ్రితో చెప్పెను.

37. And Reuben said, Put my two sons to death if I do not come back to you with him; let him be in my care and I will give him safely back to you.

38. అయితే అతడు నా కుమారుని మీతో వెళ్లనియ్యను; ఇతని అన్న చనిపోయెను, ఇతడు మాత్రమే మిగిలియున్నాడు. మీరు పోవు మార్గమున ఇతనికి హాని సంభవించినయెడల నెరసిన వెండ్రుకలు గల నన్ను మృతుల లోకములోనికి దుఃఖముతో దిగిపోవునట్లు చేయుదురని చెప్పెను.

38. And he said, I will not let my son go down with you; for his brother is dead and he is all I have: if evil overtakes him on the journey, then through you will my grey head go down to the underworld in sorrow.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Genesis - ఆదికాండము 42 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible
యాకోబు మొక్కజొన్న కొనడానికి పది మంది కొడుకులను పంపాడు. (1-6) 
తన పొరుగువారు ఈజిప్ట్ అనే సుదూర ప్రాంతం నుండి మంచి మొక్కజొన్నలను కొన్నారని యాకోబు చూశాడు. దీంతో కష్టపడి పనిచేసి తనకు కూడా మంచి తిండి తెచ్చుకోవాలని కోరిక కలిగింది. మన ఆత్మలు ఆరోగ్యంగా ఉండాలంటే మనకు అవసరమైన వాటిని ఇతరులు పొందకుండా ఉండటం ముఖ్యం. మనం సహాయం కోసం అడగడం ద్వారా మరియు దానిని పొందడానికి కష్టపడి పనిచేయడం ద్వారా మనం సహాయం పొందవచ్చు, ప్రత్యేకించి మన ఆత్మల సంరక్షణ విషయంలో. యేసు వద్ద మనకు కావలసినది ఉంది, కానీ మనం అతని వద్దకు వెళ్లి దానిని అడగాలి.

జోసెఫ్ తన సహోదరులతో వ్యవహరించిన తీరు. (7-20) 
జోసెఫ్ తన సహోదరులతో కఠినంగా ప్రవర్తించాడు, అతను వారిని తిరిగి పొందాలనుకున్నాడు కాబట్టి కాదు, కానీ వారు చేసిన దానికి వారు జాలిపడాలని అతను కోరుకున్నాడు. అతను తన సోదరుడు బెంజమిన్ వెళ్లిపోయాడని అనుకున్నాడు, కాబట్టి అతను తన సోదరులను వారి తండ్రి మరియు బెంజమిన్ గురించి అడిగాడు. కొన్నిసార్లు దేవుడు వ్యక్తులతో కఠినంగా కనిపిస్తాడు, అతను వారిని ప్రేమిస్తున్నప్పటికీ మరియు వారితో దయగా ఉండాలని కోరుకుంటాడు. యోసేపు తన సోదరుల్లో ఒకరు తనతో ఉండాలని నిర్ణయించుకున్నాడు, మిగిలిన వారు బెన్యామీనును తీసుకురావడానికి ఇంటికి వెళ్లారు. జోసెఫ్ "నేను దేవునికి భయపడుతున్నాను" అంటే దేవుడు చూస్తున్నాడని అతనికి తెలుసు కాబట్టి వారికి ఎలాంటి తప్పు చేయనని అతను వాగ్దానం చేసాడు. దేవునికి భయపడే వ్యక్తులు మనతో న్యాయంగా వ్యవహరిస్తారని మనం నమ్మవచ్చు.

వారి పశ్చాత్తాపం, సిమియన్ నిర్బంధించారు. (21-24) 
మనం ఏదైనా తప్పు చేసినప్పుడు, అది చాలా కాలం క్రితం జరిగినా మనస్సాక్షి మనకు గుర్తుచేస్తుంది. జోసెఫ్ సోదరులకు ఇది జరిగింది, వారు జోసెఫ్‌కు చేసిన చెడు పనిని ఎగతాళి చేసి, దాని గురించి మరచిపోయారు. కానీ తరువాత, వారు చేసిన పనికి అపరాధభావం మరియు విచారం వ్యక్తం చేశారు. అందుకే మనం వేరొకరికి ఏదైనా తప్పు చేసినప్పుడు గుర్తుంచుకోవడం ముఖ్యం. జోసెఫ్ సహోదరులలో ఒకరైన రూబెన్ చెడ్డదాన్ని జరగకుండా ఆపడానికి ప్రయత్నించినందున అతను మంచిగా భావించాడు. కష్టమైనా చెడు విషయాలకు వ్యతిరేకంగా నిలబడటం చాలా ముఖ్యం. జోసెఫ్ తన సహోదరులు చేసిన పనికి విచారంగా ఉన్నాడు, అయినప్పటికీ అతను వారికి తెలియనట్లు నటించవలసి వచ్చింది.

మిగిలినవి మొక్కజొన్నతో తిరిగి వస్తాయి. (25-28) 
కొంతమంది మొక్కజొన్న కోసం వచ్చారు మరియు వారు దానిని పొందగలిగారు, అదనంగా వారు తమ డబ్బును తిరిగి పొందారు. ఇది యేసు మరియు యోసేపు ప్రజలకు ఉచితంగా వస్తువులను ఎలా అందజేస్తుంది. అంత డబ్బు లేని వారు కూడా తమకు కావాల్సినవి పొందగలరు. కానీ కొన్నిసార్లు, మనం చేసిన పని గురించి మనకు బాధగా అనిపించినప్పుడు, మనకు జరిగే మంచి విషయాలను మనం తప్పుగా అర్థం చేసుకోవచ్చు. అవి నిజంగా చెడ్డవని మనం అనుకోవచ్చు.

బెన్యామీనును ఈజిప్టుకు పంపడానికి యాకోబు నిరాకరించాడు. (29-38)
యాకోబు కుమారులు అతనికి ఆందోళన కలిగించిన విషయం అతనికి చెప్పారు. జోసెఫ్ వారి డబ్బును తిరిగి ఇచ్చినప్పటికీ, తన కుమారులు ఏదో తప్పు చేశారని మరియు ఈజిప్షియన్లకు కోపం తెప్పించారని యాకోబు ఇప్పటికీ భయపడ్డాడు. యాకోబు తన కుమారులను నమ్మలేదు, ఎందుకంటే అతను యోసేపుతో వెళ్ళినప్పటి నుండి అతను చూడలేదు. పిల్లలు చెడుగా ప్రవర్తించినప్పుడు, వారి తల్లిదండ్రులను విశ్వసించడం కష్టమవుతుంది. యాకోబు తాను యోసేపును ఎప్పటికీ కోల్పోయాడని మరియు సిమియోను మరియు బెంజమిన్ ప్రమాదంలో ఉన్నారని అనుకున్నాడు. తనకు అంతా తప్పు జరుగుతోందని భావించాడు. అయితే, మొదట్లో అలా జరగదని భావించినప్పటికీ, చివరికి, యాకోబు మరియు అతని కుటుంబానికి అంతా మంచిదే. కొన్నిసార్లు చెడుగా అనిపించే విషయాలు మనకు మంచివి. కొన్నిసార్లు విషయాలు చాలా కష్టంగా అనిపిస్తాయి మరియు మన శరీరాలు, మన డబ్బు, మన కీర్తి మరియు మన సంబంధాలు వంటి ప్రతిదీ మనకు వ్యతిరేకంగా జరుగుతున్నట్లు అనిపిస్తుంది. కానీ వాస్తవానికి, ఈ కష్టమైన విషయాలు మనకు మరింత మెరుగైన వ్యక్తులుగా మారడానికి మరియు మనకు గొప్ప ఆనందాన్ని అందించడంలో సహాయపడతాయి. ఎందుకంటే మనం చూడనప్పుడు కూడా యేసు మనల్ని గమనిస్తూ సహాయం చేస్తున్నాడు. కొన్నిసార్లు అతను మనల్ని సరిదిద్దాలి మరియు వినయంగా ఉండమని నేర్పించాలి, కానీ అతను మనల్ని ప్రేమిస్తాడు మరియు మనం సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు కాబట్టి అతను ఎల్లప్పుడూ అలా చేస్తాడు. మనం ఎప్పుడూ నిరీక్షణను వదులుకోకూడదు మరియు ఎల్లప్పుడూ యేసును విశ్వసించకూడదు, ఎందుకంటే అతను ఎల్లప్పుడూ మనల్ని జాగ్రత్తగా చూసుకుంటాడు మరియు మనం ఊహించిన దానికంటే ఎక్కువ ఇస్తాడు.




Shortcut Links
ఆదికాండము - Genesis : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |