3:2 అహరోను కుమారుల పేరులు ఏవనగా, తొలుతపుట్టిన నాదాబు అబీహు ఎలియాజరు ఈతామారు అనునవే.3:4 నాదాబు అబీహులు సీనాయి అరణ్యమందు యెహోవా సన్నిధిని అన్యాగ్ని నర్పించినందున వారు యెహోవా సన్నిధిని చనిపోయిరి. వారికి కుమారులు కలుగలేదు గనుక ఎలియాజరు ఈతామారును తమ తండ్రి యైన అహరోను ఎదుట యాజక సేవచేసిరి.3:32 యాజకుడైన అహరోను కుమారుడగు ఎలియాజరు లేవీయుల ప్రధానులకు ముఖ్యుడు. అతడు పరిశుద్ధస్థలమును కాపాడు వారిమీద విచారణకర్త.4:16 యాజకుడగు అహరోను కుమారుడైన ఎలియాజరు పైవిచారణలోనికి వచ్చునవి ఏవనగా దీపతైలము పరిమళ ధూపద్రవ్యములు నిత్య నైవేద్యము అభిషేకతైలము. మందిరమంతటి పైవిచారణ పరిశుద్ధస్థలములోనేమి, దాని ఉపకరణములలోనేమి, దానిలోనున్న అంతటి పై విచారణలోనికి అతని భారము.16:36 అప్పుడు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను నీవు యాజకుడగు అహరోను కుమారుడైన ఎలియాజరుతో ఇట్లనుము ఆ అగ్నిమధ్యనుండి ఆ ధూపార్తులను ఎత్తుము, అవి ప్రతిష్ఠితమైనవి.16:40 కోరహువలెను అతని సమాజము వలెను కాకుండునట్లు ఇశ్రాయేలీయులకు జ్ఞాపకసూచనగా ఉండుటకై యాజకుడైన ఎలియాజరు కాల్చబడిన వారు అర్పించిన యిత్తడి ధూపార్తులను తీసి యెహోవా మోషే ద్వారా తనతో చెప్పినట్లు వాటితో బలిపీఠమునకు కప్పుగా వెడల్పయిన రేకులు చేయించెను.19:3 మీరు యాజకుడైన ఎలియాజరుకు దానిని అప్పగింపవలెను. ఒకడు పాళెము వెలుపలికి దాని తోలు కొనిపోయి అతని యెదుట దానిని వధింపవలెను.19:4 యాజకుడైన ఎలియాజరు దాని రక్తములోనిది కొంచెము వ్రేలితో తీసి ప్రత్యక్షపు గుడారము ఎదుట ఆ రక్తములో కొంచెము ఏడుమారులు ప్రోక్షింపవలెను;20:25 నీవు అహరోనును అతని కుమారుడైన ఎలియాజరును తోడుకొని హోరు కొండయెక్కి,20:26 అహరోను వస్త్రములు తీసి అతని కుమారుడైన ఎలియాజరునకు తొడిగించుము. అహరోను తన పితరులతో చేర్చబడి అక్కడ చనిపోవును.20:28 మోషే అహరోను వస్త్రములు తీసి అతని కుమారుడైన ఎలియాజరునకు తొడిగించెను. అహరోను కొండశిఖరమున చనిపోయెను. తరువాత మోషేయు ఎలియాజరును ఆ కొండదిగివచ్చిరి.25:1 అప్పుడు యెహోవా మోషేకు ఈలాగు ఆజ్ఞ ఇచ్చెను యాజకుడైన అహరోను మనుమడును ఎలియాజరు కుమారుడునైన ఫీనెహాసు, ఇశ్రాయేలీయులు షిత్తీములో దిగియుండగా ప్రజలు మోయాబురాండ్రతో వ్యభిచారము చేయసాగిరి.25:7 యాజకుడైన అహరోను మనుమడును ఎలియాజరు కుమారుడునైన ఫీనెహాసు అది చూచి,25:10 అప్పుడు యెహోవా మోషేకు ఈలాగు ఆజ్ఞ ఇచ్చెను యాజకుడైన అహరోను మనుమడును ఎలియాజరు కుమారుడునైన ఫీనెహాసు,26:1 ఆ తెగులు పోయిన తర్వాత యెహోవా మోషేకును యాజకుడగు అహరోను కుమారుడైన ఎలియాజరుకును ఈలాగు సెలవిచ్చెను26:3 కాబట్టి యిరువది ఏండ్లు మొదలుకొని పైప్రాయముగల వారిని లెక్కింపుడని యెహోవా మోషేకును ఐగుప్తుదేశమునుండి వచ్చిన ఇశ్రాయేలీయులకును ఆజ్ఞాపించినట్లు మోషేయు యాజకుడగు ఎలియాజరును ఇశ్రాయేలీయులు26:60 అహరోను వలన నాదాబు అబీహు ఎలియాజరు ఈతామారు పుట్టిరి.26:63 యెరికో ప్రాంతములయందలి యొర్దానునొద్దనున్న మోయాబు మైదానములలో మోషేయు యాజకుడగు ఎలియాజరును ఇశ్రాయేలీయుల జనసంఖ్య చేసినప్పుడు లెక్కింపబడినవారు వీరు.27:2 వారు ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునొద్ద మోషే యెదుటను యాజకుడైన ఎలియాజరు ఎదుటను ప్రధానుల యెదుటను సర్వసమాజము యెదుటను నిలిచి చెప్పినదేమనగామా తండ్రి అరణ్యములో మరణమాయెను.27:19 యాజకుడగు ఎలియాజరు ఎదుటను సర్వసమాజము ఎదుటను అతని నిలువబెట్టి వారి కన్నుల యెదుట అతనికి ఆజ్ఞ యిమ్ము;27:21 యాజకుడైన ఎలియాజరు ఎదుట అతడు నిలువగా అతడు యెహోవా సన్నిధిని ఊరీము తీర్పువలన అతనికొరకు విచారింపవలెను. అతడును అతనితో కూడ ఇశ్రాయేలీయులందరును, అనగా సర్వసమాజము అతని మాటచొప్పున తమ సమస్త కార్యములను జరుపుచుండవలెను.27:22 యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేసెను. అతడు యెహోషువను తీసికొని యాజకుడైన ఎలియాజరు ఎదుటను సర్వసమాజము ఎదుటను అతని నిలువ బెట్టి31:6 మోషే వారిని, అనగా ప్రతి గోత్రమునుండి వేయేసి మందిని, యాజకుడగు ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసును పంపెను. అతని చేతిలోని పరిశుద్ధమైన ఉపకరణములను ఊదుటకు బూరలను యుద్ధమునకు పంపెను.31:12 తరువాత వారు మోయాబు మైదానములలో యెరికో యొద్దనున్న యొర్దాను దగ్గర దిగియున్న దండులో మోషే యొద్దకును యాజకుడైన ఎలియాజరు నొద్దకును ఇశ్రాయేలీయుల సమాజము నొద్దకును చెరపట్టబడినవారిని అపహరణములను ఆ కొల్ల సొమ్మును తీసికొని రాగా31:13 మోషేయు యాజకుడైన ఎలియాజరును సమాజ ప్రధానులందరును వారిని ఎదుర్కొనుటకు పాళెములోనుండి వెలుపలికి వెళ్లిరి.31:26 నీవును యాజకుడైన ఎలియాజరును సమాజముయొక్క పితరుల కుటుంబములలో ప్రధానులును మనుష్యులలో నేమి, పశువులలోనేమి, చెరపట్టబడిన దోపుడుసొమ్ము మొత్తమును లెక్కించి రెండు భాగములుగాచేసి31:29 యెహోవాకు ప్రతిష్ఠార్పణముగా యాజకుడైన ఎలియాజరుకు ఇయ్యవలెను.31:31 యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషేయు యాజకుడైన ఎలియాజరును చేసిరి.31:41 యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే పన్నును, అనగా యెహోవాకు చెల్లవలసిన ప్రతిష్ఠార్పణమును యాజకుడైన ఎలియాజరున కిచ్చెను.31:51 మోషేయు యాజకుడైన ఎలియాజరు నగలుగా చేయబడిన ఆ బంగారును వారియొద్ద తీసికొనిరి.31:54 అప్పుడు మోషేయు యాజకుడైన ఎలియాజరును సహస్రాధిపతులయొద్ద నుండియు శతాధిపతుల యొద్దనుండియు ఆ బంగారును తీసికొని యెహోవా సన్నిధిని ఇశ్రాయేలీయులకు జ్ఞాపకార్థముగా ప్రత్యక్షపు గుడారమున ఉంచిరి.32:2 వారు వచ్చి మోషేను యాజకుడగు ఎలియాజరును సమాజ ప్రధానులతొ32:28 కాబట్టి మోషే వారినిగూర్చి యాజకుడైన ఎలియాజరు కును, నూను కుమారుడైన యెహోషువకును, ఇశ్రాయేలీ యుల గోత్రములలో పితరుల కుటుంబ ముల ప్రధానులకును ఆజ్ఞాపించి వారితో ఇట్లనెను34:17 ఆ దేశమును మీకు స్వాస్థ్యముగా పంచిపెట్టవలసిన వారెవరనగా, యాజకుడైన ఎలియాజరును నూను కుమారుడైన యెహోషువయు.