ఆసా (ఆసా)


వైద్యుడు

Bible Results

"ఆసా" found in 9 books or 84 verses

1 రాజులు (24)

15:8 అబీయాము తన పితరులతో కూడ నిద్రించగా వారు దావీదు పురమందు అతనిని సమాధిచేసిరి; అతని కుమారుడైన ఆసా అతనికి మారుగా రాజాయెను.
15:9 ఇశ్రాయేలువారికి రాజైన యరొబాము ఏలుబడియందు ఇరువదియవ సంవత్సరమున ఆసా యూదావారిని ఏల నారంభించెను.
15:11 ఆసా తన పితరుడైన దావీదువలె యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొని
15:13 మరియు తన అవ్వ యైన మయకా అసహ్యమైన యొకదాని చేయించి, దేవతాస్తంభము ఒకటి నిలుపగా ఆసా ఆ విగ్రహమును ఛిన్నాభిన్నములుగా కొట్టించి, కిద్రోను ఓరను దాని కాల్చివేసి ఆమె పట్టపుదేవికాకుండ ఆమెను తొలగించెను.
15:14 ఆసా తన దినములన్నియు హృదయపూర్వకముగా యెహోవాను అనుసరించెను గాని ఉన్నత స్థలములను తీసివేయకపోయెను.
15:16 వారు బ్రదికిన దినములన్నిటను ఆసాకును ఇశ్రాయేలు రాజైన బయె షాకును యుద్ధము జరుగుచుండెను.
15:17 ఇశ్రాయేలు రాజైన బయెషా యూదావారికి విరోధియై యుండి, యూదా రాజైన ఆసాయొద్దనుండి యెవరును రాకుండను అతని యొద్దకు ఎవరును పోకుండను, రామాపట్టణమును కట్టిం చెను.
15:18 కాబట్టి ఆసా యెహోవా మందిరపు ఖజానాలోను రాజనగరుయొక్క ఖజానాలోను శేషించిన వెండి అంతయు బంగారమంతయు తీసి తన సేవకులచేతి కప్ప గించి, హెజ్యోనునకు పుట్టిన టబ్రిమ్మోను కుమారుడును దమస్కులో నివాసము చేయుచు అరామునకు రాజునైయున్న బెన్హదదుకు పంపి మనవి చేసినదేమనగా
15:20 కాబట్టి బెన్హదదు రాజైన ఆసా చెప్పిన మాటకు సమ్మతించి తన సైన్యముల అధిపతులను ఇశ్రాయేలు పట్టణముల మీదికి పంపి ఈయోనును దానును ఆబేల్బేత్మయకాను కిన్నెరెతును నఫ్తాలీ దేశమును పట్టుకొని కొల్లపెట్టెను.
15:22 అప్పుడు రాజైన ఆసా యెవరును నిలిచిపోకుండ యూదాదేశపు వారందరు రావలెనని ప్రకటన చేయగా జనులు సమకూడి బయెషా కట్టించుచుండిన రామాపట్టణపు రాళ్లను కఱ్ఱలను ఎత్తికొని వచ్చిరి. రాజైన ఆసా వాటి చేత బెన్యామీను సంబంధమైన గెబను మిస్పాను కట్టించెను.
15:23 ఆసా చేసిన యితర కార్యములను గూర్చియు, అతని బలమంతటిని గూర్చియు, అతడు చేసిన సమస్తమునుగూర్చియు, అతడు కట్టించిన పట్టణములనుగూర్చియు యూదారాజుల వృత్తాం తముల గ్రంథమందు వ్రాయబడియున్నది. అతడు వృద్ధుడైన తరువాత అతని పాదములయందు రోగముపుట్టెను.
15:24 అంతట ఆసా తన పితరులతోకూడ నిద్రించి, తన పితరుడైన దావీదు పురమందు తన పితరుల సమాధిలో పాతిపెట్టబడెను; అతనికి మారుగా యెహోషాపాతు అను అతని కుమారుడు రాజాయెను.
15:25 యరొబాము కుమారుడైన నాదాబు యూదారాజైన ఆసా యేలుబడిలో రెండవ సంవత్సరమందు ఇశ్రాయేలు వారిని ఏలనారంభించి ఇశ్రాయేలువారిని రెండు సంవత్సర ములు ఏలెను.
15:28 రాజైన ఆసాయేలుబడిలో మూడవ సంవత్సరమందు బయెషా అతని చంపి అతనికి మారుగా రాజాయెను.
15:32 వారి దినములన్నిటను ఆసా కును ఇశ్రాయేలు రాజైన బయెషాకును యుద్ధము జరుగు చుండెను.
15:33 యూదారాజైన ఆసా యేలుబడిలో మూడవ సంవ త్సరమందు అహీయా కుమారుడైన బయెషా తిర్సాయందు ఇశ్రాయేలువారినందరిని ఏలనారంభించి యిరువది నాలుగు సంవత్సరములు ఏలెను.
16:8 యూదారాజైన ఆసా యేలుబడిలో ఇరువదియారవ సంవత్సరమున బయెషా కుమారుడైన ఏలా తిర్సాయందు ఇశ్రాయేలువారినందరిని ఏలనారంభించి రెండు సంవత్సర ములు ఏలెను.
16:10 అతని కొట్టి చంపి అతనికి మారుగా రాజాయెను. ఇది యూదారాజైన ఆసా యేలుబడిలో ఇరువది యేడవ సంవత్సరమున సంభ వించెను.
16:15 యూదారాజైన ఆసా యేలుబడిలో ఇరువదియేడవ సంవత్సరమున జిమీ తిర్సాలో ఏడు దినములు ఏలెను. జనులు ఫిలిష్తీయుల సంబంధమైన గిబ్బెతోను మీదికి వచ్చి అక్కడ దిగియుండగా
16:23 యూదారాజైన ఆసా యేలుబడిలో ముప్పదియొకటవ సంవత్సరమున ఒమీ ఇశ్రాయేలువారికి రాజై పండ్రెండు సంవత్సరములు ఏలెను; ఆ పండ్రెండింటిలో ఆరు సంవత్సరములు అతడు తిర్సాలో ఏలెను.
16:29 యూదారాజైన ఆసా యేలుబడిలో ముప్పదియెనిమిదవ సంవత్సరమున ఒమీ కుమారుడైన అహాబు ఇశ్రా యేలువారికి రాజై షోమ్రోనులో ఇశ్రాయేలువారిని ఇరు వదిరెండు సంవత్సరములు ఏలెను.
22:41 ఆసా కుమారుడైన యెహోషాపాతు ఇశ్రాయేలు రాజైన అహాబు ఏలుబడిలో నాలుగవ సంవత్సరమందు యూదాను ఏలనారంభించెను.
22:43 అతడు తన తండ్రియైన ఆసాయొక్క మార్గములన్నిటి ననుసరించి, యెహోవా దృష్టికి అనుకూలముగా ప్రవర్తించుచు వచ్చెను. అయితే ఉన్నత స్థలములను తీసివేయలేదు; ఉన్నత స్థలములలో జనులు ఇంకను బలులు అర్పిం చుచు ధూపము వేయుచు నుండిరి.
22:46 తన తండ్రియైన ఆసాదినములలో శేషించియుండిన పురుషగాములను అతడు దేశములోనుండి వెళ్లగొట్టెను.

2 రాజులు (2)

18:18 హిల్కీయా కుమారుడును గృహనిర్వాహకుడునైన ఎల్యా కీమును, శాస్త్రియగు షెబ్నాయును, రాజ్యపుదస్తావేజుల మీద నున్న ఆసాపు కుమారుడైన యోవాహును వారి యొద్దకు పోయిరి.
18:37 గృహ నిర్వాహకుడును హిల్కీయా కుమారుడు నైన ఎల్యాకీ మును, శాస్త్రియగు షెబ్నాయును, రాజ్యపు దస్తావేజులమీదనున్న ఆసాపు కుమారుడైన యోవాహును, బట్టలు చింపుకొని హిజ్కియాయొద్దకు వచ్చి, రబ్షాకే పలికిన మాటలన్నియు తెలియజెప్పిరి.

1 దినవృత్తాంతములు (14)

3:10 అబీ యాకు ఆసా కుమారుడు, ఆసాకు యెహోషాపాతు కుమా రుడు
6:39 హేమాను సహోదరుడైన ఆసాపు ఇతని కుడిప్రక్కను నిలుచువాడు. ఈ ఆసాపు బెరక్యా కుమారుడు, బెరక్యా షిమ్యా కుమారుడు,
9:15 బక్బక్కరు, హెరెషు, గాలాలు, ఆసాపు కుమారుడగు జిఖ్రీకి పుట్టిన మీకా కుమారుడైన మత్తన్యా,
9:16 యదూతోను కుమారు డైన గాలాలునకు పుట్టిన షెమయా కుమారుడైన ఓబద్యా, నెటోపాతీయుల గ్రామములలో కాపురమున్న ఎల్కానా కుమారుడైన ఆసాకు పుట్టిన బెరెక్యా.
15:17 కావున లేవీయులు యోవేలు కుమారుడైన హేమానును, వాని బంధువులలో బెరెక్యా కుమారుడైన ఆసాపును, తమ బంధువులగు మెరారీయులలో కూషాయాహు కుమారుడైన ఏతానును,
15:19 పాటకులైన హేమానును ఆసాపును ఏతానును పంచలోహముల తాళములు వాయించుటకు నిర్ణయింపబడిరి.
16:5 వారిలో ఆసాపు అధిపతి, జెకర్యా అతని తరువాతివాడు, యెమీయేలు షెమీరామోతు యెహీయేలు మత్తిత్యా ఏలీయాబు బెనాయా ఓబేదెదోము యెహీయేలు అనువారు స్వరమండలములను సితారాలను వాయించుటకై నియమింపబడిరి, ఆసాపు తాళములను వాయించువాడు.
16:7 ఆ దినమందు యెహోవాను స్తుతిచేయు విచారణను ఏర్పరచి, దావీదు ఆసాపుచేతికిని వాని బంధువులచేతికిని దానిని అప్పగించెను. ఆ స్తుతి విధమేమనగా
16:37 అప్పుడు మందసము ముందర నిత్యమును కావలసిన అనుదిన సేవ జరుపుటకై దావీదు అచ్చట యెహోవా నిబంధన మందసముమీద ఆసాపును అతని సహోదరులను నియమించెను. ఓబేదె దోమును వారి సహోదరులైన అరువది ఎనిమిది మందిని
25:1 మరియు దావీదును సైన్యాధిపతులును ఆసాపు హేమాను యెదూతూను అనువారి కుమారులలో కొందరిని సేవనిమిత్తమై ప్రత్యేకపరచి, సితారాలను స్వరమండలములను తాళములను వాయించుచు ప్రకటించునట్లుగా నియమించిరి ఈ సేవావృత్తినిబట్టి యేర్పాటైన వారి సంఖ్య యెంతయనగా
25:2 ఆసాపు కుమారులలో రాజాజ్ఞ ప్రకారముగా ప్రకటించుచు, ఆసాపు చేతిక్రిందనుండు ఆసాపు కుమారులైన జక్కూరు యోసేపు నెతన్యా అషర్యేలా అనువారు.
25:6 వీరందరు ఆసాపునకును యెదూ తూనునకును హేమానునకును రాజు చేసియున్న కట్టడ ప్రకారము యెహోవా యింటిలో తాళములు స్వర మండలములు సితారాలు వాయించుచు గానము చేయుచు, తమ తండ్రి చేతిక్రింద దేవుని మందిరపు సేవ జరిగించు చుండిరి.
25:9 మొదటి చీటి ఆసాపువంశమందున్న యోసేపు పేరట పడెను, రెండవది గెదల్యా పేరట పడెను, వీడును వీని సహోదరులును కుమారులును పండ్రెండుగురు.
26:1 ద్వారపాలకుల విభాగమును గూర్చినది. ఆసాపుకుమారులలో కోరే కుమారుడైన మెషెలెమ్యా కోరహు సంతతివాడు.

2 దినవృత్తాంతములు (31)

5:12 ఆసాపు హేమాను యెదూతూనుల సంబంధ మైనవారును, వారి కుమారులకును సహోదరులకును సంబంధికులగు పాటకులైన లేవీయులందరును, సన్నపు నారవస్త్రములను ధరించుకొని తాళములను తంబురలను సితారాలను చేత పట్టుకొని బలిపీఠమునకు తూర్పుతట్టున నిలిచిరి,
14:1 అబీయా తన పితరులతో కూడ నిద్రింపగా జనులు అతనిని దావీదు పట్టణమందు పాతిపెట్టిరి; అతనికి బదులుగా అతని కుమారుడైన ఆసా రాజాయెను. ఇతని దినములలో దేశము పది సంవత్సరములు నెమ్మది పొందెను.
14:2 ఆసాతన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడచినవాడై
14:8 ఆ కాలమున డాళ్లను ఈటెలను పట్టుకొను మూడు లక్షలమంది యూదావారును, కేడెములు ధరించివిల్లువేయు రెండు లక్షల ఎనుబది వేలమంది బెన్యామీనీ యులును కూడిన సైన్యము ఆసాకు ఉండెను; వీరందరును పరాక్రమశాలులై యుండిరి.
14:9 కూషీయుడైన జెరహు వారిమీద దండెత్తి వేయి వేల సైన్యమును మూడువందల రథములను కూర్చుకొని బయలుదేరి మారేషావరకు రాగా ఆసా అతనికి ఎదురుబోయెను.
14:11 ఆసా తన దేవుడైన యెహోవాకు మొఱ్ఱపెట్టి యెహోవా, విస్తారమైన సైన్యముచేతిలో ఓడిపోకుండ బలములేనివారికి సహాయము చేయుటకు నీకన్న ఎవరును లేరు; మా దేవా యెహోవా, మాకు సహాయముచేయుము, నిన్నే నమ్ముకొని యున్నాము, నీ నామమునుబట్టియే యీ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరియున్నాము. యెహోవా నీవే మా దేవుడవు, నరమాత్రులను నీ పైని జయమొందనియ్యకుము అని ప్రార్థింపగా
14:12 యెహోవా ఆ కూషీయులను ఆసాయెదుటను యూదావారి యెదుటను నిలువనియ్యక వారిని మొత్తినందున వారు పారిపోయిరి.
14:13 ఆసాయును అతనితో కూడనున్న వారును గెరారువరకు వారిని తరుమగా కూషీయులు మరల పంక్తులు తీర్చ లేక యెహోవా భయముచేతను ఆయన సైన్యపు భయముచేతను పారిపోయిరి. యూదావారు విశేషమైన కొల్లసొమ్ము పట్టుకొనిరి.
15:1 ఆ కాలమున దేవుని ఆత్మ ఓదేదు కుమారుడైన అజర్యామీదికి రాగా అతడు ఆసాను ఎదుర్కొనబోయి యీలాగు ప్రకటించెను
15:2 ఆసా, యూదావారలారా, బెన్యామీనీయులారా, మీరందరు నా మాట వినుడి. మీరు యెహోవా పక్షపువారైనయెడల ఆయన మీ పక్షమున నుండును; మీరు ఆయనయొద్ద విచారణచేసినయెడల ఆయన మీకు ప్రత్యక్షమగును; మీరు ఆయనను విసర్జిం చినయెడల ఆయన మిమ్మును విసర్జించును,
15:8 ప్రవక్తయైన ఓదేదు ప్రవచించిన యీ మాటలు ఆసా వినినప్పుడు అతడు ధైర్యము తెచ్చుకొని యూదా బెన్యా మీనీయుల దేశమంతటినుండియు, ఎఫ్రాయిము మన్యములో తాను పట్టుకొనిన పట్టణములలోనుండియు హేయములైన విగ్రహములన్నిటిని తీసి వేసి, యెహోవా మంటపము ఎదుటనుండు యెహోవా బలిపీఠమును మరల కట్టించి
15:10 ఆసా యేలు బడియందు పదునైదవ సంవత్సరమున మూడవ నెలను వారు యెరూషలేములో కూడి
15:16 మరియు తన తల్లియైన మయకా అసహ్యమైన యొక దేవతా స్తంభమును నిలిపినందున ఆమె యిక పట్టపుదేవియై యుండకుండ రాజైన ఆసా ఆమెను త్రోసివేసి, ఆమె నిలిపిన విగ్రహమును పడగొట్టి ఛిన్నాభిన్నము చేసి కిద్రోను వాగుదగ్గర దాని కాల్చివేసెను.
15:17 ఆసా ఉన్నత స్థలములను ఇశ్రాయేలీయులలోనుండి తీసివేయలేదు గాని యితడు బ్రదికిన కాలమంతయు ఇతని హృదయము యథార్థముగా ఉండెను.
15:19 ఆసా యేలుబడియందు ముప్పది యయిదవ సంవత్సరమువరకు యుద్ధములు జరుగలేదు.
16:1 ఆసా యేలుబడియందు ముప్పది ఆరవ సంవత్సర మున ఇశ్రాయేలు రాజైన బయెషా యూదావారిమీద దండెత్తి బయలుదేరి యూదా రాజైన ఆసాయొద్దకు రాక పోకలు జరుగకుండునట్లు రామాను కట్టింపగా
16:2 ఆసా యెహోవా మందిరమందును రాజనగరునందును ఉన్న బొక్కసములలోని వెండి బంగారములను తీసి, దమస్కులో నివాసముచేయు సిరియా రాజగు బెన్హదదు నొద్దకు దూతలచేత పంపించి
16:4 బెన్హదదు రాజైన ఆసా మాట అంగీ కరించి, తన సైన్యముల అధిపతులను ఇశ్రాయేలువారి పట్టణములమీదికి పంపగా వీరు ఈయోనును దానును ఆబేల్మాయీమును నఫ్తాలి ప్రదేశమునకు చేరిన పట్టణముల లోని కొట్లను కొల్లపెట్టిరి.
16:6 అప్పుడు రాజైన ఆసా యూదా వారినందరిని సమకూర్చెను; వీరు పోయి బయెషా కట్టించు చుండిన రామాపట్టణపు రాళ్లను దూలములను తీసికొని వచ్చిరి, వాటితో ఆసా గెబను మిస్పాను ప్రాకార పురములుగా కట్టించెను.
16:7 ఆ కాలమందు దీర్ఘదర్శియైన హనానీ యూదా రాజైన ఆసాయొద్దకు వచ్చి అతనితో ఈలాగు ప్రకటించెనునీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొ నక సిరియా రాజును నమ్ముకొంటివే? సిరియా రాజుయొక్క సైన్యము నీ వశము నుండి తప్పించుకొనిపోయెను.
16:10 ఆ దీర్ఘదర్శి అట్లు ప్రకటించినందుకు ఆసా అతనిమీద కోపగించి రౌద్రము చూపి అతనిని బందీగృహ ములో వేసెను, ఇదియు గాక ఆ సమయమందే ఆసా జనులలో కొందరిని బాధపరచెను.
16:11 ఆసా చేసిన కార్యము లన్నిటినిగూర్చి యూదా ఇశ్రాయేలు రాజుల గ్రంథమందు వ్రాయబడియున్నది.
16:12 ఆసా తన యేలుబడియందు ముప్పది తొమ్మిదవ సంవత్సరమున పాదములలో జబ్బుపుట్టి తాను బహు బాధపడినను దాని విషయములో అతడు యెహోవాయొద్ద విచారణచేయక వైద్యులను పట్టుకొనెను.
16:13 ఆసా తన పితరులతో కూడ నిద్రించి తన యేలుబడియందు నలువది యొకటవ సంవత్సరమున మృతి నొందగా
17:2 అతడు యూదా దేశములోని ప్రాకార పురములన్నిటియందును సైన్యములను ఉంచి, యూదా దేశమందును తన తండ్రియైన ఆసా పట్టుకొనిన ఎఫ్రాయిము పట్టణములయందును కావలి బలములను ఉంచెను.
20:14 అప్పుడు మత్తన్యాకు పుట్టిన యెహీయేలు కుమారుడైన బెనాయాకు జననమైన జెకర్యా కుమారుడును ఆసాపు సంతతివాడును లేవీయుడునగు యహజీయేలు సమాజములో ఉండెను. యెహోవా ఆత్మ అతనిమీదికి రాగా అతడీలాగు ప్రకటించెను
20:32 అతడు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించి తన తండ్రియైన ఆసామార్గమందు నడచుచు దానిలోనుండి తొలగిపోకుండెను.
21:12 అంతట ప్రవక్తయైన ఏలీయా యొక పత్రిక వ్రాసి అతనియొద్దకు పంపెనునీ పితరుడగు దావీదునకు దేవుడైన యెహోవా సెలవిచ్చునదేమనగానీవు నీ తండ్రియైన యెహోషాపాతు మార్గములందైనను యూదారాజైన ఆసా మార్గములందైనను నడువక
29:13 ఎలీషాపాను సంతతి వారిలో షిమీ యెహీయేలు, ఆసాపు కుమారులలో జెకర్యా మత్తన్యా
29:30 దావీదును దీర్ఘదర్శియగు ఆసాపును రచించిన శ్లోకములను ఎత్తి యెహోవాను స్తుతించుడని రాజైన హిజ్కియాయును అధిపతులును లేవీయులకు ఆజ్ఞా పింపగా వారు సంతోషముతో స్తోత్రములు పాడి తలవంచి ఆరాధించిరి.
35:15 మరియు ఆసాపు సంతతివారగు గాయకు లును, ఆసాపు హేమానులును, రాజునకు దీర్ఘదర్శియగు యెదూతూనును దావీదు నియమించిన ప్రకారముగా తమ స్థలమందుండిరి; ద్వారములన్నిటియొద్దను ద్వార పాలకులు కనిపెట్టుచుండిరి. వారు తమ చేతిలో పని విడిచి అవతలికి వెళ్లిపోకుండునట్లు వారి సహోదరులగు లేవీయులు వారికొరకు సిద్ధపరచిరి.

ఎజ్రా (2)

2:41 గాయకులలో ఆసాపు వంశస్థులు నూట ఇరువది యెనమండు గురు,
3:10 శిల్పకారులు యెహోవా మందిరముయొక్క పునాదిని వేయుచుండగా ఇశ్రాయేలు రాజైన దావీదు నిర్ణయించిన విధిచొప్పున తమ వస్త్రములు ధరించుకొనినవారై యాజకులు బాకాలతోను, ఆసాపు వంశస్థులగు లేవీయులు చేయి తాళములతోను నిలువబడి యెహోవాను స్తోత్రము చేసిరి

నెహెమ్యా (6)

2:8 పట్టణప్రాకారమునకును, మందిరముతో సంబంధించిన కోటగుమ్మములకును, నేను ప్రవేశింపబోవు ఇంటికిని, దూలములు మ్రానులు ఇచ్చునట్లుగా రాజుగారి అడవులను కాయు ఆసాపునకు ఒక తాకీదును ఇయ్యుడని అడిగితిని; ఆలాగు నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణా హస్తముకొలది రాజు నా మనవి ఆలకించెను.
7:44 గాయకు లైన ఆసాపు వంశస్థులు నూట నలువది యెనమండుగురును
11:17 ఆసాపు కుమారుడైన జబ్దికి పుట్టిన మీకా కుమారుడైన మత్తన్యా ప్రార్థన స్తోత్రముల విషయములో ప్రధానుడు; తన సహోదరులలో బక్బుక్యాయును యెదూతూను కుమారుడైన గాలాలునకు పుట్టిన షమ్మూయ కుమారుడైన అబ్దాయును ఈ విషయములో అతని చేతిక్రింది వారు
11:22 యెరూషలేములో ఉన్న లేవీయులకు మీకాకు పుట్టిన మత్తన్యా కుమారుడైన హషబ్యా కనిన బానీ కుమారుడైన ఉజ్జీ ప్రధానుడు; ఆసాపు కుమారులలో గాయకులు దేవుని మందిరముయొక్క పనిమీద అధికారులు
12:35 యాజకుల కుమారులలో కొందరు బాకాలు ఊదుచు పోయిరి; వారెవరనగా, ఆసాపు కుమారుడైన జక్కూరునకు పుట్టిన మీకాయా కనిన మత్తన్యాకు పుట్టిన షెమయా కుమారుడైన యోనాతానునకు పుట్టిన జెకర్యాయు
12:46 పూర్వ మందు దావీదు దినములలో గాయకుల విషయములోను స్తోత్రగీతముల విషయములోను పాటల విషయములోను ఆసాపు ప్రధానుడు.

యెషయా (2)

36:3 హిల్కీయా కూమారుడును రాజు గృహనిర్వాహ కుడును నైన ఎల్యాకీమును శాస్త్రియగు షెబ్నాయును, రాజ్యపు దస్తావేజులమీదనున్న ఆసాపు కుమారుడగు యోవాహును వారియొద్దకు పోయిరి.
36:22 గృహనిర్వాహకుడును హిల్కీయా కుమారుడునైన ఎల్యాకీమును, శాస్త్రియగు షెబ్నాయును, రాజ్యపు దస్తావేజులమీదనున్న ఆసాపు కుమారుడగు యోవాహును బట్టలు చింపుకొని హిజ్కియాయొద్దకు వచ్చి రబ్షాకే పలికిన మాటలన్నియు తెలియజెప్పిరి.

యిర్మియా (1)

41:9 ఇష్మాయేలు గెదల్యాతోకూడ చంపిన మనుష్యుల శవములన్నిటిని పడవేసిన గోయి రాజైన ఆసా ఇశ్రాయేలు రాజైన బయషాకు భయపడి త్రవ్వించిన గొయ్యియే; నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు చంపబడినవారి శవములతో దాని నింపెను.

మత్తయి (2)

1:7 సొలొమోను రెహబామును కనెను; రెహబాము అబీయాను కనెను, అబీయా ఆసాను కనెను;
1:8 ఆసా యెహోషాపాతును కనెను, యెహోషాపాతు యెహోరామును కనెను, యెహోరాము ఉజ్జియాను కనెను;

Bible Topics

Back to Top
No Data Found

Songs and Lyrics

Back to Top
No Data Found

Sermons and Devotions

Back to Top
"ఆసా" found in 7 contents.

దేవుని మర్మమైన మార్గములు!
దేవుని మర్మమైన మార్గములు! విశ్వాసులు అయిన మనము మన జ్ఞానమును బట్టి కొన్ని సంగతులు ఇలా జరగాలి, ఆలా జరగాలి అని అనుకుంటాము.  మన ఆలోచన ప్రకారం లేదా మనకు తెలిసినట్లుగా జరగనప్పుడు బాధపడటం అత్యంత సహజం. కానీ దేవుని మార్గములు అత్యంత మర్మమయినవి, మానవ జ్ఞానమునకు అందనివి. అనంత జ్ఞానము కలిగిన

దినవృత్తాంతములు రెండవ గ్రంథము
ఉద్దేశము : రాజులకు తీర్పునిచ్చే కొలబద్ద చూపించుచూ, నిజమైన ఆరాధనకు మనుష్యులను ఐక్యపరచుట, యూదాలోని నీతి మంతులైన రాజులను వారి యొక్క పరిపాలనలో జరిగిన ఆత్మీయ ఉజ్జీవమును చూపించుట. చెడు రాజుల పాపములను బహిరంగముగా చూపించుట. గ్రంథకర్త : ఎజ్రా (యూదా పారంపర్య నమ్మకము

Day 84 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)
విశ్వాసము లేకుండ దేవునికి ఇష్టుడైయుండుట అసాధ్యము; దేవునియొద్దకు వచ్చువాడు ఆయన యున్నాడనియు, తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా (హెబ్రీ 11:6). ఆశలు అడుగంటిన సమయాల్లో విశ్వాసం! నిస్పృహ ఆవరించిన రోజులు ఎన్నో బైబిల్లో ఉదహరించబడినాయి. చాలా మట్టుకు బైబిల్లోని వర్ణనలు ఇవే. దాన్లోని కీ

Day 5 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
సహాయం చేయుటకు నీకన్న ఎవరు లేరు (2 దిన14: 11). దేవునిదే పూర్తి బాధ్యత అని ఆయనకి గుర్తు చెయ్యండి. నువ్వు తప్ప సహాయం చేసే వాళ్ళు మరెవరూ లేరు. వెయ్యీ వేలమంది ఆయుధాలు ధరించిన సైనికులు, మూడువందల రథాలు అతనికి (ఆసాకు) ఎదురై నిలిచాయి. అంత గొప్ప సమూహం ఎదుట తనకై తానూ నిలవడం అసాధ్యం. అతనికి సహాయంగా

దేవుని ముఖాన్ని చూస్తే..?
దేవుని ముఖాన్ని చూస్తే..? ఎదుటివారి ముఖాన్ని చూసినప్పుడు మన గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారో సుళువుగా అర్ధమవుతుంది. కోపంగా ఉన్నారా, ప్రేమను చూపిస్తున్నారా అనే భావనలు వారి ముఖ వ్యక్తీకరణలను బట్టి తెలుసుకుంటూ ఉంటాము. ఎదుటివారి నుండి సమాధానం పొందుకోవాలానే సమయంలో వారి మాటలతో పూర్తిగా సంతృప్తి ప

బలపరచే కృప
బలపరచే కృపAudio: https://youtu.be/fCiUs9cGg5U కీర్తన 94:17,18 యెహోవా నాకు సహాయము చేసియుండని యెడల నా ప్రాణము శీఘ్రముగా మౌనమందు నివసించి యుండును, నా కాలు జారెనని నేననుకొనగా యెహోవా, నీ కృప నన్ను బలపరచుచున్నది. ఈ భాగంలో కీర్తనాకారుడు ఒక

బలపరచే కృప
బలపరచే కృపకీర్తన 94:17,18 యెహోవా నాకు సహాయము చేసియుండని యెడల నా ప్రాణము శీఘ్రముగా మౌనమందు నివసించి యుండును, నా కాలు జారెనని నేననుకొనగా యెహోవా, నీ కృప నన్ను బలపరచుచున్నది. ఈ భాగంలో కీర్తనాకారుడు ఒక చీకటి అనుభవం గుండా వెళ్ళిన సంధర్భాన్న

Popular Searches:

దేవుడు , యెహోవా , మోషే , యేసు , శ్రమ , అల్ఫా , కృప , దావీదు , క్రీస్తు , యోసేపు , మరణ , , కాలేబు , మరియ , ఇశ్రాయేలీయులు , యాకోబు , గిద్యోను , బిలాము , కోరహు , అహరోను , ఆత్మ , అబ్రాహాము , మిర్యాము , అక్సా , సెల , అగ్ని , ప్రేమ , యెరూషలేము , సాతాను , సౌలు , హనోకు , పౌలు , ప్రార్థన , రాహాబు , దేవ�%B , ఇశ్రాయేలు , సొలొమోను , రాహేలు , యూదా , యాషారు , సీయోను , బబులోను , లోతు , స్వస్థ , ఇస్కరియోతు , జక్కయ్య , సారెపతు , సమరయ , ఇస్సాకు , యెహోషాపాతు , అన్న , ఐగుప్తు , అతల్యా , నోవహు , యోకెబెదు , ఏశావు , లేవీయులు , కోరెషు , ఆకాను , గిలాదు , ప్రార్ధన , కెజీయా , తెగులు , ఎలియాజరు , యోబు , అబ్దెయేలు , రోగము , గిల్గాలు , బేతేలు , మగ్దలేనే మరియ , వృషణాలు , అకుల , కూషు , తీతు , ఏలీయా , ఆషేరు , కనాను , మార్త , రక్షణ , సీమోను , దొర్కా , సబ్బు , ఆసా , బెసలేలు , బేతనియ , యెహోవా వశము , ఎఫ్రాయిము , యొర్దాను , ఏఫోదు , పరదైసు , కయీను , హాము , ఎలీషా , తామారు , హిజ్కియా , అంతియొకయ , ఊజు , రూతు , ఈకాబోదు , బర్జిల్లయి ,

Telugu Keyboard help