ఇస్సాకు (ఇస్సాకు)


అతడు నవ్వును

Bible Results

"ఇస్సాకు" found in 21 books or 122 verses

ఆదికాండము (74)

17:19 దేవుడు నీ భార్యయైన శారా నిశ్చయముగా నీకు కుమారుని కనును; నీవతనికి ఇస్సాకు అను పేరు పెట్టుదువు; అతని తరువాత అతని సంతానముకొరకు నిత్యనిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరచెదను.
17:21 అయితే వచ్చు సంవత్సరము ఈ కాలమందు శారా నీకు కనబోవు ఇస్సాకుతో నా నిబంధనను స్థిరపరచెదనని చెప్పెను.
21:3 అప్పుడు అబ్రాహాము తనకు పుట్టిన వాడును తనకు శారా కనిన వాడు నైన తన కుమారునికి ఇస్సాకు అను పేరు పెట్టెను.
21:4 మరియు దేవుడు అబ్రాహాము కాజ్ఞాపించిన ప్రకారము అతడు ఎనిమిది దినముల వాడైన ఇస్సాకు అను తన కుమారునికి సున్నతి చేసెను.
21:5 అబ్రాహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు నూరేండ్లవాడు.
21:8 ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రాహాము గొప్ప విందు చేసెను.
21:10 ఈ దాసిని దీని కుమారుని వెళ్లగొట్టుము; ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై యుండడని అబ్రాహాముతో అనెను.
21:12 అయితే దేవుడు ఈ చిన్న వాని బట్టియు నీ దాసిని బట్టియు నీవు దుఃఖపడవద్దు. శారా నీతో చెప్పు ప్రతి విషయములో ఆమె మాట వినుము; ఇస్సాకు వలన అయినది యే నీ సంతానమనబడును.
22:2 అప్పుడాయన నీకు ఒక్కడైయున్న నీ కుమారుని, అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసికొని మోరీయా దేశమునకు వెళ్లి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదానిమీద దహనబలిగా అతని నర్పించుమని చెప్పెను
22:3 తెల్లవారినప్పుడు అబ్రాహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడగు ఇస్సాకును వెంటబెట్టుకొని దహనబలి కొరకు కట్టెలు చీల్చి, లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్లెను.
22:6 దహనబలికి కట్టెలు తీసికొని తన కుమారుడగు ఇస్సాకుమీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయెను. వారిద్దరు కూడి వెళ్లుచుండగా
22:7 ఇస్సాకు తన తండ్రియైన అబ్రాహాముతో నా తండ్రీ అని పిలిచెను; అందుకతడు ఏమి నా కుమారుడా అనెను. అప్పుడతడు నిప్పును కట్టెలును ఉన్నవిగాని దహనబలికి గొఱ్ఱెపిల్ల ఏది అని అడుగగా
22:9 ఆలాగు వారిద్దరు కూడి వెళ్లి దేవుడు అతనితో చెప్పినచోటికి వచ్చినప్పుడు అబ్రాహాము అక్కడ బలి పీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడగు ఇస్సాకును బంధించి ఆ పీఠముపైనున్న కట్టెలమీద ఉంచెను.
24:14 కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను వంచుమని నేను చెప్పగానీవు త్రాగుము నీ ఒంటెలకును నీళ్లు పెట్టెదనని యే చిన్నది చెప్పునో ఆమెయే నీ సేవకుడైన ఇస్సాకుకొరకు నీవు నియమించినదై యుండును గాక, అందువలన నీవు నా యజమానునిమీద అనుగ్రహము చూపితివని తెలిసికొందు ననెను.
24:62 ఇస్సాకు బెయేర్‌ లహాయిరోయి మార్గమున వచ్చి దక్షిణ దేశమందు కాపురముండెను.
24:63 సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలువెళ్లి కన్నులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను,
24:64 రిబ్కా కన్నులెత్తి ఇస్సాకును చూచి ఒంటె మీదనుండి దిగి
24:66 అప్పుడా దాసుడు తాను చేసిన కార్యములన్నియు ఇస్సాకుతో వివరించి చెప్పెను.
24:67 ఇస్సాకు తల్లియైన శారా గుడారము లోనికి ఆమెను తీసికొని పోయెను. అట్లు అతడు రిబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయెను; అతడు ఆమెను ప్రేమించెను. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖనివారణ పొందెను.
25:5 వీరందరు కెతూరా సంతతివారు. అబ్రాహాము తనకు కలిగినది యావత్తు ఇస్సాకు కిచ్చెను.
25:6 అబ్రాహాము తన ఉపపత్నుల కుమారులకు బహుమానము లిచ్చి, తాను సజీవుడై యుండగానే తన కుమారుడగు ఇస్సాకు నొద్దనుండి తూర్పు తట్టుగా తూర్పు దేశమునకు వారిని పంపివేసెను.
25:9 హిత్తీయుడైన సోహరు కుమారుడగు ఎఫ్రోను పొలమందలి మక్పేలా గుహలో అతని కుమారులగు ఇస్సాకును ఇష్మాయేలును అతనిని పాతిపెట్టిరి; అది మమ్రే యెదుట నున్నది.
25:11 అబ్రాహాము మృతిబొందిన తరువాత దేవుడు అతని కుమారుడగు ఇస్సాకును ఆశీర్వదించెను; అప్పుడు ఇస్సాకు బేయేర్‌ లహాయిరోయి దగ్గర కాపురముండెను.
25:19 అబ్రాహాము కుమారుడగు ఇస్సాకు వంశావళి యిదే. అబ్రాహాము ఇస్సాకును కనెను.
25:20 ఇస్సాకు పద్దనరాములో నివసించు సిరియా వాడైన బెతూయేలు కుమార్తెయును సిరియా వాడైన లాబాను సహోదరియునైన రిబ్కాను పెండ్లి చేసికొన్నప్పుడు నలుబది సంవత్సరములవాడు.
25:21 ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్యయైన రిబ్కా గర్భవతి ఆయెను.
25:26 తరువాత అతని సహోదరుడు బయటికి వచ్చినప్పుడు అతని చెయ్యి ఏశావు మడిమెను పట్టుకొని యుండెను గనుక అతనికి యాకోబు అను పేరు పెట్టబడెను. ఆమె వారిని కనినప్పుడు ఇస్సాకు అరువది యేండ్లవాడు.
25:28 ఇస్సాకు ఏశావు తెచ్చిన వేట మాంసమును తినుచుండెను గనుక అతని ప్రేమించెను; రిబ్కా యాకోబును ప్రేమించెను.
26:1 అబ్రాహాము దినములలో వచ్చిన మొదటి కరవు గాక మరియొక కరవు ఆ దేశములో వచ్చెను. అప్పడు ఇస్సాకు గెరారులోనున్న ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు నొద్దకు వెళ్లెను.
26:6 ఇస్సాకు గెరారులో నివసించెను.
26:8 అక్కడ అతడు చాలా దినములుండిన తరువాత ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు కిటికీలో నుండి చూచినప్పుడు ఇస్సాకు తన భార్యయైన రిబ్కాతో సరసమాడుట కనబడెను.
26:9 అప్పుడు అబీమెలెకు ఇస్సాకును పిలిపించి ఇదిగో ఆమె నీ భార్యయే ఆమె నా సహోదరి అని యేల చెప్పితివని అడుగగా ఇస్సాకు ఆమెను బట్టి నేను చనిపోవుదు నేమో అనుకొంటినని అతనితో చెప్పెను.
26:12 ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతలు ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయెను.
26:16 అబీమెలెకు నీవు మాకంటె బహు బలము గలవాడవు గనుక మాయొద్ద నుండి వెళ్లిపొమ్మని ఇస్సాకుతో చెప్పగా
26:17 ఇస్సాకు అక్కడనుండి వెళ్లి గెరారు లోయలో గుడారము వేసికొని అక్కడ నివసించెను.
26:18 అప్పుడు తన తండ్రియైన అబ్రాహాము దినములలో త్రవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించెను; ఏలయనగా అబ్రాహాము మృతిబొందిన తరువాత ఫిలిష్తీయులు వాటిని పూడ్చివేసిరి. అతడు తన తండ్రి వాటికి పెట్టిన పేళ్ల చొప్పున తిరిగి వాటికి పేర్లు పెట్టెను.
26:19 మరియు ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవ్వగా జెలలుగల నీళ్లబావి దొరికెను.
26:20 అప్పుడు గెరారు కాపరులు ఇస్సాకు కాపరులతో జగడమాడి ఈ నీరు మాదే అని చెప్పిరి గనుక వారు తనతో కలహించినందున అతడు ఆ బావికి ఏశెకు అను పేరు పెట్టెను.
26:25 అక్కడ అతడొక బలిపీఠము కట్టించి యెహోవా నామమున ప్రార్థనచేసి అక్కడ తన గుడారము వేసెను. అప్పుడు ఇస్సాకు దాసులు అక్కడ బావి త్రవ్విరి.
26:27 ఇస్సాకు - మీరు నామీద పగపట్టి మీయొద్దనుండి నన్ను పంపివేసిన తరువాత ఎందునిమిత్తము నా యొద్దకు వచ్చియున్నారని వారినడుగగా
26:31 తెల్లవారినప్పుడు వారు లేచి ఒకనితో ఒకడు ప్రమాణము చేసికొనిరి; తరువాత ఇస్సాకు వారిని సాగనంపగా వారు అతని యొద్దనుండి సమాధానముగా వెళ్లిరి.
26:32 ఆ దినమందే ఇస్సాకు దాసులు వచ్చి తాము త్రవ్విన బావినిగూర్చి అతనికి తెలియచేసి మాకు నీళ్లు కనబడినవని చెప్పిరి గనుక
26:35 వీరు ఇస్సాకునకును రిబ్కాకును మనోవేదన కలుగజేసిరి.
27:1 ఇస్సాకు వృద్ధుడై అతని కన్నులకు మందదృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడైన ఏశావుతో నా కుమారుడా, అని అతని పిలువగా అతడు చిత్తము నాయనా అని అతనితో ననెను.
27:2 అప్పుడు ఇస్సాకు ఇదిగో నేను వృద్ధుడను, నా మరణదినము నాకు తెలియదు.
27:5 ఇస్సాకు తన కుమారుడగు ఏశావుతో ఇట్లు చెప్పుచుండగా రిబ్కా వినుచుండెను. ఏశావు వేటాడి మాంసము తెచ్చుటకు అడవికి వెళ్లెను.
27:20 అప్పుడు ఇస్సాకు నా కుమారుడా, ఇంత శీఘ్రముగా అది నీ కెట్లు దొరికెనని అడుగగా అతడు నీ దేవుడైన యెహోవా నా యెదుటికి దాని రప్పించుట చేతనే అని చెప్పెను.
27:21 అప్పుడు ఇస్సాకు నా కుమారుడా, నీవు ఏశావను నా కుమారుడవో కావో నేను నిన్ను తడవి చూచెదను దగ్గరకు రమ్మని చెప్పెను.
27:22 యాకోబు తన తండ్రియైన ఇస్సాకు దగ్గరకు వచ్చినప్పుడు అతడు అతని తడవిచూచి - స్వరము యాకోబు స్వరము గాని చేతులు ఏశావు చేతులే అనెను.
27:23 యాకోబు చేతులు అతని అన్నయైన ఏశావు చేతులవలె రోమము గలవైనందున ఇస్సాకు అతనిని గురుతు పట్టలేక అతనిని దీవించి
27:26 తరువాత అతని తండ్రియైన ఇస్సాకు నా కుమారుడా, దగ్గరకువచ్చి నన్ను ముద్దు పెట్టుకొమ్మని అతనితో చెప్పెను.
27:30 ఇస్సాకు యాకోబును దీవించుటయైన తరువాత యాకోబు తన తండ్రియైన ఇస్సాకు ఎదుటనుండి బయలు దేరి వెళ్లిన తక్షణమే అతని సహోదరుడైన ఏశావు వేటాడి వచ్చెను.
27:32 అతని తండ్రియైన ఇస్సాకు - నీ వెవరవని అతని నడిగినప్పుడు అతడునేను నీ కుమారుడను ఏశావు అను నీ జ్యేష్ఠకుమారుడననగా
27:33 ఇస్సాకు మిక్కుటముగా గడగడ వణకుచు అట్లయితే వేటాడిన భోజ్యమును నాయొద్దకు తెచ్చినవారెవరు? నీవు రాకమునుపు నేను వాటన్నిటిలో తిని అతనిని నిజముగా దీవించితిని, అతడు దీవింపబడినవాడే యనెను.
27:37 అందుకు ఇస్సాకు - ఇదిగో అతని నీకు ఏలికనుగా నియమించి అతని బంధుజనులందరిని అతనికి దాసులుగా ఇచ్చితిని; ధాన్యమును ద్రాక్షారసమును ఇచ్చి అతని పోషించితిని గనుక నా కుమారుడా, నీకేమి చేయవలెనని ఏశావుతో ప్రత్యుత్తరమియ్యగా¸
27:38 ఏశావు నా తండ్రీ, నీయొద్ద ఒక దీవెనయే ఉన్నదా? నా తండ్రీ, నన్ను, నన్ను కూడ దీవించుమని తన తండ్రితో చెప్పి ఏశావు ఎలుగెత్తి యేడ్వగా అతని తండ్రియైన ఇస్సాకు -
27:46 మరియు రిబ్కా ఇస్సాకుతో - హేతు కుమార్తెలవలన నా ప్రాణము విసికినది. ఈ దేశస్థురాండ్రయిన హేతు కుమార్తెలలో వీరివంటి ఒకదానిని యాకోబు పెండ్లి చేసి కొనినయెడల నా బ్రదుకువలన నాకేమి ప్రయోజనమనెను.
28:1 ఇస్సాకు యాకోబును పిలిపించి - నీవు కనాను కుమార్తెలలో ఎవతెను వివాహము చేసికొనకూడదు.
28:6 ఇస్సాకు యాకోబును దీవించి, పద్దనరాములో పెండ్లిచేసికొని వచ్చుటకై అతని నక్కడికి పంపెననియు, అతని దీవించినప్పుడు నీవు కనాను దేశపు కుమార్తెలలో ఎవరిని పెండ్లి చేసికొనవద్దని అతనికి ఆజ్ఞాపించెననియు
28:8 ఇదిగాక కనాను కుమార్తెలు తన తండ్రియైన ఇస్సాకునకు ఇష్టురాండ్రు కారని ఏశావునకు తెలిసినప్పుడు
28:13 మరియు యెహోవా దానికి పైగా నిలిచినేను నీ తండ్రియైన అబ్రాహాము దేవుడను ఇస్సాకు దేవుడైన యెహోవాను; నీవు పండుకొనియున్న యీ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చెదను.
31:18 కనాను దేశమునకు తన తండ్రియైన ఇస్సాకు నొద్దకు వెళ్లుటకు తన పశువులన్నిటిని, తాను సంపాదించిన సంపద యావత్తును, పద్దనరాములో తాను సంపాదించిన ఆస్తి యావత్తును తీసికొని పోయెను.
31:42 నా తండ్రి దేవుడు, అబ్రాహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడైయుండనియెడల నిశ్చయముగా నీవు నన్ను వట్టి చేతులతోనే పంపివేసి యుందువు. దేవుడు నా ప్రయాసమును నా చేతుల కష్టమును చూచి, పోయిన రాత్రి నిన్ను గద్దించెనని లాబానుతో చెప్పెను.
31:53 అబ్రాహాము దేవుడు నాహోరు దేవుడు వారి తండ్రి దేవుడు మన మధ్య న్యాయము తీర్చునని చెప్పెను. అప్పుడు యాకోబు తన తండ్రియైన ఇస్సాకు భయపడిన దేవునితోడని ప్రమాణము చేసెను.
32:9 అప్పుడు యాకోబు - నా తండ్రియైన అబ్రాహాము దేవా, నా తండ్రియైన ఇస్సాకు దేవా, నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్లుము, నీకు మేలు చేసెదనని నాతో చెప్పిన యెహోవా,
35:12 నేను అబ్రాహామునకును ఇస్సాకునకును ఇచ్చిన దేశము నీకిచ్చెదను; నీ తరువాత నీ సంతానమునకు ఈ దేశము నిచ్చెదనని అతనితో చెప్పెను.
35:27 అబ్రాహామును ఇస్సాకును పరదేశులైయుండిన మమ్రేలో కిర్య తర్బాకు తన తండ్రియైన ఇస్సాకునొద్దకు యాకోబు వచ్చెను. అదే హెబ్రోను.
35:28 ఇస్సాకు బ్రదికిన దినములు నూట ఎనుబది సంవత్సరములు.
35:29 ఇస్సాకు కాలము నిండిన వృద్ధుడై ప్రాణము విడిచి మృతిబొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. అతని కుమారులైన ఏశావు యాకోబులు అతని పాతిపెట్టిరి.
46:1 అప్పుడు ఇశ్రాయేలు తనకు కలిగినదంతయు తీసికొని ప్రయాణమై బెయేర్షెబాకు వచ్చి తన తండ్రియైన ఇస్సాకు దేవునికి బలులనర్పించెను.
48:15 అతడు యోసేపును దీవించి - నా పితరులైన అబ్రాహాము ఇస్సాకులు ఎవని యెదుట నడుచుచుండిరో ఆ దేవుడు, నేను పుట్టినది మొదలుకొని నేటివరకును ఎవడు నన్ను పోషించెనో ఆ దేవుడు,
48:16 అనగా సమస్తమైన కీడులలోనుండి నన్ను తప్పించిన దూత యీ పిల్లలను ఆశీర్వదించునుగాక; నా పేరును అబ్రాహాము ఇస్సాకులను నా పితరుల పేరును వారికి పెట్టబడునుగాక; భూమియందు వారు బహుగా విస్తరించుదురుగాక అని చెప్పెను.
49:31 అక్కడనే వారు అబ్రాహామును అతని భార్యయైన శారాను పాతి పెట్టిరి; అక్కడనే ఇస్సాకును అతని భార్యయైన రిబ్కాను పాతి పెట్టిరి; అక్కడనే నేను లేయాను పాతిపెట్టితిని.
50:24 యోసేపు తన సహోదరులను చూచి - నేను చనిపోవుచున్నాను; దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చి, యీ దేశములోనుండి తాను అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో ప్రమాణము చేసియిచ్చిన దేశమునకు మిమ్మును తీసికొని పోవునని చెప్పెను

నిర్గమకాండము (9)

2:24 కాగా దేవుడు వారి మూలుగును విని, అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసికొనెను.
3:6 మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడను, అబ్రాహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవునివైపు చూడ వెరచెను.
3:15 మరియు దేవుడు మోషేతో నిట్లనెను మీ పితరుల దేవుడైన యెహోవా, అనగా అబ్రాహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడునైన యెహోవా మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలెను. నిరంతరము నా నామము ఇదే, తరతరములకు ఇది నా జ్ఞాపకార్థక నామము.
3:16 నీవు వెళ్లి ఇశ్రాయేలీయుల పెద్దలను పోగు చేసి మీ పితరుల దేవుడైన యెహోవా, అనగా అబ్రాహాము ఇస్సాకు యాకోబుల దేవుడు, నాకు ప్రత్యక్షమై యిట్లనెను నేను మిమ్మును, ఐగుప్తులో మీకు సంభవించిన దానిని, నిశ్చయముగా చూచితిని,
4:5 ఆయన దానిచేత వారు తమ పితరుల దేవుడైన యెహోవా, అనగా అబ్రాహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడు నీకు ప్రత్యక్ష మాయెనని నమ్ముదురనెను.
6:3 నేను సర్వశక్తిగల దేవుడను పేరున అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు ప్రత్యక్షమైతిని కాని, యెహోవా అను నా నామమున నేను వారికి తెలియబడలేదు.
6:8 నేను అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు ఇచ్చెదనని చెయ్యి యెత్తి ప్రమాణముచేసిన దేశములోనికి మిమ్మును రప్పించి దాని మీకు స్వాస్థ్యముగా ఇచ్చెదను; నేను యెహోవానని చెప్పుమనగా
32:13 నీ సేవకులైన అబ్రాహామును ఇస్సాకును ఇశ్రాయేలును జ్ఞాపకము చేసికొనుము. నీవు వారితో ఆకాశనక్షత్రములవలె మీ సంతానము అభివృద్ధిజేసి నేను చెప్పిన యీ సమస్తభూమిని మీ సంతానమున కిచ్చెదననియు, వారు నిరంతరము దానికి హక్కుదారులగుదురనియు వారితో నీతోడని ప్రమాణముచేసి చెప్పితివనెను.
33:1 మరియు యెహోవా మోషేతో ఇట్లనెను నీవును నీవు ఐగుప్తుదేశమునుండి తోడుకొనివచ్చిన ప్రజలును బయలుదేరి, నేను అబ్రాహాముతోను ఇస్సాకుతోను యాకోబుతోను ప్రమాణము చేసి నీ సంతానమునకు దీని నిచ్చెదనని చెప్పిన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు లేచిపొండి.

లేవీయకాండము (1)

26:42 నేను యాకోబుతో చేసిన నా నిబంధనను జ్ఞాపకము చేసి కొందును; నేను ఇస్సాకుతో చేసిన నా నిబంధనను నేను అబ్రాహాముతో చేసిన నా నిబంధనను జ్ఞాపకము చేసికొందును; ఆ దేశమునుకూడ జ్ఞాపకము చేసికొందును.

సంఖ్యాకాండము (1)

32:12 మరి ఎవడును పూర్ణమనస్సుతో నన్ను అనుసరింపలేదు గనుక నేను అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు ప్రమాణపూర్వకముగా నిచ్చిన దేశమును వారు తప్ప మరి ఎవరును చూడనే చూడరని ప్రమాణము చేసెను.

ద్వితీయోపదేశకాండము (7)

1:8 ఇదిగో ఆ దేశమును మీకు అప్పగించితిని మీరు వెళ్లి యెహోవా మీ పితరులైన అబ్రాహాము ఇస్సాకు యాకోబులకును వారి తరువాత వారి సంతానమునకును ఇచ్చెదనని నేను ప్రమాణముచేసిన దేశమును స్వాధీన పరచుకొనుడి.
6:10 నీ దేవుడైన యెహోవా నీ పితరులైన అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో చేసిన ప్రమాణమునుబట్టి నిన్ను ఆ దేశములో ప్రవేశపెట్టి, నీవు కట్టని గొప్పవగు మంచి పురములను
9:5 నీవు వారి దేశ మునకు వచ్చి దాని స్వాధీనపరచుకొనుటకు నీ నీతియైనను నీ హృదయ యథార్థతయైనను హేతువుకాదు. ఈ జన ముల చెడుతనమును బట్టియే యెహోవా నీ పితరులైన అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో ప్రమాణముచేసిన మాటను స్థాపించుటకై నీ దేవుడైన యెహోవా వారిని నీ యెదుటనుండి వెళ్లగొట్టుచున్నాడు.
9:27 నీ సేవకులైన అబ్రాహాము ఇస్సాకు యాకోబులను జ్ఞాపకముచేసికొనుము. ఈ ప్రజల కాఠిన్య మునైనను వారి చెడుతనమునైనను వారి పాపమునైనను చూడకుము;
29:10 నీ దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారము గాను నీ పితరులైన అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో ప్రమాణము చేసిన ప్రకారముగాను,
30:20 నీ పితరులైన అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించునట్లు యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్షుకును మూలమై యున్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రదుకుచు, నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొను నట్లును జీవమును కోరుకొనుడి.
34:4 మరియు యెహోవా అతనితో ఇట్లనెనునీ సంతానమున కిచ్చెదనని అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు నేను ప్రమాణము చేసిన దేశము ఇదే. కన్నులార నిన్ను దాని చూడనిచ్చితిని గాని నీవు నది దాటి అక్కడికి వెళ్లకూడదు.

యెహోషువ (2)

24:3 అయితే నేను నది అద్దరినుండి మీ పితరుడైన అబ్రాహామును తోడు కొని వచ్చి కనాను దేశమందంతట సంచరింపజేసి, అతనికి సంతానమును విస్తరింపజేసి, అతనికి ఇస్సాకును ఇచ్చి తిని.
24:4 ఇస్సాకునకు నేను యాకోబు ఏశావుల నిచ్చితిని. శేయీరు మన్యములను స్వాధీనపరచుకొనునట్లు వాటిని ఏశావు కిచ్చితిని. యాకోబును అతని కుమారులును ఐగుప్తులోనికి దిగిపోయిరి.

1 రాజులు (1)

18:36 అస్తమయ నైవేద్యము అర్పించు సమయమున ప్రవక్తయగు ఏలీయా దగ్గరకు వచ్చి యీలాగు ప్రార్థనచేసెనుయెహోవా, అబ్రాహాము ఇస్సాకు ఇశ్రాయేలుల దేవా, ఇశ్రాయేలీయుల మధ్య నీవు దేవుడవై యున్నావనియు, నేను నీ సేవకుడనై యున్నాననియు, ఈ కార్యములన్నియు నీ సెలవు చేత చేసితిననియు ఈ దినమున కనుపరచుము.

2 రాజులు (1)

13:23 గాని యెహోవా వారిమీద జాలిపడి వారియందు దయయుంచి, అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసియున్ననిబంధననుబట్టి వారియందు లక్ష్యము నిలిపి, వారిని నాశము చేయనొల్లక యిప్పటికిని తన సముఖములోనుండి వారిని వెళ్లగొట్టక యుండెను.

1 దినవృత్తాంతములు (4)

1:28 ఇస్సాకు ఇష్మాయేలు.
1:34 అబ్రాహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు కుమారులు ఏశావు ఇశ్రాయేలు.
16:17 ఇస్సాకుతో చేసిన ప్రమాణమును ఏర్పాటును నిత్యము జ్ఞాపకముంచుకొనుడి.
29:18 అబ్రాహాము ఇస్సాకు ఇశ్రాయేలు అను మా పితరుల దేవా యెహోవా, నీ జనులు హృదయ పూర్వకముగా సంకల్పించిన యీ ఉద్దేశమును నిత్యము కాపాడుము; వారి హృదయమును నీకు అనుకూలపరచుము.

2 దినవృత్తాంతములు (1)

30:6 కావున అంచెవాండ్రు రాజునొద్దను అతని అధిపతులయొద్దను తాకీదులు తీసికొని, యూదా ఇశ్రాయేలు దేశములందంతట సంచరించి రాజాజ్ఞను ఈలాగు ప్రచురము చేసిరిఇశ్రాయేలువారలారా, అబ్రా హాము ఇస్సాకు ఇశ్రాయేలుల దేవుడైన యెహోవావైపు తిరుగుడి; మీరు తిరిగినయెడల మీలో అష్షూరురాజుల చేతిలోనుండి తప్పించుకొని శేషించినవారివైపు ఆయన తిరుగును.

కీర్తనల గ్రంథము (1)

105:9 ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణమును నిత్యము ఆయన జ్ఞాపకము చేసికొనును.

యిర్మియా (1)

33:26 భూమ్యా కాశములనుగూర్చిన విధులను నియమించువాడను నేను కానియెడల, అబ్రాహాము ఇస్సాకు యాకోబుల సంతానమును ఏలుటకు అతని సంతాన సంబంధియైన యేలికను ఏర్పరచుకొనక నేను యాకోబు సంతానపువాడగు నా సేవకుడైన దావీదు సంతానమును విసర్జింతును. నిశ్చయ ముగా నేను వారియెడల జాలిపడి చెరలోనుండి వారిని రప్పించెదను.

ఆమోసు (2)

7:9 ఇస్సాకు సంతతివారు ఏర్పరచిన ఉన్నతస్థలములు పాడైపోవును, ఇశ్రాయేలీయుల ప్రతిష్ఠితస్థలములు నాశమగును. నేను ఖడ్గము చేత పట్టుకొని యరొబాము ఇంటివారిమీద పడుదును.
7:16 యెహోవా మాట ఆలకించుముఇశ్రాయేలీ యులను గూర్చి ప్రవచింపకూడదనియు ఇస్సాకు సంతతి వారిని గూర్చి మాట జారవిడువకూడదనియు నీవు ఆజ్ఞ ఇచ్చుచున్నావే.

మత్తయి (3)

1:2 అబ్రాహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను;
8:11 అనేకులు తూర్పునుండియు పడమటనుండియు వచ్చి అబ్రాహాముతో కూడను, ఇస్సాకుతో కూడను, యాకోబుతో కూడను, పరలోకరాజ్యమందు కూర్చుందురు గాని
22:31 మృతుల పునరుత్థానమునుగూర్చినేను అబ్రాహాము దేవు డను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనై యున్నానని దేవుడు మీతో చెప్పినమాట మీరు చదువలేదా?

మార్కు (1)

12:26 వారు లేచెదరని మృతులనుగూర్చిన సంగతి మోషే గ్రంథమందలి పొదను గురించిన భాగములో మీరు చదువలేదా? ఆ భాగములో దేవుడునేను అబ్రాహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడనని అతనితో చెప్పెను.

లూకా (3)

3:34 యూదా యాకోబుకు, యాకోబు ఇస్సాకుకు, ఇస్సాకు అబ్రాహాముకు, అబ్రాహాము తెర హుకు, తెరహు నాహోరుకు,
13:28 అబ్రాహాము ఇస్సాకు యాకోబులును సకల ప్రవక్తలును దేవుని రాజ్యములో ఉండుటయు, మీరు వెలుపలికి త్రోయబడుటయు, మీరు చూచునప్పుడు మీరు ఏడ్చుచు పండ్లు కొరుకుదురు.
20:37 పొదనుగురించిన భాగములో ప్రభువు అబ్రాహాము దేవుడనియు ఇస్సాకు దేవుడనియు యాకోబు దేవుడనియు చెప్పుచు,

అపో. కార్యములు (3)

3:13 అబ్రాహాము ఇస్సాకు యాకోబు అనువారి దేవుడు, అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరచియున్నాడు; మీరాయనను అప్పగించితిరి, పిలాతు ఆయనను విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు మీరు అతనియెదుట ఆయనను నిరాకరించితిరి.
7:8 మరియు ఆయన సున్నతి విషయమైన నిబంధన అతని కనుగ్రహించెను. అతడు ఇస్సాకును కని ఆ నిబంధన చొప్పున ఎనిమిదవ దినమందు అత నికి సున్నతిచేసెను; ఇస్సాకు యాకోబును యాకోబు పన్నిద్దరు గోత్రకర్తలను కని వారికి సున్నతి చేసిరి.
7:32 నేను నీ పితరుల దేవుడను, అబ్రాహాము ఇస్సాకు యాకోబుల దేవుడను అని ప్రభువు వాక్కు వినబడెను గనుక మోషే వణకి, నిదానించి చూచుటకు తెగింప లేదు.

రోమీయులకు (2)

9:7 అబ్రాహాము సంతానమైనంత మాత్రముచేత అందరును పిల్లలు కారు గాని ఇస్సాకు వల్లనైనది నీ సంతానము అనబడును,
9:10 అంతేకాదు; రిబ్కా మన తండ్రియైన ఇస్సాకు అను ఒకనివలన గర్భవతియైనప్పుడు,

గలతియులకు (1)

4:28 సహోదరులారా, మనమును ఇస్సాకువలె వాగ్దానమునుబట్టి పుట్టిన కుమారులమై యున్నాము.

హెబ్రీయులకు (3)

11:9 విశ్వాసమునుబట్టి అతడును, అతనితో ఆ వాగ్దానమునకు సమానవారసులైన ఇస్సాకు యాకోబు అనువారును, గుడారములలో నివసించుచు, అన్యుల దేశ ములో ఉన్నట్టుగా వాగ్దత్తదేశములో పరవాసులైరి.
11:18 ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించెనో, ఇస్సాకువలననైనది నీ సంతానమనబడును అని యెవనితో చెప్పబడెనో, ఆ అబ్రాహాము, మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని యెంచినవాడై,
11:20 విశ్వాసమునుబట్టి ఇస్సాకు జరుగబోవు సంగతుల విషయమై యాకోబును ఏశావును ఆశీర్వదించెను.

యాకోబు (1)

2:21 మన పితరుడైన అబ్రాహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠముమీద అర్పించి నప్పుడు అతడు క్రియలవలన నీతిమంతుడని తీర్పు పొంద లేదా?

Bible Topics

Back to Top
No Data Found

Songs and Lyrics

Back to Top
"ఇస్సాకు" found in 13 lyrics.

అబ్రాహాము ఇస్సాకు యాకోబునకు దేవుడవు - Abraahaamu Issaaku Yaakobunaku Devudavu

ఆదియంతము లేనివాడా సంపూర్ణుడగు మా దేవా - Aadiyanthamu Leni Vaadaa Sampoornudagu Maa Devaa

ఆరాధన అందుకో - Aaraadhana Anduko

ఆరాధన స్తుతి ఆరాధన -Aaraadhana Sthuthi Aaraadhana

ఆరాధనాలందుకో ఆరాధనాలందుకో

ఇమ్మానుయేలు దేవుడా - Immaanuyelu Devudaa

ఇమ్మానుయేలు దేవుడా మము కన్న దేవుడా - Immaanuyelu Devudaa Mamu Kanna Devudaa

ఊహలు నాదు ఊటలు - Oohalu Naadu Ootalu

చిన్ని మనసుతో నిన్ను ఆరాధింతును - Chinni Manasutho Ninnu Aaraadhinthunu

వందనాలు యేసు - Vandanaalu Yesu

వందనాలు యేసు నా వందనాలో - Vandanaalu Yesu Naa Vandanaalo

సమర్పణ చేయుము ప్రభువునకు - Samarpana Cheyumu Prabhuvunaku

సర్వ శరీరుల దేవుడా - Sarva Shareerula Devudaa

Sermons and Devotions

Back to Top
"ఇస్సాకు" found in 28 contents.

సంపద-నిర్మాణ రహస్యం
సంపద-నిర్మాణ రహస్యంసామెతలు 11:24 వెదజల్లి అభివృద్ధిపొందువారు కలరు తగినదానికన్న తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు.అవును, ఈ రకమైన ఆర్థికశాస్త్ర నియమాన్ని ఏ వ్యాపార పుస్తకాల్లో  లేదా విశ్వవిద్యాలయాలు వివరించలేవు. ఇది తన ప్రజలకు పరలోక దే

ప్రకటన గ్రంథ ధ్యానం 2వ అధ్యాయం - Revelation 2 Detailed Study
<< Previous - Revelation Chapter 1 వివరణ >> Previous - Revelation Chapter 3 వివరణ

ఈ జీవితానికి 4 ప్రశ్నలు
ఈ లోకంలో జీవము కలిగినవి ఎన్నో ఉన్నాయి. వాటిలో ఉత్తమమైన జ్ఞానం కలిగిన వాడు మానవుడే. ఈ జ్ఞానం ఎంతగానో అభివృద్ధి చెందింది. అనాది కాలం నుండి ఈ 21వ శతాబ్దపు మానవుని జీవనా విధానంలొ ఆధునికతకు అవధులు లేని ఎన్నో మార్పులు. సామాజిక సామాన్య తత్వ శాస్త్రాలలొ మానవుని జ్ఞానం అంతా ఇంతా కాదు. ఈ విజ్ఞాన తత్వశాస్త

యేసుని శిష్యుడను
ఈ లోకములో పుట్టిన ప్రతి మనుషుడికి జ్ఞానము కలిగి వివేకముతో తెలివితో జీవించాలని ఉంటుంది, మరి జ్ఞానము ఎక్కడ నుంచి లభిస్తుంది? మనము చిన్నపటి నుంచి జ్ఞానము సంపాదించటానికి ఒక గురువు/బోధకుడిని ఎంచుకొని అతని దగ్గర శిష్యునిగా చేరి అతని దగ్గర ఉన్న జ్ఞానమును నేర్చుకుంటాము. మరి ఆ బోధకునికి తన దగ్గర

వివాహ బంధం 4
క్రైస్తవ కుటుంబ వ్యవస్థలో, ముఖ్యంగా భార్యా భర్తల వివాహ బంధంలో పిల్లల పాత్ర ఏమిటి? పిల్లల పట్ల మన వైఖరి ఎలా ఉండాలి? ఈ ప్రశ్నలు ఏంతో ప్రాముఖ్యమైనవి. కుటుంబానికి కేంద్ర బిందువు ఏమిటి? కుటుంబం దేనిమీద ఆధారపడి క్రీస్తుకు నచ్చిన విధంగా నడుచుకోగలదు అని ఎవరైనా ప్రశ్నిస్తే, ఎక్కువ శాతం కుటుంబానికి కేంద్రబ

యేసుతో పోల్చాబడిన యోసేపు యొక్క భార్య
యోసేపు అనగా “ఫలించెడి కొమ్మ “ అని అర్థము. ఇతడు మన అది పితరుడైన యకోబుకు రాహేలు ద్వారా కలిగిన ప్రధమ పుత్రుడు. రాహేలుకు వరపుత్రుడైన యోసేపును తండ్రి తన మిగిలిన కుమారులకన్నా అధికముగా ప్రేమించేవాడు. అందుకు గుర్తుగా రంగురంగుల నిలువుటంగీనీ ప్రత్యేకముగా కుట్టించాడు.ఈ ప్రత్యేకతను సహించలేని అన్నలు అసూయతో ని

కావలెను...కావలెను...
కావలెను...కావలెను... సమూయేలు వంటి దేవుని సన్నిధిలో గడిపే బాలుడు యోసేపు వంటి తన పవిత్రతను కాపాడుకొనిన దేవుని భయము గలిగిన యోవ్వనుడు దావీదు వంటి దేవునికి 7సార్లు ప్రార్ధించే మధ్య వయస్కుడు అబ్రాహాము వంటి దేవునికి స్నేహితుడైన వృద్ధుడు కావలెను...కావలెను... కాని ఎక్కడ

Day 83 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)
అప్పుడు యాకోబు - నా తండ్రియైన అబ్రాహాము దేవా, నా తండ్రియైన ఇస్సాకు దేవా - నీ దేశమునకు, నీ బంధువులయొద్దకు తిరిగి వెళ్ళుము, నీకు మేలు చేసెదనని నాతో చెప్పిన యెహోవా . . . దయచేసి నన్ను తప్పించుము (ఆది 32:9,11). ఈ ప్రార్థనలో ఆరోగ్యకరమైన లక్షణాలు చాలా ఉన్నాయి. మన ఆత్మీయ అంతరంగాన్ని శ్రమల కొలిమి

Day 129 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)
అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలుచుండెను (ఆది 18: 22). దేవుని స్నేహితుడు కాబట్టి ఇతరుల గురించి దేవునితో వాదించగలడు. అబ్రహాములో మూర్తీభవించిన విశ్వాసం, దేవునితో స్నేహం మన స్వల్ప అవగాహనకి అందదేమో. అయినా దిగులు పడాల్సిన పనిలేదు. అబ్రాహాము విశ్వాసంలో క్రమంగా ఎదిగినట్టే మనము ఎదగవచ్చు. అబ్రహ

Day 15 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
ఆ రాత్రియే యెహోవా అతనికి (ఇస్సాకుకు) ప్రత్యక్షమాయెను (ఆది 26:24) "ఆ రాత్రే" దేవుడు ప్రత్యక్షమయ్యాడట. బెయేర్షెబాకి వెళ్ళిన రాత్రే ఇలా ప్రత్యక్షమవ్వడం ఏదో యదాలాపంగా జరిగిందనుకుంటున్నారా? ఈ రాత్రి కాకపోతే ఏదో ఒక రాత్రి ప్రత్యక్షం జరిగేదేననుకుంటున్నారా? పొరపాటు. బెయేర్షెబా చేరిన రాత్రే ఇస్సా

Day 358 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలువెళ్ళి ... (ఆది 24:63). మనం ఎంత ఒంటరివాళ్ళమైతే అంత మంచి క్రైస్తవులమౌతాము. ఎంత తక్కువ పనిని తలపెడితే అంత ఎక్కువ సాధిస్తాము. ఎక్కువ సమయం ప్రభువుతో ఏకాంతంలో గడుపుతూ ఆయన కోసం ఎదురుచూడాలి. కాని మనం లోక వ్యవహారాల్లో తలమునకలుగా ఉంటున్నాము. మన హడావుడీ, అటూ

ఆదికాండము
పురాతన ప్రతులైన ఆదికాండము మొదలుకొని ద్వితీయోపదేశకాండము వరకు ఉన్న ఐదు పుస్తకములను నిబంధన పుస్తకములందురు. ({2Chro,34,30}). క్రీ.పూ 3వ శతాబ్దములోని రచయితలు హెబ్రీ భాష నుండి గ్రీకు భాషకు పాతనిబంధన గ్రంథమును తర్జుమా చేసిన సెప్టోలెజెంట్ భాషాంతర తర్జుమాదారులు వీటిని ఆదికాండము, నిర్గమకాండము, లేవీయకాండము,

ఏది విశ్వాసికి విజయం?
ఏది విశ్వాసికి విజయం?Audio: https://youtu.be/6l5U2I326-w ఈ లోకంలోని విజయానికి విశ్వాస జీవితములోని విజయానికి చాలా వ్యత్యాసం ఉంది. ఈ లోకంలో మంచి ఉద్యోగం, పెళ్ళి, పిల్లలు, ఇల్లు సంపాదిస్తే జీవితంలో విజయం సాధించాడు అంటారు. ఎదుటి వ్యక్తిని జయిస్

నీతో నడిచే దేవుడు
నీతో నడిచే దేవుడు Audio: https://youtu.be/nR7A_Qegn5k Gen 24:7 ...ఈ దేశము నిచ్చెదనని ప్రమాణము చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడగు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును; ~ ఇస్సాకునకు పెండ్లి చెయ్యాలి~ దాదాపు 65 సంవత్సరములు అయ్యింది

దేవుని ఫ్రెండ్స్
ప్రియమైన చిన్న బిడ్డలారా... మీరంటే యేసయ్యకు ఎంతో ఇష్టం. “చిన్న బిడ్డలని నా యొద్దకు రానియ్యుడి దేవుని రాజ్యం వారిదే” అన్నారు యేసయ్య మీకందరికి మీ స్నేహితులంటే ఇష్టమా ?..చాలా ఇష్టమా..? మరి మనము దేవుని ఫ్రెండ్స్ ఎవరో చూద్దామా ! అబ్రహాము: అబ్రహాము అతని భార్య శారా ఒక దేశములో నివస

నిత్య నిబంధన
క్రీస్తునందు ప్రియమైన పాఠకులకు శుభములు, పరిశుద్ధుడు పరమాత్ముడైన యేసు క్రీస్తు ప్రభువు మనతో చేసిన నిత్య నిబంధన ఏ విధంగా మన జీవితాలలో నెరవేరింది మరియు మన శేష జీవితంలో ఏ విధంగా నెరవేరబోతుంది అనే అంశాలను ఈ వార్తమానం లో గమనిద్దాం. యేసు క్రీస్తు ప్రభువు ఒకనాడు వస్తాడు అని, తన నిబంధనను మన యెడల స్థిరపరుస

సంపద-నిర్మాణ రహస్యం | Wealth Building Secret!
సంపద-నిర్మాణ రహస్యంసామెతలు 11:24 వెదజల్లి అభివృద్ధిపొందువారు కలరు తగినదానికన్న తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు.అవును, ఈ రకమైన ఆర్థికశాస్త్ర నియమాన్ని ఏ వ్యాపార పుస్తకాల్లో  లేదా విశ్వవిద్యాలయాలు వివరించలేవు. ఇది తన ప్రజలకు పరలోక దే

విమోచకుడైన దేవుడు | Our Redeemer Lives
యెషయా 44:23 - యెహోవా ఆ కార్యమును సమాప్తి చేసియున్నాడు ఆకాశములారా, ఉత్సాహధ్వని చేయుడి భూమి అగాధస్థలములారా, ఆర్భాటము చేయుడి పర్వతములారా, అరణ్యమా, అందులోని ప్రతి వృక్షమా, సంగీతనాదము చేయుడి. యెహోవా యాకోబును విమోచించును ఆయన ఇశ్రాయేలులో తన్నుతాను మహిమోన్నతునిగా కనుపరచుకొనును.

దేవుడు పరిపూర్ణుడు | God is Perfect
ఆదికాండము 21:1 - యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాటచొప్పున శారాను గూర్చి చేసెను.మన దేవుడు దోషరహితుడు మరియు ఆయన వాక్యము ఎప్పటికీ స్థిరమైనది. దేవుడు వాగ్దానం చేసినప్పుడు అది మన జీవితాలను చుట్టుముట్టే అన్ని ప్రతికూల పరిస్థితుల కంటే బలమై

తర తరములకు ఆశీర్వాదాలు | The Inheritance Of Blessing
తర తరములకు ఆశీర్వాదాలు ద్వితీయోపదేశకాండము 30:5 నీ పితరులకు స్వాధీన పరచిన దేశమున నీ దేవు డైన యెహోవా నిన్ను చేర్చును, నీవు దాని స్వాధీనపరచు కొందువు; ఆయన నీకు మేలుచేసి నీ పితరులకంటె నిన్ను విస్తరింప జేయును.1948 న ఇశ్రాయేలు తన పూర్వ వైభవా

10 ప్రసిద్ధ బైబిల్ కథనాలు
అనేక ప్రసిద్ధ బైబిల్ కథనాలు సాహిత్యం, కళ మరియు మీడియా యొక్క వివిధ రూపాల్లో తిరిగి చెప్పబడ్డాయి మరియు స్వీకరించబడ్డాయి. ఇక్కడ అత్యంత ప్రసిద్ధ మరియు ప్రియమైన కొన్ని ఉన్నాయి:సృష్టి - ఆదికాండము పుస్తకంలో వివరించిన విధంగా దేవుడు ఆరు రోజుల్లో ప్రపంచాన్ని మరియు దాని

బైబిలు చరిత్ర | Biblical History in Telugu
బైబిలు చరిత్ర బైబిల్ చరిత్ర అనేది శతాబ్దాలుగా అధ్యయనం చేయబడిన మరియు చర్చించబడిన మనోహరమైన మరియు సంక్లిష్టమైన అంశం. ఆదికాండములోని సృష్టి కథ నుండి ప్రకటనలోని ప్రవచనాల వరకు, బైబిల్ మానవత్వం మరియు మనతో దేవుని సంబంధాన్ని గుర

విమోచకుడైన దేవుడు
విమోచకుడైన దేవుడుయెషయా 44:23 - యెహోవా ఆ కార్యమును సమాప్తి చేసియున్నాడు ఆకాశములారా, ఉత్సాహధ్వని చేయుడి భూమి అగాధస్థలములారా, ఆర్భాటము చేయుడి పర్వతములారా, అరణ్యమా, అందులోని ప్రతి వృక్షమా, సంగీతనాదము చేయుడి. యెహోవా యాకోబును విమోచించును ఆయన ఇశ్రాయేలులో తన్నుతాను మహిమోన్నత

సంపద-నిర్మాణ రహస్యం
సంపద-నిర్మాణ రహస్యంసామెతలు 11:24 వెదజల్లి అభివృద్ధిపొందువారు కలరు తగినదానికన్న తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు.అవును, ఈ రకమైన ఆర్థికశాస్త్ర నియమాన్ని ఏ వ్యాపార పుస్తకాల్లో  లేదా విశ్వవిద్యాలయాలు వివరించలేవు. ఇది తన ప్రజలకు పరలోక దే

ఏది విశ్వాసికి విజయం?
ఏది విశ్వాసికి విజయం?ఈ లోకంలోని విజయానికి విశ్వాస జీవితములోని విజయానికి చాలా వ్యత్యాసం ఉంది. ఈ లోకంలో మంచి ఉద్యోగం, పెళ్ళి, పిల్లలు, ఇల్లు సంపాదిస్తే జీవితంలో విజయం సాధించాడు అంటారు. ఎదుటి వ్యక్తిని జయిస్తే విజయం, శత్రువును చంపితే విజయం అంటారు.కానీ, విశ్వా

సంపద-నిర్మాణ రహస్యం
సంపద-నిర్మాణ రహస్యంసామెతలు 11:24 వెదజల్లి అభివృద్ధిపొందువారు కలరు తగినదానికన్న తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు.అవును, ఈ రకమైన ఆర్థికశాస్త్ర నియమాన్ని ఏ వ్యాపార పుస్తకాల్లో  లేదా విశ్వవిద్యాలయాలు వివరించలేవు. ఇది తన ప్రజలకు పరలోక దే

నైతిక విలువలు కలిగిన జీవితము
నైతిక విలువలు కలిగిన జీవితముఎవరైనా తప్పు చెస్తే తగిన ఫలితం పొందుతారు అని నమ్ముతాము. యెట్టి మతమైన బోధించేది ఇదే. ఒకవేళ ఒకడు దొంగతనం చేస్తే అతడు కూడా ఏదో ఒక రోజు దోచుకొనబడుతాడు అని, అన్యాయం చెస్తే ఆ అన్యాయము అతనికి కూడా ఏదో ఓ రోజు వెంటాడుతుంది అని నమ్ముతాము. కాని కలువర

విమోచకుడైన దేవుడు
విమోచకుడైన దేవుడుయెషయా 44:23 - యెహోవా ఆ కార్యమును సమాప్తి చేసియున్నాడు ఆకాశములారా, ఉత్సాహధ్వని చేయుడి భూమి అగాధస్థలములారా, ఆర్భాటము చేయుడి పర్వతములారా, అరణ్యమా, అందులోని ప్రతి వృక్షమా, సంగీతనాదము చేయుడి. యెహోవా యాకోబును విమోచించును ఆయన ఇశ్రాయేలులో తన్నుతాను మహిమోన్నత

Popular Searches:

దేవుడు , యెహోవా , మోషే , యేసు , శ్రమ , అల్ఫా , కృప , దావీదు , క్రీస్తు , యోసేపు , మరణ , , కాలేబు , మరియ , ఇశ్రాయేలీయులు , యాకోబు , గిద్యోను , బిలాము , కోరహు , అహరోను , ఆత్మ , అబ్రాహాము , మిర్యాము , అక్సా , సెల , అగ్ని , ప్రేమ , యెరూషలేము , సాతాను , సౌలు , హనోకు , పౌలు , ప్రార్థన , రాహాబు , దేవ�%B , ఇశ్రాయేలు , సొలొమోను , రాహేలు , యూదా , యాషారు , సీయోను , బబులోను , లోతు , స్వస్థ , ఇస్కరియోతు , జక్కయ్య , సారెపతు , సమరయ , ఇస్సాకు , అన్న , యెహోషాపాతు , ఐగుప్తు , అతల్యా , నోవహు , యోకెబెదు , ఏశావు , లేవీయులు , కోరెషు , ఆకాను , గిలాదు , ప్రార్ధన , కెజీయా , తెగులు , ఎలియాజరు , యోబు , అబ్దెయేలు , రోగము , గిల్గాలు , బేతేలు , మగ్దలేనే మరియ , వృషణాలు , అకుల , కూషు , తీతు , ఏలీయా , ఆషేరు , కనాను , మార్త , రక్షణ , సీమోను , దొర్కా , సబ్బు , ఆసా , బెసలేలు , బేతనియ , యెహోవా వశము , ఎఫ్రాయిము , యొర్దాను , ఏఫోదు , పరదైసు , కయీను , హాము , ఎలీషా , తామారు , హిజ్కియా , అంతియొకయ , ఊజు , రూతు , ఈకాబోదు , బర్జిల్లయి ,

Telugu Keyboard help