గిద్యోను (గిద్యోను)


పడద్రోయువాడు

Bible Results

"గిద్యోను" found in 2 books or 40 verses

న్యాయాధిపతులు (39)

6:11 యెహోవా దూత వచ్చి అబీయెజ్రీయుడైన యోవాషునకు కలిగిన ఒఫ్రాలోని మస్తకివృక్షము క్రింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగైయుండునట్లు గానుగ చాటున గోధుమలను దుళ్లగొట్టుచుండగా
6:13 గిద్యోను చిత్తము నా యేలినవాడా, యెహోవా మాకు తోడైయుండినయెడల ఇదంతయు మాకేల సంభవించెను? యెహోవా ఐగుప్తులో నుండి మమ్మును రప్పించెనని చెప్పుచు, మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుతకార్యములన్నియు ఏ మాయెను? యెహోవా మమ్మును విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మును అప్పగించెనని అతనితో చెప్పెను.
6:19 అప్పుడు గిద్యోను లోపలికి పోయి ఒక మేక పిల్లను తూమెడు పిండితో పొంగని భక్ష్యములను సిద్ధపరచి ఆ మాంసమును గంపలో ఉంచి అది వండిన నీళ్లను కుండలో పోసి ఆయనకొరకు ఆ మస్తకివృక్షముక్రిందికి దానిని తీసికొనివచ్చి దగ్గర ఉంచగా
6:22 గిద్యోను ఆయన యెహోవా దూత అని తెలిసికొని అహహా నా యేలినవాడా, యెహోవా, ఇందుకే గదా నేను ముఖా ముఖిగా యెహోవా దూతను చూచితిననెను.
6:24 అక్కడ గిద్యోను యెహోవా నామమున బలిపీఠము కట్టి, దానికి యెహోవా సమాధానకర్తయను పేరుపెట్టెను. నేటివరకు అది అబీ యెజ్రీయుల ఒఫ్రాలో ఉన్నది.
6:27 కాబట్టి గిద్యోను తన పని వారిలో పదిమందిని తీసికొనివచ్చి యెహోవా తనతో చెప్పినట్లు చేసెను. అతడు తన పితరుల కుటుంబమునకును ఆ ఊరివారికిని భయపడినందున పగలు దానిని చేయలేక రాత్రివేళ చేసెను.
6:29 అప్పుడు వారు ఈ పని యెవరు చేసినదని ఒకరితోనొకరు చెప్పుకొనుచు విచారణచేసి వెదకి, యోవాషు కుమారుడైన గిద్యోను ఆ పనిచేసినట్టు తెలిసికొనిరి.
6:34 యెహోవా ఆత్మ గిద్యోనును ఆవేశించెను. అతడు బూర ఊదినప్పుడు అబీయెజెరు కుటుంబపు వారు అతని యొద్దకు వచ్చిరి.
6:36 అప్పుడు గిద్యోను నీవు సెలవిచ్చినట్లు నాచేత ఇశ్రాయేలీయులను రక్షింప నుద్దేశించిన యెడల
6:39 అప్పుడు గిద్యోనునీ కోపము నా మీద మండనియ్యకుము; ఇంకొక మారే ఆ బొచ్చుచేత శోధింప సెలవిమ్ము. నేల అంతటిమీద మంచు పడి యుండగా ఆ బొచ్చు మాత్రమే పొడిగా ఉండనిమ్మని దేవునితో అనగా
7:1 అప్పుడు యెరుబ్బయలు, అనగా గిద్యోనును అతనితో నున్న జనులందరును, వేకువను లేచి హరోదు బావియొద్ద దిగగా లోయలోని మోరె కొండకు ఉత్తరముగా మిద్యా నీయుల దండుపాళెము వారికి కనబడెను.
7:3 కాబట్టి నీవు ఎవడు భయపడి వణకుచున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్లవలెనని జనులు వినునట్లుగా ప్రకటించుమని గిద్యోనుతో సెలవిచ్చెను. అప్పుడు జనులలోనుండి ఇరువది రెండువేలమంది తిరిగి వెళ్లిపోయిరి.
7:4 పదివేలమంది నిలిచియుండగా యెహోవా ఈ జనులింక ఎక్కువమంది, నీళ్లయొద్దకు వారిని దిగజేయుము, అక్కడ నీకొరకు వారిని శోధించెదను. ఇతడు నీతో కూడ పోవలెనని నేను ఎవనిగూర్చి చెప్పుదునో వాడు నీతో పోవలెను; ఇతడు నీతో పోకూడదని యెవనిగూర్చి నీతో చెప్పుదునో వాడు పోకూడదని గిద్యోనుతో సెల విచ్చెను.
7:5 అతడు నీళ్లయొద్దకు ఆ జనమును దిగజేసినప్పుడు యెహోవా కుక్కగతుకునట్లు తన నాలుకతో నీళ్లను గతికిన ప్రతివానిని, త్రాగుటకు మోకాళ్లూని క్రుంగిన ప్రతి వానిని వేరువేరుగా ఉంచుమని గిద్యోనుతో సెలవిచ్చెను.
7:7 అప్పుడు యెహోవా గతికిన మూడు వందల మనుష్యుల ద్వారా మిమ్మును రక్షించెదను; మిద్యానీయులను నీ చేతికి అప్పగించెదను; జనులందరు తమ తమ చోట్లకు వెళ్లవచ్చునని గిద్యోనుతో సెలవిచ్చెను.
7:13 గిద్యోను వచ్చినప్పుడు ఒకడు తాను కనిన కలను తన చెలికానికి వివరించుచుండెను. ఎట్లనగానేనొక కలగంటిని, అదే మనగా యవలరొట్టె ఒకటి మిద్యానీయుల దండులోనికి దొర్లి యొక గుడారమునకు వచ్చి దాని పడగొట్టి తల క్రిందు చేసినప్పుడు ఆ గుడారము పడిపోయెనని చెప్పెను.
7:14 అందుకు వాని చెలికాడు అది ఇశ్రాయేలీయుడైన యోవాషు కుమారుడగు గిద్యోను ఖడ్గమేగాని మరేమికాదు; దేవుడు మిద్యానీయులను ఈ దండంతను అతని చేతికి అప్పగింప బోవుచున్నాడని ఉత్తరమిచ్చెను.
7:15 గిద్యోను ఆ కల వివరమును దాని తాత్పర్యమును వినినప్పుడు అతడు యెహోవాకు నమస్కారము చేసి ఇశ్రాయేలీయుల దండులోనికి తిరిగి వెళ్లి లెండి, యెహోవా మిద్యానీయుల దండును మీ చేతికి అప్ప గించుచున్నాడని చెప్పి
7:18 నేనును నాతో నున్నవారందరును బూరలను ఊదునప్పుడు మీరును దండు పాళెమంతటిచుట్టు బూరలను ఊదుచు యెహోవాకును గిద్యోనుకును విజయము అని కేకలు వేయవలెనని చెప్పెను.
7:19 అట్లు నడిజాము మొదటి కావలివారు ఉంచబడగానే గిద్యోనును అతనితోనున్న నూరుమందియు దండుపాళెము కొట్టకొనకు పోయి బూరలను ఊది తమ చేతులలోనున్న కుండలను పగులగొట్టిరి.
7:20 అట్లు ఆ మూడు గుంపులవారు బూరలను ఊదుచు ఆ కుండలను పగులగొట్టి, యెడమచేతులలో దివిటీలను కుడిచేతులలో ఊదుటకు బూరలను పట్టుకొనియెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గము అని కేకలువేసిరి.
7:24 గిద్యోను ఎఫ్రాయిమీయుల మన్యదేశమంతటికిని దూతలను పంపి మిద్యానీయులను ఎదుర్కొనుటకు వచ్చి, బేత్బారావరకు వాగులను యొర్దానును వారికంటెముందుగా పట్టుకొనుడని చెప్పియుండెను గనుక, ఎఫ్రాయిమీయు లందరు కూడుకొని బేత్బారా వరకు వాగులను యొర్దానును పట్టుకొనిరి.
7:25 మరియు వారు మిద్యాను అధిపతులైన ఓరేబు జెయేబు అను ఇద్దరిని పట్టుకొని, ఓరేబు బండమీద ఓరేబును చంపిరి, జెయేబు ద్రాక్షల తొట్టియొద్ద జెయేబునుచంపి మిద్యానీయులను తరుముకొనిపోయిరి. ఓరేబు జెయేబుల తలలను యొర్దాను అవతలికి గిద్యోనునొద్దకు తెచ్చిరి.
8:1 అప్పుడు ఎఫ్రాయిమీయులు గిద్యోనుతో నీవు మా యెడల చూపిన మర్యాద యెట్టిది? మిద్యానీయులతో యుద్ధము చేయుటకు నీవు పోయినప్పుడు మమ్ము నేల పిలువ లేదని చెప్పి అతనితో కఠినముగా కలహించిరి.
8:4 గిద్యోనును అతనితో నున్న మూడువందల మందియును అలసటగానున్నను, శత్రువులను తరుముచు యొర్దానునొద్దకు వచ్చి దాటిరి.
8:7 అందుకు గిద్యోను ఈ హేతువు చేతను జెబహును సల్మున్నాను యెహోవా నా చేతికప్పగించిన తరువాత నూర్చు కొయ్యలతోను కంపలతోను మీ దేహములను నూర్చి వేయుదునని చెప్పెను.
8:11 అప్పుడు గిద్యోను నోబహుకును యొగేబ్బెహకును తూర్పున గుడారములలో నివసించిన వారి మార్గమున పోయి సేన నిర్భయముగా నున్నందున ఆ సేనను హతముచేసెను.
8:13 యుద్ధము తీరిన తరువాత యోవాషు కుమారుడైన గిద్యోను
8:21 అప్పుడు జెబహు పల్మున్నాలు ప్రాయము కొలది నరునికి శక్తియున్నది గనుక నీవు లేచి మామీద పడుమని చెప్పగా గిద్యోను లేచి జెబహును సల్మున్నాను చంపి వారి ఒంటెల మెడల మీదనున్న చంద్రహారములను తీసికొనెను.
8:22 అప్పుడు ఇశ్రాయేలీయులు గిద్యోనుతో నీవు మిద్యా నీయుల చేతిలోనుండి మమ్మును రక్షించితివి గనుక నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును మమ్మును ఏల వలెనని చెప్పిరి.
8:23 అందుకు గిద్యోను నేను మిమ్మును ఏలను, నా కుమారుడును మిమ్మును ఏలరాదు, యెహోవా మిమ్మును ఏలునని చెప్పెను.
8:24 మరియు గిద్యోను మీలో ప్రతి వాడు తన దోపుడు సొమ్ములోనున్న పోగులను నాకియ్య వలెనని మనవిచేయుచున్నాననెను. వారు ఇష్మాయేలీయులు గనుక వారికి పోగులుండెను.
8:26 మిద్యాను రాజుల ఒంటి మీదనున్న చంద్రహారములు కర్ణభూషణములు ధూమ్ర వర్ణపు బట్టలు గాకను, ఒంటెల మెడలనున్న గొలుసులు గాకను, అతడు అడిగిన బంగారు పోగుల యెత్తు వెయ్యిన్ని ఏడువందల తులముల బంగారము. గిద్యోను దానితో ఒక ఏఫోదును చేయించుకొని తన పట్టణమైన ఒఫ్రాలో దాని ఉంచెను.
8:27 కావున ఇశ్రాయేలీయులందరు అక్కడికి పోయి దాని ననుసరించి వ్యభిచారులైరి. అది గిద్యోనుకును అతని యింటివారికిని ఉరిగానుండెను.
8:28 మిద్యానీయులు ఇశ్రాయేలీయుల యెదుట అణపబడి అటుతరువాత తమ తలలను ఎత్తికొనలేకపోయిరి. గిద్యోను దినములలో దేశము నలువది సంవత్సరములు నిమ్మళముగా నుండెను.
8:30 గిద్యోనుకు అనేక భార్యలున్నందున కడుపున కనిన డెబ్బదిమంది కుమారులు అతని కుండిరి.
8:31 షెకెములోనున్న అతని ఉపపత్నియు అతనికొక కుమారుని కనగా గిద్యోను వానికి అబీమెలెకను పేరు పెట్టెను.
8:32 యోవాషు కుమారుడైన గిద్యోను మహా వృద్ధుడై చనిపోయి అబీయెజ్రీయుల ఒఫ్రాలోనున్న తన తండ్రియైన యోవాషు సమాధిలో పాతిపెట్టబడెను.
8:33 గిద్యోను చనిపోయిన తరువాత ఇశ్రాయేలీయులు చుట్టునుండు తమ శత్రువులచేతిలోనుండి తమ్మును విడిపించిన తమ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసికొనక

హెబ్రీయులకు (1)

11:32 ఇకను ఏమి చెప్పుదును? గిద్యోను, బారాకు, సమ్సోను, యెఫ్తా, దావీదు, సమూయేలను వారిని గూర్చియు, ప్రవక్తలనుగూర్చియు వివరించుటకు సమయము చాలదు.

Bible Topics

Back to Top
No Data Found

Songs and Lyrics

Back to Top
"గిద్యోను" found only in one lyric.

సర్వ శరీరుల దేవుడా - Sarva Shareerula Devudaa

Sermons and Devotions

Back to Top
"గిద్యోను" found in 9 contents.

ఎన్నిక
ప్రతి జీవికి ఒక ఆత్మ కథ వున్నట్టుగా, ప్రతి గ్రామానికీ, ప్రతి పట్టణానికీ ఒక ఆత్మ కథ వున్నది. యేసుని జననమునకు ముందు ఒక కుగ్రామం వుంది. అది చాలా స్వల్పమైన గ్రామం కాబట్టి దానికి ఎలాంటి విలువా లేదు. అదే బెత్లెహేము. అలాంటి బెత్లేహేమును దేవాదిదేవుడు ఏర్పరచుకున్నాడు. అందులోనుండే యూదుల రాజును ఉదయింపజేసేం

న్యాయాధిపతులు
యెహోషువ పుస్తకములో తేటగా చెప్పబడిన ఇశ్రాయేలీయుల పరిస్థితికి భిన్నమైన పరిస్థితిని చెప్పే పుస్తకమే ఈ “న్యాయాధిపతులు". లోబడె గుణము కల్గిన ఒక సమూహము దేవుని శక్తిని ఆనుకొని కనానును జయించుట మనము యెహోషువలో చూస్తున్నాము. న్యాయాధిపతులలో లోబడని, విగ్రహారాధన చేయు ప్రజలు దేవునికి వ్యతిరేకముగా నిలుచుట వ

Day 58 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)
యాకోబు ఒక్కడు మిగిలిపోయెను; ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను (ఆది 32:24) ఒక్కడే మిగిలిపోయాడు. ఈ మాటలు మన ఒక్కొక్కరిలో ఎంత భిన్నమైన అనుభవాలను గుర్తుకు తెస్తున్నాయి! కొందరికి ఒంటరితనం, చింత గుర్తొస్తాయి. కొందరికి ప్రశాంతత, విశ్రాంతి స్ఫురిస్తాయి. దేవుడు లేకుండా ఒక్కడే మిగిలిపోవ

Day 202 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
ఇంకొక మారే ఆ బొచ్చు చేత శోధింప సెలవిమ్ము (న్యాయాధి 6:39). విశ్వాసంలో రకరకాల అంతస్తులు ఉన్నాయి. క్రైస్తవులుగా మన అనుభవం ఒక స్థాయిలో ఉన్నప్పుడు మనం ఒక విషయాన్ని నమ్మవలసి వస్తే ఏదో ఒక సూచక క్రియ గాని, మనలో ఏదో అనిర్వచనీయమైన అనుభూతి గాని కనిపిస్తేనే నమ్ముతాము. గిద్యోనులగానే మన దగ్గర గొర్రె బ

Day 208 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
నన్ను శోధించుడి (మలాకీ 3:10). అక్కడ దేవుడు ఏమంటున్నాడు - "నా కుమారుడా, నా పరలోకపు వాకిళ్ళు ఉన్నాయి. అవి ఇంకా పాడైపోలేదు. గతంలోలాగానే గడియలు తేలికగానే తియ్యవచ్చు. అవి తుప్పు పట్టలేదు. ఆ తలుపుల్ని మూసి నా దగ్గర ఉన్నవాటిని దాచిపెట్టుకోవడం కంటే వాటిని బార్లాగా తెరిచి దీవెనల్ని ధారగా కురిపించ

Day 261 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
దేవోక్తి (దర్శనము) లేనియెడల జనులు కట్టులేక తిరుగుదురు (సామెతలు 29:18). దేవుని దర్శనాన్ని పొందాలంటే ఆయన కోసం కనిపెట్టాలి. ఎంత సమయం కనిపెట్టాలి అన్నది చాలా ముఖ్యం. మన హృదయాలు కెమెరాల్లో వాడే ఫిల్ముల్లాటివి. దేవుని పోలిక అక్కడ ముద్రించబడాలంటే మనం ఆయన ఎదుటికి వచ్చి కనిపెట్టాలి. అల్లకల్లోలంగా

Day 288 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
వాళ్ళు పగలగొట్టబడడం వల్ల శుద్ధులౌతారు (యోబు 41:25 - స్వేచ్ఛానువాదం). పగిలిన వస్తువుల్ని, మనుషుల్ని దేవుడు తన సంకల్పసిద్దికి ఎక్కువగా వాడుకుంటూ ఉంటాడు. ఆయన స్వీకరించే బలులు ఏమిటంటే విరిగి నలిగిన హృదయాలే. పేనూయేలు దగ్గర యాకోబు మానవశక్తి అంతా విచ్ఛిన్నమైనందువల్లనే దేవుడు అతణ్ణి ఆత్మ వస్త్రా

Day 356 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
భయంకరమైన కటిక చీకటి అతని కమ్మగా ... (ఆది 15:12). సూర్యాస్తమయమైంది. రాత్రి తన ముసుగును భూమిపై పరచింది. రోజంతా పనిచేసి తనువూ మనస్సూ అలిసిపోయి అబ్రాహాము నిద్రకు ఒరిగాడు. నిద్రలో అతని ఆత్మ గాఢాంధకారంలో మునిగింది. అతణ్ణి ఊపిరాడనీయకుండా చేసేటంత భయంకరమైన అంధకారమది. ఆతని గుండెలపై పీడకలలాగా ఎక్కి

Day 358 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలువెళ్ళి ... (ఆది 24:63). మనం ఎంత ఒంటరివాళ్ళమైతే అంత మంచి క్రైస్తవులమౌతాము. ఎంత తక్కువ పనిని తలపెడితే అంత ఎక్కువ సాధిస్తాము. ఎక్కువ సమయం ప్రభువుతో ఏకాంతంలో గడుపుతూ ఆయన కోసం ఎదురుచూడాలి. కాని మనం లోక వ్యవహారాల్లో తలమునకలుగా ఉంటున్నాము. మన హడావుడీ, అటూ

Popular Searches:

దేవుడు , యెహోవా , మోషే , శ్రమ , కృప , యేసు , దావీదు , క్రీస్తు , అల్ఫా , యోసేపు , మరణ , , కాలేబు , ఇశ్రాయేలీయులు , బిలాము , గిద్యోను , యాకోబు , ఆత్మ , ప్రేమ , కోరహు , అహరోను , మరియ , యెరూషలేము , అబ్రాహాము , మిర్యాము , పౌలు , అగ్ని , సౌలు , ప్రార్థన , అక్సా , హనోకు , ఇశ్రాయేలు , లోతు , సాతాను , సొలొమోను , యూదా , సీయోను , సెల , రాహేలు , బబులోను , రాహాబు , దేవ�%B , ఐగుప్తు , యెహోషాపాతు , ఇస్సాకు , జక్కయ్య , ఇస్కరియోతు , నోవహు , స్వస్థ , అతల్యా , లేవీయులు , యాషారు , ఏశావు , కోరెషు , యోకెబెదు , సమరయ , ఏలీయా , అన్న , గిలాదు , హిజ్కియా , సారెపతు , రక్షణ , ఆకాను , బేతేలు , కూషు , ఎలియాజరు , గిల్గాలు , ప్రార్ధన , కనాను , ఆషేరు , ఎఫ్రాయిము , కెజీయా , మగ్దలేనే మరియ , యోబు , యెఫ్తా , ఆసా , తీతు , అబ్దెయేలు , తామారు , తెగులు , పేతురు , అకుల , బేతనియ , ఏఫోదు , యొర్దాను , రోగము , సీమోను , రిబ్కా , జెరుబ్బాబెలు , కయీను , వృషణాలు , హాము , మార్త , దొర్కా , రూబేను , యెహోవా వశము , బెసలేలు , ఎలీషా , సబ్బు , పరదైసు ,

Telugu Keyboard help