1:35 ఏశావు కుమారులు ఏలీఫజు రెయూ వేలు యెయూషు యాలాము కోరహు.2:43 హెబ్రోను కుమారులు కోరహు తప్పూయ రేకెము షెమ.6:22 కహాతు కుమారులలో ఒకడు అమ్మినాదాబు, వీని కుమారుడు కోరహు, కోరహు కుమారుడు అస్సీరు,6:37 జెఫన్యా తాహతునకు పుట్టెను, తాహతు అస్సీరునకు పుట్టెను, అస్సీరు ఎబ్యాసాపునకు పుట్టెను, ఎబ్యాసాపు కోరహునకు పుట్టెను,6:38 కోరహు ఇస్హారునకు పుట్టెను, ఇస్హారు కహాతునకు పుట్టెను, కహాతు లేవికి పుట్టెను, లేవి ఇశ్రాయేలునకు పుట్టెను.9:19 మరియు కోరహు కుమారుడగు ఎబ్యాసాపునకు పుట్టిన కోరే కుమారుడైన షల్లూమును వాని పితరుని యింటివారును వాని సహో దరులగు కోరహీయులును సేవాసంబంధమైన పనిమీదనుండి గుడారమునకు ద్వారపాలకులై యుండిరి; వారి పితరులు యెహోవా పాళెమునకు కావలివారై యుండి ప్రవేశ స్థలమును కాయుచుండిరి.9:31 లేవీయులలో కోరహు సంతతివాడైన షల్లూమునకు పెద్ద కుమారుడైన మత్తిత్యా పిండివంటల మీద నుంచబడెను.26:1 ద్వారపాలకుల విభాగమును గూర్చినది. ఆసాపుకుమారులలో కోరే కుమారుడైన మెషెలెమ్యా కోరహు సంతతివాడు.