4:17 ఎఫ్రాయిము విగ్రహములతో కలసికొనెను, వానిని ఆలాగుననే యుండనిమ్ము.5:3 ఎఫ్రాయిమును నేనెరుగుదును; ఇశ్రాయేలువారు నాకు మరుగైనవారు కారు. ఎఫ్రాయిమూ, నీవు ఇప్పుడే వ్యభిచరించుచున్నావు; ఇశ్రాయేలువారు అపవిత్రులైరి.5:5 ఇశ్రాయేలుయొక్క అతిశయాస్పదము అతనిమీద సాక్ష్యమిచ్చును. ఇశ్రాయేలువారును ఎఫ్రాయిమువారును తమ దోషములో చిక్కుపడి తొట్రిల్లుచున్నారు; వారితోకూడ యూదావారును తొట్రిల్లుచున్నారు.5:9 శిక్షా దినమున ఎఫ్రాయిము పాడైపోవును; నిశ్చయముగా జరుగబోవు దానిని ఇశ్రాయేలీయుల గోత్రపువారికి నేను తెలియజేయుచున్నాను.5:13 తాను రోగియవుట ఎఫ్రాయిము చూచెను, తనకు పుండు కలుగుట యూదా చూచెను అప్పుడు ఎఫ్రాయిము అష్షూరీయులయొద్దకు పోయెను, రాజైన యారేబును పిలుచుకొనెను. అయితే అతడు నిన్ను స్వస్థపరచజాలడు, నీ పుండు బాగు చేయజాలడు.7:1 నేను ఇశ్రాయేలువారికి స్వస్థత కలుగజేయదలంచగా ఎఫ్రాయిము దోషమును షోమ్రోను చెడుతనమును బయలుపడుచున్నది. జనులు మోసము అభ్యాసము చేసెదరు, కొల్లగాండ్రయి లోపలికి చొరబడుదురు, బందిపోటు దొంగలై బయట దోచుకొందురు.7:8 ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయెను; ఎఫ్రాయిము ఎవరును త్రిప్పివేయని అప్పమువంటి వాడాయెను.7:11 ఎఫ్రాయిము బుద్ధిలేని పిరికిగుండెగల గువ్వయాయెను; వారు ఐగుప్తీయులను పిలుచుకొందురు. అష్షూరీయుల యొద్దకు పోవుదురు.8:9 అడవి గార్దభము తన ఆశ తీర్చుకొనబోయినట్లు ఇశ్రాయేలు వారు అష్షూరీయులయొద్దకు పోయిరి; ఎఫ్రాయిము కానుకలు ఇచ్చి విటకాండ్రను పిలుచుకొనెను.8:11 ఎఫ్రాయిము పాపమునకు ఆధారమగు బలిపీఠములను ఎన్నెన్నో కట్టెను, అతడు పాపము చేయుటకు అవి ఆధారములాయెను.9:8 ఎఫ్రాయిము నా దేవునియొద్దనుండి వచ్చు దర్శనములను కనిపెట్టును; ప్రవక్తలు తమ చర్యయంతటిలోను వేటకాని వలవంటివారై యున్నారు; వారు దేవుని మందిరములో శత్రువులుగా ఉన్నారు.9:11 ఎఫ్రాయిముయొక్క కీర్తి పక్షివలె ఎగిరి పోవును; జననమైనను, గర్భముతో ఉండుటయైనను, గర్భము ధరించుటయైనను వారికుండదు.9:13 లోయలో స్థాపింపబడిన తూరువంటి స్థానముగా నుండుటకై నేను ఎఫ్రాయిమును ఏర్పరచుకొంటిని; అయితే నరహంతకుల కప్పగించుటకై అది దాని పిల్లలను బయటికి తెచ్చును.9:16 ఎఫ్రాయిము మొత్తబడెను, వారి వేరు ఎండిపోయెను, వారు ఫలమియ్యరు. వారు పిల్లలు కనినను వారి గర్భనిధిలోనుండివచ్చు సొత్తును నేను నాశనము చేసెదను.10:6 ఎఫ్రాయిము అవమానము నొందుటకు, ఇశ్రాయేలు వారు తాము చేసిన ఆలోచనవలన సిగ్గు తెచ్చుకొనుటకు, అది అష్షూరు దేశములోనికి కొనిపోబడి రాజైన యారేబునకు కానుకగా ఇయ్యబడును.10:11 ఎఫ్రాయిము నూర్పునందు అభ్యాసముగలదై కంకులను త్రొక్కగోరు పెయ్యవలె ఉన్నది; అయితే దాని నున్నని మెడకు నేను కాడి కట్టుదును; ఎఫ్రాయిముచేత దున్నించుటకు నేనొకని నియమింతును, యూదా భూమిని దున్నును, యాకోబు దానిని చదును చేసికొనును.11:3 ఎఫ్రాయిమును చెయ్యిపట్టుకొని వానికి నడక నేర్పినవాడను నేనే; వారిని కౌగలించు కొనినవాడను నేనే; నేనే వారిని స్వస్థపరచినవాడనైనను ఆ సంగతి వారికి మనస్సున పట్టలేదు11:9 నా ఉగ్రతాగ్నినిబట్టి నాకు కలిగిన యోచనను నేను నెరవేర్చను; నేను మరల ఎఫ్రాయిమును లయపరచను, నేను మీ మధ్య పరిశుద్ధదేవుడను గాని మనుష్యుడను కాను, మిమ్మును దహించునంతగా నేను కోపింపను.11:12 ఎఫ్రాయిమువారు అబద్ధములతో నన్ను ఆవరించియున్నారు; ఇశ్రాయేలువారు మోసక్రియలతో నన్ను ఆవరించియున్నారు; యూదావారు నిరాటంకముగా దేవునిమీద తిరుగుబాటు చేయుదురు, నమ్మకమైన పరిశుద్ధ దేవునిమీద తిరుగబడుదురు.12:1 ఎఫ్రాయిము గాలిని మేయుచున్నాడు; తూర్పు గాలిని వెంటాడుచున్నాడు; మానక దినమెల్ల అబద్దమాడుచు, బలాత్కారము చేయుచున్నాడు; జనులు అష్షూరీయులతో సంధిచేసెదరు, ఐగుప్తునకు తైలము పంపించెదరు.12:7 ఎఫ్రాయిమువారు కనానీయుల వర్తకులవంటివారై అన్యాయపు త్రాసును వాడుకచేసెదరు, బాధపెట్టవలె నన్న కోరిక వారికి కలదు.12:8 నేను ఐశ్వర్యవంతుడనైతిని, నాకు బహు ఆస్తి దొరికెను, నా కష్టార్జితములో దేనిని బట్టియు శిక్షకు తగిన పాపము నాలోనున్నట్టు ఎవరును కనుపరచలేరని ఎఫ్రాయిము అనుకొనుచున్నాడు.12:14 ఎఫ్రాయిము బహు ఘోరమైన కోపము పుట్టించెను గనుక అతనిని ఏలినవాడు అతడు చేసిన నరహత్యకై అతనిమీద నేరము మోపును; అతడు పరులకు అవమానము కలుగజేసి నందుకై నేనతని నవమానపరతును.13:1 ఎఫ్రాయిము మాటలాడినప్పుడు భయము కలిగెను; అతడు ఇశ్రాయేలువారిలో తన్ను గొప్ప చేసికొనెను; తరువాత బయలు దేవతనుబట్టి అపరాధియై అతడు నాశనమొందెను.13:12 ఎఫ్రాయిము దోషము నాయొద్ద ఉంచబడి యున్నది, అతని పాపము భద్రము చేయబడియున్నది.13:15 నిజముగా ఎఫ్రాయిము తన సహోదరులలో ఫలాభివృద్ధినొందును. అయితే తూర్పుగాలి వచ్చును, యెహోవా పుట్టించు గాలి అరణ్యములోనుండి లేచును; అది రాగా అతని నీటిబుగ్గలు ఎండిపోవును, అతని ఊటలు ఇంకిపోవును, అతని ధననిధులను అతనికి ప్రియమైన వస్తువులన్నిటిని శత్రువు కొల్లపెట్టును.14:8 ఎఫ్రాయిమూ బొమ్మలతో నాకిక నిమిత్తమేమి? నేనే ఆలకించుచున్నాను, నేనే ఎఫ్రాయిమునుగూర్చి విచారణ చేయుచున్నాను, నేను చిగురుపెట్టు సరళవృక్షమువంటి వాడను, నావలననే నీకు ఫలము కలుగును.