21:11 ఓబోతులో నుండి వారు సాగి సూర్యోదయ దిక్కున, అనగా మోయాబు ఎదుట అరణ్యమందలి ఈయ్యె అబారీమునొద్ద దిగిరి.27:12 మరియు యెహోవా మోషేతో ఇట్లనెను నీవు ఈ అబారీము కొండయెక్కి నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చిన దేశమును చూడుము.33:44 ఓబోతులోనుండి బయలుదేరి మోయాబు పొలిమేర యొద్దనున్న ఈయ్యె అబారీములో దిగిరి.33:45 ఈయ్యె అబారీములోనుండి బయలు దేరి దీబోనుగాదులో దిగిరి.33:48 అబారీము కొండలలోనుండి బయలుదేరి యెరికో దగ్గర యొర్దానుకు సమీపమైన మోయాబు మైదానములలో దిగిరి.