క్రీస్తునందు ప్రియమైన పాఠకులకు శుభములు, పరిశుద్ధుడు పరమాత్ముడైన యేసు క్రీస్తు ప్రభువు మనతో చేసిన నిత్య నిబంధన ఏ విధంగా మన జీవితాలలో నెరవేరింది మరియు మన శేష జీవితంలో ఏ విధంగా నెరవేరబోతుంది అనే అంశాలను ఈ వార్తమానం లో గమనిద్దాం. యేసు క్రీస్తు ప్రభువు ఒకనాడు వస్తాడు అని, తన నిబంధనను మన యెడల స్థిరపరుస్తాడు అని యెషయా భక్తుని ద్వారా దేవుడు ముందుగానే ప్రవచించి యెషయా 56:6 లో “విశ్రాంతిదినమును అపవిత్రపరచకుండ ఆచరించుచు నా నిబంధనను ఆధారము చేసికొనుచు యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించుచు ఆయనకు పరిచర్య చేయవలెనని ఆయన పక్షమున చేరు అన్యులను నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వచ్చెదను”.

పరిశుద్ధ గ్రంథంలో గమనించి నట్లయితే ఆదాము నుండి అబ్రహాము వరకు దేవుడు వాగ్ధానం చేసాడు. ఆదాముతో దేవుడు చేసిన వాగ్ధానం ఆది 1:28 ప్రకారం “దేవుడు వారిని ఆశీర్వదించెను; ఎట్లనగామీరు ఫలించి అభివృద్ధిపొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి”. అదే విధంగా నోవహుతో కూడా ఆది 9:8-17 “భూమి మీద నున్న సమస్త శరీరులకు నా నిబంధనను స్థిరపరుస్తాను అని ఒక గురుతుగా” వాగ్ధానం చేసాడు. కాని అబ్రహాముతో రెండు వాగ్ధానాలు చేసాడు. ఆది 13:16 “మరియు నీ సంతానమును భూమిమీదనుండు రేణు వులవలె విస్తరింప చేసెదను; ఎట్లనగా ఒకడు భూమి మీద నుండు రేణువులను లెక్కింప గలిగిన యెడల నీ సంతానమును కూడ లెక్కింప వచ్చును.” మరియు ఆది 15:5 “నీవు ఆకాశమువైపు తేరిచూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానము ఆలాగవునని చెప్పెను”. ఈ రెండు వాగ్ధానాలలో రాబోయే సంతానమునకు అనగా రాబోయే సంతతికి ముందుగా అబ్రహాముతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేస్తున్నాయి. ఈ రెండు వాగ్ధానాలు ఒకే విధమైన తాత్పర్యం ఉండవచ్చు కాని లోతైన ఆత్మీయ మర్మం దాగి ఉంది. ఈ రెండు వాగ్ధానాలాలో మొదటిది శరీర సంబంధమైన వాగ్ధానం మరొకటి ఆత్మ సంబంధమైన వాగ్ధానం అనగా భూలోక సంబంధమైన వాగ్ధానం మరియు పరలోక సంబంధమైన వాగ్ధానం.

శరీర సంబంధమైన వాగ్ధానాన్ని తన జీవితంలో నెరవేర్చుటకు శరీర సంబంధమైన సున్నతిని ఒక గురుతుగా వేసి ఆది 17:7,8 ప్రకారం నీకును నీ తరువాత నీ సంతానమునకును దేవుడనై యుండునట్లు, నాకును నీకును, నీ తరువాత వారి తరములలో నీ సంతతికిని మధ్య నా నిబంధన నిత్య నిబంధనగా స్థిరపరచెదను అని తెలియజేశాడు. శరీర సంబంధమైన వాగ్ధానం ద్వారా కనాను దేశమును నిత్య స్వాస్థ్యముగా అనుగ్ర -హించాడు. ఆత్మ సంబంధమైన వాగ్ధానాన్ని నెరవేర్చుటకు రక్తాన్ని బలిపీఠం పై రక్తం చిందింపబడింది. ఎట్లనగా తన యేకైక కుమారుడైన ఇస్సాకుకు మారుగా ఆది 22:13 ప్రకారం ఒక పోట్టేలును దహబలిగా అర్పించెను. ఆనాడు యెహోవా దేవుడు ఆ పర్వతము మీద చేసిన వాగ్ధానమును జ్ఞాపకము చేసుకొని ఇశ్రాయేలీయుల యెడల అనగా యాకోబు సంతతినంతటిని ఆశీర్వదించెను. అబ్రహాము ఆ వాగ్ధానాన్ని విశ్వసించాడు అది అతనికి నీతిగా ఎంచబడింది. అతనికే కాకుండా తరువాత సంతతికి కూడా ఆ నీతి ధానముగా కృపా బాహుళ్యత వలన ఆశీర్వదించబడ్డారు. పై చదవబడిన వచనం యెషయా 56:6 ప్రకారం అన్యులైన మనలను తన పరిశుద్ధ పర్వతమునకు నడిపించి మనకు కూడా ఆ వాగ్ధానాన్ని నెరవేరుస్తాను అని తెలియజేస్తున్నాడు. అనగా పాపముల చేత అపరాధములచేత చచ్చిన మనలను ఇప్పుడు క్రీస్తుతో కూడా బ్రదికించెను, బ్రదికించి అన్యులైన మనకు ఇప్పుడు శరీర సంబంధమైన సున్నతి లేకుండా, క్రీస్తు ద్వారా ఒక్కసారే సిలువ పై మరణించి, మరణపు ముల్లును విరచి, ఒక నూతన నిబంధనను స్థిరపరచాడు. ఎట్లనగా ఎఫెసీ 2:11-13 ప్రకారం అన్యులైన మనము ఇశ్రాయేలీయులతో సహా పౌరులం కానప్పటికీ, పరదేశులును, వాగ్ధాన నిబంధన లేని పరజనులును, నిరీక్షణలేని వారముగా అనగా మునుపు దూరస్తులమైన మనలను ఇప్పుడు క్రీస్తులో సమీపస్తులుగా చేసికొని ఆ నిబంధనను స్థిరపరచాడు.

ఆత్మ సంబంధమైన వాగ్ధానమునకు రక్తమును శరీరమునుండి వేరుపరచి శరీర సంబంధమైన వాగ్ధానమునకు శరీరం దున్నబడి అర్పించాడు. అనగా ఆత్మ సంబంధమైన వాగ్ధానముగా తన రక్తాన్ని ఆఖరి బొట్టు వరకు కార్చి రక్షణను మనకు అనుగ్రహించాడు. ఇట్లు ఆత్మ సంబంధమైన వాగ్ధానాన్ని నెరవేర్చి శరీర సంబంధమైన వాగ్ధానముగా తన శరీరాన్ని మరణములో నుండి జీవములోనికి అనగా పునరుత్థానం ద్వారా దానిని నెరవేర్చాడు. ఈ నూతన నిబంధన ద్వారా రక్షణ మరియు తన నిత్య రాజ్యము నూతన యెరూషలేమునకు చేరుతాము అనే నిరీక్షణ కలిగింది. ఇదే ఆ పరిశుద్ధ పర్వతం.

క్రీస్తు శరీరం సంఘమును సూచిస్తుంది, ఈ సంఘంలో ఉన్న మనకే ఈ వాగ్ధానం నేరవేర్తుంది కాని వేరుగా ఉన్నవారికి నెరవేరదు. అందుకే ఒకే సంఘమునకు సభ్యత్వం కలిగి ఉండడం అది నీకు మేలు. ఈ సంఘమునకు శిరస్సు క్రీస్తు. యేసు క్రీస్తు ఏ విధంగా మహిమ శరీరం గా ఎత్తబడ్డాడో ఆయన మరల వచినప్పుడు అదే విధంగా ఈ సంఘం కూడా ఎత్తబడుతుంది. అప్పుడే సంఘము ద్వారా ఎత్తబడిన మనం ఆ పరిశుద్ధ పర్వతముపై అనగా నూతన యెరూషలేములో ఉంటాము అనే నిరీక్షణ కలిగి యుండగలం. అందుకే ఎఫెసీ 5:22-27 ప్రకారం క్రీస్తు సంఘమును ప్రేమించి, అది కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైననూ లేక, పరిశుధ్ధమైనదిగాను, నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగా ఉండవలెనని కోరుతున్నాడు. అందువలెనే సిలువలో పలికిన ఆరవ మాట సమాప్తమైనది, అనగా ఈ నిబంధనను నెరవేర్చెను అని తనను తాను సమర్పించుకున్నాడు. పస్కా బలి, పాప పరిహారార్ధ బలి, సర్వాంగ దహన బలి, అపరాధ పరిహారార్ధ బలి, సమాధాన బలి వీటికి బదులుగా అనగా వాటికి మారుగా తనను తాను అర్పించుకున్నాడు.

ప్రియ చదువరీ, ఆనాడు ఇశ్రాయేలీయులకు చేసిన వాగ్ధానం ప్రకారం ప్రకటన 7:4 లో పన్నెండు గోత్రములనుండి పన్నెండు వేలమందిని లెక్కించాడు. అనగా లక్షా నలువది నాలుగు వేల మంది. అంతేకాకుండా మన అన్యులైన జీవితాలో మనలను లెక్కింపలేని గొప్ప జనసమూహంగా తన పరిశుద్ధ పరమునకు మనలను పిలిచిన వాని గుణాతిశయమును ఏమని వర్ణించగలం. పరిశుద్ధుడు పరమాత్ముడైన దేవుడు మన జీవితాల్లో ఆట్టి కృప దయచేసిన విధానమును జ్ఞాపకము చేసికొని ఇంకా ఉచితంగా ఇచ్చిన రక్షణ పొందకుండా నిర్ల్యక్షము చేస్తుంటే వ్యర్ధం. నిత్య నిబంధనను దేవునిని బట్టి అట్టి కృపకు రక్షణకు పాత్రులవుదురు గాక. ఆమేన్.

 • The Bible
 • The aim of the bible is not to Christianize people,

  But to spiritualize people as Adams ate the forbidden Apple.

  The aim is not to show religious path,

  But...

 • ప్రవచనములు - నెరవేర్పు
 • 1. కన్యక గర్భంలో జన్మించడం

  ప్రవచనం : యెషయా 7:14 “కాబట్టి ప్రభువు తానే యొక సూచన మీకు చూపును. ఆలకించుడి, కన్యక గర్భవతియై కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును.”

  నేరవేర్పు: మత్తయి 1:18-25 “యేసు క్రీస్తు జననవిధ మెట్లనగా, ఆయన తల్లియైన మరియ యోసేపునకు ప్రధానము చేయబడిన తరువాత వారే...

 • ఈ జీవితానికి 4 ప్రశ్నలు
 • ఈ లోకంలో జీవము కలిగినవి ఎన్నో ఉన్నాయి. వాటిలో ఉత్తమమైన జ్ఞానం కలిగిన వాడు మానవుడే. ఈ జ్ఞానం ఎంతగానో అభివృద్ధి చెందింది. అనాది కాలం నుండి ఈ 21వ శతాబ్దపు మానవుని జీవనా విధానంలొ ఆధునికతకు అవధులు లేని ఎన్నో మార్పులు. సామాజిక సామాన్య తత్వ శాస్త్రాలలొ మానవుని జ్ఞానం అంతా ఇంతా కాదు. ఈ విజ్ఞాన తత్వశాస్త...

 • నిత్య భధ్రత పాపము చేయడానికి అనుమతిని ధృవీకరిస్తుందా?
 • నిత్య భధ్రత సిధ్దాంతమునకు తరచుగా వచ్చే ఆక్షేపణ ఏంటంటే ఒక వ్యక్తి తన కిష్టమువచ్చినట్లు పాపం చేసి మరియు రక్షింపబడటుకు ప్రజలకు అనుమతినిచ్చినట్లు కన్పడుతుంది. సాంకేతికంగా ఆలోచించినట్లయితే ఇది సత్యమే, వాస్తవికంగా అది సత్యం కాదు. ఒక వ్యక్తి నిజంగా యేసుక్రీస్తుచేత విమోచింపబడినట్లయితే ఆ వ్యక్తి తన ఇష్ట్ట...

 • సిలువ యాత్రలో సీమోను
 • లూకా 23:26-31 “వారాయనను తీసికొని పోవు చుండగా పల్లెటూరి నుండి వచ్చుచున్న కురేనీయుడైన సీమోనను ఒకనిని పట్టుకొని యేసు వెంట సిలువను మోయుటకు అతని మీద దానిని పెట్టిరి.”

  కురేనీయుడైన సీమోనుకు కొంత సమయం యేసు ప్రభువుతో పాటు సిలువను మోసే భాగ్యం కలిగింది. ఇతడు ఆఫ్రికా ఖండం లోని కురేనియ(లిబియ) దేశస్థు...

 • యేసుని శిష్యుడను - 4
 • సుంకరులును వేశ్యలును మీకంటె ముందుగా దేవుని రాజ్యములో ప్రవేశించుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను (మత్తయి 21:31). సుంకరులును వేశ్యలును పాపముతో నిండిన వారు కదా మరి వారు ముందుగా దేవుని రాజ్యములో ఎలా ప్రవేశించుదురు?

  ఈ దినము మనము సుంకరియైన మత్తయి గురించి తెలుసుకుందాము. అల్ఫయి కుమారుడగు లే...

 • ఆ వాక్యమే శరీరధారి
 • యోహాను 1:1-18 “ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను. ఆయన ఆది యందు దేవునియొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగియున్నదేదియు ఆయన లేకుండ కలుగలేదు. ఆయనలో జీవముండెను; ఆ జీవము మనుష్యులకు వెలుగైయుండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాని గ్ర...

 • యేసుని శిష్యుడను
 • ఆకాశమునుండి అగ్ని దిగి వీరిని నాశనము చేయునట్లు మేమాజ్ఞాపించుట నీకిష్టమా అని అడుగగా, ఆయన(యేసు) వారితట్టు తిరిగి వారిని గద్దించెను (లూకా 9:55). అంతటి దుడుకు స్వభావము గలవారు యేసుని శిష్యులలోని సహోదురులైన యోహాను మరియు యాకోబు. వీరిద్దరికి ఆయన బొయనేర్గెసను పెరుపెట్టేను; బొయనేర్గెసు అనగా ఉరిమెడు వారని ...

 • రక్షకుడు
 • నేడు రక్షకుడు నా కొరకు పుట్టియున్నాడు(లూక 2:11)

  యేసు క్రీస్తు ఈ రక్షణను మనకు ఎందుకు కలుగ చేసెను?

  లూక 1:75 మనము శత్రువుల చేతినుండి విడిపింపబడి మన జీవితకాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగజేసెను.

  నా రక...

 • హెబ్రీ పత్రిక ధ్యానం
 • అధ్యాయాలు 13 వచనములు 303

  రచించిన తేది : క్రీ.శ. 70

  మూల వాక్యాలు :హెబ్రీయులకు 1:3-4 “ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వముయొక్క మూర్తి మంతమునై యుండి, తన మహత్తుగల మాటచేత సమస్తమును నిర్వహించుచు, పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి, దేవదూతల కంటె ఎంత శ్రేష్ఠమైన నామము పొందెనో వారికంటె...

 • మలాకీ గ్రంథ ధ్యానం
 • గ్రంథ కర్త: మలాకి 1:1 ప్రకారం మలాకీ ప్రవక్త అని వ్రాయబడియుంది.

  రచించిన తేదీ: క్రీ.పూ. 440 మరియు 400||సం మధ్య రచించి ఉండవచ్చు.

  అధ్యాయాలు : 4, వచనములు : 55

  రచించిన ఉద్దేశం: దేవుడు తన ప్రజల పట్ల ఎటువంటి ఉద్దేశం కలిగి ఉన్నాడో దానిని ముందుగానే ప్రవక్త యైన మలాకీ ద్వారా తెలియజేసి...

 • ఎజ్రా గ్రంథం
 • అధ్యాయాలు : 10, వచనములు : 280

  రచించిన తేది, కాలం : క్రీ.పూ. 457-444 సం||లో ఈ గ్రంధం వ్రాయబడింది.

  మూల వాక్యాలు: 3:11 “వీరు వంతు చొప్పున కూడి యెహోవా దయాళుడు, ఇశ్రాయేలీయుల విషయమై ఆయన కృప నిరంతరము నిలుచునని పాడుచు యెహోవాను స్తుతించిరి. మరియు యెహోవా మందిరముయొక్క పునాది వేయబడుట చూచి, జ...

 • యోబు గ్రంథం
 • అధ్యాయాలు : 42, వచనములు : 1070

  గ్రంథకర్త : ఎవరో తెలియదు.

  రచించిన తేది : దాదాపు 1800-1500 సం. క్రీ.పూ

  మూల వాక్యాలు : 1:21

  రచించిన ఉద్ధేశం: బైబెల్ గ్రంథంలో ఉన్న పుస్తకాలలో యోబు గ్రంథం ప్రత్యేకమైనది. ఈ గ్రంథంలో ఓ చక్కటి తత్వశాస్త్రం ఇమిడి ఉంది మరియు నీతిమంతులకు శ్రమలు...

 • ఎస్తేరు గ్రంథం
 • అధ్యాయాలు : 10, వచనములు : 167

  గ్రంథకర్త : మొర్దెకైగా (9:29) (రచనా శైలిని తీసికొని ఈ పుస్తకమును ఎజ్రాయో, నెహెమ్యాయో వ్రాసి యుండవచ్చు) రచించిన తేది : దాదాపు 133 సం. క్రీ.పూ

  మూల వాక్యాలు : 4:14 “నీవు ఈ సమయమందు ఏమియు మాటలాడక మౌనముగానున్న యెడల యూదులకు సహాయమును విడుదలయు మరియొక దిక్కును...

Daily Bible Verse
"అక్కడ సింహముండదు క్రూరజంతువులు దాని ఎక్కవు, అవి అక్కడ కనబడవు విమోచింపబడినవారే అక్కడ నడచుదురు యెహోవా విమోచించినవారు పాటలుపాడుచు తిరిగి సీయోనునకు వచ్చెదరు " యెషయా 35:9
Daily Bible Quote
"ఒకడు తన ఒడిలో అగ్ని నుంచుకొనినయెడల వాని వస్త్రములు కాలకుండునా?" సామెతలు 6:27
Apr - May 2012 Vol. 2 Issue. 4
Magazine
Whats New
Telugu Cross Reference Bible

Telugu Bible update now with Cross Reference

Update to New Look

Sajeeva Vahini has increased its appearance in the Homepage and design.

Facebook Telugu Bible App

Facebook APP Click Here

Telugu Audio Bible

Telugu Audio Bible is updated for all the scriptures.. Read & Listen. Now!! its Free..

Telugu Bible Online

Telugu Bible Online version has been improved for readers convenience.

Explore

© సజీవ వాహిని - Sajeeva Vahini 2009-2014. info@sajeevavahini.com

Note: Please email any information for any suspected content/audio subject to piracy/copyright act on this website can be considered. Which can help us to improve better.