Samuel I- 1 సమూయేలు 17 | View All

1. ఫిలిష్తీయులు తమ సైన్యములను యుద్ధమునకు సమ కూర్చి యూదా దేశములోని శోకోలో కూడి ఏఫెస్దమీ్మము దగ్గర శోకోకును అజేకాకును మధ్యను దిగి యుండగా

1. philishtheeyulu thama sainyamulanu yuddhamunaku sama koorchi yoodhaa dheshamulōni shōkōlō kooḍi ēphesdameemamu daggara shōkōkunu ajēkaakunu madhyanu digi yuṇḍagaa

2. సౌలును ఇశ్రాయేలీయులును కూడివచ్చి ఏలాలోయలో దిగి ఫిలిష్తీయుల కెదురుగ యుద్ధపంక్తులు తీర్చిరి.

2. saulunu ishraayēleeyulunu kooḍivachi ēlaalōyalō digi philishtheeyula keduruga yuddhapaṅkthulu theerchiri.

3. ఫిలిష్తీయులు ఆతట్టు పర్వతము మీదను ఇశ్రా యేలీయులు ఈతట్టు పర్వతముమీదను నిలిచియుండగా ఉభయుల మధ్యను ఒక లోయయుండెను.

3. philishtheeyulu aathaṭṭu parvathamu meedanu ishraayēleeyulu eethaṭṭu parvathamumeedanu nilichiyuṇḍagaa ubhayula madhyanu oka lōyayuṇḍenu.

4. గాతువాడైన గొల్యాతు అను శూరుడొకడు ఫిలిష్తీయుల దండులో నుండి బయలుదేరు చుండెను. అతడు ఆరుమూళ్లజేనెడు ఎత్తుమనిషి.

4. gaathuvaaḍaina golyaathu anu shooruḍokaḍu philishtheeyula daṇḍulō nuṇḍi bayaludheru chuṇḍenu. Athaḍu aarumooḷlajēneḍu etthumanishi.

5. అతని తలమీద రాగి శిరస్త్రాణముండెను, అతడు యుద్ధకవచము ధరించియుండెను, ఆ కవచము అయిదు వేల తులముల రాగి యెత్తుగలది.

5. athani thalameeda raagi shirastraaṇamuṇḍenu, athaḍu yuddhakavachamu dharin̄chiyuṇḍenu, aa kavachamu ayidu vēla thulamula raagi yetthugaladhi.

6. మరియు అతని కాళ్లకు రాగి కవచమును అతని భుజముల మధ్యను రాగి బల్లెమొకటి యుండెను.

6. mariyu athani kaaḷlaku raagi kavachamunu athani bhujamula madhyanu raagi ballemokaṭi yuṇḍenu.

7. అతని యీటె కఱ్ఱ నేతగాని దోనె అంత పెద్దది; మరియు అతని యీటెకొన ఆరువందల తులముల యినుము ఎత్తుగలది. ఒకడు డాలును మోయుచు అతని ముందర పోవుచుండెను.

7. athani yeeṭe karra nēthagaani dōne antha peddadhi; mariyu athani yeeṭekona aaruvandala thulamula yinumu etthugaladhi. Okaḍu ḍaalunu mōyuchu athani mundhara pōvuchuṇḍenu.

8. అతడు నిలిచి ఇశ్రాయేలీయుల దండువారిని పిలిచియుద్ధపంక్తులు తీర్చుటకై మీ రెందుకు బయలుదేరి వచ్చితిరి?నేను ఫిలిష్తీయుడను కానా? మీరు సౌలు దాసులుకారా? మీ పక్షముగా ఒకనిని ఏర్ప రచుకొని అతని నాయొద్దకు పంపుడి;

8. athaḍu nilichi ishraayēleeyula daṇḍuvaarini pilichiyuddhapaṅkthulu theerchuṭakai mee renduku bayaludheri vachithiri?Nēnu philishtheeyuḍanu kaanaa? meeru saulu daasulukaaraa? mee pakshamugaa okanini ērpa rachukoni athani naayoddhaku pampuḍi;

9. అతడు నాతో పోట్లాడి నన్ను చంపగలిగినయెడల మేము మీకు దాసుల మగుదుము; నేనతని జయించి చంపినయెడల మీరు మాకు దాసులై మాకు దాస్యము చేయుదురు.

9. athaḍu naathoo pōṭlaaḍi nannu champagaliginayeḍala mēmu meeku daasula magudumu; nēnathani jayin̄chi champinayeḍala meeru maaku daasulai maaku daasyamu cheyuduru.

10. ఈ దినమున నేను ఇశ్రాయేలీయుల సైన్యములను తిరస్కరించుచున్నాను. ఒకని నియమించిన యెడల వాడును నేనును పోట్లాడుదుమని ఆ ఫిలిష్తీయుడు చెప్పుచువచ్చెను.

10. ee dinamuna nēnu ishraayēleeyula sainyamulanu thiraskarin̄chuchunnaanu. Okani niyamin̄china yeḍala vaaḍunu nēnunu pōṭlaaḍudumani aa philishtheeyuḍu cheppuchuvacchenu.

11. సౌలును ఇశ్రా యేలీయులందరును ఆ ఫిలిష్తీయుని మాటలు వినినప్పుడు బహు భీతులైరి.

11. saulunu ishraayēleeyulandarunu aa philishtheeyuni maaṭalu vininappuḍu bahu bheethulairi.

12. దావీదు యూదా బేత్లెహేమువాడగు ఎఫ్రాతీయు డైన యెష్షయి అనువాని కుమారుడు.యెష్షయికి ఎనమండు గురు కుమాళ్లుండిరి. అతడు సౌలు కాలమందు జనులలో ముసలివాడై యుండెను.

12. daaveedu yoodhaa bētlehēmuvaaḍagu ephraatheeyu ḍaina yeshshayi anuvaani kumaaruḍu.Yeshshayiki enamaṇḍu guru kumaaḷluṇḍiri. Athaḍu saulu kaalamandu janulalō musalivaaḍai yuṇḍenu.

13. అయితే యెష్షయియొక్క ముగ్గురు పెద్దకుమారులు యుద్ధమునకు సౌలువెంటను పోయి యుండిరి. యుద్ధమునకు పోయిన అతని ముగ్గురు కుమా రుల పేరులు ఏవనగా, జ్యేష్ఠుడు ఏలీయాబు, రెండవవాడు అబీనాదాబు, మూడవవాడు షమ్మా,

13. ayithē yeshshayiyokka mugguru peddakumaarulu yuddhamunaku sauluveṇṭanu pōyi yuṇḍiri. Yuddhamunaku pōyina athani mugguru kumaa rula pērulu ēvanagaa, jyēshṭhuḍu ēleeyaabu, reṇḍavavaaḍu abeenaadaabu, mooḍavavaaḍu shammaa,

14. దావీదు కనిష్ఠుడు; పెద్దవారైన ముగ్గురు సౌలువెంటను పోయి యుండిరిగాని

14. daaveedu kanishṭhuḍu; peddavaaraina mugguru sauluveṇṭanu pōyi yuṇḍirigaani

15. దావీదు బేత్లెహేములోతన తండ్రి గొఱ్ఱెలను మేపుచు సౌలునొద్దకు తిరిగి పోవుచు వచ్చుచు నుండెను.

15. daaveedu bētlehēmulōthana thaṇḍri gorrelanu mēpuchu saulunoddhaku thirigi pōvuchu vachuchu nuṇḍenu.

16. ఆ ఫిలిష్తీయుడు ఉదయమునను సాయంత్రమునను బయలు దేరుచు నలువది దినములు తన్ను తాను అగుపరచుకొనుచు వచ్చెను.

16. aa philishtheeyuḍu udayamunanu saayantramunanu bayalu dheruchu naluvadhi dinamulu thannu thaanu aguparachukonuchu vacchenu.

17. యెష్షయి తన కుమారుడైన దావీదును పిలిచినీ సహోదరులకొరకు వేయించిన యీ గోధుమలలో ఒక తూమెడును ఈ పది రొట్టెలను తీసికొని దండులో నున్న నీ సహోదరులదగ్గరకు త్వరగా పొమ్ము.

17. yeshshayi thana kumaaruḍaina daaveedunu pilichinee sahōdarulakoraku vēyin̄china yee gōdhumalalō oka thoomeḍunu ee padhi roṭṭelanu theesikoni daṇḍulō nunna nee sahōdaruladaggaraku tvaragaa pommu.

18. మరియు ఈ పది జున్నుగడ్డలు తీసికొని పోయి వారి సహస్రాధిపతికిమ్ము; నీ సహోదరులు క్షేమముగా నున్నారో లేదో సంగతి తెలిసికొని వారియొద్దనుండి ఆనవాలొకటి తీసికొని రమ్మనిచెప్పి పంపివేసెను.

18. mariyu ee padhi junnugaḍḍalu theesikoni pōyi vaari sahasraadhipathikimmu; nee sahōdarulu kshēmamugaa nunnaarō lēdō saṅgathi telisikoni vaariyoddhanuṇḍi aanavaalokaṭi theesikoni rammanicheppi pampivēsenu.

19. సౌలును వారును ఇశ్రా యేలీయులందరును ఏలా లోయలో ఫిలిష్తీయులతో యుద్ధము చేయుచుండగా

19. saulunu vaarunu ishraayēleeyulandarunu ēlaa lōyalō philishtheeyulathoo yuddhamu cheyuchuṇḍagaa

20. దావీదు ఉదయమున లేచి ఒక కాపరికి గొఱ్ఱెలను అప్పగించి ఆ వస్తువులను తీసికొని యెష్షయి తన కిచ్చిన ఆజ్ఞ చొప్పున ప్రయాణమైపోయెను; అయితే అతడు కందకమునకు వచ్చునప్పటికి వారును వీరును పంక్తులుగా తీరి, జయము జయమని అరుచుచు యుద్ధమునకు సాగుచుండిరి.

20. daaveedu udayamuna lēchi oka kaapariki gorrelanu appagin̄chi aa vasthuvulanu theesikoni yeshshayi thana kichina aagna choppuna prayaaṇamaipōyenu; ayithē athaḍu kandakamunaku vachunappaṭiki vaarunu veerunu paṅkthulugaa theeri, jayamu jayamani aruchuchu yuddhamunaku saaguchuṇḍiri.

21. సైన్యము సైన్యమునకు ఎదురై ఇశ్రాయేలీయులును ఫిలిష్తీయులును యుద్ధసన్న ద్ధులై బయలుదేరు చుండిరి.

21. sainyamu sainyamunaku edurai ishraayēleeyulunu philishtheeyulunu yuddhasanna ddhulai bayaludheru chuṇḍiri.

22. దావీదు తాను తెచ్చిన వస్తువులను సామగ్రిని కనిపెట్టువాని వశము చేసి, పరు గెత్తిపోయి సైన్యములో చొచ్చి కుశలప్రశ్నలు తన సహోదరుల నడిగెను.

22. daaveedu thaanu techina vasthuvulanu saamagrini kanipeṭṭuvaani vashamu chesi, paru getthipōyi sainyamulō cochi kushalaprashnalu thana sahōdarula naḍigenu.

23. అతడు వారితో మాటలాడు చుండగా గాతు ఫిలిష్తీయుడైన గొల్యాతు అను శూరుడు ఫిలిష్తీయుల సైన్యములోనుండి వచ్చి పై చెప్పిన మాటల చొప్పున పలుకగా దావీదు వినెను.

23. athaḍu vaarithoo maaṭalaaḍu chuṇḍagaa gaathu philishtheeyuḍaina golyaathu anu shooruḍu philishtheeyula sainyamulōnuṇḍi vachi pai cheppina maaṭala choppuna palukagaa daaveedu vinenu.

24. ఇశ్రాయేలీయులందరు ఆ మనుష్యుని చూచి మిక్కిలి భయపడి వాని యెదుటనుండి పారిపోగా

24. ishraayēleeyulandaru aa manushyuni chuchi mikkili bhayapaḍi vaani yeduṭanuṇḍi paaripōgaa

25. ఇశ్రాయేలీయులలో ఒకడువచ్చుచున్న ఆ మనిషిని చూచితిరే; నిజముగా ఇశ్రా యేలీయులను తిరస్కరించుటకై వాడు బయలుదేరు చున్నాడు, వానిని చంపినవానికి రాజు బహుగ ఐశ్వర్యము కలుగజేసి తన కుమార్తెనిచ్చి పెండ్లిచేసి వాని తండ్రి ఇంటి వారిని ఇశ్రాయేలీయులలో స్వతంత్రులుగా చేయుననగా

25. ishraayēleeyulalō okaḍuvachuchunna aa manishini chuchithirē; nijamugaa ishraayēleeyulanu thiraskarin̄chuṭakai vaaḍu bayaludheru chunnaaḍu, vaanini champinavaaniki raaju bahuga aishvaryamu kalugajēsi thana kumaarthenichi peṇḍlichesi vaani thaṇḍri iṇṭi vaarini ishraayēleeyulalō svathantrulugaa cheyunanagaa

26. దావీదుజీవముగల దేవుని సైన్యములను తిరస్క రించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు? వాని చంపి ఇశ్రాయేలీయులనుండి యీ నింద తొలగించిన వానికి బహుమతి యేమని తనయొద్ద నిలిచినవారి నడుగగా

26. daaveedujeevamugala dhevuni sainyamulanu thiraska rin̄chuṭaku ee sunnathi lēni philishtheeyuḍu enthaṭi vaaḍu? Vaani champi ishraayēleeyulanuṇḍi yee ninda tolagin̄china vaaniki bahumathi yēmani thanayoddha nilichinavaari naḍugagaa

27. జనులువాని చంపినవానికి ఇట్లిట్లు చేయ బడునని అతని కుత్తరమిచ్చిరి.

27. januluvaani champinavaaniki iṭliṭlu cheya baḍunani athani kuttharamichiri.

28. అతడు వారితో మాటలాడునది అతని పెద్దన్న యగు ఏలీయాబునకు వినబడగా ఏలీయాబునకు దావీదు మీద కోపమువచ్చి అతనితోనీవిక్కడి కెందుకు వచ్చితివి? అరణ్యములోని ఆ చిన్న గొఱ్ఱ మందను ఎవరి వశము చేసితివి? నీ గర్వమును నీ హృదయపు చెడుతనమును నేనెరుగుదును; యుద్ధము చూచుటకే గదా నీవు వచ్చితి వనెను.

28. athaḍu vaarithoo maaṭalaaḍunadhi athani peddanna yagu ēleeyaabunaku vinabaḍagaa ēleeyaabunaku daaveedu meeda kōpamuvachi athanithooneevikkaḍi kenduku vachithivi? Araṇyamulōni aa chinna gorra mandanu evari vashamu chesithivi? nee garvamunu nee hrudayapu cheḍuthanamunu nēnerugudunu; yuddhamu choochuṭakē gadaa neevu vachithi vanenu.

29. అందుకు దావీదునేనేమి చేసితిని? మాట మాత్రము పలికితినని చెప్పి

29. anduku daaveedunēnēmi chesithini? Maaṭa maatramu palikithinani cheppi

30. అతనియొద్దనుండి తొలగి, తిరిగి మరియొకని ఆ ప్రకారమే యడుగగా జనులు వానికి అదేప్రకారము ప్రత్యుత్తరమిచ్చిరి.

30. athaniyoddhanuṇḍi tolagi, thirigi mariyokani aa prakaaramē yaḍugagaa janulu vaaniki adheprakaaramu pratyuttharamichiri.

31. దావీదు చెప్పిన మాటలు నలుగురికిని తెలియగా జనులు ఆ సంగతి సౌలుతో తెలియ జెప్పిరి గనుక అతడు దావీదును పిలువ నంపెను.

31. daaveedu cheppina maaṭalu nalugurikini teliyagaa janulu aa saṅgathi sauluthoo teliya jeppiri ganuka athaḍu daaveedunu piluva nampenu.

32. ఈ ఫిలిష్తీయునిబట్టి యెవరిమనస్సును క్రుంగ నిమిత్తము లేదు. మీ దాసుడనైన నేను వానితో పోట్లాడుదునని దావీదు సౌలుతో అనగా

32. ee philishtheeyunibaṭṭi yevarimanassunu kruṅga nimitthamu lēdu. mee daasuḍanaina nēnu vaanithoo pōṭlaaḍudunani daaveedu sauluthoo anagaa

33. సౌలుఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు; నీవు బాలుడవు, వాడు బాల్యమునుండి యుద్ధాభ్యాసము చేసినవాడని దావీదుతో అనెను.

33. saulu'ee philishtheeyuni edurkoni vaanithoo pōṭlaaḍuṭaku neeku balamu chaaladu; neevu baaluḍavu, vaaḍu baalyamunuṇḍi yuddhaabhyaasamu chesinavaaḍani daaveeduthoo anenu.

34. అందుకు దావీదు సౌలుతో ఇట్లనెనుమీ దాసుడనైన నేను నా తండ్రియొక్క గొఱ్ఱెలను కాయుచుండ సింహమును ఎలుగుబంటియును వచ్చి మందలోనుండి ఒక గొఱ్ఱ పిల్లను ఎత్తికొని పోవుచుండగ.
హెబ్రీయులకు 11:33

34. anduku daaveedu sauluthoo iṭlanenumee daasuḍanaina nēnu naa thaṇḍriyokka gorrelanu kaayuchuṇḍa simhamunu elugubaṇṭiyunu vachi mandalōnuṇḍi oka gorra pillanu etthikoni pōvuchuṇḍaga.

35. నేను దానిని తరిమి చంపి దాని నోటనుండి ఆ గొఱ్ఱను విడిపించితిని; అది నా మీదికి రాగా దాని గడ్డము పట్టుకొని దానిని కొట్టి చంపితిని.

35. nēnu daanini tharimi champi daani nōṭanuṇḍi aa gorranu viḍipin̄chithini; adhi naa meediki raagaa daani gaḍḍamu paṭṭukoni daanini koṭṭi champithini.

36. మీ దాసుడనైన నేను ఆ సింహమును ఎలుగు బంటిని చంపితినే, జీవముగల దేవుని సైన్యములను తిరస్క రించిన యీ సున్నతిలేని ఫిలిష్తీయుడు వాటిలో ఒకదానివలె అగుననియు,

36. mee daasuḍanaina nēnu aa simhamunu elugu baṇṭini champithinē, jeevamugala dhevuni sainyamulanu thiraska rin̄china yee sunnathilēni philishtheeyuḍu vaaṭilō okadaanivale agunaniyu,

37. సింహముయొక్క బలమునుండియు, ఎలుగుబంటి యొక్క బలమునుండియు నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలోనుండికూడను నన్ను విడిపించుననియు చెప్పెను. అందుకు సౌలుపొమ్ము; యెహోవా నీకు తోడుగానుండునుగాక అని దావీదుతో అనెను.

37. simhamuyokka balamunuṇḍiyu, elugubaṇṭi yokka balamunuṇḍiyu nannu rakshin̄china yehōvaa ee philishtheeyuni chethilōnuṇḍikooḍanu nannu viḍipin̄chunaniyu cheppenu. Anduku saulupommu; yehōvaa neeku thooḍugaanuṇḍunugaaka ani daaveeduthoo anenu.

38. పిమ్మట సౌలు తన యుద్ధవస్త్రములను దావీదునకు ధరింపజేసి, రాగి శిరస్త్రాణమొకటి అతనికి కట్టి, యుద్ధకవ చము తొడిగించెను.

38. pimmaṭa saulu thana yuddhavastramulanu daaveedunaku dharimpajēsi, raagi shirastraaṇamokaṭi athaniki kaṭṭi, yuddhakava chamu toḍigin̄chenu.

39. ఈ సామగ్రి దావీదునకు వాడుకలేదు గనుక తాను తొడిగిన వాటిపైన కత్తి కట్టుకొని వెళ్ల కలిగినది లేనిది చూచుకొనిన తరువాత దావీదుఇవి నాకు వాడుకలేదు, వీటితో నేను వెళ్లలేనని సౌలుతో చెప్పి వాటిని తీసివేసి

39. ee saamagri daaveedunaku vaaḍukalēdu ganuka thaanu toḍigina vaaṭipaina katthi kaṭṭukoni veḷla kaliginadhi lēnidi choochukonina tharuvaatha daaveedu'ivi naaku vaaḍukalēdu, veeṭithoo nēnu veḷlalēnani sauluthoo cheppi vaaṭini theesivēsi

40. తన కఱ్ఱ చేత పట్టుకొని యేటి లోయలో నుండి అయిదు నున్నని రాళ్లను ఏరుకొని తనయొద్దనున్న చిక్కములో నుంచుకొని వడిసెల చేత పట్టుకొని ఆ ఫిలిష్తీ యుని చేరువకు పోయెను.

40. thana karra chetha paṭṭukoni yēṭi lōyalō nuṇḍi ayidu nunnani raaḷlanu ērukoni thanayoddhanunna chikkamulō nun̄chukoni vaḍisela chetha paṭṭukoni aa philishthee yuni cheruvaku pōyenu.

41. డాలు మోయువాడు తనకు ముందు నడువగా ఆ ఫిలిష్తీయుడు బయలుదేరి దావీదు దగ్గరకువచ్చి

41. ḍaalu mōyuvaaḍu thanaku mundu naḍuvagaa aa philishtheeyuḍu bayaludheri daaveedu daggarakuvachi

42. చుట్టు పారచూచి దావీదును కనుగొని, అతడు బాలుడై యెఱ్ఱటివాడును రూపసియునై యుండుట చూచి అతని తృణీకరించెను.

42. chuṭṭu paarachuchi daaveedunu kanugoni, athaḍu baaluḍai yerraṭivaaḍunu roopasiyunai yuṇḍuṭa chuchi athani truṇeekarin̄chenu.

43. ఫిలిష్తీయుడుకఱ్ఱ తీసి కొని నీవు నా మీదికి వచ్చుచున్నావే, నేను కుక్కనా? అని దావీదుతో చెప్పి తన దేవతల పేరట దావీదును శపించెను.

43. philishtheeyuḍukarra theesi koni neevu naa meediki vachuchunnaavē, nēnu kukkanaa? Ani daaveeduthoo cheppi thana dhevathala pēraṭa daaveedunu shapin̄chenu.

44. నా దగ్గరకు రమ్ము, నీ మాంసమును ఆకాశ పక్షులకును భూమృగముల కును ఇచ్చివేతునని ఆ ఫిలిష్తీ యుడు దావీదుతో అనగా

44. naa daggaraku rammu, nee maansamunu aakaasha pakshulakunu bhoomrugamula kunu ichivēthunani aa philishthee yuḍu daaveeduthoo anagaa

45. దావీదునీవు కత్తియు ఈటెయు బల్లెమును ధరించుకొని నా మీదికి వచ్చుచున్నావు అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకధిపతియగు యెహోవా పేరట నేను నీమీదికి వచ్చుచున్నాను.

45. daaveeduneevu katthiyu eeṭeyu ballemunu dharin̄chukoni naa meediki vachuchunnaavu ayithē neevu thiraskarin̄china ishraayēleeyula sainyamulakadhipathiyagu yehōvaa pēraṭa nēnu neemeediki vachuchunnaanu.

46. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును; నేను నిన్ను చంపి నీ తల తెగవేతును; ఇశ్రాయేలీయులలో దేవుడున్నాడని లోక నివాసులందరును తెలిసికొనునట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయులయొక్క కళేబరములను ఆకాశపక్షులకును భూమృగములకును ఇత్తును.

46. ee dinamuna yehōvaa ninnu naa chethiki appagin̄chunu; nēnu ninnu champi nee thala tegavēthunu; ishraayēleeyulalō dhevuḍunnaaḍani lōka nivaasulandarunu telisikonunaṭlu nēnu ee dinamuna philishtheeyulayokka kaḷēbaramulanu aakaashapakshulakunu bhoomrugamulakunu itthunu.

47. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటెచేతను రక్షించువాడుకాడని యీ దండువా రందరు తెలిసికొందురు; యుద్ధము యెహోవాదే; ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పెను.

47. appuḍu yehōvaa katthi chethanu eeṭechethanu rakshin̄chuvaaḍukaaḍani yee daṇḍuvaa randaru telisikonduru; yuddhamu yehōvaadhe; aayana mimmunu maa chethiki appagin̄chunani cheppenu.

48. ఆ ఫిలిష్తీ యుడు లేచి దావీదును కలియుటకై అతనికి ఎదురుపోగా దావీదు వానిని ఎదుర్కొనుటకు సైన్యముతట్టు త్వరగా పరుగెత్తిపోయి

48. aa philishthee yuḍu lēchi daaveedunu kaliyuṭakai athaniki edurupōgaa daaveedu vaanini edurkonuṭaku sainyamuthaṭṭu tvaragaa parugetthipōyi

49. తన సంచిలో చెయ్యివేసి అందులోనుండి రాయి యొకటి తీసి వడిసెలతో విసరి ఆ ఫిలిష్తీయునినుదుట కొట్టెను. ఆ రాయి వాని నుదురుచొచ్చినందున వాడు నేలను బోర్లపడెను.

49. thana san̄chilō cheyyivēsi andulōnuṇḍi raayi yokaṭi theesi vaḍiselathoo visari aa philishtheeyuninuduṭa koṭṭenu. aa raayi vaani nudurucochinanduna vaaḍu nēlanu bōrlapaḍenu.

50. దావీదు ఫిలిష్తీయునికంటె బలాఢ్యుడై ఖడ్గము లేకయే వడిసెలతోను రాతితోను ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపెను.

50. daaveedu philishtheeyunikaṇṭe balaaḍhyuḍai khaḍgamu lēkayē vaḍiselathoonu raathithoonu aa philishtheeyuni koṭṭi champenu.

51. వాడు బోర్లపడగా దావీదు పరుగెత్తిపోయి ఫిలిష్తీయునిమీద నిలుచుండి వాని కత్తి వర దూసి దానితో వాని చంపి వాని తలను తెగవేసెను. ఫిలిష్తీయులు తమ శూరుడు చచ్చుట చూచి పారి పోయిరి.

51. vaaḍu bōrlapaḍagaa daaveedu parugetthipōyi philishtheeyunimeeda niluchuṇḍi vaani katthi vara doosi daanithoo vaani champi vaani thalanu tegavēsenu. Philishtheeyulu thama shooruḍu chachuṭa chuchi paari pōyiri.

52. అప్పుడు ఇశ్రాయేలువారును యూదావారును లేచిజయము జయమని అరచుచు లోయవరకును షరా యిము ఎక్రోనువరకును ఫిలిష్తీయులను తరుమగా ఫిలిష్తీ యులు హతులై షరాయిము ఎక్రోను మార్గమున గాతు ఎక్రోను అను పట్టణములవరకు కూలిరి.

52. appuḍu ishraayēluvaarunu yoodhaavaarunu lēchijayamu jayamani arachuchu lōyavarakunu sharaa yimu ekrōnuvarakunu philishtheeyulanu tharumagaa philishthee yulu hathulai sharaayimu ekrōnu maargamuna gaathu ekrōnu anu paṭṭaṇamulavaraku kooliri.

53. అప్పుడు ఇశ్రా యేలీయులు ఫిలిష్తీయులను తరుముట మాని తిరిగి వచ్చి వారి డేరాలను దోచుకొనిరి.

53. appuḍu ishraayēleeyulu philishtheeyulanu tharumuṭa maani thirigi vachi vaari ḍēraalanu dōchukoniri.

54. అయితే దావీదు ఆ ఫిలిష్తీ యుని ఆయుధములను తన డేరాలో ఉంచుకొని అతని తలను తీసికొని యెరూషలేమునకు వచ్చెను.

54. ayithē daaveedu aa philishthee yuni aayudhamulanu thana ḍēraalō un̄chukoni athani thalanu theesikoni yerooshalēmunaku vacchenu.

55. సౌలు దావీదు ఫిలిష్తీయునికి ఎదురుగా పోవుట చూచినప్పుడు తన సైన్యాధిపతియైన అబ్నేరును పిలిచి అబ్నేరూ, ఈ ¸యౌవనుడు ఎవని కుమారుడని అడుగగా అబ్నేరురాజా, నీ ప్రాణముతోడు నాకు తెలియదనెను.

55. saulu daaveedu philishtheeyuniki edurugaa pōvuṭa chuchinappuḍu thana sainyaadhipathiyaina abnērunu pilichi abnēroo, ee ¸yauvanuḍu evani kumaaruḍani aḍugagaa abnēruraajaa, nee praaṇamuthooḍu naaku teliyadanenu.

56. అందుకు రాజుఈ పడుచువాడు ఎవని కుమా రుడో అడిగి తెలిసికొమ్మని అతనికి ఆజ్ఞ ఇచ్చెను.

56. anduku raaju'ee paḍuchuvaaḍu evani kumaa ruḍō aḍigi telisikommani athaniki aagna icchenu.

57. దావీదు ఫిలిష్తీయుని చంపి తిరిగి వచ్చినప్పుడు అబ్నేరు అతని పిలుచుకొనిపోయి ఫిలిష్తీయుని తల చేతనుండగా అతని సౌలు దగ్గరకు తోడుకొనివచ్చెను.

57. daaveedu philishtheeyuni champi thirigi vachinappuḍu abnēru athani piluchukonipōyi philishtheeyuni thala chethanuṇḍagaa athani saulu daggaraku thooḍukonivacchenu.

58. సౌలు అతనిని చూచిచిన్నవాడా, నీవెవని కుమారుడవని అడుగగాదావీదునేను బేత్లెహేమీయుడైన యెష్షయి అను నీ దాసుని కుమారుడనని ప్రత్యుత్తరమిచ్చెను.

58. saulu athanini chuchichinnavaaḍaa, neevevani kumaaruḍavani aḍugagaadaaveedunēnu bētlehēmeeyuḍaina yeshshayi anu nee daasuni kumaaruḍanani pratyuttharamicchenu.


Shortcut Links
1 సమూయేలు - 1 Samuel : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |

Support & Donate Us | Google Play Store | సజీవ వాహిని - Sajeeva Vahini 2009-2022. info@sajeevavahini.com
Sajeeva Vahini, Hyderabad & Chennai, India. SajeevaVahini.org Email: , . Whatsapp: 8898 318 318 or call us: +918898318318
Content on this website is prepared manually by Sajeeva Vahini, India. Our Content is free and open to use for any kind of distrubution. We request to carry a physical bible to churches rather than using bible on mobile or tablets. Please email any information for any suspected content/audio subject to piracy/copyright act on this website can be considered/removed. Which can help us to improve better. Note: we dont have any data/content related to Life Way Study Bible as a part of Sajeeva Vahini Notes or Verse Explanations.