Judges - న్యాయాధిపతులు 6 | View All

1. ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా యేడేండ్లు వారిని మిద్యానీయుల కప్ప గించెను.

1. The Israelites did what was evil in the sight of the LORD. So the LORD handed them over to Midian seven years,

2. మిద్యానీయుల చెయ్యి ఇశ్రాయేలీయుల మీద హెచ్చాయెను గనుక వారు మిద్యానీయులయెదుట నిలువలేక కొండలోనున్న వాగులను గుహలను దుర్గములను తమకు సిద్ధపరచుకొనిరి.

2. and they oppressed Israel. Because of Midian, the Israelites made hiding places for themselves in the mountains, caves, and strongholds.

3. ఇశ్రాయేలీయులు విత్తనములు విత్తిన తరువాత మిద్యా నీయులును అమాలేకీయులును తూర్పుననుండు వారును తమ పశువులను గుడారములను తీసికొని మిడతల దండంత విస్తారముగా వారిమీదికి వచ్చి

3. Whenever the Israelites planted crops, the Midianites, Amalekites, and the eastern peoples came and attacked them.

4. వారి యెదుట దిగి, గాజాకు పోవునంతదూరము భూమి పంటను పాడుచేసి, ఒక గొఱ్ఱెనుగాని యెద్దునుగాని గాడిదనుగాని జీవనసాధన మైన మరిదేనినిగాని ఇశ్రాయేలీయులకు ఉండనీయ లేదు.

4. They encamped against them and destroyed the produce of the land, even as far as Gaza. They left nothing for Israel to eat, as well as no sheep, ox or donkey.

5. వారును వారి ఒంటెలును లెక్కలేకయుండెను.

5. For the Midianites came with their cattle and their tents like a great swarm of locusts. They and their camels were without number, and they entered the land to waste it.

6. దేశమును పాడుచేయుటకు వారు దానిలోనికి వచ్చిరి ఇశ్రాయేలీయులు మిద్యానీయులవలన మిక్కిలి హీనదశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొఱ్ఱ పెట్టిరి.

6. So Israel became poverty stricken because of Midian, and the Israelites cried out to the LORD.

7. మిద్యానీయులవలని బాధనుబట్టి ఇశ్రాయేలీయులు యెహోవాకు మొఱ్ఱపెట్టగా

7. When the Israelites cried out to Him because of Midian,

8. యెహోవా ఇశ్రాయేలీ యులయొద్దకు ప్రవక్తనొకని పంపెను. అతడు వారితో ఈలాగు ప్రకటించెనుఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగానేను ఐగుప్తులోనుండి మిమ్మును రప్పించి, దాసుల గృహములోనుండి మిమ్మును తోడుకొని వచ్చితిని.

8. the LORD sent a prophet to them. He said to them, 'This is what the LORD God of Israel says: 'I brought you out of Egypt and out of the place of slavery.

9. ఐగుప్తీయుల చేతిలో నుండియు మిమ్మును బాధించిన వారందరిచేతిలోనుండియు మిమ్మును విడిపించి, మీ యెదుటనుండి వారిని తోలివేసి వారి దేశమును మీకిచ్చితిని; మీ దేవుడనైన యెహోవాను నేనే.

9. I delivered you from the power of Egypt and the power of all who oppressed you. I drove them out before you and gave you their land.

10. మీరు అమోరీయుల దేశమున నివసించు చున్నారు, వారి దేవతలకు భయపడకుడి అని మీతో చెప్పితిని గాని మీరు నా మాట వినకపోతిరి.

10. I said to you: I am the LORD your God. Do not fear the gods of the Amorites whose land you live in. But you did not obey Me.''

11. యెహోవా దూత వచ్చి అబీయెజ్రీయుడైన యోవా షునకు కలిగిన ఒఫ్రాలోని మస్తకివృక్షము క్రింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగైయుండునట్లు గానుగ చాటున గోధుమలను దుళ్లగొట్టుచుండగా

11. The Angel of the LORD came, and He sat under the oak that was in Ophrah, which belonged to Joash, the Abiezrite. His son Gideon was threshing wheat in the wine vat in order to hide it from the Midianites.

12. యెహోవా దూత అతనికి కనబడిపరాక్రమముగల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై యున్నాడని అతనితో అనగా

12. Then the Angel of the LORD appeared to him and said: 'The LORD is with you, mighty warrior.'

13. గిద్యోనుచిత్తము నా యేలినవాడా, యెహోవా మాకు తోడైయుండినయెడల ఇదంతయు మాకేల సంభవిం చెను? యెహోవా ఐగుప్తులో నుండి మమ్మును రప్పించెనని చెప్పుచు, మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుతకార్యములన్నియు ఏ మాయెను? యెహోవా మమ్మును విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మును అప్పగించెనని అతనితో చెప్పెను.

13. Gideon said to Him, 'Please Sir, if the LORD is with us, why has all this happened? And where are all His wonders that our fathers told us about? They said, 'Hasn't the LORD brought us out of Egypt?' But now the LORD has abandoned us and handed us over to Midian.'

14. అంతట యెహోవా అతనితట్టు తిరిగిబలము తెచ్చుకొని వెళ్లి మిద్యానీయుల చేతిలోనుండి ఇశ్రాయేలీయులను రక్షిం పుము, నిన్ను పంపినవాడను నేనే అని చెప్పగా

14. The LORD turned to him and said, 'Go in the strength you have and deliver Israel from the power of Midian. Am I not sending you?'

15. అతడు చిత్తము నా యేలిన వాడా, దేని సహాయముచేత నేను ఇశ్రాయేలీయులను రక్షింపగలను? నా కుటుంబము మనష్షే గోత్రములో ఎన్నికలేనిదే. నా పితరుల కుటుంబములో నేను కనిష్ఠుడనై యున్నానని ఆయనతో చెప్పెను. అందుకు యెహోవా అయిన నేమి?

15. He said to Him, 'Please, Lord, how can I deliver Israel? Look, my family is the weakest in Manasseh, and I am the youngest in my father's house.'

16. నేను నీకు తోడై యుందును గనుక ఒకే మనుష్యుని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతముచేయుదువని సెలవిచ్చెను.

16. 'But I will be with you,' the LORD said to him. 'You will strike Midian down [as if it were] one man.'

17. అందుకతడునాయెడల నీకు కటాక్షము కలిగినయెడల నాతో మాటలాడుచున్న వాడవు నీవే అని నేను తెలిసి కొనునట్లు ఒక సూచన కనుపరచుము.

17. Then he said to Him, 'If I have found favor in Your sight, give me a sign that You are speaking with me.

18. నేను నీయొద్దకు వచ్చి నా అర్పణమును బయటికి తెచ్చి నీ సన్నిధిని దానిని పెట్టువరకు ఇక్కడనుండి వెళ్లకుమీ అని వేడుకొనగా ఆయననీవు తిరిగి వచ్చువరకు నేను ఉండెదననెను.

18. Please do not leave this place until I return to You. Let me bring my gift and set it before You.' And He said, 'I will stay until you return.'

19. అప్పుడు గిద్యోను లోపలికి పోయి ఒక మేక పిల్లను తూమెడు పిండితో పొంగని భక్ష్యములను సిద్ధపరచి ఆ మాంసమును గంపలో ఉంచి అది వండిన నీళ్లను కుండలో పోసి ఆయనకొరకు ఆ మస్తకివృక్షముక్రిందికి దానిని తీసికొనివచ్చి దగ్గర ఉంచగా

19. So Gideon went and prepared a young goat and unleavened bread from a half bushel of flour. He placed the meat in a basket and the broth in a pot. He brought them out and offered them to Him under the oak.

20. దేవుని దూత ఆ మాంసమును పొంగని భక్ష్యములను పట్టుకొని రాతి మీద పెట్టినీళ్లు పోయుమని అతనితో చెప్పెను.

20. The Angel of God said to him, 'Take the meat with the unleavened bread, put it on this stone, and pour the broth [on it].' And he did so.

21. అతడాలాగు చేయగా యెహోవా దూత తన చేత నున్న కఱ్ఱను చాపి దాని కొనతో ఆ మాంసమును ఆ పొంగని భక్ష్యములను ముట్టినప్పుడు అగ్ని ఆ రాతిలోనుండి వెడలి ఆ మాంస మును పొంగని భక్ష్యములను కాల్చి వేసెను, అంతట యెహోవా దూత అతనికి అదృశ్య మాయెను.

21. The Angel of the LORD extended the tip of the staff that was in His hand and touched the meat and the unleavened bread. Fire came up from the rock and consumed the meat and the unleavened bread. Then the Angel of the LORD vanished from his sight.

22. గిద్యోను ఆయన యెహోవా దూత అని తెలిసికొని అహహా నా యేలినవాడా, యెహోవా, ఇందుకే గదా నేను ముఖా ముఖిగా యెహోవా దూతను చూచితిననెను.

22. When Gideon realized that He was the Angel of the LORD, he said, 'Oh no, Lord God! I have seen the Angel of the LORD face to face!'

23. అప్పుడు యెహోవానీకు సమాధానము, భయపడకుము, నీవు చావవని అతనితో సెలవిచ్చెను.

23. But the LORD said to him, 'Peace to you. Don't be afraid, for you will not die.'

24. అక్కడ గిద్యోను యెహోవా నామమున బలిపీఠము కట్టి, దానికి యెహోవా సమాధానకర్తయను పేరుపెట్టెను. నేటివరకు అది అబీ యెజ్రీయుల ఒఫ్రాలో ఉన్నది.

24. So Gideon built an altar to the LORD there and called it Yahweh Shalom. It is in Ophrah of the Abiezrites until today.

25. మరియు ఆ రాత్రియందే యెహోవానీ తండ్రి కోడెను, అనగా ఏడేండ్ల రెండవ యెద్దును తీసికొని వచ్చి, నీ తండ్రికట్టిన బయలుయొక్క బలిపీఠమును పడగొట్టి, దానికి పైగానున్న దేవతాస్తంభమును నరికివేసి

25. On that very night the LORD said to him, 'Take your father's young bull and a second bull seven years old. Then tear down the altar of Baal that belongs to your father and cut down the Asherah pole beside it.

26. తగిన యేర్పాటుతో ఈ బండ కొనను నీ దేవుడైన యెహో వాకు బలిపీఠము కట్టి, ఆ రెండవ కోడెను తీసికొనివచ్చి నీవు నరికిన ప్రతిమయొక్క కఱ్ఱతో దహనబలి నర్పించు మని అతనితో చెప్పెను.

26. Build a well-constructed altar to the LORD your God on the top of this rock. Take the second bull and offer it as a burnt offering with the wood of the Asherah pole you cut down.'

27. కాబట్టి గిద్యోను తన పని వారిలో పదిమందిని తీసికొనివచ్చి యెహోవా తనతో చెప్పినట్లు చేసెను. అతడు తన పితరుల కుటుంబమునకును ఆ ఊరివారికిని భయపడినందున పగలు దానిని చేయలేక రాత్రివేళ చేసెను.

27. So Gideon took 10 of his male servants and did as the LORD had told him. But because he was too afraid of his father's household and the men of the city to do it in the daytime, he did it at night.

28. ఆ ఊరివారు వేకువనే లేచినప్పుడు బయలుయొక్క బలిపీఠము విరుగగొట్టబడియుండెను, దానికి పైగా నున్న దేవతాస్తంభమును పడద్రోయబడి యుండెను, కట్టబడిన ఆ బలిపీఠముమీద ఆ రెండవ యెద్దు అర్పింప బడి యుండెను.

28. When the men of the city got up in the morning, they found Baal's altar torn down, the Asherah pole beside it cut down, and the second bull offered up on the altar that had been built.

29. అప్పుడు వారుఈ పని యెవరు చేసినదని ఒకరితోనొకరు చెప్పుకొనుచు విచారణచేసి వెదకి, యోవాషు కుమారుడైన గిద్యోను ఆ పనిచేసినట్టు తెలిసికొనిరి.

29. They said to each other, 'Who did this?' After they made a thorough investigation, they said, 'Gideon son of Joash did it.'

30. కాబట్టి ఆ ఊరివారునీ కుమారుడు బయలుయొక్క బలిపీఠమును పడగొట్టి దానికి పైగానున్న దేవతాస్తంభమును పడద్రోసెను గనుక అతడు చావవలెను, వానిని బయటికి తెమ్మని యోవాషుతో చెప్పగా

30. Then the men of the city said to Joash, 'Bring out your son. He must die, because he tore down Baal's altar and cut down the Asherah pole beside it.'

31. యోవాషు తనకు ఎదురుగా నిలిచిన వారందరితోమీరు బయలు పక్షముగా వాదింతురా? మీరు వాని రక్షించు దురా? వానిపక్షముగా వాదించువాడు ఈ ప్రొద్దుననే చావవలెను; ఎవడో వాని బలిపీఠమును విరుగగొట్టెను గనుక, వాడు దేవతయైనందున తన పక్షమున తానేవాదించ వచ్చును.

31. But Joash said to all who stood against him, 'Would you plead Baal's case for him? Would you save him? Whoever pleads his case will be put to death by morning! If he is a god, let him plead his own case, because someone tore down his altar.'

32. ఒకడు తన బలిపీఠమును విరుగ గొట్టినందున అతనితో బయలు వాదించుకొననిమ్మని చెప్పి ఆ దినమున అతనికి యెరుబ్బయలను పేరు పెట్టెను.

32. That day, Gideon's father called him Jerubbaal, saying, 'Let Baal plead his case with him,' because he tore down his altar.

33. మిద్యానీయులందరును అమాలేకీయులందరును తూర్పు వారందరును కూడి వచ్చి నది దాటి యెజ్రెయేలు మైదా నములో దిగగా

33. All the Midianites, Amalekites, and Qedemites gathered together, crossed over [the Jordan], and camped in the Valley of Jezreel.

34. యెహోవా ఆత్మ గిద్యోనును ఆవే శించెను. అతడు బూర ఊదినప్పుడు అబీయెజెరు కుటుంబపువారు అతని యొద్దకు వచ్చిరి.

34. The Spirit of the LORD enveloped Gideon, and he blew the ram's horn and the Abiezrites rallied behind him.

35. అతడు మనష్షీ యులందరియొద్దకు దూతలను పంపగా వారును కూడు కొని అతనియొద్దకు వచ్చిరి. అతడు ఆషేరు జెబూలూను నఫ్తాలి గోత్రములవారియొద్దకు దూతలను పంపగా వారును కూడినవారిని ఎదుర్కొనుటకు వచ్చిరి.

35. He sent messengers throughout all of Manasseh, who rallied behind him. He also sent messengers throughout Asher, Zebulun, and Naphtali, who [also] came to meet him.

36. అప్పుడు గిద్యోను నీవు సెలవిచ్చినట్లు నాచేత ఇశ్రాయేలీయులను రక్షింప నుద్దేశించిన యెడల

36. Then Gideon said to God, 'If You will deliver Israel by my hand, as You said,

37. నేను కళ్లమున గొఱ్ఱెబొచ్చు ఉంచినతరువాత నేల అంతయు ఆరియుండగా ఆ గొఱ్ఱె బొచ్చుమీద మాత్రమే మంచుపడు నెడల నీవు సెల విచ్చినట్లు ఇశ్రాయేలీయులను నా మూలముగా రక్షించెదవని నేను నిశ్చయించుకొందునని దేవునితో అనెను.

37. I will put a fleece of wool here on the threshing floor. If dew is only on the fleece, and all the ground is dry, I will know that You will deliver Israel by my strength, as You said.'

38. ఆలాగున జరిగెను; అతడు ప్రొద్దుట లేచి ఆ బొచ్చును పిడిచి నీళ్లతో పాత్ర నిండువరకు ఆ బొచ్చునుండి మంచును పిండెను.

38. And that is what happened. When he got up early in the morning, he squeezed the fleece and wrung dew out of it, filling a bowl with water.

39. అప్పుడు గిద్యోనునీ కోపము నా మీద మండనియ్యకుము; ఇంకొక మారే ఆ బొచ్చుచేత శోధింప సెలవిమ్ము. నేల అంతటిమీద మంచు పడి యుండగా ఆ బొచ్చు మాత్రమే పొడిగా ఉండనిమ్మని దేవునితో అనగా

39. Gideon then said to God, 'Don't be angry with me; let me speak one more time. Please allow me to make one more test with the fleece. Let it remain dry, and the dew be all over the ground.'

40. ఆ రాత్రి దేవుడు ఆలాగున చేసెను; నేల అంతటి మీద మంచు పడినను ఆ బొచ్చుమాత్రమే పొడిగానుండెను.

40. That night God did [as Gideon requested]: only the fleece was dry, and dew was all over the ground.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Judges - న్యాయాధిపతులు 6 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

మిద్యానీయులచే అణచివేయబడిన ఇశ్రాయేలు. (1-6) 
ఇశ్రాయేలు మరోసారి పాపం చేసింది, మరియు వారి బాధలు పునరావృతమయ్యాయి. పాపంలో నిమగ్నమైన వారు పర్యవసానంగా బాధలను ఊహించాలి. ఇశ్రాయేలీయులు గుహలు మరియు గుహలలో ఆశ్రయం పొందారు, ఎందుకంటే వారి మనస్సాక్షి వారిపై భారంగా ఉంది. పాపానికి మనుషుల్ని కృంగదీసే శక్తి ఉంది. ఆక్రమణదారులు ఇజ్రాయెల్ వారి జీవనోపాధిని కోల్పోయారు, గుహలలో దాగి ఉన్న వాటిని మాత్రమే వదిలివేశారు. దురదృష్టవశాత్తూ, దానిని దేవుణ్ణి సేవించడానికి ఉపయోగించే బదులు, వారు బాల్ కోసం అర్పణలను సిద్ధం చేశారు, దాని ఫలితంగా, దేవుడు నిర్ణీత సమయంలో దానిని తీసివేయడానికి శత్రువును అనుమతించాడు.


ఇజ్రాయెల్‌ను ఒక ప్రవక్త మందలించాడు. (7-10) 
విమోచన కోసం వారి కేకలు దేవుని చెవులకు చేరుకున్నాయి మరియు ప్రతిస్పందనగా, దైవిక బోధలను అందించడానికి వారికి ఒక ప్రవక్తను పంపాడు. ఒక దేశంలో నమ్మకమైన పరిచారకుల ఉనికి దాని పట్ల దేవుని దయగల ఉద్దేశాలను సూచిస్తుంది. ప్రవక్త వారిని ఎదుర్కొన్నాడు, ప్రభువుపై వారి తిరుగుబాటును ఎత్తి చూపాడు, వారిని పశ్చాత్తాపం వైపు నడిపించాలనే లక్ష్యంతో. అతిక్రమణల యొక్క పాపాత్మకమైన స్వభావం, ప్రత్యేకించి దేవునికి వ్యతిరేకంగా అవిధేయత వంటి చర్యలు, విలాపం యొక్క ప్రాధమిక దృష్టిగా మారినప్పుడు నిజమైన పశ్చాత్తాపం సంభవిస్తుంది.


గిద్యోను ఇశ్రాయేలును విడిపించడానికి సిద్ధమయ్యాడు. (11-24) 
గిడియాన్, ధైర్యం మరియు శక్తిగల వ్యక్తి, సమస్యాత్మక సమయాల్లో సాపేక్షంగా అస్పష్టంగా జీవిస్తున్నాడు. అయినప్పటికీ, అతను ఒక ముఖ్యమైన పనిని చేపట్టాలని పిలుపునిచ్చారు. అతని దేవదూత గిడియాన్‌తో కలిసి ఉన్నప్పుడు ప్రభువు ఉనికిని స్పష్టంగా చెప్పలేము. అయినప్పటికీ, గిద్యోను విశ్వాసం బలహీనంగా ఉంది, ఇజ్రాయెల్ యొక్క బాధతో దేవుని ఉనికి యొక్క హామీని తిరిగి పొందడం అతనికి కష్టతరం చేసింది. అయినప్పటికీ, దేవదూత అతని సందేహాలను తీర్చాడు, ఇజ్రాయెల్ యొక్క విమోచకునిగా వ్యవహరించమని అతనిని కోరాడు, అది అవసరం. బిషప్ హాల్ తెలివిగా వ్యాఖ్యానించినట్లుగా, దేవుడు గిడియాన్‌ను పరాక్రమవంతుడు అని పిలవడమే కాకుండా అతనిని అలా ఉండేలా శక్తివంతం చేశాడు. వినయస్థులను ఉద్ధరించడంలో ప్రభువు సంతోషిస్తాడు. గిడియాన్ తన విశ్వాసం యొక్క ధృవీకరణను కోరినప్పుడు, ఈ రోజుల్లో, ఆత్మ యొక్క మార్గదర్శకత్వంలో, అతను చేసినట్లుగా మనం బాహ్య సంకేతాలను వెతకకూడదని మనకు తెలుసు. బదులుగా, మన హృదయాలలో ఆత్మ శక్తివంతంగా పని చేస్తూ, మనలో ఉన్న ఆయన కృపను వెల్లడిచేయాలని మనము తీవ్రంగా ప్రార్థించాలి. దేవదూత మాంసాన్ని నైవేద్యంగా మార్చాడు, అతను ఆహారం కోసం అవసరమైన మానవుడు కాదు, దేవుని కుమారుడని, త్యాగం ద్వారా వడ్డించబడాలని మరియు గౌరవించబడాలని నిరూపించాడు. ఈ అద్భుత సూచన గిద్యోనుకు నిజంగా దేవుని దృష్టిలో దయ ఉందని హామీ ఇచ్చింది. చరిత్ర అంతటా, మానవజాతి, పాపం భారంతో, స్వర్గం నుండి సందేశాలను ఎదుర్కొన్నప్పుడు, అది తరచుగా భయంతో కూడి ఉంటుంది, ఎందుకంటే మనం ఆత్మల ప్రపంచానికి దూరంగా ఉన్నట్లు అనిపిస్తుంది. గిద్యోను ధైర్యం సన్నగిల్లింది, అయినప్పటికీ దేవుడు అతనికి శాంతి మరియు హామీనిచ్చే మాటలు చెప్పాడు.


గిద్యోను బలి బలిపీఠాన్ని నాశనం చేశాడు. (25-32) 
ఒక సంస్కర్తను పెంచడంలో దేవుని దయ యొక్క అద్భుతమైన శక్తిని మరియు విగ్రహారాధన చేసే నాయకుడి కుటుంబం నుండి విమోచకుడిని నియమించడంలో అతని దయ యొక్క అపారమైన దయకు సాక్ష్యమివ్వండి. గిద్యోను కేవలం బాల్ యొక్క బలిపీఠం వద్ద ఆరాధించడం నుండి దూరంగా ఉండమని సూచించబడలేదు; అతను దానిని పూర్తిగా కూల్చివేసి, మరొక బలిపీఠంపై బలులు అర్పించే పనిలో ఉన్నాడు. మిద్యానుకు వ్యతిరేకంగా యుద్ధం చేయడానికి ముందు దేవునితో నిజమైన శాంతిని వెతకాలి. గొప్ప త్యాగం ద్వారా మంజూరు చేయబడిన క్షమాపణ లేకుండా, సానుకూల ఫలితం ఆశించబడదు. అన్ని హృదయాలను తన చేతుల్లో ఉంచుకున్న దేవుడు, జోయాష్ గతంలో బాల్ ఆరాధనలో పాల్గొన్నప్పటికీ, బాల్ యొక్క న్యాయవాదులకు వ్యతిరేకంగా తన కొడుకుకు మద్దతు ఇచ్చేలా ప్రభావితం చేసాడు. మన విధులను నెరవేర్చడానికి మరియు మన భద్రత కోసం దేవునిపై మన నమ్మకాన్ని ఉంచడానికి మేము పిలువబడ్డాము. బాల్‌కు ఎదురైన సవాలు ఏమిటంటే, మంచి లేదా చెడు చేయగల తన సామర్థ్యాన్ని ప్రదర్శించడం. పగ తీర్చుకోలేని దేవతను ప్రార్థించే వారి మూర్ఖత్వాన్ని ఈ ఫలితం రుజువు చేసింది.

అతనికి ఇచ్చిన సంకేతాలు. (33-40)
ఈ సంకేతాలు కాదనలేని అద్భుతాలు మరియు గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. గిద్యోను మరియు అతని మనుష్యులు మిద్యానీయులను ఎదుర్కోవడానికి సిద్ధమయ్యారు. దేవుడు ఇజ్రాయెల్ యొక్క చిన్న ఉన్ని మరియు మిద్యాను విశాలమైన అంతస్తు మధ్య తేడాను గుర్తించగలడా? దేవుడు అలా చేయగలడనే హామీని గిద్యోను పొందాడు. గిడియాన్ ప్రత్యేకంగా దైవిక దయ యొక్క మంచు తనపై పడాలని కోరుకుంటే, ధృవీకరణగా ఉన్ని మంచుతో తడిసిపోవడాన్ని అతను చూశాడు. మరియు అతను ఇశ్రాయేలీయులందరినీ చుట్టుముట్టడానికి దేవుని దయ కోరుకుంటే, అతను నేల మొత్తం మంచుతో కప్పబడి ఉంటాడు. ఒకప్పుడు ఇజ్రాయెల్‌కు మాత్రమే పరిమితమైన స్వర్గపు ఆశీర్వాదాలు ఇప్పుడు భూమిపై నివసించే వారందరికీ విస్తరింపబడినందుకు కృతజ్ఞతతో ఉండేందుకు, అన్యజనుల పాపులమైన మనకు ఇది రిమైండర్‌గా పనిచేస్తుంది. ఏది ఏమైనప్పటికీ, దయ యొక్క సాధనాలు దేవుని ఉద్దేశాల ప్రకారం వివిధ కొలతలలో పంపిణీ చేయబడతాయని మనం గుర్తించాలి. అదే సంఘంలో, ఒక వ్యక్తి యొక్క ఆత్మ గిద్యోను యొక్క తేమతో కూడిన ఉన్ని వలె దేవుని కృపను స్వీకరించవచ్చు, మరొక వ్యక్తి ఎండిపోయిన నేలలా ఆధ్యాత్మికంగా పొడిగా ఉండవచ్చు.



Shortcut Links
న్యాయాధిపతులు - Judges : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |