Judges - న్యాయాధిపతులు 21 | View All

1. ఇశ్రాయేలీయులు తమలో ఎవడును తన కుమార్తెను బెన్యామీనీయుని కియ్యకూడదని మిస్పాలో ప్రమాణము చేసికొనియుండిరి.

1. Now the men of Yisra'el had sworn in Mitzpah, saying, There shall not any of us give his daughter to Binyamin as wife.

2. ప్రజలు బేతేలుకు వచ్చి దేవుని సన్ని ధిని సాయంకాలమువరకు కూర్చుండి

2. The people came to Beit-El, and sat there until evening before God, and lifted up their voices, and wept sore.

3. యెహోవా ఇశ్రాయేలీయుల దేవా, నేడు ఇశ్రాయేలీయులలో ఒక గోత్రము లేకపోయెను. ఇది ఇశ్రాయేలీయులకు సంభ వింపనేల అని బహుగా ఏడ్చిరి.

3. They said, the LORD, the God of Yisra'el, why has this happened in Yisra'el, that there should be today one tribe lacking in Yisra'el?

4. మరునాడు జనులు వేకువనే లేచి అక్కడ బలిపీఠమును కట్టి దహనబలులను సమాధానబలులను అర్పించిరి.

4. It happened on the next day that the people rose early, and built there an altar, and offered burnt offerings and peace-offerings.

5. అప్పుడు ఇశ్రాయేలీయులు ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలో మిస్పాలో యెహోవా పక్షమున రాకపోయినవారెవరని విచారించిరి. ఏలయనగా అట్టివారికి నిశ్చయముగా మరణశిక్ష విధింప వలెనని ఖండితముగా ప్రమాణము చేసియుండిరి.

5. The children of Yisra'el said, Who is there among all the tribes of Yisra'el who didn't come up in the assembly to the LORD? For they had made a great oath concerning him who didn't come up to the LORD to Mitzpah, saying, He shall surely be put to death.

6. ఇశ్రాయేలీయులు తమ సహోదరులైన బెన్యామీనీయులను గూర్చి పశ్చాత్తాపపడినేడు ఒక గోత్రము ఇశ్రా యేలీయులలో నుండకుండ కొట్టివేయబడియున్నది;

6. The children of Yisra'el repented them for Binyamin their brother, and said, There is one tribe cut off from Yisra'el this day.

7. మిగిలియున్నవారికి భార్యలు దొరుకునట్లు మనము మన కుమార్తెలను వారికి పెండ్లి చేయమని యెహోవా తోడని ప్రమాణము చేసితివిుగదా; వారి విషయములో ఏమి చేయ గలము? అని చెప్పుకొనిరి.

7. How shall we do for wives for those who remain, seeing we have sworn by the LORD that we will not give them of our daughters to wives?

8. మరియు వారు ఇశ్రాయేలీ యుల గోత్రములలో యెహోవా పక్షమున మిస్పాకు రానిది ఏదని విచా రింపగా

8. They said, What one is there of the tribes of Yisra'el who didn't come up to the LORD to Mitzpah? Behold, there came none to the camp from Yavesh-Gil`ad to the assembly.

9. సమాజమునకుచేరిన యాబేష్గి లాదునుండి సేనలోనికి ఎవడును రాలేదని తేలెను. జన సంఖ్య చేసినప్పుడు యాబేష్గిలాదు నివాసులలో ఒకడును అక్కడ ఉండలేదు.

9. For when the people were numbered, behold, there were none of the inhabitants of Yavesh-Gil`ad there.

10. కాబట్టి సమాజపు వారు పరా క్రమవంతులైన పండ్రెండు వేలమంది మనుష్యులను పంపించి మీరు పోయి స్త్రీల నేమి పిల్లల నేమి యాబేష్గిలాదు నివాసులనందరిని కత్తివాతను హతము చేయుడి.

10. The congregation sent there twelve thousand men of the most valiant, and commanded them, saying, Go and strike the inhabitants of Yavesh-Gil`ad with the edge of the sword, with the women and the little ones.

11. మీరు చేయవలసినదేమనగా, ప్రతి పురుషుని పురుషసంయోగము నెరిగిన ప్రతి స్త్రీని నశింపజేయవలెనని చెప్పిరి.

11. This is the thing that you shall do: you shall utterly destroy every male, and every woman who has lain by man.

12. యాబేష్గి లాదు నివాసులలో పురుషసంయోగము నెరుగని నాలుగు వందలమంది కన్యలైన స్త్రీలు దొరుకగా కనాను దేశ మందలి షిలోహులోనున్న సేనలోనికి వారిని తీసికొనివచ్చిరి.

12. They found among the inhabitants of Yavesh-Gil`ad four hundred young virgins, who had not known man by lying with him; and they brought them to the camp to Shiloh, which is in the land of Kana`an.

13. ఆ సర్వసమాజము రిమ్మోను కొండలోనున్న బెన్యా మీనీయులతో మాటలాడుటకును వారిని సమాధానపరచు టకును వర్తమానము పంపగా

13. The whole congregation sent and spoke to the children of Binyamin who were in the rock of Rimmon, and proclaimed shalom to them.

14. ఆ వేళను బెన్యా మీనీ యులు తిరిగి వచ్చిరి. అప్పుడు వారు తాము యాబేష్గి లాదు స్త్రీలలో బ్రదుకనిచ్చినవారిని వారికిచ్చి పెండ్లి చేసిరి. ఆ స్త్రీలు వారికి చాలక పోగా

14. Binyamin returned at that time; and they gave them the women whom they had saved alive of the women of Yavesh-Gil`ad: and yet so they weren't enough for them.

15. యెహోవా ఇశ్రాయేలీయుల గోత్రములలో లోపము కలుగజేసి యుండుట జనులు చూచి బెన్యామీనీయులనుగూర్చి పశ్చాత్తాపపడిరి.

15. The people repented them for Binyamin, because that the LORD had made a breach in the tribes of Yisra'el.

16. సమాజప్రధానులు బెన్యామీను గోత్రములో స్త్రీలు నశించియుండుట చూచి మిగిలినవారికి భార్యలు దొరుకు నట్లు మనమేమి చేయుదమని యోచించుకొని

16. Then the Zakenim of the congregation said, How shall we do for wives for those who remain, seeing the women are destroyed out of Binyamin?

17. ఇశ్రా యేలీయులలోనుండి ఒక గోత్రము తుడిచివేయ బడకుండు నట్లు బెన్యామీనీయులలో తప్పించుకొనిన వారికి స్వాస్థ్య ముండవలెననిరి.

17. They said, There must be an inheritance for those who are escaped of Binyamin, that a tribe not be blotted out from Yisra'el.

18. ఇశ్రాయేలీయులలో ఎవడైనను తన కుమార్తెను బెన్యామీనీయునికి ఇచ్చిన యెడల వాడు నిర్మూలము చేయబడునని ప్రమాణము చేసియున్నాము గనుక మనము మన కుమార్తెలను వారికి పెండ్లి చేయకూడ దని చెప్పుకొనుచుండిరి.

18. However we may not give them wives of our daughters, for the children of Yisra'el had sworn, saying, Cursed be he who gives a wife to Binyamin.

19. కాగా వారు బెన్యామీనీయు లతో ఇట్లనిరిఇదిగో బేతేలుకు ఉత్తరదిక్కున బేతేలు నుండి షెకెమునకు పోవు రాజమార్గమునకు తూర్పుననున్న లెబోనాకు దక్షిణ దిక్కున యెహోవాకు పండుగ ఏటేట షిలోహులో జరుగునని చెప్పి బెన్యామీనీయులను చూచి

19. They said, Behold, there is a feast of the LORD from year to year in Shiloh, which is on the north of Beit-El, on the east side of the highway that goes up from Beit-El to Shekhem, and on the south of Levonah.

20. మీరు వెళ్లి ద్రాక్షతోటలలో మాటుననుండి షిలోహు స్త్రీలు నాట్యమాడువారితో కలిసి నాట్యమాడుటకు బయలు దేరగా

20. They commanded the children of Binyamin, saying, Go and lie in wait in the vineyards,

21. ద్రాక్షతోటలలోనుండి బయలు దేరివచ్చి పెండ్లి చేసికొనుటకు ప్రతివాడును షిలోహు స్త్రీలలో ఒకదాని పట్టుకొని బెన్యామీనీయుల దేశమునకు పారిపోవుడి.

21. and see, and, behold, if the daughters of Shiloh come out to dance in the dances, then come you out of the vineyards, and catch you every man his wife of the daughters of Shiloh, and go to the land of Binyamin.

22. తరువాత వారి తండ్రులైనను సహో దరులైనను వాదించుటకు మీయొద్దకు వచ్చినయెడల మేము ఆ యుద్ధమును బట్టి వారిలో ప్రతివానికిని పెండ్లికి స్త్రీ దొరకలేదు గనుక ఈ స్త్రీలను దయచేసి మాకియ్యుడి, ఈ సమయమున వారికిచ్చినయెడల మీరు అపరాధులగుదురు గనుక మాకిచ్చినట్లుగా ఇయ్యుడని వారితో చెప్పెద మనిరి.

22. It shall be, when their fathers or their brothers come to complain to us, that we will say to them, Grant them graciously to us, because we didn't take for each man his wife in battle, neither did you give them to them, else would you now be guilty.

23. కాగా బెన్యామీనీయులు అట్లు చేసి తమ లెక్క చొప్పున నాట్యమాడిన వారిలోనుండి స్త్రీలను పట్టుకొని వారిని తీసికొని పోయి తమ స్వాస్థ్యమునకు వెళ్లి పట్టణములను కట్టి వాటిలో నివసించిరి.

23. The children of Binyamin did so, and took them wives, according to their number, of those who danced, whom they carried off: and they went and returned to their inheritance, and built the cities, and lived in them.

24. అటుపిమ్మట ఇశ్రా యేలీయులలో ప్రతివాడును అక్కడనుండి తమ గోత్ర స్థానములకును కుటుంబములకును పోయెను. అందరును అక్కడనుండి బయలుదేరి తమ స్వాస్థ్యములకు పోయిరి.

24. The children of Yisra'el departed there at that time, every man to his tribe and to his family, and they went out from there every man to his inheritance.

25. ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు; ప్రతి వాడును తన తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచువచ్చెను.

25. In those days there was no king in Yisra'el: every man did that which was right in his own eyes.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Judges - న్యాయాధిపతులు 21 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

ఇశ్రాయేలీయులు బెన్యామీనీయుల కొరకు విలపిస్తారు.
ఇశ్రాయేలీయులు బెంజిమీయుల దుస్థితికి సంతాపం చెందారు మరియు వారి కుమార్తెలను వారికి వివాహం చేయడాన్ని నిషేధిస్తూ వారు చేసిన ప్రమాణం వల్ల తమను తాము ఇబ్బంది పడ్డారు. ప్రజలు తరచుగా దేవుని అధికారం కంటే తమ స్వంత అధికారాన్ని సమర్థించడంలో ఎక్కువ ఉత్సాహాన్ని చూపుతారని స్పష్టమైంది. వారి దురదృష్టకరమైన ప్రమాణాలకు మొండిగా పట్టుకోకుండా, వారు పశ్చాత్తాపం చెందడం, పాపపరిహారార్థం సమర్పించడం మరియు నిర్దేశించిన పద్ధతిలో క్షమాపణ కోరడం ద్వారా మరింత తెలివిగా వ్యవహరించేవారు. సమానమైన తప్పుడు చర్యలలో నిమగ్నమై అబద్ధాల నేరాన్ని తప్పించుకునే ప్రయత్నం సరైన మార్గం కాదు. విధి ముసుగులో నమ్మకద్రోహమైన లేదా హింసాత్మకమైన చర్యలకు పాల్పడమని వ్యక్తులు ఇతరులకు సలహా ఇవ్వగలరనే వాస్తవం, మానవ మనస్సు యొక్క స్వాభావిక అంధత్వాన్ని అదుపు చేయకుండా వదిలేస్తే మరియు అజ్ఞానం మరియు పొరపాటుతో మబ్బుగా ఉన్న మనస్సాక్షి యొక్క భయంకరమైన పరిణామాలను పూర్తిగా గుర్తు చేస్తుంది. అటువంటి హానికరమైన మార్గాలను నివారించడానికి సత్యం మరియు నైతిక మార్గదర్శకత్వం యొక్క ప్రాముఖ్యతను ఇది నొక్కి చెబుతుంది.


Shortcut Links
న్యాయాధిపతులు - Judges : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |