“తెరచి ఉన్న ఒక తలుపు”– దేవుడు యోహానుకు ఇంకా కొన్ని పరలోక రహస్య సత్యాలను వెల్లడి చేయబోతున్నాడని ఇది సూచిస్తున్నది.
“బూర ధ్వని లాగే”– ప్రకటన గ్రంథం 1:10 – బిగ్గరగా, తేటగా ధ్వనించిన స్వరం అన్నమాట. అది స్వరమే, బూర కాదు.
“ఇక్కడికి ఎక్కిరా”– కొందరు వ్యాఖ్యానకర్తలు ఇక్కడ యోహాను పరలోకానికి ఎక్కిపోవడం క్రీస్తు సంఘం పైకెత్తబడడానికి (1 థెస్సలొనీకయులకు 4:16-17) సూచనగా ఉందని నేర్పారు. సంఘం ఎత్తబడడం ఖాయం గానీ ఈ వచనం సూచించే సమయంలో ఎత్తబడుతుందో లేదో ఖచ్చితంగా చెప్పలేము. యోహాను ఇక్కడ ఆ సంఘటనకు సూచనగా ఉన్నాడనే బోధన కూడా చాలా సందేహమైన సంగతే. 10,11 అధ్యాయాల్లో యోహాను మళ్ళీ భూమి మీద కనిపిస్తున్నాడు (ప్రకటన గ్రంథం 10:1, ప్రకటన గ్రంథం 10:4, ప్రకటన గ్రంథం 10:7, ప్రకటన గ్రంథం 10:9-10; ప్రకటన గ్రంథం 11:1-3). అయితే అక్కడ అతడు పరలోకంనుంచి మళ్ళీ వచ్చిన సంఘానికి సూచనగా ఉన్నాడని వ్యాఖ్యానకర్తలు ఎవరూ చెప్పడం లేదు. అంతేగాక ఈ అధ్యాయంలో తరువాతి అధ్యాయాల్లో కనిపించిన పరలోక దర్శనాలలో సంఘం అనే మాట కనబడదు.
“తరువాత ఉండవలసినవి”– ప్రకటన గ్రంథం 1:19 – బహుశా దీని అర్థం ఈ యుగ సమాప్తిలో, క్రైస్తవ సంఘాల్లోని పరిస్థితులు పూర్తిగా వికసించిన తరువాత జరగబోయే సంఘటనలు.