Revelation - ప్రకటన గ్రంథము 12 | View All

1. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుని ధరించుకొనిన యొక స్త్రీ ఆమె పాదములక్రింద చంద్రుడును శిరస్సుమీద పండ్రెండు నక్షత్రముల కిరీటమును ఉండెను.

1. And a greet signe apperide in heuene; a womman clothid with the sunne, and the moone vndur hir feet, and in the heed of hir a coroun of twelue sterris.

2. ఆమె గర్భిణియై ప్రసవవేదనపడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను.
యెషయా 66:7, మీకా 4:10

2. And sche hadde in wombe, and sche crieth, trauelynge of child, and is turmentid, that sche bere child.

3. అంతట పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో యెఱ్ఱని మహాఘటసర్పము; దానికి ఏడు తలలును పది కొమ్ములును ఉండెను; దాని తలలమీద ఏడు కిరీటము లుండెను.
దానియేలు 7:7

3. And another signe was seyn in heuene; and lo! a greet reede dragoun, that hadde seuene heedis, and ten hornes, and in the heedis of hym seuene diademes.

4. దాని తోక ఆకాశ నక్షత్రములలో మూడవ భాగము నీడ్చి వాటిని భూమిమీద పడవేసెను. కననైయున్న ఆ స్త్రీ కనగానే, ఆమె శిశువును మింగివేయవలెనని ఆ ఘటసర్పము స్త్రీ యెదుట నిలుచుండెను.
దానియేలు 8:10

4. And the tail of hym drow the thridde part of sterris of heuene, and sente hem in to the erthe. And the dragoun stood bifore the womman, that was to berynge child, that whanne sche hadde borun child, he schulde deuoure hir sone.

5. సమస్త జనములను ఇనుపదండముతో ఏలనైయున్న యొక మగశిశువును ఆమె కనగా, ఆమె శిశువు దేవునియొద్దకును ఆయన సింహాసనమునొద్దకును కొనిపోబడెను.
కీర్తనల గ్రంథము 2:9, యెషయా 7:14, యెషయా 66:7

5. And sche bar a knaue child, that was to reulinge alle folkis in an yrun yerde; and hir sone was rauyschid to God, and to his trone.

6. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను; అచ్చట వారు వెయ్యిన్ని రెండువందల అరువది దినములు ఆమెను పోషింపవలెనని దేవుడామెకు ఒక స్థలము సిద్ధపరచియుంచెను.

6. And the womman flei in to wildirnesse, where sche hath a place maad redi of God, that he fede hir there a thousynde daies two hundrid and sixti.

7. అంతట పరలోకమందు యుద్ధము జరిగెను. మిఖా యేలును అతని దూతలును ఆ ఘటసర్పముతో యుద్ధము చేయవలెనని యుండగా
దానియేలు 10:13, దానియేలు 10:20, దానియేలు 10:21, దానియేలు 12:1

7. And a greet batel was maad in heuene, and Myyhel and hise aungels fouyten with the dragoun. And the dragoun fauyt, and hise aungels;

8. ఆ ఘటసర్పమును దాని దూతలును యుద్ధము చేసిరి గాని గెలువ లేకపోయిరి గనుక పరలోకమందు వారికిక స్థలము లేకపోయెను.

8. and thei hadden not myyt, nether the place of hem was foundun more in heuene.

9. కాగా సర్వలోకమును మోస పుచ్చుచు, అపవాదియనియు సాతాననియు పేరుగల ఆదిసర్పమైన ఆ మహా ఘటసర్పము పడద్రోయబడెను. అది భూమిమీద పడ ద్రోయబడెను; దాని దూతలు దానితో కూడ పడద్రోయబడిరి.
ఆదికాండము 3:1, జెకర్యా 3:1-2

9. And thilke dragoun was cast doun, the greet elde serpent, that is clepid the Deuel, and Sathanas, that disseyueth al the world; he was cast doun in to the erthe, and hise aungels weren sent with hym.

10. మరియు ఒక గొప్ప స్వరము పరలోక మందు ఈలాగు చెప్పుట వింటిని రాత్రింబగళ్లు మన దేవునియెదుట మన సహోదరులమీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి యున్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయెను; ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయెను.
యోబు 1:9-11

10. And Y herde a greet vois in heuene, seiynge, Now is maad helthe, and vertu, and kyngdom of oure God, and the power of his Crist; for the accuser of oure britheren is cast doun, which accuside hem bifor the siyte of oure God dai and nyyt.

11. వారు గొఱ్ఱెపిల్ల రక్తమును బట్టియు, తామిచ్చిన సాక్ష్య మునుబట్టియు వానిని జయించియున్నారు గాని, మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు.

11. And thei ouercamen hym for the blood of the lomb, and for the word of his witnessing; and thei louyden not her lyues til to deth.

12. అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా, ఉత్సహించుడి; భూమీ, సముద్రమా, మీకు శ్రమ; అపవాది తనకు సమయము కొంచెమే అని తెలిసికొని బహు క్రోధము గలవాడై మీయొద్దకు దిగి వచ్చియున్నాడని చెప్పెను.
యెషయా 44:23, యెషయా 49:13

12. Therfor, ye heuenes, be ye glad, and ye that dwellen in hem. Wo to the erthe, and to the see; for the fend is come doun to you, and hath greet wraththe, witynge that he hath litil tyme.

13. ఆ ఘటసర్పము తాను భూమిమీద పడద్రోయబడి యుండుట చూచి, ఆ మగశిశువును కనిన స్త్రీని హింసించెను;

13. And after that the dragoun sai, that he was cast doun to the erthe, he pursuede the womman, that bare the knaue child.

14. అందువలన ఆమె అరణ్యములో ఉన్న తన చోటికి ఎగురునట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు రెండు ఆమెకు ఇయ్యబడెను. అచ్చట ఆ సర్పముఖమును చూడ కుండ ఆమె ఒకకాలము కాలములు అర్ధకాలము పోషింపబడును.
దానియేలు 7:25, దానియేలు 12:7

14. And twei wengis of a greet egle weren youun to the womman, that sche schulde flee in to deseert, in to hir place, where sche is fed by tyme, and tymes, and half a tyme, fro the face of the serpent.

15. కావున ఆ స్త్రీ, ప్రవాహమునకు కొట్టుకొని పోవలెనని ఆ సర్పము తన నోటినుండి నీళ్లు నదీప్రవాహముగా ఆమె వెనుక వెళ్లగ్రక్కెనుగాని

15. And the serpent sente out of his mouth aftir the womman watir as a flood, that he schulde make hir to be drawun of the flood.

16. భూమి ఆ స్త్రీకి సహకారియై తన నోరు తెరచి ఆ ఘటసర్పము, తన నోటనుండి గ్రక్కిన ప్రవాహమును మింగివేసెను.

16. And the erthe helpide the womman, and the erthe openyde his mouth, and soop up the flood, that the dragoun sente of his mouth.

17. అందుచేత ఆ ఘటసర్పము ఆగ్రహము తెచ్చుకొని, దేవుని అజ్ఞలు గైకొనుచు యేసునుగూర్చి సాక్ష్యమిచ్చుచు ఉన్న వారైన ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలువెడలి సముద్రతీరమున నిలిచెను.
దానియేలు 7:21, దానియేలు 7:7

17. And the dragoun was wrooth ayens the womman, and he wente to make batel with othere of hir seed, that kepen the maundementis of God, and han the witnessing of Jhesu Crist.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Revelation - ప్రకటన గ్రంథము 12 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

ప్రకటన 12:1 అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుని ధరించుకొనిన యొక స్త్రీ ఆమె పాదములక్రిందచంద్రుడును శిరస్సుమీద పండ్రెండు నక్షత్రముల కిరీటమును

ప్రకటన 12:2 ఆమె గర్భిణియై ప్రసవవేదనపడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను.
పరలోకంలో గొప్ప సూచన : సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంత అందముగలదై సూర్యుని అంత స్వచ్ఛమును కళలునుగలదై వ్యూహితసైన్య సమభీకర రూపిణియునగు ఈమె ఎవరు? (ప. గీ. 6:10). శిరస్సుమీద పండ్రెండుగురు అపోస్తలుల కిరీటమును ధరించిన ఈమె ఎవరు?
వరుడు ఏసుక్రీస్తు సరసన నిలువబడ సిద్ధపడుచున్న సంఘ వదువే. సంధ్యారాగము అనగా ఉదయించుచున్న సూర్యుని వస్త్రమువలె ధరించిన సుందరవతి, చంద్రబింబమంత అందముగలది అనగా పాదములక్రిండ నున్న చంద్రుని కాంతి కిరణాల వెలుగులో మెరయుచున్న పాదరస వర్ణము, సూర్యుని ధరించుకొనిన అనగా మచ్చ, మరక, ముడత, అటువంటిది మరి ఏడైననూ లేనిది లేక వరుడు క్రీస్తు యెదుట నిలువబడగలుగునట్లు వాక్యముతో ఉదకస్నానముచేత పవిత్రపరచబడినది, పరిశుద్ధపరచబడినది.
స్త్రీ ప్రసవించునప్పుడు ఆమె గడియ వచ్చెను గనుక ఆమె వేదనపడును; అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టెనను సంతోషముచేత ఆమె ఆ వేదన మరి జ్ఞాపకము చేసికొనదు (యోహా 16:21). ప్రసవవేదన అనగా సంఘము హింసింపబడుట లేక ఒక ఆత్మ రాక్షణార్ధమై అపోస్తలులు ప్రయాసపడుట లోకముతో పోరాడుట. సృష్టి యావత్తు మూలుగుచు ప్రసవవేదన పడుచునున్నది (రోమా 8:22)
అలాగే క్రీస్తు స్వరూపము మనయందేర్పడు వరకు మన విషయమై నిజమైన దైవ సేవకునికి మరియూ అపోస్తలులకు ప్రసవవేదన కలుగుచున్నది (గల 4:19) అని అపో. పౌలు గారు తెలియపరచు చున్నారు. అందుకే మారుమనస్సు అక్కరలేని తొంబది తొమి్మది మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషముకంటె మారుమనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలొక మందు ఎక్కువ సంతోషము అని (లూకా 15:7).

ప్రకటన 12:3 అంతట పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో యెఱ్ఱని మహాఘటసర్పము; దానికి ఏడు తలలును పది కొమ్ములును ఉండెను; దాని తలలమీద ఏడు కిరీటము లుండెను.

ప్రకటన 12:4 దాని తోక ఆకాశ నక్షత్రములలో మూడవ భాగము నీడ్చి వాటిని భూమిమీద పడవేసెను. కననైయున్న ఆ స్త్రీ కనగానే, ఆమె శిశువును మింగివేయవలెనని ఆ ఘటసర్పము స్త్రీ యెదుట నిలుచుండెను.

ప్రకటన 12:5 సమస్త జనములను ఇనుపదండముతో ఏలనైయున్న యొక మగశిశువును ఆమె కనగా, ఆమె శిశువు దేవునియొద్దకును ఆయన సింహాసనమునొద్దకును కొనిపోబడెను.

ప్రకటన 12:6 ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను; అచ్చట వారు వెయ్యిన్ని రెండువందల అరువది దినములు (మూడున్నర సంవత్సరములు) ఆమెను పోషింపవలెనని దేవుడామెకు ఒక స్థలము సిద్ధపరచియుంచెను.
సంఘము విస్తరించనారంభించినప్పుడు అనగా ఒక్కొక్క ఆత్మ రక్షింపబడినప్పుడు లేక ఒక వ్యక్తీ ఏసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు సాతాను ఎలా విజ్రుంభిస్తుందో ఈ దర్శనములో పరి. యోహాను గారు స్పష్టముగా చూస్తున్నారు.
అది యెఱ్ఱని మహాఘటసర్పము, అది మింగివేయవలెనని చూచుచున్నది. రెండు సంవత్సరములు మొదలుకొని తక్కువ వయస్సుగల మగపిల్లల నందరిని వధించెను (మత్త 2:16) అను వాక్యము మనకు విదితమే.. ఇనుపదండముతో ఏలనైయున్న ఆ శిశువు పుట్టగానే దేవుని సన్నిధికి తేబడుట కనబడుచున్నది దర్శనములో. ఆ స్త్రీ అనగా కన్యక సంఘము పరిశుద్ధాత్మ చేత ఆవరింపబడినది.
రక్షించబడిన పరిశుద్ధులతో దేవుడు చేసిన వాగ్దానములు:
1. సమాధాన కర్తయగు దేవుడు సాతానును మీ కాళ్లక్రింద శీఘ్రముగా చితుక త్రొక్కించును (రోమా 16:20).
2. నన్ను వెంబడించిన మీరును పండ్రెండు సింహాసనములమీద ఆసీనులై ఇశ్రాయేలు పండ్రెండు గోత్రములవారికి తీర్పుతీర్చుదురు (మత్త 19:28).
3. నేను జయించి నా తండ్రితోకూడ ఆయన సింహాసనమునందు కూర్చుండి యున్న ప్రకారము జయించువానిని నాతోకూడ నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను (ప్రక 3:21).
హింస ప్రభలినప్పుడు అపో. పౌలు గారిని దేవుడు ఎలా దాచివుంచాడో ఆయన సాక్ష్యమే ఎలా వ్రాయబడినది : క్రీస్తునందున్న యొక మనుష్యుని నేనెరుగుదును. అతడు పదునాలుగు సంవత్సరములక్రిందట మూడవ ఆకాశమునకు కొనిపోబడెను; అతడు శరీరముతో కొనిపోబడెనో నేనెరుగను, శరీరములేక కొనిపోబడెనో నేనెరుగను, అది దేవునికే తెలియును (2 కొరిం 12:2).
- కనుక కొన్ని మర్మములు మనకు మరుగైవున్నవి. కొనిపోబడిన తానే నేనెరుగను అని వ్రాస్తున్నారు. ప్రార్ధన చేద్దాం. ముందుకు సాగుదాం.
పరలోక రాజ్యమర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడియున్నది (మత్త 13:11). ఐననూ సంగతి మరుగుచేయుట దేవునికి ఘనత సంగతి శోధించుట రాజులకు ఘనత (సామె 25:2).

ప్రకటన 12:7 అంతట పరలోకమందు యుద్ధము జరిగెను. మిఖాయేలును అతని దూతలును ఆ ఘటసర్పముతో యుద్ధము చేయవలెనని యుండగా
మొషే సృష్టి గ్రంధం వ్రాసేప్పుడు ఎక్కడ వున్నాడు? సృష్టి జరిగిన ఎన్నాళ్ళ తరువాత ఆ దర్శనము పొందాడు? అనే ప్రశ్నలకు జవాబు ఆలోచించితే,
పరలోకములో యుద్ధము – ఎప్పుడు జరిగింది? అనే ప్రశ్నకు జవాబు దొరుకుతుంది. యేసు ప్రభువు భూమి మీద ఉన్నప్పుడే “సాతాను మెరుపు వలె ఆకాశమునుండి పడుట చూచితిని” (లూకా 10:18) అన్నారు.
మిఖాయేలు అతనితో వున్న కొందరు దూతలు సాతానుతో అనగా మనకు తెలిసిన లూసీఫర్ అనే దూతతోనూ దాని అనుచరులతోనూ యుద్ధం చేశారు. దేవునికిలేని బాధ్యత మిఖాయేలుకెందుకు?
దానియేలు గ్రంధములో వున్నకొన్ని వివరణలు చూద్దాం : 1. ప్రధానాధిపతులలో [one of the chief princes] మిఖాయేలను ఒకడు (దాని 10:13) 2. యధిపతియగు [prince] మిఖాయేలు (దాని 10:21) 3. మహా అధిపతియగు [the great prince] మిఖాయేలు (దాని 12:1) అని వ్రాయబడినది.
ప్రధానాధిపతులుగా కొందరు దేవదూతలు నియమింప బడినారనియూ, వారికి అప్పగింపబడిన బాధ్యతలు వేరు వేరుగా వున్నావనియూ మనము గ్రహించాలి. మరో ప్రధాన దూత గాబ్రియేల్ కూడా మనకు తెలుసు. వారు KING OF KINGS, JESUS CHRIST ఎదుట PRINCES గా వున్నారు. ఇది అధ్బుతం. హల్లెలూయా

ప్రకటన 12:8 ఆ ఘటసర్పమును దాని దూతలును యుద్ధము చేసిరి గాని గెలువ లేకపోయిరి గనుక పరలోకమందు వారికిక స్థలము లేకపోయెను.

ప్రకటన 12:9 కాగా సర్వలోకమును మోస పుచ్చుచు, అపవాదియనియు సాతాననియు పేరుగల ఆదిసర్పమైన ఆ మహా ఘటసర్పము పడద్రోయబడెను. అది భూమిమీద పడ ద్రోయబడెను; దాని దూతలు దానితో కూడ పడద్రోయబడిరి.

ప్రకటన 12:10 మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఈలాగు చెప్పుట వింటిని రాత్రింబగళ్లు మన దేవునియెదుట మన సహోదరులమీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి యున్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయెను; ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయెను.
పరిశుద్ధ దూతలతో పరలోకంలోనే ఆ ఘటసర్పము దాని దూతలు యుద్ధము చేసారు అంటే; భూమిమీద మనుష్యులను కేవలము శోధించి ఊరుకుంటాయా అని ఆలోచించాలి మనము.
నాటినుండి అపవాదికి పరలోకములో స్థలము లేకపోయినది. యెహోవానీవు ఎక్కడనుండి వచ్చితివని వాని నడుగగా అపవాది భూమిలో ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరమిచ్చెను (యోబు 2:2).
అంతే కాదు; రాత్రింబగళ్లు మనలను మోసము చేయుచూ, మన దేవునియెదుట మన సహోదరులమీద నేరము మోపువాడైనాడట ఈ అపవాది. అపో. పౌలు గారు ఎఫెసు సంఘమునకు వ్రాసిన లేఖలో : మనము పోరాడునది శరీరులతో కాదు [మన విరోధి మన పొరుగు వాడు గాని మన మధ్యనున్న అన్యుడు గాని కాదు], గాని ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకారసంబంధులగు లోక నాథులతోను, ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోను పోరాడుచున్నాము (ఎఫే 6:12).
ప్రతిక్రైస్తవ విశ్వాసీ ఈ పోరాటములో విజయము పొందునట్లు దేవుడు సంఘమును ఏర్పరచి సమస్తమును ఆయన పాదములక్రింద ఉంచి, సమస్తముపైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను (ఎఫే 1:22). ఆత్మ యుద్ధములో విజయము పొందునట్లు సంఘములో నీవున్నావా లేక లోకమనే యుద్ధ రంగములో నీవున్నావా లేక నులివెచ్చగా వున్నావా; ఈ రోజే సరిచేసుకో ప్రియ స్నేహితుడా.
అప్పుడు “రక్షణ యెహోవాది” (కీర్త 3:8), ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయెను; ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయెను.
అవును, ఇప్పుడు రక్షణ నీ స్వంతం. నీ ఆత్మ రక్షణ తీర్మానం నీదే. మోకరించు, పశ్చాతాపపడు, పాపము ఒప్పుకో, బాప్తిస్మం ద్వారా క్రీస్తు మరణ భూస్తాపనలో పాలుపంచుకో, పరిశుద్ధాత్మ వరములు నీ సొంతం. ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి, గ్రీసుదేశస్థునికి కూడ రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తియై యున్నది (రోమా 1:16) అది క్రీస్తు మనకొరకు సంపాదించిన స్వాస్థ్యమై యున్నది.
నేడే రక్షణ పొందు, రక్షణ లేని వారికొరకు భారముతో ప్రార్ధించు. దేవుడు నీకు తోడుగా వున్నాడు. ఆమెన్

ప్రకటన 12:11 వారు గొఱ్ఱపిల్ల రక్తమును బట్టియు, తామిచ్చిన సాక్ష్య మునుబట్టియు వానిని జయించియున్నారు గాని, మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు.

ప్రకటన 12:12 అందుచేత పరలోకమా, పరలోకనివాసులారా, ఉత్సహించుడి; భూమీ, సముద్రమా, మీకు శ్రమ; అపవాది తనకు సమయము కొంచెమే అని తెలిసికొని బహు క్రోధము గలవాడై మీయొద్దకు దిగివచ్చియున్నాడని చెప్పెను
పరలోకమందు యుద్ధము జరిగెను. మిఖాయేలును అతని దూతలును ఆ ఘటసర్పముతో యుద్ధము చేయవలెనని యుండగా ఆ ఘటసర్పమును దాని దూతలును యుద్ధము చేసిరి గాని గెలువ లేకపోయిరి అని ఇప్పటివరకూ ధ్యానిస్తూ వచ్చాము. ఐతే ఆ జయించినవారు ఎవరు? దేవదూతలే కదా.
మరి ఈ వచనములో వారు 1. గొఱ్ఱపిల్ల రక్తమును బట్టి,2. తామిచ్చిన సాక్ష్యమును బట్టి అని వ్రాయబడుచున్నది. అందును బట్టియే వారు అపవాదిని జయించియున్నారు. యేసు చెప్పిన రెండు విషయాలు ఇక్కడ మనము స్మరణకు తెచ్చుకోవాలి. లోకములో మీకు శ్రమ కలుగును; అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి యున్నాననెను (యోహా 16:33).
యేసయ్య జయిస్తే అది విశ్వాసికి విజయం. నీకు కలిగిన ప్రతి శ్రమలోనూ క్రీస్తు నీ పక్షముగా పొందిన జయమును గుర్తుకు తెచ్చుకో అంటున్నది వాక్యము. అలాగీ మారుమనస్సు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల యెదుట సంతోషము కలుగును (లూకా 15:10) అను వాక్య భావమిదే. దేవ దూతలు యుద్ధము చేస్తే, “మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు” అనే ఈ మాట ఏమిటి ? వారికి మరణమే లేదు కదా. వారు అమర్త్యులు కదా.
ఇక్కడ ఒక మర్మము వుంది. అసలు అపవాది పడిపోయినట్లు ప్రవక్తల దర్శనములున్నవి. యెషయా గ్రంధములో చూస్తే; నేను ఆకాశమున కెక్కిపోయెదను దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును ఉత్తరదిక్కుననున్న సభాపర్వతముమీద కూర్చుందును మేఘమండలముమీది కెక్కుదును మహోన్నతునితో నన్ను సమానునిగా చేసికొందును అని నీవు మనస్సులో అనుకొంటివిగదా? నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే (యెష 14:13-15) అని వ్రాయబడినది.
యేసు ప్రభువు భూమి మీద ఉన్నప్పుడే “సాతాను మెరుపు వలె ఆకాశమునుండి పడుట చూచితిని” (లూకా 10:18) అన్నారు.
ఈ దర్శనము ఒక పాపి తను పాపిని అని గ్రహించుట లేక తన పాపము ఒప్పుకొనుట అంతరంగములో జరిగే ఆత్మీయ యుద్ధమే. తదనుగుణ్యముగా పరలోకములో దేవదూతల యుద్ధం దానికి సాదృశ్యం. ఆ వ్యక్తీ ఒక సంఘములో బాప్తిస్మము ద్వారా యేసు నా రక్షకుడు అని సాక్ష్యమిస్తే అది సాతానుకు ఓటమి. ఎప్పుడైతే నూతన రక్త సంబంధములో అనగా క్రీస్తు రక్తములో పాలు పంచుకుంటాడో అప్పుడే అపవాది మరోసారి పడద్రోయబడుతుంది అంది ఉపమానరూపక దర్శనమిది.
అప్పుడు లూకా 15:7 లో మారుమనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలొక మందు ఎక్కువ సంతోషము అని వ్రాయబడిన ప్రకారము అక్కడనుండి హెచ్చరికతో కూడిన ఒక ప్రకటన వెలువడుతున్నది: పరలోకమా, పరలోకనివాసులారా, ఉత్సహించుడి; భూమీ, సముద్రమా, మీకు శ్రమ; అపవాది తనకు సమయము కొంచెమే అని తెలిసికొని బహు క్రోధము గలవాడై మీయొద్దకు దిగివచ్చియున్నాడని చెప్పెను.
అందుకే రక్షింపబడిన నీవు మరొకరి రక్షణకొరకు ప్రయాస పడాలి. ఎందుకంటే, ఒక ఆత్మ చేయిజారిపోతే, సాతాను మరి బలముగా వేరొక ఆత్మను శోధించగలదు. మన రక్షణను కాపాడుకొంటూ, ఇతరుల రక్షణ కొరకు ప్రార్ధన చేద్దామా. క్రీస్తు ఆత్మ మనల నడిపించునుగాక. ఆమెన్

ప్రకటన 12:13 ఆ ఘటసర్పము తాను భూమిమీద పడద్రోయబడి యుండుట చూచి, ఆ మగశిశువును కనిన స్త్రీని హింసిం చెను;

ప్రకటన 12:14 అందువలన ఆమె అరణ్యములో ఉన్న తన చోటికి ఎగురునట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు రెండు ఆమెకు ఇయ్యబడెను. అచ్చట ఆ సర్పముఖమును చూడ కుండ ఆమె ఒకకాలము కాలములు అర్ధకాలము పోషింపబడును.

ప్రకటన 12:15 కావున ఆ స్త్రీ, ప్రవాహమునకు కొట్టుకొని పోవలెనని ఆ సర్పము తన నోటినుండి నీళ్లు నదీప్రవాహముగా ఆమె వెనుక వెళ్లగ్రక్కెనుగాని

ప్రకటన 12:16 భూమి ఆ స్త్రీకి సహకారియై తన నోరు తెరచి ఆ ఘటసర్పము, తన నోటనుండి గ్రక్కిన ప్రవాహమును మింగివేసెను.

ప్రకటన 12:17 అందుచేత ఆ ఘటసర్పము ఆగ్రహము తెచ్చుకొని, దేవుని అజ్ఞలు గైకొనుచు యేసునుగూర్చి సాక్ష్యమిచ్చుచు ఉన్న వారైన ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలువెడలి సముద్రతీరమున నిలిచెను.
పడద్రోయబడిన అపవాది ఆ స్త్రీని చూచినప్పుడు ఆమె మగశిశువును కనినట్లు వ్రాయబడుచున్నది. ఆ స్త్రీని, శిశువును కూడా దేవుడు సంరక్షించిన విధము ఈ దర్శనములో స్పష్టమౌతున్నది. ఆమెకు ఇవ్వబడిన రెండు రెక్కలు పక్షిరాజు రెక్కలవలె వున్నవి అనగా, సంఘమును అపవాది తంత్రముల నుండి కాయుటకు నియమింపబడిన పరిశుద్ధ దేవదూతలను సూచించు చున్నది.
ఇశ్రాయేలీయుల ఇగుప్తు విడుదలను సూచిస్తూ ప్రభువు: మిమ్మును గద్ద రెక్కలమీద మోసి నా యొద్దకు మిమ్ము నెట్లు చేర్చు కొంటినో మీరు చూచితిరి (నిర్గ 19:4) అన్నారు. వారి మధ్య వున్న ప్రత్యక్ష గుదారములో నున్న కరుణాపీఠము మీది కెరూబులు పైకి విప్పిన రెక్కలుగలవై కరుణాపీఠమును తమ రెక్కలతో కప్పుచున్నవి (నిర్గ 25:20). అట్లు దేవుని మందిరములోనూ మందిరము చుట్టునూ ఆవరించి యున్న దేవుని మహిమ బయలుపరచ బడునట్లు మనకు తెలుపుటయే దేవుడు పరి. యోహాను గారి ద్వారా మనకు అనుగ్రహించినది ఈ దర్శనము.
ఒక కాలము కాలములు అర్ధ కాలము అనగా ఎంత కాలము? యివ్విషయమును మనము ప్రక 12:1 నుండి 12:6 లో ధ్యానించి యున్నాము యేమనగా అది వెయ్యిన్ని రెండువందల అరువది దినములు అనగా మూడున్నర సంవత్సరములు. అదే దర్శనము ఇక్కడ కొనసాగుతున్నదని గ్రహించాలి మనము. ప్రవాహములు అను మాటకు భావము అపవాది రేపిన జలప్రళయము.
ఇందు విషయమై మనకు జ్ఞాపకమునకు వచ్చుచున్న ఒక అద్భుతమును మత్తయి 8 వ అధ్యాయములో చూసియున్నాము. క్రీస్తు గదరేనీయుల దేశమునకు సమీపించుచూ సముద్ర ప్రయాణము చేయుచుండగా అపవాది సముద్రముమీద తుపాను లేపినందున ఆ దోనె అలలచేత కప్పబడెను. ఐతే యేసు గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మళ మాయెను (మత్త 8:24-26).
ఆ ఘటసర్పము ఆగ్రహము తెచ్చుకొని, దేవుని అజ్ఞలు గైకొనుచు యేసునుగూర్చి సాక్ష్యమిచ్చుచు ఉన్న పరిశుద్ధులైన వారితో యుద్ధము చేయుటకై సిద్ధపదినదని వాక్యము హెచ్చరించుచున్నది. అవును, మన విరోధియైన అపవాది గర్జించు సింహమువలె ఎవరిని మింగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు (1 పేతు 5:8). బుద్ధి మార్చుకొని మెలకువగానుండి ప్రార్ధన చేయుడి అని ఆత్మదేవుని హెచ్చరిక.
ప్రార్ధన చేయుట అంటే కేవలము కోరికలు తీర్చమని ప్రభును అడుగుట మాత్రమే కాదు, ప్రియ స్నేహితుడా; యుద్ధ సంనద్దులమై దుర్గములను పడద్రోయజాలినంత బలముకల యుద్ధోపకరణములను ధరించుడుము గాక. ఆమెన్



Shortcut Links
ప్రకటన గ్రంథం - Revelation : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |