Joshua - యెహోషువ 24 | View All

1. యెహోషువ ఇశ్రాయేలీయుల గోత్రముల వారి నందరిని షెకెములో పోగుచేసి, వారి పెద్దలను వారి ప్రధానులను వారి న్యాయాధిపతులను వారి నాయకులను పిలిపింపగా వారు వచ్చి దేవుని సన్నిధిని నిలిచిరి.

1. Joshua assembled all the tribes of Israel at Shechem and summoned Israel's elders, leaders, judges, and officers, and they presented themselves before God.

2. యెహోషువ జనులందరితో ఇట్లనెనుఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా చెప్పునదేమనగాఆదికాలమునుండి మీ పితరులు, అనగా అబ్రాహాముకును నాహోరుకును తండ్రియైన తెరహు కుటుంబికులు నది (యూఫ్రటీసు) అద్దరిని నివసించి యితర దేవతలను పూజించిరి.

2. Joshua said to all the people, 'This is what the LORD, the God of Israel, says: 'Long ago your ancestors, including Terah, the father of Abraham and Nahor, lived beyond the Euphrates River and worshiped other gods.

3. అయితే నేను నది అద్దరినుండి మీ పితరుడైన అబ్రాహామును తోడు కొని వచ్చి కనాను దేశమందంతట సంచరింపజేసి, అతనికి సంతానమును విస్తరింపజేసి, అతనికి ఇస్సాకును ఇచ్చి తిని.

3. But I took your father Abraham from the region beyond the Euphrates River, led him throughout the land of Canaan, and multiplied his descendants. I gave him Isaac,

4. ఇస్సాకునకు నేను యాకోబు ఏశావుల నిచ్చితిని. శేయీరు మన్యములను స్వాధీనపరచుకొనునట్లు వాటిని ఏశావు కిచ్చితిని. యాకోబును అతని కుమారులును ఐగుప్తులోనికి దిగిపోయిరి.

4. and to Isaac I gave Jacob and Esau. I gave the hill country of Seir to Esau as a possession, but Jacob and his sons went down to Egypt.

5. తరువాత నేను మోషే అహరోనులను పంపి, దాని మధ్యను నేను చేసిన క్రియలవలన ఐగుప్తీయు లను హతముచేసి మిమ్మును వెలుపలికి రప్పించితిని.

5. 'Then I sent Moses and Aaron, I plagued Egypt by what I did there, and afterwards I brought you out.

6. నేను ఐగుప్తులోనుండి మీ తండ్రులను రప్పించినప్పుడు మీరు సముద్రమునొద్దకు రాగా ఐగుప్తీయులు రథములతోను రౌతులతోను మీ తండ్రులను ఎఱ్ఱసముద్రమువరకు తరిమిరి.

6. When I brought your fathers out of Egypt and you reached the Red Sea, the Egyptians pursued your fathers with chariots and horsemen as far as the sea.

7. వారు యెహోవాకు మొఱ్ఱపెట్టినప్పుడు ఆయన మీకును ఐగుప్తీయులకును మధ్య చీకటి కల్పించి సముద్ర మును వారిమీదికి రప్పించి వారిని ముంచివేసెను. ఐగుప్తు దేశములో నేను చేసినదానిని మీరు కన్నులార చూచితిరి. అటుతరువాత మీరు బహు దినములు అరణ్యములో నివసించితిరి.

7. Your fathers cried out to the LORD, so He put darkness between you and the Egyptians, and brought the sea over them, engulfing them. Your own eyes saw what I did to Egypt. After that, you lived in the wilderness a long time.

8. యొర్దాను అద్దరిని నివసించిన అమోరీయుల దేశమునకు నేను మిమ్మును రప్పించినప్పుడు వారు మీతో యుద్ధముచేయగా నేను మీ చేతికి వారిని అప్పగించితిని, మీరు వారి దేశమును స్వాధీనపరచుకొంటిరి, వారు మీ యెదుట నిలువకుండ వారిని నశింపజేసితిని.

8. 'Later, I brought you to the land of the Amorites who lived beyond the Jordan. They fought against you, but I handed them over to you. You possessed their land, and I annihilated them before you.

9. తరువాత మోయాబు రాజును సిప్పోరు కుమారుడునైన బాలాకులేచి ఇశ్రాయేలీయులతో యుద్ధముచేసి మిమ్ము శపించుటకు బెయోరు కుమారుడైన బిలామును పిలువనంపగా

9. Balak son of Zippor, king of Moab, set out to fight against Israel. He sent for Balaam son of Beor to curse you,

10. నేను బిలాము మనవి విననొల్లనైతిని గనుక అతడు మిమ్మును దీవించుచునే వచ్చెను. అతనిచేతినుండి నేనే మిమ్మును విడిపించితిని.

10. but I would not listen to Balaam. Instead, he repeatedly blessed you, and I delivered you from his hand.

11. మీరు యొర్దాను దాటి యెరికో దగ్గరకు వచ్చినప్పుడు యెరికోకు యజమానులగు అమోరీయులు పెరిజ్జీయులు కనానీయులు హీత్తీయులు గిర్గాషీయులు హివ్వీయులు యెబూసీయులనువారు మీతో యుద్ధము చేయగా నేను వారిని మీ చేతికప్పగించితిని.

11. 'You then crossed the Jordan and came to Jericho. The people of Jericho-- as well as the Amorites, Perizzites, Canaanites, Hittites, Girgashites, Hivites, and Jebusites-- fought against you, but I handed them over to you.

12. మరియు నేను మీకు ముందుగా కందిరీగలను పంపితిని; నీ ఖడ్గము కాదు నీ విల్లు కాదు గాని అవే అమోరీయుల రాజుల నిద్దరిని తోలివేసెను. మీరు సేద్యముచేయని దేశమును

12. I sent the hornetahead of you, and it drove out the two Amorite kings before you. It was not by your sword or bow.

13. మీరు కట్టని పట్టణములను మీకిచ్చియున్నాను. మీరు వాటిలో నివసించుచున్నారు. మీరు నాటని ద్రాక్షతోటల పండ్లను ఒలీవతోటల పండ్లను తినుచున్నారు.

13. I gave you a land you did not labor for, and cities you did not build, though you live in them; you are eating from vineyards and olive groves you did not plant.'

14. కాబట్టి మీరు యెహోవాయందు భయ భక్తులుగలవారై, ఆయనను నిష్కపటముగాను సత్యము గాను సేవించుచు, మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులోను సేవించిన దేవతలను తొలగద్రోసి యెహోవానే సేవించుడి.

14. 'Therefore, fear the LORD and worship Him in sincerity and truth. Get rid of the gods your ancestors worshiped beyond the Euphrates River and in Egypt, and worship the LORD.

15. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన యెడల మీరు ఎవని సేవించెదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవిం చెదరో నేడు మీరు కోరుకొనుడి; మీరె వరిని సేవింప కోరుకొనినను నేనును నా యింటివారును యెహోవాను సేవించెదము అనెను.

15. But if it doesn't please you to worship the LORD, choose for yourselves today the one you will worship: the gods your fathers worshiped beyond the Euphrates River, or the gods of the Amorites in whose land you are living. As for me and my family, we will worship the LORD.'

16. అందుకు ప్రజలుయెహోవాను విసర్జించి యితరదేవతలను సేవించినయెడల మేము శాప గ్రస్తుల మగుదుము గాక.

16. The people replied, 'We will certainly not abandon the LORD to worship other gods!

17. ఐగుప్తుదేశమను దాసుల గృహములోనుండి మనలను మన తండ్రులను రప్పించి, మన కన్నులయెదుట ఆ గొప్ప సూచక క్రియలను చేసి, మనము నడిచిన మార్గములన్నిటిలోను, మనము వెళ్లిన ప్రజ లందరిమధ్యను మనలను కాపాడిన యెహోవాయే మన దేవుడు.

17. For the LORD our God brought us and our fathers out of the land of Egypt, the place of slavery and performed these great signs before our eyes. He also protected us all along the way we went and among all the peoples whose lands we traveled through.

18. యెహోవా ఆ దేశములో నివసించిన అమోరీ యులు మొదలైన ప్రజలందరు మనయెదుట నిలువకుండ వారిని తోలివేసినవాడు; యెహోవానే సేవించెదము; ఆయనయే మా దేవుడని ప్రత్యుత్తరమిచ్చిరి.
అపో. కార్యములు 7:45

18. The LORD drove out before us all the peoples, including the Amorites who lived in the land. We too will worship the LORD, because He is our God.'

19. అందుకు యెహోషువయెహోవా పరిశుద్ధ దేవుడు, రోషముగల దేవుడు, ఆయన మీ అపరాధ ములను మీ పాపములను పరిహరింపనివాడు, మీరాయనను సేవింపలేరు.

19. But Joshua told the people, 'You will not be able to worship the LORD, because He is a holy God. He is a jealous God; He will not remove your transgressions and sins.

20. మీరు యెహోవాను విసర్జించి అన్యదేవతలను సేవించినయెడల ఆయన మీకు మేలు చేయువాడైనను మనస్సు త్రిప్పుకొని మీకు కీడుచేసి మిమ్మును క్షీణింప జేయుననగా

20. If you abandon the LORD and worship foreign gods, He will turn against [you], harm you, and completely destroy you, after He has been good to you.'

21. జనులు అట్లు కాదు, మేము యెహోవానే సేవించెదమని యెహోషువతో చెప్పిరి.

21. No!' the people answered Joshua. 'We will worship the LORD.'

22. అప్పుడు యెహో షువమీరు యెహోవానే సేవించెదమని ఆయనను కోరు కొన్నందుకు మిమ్మును గూర్చి మీరే సాక్షులై యున్నా రనగా వారుమేము సాక్షులమే అనిరి.

22. Joshua then told the people, 'You are witnesses against yourselves that you yourselves have chosen to worship the LORD.' 'We are witnesses,' they said.

23. అందుకతడుఆలాగైతే మీ మధ్య నున్న అన్యదేవతలను తొలగద్రోసి, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాతట్టు మీ హృదయమును త్రిప్పుకొనుడని చెప్పెను.

23. 'Then get rid of the foreign gods that are among you and offer your hearts to the LORD, the God of Israel.'

24. అందుకు జనులుమన దేవు డైన యెహోవానే సేవించెదము, ఆయన మాటయే విందుమని యెహోషువతో చెప్పిరి.

24. So the people said to Joshua, 'We will worship the LORD our God and obey Him.'

25. అట్లు యెహోషువ ఆ దినమున ప్రజలతో నిబంధన చేసి వారికి షెకెములో కట్టడను విధిని నియమించి

25. On that day Joshua made a covenant for the people at Shechem and established a statute and ordinance for them.

26. దేవుని ధర్మశాస్త్రగ్రంథములో ఆ వాక్యములను వ్రాయించి పెద్ద రాతిని తెప్పించి యెహోవా పరిశుద్ధస్థలములో నున్న సిందూర వృక్షముక్రింద దాని నిలువబెట్టి

26. Joshua recorded these things in the book of the law of God; he also took a large stone and set it up there under the oak next to the sanctuary of the LORD.

27. జను లందరితో ఇట్లనెనుఆలోచించుడి, యెహోవా మనతో చెప్పిన మాటలన్నియు ఈ రాతికి వినబడెను గనుక అది మనమీద సాక్షిగా ఉండును. మీరు మీ దేవుని విసర్జించిన యెడల అది మీమీద సాక్షిగా ఉండును.

27. And Joshua said to all the people, 'You see this stone-- it will be a witness against us, for it has heard all the words the LORD said to us, and it will be a witness against you, so that you will not deny your God.'

28. అప్పుడు యెహోషువ ప్రజలను తమ స్వాస్థ్యములకు వెళ్లనంపెను.

28. Then Joshua sent the people away, each to his own inheritance.

29. ఈ సంగతులు జరిగినతరువాత నూను కుమారుడును యెహోవా దాసుడునైన యెహోషువ నూటపది సంవత్స రముల వయస్సుగలవాడై మృతి నొందెను.

29. After these things, the LORD's servant, Joshua son of Nun, died at the age of 110.

30. అతని స్వాస్థ్యపు సరిహద్దులోనున్న తిమ్నత్సెరహులో అతడు పాతి పెట్టబడెను. అది ఎఫ్రాయిమీయుల మన్యములోని గాయషు కొండకు ఉత్తర దిక్కున నున్నది.

30. They buried him in his allotted territory at Timnath-serah, in the hill country of Ephraim north of Mount Gaash.

31. యెహోషువ దినములన్నిటను యెహోషువ తరువాత ఇంక బ్రతికి యెహోవా ఇశ్రాయేలీయులకొరకు చేసిన క్రియలన్నిటిని ఎరిగిన పెద్దల దినములన్నిటను ఇశ్రాయేలీ యులు యెహోవాను సేవించుచు వచ్చిరి.

31. Israel worshiped the LORD throughout Joshua's lifetime and during the lifetimes of the elders who outlived Joshua, and who had experienced all the works the LORD had done for Israel.

32. ఇశ్రాయేలీ యులు ఐగుప్తులోనుండి తెచ్చిన యోసేపు ఎముకలను షెకెములో, అనగా యాకోబు నూరు వరహాలకు షెకెము తండ్రియైన హమోరు కుమారులయొద్ద కొనిన చేని భాగములో వారు పాతిపెట్టిరి. అవి యోసేపు పుత్రులకు ఒక స్వాస్థ్యముగా ఉండెను.
యోహాను 4:5, అపో. కార్యములు 7:16

32. Joseph's bones, which the Israelites had brought up from Egypt, were buried at Shechem in the parcel of land Jacob had purchased from the sons of Hamor, Shechem's father, for 100 qesitahs.It was an inheritance for Joseph's descendants.

33. మరియఅహరోను కుమారు డైన ఎలియాజరు మృతినొందినప్పుడు ఎఫ్రాయీమీయుల మన్యప్రదేశములో అతని కుమారుడైన ఫీనెహాసునకు ఇయ్య బడిన ఫీనెహాసుగిరిలో జనులు అతని పాతిపెట్టిరి.

33. And Eleazar son of Aaron died, and they buried him at Gibeah, which had been given to his son Phinehas in the hill country of Ephraim.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Joshua - యెహోషువ 24 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

మన జీవితం ముగిసే వరకు దేవుని కోసం మన పని పూర్తయిందని మనం ఎప్పుడూ అనుకోకూడదు. ఒకవేళ, యెహోషువా వలె, మన రోజులు ఊహించని విధంగా పొడిగించబడినట్లయితే, దేవుడు మనకొరకు మరిన్ని సేవను కలిగి ఉన్నందున. క్రీస్తు యేసు మనస్తత్వాన్ని అనుకరించటానికి మనం ప్రయత్నించినప్పుడు, మన రక్షకుని మంచితనానికి చివరి సాక్ష్యాన్ని కలిగి ఉన్నందుకు గర్వపడతాము. దేవుని అనర్హమైన దయ మనలో కలిగించిన కృతజ్ఞతా భావాన్ని మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరితో మనం ఆసక్తిగా పంచుకుంటాము. గంభీరమైన మతపరమైన సమావేశంలో, జాషువా అసెంబ్లీని ఉద్దేశించి, దేవుని పేరు మరియు అతని తరపున మాట్లాడాడు. అతని ఉపన్యాసంలో సిద్ధాంతం మరియు అప్లికేషన్ రెండూ ఉన్నాయి. సిద్ధాంతపరమైన అంశంలో దేవుడు తన ప్రజల కోసం మరియు వారి పూర్వీకుల కోసం చేసిన విశేషమైన పనుల యొక్క చారిత్రక వృత్తాంతాన్ని కలిగి ఉంది. ఈ చరిత్ర యొక్క అన్వయం ప్రజలు దేవునికి భయపడి మరియు సేవించమని, ఆయన అనుగ్రహానికి కృతజ్ఞతలు తెలుపుతూ మరియు వారి జీవితాల్లో దాని కొనసాగింపును కోరుకునే ఒక ఉపదేశంగా పనిచేసింది. (1-14)

దేవుని ప్రజల సేవ ఎల్లప్పుడూ ఇష్టపడే మరియు ప్రేమగల హృదయం నుండి ఉద్భవించాలి. ప్రేమ అనేది అన్ని ఆమోదయోగ్యమైన ఆరాధనలకు ఆధారమైన ప్రామాణికమైన మరియు నిజమైన సూత్రం. తండ్రి ఆత్మతో మరియు సత్యంతో తనను సంప్రదించే ఆరాధకులను కోరుకుంటాడు, కాని మనిషి యొక్క శరీరానికి సంబంధించిన మనస్సు, దేవునితో శత్రుత్వంతో, మళ్లీ జన్మించకుండా అలాంటి ఆధ్యాత్మిక ఆరాధనలో పాల్గొనదు. దురదృష్టవశాత్తూ, చాలా మంది తమ మతపరమైన విధులను కేవలం పనులుగా పరిగణిస్తూ కేవలం కదలికల ద్వారా వెళతారు. జాషువా వారికి ఒక ఎంపికను అందించాడు, ఉదాసీనతను సూచించలేదు, కానీ వారి ముందు విషయాన్ని స్పష్టంగా ఉంచాడు: "మీరు ఎవరికి సేవ చేస్తారో ఎంచుకోండి." అతను ఇతరుల ఎంపికలతో సంబంధం లేకుండా ప్రభువును సేవించాలని నిశ్చయించుకుంటాడు, స్వర్గానికి కట్టుబడి ఉన్నవారు ప్రబలమైన ప్రవాహానికి వ్యతిరేకంగా ఈదడానికి సిద్ధంగా ఉండాలని మరియు మెజారిటీని కాకుండా ఉత్తమమైన మార్గాన్ని అనుసరించాలని గుర్తించాడు. కుటుంబ జీవితంలో మతపరమైన విధులను నెరవేర్చడం అనేది ఏ స్థానంలో ఉన్నా ఎవరికైనా అవసరం. జాషువా యొక్క ఆదర్శప్రాయమైన ప్రభావంతో ప్రోత్సహించబడిన ఇశ్రాయేలీయులు ప్రభువును సేవించడానికి తమ సుముఖతను ప్రకటించారు: "మేము కూడా ప్రభువును సేవిస్తాము." గొప్ప వ్యక్తులు మతం పట్ల వారి అత్యుత్సాహ భక్తి ద్వారా చూపగల ముఖ్యమైన ప్రభావాన్ని ఇది వివరిస్తుంది. శాశ్వత సాక్ష్యంగా స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేయడం ద్వారా వారి నిబద్ధత గంభీరమైన ఒడంబడికగా మారుతుందని జాషువా నిర్ధారిస్తారు. వారి నుండి తన ఆఖరి సెలవు తీసుకుంటూ, వారు తమ నిబద్ధతను విస్మరించి నశించాలని ఎంచుకుంటే, బాధ్యత వారి భుజాలపైనే ఉంటుందని జాషువా హెచ్చరించాడు. దేవుని మందిరం, ప్రభువు బల్ల, మరియు వారి ప్రతిజ్ఞలను చూసిన గోడలు మరియు చెట్లు కూడా వారు తడబడితే వారికి వ్యతిరేకంగా సాక్ష్యమివ్వగలవు, వారు తమ హృదయాలలో భయాన్ని కలిగించడానికి, అతని మార్గం నుండి నిష్క్రమించకుండా నిరోధించడానికి దేవునిపై నమ్మకం ఉంచవచ్చు. దేవుడు మాత్రమే నిజమైన భక్తికి అవసరమైన దయను ఇస్తాడు, అయినప్పటికీ ఆయనను సేవించడానికి ఇతరులను ప్రేరేపించడానికి మన ప్రయత్నాలను ఆయన ఆశీర్వదిస్తాడు. ప్రేమతో మరియు సుముఖతతో ఆయన సేవలో నిమగ్నమవ్వడం ద్వారా, మనం పరిపూర్ణతను పొందగలము మరియు దేవుని పట్ల మన నిబద్ధతలో స్థిరంగా ఉండగలము. (15-28)

ఈజిప్టులో, జోసెఫ్ మరణించాడు, కానీ అతని మరణానికి ముందు, అతను తన ఎముకల గురించి ఒక ఆజ్ఞను జారీ చేశాడు. ఇజ్రాయెల్ వాగ్దానం చేసిన దేశంలో స్థిరపడే వరకు తన అవశేషాలు విశ్రాంతి తీసుకోకూడదని అతను కోరుకున్నాడు. యెహోషువ మరియు ప్రధాన యాజకుడైన ఎలియాజరు కూడా వారి అంత్యక్రియలను ముగించారు మరియు అంత్యక్రియలు చేయబడ్డారు. వీరు దేవుని చిత్తానుసారం తమ తరానికి నమ్మకంగా సేవ చేసిన విశేషమైన మరియు ఉపయోగకరమైన వ్యక్తులు. అయినప్పటికీ, అన్ని మానవుల వలె, వారు చివరికి నిద్రలోకి జారుకున్నారు మరియు క్షీణతను అనుభవించారు. పూర్తి విరుద్ధంగా, యేసు, తన భూసంబంధమైన మిషన్‌లో జాషువా మరియు జోసెఫ్ ఇద్దరినీ మించిపోయాడు, అసమానమైన సమర్థతతో తన ఉద్దేశాన్ని నెరవేర్చాడు. అతను మరణంపై విజయం సాధించాడు, సమాధి నుండి లేచాడు మరియు అవినీతికి తావు లేకుండా ఉన్నాడు. తన త్యాగం ద్వారా, యేసు తన ప్రజలను విమోచించాడు, ప్రపంచం యొక్క పునాది నుండి వారి కోసం సిద్ధం చేసిన రాజ్యం యొక్క వారసత్వాన్ని వారికి ఇచ్చాడు. యేసు కృప పట్ల ప్రశంసలతో నిండిన వారు తమ ప్రేమను మరియు కృతజ్ఞతను ఆనందంగా ప్రకటిస్తారు. అతను వారిని ఎలా ప్రేమిస్తున్నాడో వారు అంగీకరిస్తారు, తన స్వంత రక్తం ద్వారా పాపం నుండి వారిని శుద్ధి చేసి, దేవునికి మరియు అతని తండ్రికి వారిని రాజులుగా మరియు యాజకులుగా చేస్తారు. ఈ అసమానమైన ప్రేమ చర్య కోసం, వారు ఎప్పటికీ ఆయనకు కీర్తి మరియు ఆధిపత్యాన్ని అందిస్తారు. ఆమెన్. (29-33)



Shortcut Links
యెహోషువ - Joshua : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |