Ephesians - ఎఫెసీయులకు 5 | View All

1. కావున మీరు ప్రియులైన పిల్లలవలె దేవునిపోలి నడుచుకొనుడి.

మత్తయి 5:48. దేవుని పిల్లలు తమ తండ్రిలాగానే ప్రవర్తించాలి. “ప్రియమైన పిల్లలు”– 1 యోహాను 3:1.

2. క్రీస్తు మిమ్మును ప్రేమించి, పరిమళ వాసనగా ఉండుటకు మనకొరకు తన్నుతాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను; ఆలాగుననే మీరును ప్రేమగలిగి నడుచుకొనుడి.
నిర్గమకాండము 29:18, కీర్తనల గ్రంథము 40:6

“క్రీస్తు మనలను ప్రేమించి”– వ 25; యోహాను 13:1; యోహాను 15:9, యోహాను 15:12; రోమీయులకు 8:37; గలతియులకు 2:20. “పరిమళమైన...బలిగా”– మత్తయి 20:28; మత్తయి 26:28; యోహాను 1:29; రోమీయులకు 3:25; రోమీయులకు 5:8; 2 కోరింథీయులకు 5:14; హెబ్రీయులకు 9:14; హెబ్రీయులకు 10:10, హెబ్రీయులకు 10:14; 1 పేతురు 2:24; 1 పేతురు 3:18. పరిమళం అనే పదం క్రీస్తుకు సూచనగా ఉన్న పాత ఒడంబడిక అర్పణలను గుర్తుకు తెస్తున్నది (లేవీయకాండము 1:9, లేవీయకాండము 1:13, లేవీయకాండము 1:17 మొ।।). “ప్రేమభావం”– ఎఫెసీయులకు 3:19; ఎఫెసీయులకు 4:15; యోహాను 13:34; రోమీయులకు 12:10; గలతియులకు 5:6, గలతియులకు 5:13; 1 యోహాను 3:11, 1 యోహాను 3:16-18; 1 యోహాను 4:7-8.

3. మీలో జారత్వమే గాని, యే విధమైన అపవిత్రతయే గాని, లోభత్వమేగాని, వీటి పేరైనను ఎత్తకూడదు, ఇదే పరిశుద్ధులకు తగినది.

ఎఫెసీయులకు 4:1; 1 కోరింథీయులకు 6:13-18; 1 పేతురు 1:14-15; 1 యోహాను 2:6. “అత్యాశ”– వ 5; లూకా 12:15-21; 1 తిమోతికి 6:6-10; హెబ్రీయులకు 13:5; 2 పేతురు 1:4.

4. కృతజ్ఞతావచనమే మీరుచ్చరింపవలెను గాని మీరు బూతులైనను, పోకిరిమాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు; ఇవి మీకు తగవు.

ఎఫెసీయులకు 4:29; కొలొస్సయులకు 3:8. “కృతజ్ఞతలు”– వ 20; కొలొస్సయులకు 3:17; ఫిలిప్పీయులకు 4:6; 1 థెస్సలొనీకయులకు 5:18; హెబ్రీయులకు 13:15; కీర్తనల గ్రంథము 50:14; కీర్తనల గ్రంథము 113:1; లేవీయకాండము 7:12-13.

5. వ్యభిచారియైనను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడై యున్నలోభియైనను, క్రీస్తుయొక్కయు దేవునియొక్కయురాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయముగా తెలియును.

1 కోరింథీయులకు 6:9-11; గలతియులకు 5:21; హెబ్రీయులకు 10:26-27; 1 యోహాను 3:9-10. “విగ్రహ పూజకుడు”– అత్యాశపరుడు విగ్రహాలను పూజించేవారి వంటివాడే. ఎందుకంటే సరిగ్గా చూస్తూ దేనిపై అతనికి అత్యాశ ఉందో, దాన్ని అతడు పూజిస్తున్నాడన్నమాటే. అతని విగ్రహం అతని హృదయంలో ఉంది – యెహెఙ్కేలు 14:3-4. “రాజ్యం”– మత్తయి 4:17; రోమీయులకు 14:17; కొలొస్సయులకు 1:13 చూడండి.

6. వ్యర్థమైన మాటలవలన ఎవడును మిమ్మును మోసపరచ నియ్యకుడి; ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైనవారిమీదికి వచ్చును

“మోసగించకుండా”– 1 కోరింథీయులకు 6:9; గలతియులకు 6:7; 1 యోహాను 3:7-8. మనుషులు (కొందరు క్రైస్తవులు కూడా) తమ ఇష్టం వచ్చినట్టు పాపాలు చేస్తూ కూడా దేవుని రాజ్యంలో తమకు చోటుందని తమను తాము నమ్మించుకుంటారు, ఇతరులను నమ్మించేలా ప్రయత్నిస్తారు. అలాంటివారు చేసేది బహు నీచమైన వంచన, కేవలం వట్టి మాటలు. “దేవుని కోపం” గురించి సంఖ్యాకాండము 23:5; ద్వితీయోపదేశకాండము 4:25; కీర్తనల గ్రంథము 90:7-11; యోహాను 3:36; రోమీయులకు 1:18 మొ।। చూడండి.

7. గనుక మీరు అట్టివారితో పాలివారై యుండకుడి.

2 కోరింథీయులకు 6:14-18.

8. మీరు పూర్వమందు చీకటియై యుంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగైయున్నారు.

పాపులు కేవలం ఆధ్యాత్మిక అంధకారంలో ఉండడం మాత్రమే కాదు, వారే అంధకారం. అలాగే విశ్వాసులు వెలుగులో ఉండడం మాత్రమే కాదు, క్రీస్తులో వారే ఆ వెలుగు (మత్తయి 5:14-16). వారు ఏమిటో దాని ప్రకారం నడుచుకోవడం వారికి దక్కిన ఆధిక్యత, విధి. దేవుడు వెలుగు (1 యోహాను 1:5). అందువల్ల ఆయన పిల్లలు వెలుగు సంతానం, కేవలం శుద్ధుడూ పవిత్రుడూ అయినవాని సంతానం. అందువల్ల వారు కేవలం శుద్ధులుగా పవిత్రులుగా నడుచుకోవాలి.

10. గనుక ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు, వెలుగు సంబంధులవలె నడుచు కొనుడి

రోమీయులకు 12:2; 2 కోరింథీయులకు 5:9. యేసుప్రభువుకు ఇష్టమైనదేమిటో తెలుసుకుని వాటిని చేయడమే విశ్వాసికి జీవిత ఆశయం కావాలి.

11. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలి వారైయుండక వాటిని ఖండించుడి.

“చీకటి వ్యవహారాలు”– యోహాను 3:19-20; రోమీయులకు 13:12-14. విశ్వాసులు అలాంటి వాటిని బయట పెట్టవలసిన విధానం వాటి గురించి మాట్లాడ్డం ద్వారా కాదు (వ 12,13), “వెలుగు”గా ఉండడం ద్వారా, వెలుగు సంతానంగా జీవించడం ద్వారా (వ 8), దేవుని సత్యం పలకడం ద్వారా.

12. ఏలయనగా అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాటలాడుటయైనను అవమానకరమై యున్నది.
యెహెఙ్కేలు 20:41

ఎఫెసీయులకు 2:2; కొలొస్సయులకు 3:6; తీతుకు 1:16. మనుషులు దేవునికి అవిధేయులై ఆయన వెలుగుకు రాకపోవడం మూలంగా చీకటిలో ఉన్నారు (యోహాను 3:20).

13. సమస్తమును ఖండింపబడి వెలుగుచేత ప్రత్యక్షపరచబడును; ప్రత్యక్షపరచునది ఏదో అది వెలుగేగదా

14. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలోనుండి లెమ్ము, క్రీస్తు నీమీద ప్రకాశించునని ఆయన చెప్పు చున్నాడు.
యెషయా 52:1, యెషయా 60:1

ఇది పాత ఒడంబడిక గ్రంథంనుంచి ఎత్తి రాసిన వచనం కాదు గాని అందులోని ఏదైనా వచనం ఆధారంగా రాసినది కావచ్చు – యెషయా 60:1; మలాకీ 4:2. ఈ మాటలు ఏదైనా పురాతన క్రైస్తవ గీతంలోవి కావచ్చు. “మృతి చెందిన”– చీకటిలో, పాపంలో ఉన్నవారు ఆత్మ సంబంధంగా నిద్రలో ఉన్నవారు, చనిపోయినవారు (ఎఫెసీయులకు 2:1). తన ప్రజల ద్వారా క్రీస్తు వెలుగు లోకంలో ప్రకాశిస్తూ ఉంది. నిద్రలో, మరణంలో ఉన్నవారు లేచి క్రీస్తు చెంతకు రావాలి.

15. దినములు చెడ్డవి గనుక, మీరు సమయమును పోనియ్యక సద్వినియోగము చేసికొనుచు,

లోకంలో తన వెలుగు ప్రకాశించనిచ్చేందుకు అవకాశాలు వస్తాయి. మనం వాటిని చక్కగా వాడుకోవాలని పౌలు ఉద్దేశం. “చెడ్డవి”– గలతియులకు 1:4; ఫిలిప్పీయులకు 2:15; 2 తిమోతికి 3:1.

16. అజ్ఞానులవలె కాక, జ్ఞానులవలె నడుచుకొనునట్లు జాగ్రత్తగా చూచుకొనుడి.
ఆమోసు 5:13

“తెలివైన వారిలాగే”– కొలొస్సయులకు 4:5; మత్తయి 10:16. ఇలాంటి భ్రష్ట లోకంలో ఎలా జీవించాలో ఎరిగే జ్ఞానం విశ్వాసులకు ఉండాలి. అది మనకు అందుబాటులో ఉంది (యాకోబు 1:5-6). “నడుచుకోవడానికి”– మనుషులు పాపంలో నిద్రపోతూ మరణించిన స్థితిలో ఉండగా విశ్వాసులు తమ ద్వారా దేవుని వెలుగు వారి మీద ప్రకాశించేలా నడుచుకోవాలి.

17. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువుయొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి.

“గ్రహించుకోండి”– ఎఫెసీయులకు 1:18; ఎఫెసీయులకు 4:18; కొలొస్సయులకు 1:9; కొలొస్సయులకు 2:2; రోమీయులకు 12:1-2.

18. మరియు మద్యముతో మత్తులైయుండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు; అయితే ఆత్మ పూర్ణులైయుండుడి.
సామెతలు 23:31

“మత్తిల్లకండి”– రోమీయులకు 13:13; 1 కోరింథీయులకు 5:11; 1 కోరింథీయులకు 6:10; గలతియులకు 5:21; యెషయా 5:11, యెషయా 5:22; ఆదికాండము 9:21. “ఆత్మ”– ఎఫెసీయులకు 1:13-14; ఎఫెసీయులకు 2:18, ఎఫెసీయులకు 2:22; ఎఫెసీయులకు 3:16. ఆత్మతో నిండి ఉండడమే ప్రతి విశ్వాసి విషయంలోనూ దేవుని సంకల్పం. మన పట్ల ఆయన సంకల్పం కాని దేన్నీ చేయాలని గానీ కలిగి ఉండాలని గానీ ఆయన చెప్పడు. దేవుని ఆత్మతో నిండి ఉండడం ఎఫెసీయులకు 3:19 లో పౌలు విశ్వాసుల కోసం ప్రార్థించిన విషయం ఒకటే. ఇది దేవుని సంకల్పమే కాబట్టి మనలో ప్రతి ఒక్కరికీ ఈ ఆత్మ పూర్ణత కలగడం సాధ్యమని మనకు తెలుసు (1 యోహాను 5:14-15; లూకా 11:13). అపో. కార్యములు 1:5; అపో. కార్యములు 2:4, అపో. కార్యములు 2:39 నోట్స్ కూడా చూడండి. “నిండి ఉండండి” అంటే ఎప్పుడూ నిండుతూ ఉండండి, అదే స్థితిలో నిలిచి ఉండండి అని అర్థం. విశ్వాసులందరి సామాన్య స్థితి ఇదే అయి ఉండాలని దేవుని కోరిక. మనం క్రైస్తవ జీవితం గడపవలసిన విధమిదే. ఇలా కాకపోతే మనమెలా స్వార్థ త్యాగం చేసుకోగలం? జీవించవలసిన రీతిలో ఎలా జీవించగలం? క్రీస్తును సేవించవలసిన రీతిలో ఎలా సేవించగలం? పవిత్రాత్మతో ఎప్పుడూ నిండి ఉండడం అంటే మనం మట్టుకు దేవునికి అస్తమానం విధేయులమై లోబడి, ఆయన్ను నమ్మి జీవిస్తూ ఉండడం. “నిండి ఉండడం” అంటే ఏమిటి? మద్యం తాగిన మనిషి ఆ మద్యం అదుపులో, దాని ప్రభావం కింద వుంటాడు. దేవుని ఆత్మతో నిండిన వ్యక్తి ఆ ఆత్మ అదుపులో ఉంటాడు. అలాగని తన స్పృహ కోల్పోయి పూనకం వచ్చిన వాడిలా అయిపోతాడని కాదు (1 కోరింథీయులకు 14:32-33). అది ఒక వ్యక్తి ఇష్టపూర్వకంగా ప్రేమతో ఆత్మకు లోబడి ఉండడం, ఆయనతో ఆనందంగా సహవాసం చెయ్యడం.

19. ఒకనినొకడు కీర్తనల తోను సంగీతములతోను ఆత్మసంబంధమైన పాటలతోను హెచ్చరించుచు, మీ హృదయములలో ప్రభువునుగూర్చి పాడుచు కీర్తించుచు,
కీర్తనల గ్రంథము 33:2-3

దేవుని ఆత్మతో నిండి ఉన్నామనడానికి రుజువు ఏమిటి? ఇక్కడ పౌలు సూచనలు అద్భుతాల గురించి, లేక ఆధ్యాత్మిక సామర్థ్యాలు, ఆత్మ ప్రత్యక్షతల గురించి ఏమీ చెప్పడం లేదు. వీటిల్లో ఏ ఒక్కటీ కూడా విశ్వాసులందరికీ ఇవ్వబడదు. ఒకరికి ఒకటుంటే, మరొకరికి వేరొకటి ఉంటుంది (రోమీయులకు 12:4-8; 1 కోరింథీయులకు 12:7-11, 1 కోరింథీయులకు 12:28-30). ఏదో ఒకటి లేక ఎక్కువ ఆధ్యాత్మిక సామర్థ్యాలు ఉండి కూడా పవిత్రాత్మతో నిండిన స్థితిలో ఉండకపోవడం సాధ్యమే (1 కోరింథీయులకు 1:7; 1 కోరింథీయులకు 3:1, 1 కోరింథీయులకు 3:3). అలానే ఒకరు పవిత్రాత్మతో నిండి ఉండి కూడా, కొందరు క్రైస్తవులు ఎక్కువగా ప్రాముఖ్యత ఇచ్చే సామర్థ్యం వారిలో లేకపోవడం కూడా సాధ్యమే (అపో. కార్యములు 2:4, అపో. కార్యములు 2:11; 1 కోరింథీయులకు 12:10, 1 కోరింథీయులకు 12:28-30 నోట్స్‌). పౌలు ఇక్కడ ఇతర సంగతులను చెప్తున్నాడు. ఇవి దేవుని ఆత్మతో నిండి ఉండడానికి గుర్తులు – ఇతర విశ్వాసులతో ఆనందకరమైన సహవాసం, దేవునికి కృతజ్ఞతలు చెప్తూ ఉండడం, ఒకరికొకరు లోబడి ఉండడం. ఆత్మఫలం (గలతియులకు 5:22) అస్తమానం ఆత్మతో నిండి ఉండేవారిలో ఏపుగా పెరుగుతుంది. ఆధ్యాత్మికమైన సంగీతం, పాటలు పవిత్రాత్మ నిండిన హృదయాల్లోనుంచి సహజంగా పెల్లుబుకుతాయి.

20. మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమునుగూర్చి తండ్రియైన దేవునికి ఎల్లప్పుడును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు,

“అన్ని పరిస్థితుల్లో”, “ఎప్పుడూ” అనే మాటలను గమనించండి. 2 కోరింథీయులకు 4:15; కొలొస్సయులకు 2:7; కొలొస్సయులకు 4:2; 1 థెస్సలొనీకయులకు 5:18; 1 తిమోతికి 2:1; హెబ్రీయులకు 13:15; లేవీయకాండము 7:12-13; కీర్తనల గ్రంథము 7:17; మొ।। చూడండి. రోమ్ 8:28 కారణంగా విశ్వాసులు ఇలా చేయగలరు – అయితే దీనికి వారు పవిత్రాత్మలో నిండి ఉండాలి.

21. క్రీస్తునందలి భయముతో ఒకనికొకడు లోబడియుండుడి.

“భయభక్తులు”– ఆదికాండము 20:11; కీర్తనల గ్రంథము 34:11-14; కీర్తనల గ్రంథము 111:10; సామెతలు 1:7 నోట్స్ చూడండి. “లోబడి”– వ 22,24; ఎఫెసీయులకు 6:1, ఎఫెసీయులకు 6:5; 1 కోరింథీయులకు 16:16; హెబ్రీయులకు 13:17; 1 పేతురు 5:5. లోబడి ఉండడ మంటే విధేయత. స్వంత ఇష్టం నెరవేర్చుకోవడం, స్వార్థాన్ని హెచ్చించుకోవడం, గర్వంతో కూడిన స్వేచ్ఛ వీటన్నిటికీ ఇది విరుద్ధం.

22. స్త్రీలారా, ప్రభువునకువలె మీ సొంతపురుషులకు లోబడియుండుడి.
ఆదికాండము 3:16

“ప్రభువుకు...లోబడినట్టే”– అంటే భార్యలు క్రీస్తును ఎంచినట్టే తమ భర్తలను ఎంచాలని కాదు. క్రీస్తు పట్ల తమ బాధ్యతగా భర్తలకు లోబడాలని దీని అర్థం. కొలొస్సయులకు 3:18 పోల్చి చూడండి. 1 తిమోతికి 2:11-13; 1 పేతురు 3:1-2, 1 పేతురు 3:5-6 కూడా చూడండి.

23. క్రీస్తు సంఘమునకు శిరస్సై యున్న లాగున పురుషుడు భార్యకు శిరస్సై యున్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడైయున్నాడు.

“శరీరానికి”– వ 30; ఎఫెసీయులకు 1:22-23. “రక్షకుడు”– క్రీస్తే నిజ సంఘాన్ని ప్రమాదాలనుంచి విడిపించేవాడు, కాపాడేవాడు. “శిరస్సు”– అంటే స్త్రీలు పురుషులకన్నా తక్కువ అని కాదు. దేవుడు తన మహా జ్ఞానం చొప్పున కుటుంబంలోను, సమాజంలోను ఈ క్రమాన్ని ఏర్పరిచాడు. విశ్వాసులు ఈ క్రమాన్ని అనుసరించాలని కోరుతున్నాడు. 1 కోరింథీయులకు 11:3-16 నోట్స్.

24. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలుకూడ ప్రతి విషయములోను తమ పురుషులకు లోబడవలెను.

“అన్ని విషయాలలో”– భార్యాభర్తలిద్దరూ విశ్వాసులై, ఇద్దరూ ప్రభువుకు లోబడి ఉండే స్థితిని గురించి పౌలు మాట్లాడుతున్నాడు. ఒక భర్త తన భార్యను దేవుని వాక్కుకు లేక ఆమె అంతర్వాణికి వ్యతిరేకంగా ఏమైనా చేయమంటే ఆమె చెయ్యకూడదు. పాపం చెయ్యవలసి వచ్చే పరిస్థితుల్లో కూడా భర్తకు లోబడాలని దేవుడు చెప్పలేదు. దేవుని వాక్కులో విధించిన సూత్రాలు చూడండి – అపో. కార్యములు 4:19; అపో. కార్యములు 5:29; రోమీయులకు 1423:1; మొ।।.

25. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలె క్రీస్తుకూడ సంఘమును ప్రేమించి,

“ప్రేమించినట్టే”– యోహాను 13:24. “ప్రేమిస్తూ”– భార్యలకు వారి ధర్మం ఉంది – లోబడడం. భర్తలకూ వారు చేయవలసినది ఉంది – ప్రేమించడం (అంటే భార్యలు తమ భర్తల్ని ప్రేమించవద్దని కాదు). భర్తలు తమ భార్యలను చూచుకునే విధానాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రేమించాలి అంటున్నాడు పౌలు. ఇది కేవలం వలపు, మోహం కాదు. ఇక్కడున్న గ్రీక్ పదం స్వార్థం లేని ప్రేమను సూచిస్తున్నది. 1 కోరింథీయులకు 13:1 నోట్ చూడండి.

26. అది కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక, పరిశుద్ధమైనదిగాను,

సంఘం కోసం క్రీస్తు ఎందుకు చనిపోయాడో చూడండి. ఎఫెసీయులకు 1:4; తీతుకు 2:14; 1 కోరింథీయులకు 6:11 పోల్చి చూడండి. ఆయన మచ్చలేని పవిత్రత గలవాడు. తన సంఘం కూడా మచ్చలేని పవిత్రతలోకి వచ్చేవరకు తృప్తి చెందడు. “వాక్కు అనే నీళ్ళతో”– పౌలు ఇక్కడ బాప్తిసం గురించి మాట్లాడుతున్నాడని కొందరు పండితులు బల్ల గుద్ది చెప్పారు. ఇది అసంభవం. పౌలు దేవుని వాక్కు గురించి మాట్లాడుతున్నాడు. దేవుని వాక్కుతో, దేవుని ఆత్మతో మన అంతరంగాలు శుద్ధి కావడం ముఖ్యమైన సంగతి అనీ, శుద్ధి అయినట్టు బాహ్య చిహ్నమైన బాప్తిసం ముఖ్యం కాదనీ మనందరం గుర్తుపెట్టుకోవాలి. శుద్ధిచేయడం, కడగడం గురించి కీర్తనల గ్రంథము 51:2, కీర్తనల గ్రంథము 51:7; యెహెఙ్కేలు 36:25-26; యెహెఙ్కేలు 37:23; యోహాను 13:5-10; యోహాను 15:3; తీతుకు 3:5 (యోహాను 3:3-8); హెబ్రీయులకు 9:14; 1 యోహాను 1:7, 1 యోహాను 1:9 చూడండి. “అర్పించుకున్నాడు”– వ 2; గలతియులకు 2:20; రోమీయులకు 5:8; యోహాను 10:11, యోహాను 10:15. క్రీస్తు రెండో రాకడ సమయంలో ఆయన సంఘం ఆరోహణమై ఆకాశంలో క్రీస్తును కలుసుకునే సమయంలో వ 27 నెరవేరుతుంది (1 కోరింథీయులకు 15:50-57).

27. నిర్దోష మైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తనయెదుట దానిని నిలువబెట్టుకొనవలెనని, వాక్యముతో ఉదకస్నానముచేత దానిని పవిత్రపరచి, పరిశుద్ధపరచుటకై దానికొరకు తన్ను తాను అప్పగించుకొనెను.

28. అటువలెనే పురుషులుకూడ తమ సొంతశరీరములనువలె తమ భార్యలను ప్రేమింప బద్ధులైయున్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు.

భార్య, భర్త ఒకే శరీరం అని పౌలు భావం (వ 31). భార్య తన స్వంత శరీరం వంటిదే గనుక తన శరీరం లాగానే భర్త ఆమెను చూచుకోవాలి.

29. తన శరీరమును ద్వేషించినవాడెవడును లేడు గాని ప్రతివాడును దానిని పోషించి సంర క్షించుకొనును.

“పోషించి సంరక్షించుకొంటాడు”– అంటే ఆమెపట్ల ప్రవర్తించే విషయంలో చూపవలసిన ప్రేమ (వ 25). క్రియల్లో బయటపడని ప్రేమ క్రైస్తవ ప్రేమ కాదు, క్రీస్తు ప్రేమ కాదు – 1 యోహాను 3:18. క్రీస్తు ప్రేమసందేశాలు పంపుతూ పరలోకంలో హాయిగా కూర్చోలేదు. ఈ లోకానికి వచ్చి తనను మనకోసం అర్పించుకున్నాడు. ఇప్పుడు తన సంఘాన్ని సంరక్షించి పోషిస్తున్నాడు.

30. మనము క్రీస్తు శరీరమునకు అవయవములమై యున్నాము గనుక అలాగే క్రీస్తుకూడ సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు.

ఎఫెసీయులకు 1:23; ఎఫెసీయులకు 2:16; ఎఫెసీయులకు 4:4, ఎఫెసీయులకు 4:12, ఎఫెసీయులకు 4:16; రోమీయులకు 12:4-5; 1 కోరింథీయులకు 12:12-13, 1 కోరింథీయులకు 12:27.

31. ఈ హేతువుచేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును; వారిద్దరును ఏకశరీరమగుదురు.
ఆదికాండము 2:24

ఆదికాండము 2:24.

32. ఈ మర్మము గొప్పది; అయితే నేను క్రీస్తునుగూర్చియు సంఘమునుగూర్చియు చెప్పుచున్నాను.

ఆధ్యాత్మికంగా క్రీస్తుతో ఐక్యత కావడానికి వ్యక్తులు తమ తల్లిదండ్రుల్ని, తోబుట్టువుల్ని, తమకున్నదానంతటినీ, తమను కూడా కాదని చెప్పి ఆయనదగ్గరికి వస్తారు. వారు ఆయనతో ఒకే ఆత్మ అవుతారు (1 కోరింథీయులకు 6:17; మత్తయి 4:18-22; మత్తయి 10:37-39; లూకా 14:26-27, లూకా 14:33). భర్తను క్రీస్తుకు సాదృశ్యంగా లేక చిహ్నంగా, అతని భార్యను సంఘానికి చిహ్నంగా ఎంచి పౌలు మాట్లాడుతున్నాడు. 2 కోరింథీయులకు 11:2; యోహాను 3:28-29; ప్రకటన గ్రంథం 19:7 పోల్చి చూడండి.

33. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తననువలె తన భార్యను ప్రేమింప వలెను, భార్యయైతే తన భర్తయందు భయము కలిగి యుండునట్లు చూచుకొనవలెను.

భర్త తన భార్య గౌరవాన్ని చూరగొనే రీతిలో మెలగాలనీ, భార్య తన భర్త ప్రేమకు అర్హురాలుగా నడుచుకోవాలనీ వేరే చెప్పాలా.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Ephesians - ఎఫెసీయులకు 5 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

సోదర ప్రేమకు ప్రబోధం. (1,2) 
దేవుడు, క్రీస్తు నామంలో, మీకు క్షమాపణను అందించినందున, ఆయనను అనుకరించడానికి మరియు అతని అడుగుజాడల్లో అనుసరించడానికి కృషి చేయండి. అతని ప్రేమ మరియు దయను ప్రతిబింబించండి, వారి స్వర్గపు తండ్రిచే గౌరవించబడిన వారి ప్రవర్తనకు తగినట్లుగా మిమ్మల్ని మీరు సర్దుబాటు చేసుకోండి. క్రీస్తు త్యాగం అతని విజయవంతమైన ప్రేమను ప్రతిబింబిస్తుంది మరియు దాని లోతైన ప్రాముఖ్యతను ఆలోచించడం మనపై ఆవశ్యకం.

అనేక పాపాలకు వ్యతిరేకంగా హెచ్చరికలు. (3-14) 
అపవిత్రమైన కోరికలను తొలగించండి; వాటిని నిర్మూలించాలి. ఈ పాపాలకు భయపడండి మరియు అసహ్యించుకోండి. ఈ సలహా కేవలం కఠోరమైన పాపపు చర్యలకు వ్యతిరేకంగా హెచ్చరించడం మాత్రమే కాదు, కొందరు చిన్నవిషయం చేసే ప్రవర్తనల గురించి కూడా హెచ్చరిస్తుంది. అయితే, ఈ చర్యలు లాభదాయకంగా ఉండటమే కాకుండా వాటి గురించి విన్నవారిని కలుషితం చేస్తాయి మరియు విషపూరితం చేస్తాయి. క్రైస్తవులుగా, మన ఆనందం దేవుణ్ణి మహిమపరిచే మార్గాల్లో వ్యక్తపరచాలి.
అత్యాశగల వ్యక్తి తప్పనిసరిగా డబ్బును ఆరాధిస్తాడు, దేవునికి బదులుగా ప్రాపంచిక ఆస్తులపై ఆశ, విశ్వాసం మరియు ఆనందాన్ని ఉంచుతాడు. దేహ భోగాలలో మునిగితేలేవారు లేదా ప్రపంచం పట్ల ప్రేమను కలిగి ఉన్నవారు కృపా రాజ్యానికి చెందరు మరియు కీర్తి రాజ్యాన్ని పొందలేరు. అత్యంత దుర్మార్గులు పశ్చాత్తాపపడి, సువార్తను స్వీకరించినప్పుడు, వారు విధేయులైన పిల్లలుగా రూపాంతరం చెందుతారు, ఇకపై దేవుని కోపానికి లోబడి ఉండరు. దేవుని ఆగ్రహానికి గురిచేసే విషయాన్ని మనం తేలికగా పరిగణించాలా?
పాపులు, చీకటిలో దొర్లినట్లుగా, తెలియని దిశలో వెళతారు మరియు వారు అర్థం చేసుకోలేని పనులలో నిమగ్నమై ఉంటారు. అయినప్పటికీ, దేవుని దయ చాలా మంది ఆత్మలలో లోతైన మార్పును తెస్తుంది. జ్ఞానం మరియు పవిత్రతతో కూడిన కాంతి పిల్లలుగా నడవండి. ఏదైనా క్లెయిమ్ చేయబడిన ప్రయోజనాలు ఉన్నప్పటికీ, ఈ చీకటి పనులు ఉత్పాదకత లేనివి మరియు చివరికి పశ్చాత్తాపం చెందని పాపుల నాశనానికి దారితీస్తాయి.
ఇతరుల పాపాలకు మద్దతు ఇవ్వడానికి లేదా పాల్గొనడానికి అనేక మార్గాలు ఉన్నాయి: ప్రశంసలు, సలహాలు, సమ్మతి లేదా దాచడం ద్వారా. మనం ఇతరుల పాపాలలో పాలుపంచుకుంటే, వాటి పర్యవసానాల్లో మనం పాలుపంచుకోవాలని ఎదురుచూడాలి. ఇతరుల పాపాలను ఖండించడంలో విఫలమవడం సంక్లిష్టతను సూచిస్తుంది. చాలా మంది దుర్మార్గులు సిగ్గుపడకుండా చేసే చర్యల గురించి చర్చించడం వల్ల సద్గురువు సిగ్గుపడతాడు. పాపం పాపమని మరియు కొంతవరకు అవమానకరమని గుర్తించడమే కాకుండా అది దేవుని పవిత్ర చట్టాన్ని ఉల్లంఘించినట్లు కూడా మనం గుర్తించాలి. ప్రవక్తలు మరియు అపొస్తలుల ఉదాహరణలను అనుసరించి, పాపంలో మునిగిపోయిన వారిని మేల్కొలపడానికి మరియు లేవమని మనం పిలవాలి, క్రీస్తు వారి జీవితాలను ప్రకాశవంతం చేయడానికి అనుమతిస్తుంది.

విరుద్ధమైన ప్రవర్తనకు మరియు సంబంధిత విధులకు ఆదేశాలు. (15-21) 
పాపానికి వ్యతిరేకంగా మరొక ప్రభావవంతమైన విరుగుడు అప్రమత్తత లేదా జాగ్రత్త, లేకపోతే హృదయం మరియు ప్రవర్తన యొక్క స్వచ్ఛతను కాపాడుకోవడం అసాధ్యం. సమయం అనేది దేవుడు మనకు ప్రసాదించిన విలువైన ప్రతిభ, మరియు అతని ఉద్దేశ్యానికి అనుగుణంగా ఉపయోగించనప్పుడు దాని విలువ వృధా చేయబడుతుంది మరియు కోల్పోతుంది. మనం గతంలో సమయాన్ని వృధా చేస్తే, భవిష్యత్తు కోసం మన ప్రయత్నాలను రెట్టింపు చేయాలి. చాలా మంది తమ వద్ద ఉన్న సమయం యొక్క ప్రాముఖ్యతను గ్రహించడంలో విఫలమయ్యారు, తమ మరణశయ్యపై ఉన్న వేలాది మంది ప్రపంచమంతటి ఖర్చుతో ఆత్రంగా విమోచించుకునే వస్తువు. దురదృష్టవశాత్తు, ప్రజలు తరచుగా పనికిమాలిన పనుల కోసం ప్రతిరోజూ దానిని త్యాగం చేస్తారు. సవాలుతో కూడిన సమయాల గురించి ఫిర్యాదు చేయడానికి బదులుగా, సమయాన్ని తెలివిగా రీడీమ్ చేసుకోవడానికి అలాంటి పరిస్థితులు వారిని పురికొల్పితే అది ప్రయోజనకరంగా ఉంటుంది.
తెలివితక్కువగా ప్రవర్తించవద్దు. మన బాధ్యతల గురించి తెలియకపోవడం మరియు మన ఆత్మలను నిర్లక్ష్యం చేయడం ద్వారా గొప్ప మూర్ఖత్వం ప్రదర్శించబడుతుంది. మద్యపానం అనేది ఎప్పుడూ ఒంటరిగా నిలబడని పాపం; ఇది వ్యక్తులను ఇతర దుర్గుణాలలోకి లాగుతుంది మరియు దేవునికి చాలా అసహ్యకరమైనది. తాగుబోతు తన కుటుంబానికి మరియు ప్రపంచానికి నిరుత్సాహపరిచే దృశ్యాన్ని అందజేస్తాడు, సాధారణం కంటే దారుణంగా మరియు వినాశనం వైపు త్వరపడిపోతున్న పాపిని ప్రదర్శిస్తాడు. బాధ లేదా అలసట సమయంలో, స్ట్రాంగ్ డ్రింక్‌లో సాంత్వన పొందడం తెలివితక్కువది, ఎందుకంటే అది అసహ్యకరమైనది, హానికరమైనది మరియు బాధలను మాత్రమే తీవ్రతరం చేస్తుంది. బదులుగా, తీవ్రమైన ప్రార్థన ద్వారా, మనం ఆత్మతో నింపబడాలని కోరుకుంటాము మరియు మన దయగల ఆదరణకర్తను బాధపెట్టే దేనినైనా నివారించండి.
దేవుని ప్రజలందరికీ ఆనందించడానికి కారణం ఉంది. మనం ఎల్లవేళలా పాడుతూ ఉండకపోయినా, స్థిరంగా కృతజ్ఞతలు తెలియజేయాలి; ఈ కర్తవ్యం పట్ల మన వైఖరి ఎప్పటికీ తడబడకూడదు, మన జీవితమంతా దాని కోసం సమృద్ధిగా ఉన్న సామగ్రిని అందించడం. మేము వారి ప్రేమపూర్వక ఉద్దేశాన్ని మరియు సానుకూల ఫలితాన్ని గుర్తించినందున, కష్టాలు మరియు బాధలలో మరియు అన్ని విషయాలలో కూడా ఇది నిజం. దేవుడు విశ్వాసులను తనకు వ్యతిరేకంగా అతిక్రమించకుండా సంరక్షిస్తాడు మరియు అతని ఆజ్ఞల ప్రకారం పరస్పరం సమర్పణను ప్రోత్సహిస్తాడు, అతని మహిమను ప్రచారం చేస్తాడు మరియు ఒకరికొకరు మన బాధ్యతలను నెరవేర్చాడు.

భార్యలు మరియు భర్తల విధులు క్రీస్తు మరియు చర్చి మధ్య ఉన్న ఆధ్యాత్మిక సంబంధం ద్వారా అమలు చేయబడతాయి. (22-33)
భార్యలు తమ భర్తల పట్ల నిజమైన ప్రేమతో నడిచే గౌరవం మరియు విధేయత రెండింటినీ ఆవరించి, ప్రభువులో తమ భర్తలకు విధేయత చూపాల్సిన బాధ్యత ఉంది. మరోవైపు, భర్తలు తమ భార్యలను ప్రేమించే పనిలో ఉన్నారు. చర్చి పట్ల క్రీస్తు ప్రేమ ఒక ఉదాహరణగా పనిచేస్తుంది-ఆమె లోపాలు ఉన్నప్పటికీ నిజాయితీగా, స్వచ్ఛంగా మరియు అచంచలంగా ఉంటుంది. క్రీస్తు యొక్క ఆత్మబలిదానం ప్రస్తుత కాలంలో చర్చిని పవిత్రం చేయడం మరియు భవిష్యత్తులో దానిని మహిమపరచడం, సభ్యులందరికీ పవిత్రత యొక్క పునాదిని అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. బాప్టిజం నీటి ద్వారా సూచించబడిన పవిత్రాత్మ యొక్క ప్రభావాల ద్వారా, విశ్వాసులు పాపం యొక్క అపరాధం, కలుషితం మరియు ఆధిపత్యం నుండి విముక్తి పొందుతారు.
చర్చి మరియు దాని సభ్యులు కీర్తిని చేరుకునే వరకు పరిపూర్ణతను సాధించలేకపోవచ్చు, ప్రస్తుతం పవిత్రం చేయబడిన వారు మాత్రమే భవిష్యత్తులో మహిమను అనుభవిస్తారు. అపొస్తలుడు ఆడమ్ మాటల ప్రస్తావన అక్షరార్థంగా వివాహానికి సంబంధించినది కానీ క్రీస్తు మరియు అతని చర్చి మధ్య ఐక్యతకు సంబంధించిన దాగి ఉన్న అర్థాన్ని కూడా కలిగి ఉంది-ఇది ముఖ్యమైన సారూప్యతను కలిగి ఉంటుంది. మానవ స్వభావం యొక్క ప్రస్తుత స్థితిలో, అనివార్యంగా రెండు వైపులా లోపాలు మరియు అసంపూర్ణతలు ఉంటాయి, కానీ ఇవి ప్రాథమిక సంబంధాన్ని మార్చకూడదు.
ఐక్యత మరియు ప్రేమ వివాహం యొక్క అన్ని బాధ్యతలను కలిగి ఉంటుంది. క్రీస్తు యొక్క దయగల ప్రేమలో మనం ఆశ్చర్యపడి ఆనందిస్తున్నప్పుడు, భార్యాభర్తలు తమ పరస్పర బాధ్యతల కోసం పాఠాలు నేర్చుకుందాం. ఈ అవగాహన చెత్త చెడులను నిరోధించడానికి మరియు అనేక బాధాకరమైన పరిణామాలను నివారించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.



Shortcut Links
ఎఫెసీయులకు - Ephesians : 1 | 2 | 3 | 4 | 5 | 6 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |