Galatians - గలతీయులకు 5 | View All

1. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి, క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసియున్నాడు. కాబట్టి, మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమను కాడిక్రింద చిక్కు కొనకుడి.

పాపవిముక్తి సాధించే మార్గంగా స్వప్రయత్నాలు చేయాలనీ, ఆజ్ఞలు, నిబంధనలు, కర్మకాండలు, ఆచారాలు పాటించాలనీ నేర్పించే ఉపదేశమంతా బానిసత్వం కాడి వంటిది (గలతియులకు 4:3-9). ముఖ్యంగా పౌలు చెప్తున్నది మోషే ధర్మశాస్త్రాన్ని గురించి (అపో. కార్యములు 15:10-11 పోల్చి చూడండి). అలాంటి కాడినుంచి క్రీస్తు తన విశ్వాసులను విడుదల చేశాడు. అంటే మత సంబంధమైన అన్ని దాస్యాలనుంచీ – అది యూద మతమైనా కానివ్వండి, మరి ఏ మతమైనా కానివ్వండి, లేక భ్రష్టమైపోయిన ఏదో రకమైన క్రైస్తవ్యం కానివ్వండి – దాని నుంచి ఆయన మనకు విడుదల ఇచ్చాడు. విడుదల అంటే నూటికి నూరు శాతం విడుదల. క్రీస్తులో విశ్వాసులు తమ విడుదలను, స్వేచ్ఛను గుర్తించాలి. దాని విలువ గ్రహించాలి. దాన్ని వదులుకోకూడదు. వారు క్రీస్తుతోపాటు ఆయన కాడిక్రింద ఉన్నారు (మత్తయి 11:28-30). పాపవిముక్తి విషయంలో వారికి అవసరమైన కాడి ఇదొక్కటే. ఈ కాడి స్వతంత్రతను ఇస్తుంది.

2. చూడుడి; మీరు సున్నతి పొందినయెడల క్రీస్తువలన మీకు ప్రయోజనమేమియు కలుగదని పౌలను నేను మీతో చెప్పుచున్నాను.

ధర్మశాస్త్రం, కృప అనే రెండు మార్గాలనూ కలపడం అసాధ్యమని ఇక్కడ పౌలు అతి స్పష్టమైన మాటల్లో తెలియజేస్తున్నాడు. మనుషులు దాన్ని గానీ దీన్ని గానీ కోరుకోవాలి. రెండూ కావాలంటే కుదరదు. దేవుని కృప, తమ సొంత ప్రయత్నాలూ రెండింటినీ కలిపి ఉపయోగించి మనుషులు పాపవిముక్తి పొందలేరు. ఇటు నమ్మకం, అటు ఆజ్ఞలు, ఆచారాలు, ధర్మశాస్త్రం రెండూ కలిపి వారిని రక్షించవు. “నేను – పౌలునే”– క్రీస్తురాయబారిగా (గలతియులకు 1:1), నేరుగా క్రీస్తునుంచే శుభవార్తను పొందినవాడుగా (గలతియులకు 1:12) సంపూర్ణమైన అధికారంతో పౌలు మాట్లాడుతున్నాడు. “సున్నతి”– ఆదికాండము 17:11-14; లేవీయకాండము 12:3. శారీరకంగా సున్నతి చేయడంలో ఏమీ లేదు. వారున్న పరిస్థితి గురించి పౌలు మాట్లాడుతున్నాడు. దుర్బోధకుల మాట విని గలతీయవారు సున్నతి అనే మతాచారాన్ని ఆచరించి అలా మోషే ధర్మశాస్త్రం కిందికి వెళ్ళితే, కొత్త ఒడంబడిక వల్ల ఉన్న ప్రయోజనాలు వారికి ఉండవు. క్రీస్తునో, మోషే ధర్మశాస్త్రాన్నో, ఏదో ఒక్కదాన్నే పాపవిముక్తికి మార్గంగా ఎన్నుకోవాలి.

3. ధర్మశాస్త్రము యావత్తు ఆచరింప బద్ధుడై యున్నాడని సున్నతిపొందిన ప్రతి మను ష్యునికి నేను మరల దృఢముగ చెప్పుచున్నాను.

అలాంటి సందర్భంలో సున్నతి సంస్కారం వారిని యూద మతం పుచ్చుకొన్నవారుగా చేస్తుందనీ, అందువల్ల వారు మోషే ధర్మశాస్త్రమంతటినీ పాటించవలసిన అవసరం ఏర్పడుతుందనీ అతని ఉద్దేశం. ఇంతకుముందే చెప్పినట్టు దీనివల్ల శాపమే గాని దీవెన కలగదు (గలతియులకు 3:10-12).

4. మీలో ధర్మశాస్త్రమువలన నీతిమంతులని తీర్చబడువారెవరో వారు క్రీస్తులోనుండి బొత్తిగా వేరుచేయబడియున్నారు, కృప లోనుండి తొలగిపోయి యున్నారు.

“కృప మార్గం నుంచి పతనమయ్యారు”– విశ్వాసులు ఇలా చేస్తారని పౌలు అనడం లేదు. నిజానికి అంత బలహీనులైన గలతీయ క్రైస్తవులు సైతం అలా చెయ్యరని పౌలుకు నమ్మకం ఉంది (వ 10). కానీ ఈ సూత్రాన్ని పౌలు నొక్కి చెప్తున్నాడు: కృప, ధర్మశాస్త్రం కలవవు. విశ్వాస మార్గం, స్వప్రయత్న మార్గం మధ్య ఎలాంటి పోలికా లేదు. ధర్మశాస్త్రాన్ని ఆశ్రయించి, కట్టడులు, చట్టాలు, ఆచారాలపై ఆధారపడడమంటే కృపమార్గాన్ని విడిచిపెట్టడమే. పౌలు ఇక్కడ (మరెక్కడా కూడా) విశ్వాసులు పాపంలో పడిపోవడం మూలాన తమ పాపవిముక్తిని పోగొట్టుకుంటారని చెప్పలేదు (రోమీయులకు 5:9-10; రోమీయులకు 8:29-39; 1 యోహాను 1:9; 1 యోహాను 2:1; మొ।। పోల్చి చూడండి). కృప మార్గం నుంచి తొలగిపోవడమంటే మనందరికీ ఎదురయ్యే సాధారణ దుష్ప్రేరణలకు లొంగిపోవడమని అతని అర్థం కాదు. అది మనుషులు దేవుని కృపమూలంగా మాత్రమే పాపవిముక్తి పొందుతారన్న ఉపదేశం నుంచి తొలగిపోవడమని అతని భావం. ఇలా చేసిన వారు తమలో క్రీస్తు లేడని కనపరచుకుంటున్నాడన్న మాట. నిజంగా వారిలో క్రీస్తు ఉంటే వారు అలా చెయ్యరని చెప్పుకోవచ్చు (యోహాను 10:27; యోహాను 17:11-12).

5. ఏలయనగా, మనము విశ్వాసముగలవారమై నీతి కలుగునను నిరీక్షణ సఫలమగునని ఆత్మద్వారా ఎదురుచూచుచున్నాము.

“మనం”– ధర్మశాస్త్రం, స్వప్రయత్న మార్గాలను విడిచిపెట్టినవారం. క్రీస్తు నిజ విశ్వాసులం అయిన మనం. ధర్మశాస్త్రం దాస్యాన్ని, మరణాన్ని తెస్తుంది. నమ్మకమైతే దేవుని వాగ్దానాల అంతిమ నెరవేర్పు కోసం ఆసక్తితో ఎదురు చూచే ఆశాభావాన్ని కలిగిస్తుంది (గలతియులకు 3:18, గలతియులకు 3:29). రోమీయులకు 8:23-25 పోల్చి చూడండి. “న్యాయం”– దేవుడు ఇప్పటికే విశ్వాసిని నిర్దోషిగా తీర్చాడు (గలతియులకు 2:16; రోమీయులకు 3:21-24; రోమీయులకు 5:1). అయితే ఇక్కడ న్యాయం అంటే అర్థం అది కాదు. అన్ని విషయాల్లోనూ మనల్ని లోపం లేని న్యాయవంతులుగా చెయ్యడమన్నమాట (రోమీయులకు 8:29; 1 యోహాను 3:2). ఇది రాబోయే కాలంలో నెరవేరుతుంది. ఇది దేవుని ఆత్మ మనలో కలిగించిన దివ్యమైన ఆశాభావం.

6. యేసుక్రీస్తునందుండువారికి సున్నతిపొందుటయందేమియు లేదు, పొందకపోవుటయందేమియు లేదు గాని ప్రేమవలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగును.

గలతియులకు 6:15; 1 కోరింథీయులకు 7:19; రోమీయులకు 2:28-29; రోమీయులకు 4:9-12. బహిరంగంగా కనబడే ఏ ఆచారాన్ని తీసుకున్నా ఇంతే. ఒక మనిషిని దేవునికి అంగీకారంగా చేసే ఆచారమేదీ లేదు. దేవుడు నమ్మకం మూలంగా మాత్రమే మనుషులను నిర్దోషులుగా తీరుస్తాడు. ఆ విధంగా పాపవిముక్తి పొందిన తరువాత వారు నమ్మకం వల్ల నడుచుకొంటూ, ఒకరినొకరు ప్రేమించుకోవాలన్న క్రీస్తు ఆజ్ఞను అనుసరించాలి (యోహాను 13:34; యోహాను 15:12). క్రీస్తులో నమ్మకముంచక, ఆయన్ను ప్రేమించక ఉంటే ఎన్ని నియమాలు, ఎన్ని ఆచారాలు పాటిస్తే మాత్రం లాభం ఏముంది? ప్రేమ కలగడానికి దారితీసే విశ్వాసం అనేక ప్రాముఖ్య విషయాలలో ఒకటి మాత్రమే కాదు. అదే ప్రాముఖ్యమైనది.

7. మీరు బాగుగా పరుగెత్తుచుంటిరి; సత్యమునకు విధే యులు కాకుండ మిమ్మును ఎవడు అడ్డగించెను?

“సాగిపోతూ”– 1 కోరింథీయులకు 9:24; హెబ్రీయులకు 12:1. “ఎవరు?”– గలతియులకు 1:7.

8. ఈ ప్రేరేపణ మిమ్మును పిలుచుచున్న వానివలన కలుగలేదు.

వారిని పిలిపించినది దేవుడే (గలతియులకు 1:6). సత్యానికి వారిని లోబడనీయకుండా చేసినది మాత్రం దేవుడు కాదు.

9. పులిసిన పిండి కొంచెమైనను ముద్ద అంతయు పులియ చేయును.

1 కోరింథీయులకు 5:6-8. కొద్ది అబద్ధమైన ఉపదేశమైనా సరే చివరికి సంఘం మొత్తం మీదా, క్రైస్తవ శాఖ మొత్తం మీదా ప్రభావం చూపుతుంది.

10. మీరెంత మాత్రమును వేరుగా ఆలోచింపరని ప్రభువునందు మిమ్మునుగూర్చి నేను రూఢిగా నమ్ముకొను చున్నాను. మిమ్మును కలవరపెట్టుచున్నవాడు ఎవడైనను వాడు తగిన శిక్షను భరించును.

కృప మార్గం నుంచి వేరైపోవడం గురించి వారిని హెచ్చరించిన తరువాత (వ 4), వారలా తొలగిపోరన్న తన నమ్మకాన్ని పౌలు వెల్లడి చేస్తున్నాడు. తాను వారికి రాసిన సత్యంతో వారు సమ్మతిస్తారన్న నమ్మకాన్ని దేవుడే అతనికి కల్పించాడు. హెబ్రీయులకు 6:9 ను హెబ్రీయులకు 6:4-8 తో, హెబ్రీయులకు 10:39 ను హెబ్రీయులకు 10:26-31 తో పోల్చి చూడండి. ఇక వారిని తప్పుదారి పట్టింపజూచిన దుర్బోధకుల విషయానికొస్తే తగిన కాలంలో దేవుని తీర్పు వారిపైకి వస్తుందనడంలో పౌలుకు ఏ మాత్రం సందేహం లేదు. 2 పేతురు 2:1-3 పోల్చి చూడండి.

11. సహోదరులారా, సున్నతి పొందవలెనని నే నింకను ప్రకటించుచున్నయెడల ఇప్పటికిని హింసింపబడనేల? ఆ పక్షమున సిలువవిషయమైన అభ్యంతరము తీసివేయబడునుగదా?

పాపవిముక్తి, రక్షణ పొందాలంటే సున్నతి అవసరమని పౌలు నేర్పించినట్టు అక్కడ ఎవరైనా అన్నారేమో. అలాగంటే గనుక అది అకారణంగా అపనింద వేయడమే. “హింసలకు”– మోషే ధర్మశాస్త్రం పాపవిముక్తికి మార్గం కాదనీ, సున్నతికి స్వతహాగా ఎలాంటి ఆధ్యాత్మికమైన ప్రాముఖ్యతా లేదనీ పౌలు నేర్పినందువల్ల యూదులు అతణ్ణి హింసించారు. “సిలువ...తొట్రుపాటు”– 1 కోరింథీయులకు 1:23 పోల్చి చూడండి. ఈ తొట్రుపాటేమిటి? తిరిగి మోషే ధర్మశాస్త్రాన్ని ఆశ్రయించినప్పుడు ఈ తొట్రుపాటెలా తొలిగిపోతుంది? తొట్రుపాటేమిటంటే మనుషులు పాపంలో పూర్తిగా పతనమైపోయి చెడిపోయారని సిలువ ప్రకటిస్తూ ఉంది. మనిషి స్వప్రయత్నం, మతం, నియమాలు, ఆచారాల వల్ల పాపవిముక్తి, రక్షణ పొందలేనంత భ్రష్టమైన స్థితిలో ఉన్నాడనీ, ఆశాభావానికి అతనికి ఏకైక ఆధారం దేవుని కుమారుడు అతని స్థానంలో చనిపోవడం మాత్రమే అనీ అది సూచిస్తూ ఉంది. ఇది ఒక మనిషి అహాన్నీ, గర్వాన్నీ, ఆత్మగౌరవాన్నీ దెబ్బతీసి అతణ్ణి క్రీస్తు పాదాల ఎదుట ధూళిలో పడవేస్తుంది. అందుకే అది మనుషులకు అభ్యంతర కారణం. ముక్తి పొందాలంటే మత నియమాలూ ఆచారాలూ చాలు అనే ఉపదేశంలో ఇలాంటి అభ్యంతరం లేదు. చాలామంది మతస్థులు వినడానికి ఇష్టపడేది దీన్నే. దేవుని ఎదుట తమ యోగ్యతను పెంచుకొని తాము చేసే వాటి ద్వారా తమను తాము ముక్తుల్ని చేసుకుని రక్షించుకోగలం అనుకుంటారు చాలామంది. అలా అనుకోవడం వారికి చాలా ఇష్టం.

12. మిమ్మును కలవరపెట్టువారు తమ్మును తాము ఛేదించుకొనుట మేలు.

“కలవరపెట్టేవారు”– అబద్ధ బోధకులు గలతీయవారిని దేవుని సత్యానికి వ్యతిరేకంగా తిరుగుబాటుకు పురిగొలుపు తున్నారు. విగ్రహాల గుళ్ళలో మతపిచ్చి ముదిరి తమ మర్మాంగాలను నరికి వేసుకునే పూజారులకంటే అలాంటివారు మంచివారేమీ కాదని పౌలు చెప్తున్నాడు.

13. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శారీరక్రియలకు హేతువు చేసికొనక, ప్రేమ కలిగినవారై యొకనికొకడు దాసులైయుండుడి.

పౌలు ఇప్పుడు తాను ఇంతవరకు రాసిన సత్యాలను జీవితంలో ఆచరించాలని రాయసాగుతున్నాడు. అతడు సాధారణంగా అనుసరించే పద్ధతి ఇదే – ముందు ఒక సత్యానికి గట్టి పునాది వేస్తాడు. అప్పుడు దానికి అనుగుణంగా జీవించ వలసిందని విశ్వాసులను హెచ్చరిస్తాడు. రోమీయులకు 12:1-2; ఎఫెసీయులకు 4:1 పోల్చి చూడండి. “విడుదల”– వ 1. క్రీస్తు మనకు విడుదల ఇచ్చినది మనం పాపంలో జీవించాలని కాదు (పాపం చేయడం స్వేచ్ఛ కాదు, అది అన్నిటికన్నా చెడ్డ దాస్యం – యోహాను 8:34; రోమీయులకు 6:16). క్రీస్తు మనల్ని విడుదల చేసినది మనం ఇష్టపూర్వకంగా దేవునికీ ఒకరినొకరికీ సేవకులం కావాలనే. రోమీయులకు 6:15-23 చూపండి. “శరీర స్వభావం”– మనందరం స్వభావ సిద్ధంగా ఏమిటో తెలిపేందుకు పౌలు ఈ మాట వాడాడు. రోమీయులకు 7:5, రోమీయులకు 7:18; రోమీయులకు 8:3, రోమీయులకు 8:5, రోమీయులకు 8:8 చూడండి.

14. ధర్మశాస్త్ర మంతయునిన్నువలె నీ పొరుగువానిని ప్రేమించుము అను ఒక్క మాటలో సంపూర్ణమైయున్నది.
లేవీయకాండము 19:18

వారు ధర్మశాస్త్రం కింద ఉండాలని కోరుతున్నారా (గలతియులకు 4:21)? దాని ఏర్పాట్లు, ఆచారాలు అలా ఉంచి అసలు ధర్మశాస్త్రంలోని సారాన్ని – అంటే ప్రేమను – పాటించండి అంటున్నాడు పౌలు (లేవీయకాండము 19:18; మత్తయి 22:39; రోమీయులకు 13:8-10; యాకోబు 2:8). నిజానికి ధర్మశాస్త్ర సారాన్ని నెరవేర్చగలవారు క్రీస్తులో నమ్మకముంచినవారూ ఆయన ఆత్మ ఉన్నవారూ మాత్రమే (రోమీయులకు 8:4).

15. అయితే మీరు ఒకనినొకడు కరచుకొని భక్షించినయెడల మీరు ఒకనివలన ఒకడు బొత్తిగా నశించిపోదురేమో చూచుకొనుడి.

గలతీయలోని దుర్బోధకులు అక్కడ కలహాలను, చీలికలను సృష్టించారు. అలాంటివారి కార్యకలాపాల ఫలితం ఎప్పుడైనా ఇదే (రోమీయులకు 16:17). తన ప్రజలు ప్రేమలో సత్యంలో ఏకంగా ఉండాలని దేవుని కోరిక. సత్యం లేకుండా ప్రేమ, ప్రేమ లేకుండా సత్యం ఉంటే చాలదు. తప్పుడు బోధ, ఘర్షణ క్రైస్తవ సంఘాలను పాడు చేస్తాయి. ప్రేమ, సత్యం వాటిని ఆధ్యాత్మికంగా సజీవంగా, అభివృద్ధి చెందిస్తూ ఉంటాయి.

16. నేను చెప్పునదేమనగా ఆత్మానుసారముగా నడుచు కొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు.

“ఆత్మకు...నడుచుకోండి”– ఇక్కడినుంచి గలతియులకు 6:10 వరకు పౌలు రాసిన అంశమిదే. క్రీస్తులో ఆధ్యాత్మిక జీవితం గడిపేందుకు విశ్వాసులకు శక్తినిచ్చేది దేవుని ఆత్మే. రోమీయులకు 8:4-14 పోల్చి చూడండి. భ్రష్ట స్వభావం (“శరీర స్వభావం”– వ 13), దాని కోరికలు విశ్వాసుల్లో లేవనడం లేదు పౌలు. ఉన్నాయని స్పష్టంగా సూచిస్తున్నాడు. తరువాతి వచనంలో ఇది మరింత స్పష్టంగా ఉంది. రోమీయులకు 7:14-25; 1 యోహాను 1:8 కూడా చూడండి. శరీర స్వభావం, దాని ఆశలు మనందరిలో ఉన్నాయి. కానీ దేవుని ఆత్మమూలంగా మనం వాటిని అణగద్రొక్కి జయించగలం.

17. శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షిం చును. ఇవి యొకదానికొకటి వ్యతిరేక ముగా ఉన్నవి గనుక మీరేవిచేయ నిచ్ఛయింతురో వాటిని చేయకుందురు.

దేవుని ఆత్మకు శరీర స్వభావం పూర్తిగా వ్యతిరేకం. ఈ రెంటి కోరికలు, తలంపులు, గమ్యాలు, లక్షణాలు పూర్తిగా విభిన్నమైనవి (రోమీయులకు 8:5-8). ఈ లోకంలో మన జీవితం ముగిసేవరకు అవి రెండూ మనలో పరస్పరం యుద్ధం చేసుకుంటూ ఉంటాయి. శరీర స్వభావం – అంటే మన తల్లిదండ్రుల నుంచి వచ్చిన స్వభావాన్ని బట్టి మనం ఏమిటో అది – పట్టు వదలదు, చెడ్డవాటిని ఆశించడం మానుకోదు, మంచిగా పవిత్రంగా ఎన్నటికీ మారదు. నిజానికి కాలం గడుస్తున్నకొద్దీ అది మరింత హీనంగా మారిపోతూ ఉంటుంది (ఎఫెసీయులకు 4:22). దేవుని ఆత్మ అడుగడుక్కూ, శరీర స్వభావాన్ని ఎదిరిస్తూనే ఉంటాడు. అది కోరేవాటిలో ఒక్కదానికి కూడా లొంగడు. “మీరేవి చేయాలని ఇష్టపడుతారో అవి చేయలేక పోతున్నారు”– దీని అర్థం ఏమిటి? విశ్వాసులు తాము చేయాలనుకునే మంచి అంతా చెయ్యలేరు. ఎందుకంటే వారి శరీర స్వభావాలు అందుకు అడ్డుపడుతూ ఉంటాయి అని దీని అర్థం కావచ్చు (రోమీయులకు 7:15, రోమీయులకు 7:18, రోమీయులకు 7:20 చూడండి). లేక తమ శరీర స్వభావం కోరేవాటికి పవిత్రాత్మ అడ్డుపడుతూ ఉండడంవల్ల విశ్వాసులు వాటిని చేయరు అని అర్థం కావచ్చు. ఈ రెండూ కూడా కొంతవరకు నిజమే. ఈ రెండూ కూడా శరీర స్వభావం ఇంకా విశ్వాసుల్లో ఉందని తెలియజేస్తున్నాయి. ఇక్కడే భూమిమీదే వారి శరీర స్వభావాలను సమూలంగా తీసివేయడమే వారి విజయ మార్గమని పౌలు గలతీయవారికి నేర్పించడం లేదన్న విషయం జాగ్రత్తగా గమనించండి. ఇలాంటి ఆశను తన లేఖలు దేనిలోనూ అతడు కలిగించలేదు. విజయ మార్గం ఏమిటంటే దేవుని ఆత్మ మూలంగా జీవించడమే (వ 16) అంటున్నాడు.

18. మీరు ఆత్మచేత నడిపింపబడినయెడల ధర్మ శాస్త్రమునకు లోనైనవారు కారు.

“ఆత్మ మిమ్ములను నడిపిస్తూ”– రోమీయులకు 8:14 చూడండి. దేవుని ఆత్మ విశ్వాసులను మత దాస్యం నుంచి బయటికి తెచ్చాడు. పాపవిముక్తి, రక్షణ కోసం స్వంత ప్రయత్నాలు చెయ్యాలన్న సూత్రం నుంచి విడుదల చేశాడు. ఆయన తిరిగి వారిని అందులోకి తీసుకుపోడు. “ధర్మశాస్త్రం కింద లేరు”– రోమీయులకు 6:14. శరీర కోరికలనూ కార్యాలనూ అణిచేందుకు ఏకైక మార్గం చట్టాలు, నిబంధనలు ఏర్పరచడమేనని మనుషులు అనుకుంటారు. కానీ అలాంటివి నిజానికి పాపేచ్ఛలనూ పాపాన్నీ ప్రోత్సహించగలవని పౌలుకు తెలుసు (రోమీయులకు 7:5, రోమీయులకు 7:7-13. శరీర స్వభావాన్ని జయించడానికి ఏకైక మార్గం దేవుని ఆత్మద్వారా జీవించడమేనని కూడా అతనికి తెలుసు).

19. శరీరకార్యములు స్పష్టమైయున్నవి; అవేవనగా, జారత్వము, అపవిత్రత, కాముకత్వము,

పౌలు వ్యభిచారం పక్కన విగ్రహ పూజను, అసూయ, కలహాల ప్రక్కన త్రాగుబోతుతనం, ఆటపాటల అల్లరులను ఉంచి ఒకే జాబితాలోను చేర్చాడని గమనించండి. ఇవన్నీ భ్రష్ట స్వభావంలోనుంచి, మానవ సహజమైన హృదయంలోనుంచి వస్తాయని ఆధ్యాత్మిక వ్యక్తులకు “స్పష్టంగా” తెలుసు. మత్తయి 15:19; మార్కు 7:21-23; రోమీయులకు 1:29-32; రోమీయులకు 3:9-18 పోల్చి చూడండి. భ్రష్ట స్వభావ క్రియలన్నిటినీ పౌలు ఇక్కడ చెప్పలేదు. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. వీటిలో కొన్ని నేరుగా దేవునికి వ్యతిరేకంగా చేసేవి. కొన్ని మనుషులకు విరోధంగా చేసేవి. కొన్ని అవి చేసే వారికే విరోధంగా పని చేసేవి. ఇవన్నీ నాశనం కలిగించేవే. ఇవన్నీ దేవుని కోపానికీ తీర్పుకూ శిక్షకూ తగినవే.

20. విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు,

“విగ్రహ పూజ”– నిర్గమకాండము 20:3-6; మొ।।. “మంత్ర ప్రయోగం”– ద్వితీయోపదేశకాండము 18:9-12 మొదలైనవి. “ఈర్ష్య భావాలు”– సామెతలు 14:30; సామెతలు 27:4; మత్తయి 27:18; అపో. కార్యములు 17:5; యాకోబు 3:14, యాకోబు 3:16. “భేదాలు”– 1 కోరింథీయులకు 3:3-4.

21. భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటినిగూర్చి నేనుమునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను.

“వారసులు కాబోరు”– గలతియులకు 6:7-8; 1 కోరింథీయులకు 6:9-10; ఎఫెసీయులకు 5:5-6; ప్రకటన గ్రంథం 21:8 చూడండి. ఇలాంటి మాటలు చెప్పినప్పటికీ కొందరు క్రైస్తవులమని చెప్పుకునేవారు తమ ఇష్టం వచ్చినట్టు పాపం చేసి తప్పించుకోవచ్చులే అని తమను తాము నమ్మించుకుంటారు. ఇలాంటివారికి దూరంగా ఉండాలి. వారు తమను తాము మోసం చేసుకున్నారు; మనల్ని కూడా మోసగించడానికి ప్రయత్నిస్తారు. దేవుని రాజ్యం గురించి నోట్ మత్తయి 4:17.

22. అయితే ఆత్మ ఫలమేమనగా, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయా ళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము.

ఇవి విశ్వాసుల ఆత్మఫలం కాదు విశ్వాసిలో దేవుని ఆత్మ ఫలింపజేసిన ఫలం. ఇవి స్వంత ప్రయత్నాలవల్ల వచ్చినవి కావు. అలాగని విశ్వాసి చేతులు ముడుచుకుని ఏమీ చెయ్యకుండా కూర్చోవాలని కాదు. పవిత్రాత్మలో జీవించాలి, పవిత్రాత్మప్రకారం నడుచుకోవాలి. అలా కాకుంటే అతని జీవితంలో ఈ ఫలం కనిపించదు. ఫలం అనే మాట కాలక్రమేణా జరుగుతున్న అభివృద్ధిని సూచిస్తున్నది. మత్తయి 13:23 పోల్చి చూడండి. ప్రకృతిలో పండ్లు కాయాలంటే ముందు విత్తనం నాటాలి, మొక్క లేక చెట్టు ఎదగాలి. అప్పుడు పండ్లు కనిపిస్తాయి. ఆధ్యాత్మిక ఫలం కూడా అలాగే. మనం క్రీస్తులో మొదట నమ్మకం ఉంచినప్పుడు తరచుగా ప్రేమ, ఆనందం, మనశ్శాంతి ఒక్కసారిగా పెల్లుబికాయి. అయితే ఇవి అభివృద్ధి చెంది పరిపక్వమై, ఇతర ఆధ్యాత్మిక సుగుణాలు వీటికి తోడవాలి. సహనం, విశ్వసనీయత, ఇంద్రియ నిగ్రహం కొంతకాలం పాటు ఎదగాలి. 2 పేతురు 1:5-8 పోల్చి చూడండి. తన పిల్లల్లో ప్రతి వ్యక్తికీ ఈ జాబితాలోని ప్రతి లక్షణమూ ఉండాలని దేవుని కోరిక. దేవుని ఆత్మ కార్యం ద్వారా ప్రతిదీ మనకు లభించడం సాధ్యం. పౌలు ప్రేమను మొదటగా చెప్తున్నాడు. అది మంచి లక్షణాలన్నిటిలోకీ గొప్పదని అతనికి తెలుసు – వ 6,14; 1 కోరింథీయులకు 13:13. “ఆనందం”– యోహాను 15:11; యోహాను 16:20-22; యోహాను 17:13; రోమీయులకు 5:11; రోమీయులకు 14:17; రోమీయులకు 15:13. లోకులు అనుభవించే సంతోషం బయటి పరిస్థితులపై అధారపడినది. విశ్వాసుల ఆనందం శాశ్వతమైన వాస్తవాలపై ఆధారపడినది. “శాంతి”– లూకా 2:14; యోహాను 14:27; యోహాను 16:33; రోమీయులకు 1:2; రోమీయులకు 14:17; రోమీయులకు 15:13. “సహనం”– రోమీయులకు 5:3; కొలొస్సయులకు 1:11; హెబ్రీయులకు 6:12; హెబ్రీయులకు 10:36; హెబ్రీయులకు 12:1; యాకోబు 1:3-4. “దయ”– 1 కోరింథీయులకు 13:4; ఎఫెసీయులకు 4:32; కొలొస్సయులకు 3:12; 2 పేతురు 1:7. “మంచితనం”– రోమీయులకు 15:14; ఎఫెసీయులకు 5:9. “విశ్వసనీయత”– మత్తయి 24:45; మత్తయి 25:21; 1 కోరింథీయులకు 4:2; 1 కోరింథీయులకు 7:25; ప్రకటన గ్రంథం 2:10; ప్రకటన గ్రంథం 17:14; 1 కోరింథీయులకు 9:25, 1 కోరింథీయులకు 9:27; 2 పేతురు 1:6.

23. ఇట్టివాటికి విరోధమైన నియమమేదియులేదు.

“సాత్వికం”– మత్తయి 11:29; 2 కోరింథీయులకు 10:1; 1 థెస్సలొనీకయులకు 2:7. “ఇంద్రియ నిగ్రహం”– 2 తిమోతికి 1:7; 1 కోరింథీయులకు 9:25, 1 కోరింథీయులకు 9:27; 2 పేతురు 1:6. ఈ లక్షణాలన్నిటినీ దేవుని ఆత్మ మనకు ఇస్తాడు, వాటిని మనం ఉపయోగించి, మన అనుదిన జీవితాల్లో వాటిని ప్రదర్శించాలి. వాటి ఎదుగుదలను అరికట్టడం, లేక ప్రోత్సహించడం మన చేతుల్లోనే ఉంది.

24. క్రీస్తుయేసు సంబంధులు శరీరమును దాని యిచ్ఛల తోను దురాశలతోను సిలువవేసి యున్నారు.

ఎవరో మహనీయులైన పవిత్రుల విషయంలో మాత్రమే గాక క్రీస్తు విశ్వాసులందరి విషయంలోనూ ఇది సత్యమే. గలతియులకు 2:20 లో విశ్వాసులు క్రీస్తుతో కూడా సిలువ మరణం చెందిన విషయం పౌలు చెప్పాడు. విశ్వాసి తానే స్వయంగా చేసినది ఇక్కడ చెప్తున్నాడు. విశ్వాసులు ఇలా చెయ్యాలి అని పౌలు చెప్పడం లేదు, వారు చేశారని చెప్తున్నాడు. వారు నిజంగా పశ్చాత్తాపపడి క్రీస్తుమీద నమ్మకం ఉంచినప్పుడే ఇలా చేశారు. భ్రష్ట స్వభావ ప్రభావం కింద ఉన్న పాత జీవిత విధానంతో పూర్తి తెగతెంపులను పశ్చాత్తాపం సూచిస్తున్నది. క్రీస్తులో నమ్మకం ఆయన విశ్వాసి స్థానంలో మరణించిన విషయాన్ని అంగీకరిస్తున్నది. అంటే, “సిలువను ఎక్కవలసినది నేను, క్రీస్తు కాదు” అని విశ్వాసి చెప్తున్నట్టన్నమాట. తన భ్రష్ట స్వభావానికి తగిన చోటు సిలువమీదే అని అతడు ఒప్పుకుంటాడు. దాని విషయంలో దేవుని తీర్పుతో ఏకీభవిస్తాడు. తనను పరిత్యజించుకుని తన సిలువను ఎత్తుకుని క్రీస్తును అనుసరిస్తాడు (మత్తయి 10:38-39; మత్తయి 16:24-26. అక్కడి నోట్స్ చూడండి). ఇలా చేసేందుకు అతడు సిద్ధంగా లేకపోతే అతడు నిజ క్రైస్తవుడు కాదు. నిజ విశ్వాసులు ఎలాంటివారో పౌలు ఇక్కడ వర్ణిస్తున్నాడు. వారు తమ భ్రష్ట స్వభావాలను సిలువ వేయకపోయినట్టయితే వారు క్రీస్తుకు చెందినవారు కాదు. అయితే వ 16 నుంచి మొదలై ఈ లేఖ భాగాన్ని బట్టి చూస్తే విశ్వాసులకు తమ భ్రష్ట స్వభావం వల్ల ఇక ఎలాంటి కష్టం ఉండదని మనం భావించుకోకూడదు. కలిగిస్తూనే ఉంటుందని పౌలు స్పష్టం చేశాడు. దేవుని పట్ల, పాపం పట్ల విశ్వాసులకు కలిగిన మనస్తత్వాన్ని బట్టి వారి భ్రష్ట స్వభావాన్ని సిలువ వేశారు. అయితే భ్రష్ట స్వభావం విశ్వాసుల్లో చనిపోయి సమాధి కాలేదు. సిలువ నుంచి దిగివచ్చి మన జీవితాలను తన ఇష్టం వచ్చినట్టు నడిపేందుకు అస్తమానం ప్రయత్నిస్తూ ఉంటుంది (వ 17). అందుకనే మనం ప్రతి రోజూ మన సిలువను ఎత్తుకుని పోతూ ఉండాలని క్రీస్తు చెప్పాడు – లూకా 9:23. “శరీర స్వభావాన్ని...సిలువ వేశారు” అనే మాట విశ్వాసులకు వారి స్వభావం పట్ల ఉండే అభిప్రాయాన్ని, మనస్తత్వాన్ని సూచిస్తున్నది.

25. మనము ఆత్మ ననుసరించి జీవించువారమైతిమా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకొందము.

విశ్వాసులందరికీ దేవుని ఆత్మ ఆధ్యాత్మిక జీవాన్ని ఇచ్చాడు (యోహాను 3:3-8). ఇది నిజం కాబట్టి పవిత్రాత్మ నడిపించిన చోటికెల్లా ఆయనతో అడుగులో అడుగుగా వెళ్ళాలి. శరీర స్వభావంపై విజయానికీ, దాన్ని దానికి తగిన స్థానంలో, అంటే సిలువపైనే ఉంచడానికీ ఇదే ఏకైక మార్గం.

26. ఒకరి నొకరము వివాదమునకు రేపకయు, ఒకరి యందొకరము అసూయపడకయు వృథాగా అతిశయపడకయు ఉందము.

కొన్ని అనుదిన వ్యవహారాల్లో దేవుని ఆత్మ చూపిన దారిన వెళ్ళడం గురించి పౌలు ఇక్కడ చెప్పుతున్నాడు. అహంకారం, కలహం, అసూయ అంటే పవిత్రాత్మకు అసహ్యం. మనం పవిత్రాత్మలో జీవించేవారమైతే మనం కూడా వీటిని అసహ్యించుకోవాలి. అవి శరీర కార్యాలు.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Galatians - గలతీయులకు 5 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

సువార్త స్వాతంత్ర్యంలో స్థిరంగా నిలబడాలని ఒక తీవ్రమైన ప్రబోధం. (1-12) 
1-6
క్రీస్తును తమ ఏకైక రక్షకునిగా గుర్తించని మరియు ఆధారపడని వారు ఆయన ద్వారా మోక్షాన్ని పొందలేరు. సువార్త అందించే బోధలు మరియు స్వేచ్ఛలో స్థిరంగా ఉండేందుకు అపొస్తలుడి హెచ్చరికలు మరియు ఉపదేశాలను మనం పాటించడం చాలా ముఖ్యం. నిజమైన క్రైస్తవులు, పరిశుద్ధాత్మచే మార్గనిర్దేశం చేయబడి, తమ స్వంత పనుల ద్వారా కాకుండా, క్రీస్తుపై విశ్వాసం ద్వారా దేవుడు ప్రసాదించిన నీతి యొక్క ప్రతిఫలంగా నిత్యజీవాన్ని ఎదురుచూస్తారు. యూదు మతమార్పిడులు ఆచార వ్యవహారాలకు కట్టుబడి ఉండవచ్చు లేదా వారి స్వేచ్ఛను నొక్కిచెప్పవచ్చు, అయితే అన్యజనులు మోక్షం కోసం ఈ బాహ్య విషయాలపై ఆధారపడనంత కాలం వాటిని విస్మరించడం లేదా గమనించడం ఎంచుకోవచ్చు. యేసుపై నిజమైన విశ్వాసం లేకుండా దేవుని నుండి అంగీకారం పొందడంలో బాహ్య అధికారాలు మరియు వృత్తులకు ఎటువంటి విలువ ఉండదు. నిజమైన విశ్వాసం అనేది దేవుని పట్ల మరియు తోటి విశ్వాసుల పట్ల ప్రేమ ద్వారా వ్యక్తమయ్యే చురుకైన శక్తి. ఆత్మచేత శక్తిని పొంది, విశ్వాసం ద్వారా నీతి నిరీక్షణ కోసం ఆసక్తిగా ఎదురుచూసేవారిలో మనం కూడా ఉంటాం. అనేక సమకాలీన ఆచారాలు మరియు అభ్యాసాల మాదిరిగానే, పురాతన కాలంలోని ప్రమాదం అసంభవమైన విషయాలలో ఉండదు. ఏది ఏమైనప్పటికీ, ప్రేమకు ఆజ్యం పోసిన విశ్వాసం లేకుండా, మిగతావన్నీ వ్యర్థం, మరియు పోల్చినప్పుడు, ఇతర విషయాలు ముఖ్యమైనవి.

7-12
క్రైస్తవ ప్రయాణం ఒక రేసుతో పోల్చబడింది, అంతిమ బహుమతిని సాధించడానికి ఓర్పు మరియు పట్టుదల డిమాండ్ చేస్తుంది. క్రైస్తవ మతం యొక్క కేవలం వృత్తి తక్కువగా ఉంటుంది; ఆ ప్రకటనకు అనుగుణంగా చురుకుగా జీవించాలి. చాలామంది, తమ మతపరమైన ప్రయాణంలో నిజమైన ఉద్దేశ్యంతో ప్రారంభించినప్పటికీ, అడ్డంకులను ఎదుర్కొంటారు లేదా మార్గం నుండి తప్పుకుంటారు. దారి తప్పుతున్నవారు లేదా అలసిపోయినట్లు భావించేవారు తమ పోరాటాల వెనుక గల కారణాలను నిజాయితీగా పరిశీలించడం చాలా కీలకం. 8వ వచనంలో, ధర్మశాస్త్రాన్ని సమర్థించడం కోసం క్రీస్తుపై విశ్వాసంతో కలపడం వైపు మొగ్గు కనిపిస్తోంది. అపొస్తలుడు మూలాన్ని గుర్తించడానికి వారిని అనుమతించినప్పటికీ, అలాంటి విచలనం సాతాను తప్ప ఇతరులచే ప్రభావితం చేయబడదని అతను గట్టిగా సూచించాడు.
క్రైస్తవ సంఘాలు అనుసరించడమే కాకుండా విధ్వంసక సిద్ధాంతాలను ప్రచారం చేసే వ్యక్తులను ఆమోదించడం పట్ల జాగ్రత్తగా ఉండాలి. పాపం మరియు దోషాన్ని పరిష్కరించేటప్పుడు, నాయకులు మరియు వారి అనుచరుల మధ్య తేడాను గుర్తించడం చాలా ముఖ్యం. పాపులకు మోక్షానికి ప్రత్యేకమైన సాధనంగా క్రీస్తు ప్రకటించబడినందున యూదులు బాధపడ్డారు. పౌలు మరియు ఇతరులు మోజాయిక్ ధర్మశాస్త్రానికి కట్టుబడి ఉండుట అనేది మోక్షానికి క్రీస్తుపై విశ్వాసంతో పాటు అవసరమని అంగీకరించినట్లయితే, విశ్వాసులు చాలా బాధలను నివారించి ఉండవచ్చు. అటువంటి తప్పుదోవ పట్టించే ప్రభావానికి సంబంధించిన ప్రారంభ సంకేతాలను వ్యతిరేకించడం అత్యవసరం, మరియు క్రైస్తవ సమాజానికి అంతరాయం కలిగించడంలో పట్టుదలతో ఉన్నవారు వారి చర్యల యొక్క పరిణామాలను భరించాలి.

పాపపు కోపానికి గురికాకుండా జాగ్రత్త వహించడం. (13-15) 
క్రైస్తవ ప్రయాణం ఒక రేసుతో పోల్చబడింది, అంతిమ బహుమతిని సాధించడానికి ఓర్పు మరియు పట్టుదల డిమాండ్ చేస్తుంది. క్రైస్తవ మతం యొక్క కేవలం వృత్తి తక్కువగా ఉంటుంది; ఆ ప్రకటనకు అనుగుణంగా చురుకుగా జీవించాలి. చాలామంది, తమ మతపరమైన ప్రయాణంలో నిజమైన ఉద్దేశ్యంతో ప్రారంభించినప్పటికీ, అడ్డంకులను ఎదుర్కొంటారు లేదా మార్గం నుండి తప్పుకుంటారు. దారి తప్పుతున్నవారు లేదా అలసిపోయినట్లు భావించేవారు తమ పోరాటాల వెనుక గల కారణాలను నిజాయితీగా పరిశీలించడం చాలా కీలకం. 8వ వచనంలో, ధర్మశాస్త్రాన్ని సమర్థించడం కోసం క్రీస్తుపై విశ్వాసంతో కలపడం వైపు మొగ్గు కనిపిస్తోంది. అపొస్తలుడు మూలాన్ని గుర్తించడానికి వారిని అనుమతించినప్పటికీ, అలాంటి విచలనం సాతాను తప్ప ఇతరులచే ప్రభావితం చేయబడదని అతను గట్టిగా సూచించాడు.
క్రైస్తవ సంఘాలు అనుసరించడమే కాకుండా విధ్వంసక సిద్ధాంతాలను ప్రచారం చేసే వ్యక్తులను ఆమోదించడం పట్ల జాగ్రత్తగా ఉండాలి. పాపం మరియు దోషాన్ని పరిష్కరించేటప్పుడు, నాయకులు మరియు వారి అనుచరుల మధ్య తేడాను గుర్తించడం చాలా ముఖ్యం. పాపులకు మోక్షానికి ప్రత్యేకమైన సాధనంగా క్రీస్తు ప్రకటించబడినందున యూదులు బాధపడ్డారు. పౌలు మరియు ఇతరులు మోజాయిక్ ధర్మశాస్త్రానికి కట్టుబడి ఉండుట అనేది మోక్షానికి క్రీస్తుపై విశ్వాసంతో పాటు అవసరమని అంగీకరించినట్లయితే, విశ్వాసులు చాలా బాధలను నివారించి ఉండవచ్చు. అటువంటి తప్పుదోవ పట్టించే ప్రభావానికి సంబంధించిన ప్రారంభ సంకేతాలను వ్యతిరేకించడం అత్యవసరం, మరియు క్రైస్తవ సమాజానికి అంతరాయం కలిగించడంలో పట్టుదలతో ఉన్నవారు వారి చర్యల యొక్క పరిణామాలను భరించాలి.

మరియు ఆత్మలో నడవడం, మరియు శరీర కోరికలను నెరవేర్చడం కాదు: రెండింటి పనులు వివరించబడ్డాయి. (16-26)
మన ఆందోళన పరిశుద్ధాత్మ యొక్క మార్గదర్శకత్వం మరియు శక్తి క్రింద పని చేస్తే, మన అవినీతి స్వభావం యొక్క ప్రకంపనలు మరియు వ్యతిరేకతలను మనం ఇంకా అనుభవించినప్పటికీ, అది మనపై ఆధిపత్యం వహించదు. విశ్వాసులు తమను తాము సంఘర్షణలో పడ్డారు, దయ సంపూర్ణమైన మరియు వేగవంతమైన విజయాన్ని సాధించాలని తీవ్రంగా కోరుకుంటారు. పరిశుద్ధాత్మ నాయకత్వానికి ఇష్టపూర్వకంగా లొంగిపోయేవారు చట్టానికి కట్టుబడి పనిల ఒడంబడికగా ఉండరు లేదా దాని భయంకరమైన శాపానికి గురికారు. పాపం పట్ల వారి విరక్తి మరియు పవిత్రత కోసం వారి కోరిక సువార్త రక్షణలో వారి భాగస్వామ్యాన్ని ప్రదర్శిస్తాయి.
శరీర క్రియలు అనేకం మరియు స్పష్టంగా ఉన్నాయి, మరియు ఈ పాపాలలో మునిగిపోవడం స్వర్గం నుండి వ్యక్తులను మినహాయిస్తుంది. అయినప్పటికీ, ఆశ్చర్యకరంగా, క్రైస్తవులుగా గుర్తించబడే చాలామంది స్వర్గం కోసం నిరీక్షణను వ్యక్తం చేస్తూ అలాంటి ప్రవర్తనలను కొనసాగించారు. అపొస్తలుడు, వ్యక్తులకు హాని కలిగించే మరియు వారి మధ్య విభేదాలను పెంపొందించే మాంసం యొక్క హానికరమైన పనులను ప్రధానంగా ఎత్తి చూపాడు, ఇప్పుడు ఆత్మ యొక్క ఫలాలను నొక్కి చెప్పాడు. ఈ పండ్లు వ్యక్తుల ఆనందానికి మాత్రమే కాకుండా క్రైస్తవుల మధ్య సామరస్యాన్ని పెంపొందిస్తాయి. అటువంటి వ్యక్తులు ఆత్మచే మార్గనిర్దేశం చేయబడతారని ఆత్మ యొక్క ఫలాలు నిస్సందేహంగా సూచిస్తున్నాయి.
శరీరానికి సంబంధించిన పనులను మరియు ఆత్మ యొక్క ఫలాలను వివరించడం ద్వారా, మనం దేనిని నివారించాలి మరియు వ్యతిరేకించాలి, అలాగే దేనిని ఆదరించాలి మరియు పండించాలి. ఇది నిజమైన క్రైస్తవులందరి హృదయపూర్వక శ్రద్ధ మరియు కృషి అవుతుంది. పాపం వారి మర్త్య శరీరాలలో ఇకపై రాజ్యం చేయదు, వారిని విధేయతకు నడిపిస్తుంది (రోమా 8:5). దేహంలోని క్రియలను మట్టుబెట్టి జీవితంలో కొత్తదనంలో నడవడానికి వారు శ్రద్ధగా కృషి చేస్తారు. వారి ఆకాంక్షలు వ్యర్థమైన కీర్తి లేదా మానవ గౌరవం మరియు ప్రశంసల కోసం అధిక కోరికతో నడపబడవు. బదులుగా, వారు ఒకరినొకరు రెచ్చగొట్టడం లేదా అసూయపడడం మానేసి, యేసుక్రీస్తు ద్వారా దేవునికి స్తుతి మరియు మహిమను తెచ్చే మంచి ఫలాలను సమృద్ధిగా ఉత్పత్తి చేయడానికి చురుకుగా ప్రయత్నిస్తారు.



Shortcut Links
గలతియులకు - Galatians : 1 | 2 | 3 | 4 | 5 | 6 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |