తనను గానీ ఇతరులను గానీ మనిషనేవాడు ఎవరినీ గానీ గొప్ప చేయడం పౌలుకు ఇష్టం లేదు – 1 కోరింథీయులకు 3:5, 1 కోరింథీయులకు 3:22-23. ఈ విషయంలో మనుషులు బయటికి ఎలా కనిపిస్తున్నారు, వారికున్న గొప్ప ఆధిక్యతలేమిటి, లేక ఉన్నతమైన హోదాలేమిటి, ఇతరుల దృష్టిలో వారి పరువు ప్రతిష్ఠలేమిటి అన్నది అతనికి ముఖ్యం కాదు. అతడు ముఖ్యంగా చూచినదేమిటంటే క్రీస్తు తనకు వెల్లడి చేసిన నిజమైన శుభవార్తను వారు అంగీకరించారా లేదా అనేదే. జెరుసలంలోని క్రైస్తవ సంఘ నాయకులైన పేతురు, యాకోబు, యోహానులు శుభవార్త అర్థాన్ని గురించి తనతో ఏకీభవించారని గలతీయ క్రైస్తవులకు పౌలు తెలియజేయగలిగాడు (వ 9).