3. రాతిపలకమీదగాని సిరాతోగాని వ్రాయబడక, మెత్తని హృదయములు అను పలకలమీద జీవముగల దేవుని ఆత్మతో, మా పరిచర్యమూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రికయై యున్నారని మీరు తేటపరచబడుచున్నారు.
నిర్గమకాండము 24:12, నిర్గమకాండము 31:18, నిర్గమకాండము 34:1, ద్వితీయోపదేశకాండము 9:10-11, సామెతలు 3:3, సామెతలు 7:3, యిర్మియా 31:33, యెహెఙ్కేలు 11:19, యెహెఙ్కేలు 36:26
ఈ వచనాల్లో పౌలు పాత ఒడంబడికకూ, కొత్త ఒడంబడికకూ తేడాలు చూపుతున్నాడు.
పాతది మరణాన్ని తెచ్చిన పరిచర్య (వ 6,7); కొత్తది జీవాన్ని తెచ్చింది (వ 6)
పాతదాన్ని రాతి పలకలపై రాయడం జరిగింది (నిర్గమకాండము 31:18)
కొత్తది మనుషుల హృదయాలపై రాయబడింది (వ 3)
పాతది మనుషులను నేరస్థులుగా తీర్చే పరిచర్య, కొత్తదైతే వారిని నిర్దోషులుగా తీర్చేది (వ 9; రోమీయులకు 3:19-24)
పాతది గతించిపోతూ ఉంది (వ 11; హెబ్రీయులకు 8:13)
కొత్తది శాశ్వతం (వ 11)
ఒక్క మాటలో చెప్పాలంటే పాత ఒడంబడిక మనుషుల హృదయాలను మార్చలేని ఆజ్ఞల్లో, శాసనాల్లో ఉంది (నిర్గమకాండము 19:5-6 నోట్); కొత్త ఒడంబడిక మనుషులను కొత్తవారుగా చేసే దేవుని ఆత్మ పరిచర్యను తెచ్చేది (వ 3,6,8)
కాబట్టి పాతదానికి కొంత మహిమ ఉన్నప్పటికీ, కొత్తదానికి మరెంతో ఎక్కువ మహిమ ఉంది (వ 8-11)
మోషే ధర్మశాస్త్రాన్ని పాటించాలని చెప్తూ కొందరు కొరింతులోని క్రైస్తవులను కలవర పెడుతున్నట్టుంది. అపో. కార్యములు 15:1-2 పోల్చి చూడండి. వారు ఉపదేశిస్తున్న ధర్మశాస్త్రం కంటే తాను ఉపదేశిస్తున్న శుభవార్త ఎంత గొప్పదో పౌలు కొరింతువారికి చూపిస్తున్నారు.