ఆ రోజుల్లో రోమ్ సామ్రాజ్యంలో బానిసత్వం సర్వ సాధారణం. బానిసల్లో అనేకమంది క్రీస్తులో నమ్మకం పెట్టుకొన్నారు. వారేం చెయ్యాలి? తమ స్థితిని ప్రశాంతంగా అంగీకరించాలి, వీలైతే స్వతంత్రత పొందాలి, క్రీస్తు తమను స్వతంత్రులుగా – అంటే పాపం, మరణం, ధర్మశాస్త్రం నుంచి విడుదల – చేశాడని గుర్తించాలి. యోహాను 8:36; గలతియులకు 5:1. మనుషులకు శారీరకంగా బానిసలు కానివారు తాము క్రీస్తుకు “బానిసల”మని గుర్తించాలి (రోమీయులకు 6:16-22). వేరే మాటల్లో చెప్పాలంటే జీవితంలో అన్ని పరిస్థితుల్లోనూ విశ్వాసులు క్రీస్తుతో తమ సంబంధం ప్రాముఖ్యమైనదని గుర్తించి ఆయనకు సేవ చేయాలి, ఘనత కలిగించాలి.