Corinthians I - 1 కొరింథీయులకు 7 | View All

1. మీరు వ్రాసిన వాటి విషయము: స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు.

1. meeru vraasina vaaṭi vishayamu: streeni muṭṭakuṇḍuṭa purushuniki mēlu.

2. అయినను జారత్వములు జరుగు చున్నందున ప్రతివానికి సొంతభార్య యుండవలెను, ప్రతి స్త్రీకి సొంతభర్త యుండవలెను.

2. ayinanu jaaratvamulu jarugu chunnanduna prathivaaniki sonthabhaarya yuṇḍavalenu, prathi streeki sonthabhartha yuṇḍavalenu.

3. భర్త భార్యకును ఆలాగుననే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడుప వలెను.

3. bhartha bhaaryakunu aalaagunanē bhaarya bharthakunu vaari vaari dharmamulu naḍupa valenu.

4. భర్తకేగాని భార్యకు తన దేహముపైని అధికారము లేదు; ఆలాగున భార్యకే గాని భర్తకు తన దేహముపైని అధికారము లేదు.

4. bharthakēgaani bhaaryaku thana dhehamupaini adhikaaramu lēdu; aalaaguna bhaaryakē gaani bharthaku thana dhehamupaini adhikaaramu lēdu.

5. ప్రార్థనచేయుటకు మీకు సావకాశము కలుగునట్లు కొంతకాలమువరకు ఉభయుల సమ్మతి చొప్పుననే తప్ప, ఒకరినొకరు ఎడబాయకుడి; మీరు మనస్సు నిలుపలేకపోయినప్పుడు సాతాను మిమ్మును శోధింపకుండునట్లు తిరిగి కలిసికొనుడి.

5. praarthanacheyuṭaku meeku saavakaashamu kalugunaṭlu konthakaalamuvaraku ubhayula sammathi choppunanē thappa, okarinokaru eḍabaayakuḍi; meeru manassu nilupalēkapōyinappuḍu saathaanu mimmunu shōdhimpakuṇḍunaṭlu thirigi kalisikonuḍi.

6. ఇది నా హితోపదేశమేగాని ఆజ్ఞ కాదు; మనుష్యులందరు నావలె ఉండ గోరుచున్నాను.

6. idi naa hithoopadheshamēgaani aagna kaadu; manushyulandaru naavale uṇḍa gōruchunnaanu.

7. అయినను ఒకడొక విధమునను మరి యొకడు మరియొక విధమునను ప్రతి మనుష్యుడు తన కున్న కృపావరమును దేవునివలన పొందియున్నాడు.

7. ayinanu okaḍoka vidhamunanu mari yokaḍu mariyoka vidhamunanu prathi manushyuḍu thana kunna krupaavaramunu dhevunivalana pondiyunnaaḍu.

8. నావలెనుండుట వారికి మేలని పెండ్లికానివారితోను విధవరాండ్రతోను చెప్పుచున్నాను.

8. naavalenuṇḍuṭa vaariki mēlani peṇḍlikaanivaarithoonu vidhavaraaṇḍrathoonu cheppuchunnaanu.

9. అయితే మనస్సు నిలుపలేనియెడల పెండ్లిచేసికొనవచ్చును; కామతప్తులగుట కంటె పెండ్లిచేసికొనుట మేలు.

9. ayithē manassu nilupalēniyeḍala peṇḍlichesikonavachunu; kaamathapthulaguṭa kaṇṭe peṇḍlichesikonuṭa mēlu.

10. మరియు పెండ్లియైన వారికి నేను కాదు ప్రభువే ఆజ్ఞాపించునదేమనగా, భార్య భర్తను ఎడబాయకూడదు.

10. mariyu peṇḍliyaina vaariki nēnu kaadu prabhuvē aagnaapin̄chunadhemanagaa, bhaarya bharthanu eḍabaayakooḍadu.

11. ఎడబాసినయెడల పెండ్లిచేసికొనకుండవలెను; లేదా, తన భర్తతో సమాధాన పడవలెను. మరియు భర్త తన భార్యను పరిత్యజింప కూడదు.

11. eḍabaasinayeḍala peṇḍlichesikonakuṇḍavalenu; lēdaa, thana bharthathoo samaadhaana paḍavalenu. Mariyu bhartha thana bhaaryanu parityajimpa kooḍadu.

12. ప్రభువు కాదు నేనే తక్కినవారితో చెప్పున దేమనగా ఏ సహోదరునికైనను అవిశ్వాసురాలైన భార్య యుండి, ఆమె అతనితో కాపురము చేయ నిష్టపడిన యెడల, అతడు ఆమెను పరిత్యజింపకూడదు.

12. prabhuvu kaadu nēnē thakkinavaarithoo cheppuna dhemanagaa ē sahōdarunikainanu avishvaasuraalaina bhaarya yuṇḍi, aame athanithoo kaapuramu cheya nishṭapaḍina yeḍala, athaḍu aamenu parityajimpakooḍadu.

13. మరియు ఏ స్త్రీకైనను అవిశ్వాసియైన భర్తయుండి, ఆమెతో కాపురముచేయ నిష్టపడినయెడల, ఆమె అతని పరిత్య జింపకూడదు.

13. mariyu ē streekainanu avishvaasiyaina bharthayuṇḍi, aamethoo kaapuramucheya nishṭapaḍinayeḍala, aame athani paritya jimpakooḍadu.

14. అవిశ్వాసియైన భర్త భార్యనుబట్టి పరిశుద్ధ పరచబడును; అవిశ్వాసురాలైన భార్య విశ్వాసియైన భర్తనుబట్టి పరిశుద్ధపరచబడును. లేనియెడల మీ పిల్లలు అపవిత్రులై యుందురు, ఇప్పుడైతే వారు పవిత్రులు

14. avishvaasiyaina bhartha bhaaryanubaṭṭi parishuddha parachabaḍunu; avishvaasuraalaina bhaarya vishvaasiyaina bharthanubaṭṭi parishuddhaparachabaḍunu. Lēniyeḍala mee pillalu apavitrulai yunduru, ippuḍaithē vaaru pavitrulu

15. అయితే అవిశ్వాసియైనవాడు ఎడబాసిన ఎడబాయ వచ్చును; అట్టి సందర్భములలో సహోదరునికైనను సహోదరికైనను నిర్బంధము లేదు. సమాధానముగా ఉండుటకు దేవుడు మనలను పిలిచియున్నాడు.

15. ayithē avishvaasiyainavaaḍu eḍabaasina eḍabaaya vachunu; aṭṭi sandarbhamulalō sahōdarunikainanu sahōdarikainanu nirbandhamu lēdu. Samaadhaanamugaa uṇḍuṭaku dhevuḍu manalanu pilichiyunnaaḍu.

16. ఓ స్త్రీ, నీ భర్తను రక్షించెదవో లేదో నీకేమి తెలియును? ఓ పురుషుడా, నీ భార్యను రక్షించెదవో లేదో నీకేమి తెలియును?

16. ō stree, nee bharthanu rakshin̄chedavō lēdō neekēmi teliyunu? Ō purushuḍaa, nee bhaaryanu rakshin̄chedavō lēdō neekēmi teliyunu?

17. అయితే ప్రభువు ప్రతివానికి ఏస్థితి నియమించెనో, దేవుడు ప్రతివానిని ఏస్థితియందు పిలిచెనో, ఆ స్థితియందే నడుచుకొనవలెను; ఈ ప్రకారమే సంఘములన్నిటిలో నియమించుచున్నాను.

17. ayithē prabhuvu prathivaaniki ēsthithi niyamin̄chenō, dhevuḍu prathivaanini ēsthithiyandu pilichenō, aa sthithiyandhe naḍuchukonavalenu; ee prakaaramē saṅghamulanniṭilō niyamin̄chuchunnaanu.

18. సున్నతి పొందినవాడెవడైనను పిలువబడెనా? అతడు సున్నతి పోగొట్టుకొనవలదు; సున్నతి పొందనివాడెవడైనను పిలువబడెనా? సున్నతి పొందవలదు.

18. sunnathi pondinavaaḍevaḍainanu piluvabaḍenaa? Athaḍu sunnathi pōgoṭṭukonavaladu; sunnathi pondanivaaḍevaḍainanu piluvabaḍenaa? Sunnathi pondavaladu.

19. దేవుని ఆజ్ఞలను అనుసరించుటయే ముఖ్యము గాని సున్నతి పొందుటయందు ఏమియు లేదు, సున్నతి పొందక పోవుటయందు ఏమియులేదు.

19. dhevuni aagnalanu anusarin̄chuṭayē mukhyamu gaani sunnathi ponduṭayandu ēmiyu lēdu, sunnathi pondaka pōvuṭayandu ēmiyulēdu.

20. ప్రతివాడు ఏ స్థితిలో పిలువబడెనో ఆ స్థితిలోనే యుండవలెను.

20. prathivaaḍu ē sthithilō piluvabaḍenō aa sthithilōnē yuṇḍavalenu.

21. దాసుడవై యుండగా పిలువబడితివా? చింతపడవద్దు గాని స్వతంత్రుడవగుటకు శక్తి కలిగినయెడల, స్వతంత్రుడవగుట మరి మంచిది.

21. daasuḍavai yuṇḍagaa piluvabaḍithivaa? chinthapaḍavaddu gaani svathantruḍavaguṭaku shakthi kaliginayeḍala, svathantruḍavaguṭa mari man̄chidi.

22. ప్రభువునందు పిలువబడిన దాసుడు ప్రభువువలన స్వాతంత్ర్యము పొందినవాడు. ఆ ప్రకారమే స్వతంత్రుడైయుండి పిలువబడినవాడు క్రీస్తు దాసుడు.

22. prabhuvunandu piluvabaḍina daasuḍu prabhuvuvalana svaathantryamu pondinavaaḍu. aa prakaaramē svathantruḍaiyuṇḍi piluvabaḍinavaaḍu kreesthu daasuḍu.

23. మీరు విలువపెట్టి కొనబడినవారు గనుక మనుష్యులకు దాసులు కాకుడి.

23. meeru viluvapeṭṭi konabaḍinavaaru ganuka manushyulaku daasulu kaakuḍi.

24. సహోదరులారా, ప్రతి మనుష్యుడును ఏస్థితిలో పిలువబడునో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండవలెను.

24. sahōdarulaaraa, prathi manushyuḍunu ēsthithilō piluvabaḍunō aa sthithilōnē dhevunithoo sahavaasamu kaligi uṇḍavalenu.

25. కన్యకల విషయమై, ప్రభువుయొక్క ఆజ్ఞ నేను పొందలేదు గాని నమ్మకమైనవాడనై యుండుటకు ప్రభువు వలన కనికరము పొందినవాడనై నా తాత్పర్యము చెప్పు చున్నాను.

25. kanyakala vishayamai, prabhuvuyokka aagna nēnu pondalēdu gaani nammakamainavaaḍanai yuṇḍuṭaku prabhuvu valana kanikaramu pondinavaaḍanai naa thaatparyamu cheppu chunnaanu.

26. ఇప్పటి ఇబ్బందినిబట్టి పురుషుడు తానున్న స్థితిలోనే యుండుట మేలని తలంచుచున్నాను.

26. ippaṭi ibbandhinibaṭṭi purushuḍu thaanunna sthithilōnē yuṇḍuṭa mēlani thalan̄chuchunnaanu.

27. భార్యకు బద్ధుడవై యుంటివా? విడుదల కోరవద్దు. భార్యలేక విడిగానుంటివా? వివాహము కోరవద్దు.

27. bhaaryaku baddhuḍavai yuṇṭivaa? Viḍudala kōravaddu. Bhaaryalēka viḍigaanuṇṭivaa? Vivaahamu kōravaddu.

28. అయినను నీవు పెండ్లిచేసికొనినను పాపము లేదు, కన్యక పెండ్లిచేసి కొనినను ఆమెకు పాపము లేదు; అయితే అట్టివారికి శరీరసంబంధమైన శ్రమలు కలుగును; అవి మీకు కలుగకుండవలెనని కోరుచున్నాను.

28. ayinanu neevu peṇḍlichesikoninanu paapamu lēdu, kanyaka peṇḍlichesi koninanu aameku paapamu lēdu; ayithē aṭṭivaariki shareerasambandhamaina shramalu kalugunu; avi meeku kalugakuṇḍavalenani kōruchunnaanu.

29. సహోదరులారా, నేను చెప్పునదే మనగా, కాలము సంకుచితమై యున్నది గనుక ఇకమీదట భార్యలు కలిగినవారు భార్యలు లేనట్టును

29. sahōdarulaaraa, nēnu cheppunadhe managaa, kaalamu saṅkuchithamai yunnadhi ganuka ikameedaṭa bhaaryalu kaliginavaaru bhaaryalu lēnaṭṭunu

30. ఏడ్చువారు ఏడ్వనట్టును సంతోషపడువారు సంతోష పడనట్టును కొనువారు తాము కొనినది తమది కానట్టును

30. ēḍchuvaaru ēḍvanaṭṭunu santhooshapaḍuvaaru santhoosha paḍanaṭṭunu konuvaaru thaamu koninadhi thamadhi kaanaṭṭunu

31. ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవింప నట్టును ఉండవలెను; ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది.

31. ee lōkamu anubhavin̄chuvaaru amithamugaa anubhavimpa naṭṭunu uṇḍavalenu; yēlayanagaa ee lōkapu naṭana gathin̄chuchunnadhi.

32. మీరు చింతలేని వారై యుండవలెనని కోరుచున్నాను. పెండ్లికానివాడు ప్రభువును ఏలాగు సంతోషపెట్టగలనని ప్రభువు విషయమైన కార్యములను గూర్చి చింతించుచున్నాడు.

32. meeru chinthalēni vaarai yuṇḍavalenani kōruchunnaanu. Peṇḍlikaanivaaḍu prabhuvunu ēlaagu santhooshapeṭṭagalanani prabhuvu vishayamaina kaaryamulanu goorchi chinthin̄chuchunnaaḍu.

33. పెండ్లియైనవాడు భార్యను ఏలాగు సంతోషపెట్టగలనని లోకవిషయమైనవాటిని గూర్చి చింతించుచున్నాడు.

33. peṇḍliyainavaaḍu bhaaryanu ēlaagu santhooshapeṭṭagalanani lōkavishayamainavaaṭini goorchi chinthin̄chuchunnaaḍu.

34. అటువలెనే పెండ్లికాని స్త్రీయు కన్యకయు తాము శరీరమందును ఆత్మయందును పవిత్రురాండ్రయియుండుటకు ప్రభువు విషయమైన కార్యములనుగూర్చి చింతించుచుందురు గాని పెండ్లియైనది భర్తను ఏలాగు సంతోషపెట్టగలనని లోక విషయమైనవాటిని గూర్చి చింతించుచున్నది.

34. aṭuvalenē peṇḍlikaani streeyu kanyakayu thaamu shareeramandunu aatmayandunu pavitruraaṇḍrayiyuṇḍuṭaku prabhuvu vishayamaina kaaryamulanugoorchi chinthin̄chuchunduru gaani peṇḍliyainadhi bharthanu ēlaagu santhooshapeṭṭagalanani lōka vishayamainavaaṭini goorchi chinthin̄chuchunnadhi.

35. మీకు ఉరియొడ్డవలెనని కాదుగాని మీరు యోగ్య ప్రవర్తనులై, తొందర యేమియు లేక ప్రభువు సన్నిధాన వర్తనులై యుండవలెనని యిది మీ ప్రయోజనము నిమిత్తమే చెప్పుచున్నాను.

35. meeku uriyoḍḍavalenani kaadugaani meeru yōgya pravarthanulai, tondhara yēmiyu lēka prabhuvu sannidhaana varthanulai yuṇḍavalenani yidi mee prayōjanamu nimitthamē cheppuchunnaanu.

36. అయితే ఒకని కుమార్తెకు ఈడు మించిపోయినయెడలను, ఆమెకు వివాహము చేయవలసివచ్చినయెడలను, ఆమెకు వివాహము చేయకపోవుట యోగ్యమైనది కాదని ఒకడు తలంచినయెడలను, అతడు తన యిష్టముచొప్పున పెండ్లి చేయవచ్చును; అందులో పాపము లేదు, ఆమె పెండ్లి చేసికొనవచ్చును

36. ayithē okani kumaartheku eeḍu min̄chipōyinayeḍalanu, aameku vivaahamu cheyavalasivachinayeḍalanu, aameku vivaahamu cheyakapōvuṭa yōgyamainadhi kaadani okaḍu thalan̄chinayeḍalanu, athaḍu thana yishṭamuchoppuna peṇḍli cheyavachunu; andulō paapamu lēdu, aame peṇḍli chesikonavachunu

37. ఎవడైనను తన కుమార్తెకు పెండ్లిచేయ నవసరములేకయుండి, అతడు స్థిరచిత్తుడును, తన ఇష్ట ప్రకారము జరుప శక్తిగలవాడునై, ఆమెను వివాహములేకుండ ఉంచవలెనని తన మనస్సులో నిశ్చయించుకొనిన యెడల బాగుగా ప్రవర్తించుచున్నాడు.

37. evaḍainanu thana kumaartheku peṇḍlicheya navasaramulēkayuṇḍi, athaḍu sthirachitthuḍunu, thana ishṭa prakaaramu jarupa shakthigalavaaḍunai, aamenu vivaahamulēkuṇḍa un̄chavalenani thana manassulō nishchayin̄chukonina yeḍala baagugaa pravarthin̄chuchunnaaḍu.

38. కాబట్టి తన కుమార్తెకు పెండ్లిచేయువాడు బాగుగా ప్రవర్తించు చున్నాడు, పెండ్లి చేయనివాడు మరి బాగుగా ప్రవర్తించు చున్నాడు.

38. kaabaṭṭi thana kumaartheku peṇḍlicheyuvaaḍu baagugaa pravarthin̄chu chunnaaḍu, peṇḍli cheyanivaaḍu mari baagugaa pravarthin̄chu chunnaaḍu.

39. భార్య తన భర్త బ్రదికియున్నంతకాలము బద్ధురాలైయుండును, భర్త మృతిపొందినయెడల ఆమె కిష్టమైనవానిని పెండ్లి చేసికొనుటకు స్వతంత్రురాలై యుండునుగాని ప్రభువు నందు మాత్రమే పెండ్లిచేసికొన వలెను.

39. bhaarya thana bhartha bradhikiyunnanthakaalamu baddhuraalaiyuṇḍunu, bhartha mruthipondinayeḍala aame kishṭamainavaanini peṇḍli chesikonuṭaku svathantruraalai yuṇḍunugaani prabhuvu nandu maatramē peṇḍlichesikona valenu.

40. అయితే ఆమె విధవరాలుగా ఉండినట్టయిన మరి ధన్యురాలని నా అభిప్రాయము. దేవుని ఆత్మనాకును కలిగియున్నదని తలంచుకొనుచున్నాను.

40. ayithē aame vidhavaraalugaa uṇḍinaṭṭayina mari dhanyuraalani naa abhipraayamu. dhevuni aatmanaakunu kaligiyunnadani thalan̄chukonuchunnaanu.


Shortcut Links
1 కోరింథీయులకు - 1 Corinthians : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |

Support & Donate Us | Google Play Store | సజీవ వాహిని - Sajeeva Vahini 2009-2023. info@sajeevavahini.com
Sajeeva Vahini, Hyderabad & Chennai, India. SajeevaVahini.org Email: , . Whatsapp: 8898 318 318 or call us: +918898318318
Content on this website is prepared manually by Sajeeva Vahini, India. Our Content is free and open to use for any kind of distrubution. We request to carry a physical bible to churches rather than using bible on mobile or tablets. Please email any information for any suspected content/audio subject to piracy/copyright act on this website can be considered/removed. Which can help us to improve better. Note: we dont have any data/content related to Life Way Study Bible as a part of Sajeeva Vahini Notes or Verse Explanations.