Corinthians I - 1 కొరింథీయులకు 4 | View All

1. ఈలాగున క్రీస్తు సేవకులమనియు, దేవుని మర్మముల విషయములో గృహనిర్వాహకులమనియు ప్రతి మనుష్యుడు మమ్మును భావింపవలెను.

1 కోరింథీయులకు 2:7; 1 కోరింథీయులకు 3:5, 1 కోరింథీయులకు 3:10; రోమీయులకు 16:25; గలతియులకు 1:11-12; ఎఫెసీయులకు 3:2-3. పౌలు, ఇతర రాయబారులు, క్రీస్తు సేవకులు వారి ఉపదేశాలను వారే కల్పించలేదు. దేవుడు వాటిని వెల్లడించి వారి సంరక్షణ క్రింద ఉంచాడు. ఈ సత్యంలోని ప్రాధాన్యతను అందరూ అర్థం చేసుకోవాలని పౌలు కోరిక.

2. మరియు గృహనిర్వాహకులలో ప్రతివాడును నమ్మకమైనవాడై యుండుట అవశ్యము.

మత్తయి 24:45; మత్తయి 25:21, మత్తయి 25:23; లూకా 16:10; లూకా 19:17. క్రీస్తు సేవకులందరికీ తప్పనిసరిగా ఉండవలసిన లక్షణం విశ్వసనీయత, తాము చేసే పనిలో నమ్మకంగా ఉండడం.

3. మీ చేతనైనను, ఏ మనుష్యునిచేతనైనను నేను విమర్శింపబడుట నాకు మిక్కిలి అల్పమైన సంగతి; నన్ను నేనే విమర్శించుకొనను.

కొరింతువారు తనలో విశ్వసనీయత ఉందని అనుకున్నారో లేదోనని పౌలుకు పెద్దగా పట్టింపు లేదు. తాను క్రీస్తు సేవకుడు, వారి సేవకుడు కాదు. క్రీస్తే తనను పంపించి, ఏమి ఉపదేశించాలో చెప్పాడు, వారు కాదు. తాను జవాబు చెప్పుకోవలసినది క్రీస్తుకే, వారికి కాదు. రోమీయులకు 14:10-12 పోల్చి చూడండి. పౌలు తనకు తాను తీర్పు తీర్చుకోలేదు. అది తన పని కాదు. ఎవరూ కూడా తనకు తాను సరిగా తీర్పు తీర్చుకోలేరని అతనికి తెలుసు. దేవుడు మాత్రమే అలా చెయ్యగలడు. ఎందుకంటే ప్రతి వ్యక్తికీ తాను ఏ పని అప్పగించాడో, వ్యక్తి ఉద్దేశాలు, పోరాటాలు, పరీక్షలు, బాధలు, అంతరంగంలో జరిగేవి ఏమిటో ఆయనకే పూర్తిగా తెలుసు. ఈ విధంగా ఇతరుల తీర్పును గురించి ఆందోళన లేనప్పుడు దేవుడు నడిపించిన రీతిలో ఆయనకు సేవ చేసేందుకు స్వేచ్ఛ ఉంటుంది.

4. నాయందు నాకు ఏ దోషమును కానరాదు; అయినను ఇందువలన నీతిమంతు డనుగా ఎంచబడను, నన్ను విమర్శించువాడు ప్రభువే.
కీర్తనల గ్రంథము 143:2

5. కాబట్టి సమయము రాకమునుపు, అనగా ప్రభువు వచ్చు వరకు, దేనిని గూర్చియు తీర్పు తీర్చకుడి. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరచునప్పుడు, ప్రతి వానికిని తగిన మెప్పు దేవునివలన కలుగును.

ఇతరుల విశ్వసనీయత, వారి ఉద్దేశాల విషయంలో ఏమీ తీర్పు తీర్చకూడదని పౌలు భావం. మనుషుల బయటి ప్రవర్తన విషయంలో తీర్పు తీర్చాలని తరువాతి భాగంలో పౌలు వారికి చెప్పాడు (1 కోరింథీయులకు 5:12; 1 కోరింథీయులకు 6:1-6). హృదయంలో దాగి ఉండేవాటిని క్రీస్తు తీర్పు తీర్చగలడు, తీరుస్తాడు. ఏ మనిషీ దాన్ని చేయడానికి ప్రయత్నించకూడదు. “మెప్పు దేవుని వల్ల”– మత్తయి 25:21, మత్తయి 25:23; రోమీయులకు 2:29; 2 కోరింథీయులకు 10:18; గలతియులకు 1:10.

6. సహోదరులారా, మీరు మమ్మును చూచి, లేఖనముల యందు వ్రాసియున్న సంగతులను అతిక్రమింపకూడదని నేర్చుకొని, మీరొకని పక్షమున మరియొకని మీద ఉప్పొంగకుండునట్లు, ఈ మాటలు మీ నిమిత్తమై నా మీదను అపొల్లోమీదను పెట్టుకొని సాదృశ్యరూపముగా చెప్పియున్నాను.

కొరింతులోని విశ్వాసులతో వచ్చిన సమస్య ఏమిటంటే వారు దేవుని సేవకులను బైబిలు దృష్టిలో (అంటే లేఖనాల్లో రాసి ఉన్నదాన్ని బట్టి) చూడడం లేదు. దీనికి పౌలు తనను, అపొల్లోను ఇందుకు ఉదాహరణలుగా తీసుకొన్నాడు. వారు మనుషులకు తీర్పు తీరుస్తున్నారు, తమ ఇష్టం వచ్చినట్టు వారిని గొప్ప చేస్తున్నారు, లేదా నేరం మోపుతున్నారు. ఇలా చేయకూడదని వారు నేర్చుకోవడం అవసరం.

7. ఎందుకనగా నీకు ఆధిక్యము కలుగ జేయువాడెవడు? నీకు కలిగిన వాటిలో పరునివలన నీవు పొందనిది ఏది?పొందియుండియు పొందనట్టు నీవు అతిశ యింపనేల?

కొందరు తమ శక్తి సామర్థ్యాలను బట్టి, పదవులను బట్టి, లేదా తాము ఫలానా ఉపదేశకుణ్ణి అనుసరిస్తున్నామనే దాన్ని బట్టి అతిశయపడుతున్నారు. అక్కడున్న ఇతర క్రైస్తవులకంటే తమను అధికులుగా ఎంచుకునే విపరీతమైన పాపంలో పడిపోయారు (వారి అభిప్రాయాలు ఇందుకు సరిగ్గా వ్యతిరేకంగా ఉండవలసింది. ఫిలిప్పీయులకు 2:3 చూడండి. లూకా 18:9 పోల్చి చూడండి). వారికి ఉండదగిన విలువైనదేదైనా సరే దాన్ని దేవుడు ఉచితంగా ఇచ్చినదే అని పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. వారు అతిశయించదలచుకుంటే ఇచ్చిన దేవుని విషయంలో అతిశయించాలి, గాని తమ విషయంలో కాదు (1 కోరింథీయులకు 15:10)

8. ఇదివరకే మీరేమియు కొదువలేక తృప్తు లైతిరి, ఇది వరకే ఐశ్వర్యవంతులైతిరి, మమ్మును విడిచిపెట్టి మీరు రాజులైతిరి; అవును, మేమును మీతోకూడ రాజుల మగునట్లు మీరు రాజులగుట నాకు సంతోషమే గదా?

కొరింతువారు గొప్పలు చెప్పుకోవడం అనే సంగతిని ఖండించేందుకు పౌలు వ్యంగ్యం మాటలు ఉపయోగిస్తున్నాడు. వారి ఆధ్యాత్మిక జీవితానికి మేలు కలగాలని అతడలా చేస్తున్నాడు. పౌలు అంటున్నాడు, “మీరు క్రైస్తవ జీవితంలో ఎత్తైన శిఖరాలకు ఎక్కినట్టు మీరు అనుకుంటున్నట్టుంది. పరిపూర్ణత అనే గమ్యాన్ని చేరి, మహిమలో క్రీస్తుతో కూడా రాజ్యమేలుతున్నారని అనుకొంటున్నట్టుంది”.

9. మరణదండన విధింపబడినవారమైనట్టు దేవుడు అపొస్తలులమైన మమ్మును అందరికంటె కడపట ఉంచియున్నాడని నాకు తోచుచున్నది. మేము లోకమునకును దేవదూతలకును మనుష్యులకును వేడుకగా నున్నాము.

క్రీస్తు రాయబారులు భరించిన హింసలు, బాధల గురించి పౌలు మాట్లాడుతున్నాడు (అపో. కార్యములు 5:17-18, అపో. కార్యములు 5:40; అపో. కార్యములు 12:1-4; అపో. కార్యములు 14:19; అపో. కార్యములు 16:22-24; 2 కోరింథీయులకు 11:23-27). ఆ రోజుల్లో కొన్ని సార్లు అధికారులు నేరస్థులను చంపేముందు వారిని ప్రజల ఎదుట ఊరేగింపుగా నడిచేలా చేసేవారు. లోకంలో తన స్థానం అలా ఉన్నట్టుందని పౌలు అంటున్నాడు. ఇది ఎవరి ప్రమేయమూ లేకుండా, అదృష్టంకొద్దీ ఇలా జరిగిందని పౌలు అనుకోలేదు. ఒక జ్ఞానయుక్తమైన మంచి ఉద్దేశంతో దేవుడు ఇలా చేశాడని అతని నమ్మకం.

10. మేముక్రీస్తు నిమిత్తము వెఱ్ఱివారము, మీరు క్రీస్తునందు బుద్ధిమంతులు; మేము బలహీనులము, మీరు బలవంతులు; మీరు ఘనులు, మేము ఘనహీనులము.

“క్రీస్తు కోసం మందబుద్దులం”– లోక సంబంధమైన జ్ఞానాన్ని త్రోసిపుచ్చి లోకం వెర్రితనంగా (1 కోరింథీయులకు 1:18, 1 కోరింథీయులకు 1:23) భావించినదాన్ని ఉపదేశించేందుకు తాము సిద్ధమయ్యామని పౌలు ఉద్దేశం. కొరింతు క్రైస్తవులు నిజంగా జ్ఞానవంతులు కారు – అలాగని అనుకుంటున్నారు అంతే. “బలహీనులం”– 1 కోరింథీయులకు 2:3; 2 కోరింథీయులకు 12:9-10.

11. ఈ గడియవరకు ఆకలి దప్పులు గలవారము, దిగంబరులము; పిడిగుద్దులు తినుచున్నాము; నిలువరమైన నివాసములేక యున్నాము;

2 కోరింథీయులకు 11:27. మనుషులందరిలోకీ ఉత్తములు, ఆధ్యాత్మికంగా ఉన్నతులు అయినవారిని ఈ లోకం ఇలా చేస్తుంది. హెబ్రీయులకు 11:36-38; యోహాను 15:18-21; యోహాను 16:33 పోల్చి చూడండి.

12. స్వహస్తములతో పనిచేసి కష్టపడుచున్నాము. నిందింప బడియు దీవించుచున్నాము; హింసింపబడియు ఓర్చు కొనుచున్నాము;
కీర్తనల గ్రంథము 109:28

“కష్టపడి పని చేస్తున్నాం”– అపో. కార్యములు 18:3; అపో. కార్యములు 20:34-35. “దీవిస్తాం”– మత్తయి 5:44; లూకా 6:27-28; రోమీయులకు 12:14; 1 పేతురు 2:21-23.

13. దూషింపబడియు బతిమాలుకొను చున్నాము లోకమునకు మురికిగాను అందరికి పెంటగాను ఇప్పటివరకు ఎంచబడియున్నాము.
విలాపవాక్యములు 3:45

“చెత్త”– అంటే ఈ లోకం క్రీస్తురాయబారులను మనుషులందరిలోకి అతి హీనులుగా, నీచులుగా, నికృష్టులుగా భావించింది.

14. మిమ్మును సిగ్గుపరచవలెనని కాదుగాని నా ప్రియమైన పిల్లలని మీకు బుద్ధిచెప్పుటకు ఈ మాటలు వ్రాయు చున్నాను.

ఇలా రాయడంలో వారికి తనపై జాలి కలగాలనీ, లేక వారు తన విషయం సిగ్గుపడాలనీ పౌలు ఉద్దేశం కాదు. వారి పేద ఆధ్యాత్మిక స్థితిని అతడు చూచి వారిపై ప్రేమతో (“నా ప్రియమైన పిల్లలని”) దాని గురించి వారిని హెచ్చరించడానికే ఇలా రాశాడు.

15. క్రీస్తునందు మీకు ఉపదేశకులు పదివేలమంది యున్నను తండ్రులు అనేకులు లేరు.

దేవుని రాజ్యంలోకి ఆధ్యాత్మికంగా వారు జన్మించారు (యోహాను 1:12-13; యోహాను 3:3-8). ఇది పౌలు పరిచర్య మూలంగా జరిగింది. గలతియులకు 4:19 పోల్చి చూడండి.

16. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకొనువారై యుండవలెనని మిమ్మును బతిమాలుకొనుచున్నాను.

ఫిలిప్పీయులకు 3:17; 1 థెస్సలొనీకయులకు 1:6. పౌలు తనవైపుకు మనుషులను ఆకర్షించుకునేందుకు ఎంతమాత్రం ప్రయత్నించడం లేదు. (1 కోరింథీయులకు 3:1-7). అయితే మనుషులు ఎలా జీవించాలి అన్నదానికి దేవుడు తననొక మాదిరిగా ఉంచాడని, తాను ఉపదేశించిన శుభవార్తను ఆయనే వెల్లడి చేశాడని పౌలుకు తెలుసు. అతడు క్రీస్తును అనుసరించే మనిషి. అందువల్ల విశ్వాసులు అతణ్ణి అనుసరించడం క్షేమకరమే – 1 కోరింథీయులకు 11:1. అతడు ఒకటి ఉపదేశించి, మరో రకంగా ప్రవర్తించే అనేకమందిలాంటి వాడు కాదు (మత్తయి 23:3; రోమీయులకు 2:21-24). వారిని కలవరపరచేందుకు వచ్చిన కపట బోధకులను అనుసరించడం క్షేమకరం కాదు.

17. ఇందునిమిత్తము ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడునగు తిమోతిని మీ యొద్దకు పంపియున్నాను. అతడు క్రీస్తునందు నేను నడుచుకొను విధమును, అనగా ప్రతి స్థలములోను ప్రతి సంఘములోను నేను బోధించు విధమును, మీకు జ్ఞాపకము చేయును.

పౌలు భౌతికంగా తిమోతి తండ్రి కాదు. ఆధ్యాత్మికంగా తండ్రి (అపో. కార్యములు 16:1; 1 తిమోతికి 1:2). పౌలు ఉపదేశాలకూ, అతని జీవిత విధానానికీ సరిపోతుందని తిమోతి కొరింతువారికి చెప్పగలడు.

18. నేను మీ యొద్దకు రానని అనుకొని కొందరుప్పొంగుచున్నారు.

పౌలుకు వ్యతిరేక పక్షాల్లో ఒకదానికి చెందిన వారు వీరు. వారి లోక సంబంధమైన జ్ఞానంతో పాప సంబంధమైన గర్వంతో తామే పౌలుకంటే గొప్పవారం అనుకుంటున్నారు. అతడిక కొరింతుకు రాడని వారనుకుంటున్నారు.

19. ప్రభువు చిత్తమైతే త్వరలోనే మీయొద్దకు వచ్చి, ఉప్పొంగుచున్న వారి మాటలను కాదు వారి శక్తినే తెలిసికొందును.

“ప్రభు చిత్తమైతే”– పౌలు జీవితంలో ఎప్పుడూ తనను ఏలే తలంపుల్లో ఒకటి ఇది. యాకోబు 4:13-16 పోల్చి చూడండి.

20. దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితోనేయున్నది.

కొరింతులో పౌలుకు వ్యతిరేకంగా ఉన్నవారు మంచి ప్రసంగాలు చెయ్యగలరు గాని మంచి జీవితాలు వారికున్నాయా? క్రీస్తు నిజమైన శుభవార్తే విముక్తి కలిగించే దేవుని ప్రభావం (రోమీయులకు 1:16). అది మనుషులను కొత్తవారుగా చేస్తుంది (2 కోరింథీయులకు 5:17). ఒక మనిషి మారకపోతే అణకువ, విధేయత, పవిత్రతతో బ్రతకడానికి అతనిలో శక్తి లేకపోతే అతని మాటలు, ఉపదేశాలు వ్యర్థమే. రోమీయులకు 14:17 పోల్చి చూడండి.

21. మీరేది కోరుచున్నారు? బెత్తముతో నేను మీయొద్దకు రావలెనా? ప్రేమతోను సాత్వికమైన మనస్సుతోను రావలెనా?

“బెత్తం”– పౌలు క్రీస్తురాయబారి. కొరింతువారికి ఆధ్యాత్మికంగా తండ్రి (వ 15). వారి స్థితికి తగినట్టు క్రమశిక్షణలో పెట్టేందుకు, మందలించేందుకు, బుద్ధి చెప్పేందుకు అతనికి హక్కు ఉంది. 2 కోరింథీయులకు 13:10 చూడండి. కఠినమైన క్రమశిక్షణతో నిమిత్తం లేకుండా వారితో ప్రేమ పూర్వకమైన సహవాసం చేయడమే అతనికి ఇష్టం. అయితే ఏది కావాలో వారే తేల్చుకోవాలి. 2 కోరింథీయులకు 1:23-24 చూడండి.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Corinthians I - 1 కొరింథీయులకు 4 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

సువార్త పరిచారకుల నిజమైన పాత్ర. (1-6) 
అపొస్తలులు కేవలం క్రీస్తు సేవకులు కాదు; ఒక ముఖ్యమైన ట్రస్ట్ మరియు గౌరవప్రదమైన పదవిని కలిగి ఉండే వారి పాత్ర గౌరవించబడాలి. పౌలు తన ఖ్యాతిని దృష్టిలో ఉంచుకుని, అన్నింటికంటే మనుష్యులను సంతోషపెట్టాలని కోరుకోవడం క్రీస్తు నమ్మకమైన సేవకునిగా ఉండదని అతను గుర్తించాడు. మన అంతిమ న్యాయమూర్తులు తోటి మనుషులు కాదని ఇది ఓదార్పునిస్తుంది. స్వీయ-తీర్పు లేదా స్వీయ-సమర్థన మన భద్రత మరియు ఆనందానికి హామీ ఇవ్వదు. మన విశ్వసనీయతపై మన అంచనా లేదా సమర్థన కోసం మేము చేసే పనులపై మాత్రమే ఆధారపడలేము. దాగివున్న పాపాలు బహిర్గతమయ్యే మరియు హృదయాలు బయలు దేరే రోజు ఆసన్నమైంది. ఆ రోజున, అన్యాయంగా విమర్శించబడిన ప్రతి విశ్వాసి నిరూపించబడతాడు మరియు ప్రతి నమ్మకమైన సేవకుడు గుర్తించబడతాడు మరియు బహుమానం పొందుతాడు. ప్రజలను అంచనా వేయడానికి దేవుని వాక్యం అత్యంత నమ్మదగిన ప్రమాణంగా పనిచేస్తుంది. తగాదాలు తరచుగా అహంకారం నుండి ఉత్పన్నమవుతాయి మరియు మన ఉపాధ్యాయుల పట్ల లేదా మనపై అనవసరమైన గౌరవం స్వీయ-అహంకారంతో ప్రేరేపించబడవచ్చు. అవన్నీ దేవుడు ఉపయోగించిన సాధనాలనీ, ఒక్కొక్కటి వివిధ ప్రతిభతో కూడుకున్నవని మనం గుర్తుచేసుకున్నప్పుడు వినయాన్ని కాపాడుకోవడం సులభం అవుతుంది.

అపొస్తలుని తృణీకరించకుండా జాగ్రత్తలు. (7-13) 
అహంకారానికి మాకు ఆధారాలు లేవు; మనలోని అన్ని మంచితనం, మన ఆస్తులు మరియు మన చర్యలు దేవుని ఉచిత మరియు సమృద్ధిగా ఉన్న దయ యొక్క ఫలితం. సార్వభౌమాధికారం ద్వారా మాత్రమే విధ్వంసం నుండి రక్షించబడిన పాపి, దేవుని ఉచిత బహుమతుల గురించి ప్రగల్భాలు పలకడం అసంబద్ధం మరియు అస్థిరమైనది. సెయింట్ పాల్ తన స్వంత పరిస్థితులను 9వ వచనంలో వివరించాడు, వినోదం కోసం పురుషులు ఒకరికొకరు హాని చేసుకునేలా ఒత్తిడి చేయబడిన రోమన్ ఆటలలోని క్రూరమైన దృశ్యాలకు సమాంతరంగా చిత్రించాడు. విజేత, అతను తన ప్రత్యర్థిని చంపినప్పటికీ, మరణం నుండి తప్పించుకోలేదు కానీ మరొక రౌండ్ పోరాటానికి కేటాయించబడ్డాడు మరియు చివరికి అతని మరణాన్ని ఎదుర్కొన్నాడు. వారి పోరాటాల సమయంలో అనేక కళ్ళు విశ్వాసులపై ఉన్నాయని గుర్తించడం పట్టుదల మరియు సహనాన్ని పెంపొందించాలి.
"మేము బలహీనులం, కానీ మీరు బలంగా ఉన్నారు," వివిధ క్రైస్తవులు ఎదుర్కొంటున్న విభిన్న సవాళ్లను నొక్కి చెబుతుంది. అపొస్తలుడు వారి నిర్దిష్ట కష్టాలను వివరించాడు, ఈ పరీక్షల ద్వారా వారిని మోసుకెళ్లిన గొప్ప దాతృత్వం మరియు భక్తిని హైలైట్ చేస్తాడు. వారు మానవత్వంలోని చెత్తగా మరియు నీచంగా పరిగణించబడేంత వరకు బాధలను భరించారు, వాటిని తుడిచివేయవలసిన మురికిగా, మరియు అన్ని విషయాలపై-సమాజం యొక్క చెత్తగా కూడా ఉన్నారు. క్రీస్తుయేసునందు విశ్వాసముంచాలని కోరుకునే ఎవరైనా పేదరికం మరియు ధిక్కారం కోసం సిద్ధంగా ఉండాలి. ఇతరుల నుండి దుర్వినియోగం చేయబడినప్పటికీ, క్రీస్తు శిష్యులు అతని మాదిరిని అనుకరించాలి మరియు అతని చిత్తాన్ని మరియు బోధలను నెరవేర్చాలి. వారు అతని కొరకు, అసహ్యాన్ని మరియు దుర్వినియోగాన్ని భరించడానికి సంతృప్తి చెందాలి.
సెయింట్ పాల్ వలె తిరస్కరించబడటం, తృణీకరించబడటం మరియు చెడుగా ప్రవర్తించబడటం, ప్రపంచం యొక్క మంచి అభిప్రాయాన్ని మరియు అభిమానాన్ని పొందడం కంటే చాలా గొప్పది. లోకం మనల్ని పనికిమాలిన వారిగా త్రోసిపుచ్చినప్పటికీ, మనం దేవుని దృష్టిలో గొప్ప విలువను కలిగి ఉండవచ్చు, ఆయన స్వహస్తాలతో సమీకరించబడి, ఆయన సింహాసనంపై ఉంచబడవచ్చు.

అతను క్రీస్తులో వారి ఆధ్యాత్మిక తండ్రిగా వారి గౌరవాన్ని క్లెయిమ్ చేసాడు మరియు వారి పట్ల తనకున్న శ్రద్ధను చూపిస్తాడు. (14-21)
పాపం కోసం మందలించేటప్పుడు, పాపులు మరియు వారి చర్యల మధ్య తేడాను గుర్తించడం చాలా ముఖ్యం. సున్నితంగా మరియు ఆప్యాయంగా హెచ్చరించే ఖండనలు సంస్కరణను తీసుకురావడానికి అధిక సంభావ్యతను కలిగి ఉంటాయి. తల్లిదండ్రులకు తగిన అధికారంతో మాట్లాడినప్పటికీ, అపొస్తలుడు వారిని ప్రేమతో ప్రవర్తించడానికి ఇష్టపడతాడు. మంత్రులు, ఆదర్శప్రాయులుగా, ఆదర్శంగా నడపాలి మరియు ఇతరులు విశ్వాసం మరియు ఆచరణలో క్రీస్తును అనుసరిస్తున్నంత వరకు వారిని అనుసరించాలి. క్రైస్తవులు విభిన్న దృక్కోణాలను కలిగి ఉండవచ్చు మరియు తప్పులు చేయవచ్చు, క్రీస్తు మరియు క్రైస్తవ మతం యొక్క సత్యం కాలమంతా స్థిరంగా ఉంటాయి.
సువార్త యొక్క ప్రభావం కేవలం పదాలకు మించినది; అది పరిశుద్ధాత్మ ద్వారా శక్తిలో వ్యక్తమవుతుంది. ఈ శక్తి ఆధ్యాత్మికంగా చనిపోయినవారిని పునరుజ్జీవింపజేస్తుంది, పాపం మరియు సాతాను బానిసత్వం నుండి వ్యక్తులను విముక్తి చేస్తుంది, అంతర్గతంగా మరియు బాహ్యంగా వారిని పునరుద్ధరించింది మరియు సాధువులకు ఓదార్పు, బలం మరియు స్థిరత్వాన్ని అందిస్తుంది. అటువంటి పరివర్తనాత్మక పని కేవలం ఒప్పించే మానవ భాష ద్వారా మాత్రమే సాధించబడదు కానీ దేవుని యొక్క దైవిక శక్తి అవసరం. సరైన అధికారాన్ని సమర్థిస్తూనే ప్రేమ మరియు సౌమ్యతతో కూడిన స్వభావాన్ని కొనసాగించడం ప్రశంసనీయమైన సమతుల్యత.



Shortcut Links
1 కోరింథీయులకు - 1 Corinthians : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |