Turn Off
21st Century KJV
A Conservative Version
American King James Version (1999)
American Standard Version (1901)
Amplified Bible (1965)
Apostles' Bible Complete (2004)
Bengali Bible
Bible in Basic English (1964)
Bishop's Bible
Complementary English Version (1995)
Coverdale Bible (1535)
Easy to Read Revised Version (2005)
English Jubilee 2000 Bible (2000)
English Lo Parishuddha Grandham
English Standard Version (2001)
Geneva Bible (1599)
Hebrew Names Version
Hindi Bible
Holman Christian Standard Bible (2004)
Holy Bible Revised Version (1885)
Kannada Bible
King James Version (1769)
Literal Translation of Holy Bible (2000)
Malayalam Bible
Modern King James Version (1962)
New American Bible
New American Standard Bible (1995)
New Century Version (1991)
New English Translation (2005)
New International Reader's Version (1998)
New International Version (1984) (US)
New International Version (UK)
New King James Version (1982)
New Life Version (1969)
New Living Translation (1996)
New Revised Standard Version (1989)
Restored Name KJV
Revised Standard Version (1952)
Revised Version (1881-1885)
Revised Webster Update (1995)
Rotherhams Emphasized Bible (1902)
Tamil Bible
Telugu Bible (BSI)
Telugu Bible (WBTC)
The Complete Jewish Bible (1998)
The Darby Bible (1890)
The Douay-Rheims American Bible (1899)
The Message Bible (2002)
The New Jerusalem Bible
The Webster Bible (1833)
Third Millennium Bible (1998)
Today's English Version (Good News Bible) (1992)
Today's New International Version (2005)
Tyndale Bible (1534)
Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537)
Updated Bible (2006)
Voice In Wilderness (2006)
World English Bible
Wycliffe Bible (1395)
Young's Literal Translation (1898)
Telugu Bible Verse by Verse Explanation
పరిశుద్ధ గ్రంథ వివరణ
Telugu Bible Commentary
1. సౌలు ఇంకను ప్రభువుయొక్క శిష్యులను బెదరించుటయును హత్యచేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధానయాజకునియొద్దకు వెళ్లి
అపో. కార్యములు 8:1-3; అపో. కార్యములు 22:9-11; ఫిలిప్పీయులకు 3:6.
2. యీ మార్గ మందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనిన యెడల, వారిని బంధించి యెరూషలేము నకు తీసికొని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలిమ్మని అడిగెను.
“మార్గాన్ని”– క్రీస్తు మార్గం (యోహాను 14:6). సిరియాకు రాజధానిగా ఉన్న దమస్కు చాలా పురాతన నగరం. అది జెరుసలంకు పూర్వోత్తర దిక్కున సుమారు 200 కిలోమీటర్ల దూరాన ఉంది. అప్పటికే శుభవార్త అక్కడికి వ్యాపించింది. క్రీస్తు సంఘం ఎక్కడ కనిపించినా దాన్ని నాశనం చేద్దామని సౌలు ఆశయం.
3. అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు, అకస్మాత్తుగా ఆకాశమునుండి యొక వెలుగు అతనిచుట్టు ప్రకాశించెను.
దేవుడు అందరికంటే సంఘానికి గొప్ప శత్రువును అందరికంటే సంఘానికి గొప్ప ఉపదేశకుణ్ణిగా మార్చే సమయం వచ్చింది. ఇది దేవుని కృప, కరుణ, ప్రేమ వల్లే జరిగింది. 1 తిమోతికి 1:12-16; 2 తిమోతికి 1:9. ప్రకాశమానమైన ఒక్క క్షణంలో సౌలు జీవితం పూర్తిగా మారిపోయింది.
4. అప్పుడతడు నేలమీదపడి సౌలా, సౌలా, నీవేల నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను.
క్రీస్తుకు చెందినవారిని హింసించడం అనేది క్రీస్తును హింసించడమే. అసలు, వారికి వ్యతిరేకంగా లేక వారికోసం మనం జరిగించేదేదైనా ఆయనకు వ్యతిరేకంగా లేక ఆయనకోసం జరిగిస్తున్నామన్నమాట. వారు శరీరం, ఆయన ఆ శరీరానికి శిరస్సు (1 కోరింథీయులకు 12:12-13; ఎఫెసీయులకు 1:22-23; కొలొస్సయులకు 1:18). “శరీరాన్ని”, లేక దానిలో ఏ వ్యక్తిని అయినా హింసించే సమయంలో “శిరస్సును” హింసించకపోవడం అసాధ్యం. మత్తయి 10:40; మత్తయి 18:5; మత్తయి 25:34-46; లూకా 9:48; యోహాను 17:20-23 పోల్చి చూడండి. “యేసు” అనే ఈ మాట వినబడగానే సౌలుకు ఎంత కంగారు, ఎంత నివ్వెరపాటు కలిగి ఉండాలి! ఆ ఒక్క క్షణంలో అతని తలంపులన్నీ ఎలా తలకిందులైపోయాయో ఆలోచించండి.
5. ప్రభువా, నీవెవడవని అతడడుగగా ఆయన నేను నీవు హింసించు చున్న యేసును;
6. లేచి పట్టణములోనికి వెళ్లుము, అక్కడ నీవు ఏమి చేయవలెనో అది నీకు తెలుపబడునని చెప్పెను.
సౌలు తాను అపో. కార్యములు 22:10 లో తెలియజేసిన ప్రశ్న ఇప్పటికి అడిగాడు. ఈ ప్రశ్నవల్ల సౌలు ప్రభువుకు లొంగిపోతున్నాడనీ ఆయనకు విధేయత చూపేందుకు సిద్ధంగా ఉన్నాడనీ అర్థమవుతున్నది. సౌలు అపో. కార్యములు 26:16-18 లో తాను ఏమి చేయాలో అప్పుడు కొంతమట్టుకు ప్రభువు తెలియజేశాడని చెప్పాడు.
7. అతనితో ప్రయాణము చేసిన మనుష్యులు ఆ స్వరము వినిరి గాని యెవనిని చూడక మౌనులై నిలువ బడిరి.
అపో. కార్యములు 22:9.
8. సౌలు నేలమీదనుండి లేచి కన్నులు తెరచినను ఏమియు చూడలేక పోయెను గనుక వారతని చెయ్యి పట్టుకొని దమస్కులోనికి నడిపించిరి.
దేదీప్యమానమైన ఈ వెలుగు అతని కళ్ళకు గుడ్డితనం కలిగించింది. దీనికంటే గొప్ప వెలుగు అతని హృదయంలోకి ప్రకాశించి అతని మనోనేత్రాలను తెరచింది. 2 కోరింథీయులకు 4:5 చూడండి.
9. అతడు మూడు దినములు చూపులేక అన్నపానము లేమియు పుచ్చుకొన కుండెను.
10. దమస్కులో అననీయ అను ఒక శిష్యుడుండెను. ప్రభువు దర్శనమందు అననీయా, అని అతనిని పిలువగా
అననీయ అంటే “యెహోవా దయాళుడు” అని అర్థం (హీబ్రూలో ఈ పేరు హనన్యా). అతడు క్రీస్తుమీద నమ్మకముంచిన యూదుడు (అపో. కార్యములు 22:12). దర్శనాల గురించి నోట్ ఆదికాండము 15:1.
11. అతడు ప్రభువా, యిదిగో నేనున్నాననెను. అందుకు ప్రభువు నీవు లేచి, తిన్ననిదనబడిన వీధికి వెళ్లి, యూదా అనువాని యింట తార్సువాడైన సౌలు అనువానికొరకు విచారించుము; ఇదిగో అతడు ప్రార్థనచేయుచున్నాడు.
“తార్సు”– ఇప్పుడు ప్రస్తుత టర్కీ దేశంలో ఒక పట్టణం. అది సౌలు సొంత పట్టణం (అపో. కార్యములు 9:30; అపో. కార్యములు 11:25; అపో. కార్యములు 21:39; అపో. కార్యములు 22:3). ప్రభువు తనకు ప్రత్యక్షమైనప్పటి నుంచి సౌలు ఏమి చేస్తున్నాడో ఈ వచనంలో చూస్తున్నాం. అతడు ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు అతడు ఆరంభించినది తన మిగిలిన జీవిత కాలమంతా చేస్తూ వచ్చాడు (అపో. కార్యములు 16:25; అపో. కార్యములు 20:36; అపో. కార్యములు 22:17).
12. అతడు అననీయ అను నొక మనుష్యుడు లోపలికివచ్చి, తాను దృష్టిపొందునట్లు తలమీద చేతులుంచుట చూచి యున్నాడని చెప్పెను.
యేసుప్రభువు తాను సౌలుకు ప్రత్యక్షం కాగోరిన స్థలం దమస్కు దగ్గర అనీ రాయబారులున్న జెరుసలం కాదనీ, అతని దగ్గరికి పంపినది వారిలో ఒకరు గాక అనామకుడైన సామాన్య విశ్వాసి అనీ గమనించతగిన విషయం. యెషయా 55:8-9 చూడండి.
13. అందుకు అననీయ ప్రభువా, యీ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి యున్నాడని అతనిగూర్చి అనేకులవలన వింటిని.
“పవిత్రులు” అంటే దేవుడు తనకోసం ప్రత్యేకించు కొన్నవారు. ఇది విశ్వాసులకు మరో పేరు (రోమీయులకు 1:1; మొ।।).
14. ఇక్కడను నీ నామమునుబట్టి ప్రార్థనచేయు వారినందరిని బంధించుటకు అతడు ప్రధానయాజకులవలన అధికారము పొంది యున్నాడని ఉత్తరమిచ్చెను.
15. అందుకు ప్రభువునీవు వెళ్లుము, అన్యజనుల యెదుటను రాజుల యెదుటను ఇశ్రాయేలీయుల యెదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై యున్నాడు
ఈ రెండు వచనాలలో ప్రభువు 13-28 అధ్యాయాల్లో వర్ణించబడిన పౌలు జీవితం, పని సారాంశాన్ని తెలియజేశాడు. పౌలు ప్రభువు ఎన్నుకొన్న “సాధనం” (అపో. కార్యములు 26:16-18; గలతియులకు 1:15; ఎఫెసీయులకు 3:2, ఎఫెసీయులకు 3:7-8; కొలొస్సయులకు 1:25; 1 తిమోతికి 1:12; 2 తిమోతికి 1:11). క్రీస్తు కోసం బాధ అనుభవించడం పౌలు సేవలో తప్పించుకోలేని భాగం. దానిలో ఆనందించడం అతడు నేర్చుకొన్నాడు (2 తిమోతికి 1:12; 1 థెస్సలొనీకయులకు 3:3-4; కొలొస్సయులకు 1:24; 2 కోరింథీయులకు 7:4; 2 కోరింథీయులకు 4:16-18; రోమీయులకు 5:3). దేవుని రాజ్యంలో పరలోక రాజు తనకోసం తన సేవకులను బాధపడనివ్వడం అనుగ్రహానికి గుర్తు అని పౌలు గ్రహించాడు (మత్తయి 5:10-12; రోమీయులకు 8:17; ఫిలిప్పీయులకు 1:29).
16. ఇతడు నా నామముకొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పెను.
17. అననీయ వెళ్లి ఆ యింట ప్రవేశించి, అతని మీద చేతులుంచి సౌలా, సహోదరుడా నీవు వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభువైన యేసు, నీవు దృష్టి పొంది, పరిశుద్ధాత్మతో నింపబడునట్లు నన్ను పంపి యున్నాడని చెప్పెను.
దీన్ని బట్టి చూస్తే పౌలు పవిత్రాత్మను పొందినది అననీయ చేతులు ఉంచడంద్వారా అనిపిస్తుంది (అయినా రాసిన మాటలవల్ల ఈ సంగతి అంత స్పష్టం కాదేమో). మనుషులు దేవుని ఆత్మను లేక ఆ ఆత్మ సంపూర్ణతను పొందినది వేరువేరు రీతులుగానని ఈ గ్రంథం తెలియజేస్తున్నది – నేరుగా దేవునినుంచి (అపో. కార్యములు 2:1-4; అపో. కార్యములు 10:44-45), క్రీస్తు రాయబారులు చేతులుంచడం ద్వారా (అపో. కార్యములు 8:17; అపో. కార్యములు 19:6), ఈ ఒక సందర్భంలో సామాన్య శిష్యుడు చేతులుంచడం ద్వారా. ఆత్మను పొందడం నీటి బాప్తిసం తరువాత జరిగింది, నీటి బాప్తిసానికి ముందు కూడా జరిగింది. దేవుని ఆత్మ తన ఇష్టప్రకారం పని చేశాడు. ఆయన పని చేయకముందు ఎలా పని చేస్తాడో ఎవరూ చెప్పలేకపోయారు. అననీయ చేసిన విషయాన్ని చూస్తే అలా చేయాలని ప్రభువు విశేషంగా తేటగా అతణ్ణి ఆజ్ఞాపించాడని మనం గ్రహించాలి. అతడు చేసినట్టు ప్రభువునుంచి ఇలా నేరుగా వచ్చిన ఆదేశం లేకుండా ఎవరూ చేసేందుకు తెగించకూడదు. అతడు సౌలును “సోదరుడా” అంటూ సంబోధించాడని గమనించండి. ఈ విధంగా సౌలును విశ్వాసుల సహవాసంలో చేర్చుకొన్నాడు.
18. అప్పుడే అతని కన్నులనుండి పొరలవంటివి రాలగా దృష్టికలిగి, లేచి బాప్తిస్మము పొందెను; తరువాత ఆహారము పుచ్చుకొని బలపడెను.
“బాప్తిసం”– అపో. కార్యములు 2:38; మత్తయి 3:6; మార్కు 16:16 చూడండి. బాప్తిసం పొందాలని చెప్పింది అననీయ (అపో. కార్యములు 22:16). బాప్తిసం ఇచ్చింది కూడా అతడే అని కనిపిస్తున్నట్టుంది. ఆ సమయంలో సౌలు దగ్గర మరింకెవరు ఉన్నారు? అననీయ మామూలు శిష్యుడని గమనించండి.
19. పిమ్మట అతడు దమస్కులోనున్న శిష్యులతోకూడ కొన్ని దినములుండెను.
20. వెంటనే సమాజమందిరములలో యేసే దేవుని కుమారుడని ఆయనను గూర్చి ప్రకటించుచు వచ్చెను.
సౌలు గమలీయేల్ దగ్గర పాత ఒడంబడిక గ్రంథంలోని సత్యాలను సరిగా నేర్చుకోలేదు గానీ తాను చూచిన ప్రభు దర్శనాన్ని బట్టి, పవిత్రాత్మతో నిండిపోయినందు వల్ల అతడు ఆ సత్యాలను గ్రహించగలిగాడు.
21. వినినవారందరు విభ్రాంతినొంది, యెరూషలేములో ఈ నామమునుబట్టి ప్రార్థన చేయువారిని నాశనము చేసినవాడితడే కాడా? వారిని బంధించి ప్రధాన యాజకులయొద్దకు కొనిపోవుటకు ఇక్కడికికూడ వచ్చి యున్నాడని చెప్పు కొనిరి.
22. అయితే సౌలు మరి ఎక్కువగా బలపడిఈయనే క్రీస్తు అని రుజువు పరచుచు దమస్కులో కాపురమున్న యూదులను కలవరపరచెను.
23. అనేక దినములు గతించిన పిమ్మట యూదులు అతనిని చంపనాలోచింపగా
2 కోరింథీయులకు 11:33. యూదులు పౌలును చంపే అనేక ప్రయత్నాలలో ఇది మొదటిది మాత్రమే (వ 29; అపో. కార్యములు 13:45; అపో. కార్యములు 14:5, అపో. కార్యములు 14:19; అపో. కార్యములు 17:5, అపో. కార్యములు 17:13; అపో. కార్యములు 18:6; అపో. కార్యములు 21:27-31). అతని జీవితంలో ఒక భాగంగా ఉన్న బాధలు (వ 16) ఆరంభమయ్యాయి.
24. వారి ఆలోచన సౌలునకు తెలియ వచ్చెను. వారు అతని చంపవలెనని రాత్రింబగళ్లు ద్వార ములయొద్ద కాచుకొనుచుండిరి
25. గనుక అతని శిష్యులు రాత్రివేళ అతనిని తీసికొని పోయి గంపలో ఉంచి, గోడగుండ అతనిని క్రిందికి దింపిరి.
26. అతడు యెరూషలేములోనికి వచ్చి శిష్యులతో కలిసి కొనుటకు యత్నముచేసెను గాని, అతడు శిష్యుడని నమ్మక అందరును అతనికి భయపడిరి.
గలతియులకు 1:15-19. మూడు సంవత్సరాల నుంచి వారు సౌలును చూడలేదు. అతని గురించి వదంతులు మాత్రం విన్నారు. వారు భయపడడం వింత కాదు.
27. అయితే బర్నబా అతనిని దగ్గరతీసి అపొస్తలుల యొద్దకు తోడుకొనివచ్చి అతడు త్రోవలో ప్రభువును చూచెననియు, ప్రభువు అతనితో మాటలాడెననియు, అతడు దమస్కులో యేసు నామమునుబట్టి ధైర్యముగా బోధించెననియు, వారికి వివరముగా తెలియపరచెను.
బర్నబా తన పేరుకున్న అర్థాన్ని తన జీవితంలో నెరవేర్చాడు (అపో. కార్యములు 4:36; అపో. కార్యములు 11:22-24). ఈ సమయంలో క్రీస్తు రాయబారులలో ఇద్దరు మాత్రమే జెరుసలంలో ఉన్నట్టు కనిపిస్తున్నది (గలతియులకు 1:18-19. అయితే గలతీయవారికి రాసిన లేఖలో పౌలు వేరే సమయాన్ని గురించి రాశాడేమో).
28. అతడు యెరూషలేములో వారితోకూడ వచ్చుచు పోవుచు,
దేవుని ఆత్మతో నిండి ఉన్న వారి లక్షణాలలో ధైర్యం ఒకటి (అపో. కార్యములు 4:13, అపో. కార్యములు 4:31).
29. ప్రభువు నామమునుబట్టి ధైర్యముగా బోధించుచు, గ్రీకు భాషను మాట్లాడు యూదులతో మాటలాడుచు తర్కించుచునుండెను.
వ 23.
30. వారు అతనిని చంప ప్రయత్నము చేసిరి గాని సహోదరులు దీనిని తెలిసికొని అతనిని కైసరయకు తోడు కొనివచ్చి తార్సునకు పంపిరి.
వ 11.
31. కావున యూదయ గలిలయ సమరయ దేశములందంతట సంఘము క్షేమాభివృద్ధినొందుచు సమాధానము కలిగియుండెను; మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను.
క్రీస్తుసంఘాన్ని హింస నాశనం చేయదనీ దాని సాక్ష్యాన్ని ఆపలేదనీ యూద నాయకులు గ్రహించారు. ముఖ్య హింసకుడు (సౌలు) యేసు శిష్యుడైన సంగతికి వారు తప్పక నివ్వెరపడి ఉండాలి. ప్రభు భయాన్ని గురించి నోట్స్ ఆదికాండము 20:11; యోబు 28:28; కీర్తనల గ్రంథము 34:11-14; కీర్తనల గ్రంథము 111:10; సామెతలు 1:7.
32. ఆ తరువాత పేతురు సకల ప్రదేశములలో సంచారము చేయుచు, లుద్దలో కాపురమున్న పరిశుద్ధులయొద్దకు వచ్చెను.
“లుద్ద”– జెరుసలంకు పశ్చిమోత్తర దిక్కున సుమారు 40 కిలోమీటర్ల దూరాన, యొప్పేదగ్గర ఉన్న పట్టణం.
33. అక్కడ పక్షవాయువు కలిగి యెనిమిది ఏండ్లనుండి మంచము పట్టియుండిన ఐనెయ అను ఒక మనుష్యుని చూచి,
34. పేతురు ఐనెయా, యేసు క్రీస్తు నిన్ను స్వస్థపరచుచున్నాడు, నీవు లేచి నీ పరుపు నీవే పరచుకొనుమని అతనితో చెప్పగా
“సీమోను పేతురు నిన్ను బాగు చేస్తున్నాడు” అని అతడు అనలేదు. అపో. కార్యములు 3:6, అపో. కార్యములు 3:12 చూడండి.
35. వెంటనే అతడు లేచెను. లుద్దలోను షారోనులోను కాపురమున్నవారందరు అతనిచూచి ప్రభువుతట్టు తిరిగిరి.
అద్భుతాలు వాటంతట అవి విశ్వాసాన్ని పుట్టించలేవు (లూకా 16:31), గానీ తాను దగ్గరగా ఉన్నాననీ చర్యలు జరిగిస్తున్నాననీ ప్రజలను ఒప్పించడానికి దేవుడు అద్భుతాలు ఉపయోగించవచ్చు. అద్భుతాల గురించి నోట్స్ మత్తయి 8:1; యోహాను 2:11.
36. మరియు యొప్పేలో తబితా అను ఒక శిష్యురాలు ఉండెను; ఆమెకు భాషాంతరమున దొర్కా అని పేరు. ఆమె సత్ క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి యుండెను.
యొప్పే జెరుసలంకు సుమారు 55 కిలోమీటర్ల దూరాన మధ్యధరా సముద్ర తీరాన ఉన్న రేవు పట్టణం. తబితా అరమేయిక్ పేరు, దొర్కస్ గ్రీకు పేరు. రెంటికి ఒకే అర్థం – లేడి. పేదలకు సహాయం చేయడంలో ఆమె క్రైస్తవులందరికీ ఒక ఆదర్శం. పేదలకు సహాయం చేయడం గురించి గలతియులకు 2:10; మత్తయి 19:21; 2 కోరింథీయులకు 9:9 చూడండి.
37. ఆ దినములయందామె కాయిలాపడి చనిపోగా, వారు శవమును కడిగి మేడ గదిలో పరుండ బెట్టిరి.
38. లుద్ద యొప్పేకు దగ్గరగా ఉండుటచేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని, అతడు తడవుచేయక తమయొద్దకు రావలెనని వేడుకొనుటకు ఇద్దరు మనుష్యులను అతని యొద్దకు పంపిరి.
పేతురు దొర్కస్‌ను బ్రతికించగలడని వారికి ఆశాభావం ఉన్నట్టుంది.
39. పేతురు లేచి వారితోకూడ వెళ్లి అక్కడ చేరినప్పుడు, వారు మేడగదిలోనికి అతనిని తీసికొని వచ్చిరి; విధవరాండ్రందరు వచ్చి యేడ్చుచు, దొర్కా తమతోకూడ ఉన్నప్పుడు కుట్టిన అంగీలును వస్త్రములును చూపుచు అతని యెదుట నిలిచిరి.
40. పేతురు అందరిని వెలుపలికి పంపి మోకాళ్లూని ప్రార్థనచేసి శవమువైపు తిరిగి తబితా, లెమ్మనగా ఆమె కన్నులు తెరచి పేతురును చూచి లేచి కూర్చుండెను.
మార్కు 5:21-24, మార్కు 5:35-43; యోహాను 14:12-13 పోల్చి చూడండి. ఈ గ్రంథంలో చనిపోయినవారిని బ్రతికించడం అనే రెండు సంఘటనల్లో ఇది మొదటిది. మరొకటి అపో. కార్యములు 20:7-12 లో కనిపిస్తున్నది. ప్రభువు ఇలాంటి అద్భుతం జరిగించినది అరుదు. అయినా ఇది మరి ఏ ఇతర అద్భుతం కంటే ఆయనకు కష్టతరం కాదు.
41. అతడామెకు చెయ్యి యిచ్చి లేవనెత్తి, పరిశుద్ధులను విధవరాండ్రను పిలిచి ఆమెను సజీవురాలనుగా వారికి అప్పగించెను.
42. ఇది యొప్పేయందంతట తెలిసినప్పుడు అనేకులు ప్రభువు నందు విశ్వాసముంచిరి.
చనిపోయిన వ్యక్తిని బ్రతికించినది పేతురు కాదు గాని ప్రభువే అని వారు గుర్తించారు. అపో. కార్యములు 3:12 చూడండి.
43. పేతురు యొప్పేలో సీమోనను ఒక చర్మకారునియొద్ద బహుదినములు నివసించెను.
చర్మకారుడి వృత్తి అశుద్ధమని యూద మత గురువులు అనుకొనేవారు. అయినా దాని గురించి పేతురుకు ఏమీ పట్టింపు లేదు.