Acts - అపొ. కార్యములు 5 | View All

1. అననీయ అను ఒక మనుష్యుడు తన భార్యయైన సప్పీరాతో ఏకమై పొలమమ్మెను.

1. ‘అననీయ’ అనబడే ఒక వ్యక్తి, అతని భార్య ‘సప్పీరా’ కలిసి తమ భూమి అమ్మేసారు.

2. భార్య యెరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపొస్తలుల పాదములయొద్ద పెట్టెను.

2. ‘అననీయ’ తన కొరకు కొంత డబ్బు దాచుకొన్నాడు. ఈ విషయం అతని భార్యకు తెలుసు. ‘అననీయ’ మిగతా డబ్బు తెచ్చి అపొస్తలుల కాళ్ళ ముందుంచాడు.

3. అప్పుడు పేతురు అననీయా, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరి శుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను. ?

3. అప్పుడు పేతురు ఈ విధంగా అన్నాడు: “అననీయా నీ మనస్సులో సైతాను ఎందుకు చేరాడు? భూమి అమ్మగా వచ్చిన డబ్బులో కొంత భాగాన్ని దాచి పవిత్రాత్మను ఎందుకు మోసం చేసావు?

4. అది నీయొద్ద నున్నపుడు నీదే గదా? అమ్మిన పిమ్మట అది నీ వశమై యుండలేదా? యెందుకు ఈ సంగతి నీ హృదయములో ఉద్దేశించు కొన్నావు? నీవు మనుష్యులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివని వానితో చెప్పెను.

4. అది అమ్మక ముందు కూడా నీదే కదా! అమ్మిన తర్వాత కూడా ఆ డబ్బు నీ ఆధీనంలోనే ఉంది కదా! ఇలా చెయ్యటానికి నీకెట్లా బుద్ధి పుట్టింది. నీవు మనుష్యులతో కాదు అబద్ధం ఆడింది, దేవునితో.”

5. అననీయ యీ మాటలు వినుచునే పడి ప్రాణము విడువగా వినినవారి కందరికిని మిగుల భయము కలిగెను;

5. ఈ మాటలు విని అననీయ క్రింద పడి ప్రాణాలు విడిచాడు. ఈ సంఘటన విన్న వాళ్ళందరికీ ఒక పెద్ద భయం పట్టుకుంది.

6. అప్పుడు పడుచు వారు లేచి వానిని బట్టతో చుట్టి మోసికొనిపోయి పాతిపెట్టిరి.

6. కొందరు యువకులు ముందుకొచ్చి అననీయ దేహాన్ని ఒక వస్త్రంలో చుట్టి మోసుకెళ్ళి సమాధి చేసారు.

7. ఇంచుమించు మూడు గంటల సేపటికి వానిభార్య జరిగినది యెరుగక లోపలికి వచ్చెను.

7. మూడు గంటల తర్వాత అననీయ భార్య అక్కడికి వచ్చింది. అక్కడ జరిగిందేదీ ఆమెకు తెలియదు.

8. అప్పుడు పేతురుమీరు ఆ భూమిని ఇంతకే అమ్మితిరా నాతో చెప్పుమని ఆమెను అడిగెను. అందుకామె అవును ఇంతకే అని చెప్పెను.

8. పేతురు, “మీరు భూమి అమ్మగా లభించిన డబ్బు యింతేనా? చెప్పు!” అని ఆమెను అడిగాడు. “ఔనండి! అంతే డబ్బు లభించింది” అని ఆమె సమాధానం చెప్పింది.

9. అందుకు పేతురు ప్రభువుయొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? ఇదిగో నీ పెనిమిటిని పాతిపెట్టినవారి పాదములు వాకిటనే యున్నవి; వారు నిన్నును మోసికొని పోవుదురని ఆమెతొ చెప్పెను.

9. పేతురు ఆమెతో, “నీవు, నీ భర్త కలిసి ప్రభువు ఆత్మను పరీక్షించాలని ఎందుకు నిశ్చయించుకున్నారు? ఆ తలుపు దగ్గరనుండి వస్తున్న అడుగుల చప్పుడు విను! అవి నీ భర్తను సమాధి చేసిన వాళ్ళవి. వాళ్ళు నిన్ను కూడా మోసుకు వెళ్తారు” అని అన్నాడు.

10. వెంటనే ఆమె అతని పాదములయొద్ద పడి ప్రాణము విడిచెను. ఆ పడుచువారు, లోపలికి వచ్చి, ఆమె చనిపోయినది చూచి, ఆమెను మోసికొనిపోయి, ఆమె పెనిమిటియొద్ద పాతిపెట్టిరి.

10. తక్షణమే ఆమె అతని పాదాలముందు పడి ప్రాణాలు విడిచింది. ఆ తర్వాత యువకులు లోపలికి వచ్చి ఆమె చనిపోయి ఉండటం చూసి ఆమెను కూడా మోసుకు వెళ్ళి ఆమె భర్త ప్రక్కన సమాధి చేసారు.

11. సంఘమంతటికిని, ఈ సంగతులు వినినవారికందరికిని మిగుల భయము కలిగెను.

11. సంఘానికి, ఈ సంఘటనలు విన్న వాళ్ళకు పెద్ద భయం పట్టుకుంది.

12. ప్రజలమధ్య అనేకమైన సూచకక్రియలును మహ త్కార్యములును అపొస్తలులచేత చేయబడుచుండెను. మరియు వారందరు ఏకమనస్కులై సొలొమోను మంటప ములో ఉండిరి.

12. అపొస్తలులు, విశ్వాసులు, ఉమ్మడిగా సొలొమోను మండపంలో సమావేశమౌతూ ఉండేవాళ్ళు. వీళ్ళు ప్రజల్లో ఎన్నో అద్భుతాలు, మహత్యాలు చేసారు.

13. కడమవారిలో ఎవడును వారితో కలిసి కొనుటకు తెగింపలేదు గాని

13. ప్రజలు అపొస్తలుల్ని పొగుడుతూ ఉన్నప్పటికీ మిగతా వాళ్ళు వాళ్ళతో చేరడానికి తెగించలేదు.

14. ప్రజలు వారిని ఘనపరచు చుండిరి. పురుషులును స్త్రీలును అనేకులు మరియెక్కువగ విశ్వాసులై ప్రభువు పక్షమున చేర్చబడిరి.

14. చాలా మంది స్త్రీలు, పురుషులు ప్రభువును విశ్వసించారు. ప్రభువు వాళ్ళను సంఘంలో చేర్చాడు.

15. అందు చేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధులలోనికి తెచ్చి, వారిలో ఎవనిమీదనైనను అతని నీడయైనను పడవలెనని మంచములమీదను పరుపులమీదను వారిని ఉంచిరి.

15. ఇవి చూసిన ప్రజలు జబ్బుతో ఉన్న వాళ్ళను దారి మీదికి తెచ్చి పరుపుల మీద చాపల మీద పడుకోబెట్టారు. పేతురు ఆ దారి మీదుగా నడిచినప్పుడు అతని నీడ కొందరి మీదనన్నా పడుతుందని వాళ్ళ ఉద్దేశ్యం.

16. మరియయెరూషలేము చుట్టునుండు పట్టణముల జనులు రోగులను అపవిత్రాత్మలచేత పీడింప బడిన వారిని మోసికొని కూడివచ్చిరి. వారందరు స్వస్థత పొందిరి.

16. ప్రజలు యెరూషలేము చుట్టూ ఉన్న ప్రాంతాల నుండి గుంపులు గుంపులుగా వచ్చారు. తమలో జబ్బుతో ఉన్న వాళ్ళను, దయ్యాలు పట్టి బాధపడ్తున్న వాళ్ళను తీసుకు వచ్చారు. వాళ్ళందరికీ నయమైపోయింది.

17. ప్రధానయాజకుడును అతనితో కూడ ఉన్నవారందరును, అనగా సద్దూకయ్యుల తెగవారు లేచి మత్సరముతో నిండుకొని

17. సద్దూకయ్యుల తెగకు చెందిన ప్రధాన యాజకుడు, అతనితో ఉన్న వాళ్ళు అసూయతో నిండిపోయారు.

18. అపొస్తలులను బలాత్కారముగా పట్టుకొని పట్టణపు చెరసాలలో ఉంచిరి.

18. వాళ్ళు అపొస్తలులను బంధించి కారాగారంలో వేసారు.

19. అయితే ప్రభువు దూత రాత్రివేళ ఆ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలికి తీసికొని వచ్చిమీరు వెళ్లి దేవాలయములో నిలువబడి

19. కాని రాత్రివేళ దేవదూత కారాగారపు తలుపులు తీసి వాళ్ళను బయటికి పిలుచుకు వచ్చాడు.

20. ఈ జీవమునుగూర్చిన మాటలన్నియు ప్రజలతో చెప్పుడని వారితో అనెను.

20. వాళ్ళతో, “వెళ్ళి మందిర ఆవరణంలో నిలుచొని ఈ క్రొత్త జీవితాన్ని గురించి విశదంగా ప్రజలకు చెప్పండి” అని చెప్పాడు.

21. వారామాట విని, తెల్లవారగానే దేవాలయములోనికి వెళ్లి బోధించుచుండిరి. ప్రధాన యాజకుడును అతనితోకూడ నున్న వారును వచ్చి, మహా సభవారిని ఇశ్రాయేలీయుల పెద్దలనందరిని పిలువనంపించివారిని తోడుకొని రండని బంట్రౌతులను చెరసాలకు పంపిరి.

21. దేవదూత చెప్పినట్లు విని వాళ్ళు తెల్లవారుతుండగా మందిరం యొక్క ఆవరణంలో ప్రవేశించి ప్రజలకు బోదించటం మొదలు పెట్టారు. ప్రధాన యాజకుడు, అతనితో ఉన్న వాళ్ళు ఇశ్రాయేలు ప్రజల పెద్దలందర్ని సమావేశపరిచి మహాసభను ఏర్పాటు చేసారు. ఆ తర్వాత అపొస్తలులను పిలుచుకు రమ్మని కొందర్ని కారాగారానికి పంపారు.

22. బంట్రౌతులు అక్కడికి వెళ్లినప్పుడు వారు చెరసాలలో కనబడనందున తిరిగివచ్చి

22.

23. చెరసాల బహు భద్రముగా మూసియుండుటయు, కావలివారు తలుపుల ముందర నిలిచియుండుటయు చూచితివిు గాని తలుపులు తీసినప్పుడు లోపల మాకొకడైనను కనబడలేదని వారికి తెలిపిరి.

23.

24. అంతట దేవాలయపు అధిపతియు ప్రధాన యాజకులును ఆ మాటలు వినిఇది యేమవునో అని వారి విషయమై యెటుతోచక యుండిరి.

24. ఈ సంగతి విని మందిరం యొక్క ద్వారపాలకుల అధిపతి, ప్రధాన యాజకులు, వాళ్ళు ఏమై ఉంటారా? అని ఆశ్చర్యపడ్డారు.

25. అప్పుడు ఒకడు వచ్చిఇదిగో మీరు చెరసాలలో వేయించిన మనుష్యులు దేవాలయములో నిలిచి ప్రజలకు బోధించుచున్నారని వారికి తెలుపగా

25. ఇంతలో ఒకడు వచ్చి, “మీరు కారాగారంలో ఉంచిన వాళ్ళు మందిరం యొక్క ఆవరణంలో నిలబడి ప్రజలకు బోధిస్తున్నారు” అని చెప్పాడు.

26. అధిపతి బంట్రౌతులతో కూడ పోయి, ప్రజలు రాళ్లతో కొట్టుదురేమో అని భయపడి, బలాత్కారము చేయకయే వారిని తీసికొని వచ్చెను.

26. ఇది విని ద్వారపాలకుల అధిపతి భటులను వెంట తీసుకొని వాళ్ళను పట్టుకు రావటానికి వెళ్ళాడు. ప్రజలు తమను రాళ్ళతో కొడతారనే భయం వాళ్ళలో ఉంది. కనుక అపొస్తలులపై వాళ్ళు ఏ దౌర్జన్యం చేయలేదు.

27. వారిని తీసికొని వచ్చి సభలో నిలువబెట్టగా

27. అపొస్తలుల్ని పిలుచుకు వచ్చి మహాసభ ముందు నిలుచోబెట్టారు. ప్రధాన యాజకుడు విచారణ చేస్తూ,

28. ప్రధానయాజకుడు వారిని చూచిమీరు ఈ నామమునుబట్టి బోధింపకూడdదని మేము మీకు ఖండితముగా ఆజ్ఞాపింపలేదా? ఇదిగో మీరు యెరూషలేమును మీ బోధతో నింపి, యీ మనుష్యుని హత్య మామీదికి తేవలెనని ఉద్దేశించుచున్నారని చెప్పెను.

28. “మీ యేసు పేరిట బోధించవద్దని మేము యిది వరకే ఖచ్చితంగా ఆజ్ఞాపించాము. అయినా యెరూషలేమంతా మీ బోధనలతో నింపివేసారు. అంతేకాక అతని మరణాన్ని మాపై మోపాలని చూస్తున్నారు” అని అన్నాడు.

29. అందుకు పేతురును అపొస్తలులునుమనుష్యలకు కాదు దేవునికే మేము లోబడవలెను గదా.

29. పేతురు, మిగతా అపొస్తలులు యిలా అన్నారు: “మేము దేవుని ఆజ్ఞల్ని పాటిస్తున్నాము, మానవుల ఆజ్ఞల్ని కాదు.

30. మీరు మ్రానున వ్రేలాడవేసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను.
ద్వితీయోపదేశకాండము 21:22-23

30. మీరు సిలువకు వ్రేలాడదీసి చంపిన యేసును మా పూర్వీకుల దేవుడు బ్రతికించాడు.

31. ఇశ్రాయేలునకు మారుమనస్సును పాప క్షమాపణను దయచేయుటకై దేవుడాయనను అధిపతిని గాను రక్షకునిగాను తన దక్షిణహస్తబలముచేత హెచ్చించి యున్నాడు.

31. దేవుడు ఆయనకు తన కుడి వైపుననున్న స్థానాన్నిచ్చాడు. ఆయన్ని ఒక అధిపతిగా, రక్షకుడిలా నియమించాడు. తద్వారా ఇశ్రాయేలు ప్రజలకు పశ్చాత్తాపం పొందే అవకాశము, తమ పాపాలకు క్షమాపణ పొందే అవకాశము కలగాలని ఆయన ఉద్దేశ్యం.

32. మేమును, దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు, ఈ సంగతులకు సాక్షులమై యున్నామని చెప్పిరి.

32. వీటికి మేము సాక్షులము. దేవుడు తన ఆజ్ఞల్ని పాటించిన వాళ్ళకిచ్చిన పవిత్రాత్మ కూడా దీనికి సాక్షి.”

33. వారు ఈ మాట విని అత్యాగ్రహము తెచ్చుకొని వీరిని చంప నుద్దేశించగా

33. ఇది విని వాళ్ళకు చాలా కోపం వచ్చింది. వాళ్ళు అపొస్తలులను చంపాలనుకున్నారు.

34. సమస్త ప్రజలవలన ఘనత నొందినవాడును ధర్మశాస్త్రోపదేశకుడునైన గమలీయేలను ఒక పరిసయ్యుడు మహాసభలో లేచిఈ మనుష్యులను కొంత సేపు వెలుపల ఉంచుడని ఆజ్ఞాపించి వారితో ఇట్లనెను

34. కాని ‘గమలీయేలు’ అనే పరిసయ్యుడు ఆ మహాసభలో లేచి నిలుచొని అపొస్తలుల్ని కొంతసేపు అవతలకు తీసుకు వెళ్ళమని ఆజ్ఞాపించాడు. గమలీయేలు ధర్మశాస్త్ర పండితుడు. ప్రజల గౌరవం పొందినవాడు.

35. ఇశ్రాయేలీయులారా, యీ మనుష్యుల విషయమై మీరేమి చేయబోవుచున్నారో జాగ్రత్తసుమండి.

35. అతడు వాళ్ళని సంబోధిస్తూ, “ఇశ్రాయేలు ప్రజలారా! వీళ్ళను ఏమి చెయ్యాలో జాగ్రత్తగా ఆలోచించండి!

36. ఈ దినములకు మునుపు థూదా లేచి తానొక గొప్ప వాడనని చెప్పుకొనెను; ఇంచుమించు నన్నూరుమంది మనుష్యులు వానితో కలిసి కొనిరి, వాడు చంపబడెను, వానికి లోబడిన వారందరును చెదరి వ్యర్థులైరి.

36. ఇదివరలో థూదా కనిపించి తానొక గొప్ప వాణ్ణని చెప్పుకున్నాడు. సుమారు నాలుగువందల యాభై మంది అతణ్ణి అనుసరించారు. అతడు చంపబడ్డాడు. ఆ తర్వాత అతని అనుచరులు చెదిరి పోయారు. చివరకు ఏమీ మిగల్లేదు.

37. వానికి తరువాత జనసంఖ్య దినములలో గలిలయుడైన యూదా అను ఒకడు వచ్చి, ప్రజలను తనతో కూడ తిరుగుబాటుచేయ ప్రేరేపించెను; వాడుకూడ నశించెను, వానికి లోబడినవారందరును చెదరి పోయిరి.

37. అతని తర్వాత జనాభా లెక్కల కాలంలో యూదా అనే వాడు వచ్చి ప్రజల్ని చేరదీసి తిరుగుబాటు చేసాడు. ఇతడు గలిలయవాడు. ఇతడు కూడా చంపబడ్డాడు. అతని అనుచరులందరూ చెదిరిపోయారు,

38. కాబట్టి నేను మీతో చెప్పునదేమనగా ఈ మనుష్యుల జోలికి పోక వారిని విడిచిపెట్టుడి. ఈ ఆలోచనయైనను ఈ కార్యమైనను మనుష్యులవలన కలిగిన దాయెనా అది వ్యర్థమగును.

38. అందువల్ల వాళ్ళ విషయంలో నా సలహా ఇది: వాళ్ళ విషయం పట్టించుకోకండి! వాళ్ళను వదిలివేయండి! వాళ్ళ కార్యము, వాళ్ళ ఉద్దేశ్యము మానవుడు సృష్టించినదైతే అది నశిస్తుంది.

39. దేవునివలన కలిగినదాయెనా మీరు వారిని వ్యర్థపరచలేరు; మీరొకవేళ దేవునితో పోరాడువారవుదురు సుమీ.

39. అలా కాకుండా అది దైవేచ్ఛ వలన అయితే మీరు వాళ్ళను ఆపలేరు. అలా చేస్తే మీరు దేవునికి ఎదురు తిరిగిన వాళ్ళౌతారు” అని అన్నాడు.

40. వారతని మాటకు సమ్మతించి, అపొస్తలులను పిలిపించి కొట్టించియేసు నామమునుబట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి.

40. సభ్యులు అతడు చెప్పినట్లు విన్నారు. అపొస్తలుల్ని పిలిపించి కొరడా దెబ్బలు కొట్టించారు. ఆ తర్వాత, యేసు పేరిట మాట్లాడవద్దని వారించి వదిలి వేసారు.

41. ఆ నామముకొరకు అవమానము పొందుటకు పాత్రులని యెంచబడినందున వారు సంతోషించుచు మహాసభ యెదుటనుండి వెళ్లిపోయి

41. అపొస్తలులు యేసు కోసం అవమానింపబడటానికి తాము అర్హులైనందుకు సంతోషిస్తూ మహా సభనుండి వెళ్ళిపోయారు.

42. ప్రతిదినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు, యేసే క్రీస్తని ప్రకటించుచుండిరి.

42. ప్రతి రోజూ మందిరంలో, ఇంటింటా, “యేసే క్రీస్తు” అని ప్రకటించారు. ఈ సువార్త ప్రకటించటం మానుకోలేదు.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Acts - అపొ. కార్యములు 5 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

అననియాస్ మరియు సప్ఫీరా మరణం. (1-11) 
అననియాస్ మరియు సప్ఫీరా చేసిన పాపం, వారు నిజమైన అనుచరులు కానప్పుడు, అంకితభావంతో కూడిన శిష్యులుగా భావించబడాలనే వారి ఆశయం. కపటులు ఒక సందర్భంలో కొన్ని ప్రాపంచిక లాభాలను త్యాగం చేయవచ్చు, మరెక్కడా పరిహారం ఆశించవచ్చు. ప్రాపంచిక సంపద కోసం వారి అత్యాశ మరియు దేవుని సంరక్షణపై నమ్మకం లేకపోవడం వల్ల వారు దేవుణ్ణి మరియు మమ్మోన్ రెండింటినీ సేవించగలరని విశ్వసించారు. అపొస్తలులను మోసగించడానికి వారి ప్రయత్నం పేతురులో దేవుని ఆత్మ ద్వారా గుర్తించబడిన ప్రాథమిక అవిశ్వాసానికి ద్రోహం చేసింది. సాతాను అలాంటి దుష్టత్వాన్ని సూచించినప్పటికీ, అననీయస్ తన అనుమతి లేకుండా దానిని స్వీకరించలేడు.
అననియస్ చేసిన నేరం కేవలం భూమి ఆదాయంలో కొంత భాగాన్ని వెనక్కు తీసుకోవడం కాదు; అతను అన్నింటినీ ఉంచడానికి ఎంపిక చేసుకున్నాడు. అయినప్పటికీ, అతని పాపం అపోస్తలులను ఒక ఘోరమైన అబద్ధంతో మోసగించడానికి ప్రయత్నించింది, దురాశతో పాటు వ్యర్థమైన ప్రదర్శనల కోరికతో నడిచింది. దేవుడిని మోసం చేయడానికి ప్రయత్నించేవారు చివరికి తమ ఆత్మలను మోసం చేసుకుంటారు. మంచితనంలో ఒకరినొకరు ప్రోత్సహిస్తూ, చెడులో ఒకరినొకరు బలపరుస్తున్న కుటుంబ సభ్యులను సాక్ష్యమివ్వడం నిరుత్సాహపరుస్తుంది. విధించిన శిక్ష చాలా మందికి దయగా పనిచేసింది, స్వీయ-పరిశీలన, ప్రార్థన మరియు కపటత్వం, దురాశ మరియు వ్యర్థమైన కీర్తి యొక్క భయాన్ని ప్రేరేపించింది. ఈ పరిణామం తప్పుడు ప్రచారం యొక్క విస్తరణను నిరోధించడానికి లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ కథనం సత్యదేవునికి అసత్యాన్ని అసహ్యించుకోవడాన్ని బోధిస్తుంది, కఠోరమైన అబద్ధాలకు దూరంగా ఉండటమే కాకుండా మన ప్రసంగంలో అస్పష్టమైన వ్యక్తీకరణలు మరియు ద్వంద్వ అర్థాల నుండి దూరంగా ఉండాలని, అటువంటి మోసం యొక్క గురుత్వాకర్షణను అర్థం చేసుకోవాలని మనలను ప్రోత్సహిస్తుంది.

సువార్త బోధతో కూడిన శక్తి. (12-16) 
వేరువేరు కపటవాదులు ఒకరికొకరు మరియు సువార్త పరిచర్యకు దగ్గరయ్యేలా నిష్కపటమైన తీర్పులను ప్రోత్సహించాలి. చర్చి యొక్క స్వచ్ఛత మరియు స్థితికి దోహదపడే ఏదైనా దాని అభివృద్ధిని కూడా ప్రోత్సహిస్తుంది. ఏది ఏమైనప్పటికీ, అద్భుతాలు చేయడంలో అపొస్తలులు ప్రదర్శించిన అసాధారణ శక్తి పాపులను పాపం మరియు సాతాను యొక్క పట్టు నుండి విముక్తి చేయగల ఏకైక శక్తి, చివరికి విశ్వాసులను అతని ఆరాధనలోకి తీసుకువస్తుంది. క్రీస్తు తన అంకితమైన సేవకులందరి ద్వారా చురుకుగా పని చేస్తాడు, వైద్యం కోసం తనను వెతుకుతున్న ప్రతి ఒక్కరూ పునరుద్ధరించబడతారు.

అపొస్తలులు ఖైదు చేయబడ్డారు, కానీ ఒక దేవదూత ద్వారా విడుదల చేయబడ్డారు. (17-25) 
దేవుడు తన ప్రజలను సందర్శించలేనంత చీకటిగా లేదా భయంకరమైన జైలు ఏదీ లేదు. అనారోగ్యం నుండి కోలుకోవడం మరియు కష్టాల నుండి విముక్తి అనేది కేవలం జీవిత సుఖాలను అనుభవించడం కోసం మాత్రమే ఇవ్వబడదు, కానీ మన జీవితాల సేవ ద్వారా దేవుడిని గౌరవించాలనే ఉద్దేశ్యంతో. క్రీస్తు సువార్త బోధకులు పెద్ద సంఘంలో బోధించే అవకాశం ఉన్నంత వరకు ఏకాంతానికి దూరంగా ఉండకూడదు. వారి కర్తవ్యం అందరికీ ప్రకటించడం, అత్యంత ప్రముఖుల ఆత్మలు క్రీస్తుకు విలువైనవిగా ఉన్న వినయపూర్వకమైన వ్యక్తులను చేరుకోవడం. ప్రతి ఒక్కరినీ సంబోధించండి, ఎందుకంటే అందరూ చిక్కుకున్నారు. దృఢ సంకల్పంతో మాట్లాడండి, సందేశం ద్వారా జీవించి చనిపోవాలని నిర్ణయించుకున్నారు. ఈ స్వర్గపు, దైవిక జీవితాన్ని పూర్తిగా పంచుకోండి, ప్రస్తుత భూసంబంధమైన ఉనికిని ప్రాముఖ్యతతో అధిగమించండి. పరిశుద్ధాత్మ ద్వారా ప్రసాదించబడిన ఈ జీవాన్ని ఇచ్చే మాటలు మీ పెదవుల నుండి ప్రవహించనివ్వండి. సువార్త యొక్క పదాలు జీవిత పదాలు, మోక్షాన్ని అందిస్తాయి. సువార్త విజయంతో బాధపడేవారిని చూడటం నిజంగా విచారకరం. ప్రభువు యొక్క మాట మరియు శక్తి తమకు వ్యతిరేకమని గుర్తించినప్పటికీ, పర్యవసానాలను భయపెట్టినప్పటికీ, వారు తమ వ్యతిరేకతను కొనసాగించారు.

అపొస్తలులు కౌన్సిల్ ముందు క్రీస్తుకు సాక్ష్యమిస్తారు. (26-33) 
చాలా మంది వ్యక్తులు సాహసోపేతమైన మరియు చెడు పనులలో నిమగ్నమై ఉండవచ్చు కానీ ఆ తర్వాత పరిణామాలను ఎదుర్కోలేక లేదా అంగీకరించలేకపోతారు. మనం విమోచన మరియు స్వస్థత ఆశించినట్లయితే క్రీస్తు పాలనకు లొంగిపోవడం చాలా అవసరం. విశ్వాసం అనేది క్రీస్తును అతని పాత్రలన్నింటిలో ఆలింగనం చేసుకోవడం; ఆయన మన పాపములలో మనలను రక్షించుటకు కాదు వాటి నుండి మనలను రక్షించుటకు వచ్చెను. ఇశ్రాయేలుకు ఆధిపత్యం ఇవ్వడానికి క్రీస్తు ఉన్నతీకరించబడి ఉంటే, ప్రధాన యాజకులు అతనిని ఆలింగనం చేసుకుని ఉండేవారు. అయినప్పటికీ, వారు పశ్చాత్తాపం మరియు పాప క్షమాపణ యొక్క ఆశీర్వాదాలను విలువైనదిగా పరిగణించలేదు లేదా గుర్తించలేదు, అతని బోధనలను తీవ్రంగా తిరస్కరించేలా వారిని నడిపించారు. పశ్చాత్తాపం తప్పకుండా క్షమాపణ అనే బహుమతిని తెస్తుంది. పాపం యొక్క అధికారం మరియు ఆధిపత్యం నుండి విముక్తి పొందినవారు, దాని నుండి విముఖంగా మరియు దానికి వ్యతిరేకంగా నిలబడిన వారు మాత్రమే పాపం యొక్క అపరాధం మరియు శిక్ష నుండి విడుదల చేయబడతారు. క్రీస్తు, తన ఆత్మ వాక్యంతో పని చేయడం ద్వారా, మనస్సాక్షిని మేల్కొల్పడం ద్వారా పశ్చాత్తాపాన్ని కలుగజేస్తాడు, పాపం కోసం దుఃఖాన్ని కలిగించాడు మరియు హృదయం మరియు జీవితంలో లోతైన పరివర్తనను ప్రభావితం చేస్తాడు. పరిశుద్ధాత్మ యొక్క ప్రసాదం క్రీస్తుకు లోబడాలనేది దేవుని చిత్తమని స్పష్టమైన రుజువుగా పనిచేస్తుంది. అతని పాలనను తిరస్కరించే వారు అనివార్యంగా నాశనాన్ని ఎదుర్కొంటారు.

గమలీయేలు సలహా, కౌన్సిల్ అపొస్తలులను విడిచిపెట్టింది. (34-42)
ప్రభువు తన చేతులలో అన్ని హృదయాలను పట్టుకుని, హింసించేవారిని అరికట్టడానికి లోక జ్ఞానుల జ్ఞానాన్ని అప్పుడప్పుడు మార్గనిర్దేశం చేస్తాడు. ఇంగితజ్ఞానం జాగ్రత్తగా ఉండాలని సలహా ఇస్తుంది మరియు మతపరమైన మోసాల విజయం తరచుగా స్వల్పకాలికంగా ఉంటుందని అనుభవం వెల్లడిస్తుంది. క్రీస్తు కోసం నిందను భరించడం నిజమైన పురోగతి, అతని ఉదాహరణతో మనలను సమం చేయడం మరియు అతని కారణానికి దోహదం చేయడం. మంచి చేయడం కోసం కష్టాలను భరించే వారు, దయతో సహించినట్లయితే మరియు అది ఎలా ఉండాలో, అనుమతించే దయలో సంతోషించడానికి కారణం ఉంటుంది. అపొస్తలులు తమ బోధలను క్రీస్తుపైనే కేంద్రీకరించారు, తాము కాదు, ఇది ప్రత్యేకంగా యాజకులను కలవరపరిచింది. సువార్త పరిచారకుల యొక్క స్థిరమైన విధిగా క్రీస్తును ప్రకటించడం-అతని సిలువ వేయడం, ఆయన మహిమపరచడం-దానితో సంబంధం లేని ప్రతిదీ మినహాయించి. జీవితంలో మన స్థానంతో సంబంధం లేకుండా, మనం ఆయనను గుర్తించడానికి మరియు అతని పేరును మహిమపరచడానికి కృషి చేయాలి.



Shortcut Links
అపో. కార్యములు - Acts : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |