John - యోహాను సువార్త 11 | View All

1. మరియ, ఆమె సహోదరియైన మార్త, అనువారి గ్రామమైన బేతనియలోనున్న లాజరు అను ఒకడు రోగి యాయెను.

1. mariya, aame sahodariyaina maartha, anuvaari graamamaina bethaniyalonunna laajaru anu okadu rogi yaayenu.

2. ఈ లాజరు ప్రభువునకు అత్తరుపూసి తల వెండ్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు.

2. ee laajaru prabhuvunaku attharupoosi thala vendrukalathoo aayana paadamulu thudichina mariyaku sahodarudu.

3. అతని అక్క చెల్లెండ్రు ప్రభువా, యిదిగో నీవు ప్రేమించువాడు రోగియై యున్నాడని ఆయనయొద్దకు వర్తమానము పంపిరి.

3. athani akka chellendru prabhuvaa, yidigo neevu preminchuvaadu rogiyai yunnaadani aayanayoddhaku varthamaanamu pampiri.

4. యేసు అది వినియీ వ్యాధి మరణముకొరకు వచ్చినదికాదు గాని దేవుని కుమారుడు దానివలన మహిమ పరచబడునట్లు దేవుని మహిమకొరకు వచ్చినదనెను.

4. yesu adhi viniyee vyaadhi maranamukoraku vachinadhikaadu gaani dhevuni kumaarudu daanivalana mahima parachabadunatlu dhevuni mahimakoraku vachinadanenu.

5. యేసు మార్తను ఆమె సహోదరిని లాజరును ప్రేమించెను.

5. yesu maarthanu aame sahodarini laajarunu preminchenu.

6. అతడు రోగియై యున్నాడని యేసు వినినప్పుడు తానున్నచోటనే యింక రెండు దినములు నిలిచెను.

6. athadu rogiyai yunnaadani yesu vininappudu thaanunnachootane yinka rendu dinamulu nilichenu.

7. అటుపిమ్మట ఆయనమనము యూదయకు తిరిగి వెళ్లుదమని తన శిష్యులతో చెప్పగా

7. atupimmata aayanamanamu yoodayaku thirigi velludamani thana shishyulathoo cheppagaa

8. ఆయన శిష్యులుబోధకుడా, యిప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్ట చూచుచుండిరే; అక్కడికి తిరిగి వెళ్లుదువా అని ఆయన నడిగిరి.

8. aayana shishyulubodhakudaa, yippude yoodulu ninnu raallathoo kotta choochuchundire; akkadiki thirigi velluduvaa ani aayana nadigiri.

9. అందుకు యేసు పగలు పండ్రెండు గంటలున్నవి గదా, ఒకడు పగటివేళ నడిచిన యెడల ఈ లోకపు వెలుగును చూచును గనుక తొట్రు పడడు.

9. anduku yesu pagalu pandrendu gantalunnavi gadaa, okadu pagativela nadichina yedala ee lokapu velugunu choochunu ganuka totru padadu.

10. అయితే రాత్రివేళ ఒకడు నడిచినయెడల వానియందు వెలుగులేదు గనుక వాడు తొట్రుపడునని చెప్పెను.

10. ayithe raatrivela okadu nadichinayedala vaaniyandu veluguledu ganuka vaadu totrupadunani cheppenu.

11. ఆయన యీ మాటలు చెప్పిన తరువాతమన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు; అతని మేలు కొలుప వెళ్లుచున్నానని వారితో చెప్పగా

11. aayana yee maatalu cheppina tharuvaathamana snehithudaina laajaru nidrinchuchunnaadu; athani melu kolupa velluchunnaanani vaarithoo cheppagaa

12. శిష్యులు ప్రభువా, అతడు నిద్రించినయెడల బాగుపడుననిరి.

12. shishyulu prabhuvaa, athadu nidrinchinayedala baagupadunaniri.

13. యేసు అతని మరణమునుగూర్చి ఆ మాట చెప్పెను గాని వారు ఆయన నిద్ర విశ్రాంతిని గూర్చి చెప్పెననుకొనిరి.

13. yesu athani maranamunugoorchi aa maata cheppenu gaani vaaru aayana nidra vishraanthini goorchi cheppenanukoniri.

14. కావున యేసు లాజరు చనిపోయెను,

14. kaavuna yesu laajaru chanipoyenu,

15. మీరు నమ్మునట్లు నేనక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషించుచున్నాను; అయినను అతనియొద్దకు మనము వెళ్లుదము రండని స్పష్టముగా వారితో చెప్పెను.

15. meeru nammunatlu nenakkada undaledani mee nimitthamu santhooshinchuchunnaanu; ayinanu athaniyoddhaku manamu velludamu randani spashtamugaa vaarithoo cheppenu.

16. అందుకు దిదుమ అనబడిన తోమా ఆయనతో కూడ చనిపోవుటకు మనమును వెళ్లుదమని తనతోడి శిష్యులతో చెప్పెను.

16. anduku diduma anabadina thoomaa aayanathoo kooda chanipovutaku manamunu velludamani thanathoodi shishyulathoo cheppenu.

17. యేసు వచ్చి అదివరకే అతడు నాలుగు దినములు సమాధిలో ఉండెనని తెలిసికొనెను.

17. yesu vachi adhivarake athadu naalugu dinamulu samaadhilo undenani telisikonenu.

18. బేతనియ యెరూషలేమునకు సమీపమై యుండెను; దానికి ఇంచుమించు కోసెడు దూరము

18. bethaniya yerooshalemunaku sameepamai yundenu; daaniki inchuminchu kosedu dooramu

19. గనుక యూదులలో అనేకులు వారి సహోదరునిగూర్చి మార్తను మరియను ఓదార్చుటకై వారి యొద్దకు వచ్చియుండిరి.

19. ganuka yoodulalo anekulu vaari sahodarunigoorchi maarthanu mariyanu odaarchutakai vaari yoddhaku vachiyundiri.

20. మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయనను ఎదుర్కొన వెళ్లెనుగాని మరియ యింటిలో కూర్చుండి యుండెను.

20. maartha yesu vachuchunnaadani vini aayananu edurkona vellenugaani mariya yintilo koorchundi yundenu.

21. మార్త యేసుతో ప్రభువా, నీవిక్కడ ఉండినయెడల నా సహోదరుడు చావకుండును.

21. maartha yesuthoo prabhuvaa, neevikkada undinayedala naa sahodarudu chaavakundunu.

22. ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకను గ్రహించునని యెరుగుదుననెను.

22. ippudainanu neevu dhevuni emadiginanu dhevudu neekanu grahinchunani yerugudunanenu.

23. యేసు నీ సహోదరుడు మరల లేచునని ఆమెతో చెప్పగా

23. yesu nee sahodarudu marala lechunani aamethoo cheppagaa

24. మార్త ఆయనతో అంత్య దినమున పునరుత్థానమందు లేచునని యెరుగుదుననెను.
దానియేలు 12:2

24. maartha aayanathoo antya dinamuna punarut'thaanamandu lechunani yerugudunanenu.

25. అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే; నాయందు విశ్వాసముంచువాడు చని పోయినను బ్రదుకును;

25. anduku yesu punarut'thaanamunu jeevamunu nene; naayandu vishvaasamunchuvaadu chani poyinanu bradukunu;

26. బ్రదికి నాయందు విశ్వాస ముంచు ప్రతివాడును ఎన్నటికిని చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా? అని ఆమెను నడిగెను.

26. bradhiki naayandu vishvaasa munchu prathivaadunu ennatikini chanipodu. ee maata nammuchunnaavaa? Ani aamenu nadigenu.

27. ఆమె అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడవైన క్రీస్తువని నమ్ముచున్నానని ఆయనతో చెప్పెను.

27. aame avunu prabhuvaa, neevu lokamunaku raavalasina dhevuni kumaarudavaina kreesthuvani nammuchunnaanani aayanathoo cheppenu.

28. ఆమె ఈ మాట చెప్పి వెళ్లిబోధకుడు వచ్చి నిన్ను పిలుచుచున్నాడని తన సహోదరియైన మరియను రహస్య ముగా పిలిచెను.

28. aame ee maata cheppi vellibodhakudu vachi ninnu piluchuchunnaadani thana sahodariyaina mariyanu rahasya mugaa pilichenu.

29. ఆమె విని త్వరగా లేచి ఆయన యొద్దకు వచ్చెను.

29. aame vini tvaragaa lechi aayana yoddhaku vacchenu.

30. యేసు ఇంకను ఆ గ్రామములోనికి రాక, మార్త ఆయనను కలిసికొనిన చోటనే ఉండెను

30. yesu inkanu aa graamamuloniki raaka, maartha aayananu kalisikonina chootane undenu

31. గనుక యింటిలో మరియతో కూడ నుండి ఆమెను ఓదార్చుచుండిన యూదులు మరియ త్వరగా లేచి వెళ్లుట చూచి, ఆమె సమాధియొద్ద ఏడ్చుటకు అక్కడికి వెళ్లుచున్నదనుకొని ఆమె వెంట వెళ్లిరి.

31. ganuka yintilo mariyathoo kooda nundi aamenu odaarchuchundina yoodulu mariya tvaragaa lechi velluta chuchi, aame samaadhiyoddha edchutaku akkadiki velluchunnadanukoni aame venta velliri.

32. అంతట మరియ యేసు ఉన్న చోటికి వచ్చి, ఆయనను చూచి, ఆయన పాదములమీద పడిప్రభువా, నీవిక్కడ ఉండినయెడల నా సహోదరుడు చావకుండు ననెను.

32. anthata mariya yesu unna chootiki vachi, aayananu chuchi, aayana paadamulameeda padiprabhuvaa, neevikkada undinayedala naa sahodarudu chaavakundu nanenu.

33. ఆమె ఏడ్చుటయు, ఆమెతో కూడ వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతని నెక్కడ నుంచితిరని అడుగగా,

33. aame edchutayu, aamethoo kooda vachina yoodulu edchutayu yesu chuchi kalavarapadi aatmalo mooluguchu athani nekkada nunchithirani adugagaa,

34. వారుప్రభువా, వచ్చి చూడుమని ఆయనతో చెప్పిరి.

34. vaaruprabhuvaa, vachi choodumani aayanathoo cheppiri.

35. యేసు కన్నీళ్లు విడిచెను.

35. yesu kanneellu vidichenu.

36. కాబట్టి యూదులు అతనిని ఏలాగు ప్రేమించెనో చూడుడని చెప్పుకొనిరి.

36. kaabatti yoodulu athanini elaagu premincheno choodudani cheppukoniri.

37. వారిలో కొందరుఆ గ్రుడ్డి వాని కన్నులు తెరచిన యీయన, యితనిని చావకుండ చేయలేడా అని చెప్పిరి.

37. vaarilo kondaru'aa gruddi vaani kannulu terachina yeeyana, yithanini chaavakunda cheyaledaa ani cheppiri.

38. యేసు మరల తనలో మూలుగుచు సమాధియొద్దకు వచ్చెను. అది యొక గుహ, దానిమీద ఒక రాయి పెట్టియుండెను.

38. yesu marala thanalo mooluguchu samaadhiyoddhaku vacchenu. adhi yoka guha, daanimeeda oka raayi pettiyundenu.

39. యేసు రాయి తీసివేయుడని చెప్పగా చనిపోయినవాని సహోదరియైన మార్తప్రభువా, అతడు చనిపోయి నాలుగు దినములైనది గనుక ఇప్పటికి వాసనకొట్టునని ఆయనతో చెప్పెను.

39. yesu raayi theesiveyudani cheppagaa chanipoyinavaani sahodariyaina maarthaprabhuvaa, athadu chanipoyi naalugu dinamulainadhi ganuka ippatiki vaasanakottunani aayanathoo cheppenu.

40. అందుకు యేసు నీవు నమ్మినయెడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను;

40. anduku yesu neevu namminayedala dhevuni mahima choothuvani nenu neethoo cheppaledaa ani aamethoo anenu;

41. అంతట వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి తండ్రీ, నీవు నా మనవి వినినందున నీకు కృత జ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను.

41. anthata vaaru aa raayi theesivesiri. Yesu kannulu paiketthi thandree, neevu naa manavi vininanduna neeku krutha gnathaasthuthulu chellinchuchunnaanu.

42. నీవు ఎల్లప్పుడును నా మనవి వినుచున్నావని నేనెరుగుదును గాని నీవు నన్ను పంపితివని చుట్టు నిలిచియున్న యీ జనసమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై యీ మాట చెప్పితిననెను.

42. neevu ellappudunu naa manavi vinuchunnaavani nenerugudunu gaani neevu nannu pampithivani chuttu nilichiyunna yee janasamoohamu nammunatlu vaari nimitthamai yee maata cheppithinanenu.

43. ఆయన ఆలాగు చెప్పిలాజరూ, బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా

43. aayana aalaagu cheppilaajaroo, bayatiki rammani biggaragaa cheppagaa

44. చనిపోయినవాడు, కాళ్లు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడినవాడై వెలుపలికి వచ్చెను; అతని ముఖమునకు రుమాలు కట్టియుండెను. అంతట యేసు మీరు అతని కట్లు విప్పిపోనియ్యుడని వారితో చెప్పెను.

44. chanipoyinavaadu, kaallu chethulu pretha vastramulathoo kattabadinavaadai velupaliki vacchenu; athani mukhamunaku rumaalu kattiyundenu. Anthata yesu meeru athani katlu vippiponiyyudani vaarithoo cheppenu.

45. కాబట్టి మరియయొద్దకు వచ్చి ఆయన చేసిన కార్య మును చూచిన యూదులలో అనేకులు ఆయనయందు విశ్వాసముంచిరికాని

45. kaabatti mariyayoddhaku vachi aayana chesina kaarya munu chuchina yoodulalo anekulu aayanayandu vishvaasamunchirikaani

46. వారిలో కొందరు పరిసయ్యుల యొద్దకు వెళ్లి యేసుచేసిన కార్యములను గూర్చి వారితో చెప్పిరి.

46. vaarilo kondaru parisayyula yoddhaku velli yesuchesina kaaryamulanu goorchi vaarithoo cheppiri.

47. కాబట్టి ప్రధానయాజకులును పరిసయ్యులును మహా సభను సమకూర్చిమనమేమి చేయుచున్నాము? ఈ మను ష్యుడు అనేకమైన సూచక క్రియలు చేయుచున్నాడే.

47. kaabatti pradhaanayaajakulunu parisayyulunu mahaa sabhanu samakoorchimanamemi cheyuchunnaamu? ee manu shyudu anekamaina soochaka kriyalu cheyuchunnaade.

48. మనమాయనను ఈలాగు చూచుచు ఊరకుండినయెడల అందరు ఆయనయందు విశ్వాసముంచెదరు; అప్పుడు రోమీయులు వచ్చి మన స్థలమును మన జనమును ఆక్ర మించుకొందురని చెప్పిరి.

48. manamaayananu eelaagu choochuchu oorakundinayedala andaru aayanayandu vishvaasamunchedaru; appudu romeeyulu vachi mana sthalamunu mana janamunu aakra minchukondurani cheppiri.

49. అయితే వారిలో కయప అను ఒకడు ఆ సంవత్సరము ప్రధాన యాజకుడైయుండిమీ కేమియు తెలియదు.

49. ayithe vaarilo kayapa anu okadu aa samvatsaramu pradhaana yaajakudaiyundimee kemiyu teliyadu.

50. మన జనమంతయు నశింప కుండునట్లు ఒక మనుష్యుడు ప్రజలకొరకు చనిపోవుట మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకొనరు అని వారితో చెప్పెను.

50. mana janamanthayu nashimpa kundunatlu oka manushyudu prajalakoraku chanipovuta meeku upayukthamani meeru aalochinchukonaru ani vaarithoo cheppenu.

51. తనంతట తానే యీలాగు చెప్పలేదు గాని ఆ సంవత్సరము ప్రధానయాజకుడై యుండెను గనుక

51. thananthata thaane yeelaagu cheppaledu gaani aa samvatsaramu pradhaanayaajakudai yundenu ganuka

52. యేసు ఆ జనముకొరకును, ఆ జనముకొరకు మాత్రమేగాక చెదరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకును, చావనైయున్నాడని ప్రవచించెను.
ఆదికాండము 49:10

52. yesu aa janamukorakunu, aa janamukoraku maatramegaaka chedaripoyina dhevuni pillalanu ekamugaa samakoorchutakunu, chaavanaiyunnaadani pravachinchenu.

53. కాగా ఆ దినమునుండి వారు ఆయనను చంప నాలో చించుచుండిరి.

53. kaagaa aa dinamunundi vaaru aayananu champa naalo chinchuchundiri.

54. కాబట్టి యేసు అప్పటినుండి యూదులలో బహిరంగ ముగా సంచరింపక, అక్కడనుండి అరణ్యమునకు సమీప ప్రదేశములోనున్న ఎఫ్రాయిమను ఊరికి వెళ్లి, అక్కడ తన శిష్యులతోకూడ ఉండెను.

54. kaabatti yesu appatinundi yoodulalo bahiranga mugaa sancharimpaka, akkadanundi aranyamunaku sameepa pradheshamulonunna ephraayimanu ooriki velli, akkada thana shishyulathookooda undenu.

55. మరియు యూదుల పస్కాపండుగ సమీపమై యుండెను గనుక అనేకులు తమ్మునుతాము శుద్ధిచేసికొనుటకై పస్కా రాకమునుపే పల్లె టూళ్లలోనుండి యెరూషలేమునకు వచ్చిరి.
2 దినవృత్తాంతములు 30:17

55. mariyu yoodula paskaapanduga sameepamai yundenu ganuka anekulu thammunuthaamu shuddhichesikonutakai paskaa raakamunupe palle toollalonundi yerooshalemunaku vachiri.

56. వారు యేసును వెదకుచు దేవాలయములో నిలువబడి మీకేమి తోచుచున్నది? ఆయన పండుగకు రాడా యేమి? అని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి.

56. vaaru yesunu vedakuchu dhevaalayamulo niluvabadi meekemi thoochuchunnadhi? aayana pandugaku raadaa yemi? Ani okanithoo okadu cheppukoniri.

57. ప్రధానయాజకులును పరిసయ్యులును ఆయన ఎక్కడ ఉన్నది ఎవనికైనను తెలిసియున్న యెడల తాము ఆయనను పట్టుకొన గలుగుటకు తమకు తెలియజేయవలెనని ఆజ్ఞాపించి యుండిరి.

57. pradhaanayaajakulunu parisayyulunu aayana ekkada unnadhi evanikainanu telisiyunna yedala thaamu aayananu pattukona galugutaku thamaku teliyajeyavalenani aagnaapinchi yundiri.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
John - యోహాను సువార్త 11 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

లాజరస్ యొక్క అనారోగ్యం. (1-6) 
క్రీస్తు ప్రేమను ఇష్టపడే వారు అనారోగ్యం అనుభవించడం ఒక కొత్త సంఘటన కాదు; శారీరక రుగ్మతలు అవినీతిని సరిదిద్దడానికి మరియు దేవుని ప్రజల కృపలను పరీక్షించడానికి ఉపయోగపడతాయి. క్రీస్తు తన అనుచరులను అటువంటి బాధల నుండి రక్షించడానికి రాలేదు కానీ వారి పాపాల నుండి మరియు రాబోయే కోపం నుండి వారిని రక్షించడానికి వచ్చాడు. ఏది ఏమైనప్పటికీ, మన జబ్బుపడిన మరియు బాధిత స్నేహితులు మరియు బంధువుల తరపున ఆయనను వెతకవలసిన బాధ్యత మనపై ఉంది. ప్రొవిడెన్స్ యొక్క అత్యంత అస్పష్టమైన మలుపులు కూడా దేవుని మహిమ కోసం నిర్వహించబడుతున్నాయని అర్థం చేసుకోవడంలో మనం ఓదార్పుని పొందుతాము-అది అనారోగ్యం, నష్టం లేదా నిరాశ ద్వారా కావచ్చు. దేవుడు మహిమపరచబడితే, మన తృప్తి అనుసరించాలి.
మార్త, ఆమె సహోదరి, లాజరులపట్ల యేసుకు ఉన్న వాత్సల్యం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రేమ మరియు శాంతి వర్ధిల్లినప్పుడు కుటుంబాలు అదృష్టవంతులు అయితే, నిజమైన సంతోషం యేసు ప్రేమను పొందడం మరియు ఆ ప్రేమను తిరిగి పొందడంలోనే ఉంటుంది. దురదృష్టవశాత్తు, చిన్న కుటుంబాలలో కూడా యేసుతో అలాంటి సామరస్యపూర్వక సంబంధం చాలా అరుదు. దేవుని జాప్యాలు ప్రయోజనం లేకుండా లేవని గుర్తించడం చాలా ముఖ్యం; వాటి వెనుక దయగల ఉద్దేశాలు ఉన్నాయి. తాత్కాలిక లేదా ఆధ్యాత్మిక విమోచన సందర్భంలో, అది బహిరంగమైనా లేదా వ్యక్తిగతమైనా, ఆలస్యం కేవలం అనుకూలమైన క్షణం కోసం వేచి ఉంది.

క్రీస్తు యూదయకు తిరిగి వస్తాడు. (7-10) 
ఆపద సమయాల్లో క్రీస్తు ఎల్లప్పుడూ తన ప్రజలకు తోడుగా ఉంటాడు; అతను వారి పక్కన లేకుండా వారిని ఎప్పుడూ ఆపదలోకి తీసుకెళ్లడు. మన స్వంత సంపద, కీర్తి, సౌలభ్యం మరియు భద్రత కోసం ఉత్సాహంతో ప్రభువు పట్ల ఉత్సాహాన్ని తప్పుగా భావించడం సులభం. కాబట్టి, మన సూత్రాలను పరిశీలించడం చాలా ముఖ్యం. మా పని పూర్తయ్యే వరకు మరియు మా సాక్ష్యం నెరవేరే వరకు మా రోజులు పొడిగించబడతాయి. ఒక వ్యక్తి కర్తవ్య మార్గంలో ఉన్నప్పుడు, దేవుని వాక్యం ద్వారా వివరించబడినట్లుగా మరియు అతని ప్రొవిడెన్స్ ద్వారా నిర్దేశించబడినప్పుడు, ఓదార్పు మరియు సంతృప్తి ఉంటుంది. క్రీస్తు, తన భూలోక ప్రయాణంలో, పగటిపూట నడిచాడు, అలాగే మనం ఆయన అడుగుజాడల్లో నడుచుకుంటే మనం కూడా నడుస్తాము. అయినప్పటికీ, ఎవరైనా తమ హృదయపు కోరికలను అనుసరించి, ప్రపంచ మార్గాలకు అనుగుణంగా ఉంటే, దేవుని చిత్తం మరియు మహిమపై కంటే వారి స్వంత ప్రాపంచిక తర్కంపై ఎక్కువగా ఆధారపడినట్లయితే, వారు ప్రలోభాలు మరియు ఉచ్చులలో పడే అవకాశం ఉంది. అలాంటి వ్యక్తి పొరపాట్లు చేస్తాడు, ఎందుకంటే వారికి మార్గనిర్దేశం చేసే అంతర్గత కాంతి లేదు; మన సహజ చర్యలకు మన చుట్టూ ఉన్న కాంతి ఎంత అవసరమో, మనలోని కాంతి మన నైతిక చర్యలకు కీలకం.

లాజరస్ మరణం. (11-16) 
చివరికి మళ్లీ పైకి లేస్తామన్న హామీని బట్టి, నిత్యజీవానికి ఆ పునరుత్థానంపై ఆశాజనకమైన విశ్వాసం మన శరీరాలను వదులుకోవడం మరియు మరణాన్ని ఎదుర్కోవడం మన బట్టలు విప్పి నిద్రపోవడం వంటి అప్రయత్నంగా ఎందుకు చేయకూడదు? నిజమైన క్రైస్తవుడు మరణించినప్పుడు, అది ప్రశాంతమైన నిద్రతో సమానం-ముందు రోజు శ్రమల నుండి విశ్రాంతి. నిజానికి, మరణం అనేది నిద్రను అధిగమిస్తుంది, అంటే నిద్ర అనేది క్లుప్తమైన విశ్రాంతి అయితే, మరణం అనేది భూసంబంధమైన శ్రమలు మరియు శ్రమల ముగింపును సూచిస్తుంది.
లాజరస్ పట్ల శిష్యులు మొదట విముఖత చూపినట్లే, బహిర్గతం మరియు ప్రమాదం గురించి భయపడి, సవాలు చేసే పరిస్థితులలో క్రీస్తు మనలను నడిపించడం అనవసరమని మనం భావించే సమయాలు ఉన్నాయి. తరచుగా, ఎవరైనా అవసరమైన మంచి పనిని చేపడతారని మేము ఆశిస్తున్నాము, ప్రత్యేకించి ప్రమాదం ఉన్నట్లయితే. అయినప్పటికీ, క్రీస్తు లాజరును మృతులలోనుండి లేపినప్పుడు ప్రదర్శించబడినట్లుగా, అలాంటి చర్యలు అనేకులు ఆయనను విశ్వసించేలా చేయగలవు, విశ్వాసం బలపడటానికి గణనీయంగా తోడ్పడతాయి.
సవాళ్లను ఎదుర్కోవడంలో, కష్ట సమయాల్లో థామస్ చేసినట్లుగా క్రైస్తవులు ఒకరికొకరు మద్దతునివ్వాలి. ప్రభువైన యేసు మరణము దేవుడు కోరినప్పుడల్లా మన స్వంత మరణాన్ని స్వీకరించే సంసిద్ధతను మనలో కలిగించాలి. మరణము మనలను క్రీస్తు ప్రేమ నుండి విడదీయదు, లేదా ఆయన దైవిక పిలుపుకు మించిన మనలను ఉంచదు.

క్రీస్తు బేతనియకు వస్తాడు. (17-32) 
దేవుని భయము, మరియు అతని ఆశీర్వాదం ఉన్న ఈ నివాసంలో, శోక వాతావరణం ఉంది. దయ హృదయాన్ని దుఃఖం నుండి రక్షించగలదు, కానీ అది ఇంటిని దాని నుండి మినహాయించదు. దేవుడు తన కృప మరియు ప్రొవిడెన్స్ ద్వారా దయ మరియు ఓదార్పుతో మనలను సమీపించినప్పుడు, మార్తాలాగే మనం కూడా ఆయనను కలవడానికి విశ్వాసం, ఆశ మరియు ప్రార్థనతో ఉత్సాహంగా ముందుకు సాగాలి.
మార్త యేసును ఎదుర్కోవడానికి బయలుదేరినప్పుడు, మరియ ఇంట్లోనే కూర్చుని ఉంది. ఈ ప్రవృత్తి ఒకప్పుడు ప్రయోజనకరంగా ఉన్నప్పటికీ, అతని బోధనలను గ్రహించడానికి ఆమెను క్రీస్తు పాదాల వద్ద ఉంచడం, కష్ట సమయాల్లో, అది ఆమెను విచారం వైపు మొగ్గు చూపింది. ప్రలోభాలకు వ్యతిరేకంగా మనం అప్రమత్తంగా ఉండటం మరియు మన సహజ స్వభావాల ప్రయోజనాలను ఉపయోగించుకోవడం తెలివైన పని. ప్రత్యేకంగా ఏమి అడగాలి లేదా ఆశించాలి అనే దాని గురించి అనిశ్చితంగా ఉన్నప్పుడు, మనల్ని మనం దేవునికి అప్పగించడం వివేకం, అతను ఉత్తమంగా భావించేదాన్ని చేయడానికి అనుమతించడం.
మార్తా యొక్క అంచనాలను పెంచడానికి, మన ప్రభువు తనను తాను పునరుత్థానం మరియు జీవితంగా ప్రకటించుకున్నాడు. ప్రతి కోణంలో, ఆయన పునరుత్థానం-దాని మూలం, పదార్ధం, మొదటి ఫలాలు మరియు కారణం. విమోచించబడిన ఆత్మ మరణం తర్వాత శాశ్వతమైన ఆనందాన్ని అనుభవిస్తుంది మరియు పునరుత్థానం తరువాత, శరీరం మరియు ఆత్మ రెండూ అన్ని చెడుల నుండి శాశ్వతంగా భద్రపరచబడతాయి.
మరణానంతర జీవితంలోని లోతైన అంశాల గురించి క్రీస్తు మాటలు చదివిన తర్వాత లేదా విన్న తర్వాత, మనం ఆత్మపరిశీలన చేసుకోవాలి: ఈ సత్యాన్ని మనం నిజంగా నమ్ముతున్నామా? నిత్యత్వపు సత్యాలను మనం వాటికి అర్హమైన విషయంలో కలిగి ఉంటే ప్రస్తుత ఆనందాలు మరియు సవాళ్లు మనపై తక్కువ లోతైన ప్రభావాన్ని చూపుతాయి. మన గురువు క్రీస్తు వచ్చినప్పుడు, ఆయన మనలను పిలుస్తాడు. అతను తన మాటలు మరియు శాసనాల ద్వారా వస్తాడు, మనలను వారి వద్దకు పిలుస్తాడు, వారి ద్వారా మనల్ని పిలుస్తాడు మరియు చివరికి మనల్ని తన వైపుకు ఆహ్వానిస్తాడు. శాంతి సమయాల్లో, క్రీస్తు నుండి నేర్చుకునేందుకు అతని పాదాల వద్ద తమను తాము నిలబెట్టుకునే వారు, ఆపద సమయంలో, ఆయన అనుగ్రహాన్ని పొందేందుకు నిశ్చయతతో ఆయన పాదాల వద్ద తమను తాము వేసుకోవచ్చు.

అతను లాజరును లేపుతాడు. (33-46) 
ఈ దుఃఖిస్తున్న స్నేహితుల పట్ల క్రీస్తు ప్రగాఢమైన కనికరం అతని ఆత్మ యొక్క గందరగోళం ద్వారా స్పష్టంగా కనిపించింది. విశ్వాసులు ఎదుర్కొనే ప్రతి పరీక్షలో, ఆయన వారి బాధలలో పాలుపంచుకుంటాడు. అతని నిష్క్రమించిన స్నేహితుడి అవశేషాల గురించి అతని శ్రద్ధగల విచారణలో వారి పట్ల అతని శ్రద్ధ వ్యక్తమైంది. మనిషి రూపాన్ని ధరించి, మనుష్యుల తీరులో తనను తాను నడిపించాడు. అతని సానుభూతి కన్నీళ్ల ద్వారా మరింత ప్రదర్శించబడింది, అతను దుఃఖంతో పరిచయం ఉన్న వ్యక్తిగా, కరుణతో కన్నీళ్లు కార్చాడు-క్రీస్తును ప్రతిబింబించే సెంటిమెంట్. అయితే, క్రీస్తు కల్పిత బాధల కథల కోసం కన్నీళ్లు పెట్టుకున్నప్పుడు చాలా మంది గొప్పగా చెప్పుకునే భావోద్వేగ సున్నితత్వాన్ని ఆమోదించలేదు, కానీ నిజమైన బాధల పట్ల ఉదాసీనంగా ఉంటారు. పనికిమాలిన ఉల్లాస దృశ్యాల నుండి వైదొలగడానికి, బాధలో ఉన్నవారిని ఓదార్చడానికి మన దృష్టిని మళ్లించడానికి అతను మనకు ఒక ఉదాహరణగా నిలిచాడు. మన బలహీనతలపై సానుభూతి చూపగల ప్రధాన పూజారి ఉండటం మన అదృష్టం.
రాయి తీసివేయబడినప్పుడు, పక్షపాతాలను పక్కన పెట్టినప్పుడు మరియు వాక్యం హృదయంలోకి చొచ్చుకుపోయే మార్గం తెరవబడినప్పుడు ఆధ్యాత్మిక పునరుజ్జీవనం వైపు పురోగతి ఏర్పడుతుంది. క్రీస్తు వాక్యం, శక్తి మరియు విశ్వసనీయతపై విశ్వాసం ఉంచడం వల్ల మనం దేవుని మహిమను సాక్ష్యమివ్వడానికి మరియు ఆ దృష్టిలో ఆనందాన్ని పొందగలుగుతాము. మన ప్రభువైన యేసు, తన స్వంత ఉదాహరణ ద్వారా, ప్రార్థనలో దేవుణ్ణి తండ్రి అని సంబోధించమని బోధించాడు, వినయపూర్వకమైన భక్తితో మరియు పవిత్ర ధైర్యంతో ఆయనను చేరుకుంటాడు. దేవునితో అతని బహిరంగ సంభాషణ, ఎత్తైన కళ్ళు మరియు పెద్ద స్వరంతో గుర్తించబడింది, తండ్రి తనను తన ప్రియమైన కుమారుడిగా ప్రపంచంలోకి పంపాడని నమ్మదగిన ప్రకటనగా పనిచేసింది.
క్రీస్తు తన శక్తి మరియు సంకల్పం యొక్క నిశ్శబ్ద శ్రమ ద్వారా లాజరస్‌ను పునరుత్థానం చేయగలిగినప్పటికీ, అతను బిగ్గరగా పిలుపునిచ్చాడు. ఈ చర్య సువార్త పిలుపును సూచిస్తుంది, ఆత్మీయంగా చనిపోయిన ఆత్మలను పాప సమాధి నుండి బయటకు తీసుకువస్తుంది మరియు చివరి రోజున ప్రధాన దేవదూత ట్రంపెట్ ధ్వనిని సూచిస్తుంది, గొప్ప న్యాయస్థానం ముందు దుమ్ములో నిద్రిస్తున్న వారందరినీ పిలుస్తుంది. క్రీస్తు పునరుజ్జీవింపబడిన వారికి పాప సమాధిలో మరియు ఈ లోకంలో స్థానం లేదు; అవి తప్పక ఉద్భవించాయి. లాజరు తిరిగి బ్రతికించడమే కాకుండా పూర్తిగా తన ఆరోగ్యాన్ని తిరిగి పొందాడు. అదేవిధంగా, ఒక పాపి తన స్వంత ఆత్మను పునరుద్ధరించుకోలేడు, వారు దయ యొక్క మార్గాలను ఉపయోగించాలి. అలాగే, ఒక విశ్వాసి తమను తాము పవిత్రం చేసుకోలేరు, కానీ వారు ప్రతి అవరోధాన్ని విస్మరించాలి. మనం మన బంధువులు మరియు స్నేహితులను మార్చలేనప్పటికీ, మనం వారికి సూచనలను అందించాలి, హెచ్చరికలు అందించాలి మరియు ఆహ్వానాలను అందజేయాలి.

యేసుకు వ్యతిరేకంగా పరిసయ్యులు సంప్రదింపులు జరుపుతున్నారు. (47-53) 
ఇక్కడ అందించబడిన రికార్డు మానవ హృదయంలో వేళ్లూనుకున్న మూర్ఖత్వానికి మరియు దేవునిపట్ల దాని తీరని శత్రుత్వాన్ని పూర్తిగా బహిర్గతం చేస్తుంది. ప్రవచనాత్మక పదాలను ఉచ్చరించడం హృదయంలోని దయగల సూత్రానికి స్పష్టమైన రుజువుగా ఉపయోగపడదు. హాస్యాస్పదంగా, పాపం ద్వారా మనం తప్పించుకోవాలనుకునే విపత్తు తరచుగా మనపై మనం తెచ్చుకునే పర్యవసానంగా మారుతుంది. ఇది క్రీస్తు రాజ్యాన్ని వ్యతిరేకిస్తూ, తమ స్వంత ప్రాపంచిక ప్రయోజనాలను ముందుకు తీసుకువెళ్తున్నామని నమ్మే వారికి సమానంగా ఉంటుంది. అయితే, చెడ్డవారు భయపడతారేమోననే భయం చివరికి వారిని అధిగమిస్తుంది.
ఆత్మలను మార్చడం అనేది క్రీస్తును వారి సార్వభౌమాధికారం మరియు పవిత్ర స్థలంగా ఆకర్షిస్తుంది, దీని కోసం అతను తనను తాను త్యాగం చేశాడు. అతని మరణం ద్వారా, అతను వాటిని తన కోసం సంపాదించుకున్నాడు మరియు వారి కోసం పరిశుద్ధాత్మ బహుమతిని పొందాడు. విశ్వాసుల పట్ల ఆయన మరణంలో ప్రదర్శించబడిన ప్రేమ వారి మధ్య బలమైన బంధాన్ని పెంపొందించాలి.

యూదులు అతని కోసం వెతుకుతున్నారు. (54-57)
మన సువార్త పాస్ ఓవర్కు ముందు, మన పశ్చాత్తాపాన్ని రిఫ్రెష్ చేసుకోవడం అత్యవసరం. చాలా మంది వ్యక్తులు, వారి చుట్టూ ఉన్నవారి కంటే ఎక్కువ భక్తితో, జెరూసలేంలో పాస్ ఓవర్‌కు దారితీసే రోజులలో స్వచ్ఛంద శుద్దీకరణ మరియు మతపరమైన వ్యాయామాలలో పాల్గొంటారు. దేవునితో ఒక ఎన్‌కౌంటర్ కోసం ఎదురుచూడేటప్పుడు, గంభీరమైన తయారీ అవసరం. మానవ నిర్మిత పథకాలు దేవుని ఉద్దేశాలను మార్చలేవు, మరియు కపటవాదులు ఆచారాలు మరియు వాదోపవాదాలలో పాల్గొంటున్నప్పుడు మరియు ప్రాపంచిక వ్యక్తులు వారి స్వంత అజెండాలను అనుసరిస్తున్నప్పుడు, యేసు తన మహిమ మరియు తన ప్రజల మోక్షం కోసం అన్ని విషయాలను ఆర్కెస్ట్రేట్ చేస్తూనే ఉన్నాడు.



Shortcut Links
యోహాను - John : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |