యూదులు పాత ఒడంబడిక గ్రంథాన్ని కొన్ని సార్లు రెండు భాగాలు చేశారు – ధర్మశాస్త్రం, ప్రవక్తలు (వ 27; మత్తయి 5:17). కొన్ని సార్లు మూడు భాగాలు చేశారు – ధర్మశాస్త్రం, ప్రవక్తలు, కీర్తనలు. ఇప్పుడు మనకున్న పాత ఒడంబడికలోని పుస్తకాల వరుసకు వారు ఏర్పరచుకున్న వరుస వేరుగా ఉండేది. మూడవ భాగంలో కీర్తనల గ్రంథం మొదటి పుస్తకంగా ఉండేది. క్రైస్తవులు ఇప్పుడు సాధారణంగా పాత ఒడంబడిక గ్రంథాన్ని నాలుగు భాగాలుగా విభజిస్తారు. మోషే రాసిన పంచ గ్రంథాలు – ఆదికాండం నుంచి ద్వితీయోపదేశకాండం వరకు; చరిత్ర గ్రంథాలు – యెహోషువ నుంచి ఎస్తేరు వరకు; కావ్య గ్రంథాలు – యోబు నుండి పరమగీతం వరకు; ప్రవక్తల గ్రంథాలు – యెషయానుండి మలాకీ వరకు. క్రీస్తును గురించిన భవిష్యద్వాక్కులు, ఆయన్ను సూచించే సాదృశ్యాలు, పాత ఒడంబడిక అన్ని భాగాల్లోనూ కనిపిస్తాయి. యేసు ఇదంతా తన శిష్యులకు స్పష్టంగా చెప్పాడు – అప్పటికప్పుడు కాదు గాని 40 రోజుల కాలంలో (అపో. కార్యములు 1:3).