Luke - లూకా సువార్త 18 | View All

1. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలె ననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను.

1. శిష్యులకు ఈ ఉపమానం చెప్పాడు:

2. దేవునికి భయపడకయు మనుష్యులను లక్ష్య పెట్టకయు నుండు ఒక న్యాయాధిపతి యొక పట్టణ ములో ఉండెను.

2. “ఒక గ్రామంలో ఒక న్యాయాధిపతి ఉండేవాడు. అతనికి దేవుడంటే భయంకాని, ప్రజలు తనని గురించి ఏమనుకొంటారనే భీతికాని లేకుండెను. ఆ గ్రామంలో జక్కయ్య వాడు

3. ఆ పట్టణములో ఒక విధవరాలును ఉండెను. ఆమె అతనియొద్దకు తరచుగావచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చుమని అడుగుచు వచ్చెను గాని

3. అదే గ్రామంలో ఒక వితంతువు ఉండేది. ఆమె ఆ న్యాయాధిపతి దగ్గరకు ప్రతిరోజు వచ్చి ‘నాకు ఒకడు అన్యాయం చేశాడు. నాకు న్యాయం చేకూర్చండి’ అని అడుగుతూ ఉండేది.

4. అతడు కొంతకాలము ఒప్పకపోయెను. తరువాత అతడు - నేను దేవునికి భయపడకయు మనుష్యులను లక్ష్యపెట్టకయు ఉండినను

4. చాలా కాలం అతడు ఆమె మాటలు పట్టించుకోలేదు. కాని చివరకు’ నాకు దేవుడంటే భయంకాని, ప్రజలంటే భీతికాని లేదు.

5. ఈ విధవరాలు నన్ను తొందరపెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండునట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలోతాననుకొనెను.

5. కాని ఈ వితంతువు వచ్చి నన్ను విసిగిస్తోంది. కాబట్టి ఈమె మళ్ళీ మళ్ళీ నా దగ్గరకు రాకుండ ఈమెకు న్యాయం జరిగేలా చూస్తాను’ అని తన మనస్సులో అనుకున్నాడు.”

6. మరియు ప్రభువిట్లనెను అన్యాయస్థుడైన ఆ న్యాయాధి పతి చెప్పిన మాట వినుడి.

6. ఇలా చెప్పి ప్రభువు, “ఆ నీతి నియమం లేని న్యాయాధిపతి అనుకొన్న మాటలు విన్నారు కదా!

7. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్నుగూర్చి మొఱ్ఱపెట్టుకొను చుండగా వారికి న్యాయము తీర్చడా?

7. మరి దేవుడు తనను రాత్రింబగళ్ళు ప్రార్థించే తన వాళ్ళకు న్యాయం చేకూర్చకుండా ఉంటాడా? వాళ్ళకు న్యాయం చెయ్యటంలో ఆలస్యం చేస్తాడా!

8. ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును; వారినిషయమే గదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. అయినను మనుష్య కుమారుడు వచ్చునప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా?

8. ఆయన వాళ్ళకు వెంటనే న్యాయం చేకూరుస్తాడని నేను చెబుతున్నాను. కాని మనుష్యకుమారుడు వచ్చినప్పుడు ఈ ప్రపంచంలోని ప్రజలలో విశ్వాసాన్ని కనుగొంటాడా? అని అన్నాడు.

9. తామే నీతిమంతులని తమ్ము నమ్ముకొని యితరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పెను.

9. తాము మాత్రమే నీతిమంతులమని అనుకొని యితర్లను చిన్నచూపు చూసేవాళ్ళకు యేసు ఈ ఉపమానం చెప్పాడు:

10. ప్రార్థనచేయుటకై యిద్దరు మనుష్యులు దేవాలయమునకు వెళ్లిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి.

10. “ఇద్దరు మనుష్యులు మందిరానికి వెళ్ళారు. ఒకడు పరిసయ్యుడు, ఒకడు పన్నులు వసూలు చేసేవాడు.

11. పరిసయ్యుడు నిలువబడిదేవా, నేను చోరులును అన్యాయస్థులును వ్యభిచారులునైన యితర మనుష్యులవలెనైనను, ఈ సుంకరివలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను.

11. పరిసయ్యుడు ఒక ప్రక్కనిలుచొని ఈ విధంగా ప్రార్థించటం మొదలు పెట్టాడు: ‘ప్రభూ! నేను యితరుల్లా, అంటే మోసగాళ్ళల్లా, దుర్మార్గుల్లా, వ్యభిచారుల్లా ఉండనందుకు నీకు కృతజ్ఞుణ్ణి. ఈ పన్నులు సేకరించేవానిలా నేను ఉండనందుకు కూడా కృతజ్ఞుణ్ణి.

12. వారమునకు రెండు మారులు ఉప వాసము చేయుచు నా సంపాదన అంతటిలో పదియవ వంతు చెల్లించుచున్నానని తనలోతాను ప్రార్థించుచుండెను.
ఆదికాండము 14:20

12. నేను వారానికి రెండుసార్లు ఉపవాసాలు చేస్తాను. నా సంపదలో పదవనంతు దేవుని పేరిట యిస్తాను.’

13. అయితే సుంకరి దూరముగా నిలుచుండి, ఆకాశమువైపు కన్ను లెత్తుటకైనను ధైర్యముచాలక రొమ్ము కొట్టుకొనుచుదేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను.
కీర్తనల గ్రంథము 51:1

13. “ఆ పన్నులు సేకరించేవాడు మరొక ప్రక్క నిలుచొని ఆకాశం వైపు కూడా చూడటానికి ధైర్యము లేక గుండెలు బాదుకుంటూ, ‘దేవుడా! నేనొక పాపిని, నాపై దయచూపు’ అని అన్నాడు.

14. అతనికంటె ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన యింటికి వెళ్లెనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడుననియు తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడుననియు చెప్పెను.

14. దేవుని దృష్టిలో పరిసయ్యునికి మారుగా ఇతడు నీతిమంతుడనిపించుకొని ఇంటికి వెళ్ళాడు. ఎందుకంటే గొప్పలు చెప్పుకొన్నవాడు అణచబడతాడు. అణుకువతో ఉన్నవాడు గొప్ప స్థానానికి ఎత్తబడతాడు.”

15. తమ శిశువులను ముట్టవలెనని కొందరు ఆయనయొద్దకు వారిని తీసికొనిరాగా ఆయన శిష్యులు అది చూచి తీసి కొనివచ్చిన వారిని గద్దించిరి.

15. యేసు వారిని తాకాలని ప్రజలు చిన్న పిల్లల్ని ఆయన దగ్గరకు పిలుచుకు వచ్చారు. శిష్యులు యిది చూసి ప్రజల్ని వారించారు.

16. అయితే యేసు వారిని తనయొద్దకు పిలిచిచిన్న బిడ్డలను ఆటంకపరచక వారిని నాయొద్దకు రానియ్యుడి, దేవుని రాజ్యము ఈలాటివారిది.

16. కాని, యేసు ఆ చిన్న పిల్లల్ని తన దగ్గరకు పిలుస్తూ, “చిన్న పిల్లల్ని నా దగ్గరకు రానివ్వండి. వాళ్ళను ఆపకండి. దేవుని రాజ్యం వాళ్ళలాంటి వారిదే.

17. చిన్న బిడ్డవలె దేవుని రాజ్యము అంగీకరింపనివాడు దానిలో ఎంతమాత్రమును ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.

17. యిది నిజం. దేవుని రాజ్యాన్ని చిన్న పిల్లల్లా అంగీరించనివాడు ఆందులోకి ప్రవేశించలేడు” అని అన్నాడు.

18. ఒక అధికారి ఆయనను చూచి సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలెనని ఆయన నడిగెను.

18. ఒక యూదుల నాయకుడు యేసును, “బోధకుడా! మీరు మంచివాళ్ళు. నేను అనంత జీవితం పొందాలంటే ఏమి చెయ్యాలి?” అని అడిగాడు.

19. అందుకు యేసు నేను సత్పురుషుడనని యేల చెప్పుచున్నావు? దేవుడొక్కడే తప్ప మరి ఎవడును సత్పురుషుడు కాడు.

19. “నేను మంచివాణ్ణని ఎందుకంటున్నావు? దేవుడు తప్ప మరెవ్వరూ మంచివాళ్ళు కాదు.

20. వ్యభిచరింప వద్దు, నరహత్యచేయ వద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలుకవద్దు, నీ తలి దండ్రులను సన్మానింపుమను ఆజ్ఞలను ఎరుగుదువు గదా అని అతనితో చెప్పెను.
నిర్గమకాండము 20:12-16, ద్వితీయోపదేశకాండము 5:16-20

20. నీకు దేవుని ఆజ్ఞలు తెలుసు కదా: “వ్యభిచారం చెయ్యరాదు, హత్య చెయ్యరాదు. దొంగతనము చెయ్యరాదు. దొంగ సాక్ష్యాలు చెప్పరాదు. తల్లి తండ్రుల్ని గౌరవించవలెను”‘ అని యేసు సమాధానం చెప్పాడు.

21. అందుకతడు బాల్యమునుండి వీటినన్నిటిని అనుసరించుచునే యున్నాననెను.

21. “నేను చిన్ననాటినుండి ఈ నియమాలు పాటిస్తూనేవున్నాను” అని ఆ యూదుల పెద్ద అన్నాడు.

22. యేసు వినినీకింక ఒకటి కొదువగా నున్నది; నీకు కలిగినవన్నియు అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును; నీవు వచ్చి నన్ను వెంబడింపుమని అతనితో చెప్పెను.

22. ఇది విని యేసు అతనితో, “నీలో యింకొక లోపం ఉంది. నీ దగ్గరున్నవన్నీ అమ్మేసి పేదవాళ్ళకు దానం చెయ్యి. అది నీకు పరలోకంలో సంపద అవుతుంది. ఆ తదుపరి నన్ను అనుసరించు” అని అన్నాడు.

23. అతడు మిక్కిలి ధనవంతుడు గనుక ఈ మాటలు విని మిక్కిలి వ్యసనపడగా

23. ఆ యూదుల పెద్ద చాలా ధనవంతుడు. అందువల్ల యిది విని అతనికి చాలా దుఃఖం కలిగింది.

24. యేసు అతని చూచి ఆస్తిగలవారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభము.

24. యేసు అతడు దుఃఖపడటం చూసి, “ధనవంతులు దేవుని రాజ్యంలో ప్రవేశించటం చాలా కష్టం.

25. ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుట కంటె సూదిబెజ్జములో ఒంటెదూరుట సులభమని చెప్పెను.

25. ధనవంతుడు దేవుని రాజ్యంలోకి ప్రవేశించటంకన్నా ఒంటె సూది రంధ్రం ద్వారా వెళ్ళటం సులభం” అని అన్నాడు.

26. ఇది వినినవారు ఆలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడుగగా

26. ఇది విని వాళ్ళు, “మరి ఎవరు రక్షింపబడుతారు?” అని అడిగారు.

27. ఆయన మనుష్యులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములని చెప్పెను.

27. “మానవునికి సాధ్యంకానిది దేవునికి సాధ్యమౌతుంది” అని యేసు అన్నాడు.

28. పేతురు ఇదిగో మేము మాకు కలిగినవి విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమనగా

28. పేతురు, “మిమ్మల్ని అనుసరించటానికి మాకున్నవన్నీ వదిలివేసాము” అని అన్నాడు.

29. ఆయన దేవుని రాజ్యము నిమిత్తమై యింటినైనను భార్యనైనను అన్నదమ్ములనైనను తలిదండ్రుల నైనను పిల్లలనైనను విడిచిపెట్టినవాడెవడును,

29. యేసు, “ఇది నిజం. దేవుని రాజ్యం కొరకు తన యింటిని, భార్యను, సోదరుల్ని, తల్లితండ్రుల్ని, సంతానాన్ని వదిలినవాడు ఏ మాత్రం నష్టపోడు.

30. ఇహమందు చాలరెట్లును పరమందు నిత్యజీవమును పొందకపోడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను.

30. ఇప్పుడు ఎన్నోరెట్లు ఫలం పొందటమే కాకుండా మున్ముందు అనంత జీవితం పొందుతాడు.” అని అన్నాడు.

31. ఆయన తన పండ్రెండుమంది శిష్యులను పిలిచి ఇదిగో యెరూషలేమునకు వెళ్లుచున్నాము; మనుష్యకుమారుని గూర్చి ప్రవక్తలచేత వ్రాయబడిన మాటలన్నియు నెరవేర్చబడును.

31. యేసు పన్నెండుమందిని ప్రక్కకు పిలుచుకు వెళ్ళి, “మనం యెరూషలేము వెళ్ళాలి. మనుష్యకుమారుణ్ణి గురించి ప్రవక్తలు వ్రాసినవన్నీ నిజం కాబోతున్నాయి.

32. ఆయన అన్యజనుల కప్పగింపబడును; వారు ఆయనను అపహసించి, అవమానపరచి, ఆయనమీద ఉమ్మి వేసి,

32. ఆయన యూదులుకాని వాళ్ళకు అప్పగింపబడతాడు. వాళ్ళాయన్ని హేళన చేస్తారు. అవమానిస్తారు, ఆయనపై ఉమ్మి వేస్తారు,

33. ఆయనను కొరడాలతో కొట్టి చంపుదురు; మూడవ దినమున ఆయన మరల లేచునని చెప్పెను.

33. కొరడా దెబ్బలు కొడతారు. చివరకు చంపివేస్తారు. మూడవ రోజు ఆయన బ్రతికి వస్తాడు” అని అన్నాడు.

34. వారు ఈ మాటలలో ఒకటైనను గ్రహింపలేదు; ఈ సంగతి వారికి మరుగు చేయబడెను గనుక ఆయన చెప్పిన సంగతులు వారికి బోధపడలేదు.

34. శిష్యులకు ఆయన చెప్పింది ఏ మాత్రం అర్థం కాలేదు. ఆయన చెప్పిన దానిలో గూఢార్థం ఉంది. కాని వాళ్ళకది బోధపడలేదు.

35. ఆయన యెరికో పట్టణమునకు సమీపించినప్పుడు ఒక గ్రుడ్డివాడు త్రోవప్రక్కను కూర్చుండి భిక్షమడుగుకొను చుండెను.

35. యేసు యెరికో పట్టణాన్ని సమీపిస్తున్నాడు. అదే సమయానికి ఒక గ్రుడ్డివాడు దారిప్రక్కన భిక్షమెత్తుకుంటూ కూర్చొని ఉన్నాడు.

36. జనసమూహము దాటిపోవుచున్నట్టు వాడు చప్పుడు విని ఇది ఏమని అడుగగా

36. అతడు ప్రజల గుంపు వెళ్తుండటం గమనించి ఏమి జరుగుతోందని అడిగాడు.

37. వారునజరేయుడైన యేసు ఈ మార్గమున వెళ్లుచున్నాడని వానితో చెప్పిరి.

37. వాళ్ళు, “నజరేతు నివాసి యేసు ఈ దారిలో వెళ్తున్నాడు” అని చెప్పారు.

38. అప్పుడు వాడు యేసూ, దావీదు కుమారుడా, నన్ను కరుణించుమని కేకలువేయగా

38. ఆ గ్రుడ్డివాడు బిగ్గరగా, “యేసూ! దావీదు కుమారుడా! నామీద దయ చూపు!” అని అన్నాడు.

39. ఊరకుండుమని ముందర నడుచుచుండినవారు వానిని గద్దించిరి గాని, వాడు మరి ఎక్కువగాదావీదు కుమారుడా, నన్ను కరుణించుమని కేకలువేసెను.

39. ముందున్న వాళ్ళు అతణ్ణి గద్దిస్తూ నోరు మూసుకోమని చెప్పారు. కాని, అతడు యింకా బిగ్గరగా, “దావీదు కుమారుడా! నా మీద దయ చూపు” అని అన్నాడు.

40. అంతట యేసు నిలిచి, వానిని తనయొద్దకు తీసికొని రమ్మనెను.

40. యేసు ఆగి ఆ గ్రుడ్డివాణ్ణి తన దగ్గరకు పిలుచుకురమ్మని ఆజ్ఞాపించాడు. అతడు దగ్గరకు రాగానే యేసు అతణ్ణి

41. వాడు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన నేను నీకేమి చేయ గోరుచున్నావని అడుగగా, వాడుప్రభువా, చూపు పొందగోరుచున్నాననెను.

41. “ఏమి కావాలి?” అని అడిగాడు. “ప్రభూ! నాకు దృష్టి కావాలి!” అని గ్రుడ్డివాడు సమాధానం చెప్పాడు.

42. యేసు చూపు పొందుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెనని వానితో చెప్పెను;

42. యేసు, “నీకు దృష్టి కలగాలి! నీవు విశ్వసించావు కనుక నీకు దృష్టి కలిగింది” అని అన్నాడు.

43. వెంటనే వాడు చూపుపొంది దేవుని మహిమపరచుచు ఆయనను వెంబడించెను. ప్రజలందరు అది చూచి దేవుని స్తోత్రము చేసిరి.

43. వెంటనే అతడు చూడగలిగాడు. ఆ గ్రుడ్డివాడు దేవుణ్ణి స్తుతిస్తూ యేసును అనుసరించాడు. ప్రజలందరూ యిది చూసి వారుకూడా దేవుణ్ణి స్తుతించారు. యేసు యెరికోను చేరి ఆ పట్టణం ద్వారా వెళ్తూవున్నాడు.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Luke - లూకా సువార్త 18 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

దుఃఖించబడిన వితంతువు యొక్క ఉపమానం. (1-8) 
దేవునికి సంబంధించిన ప్రతి ఒక్కరూ ప్రార్థనలో పాల్గొంటారు. ఇది ఆధ్యాత్మిక ఆశీర్వాదాల కోసం హృదయపూర్వక మరియు నిరంతర ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. వితంతువు యొక్క అచంచలమైన సంకల్పం అన్యాయమైన న్యాయమూర్తిని కూడా ప్రభావితం చేసింది; అది అతనికి వ్యతిరేకంగా మారుతుందని ఆమె భయపడి ఉండవచ్చు, మన హృదయపూర్వక ప్రార్థనలను దేవుడు స్వాగతించాడు. విశ్వాస బలహీనతతో కొనసాగుతున్న పోరాటం చివరి వరకు చెల్లుబాటు అయ్యే ఆందోళనగా మిగిలిపోయింది.

పరిసయ్యుడు మరియు పబ్లికన్. (9-14) 
ఈ ఉపమానం వారి స్వంత నీతిపై ఆధారపడే మరియు ఇతరులను తక్కువగా చూసేవారిని ఒప్పించడమే లక్ష్యంగా పెట్టుకుంది. పవిత్రమైన ఆచారాలలో దేవుడు మన విధానాన్ని ఎలా గమనిస్తున్నాడో ఇది నొక్కి చెబుతుంది. పరిసయ్యుని మాటలు స్థూల పాపాల నుండి విముక్తి పొందినట్లుగా, నీతిపై అతని ఆత్మవిశ్వాసాన్ని వెల్లడిస్తున్నాయి. ప్రశంసనీయమైనప్పటికీ, అతని స్వీయ-కేంద్రీకృతత అతని అంగీకారానికి దారితీసింది. ప్రార్థన చేయడానికి ఆలయానికి వెళ్ళినప్పటికీ, అతను దేవుని అనుగ్రహాన్ని మరియు దయను పొందడంలో విఫలమయ్యాడు, వారి విలువను తిరస్కరించాడు. గర్వించదగిన భక్తిని అందించడం మరియు ఇతరులను తృణీకరించడం గురించి మనం జాగ్రత్తగా ఉందాం.
దీనికి విరుద్ధంగా, పబ్లిక్ ప్రార్థన వినయం, పశ్చాత్తాపం మరియు దేవుని వైపు మళ్లింది. క్లుప్తంగా ఉన్నప్పటికీ, అతని అభ్యర్ధన, "పాపి అయిన నన్ను కరుణించు," అనేది రికార్డ్ చేయబడిన మరియు సమాధానం ఇవ్వబడిన ప్రార్థన. యేసుక్రీస్తు ద్వారా మనలాగే అతడు నీతిమంతునిగా ఇంటికి వెళ్ళాడని మనం నిశ్చయించుకోవచ్చు. అతను తన పాపపు స్వభావాన్ని మరియు చర్యలను అంగీకరించాడు, దేవుని ముందు దోషిగా నిలబడి, కేవలం దేవుని దయపై ఆధారపడి ఉన్నాడు. గర్విష్ఠులను ఎదిరించి, వినయస్థులకు కృపను అందించడమే దేవుని కోరిక. నీతిమంతులుగా కాకుండా స్వీయ-ఖండన పొందినవారిని ఆయన ఎదుట సమర్థించుకునేలా చేయడం ద్వారా, క్రీస్తులో దేవుని నుండి సమర్థించబడడం వస్తుంది.

పిల్లలు క్రీస్తు వద్దకు తీసుకువచ్చారు. (15-17) 
క్రీస్తు వద్దకు తీసుకురాబడటానికి ఎవరూ చాలా చిన్నవారు లేదా చాలా చిన్నవారు కాదు, ఆయనను సేవించలేని వారికి దయను విస్తరింపజేస్తాడు. చిన్న పిల్లలను కూడా తన వద్దకు తీసుకురావాలని క్రీస్తు కోరిక. వాగ్దానం మనకు మరియు మన వారసుల కోసం, కాబట్టి అతను మనతో పాటు వారిని స్వాగతిస్తున్నాడు. మనం అతని రాజ్యాన్ని పిల్లల వలె స్వీకరించాలి, దానిని సంపాదించడం ద్వారా కాదు, దానిని మన తండ్రి నుండి బహుమతిగా అంగీకరించాలి.

పాలకుడు తన ఐశ్వర్యాన్ని అడ్డుకున్నాడు. (18-30) 
చాలా మంది వ్యక్తులు ప్రశంసనీయమైన లక్షణాలను కలిగి ఉంటారు, అయినప్పటికీ వారు ఒక కీలకమైన అంశం లేకపోవడం వల్ల విధ్వంసానికి గురవుతారు. అదేవిధంగా, ఈ పాలకుడు క్రీస్తు యొక్క షరతులను అంగీకరించలేకపోయాడు, ఎందుకంటే అవి అతని సంపద నుండి అతనిని వేరు చేస్తాయి. కొందరు క్రీస్తుతో విడిపోవడానికి ఇష్టపడరు, కానీ చివరికి అలా చేస్తారు. వారి నమ్మకాలు మరియు పాపపు కోరికల మధ్య సుదీర్ఘ పోరాటం తర్వాత, రెండోది తరచుగా విజయం సాధిస్తుంది. ఎంపిక చేయవలసి వస్తే, అది ప్రాపంచిక లాభం కంటే దేవుణ్ణి విడిచిపెట్టడమే అని వారు విచారంగా అంగీకరిస్తున్నారు. వారి ప్రకటిత విధేయత తరచుగా బాహ్య ప్రదర్శన మాత్రమే, ప్రపంచం యొక్క ప్రేమ ఏదో ఒక రూపంలో అంతర్లీనంగా ఉంటుంది. ప్రజలు పీటర్ లాగా క్రీస్తు కోసం విడిచిపెట్టిన మరియు భరించిన వాటి గురించి గొప్పగా చెప్పుకుంటారు. అయితే, అలా చేయడంలో పశ్చాత్తాపం లేదా ఇబ్బంది ఏదైనా ఉంటే మనం సిగ్గుపడాలి.

క్రీస్తు తన మరణాన్ని ముందే చెప్పాడు. (31-34) 
పాత నిబంధన ప్రవక్తలు, క్రీస్తు ఆత్మ ప్రభావంతో, అతని బాధలను మరియు తదుపరి మహిమను ప్రవచించారు 1 పేతురు 1:11 అయినప్పటికీ, శిష్యులు వారి ముందస్తు ఆలోచనలలో ఎంతగానో పాతుకుపోయారు, వారు ఈ అంచనాలను అక్షరాలా గ్రహించలేకపోయారు. క్రీస్తు మహిమ గురించిన ప్రవచనాలపై వారి దృష్టి అతని బాధలను వివరించే వారిని పట్టించుకోకుండా నడిపించింది. ప్రజలు తమ బైబిళ్లను ఎంపిక చేసుకుని, ఓదార్పునిచ్చే భాగాలవైపు ఆకర్షితులవుతున్నప్పుడు మాత్రమే తప్పులు తలెత్తుతాయి. అదేవిధంగా, క్రీస్తు బాధలు, సిలువ వేయడం మరియు పునరుత్థానం నుండి సరైన పాఠాలు నేర్చుకోవడానికి మనం తరచుగా ఇష్టపడరు - శిష్యులు ఈ సంఘటనలను అర్థం చేసుకోవడంలో నిదానంగా ఉన్నారు. సాధారణ అవరోధం మన స్వీయ-ప్రేమ మరియు ప్రాపంచిక సాధనల పట్ల కోరిక, ఇది మన అవగాహనను అంధకారం చేస్తుంది.

ఒక గుడ్డి మనిషికి తిరిగి చూపు వచ్చింది. (35-43)
దారి పక్కన కూర్చొని, ఈ పేద అంధుడు వేడుకున్నాడు-ఇది కేవలం భౌతిక అంధత్వమే కాదు, మానవత్వం యొక్క ఆధ్యాత్మిక పేదరికాన్ని కూడా సూచిస్తుంది, క్రీస్తు నయం చేయడానికి మరియు రక్షించడానికి వచ్చాడు. విశ్వాసంతో కూడిన ప్రార్థన, క్రీస్తు యొక్క అభయమిచ్చే వాగ్దానాలచే మార్గనిర్దేశం చేయబడి, వాటిలో దృఢంగా పాతుకుపోయింది, అది వ్యర్థం కాదు. క్రీస్తు కృపను కృతజ్ఞతాపూర్వకంగా గుర్తించి, దేవునికి మహిమను తీసుకురావడం సముచితం. కళ్ళు తెరిచిన వారు, యేసును అనుసరించి, దేవుని మహిమకు దోహదం చేస్తారు. మనపై మనకు ప్రసాదించబడిన కనికరం కోసం మాత్రమే కాకుండా ఇతరులకు కూడా అందించబడినందుకు కూడా మనం దేవుణ్ణి స్తుతించాలి. ఈ సత్యాలను గ్రహించాలంటే, మనం గుడ్డివానిలా క్రీస్తుని సంప్రదించాలి, మన కళ్ళు తెరవమని ఆయనను మనస్ఫూర్తిగా వేడుకోవాలి, ఆయన ఆజ్ఞల శ్రేష్ఠతను మరియు అతని మోక్షానికి సంబంధించిన విలువను వెల్లడిస్తుంది.



Shortcut Links
లూకా - Luke : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |