Luke - లూకా సువార్త 17 | View All

1. ఆయన తన శిష్యులతో ఇట్లనెను అభ్యంతరములు రాకపోవుట అసాధ్యముకాని అవి ఎవనివలన వచ్చునో వానికి శ్రమ.

1. And Jhesu seide to hise disciplis, It is impossible that sclaundris come not; but wo to that man, bi whom thei comen.

2. వాడీ చిన్నవారిలో ఒకనికి అభ్యంతరము కలుగజేయుటకంటె వాని మెడకు తిరు గటిరాయి కట్టబడి సముద్రములో పడద్రోయబడుట వానికి మేలు.

2. It is more profitable to him, if a mylne stoon be put aboute his necke, and he be cast in to the see, than that he sclaundre oon of these litle.

3. మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండుడి. నీ సహోదరుడు తప్పిదము చేసినయెడల అతని గద్దించుము; అతడు మారుమనస్సు పొందిన యెడల అతని క్షమించుము.

3. Take ye hede you silf; if thi brothir hath synned ayens thee, blame hym; and if he do penaunce, foryyue hym.

4. అతడు ఒక దినమున ఏడుమారులు నీయెడల తప్పిదము చేసి యేడు మారులు నీవైపుతిరిగిమారుమనస్సు పొందితి ననినయెడల అతని క్షమింపవలెననెను.

4. And if seuene sithis in the dai he do synne ayens thee, and seuene sithis in the dai he be conuertid to thee, and seie, It forthenkith me, foryyue thou hym.

5. అపొస్తలులుమా విశ్వాసము వృద్ధిపొందించుమని ప్రభువుతో చెప్పగా

5. And the apostlis seiden to the Lord, Encrese to vs feith.

6. ప్రభువు మీరు ఆవగింజంత విశ్వాసము గలవారైతే ఈ కంబళిచెట్టును చూచినీవు వేళ్లతోకూడ పెల్లగింపబడి సముద్రములో నాటబడుమని చెప్పునప్పుడు అది మీకు లోబడును.

6. And the Lord seide, If ye han feith as the corn of seneuei, ye schulen seie to this more tre, Be thou drawun vp bi the rote, and be ouerplauntid in to the see, and it schal obeie to you.

7. దున్నువాడు గాని మేపువాడు గాని మీలో ఎవనికైన ఒక దాసుడుండగా, వాడు పొలములోనుండి వచ్చి నప్పుడునీవు ఇప్పడే వెళ్లి భోజనము చేయుమని వానితో చెప్పునా? చెప్పడు.

7. But who of you hath a seruaunt erynge, or lesewynge oxis, which seith to hym, whanne he turneth ayen fro the feeld, Anoon go, and sitte to mete;

8. అంతేకాకనేను భోజనము చేయుటకు ఏమైనను సిద్ధ పరచి, నడుము కట్టుకొని నేను అన్నపానములు పుచ్చు కొనువరకు నాకు పరిచారము చేయుము; అటుతరువాత నీవు అన్నపానములు పుచ్చుకొనవచ్చునని వానితో చెప్పును గాని

8. and seith not to hym, Make redi, that Y soupe, and girde thee, and serue me, while Y ete and drynke, and aftir this thou schalt ete and drynke;

9. ఆ దాసుడు ఆజ్ఞాపింపబడిన పనులు చేసినందుకు వాడు దయచూపెనని వానిని మెచ్చునా?

9. whether he hath grace to that seruaunt, for he dide that that he comaundide hym?

10. అటువలె మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నియు చేసిన తరువాతమేము నిష్‌ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసినవే చేసియున్నామని చెప్పుడనెను.

10. Nay, Y gesse. So ye, whanne ye han don alle thingis that ben comaundid to you, seie ye, We ben vnprofitable seruauntis, we han do that that we ouyten to do.

11. ఆయన యెరూషలేమునకు ప్రయాణమై పోవుచు సమరయ గలిలయల మధ్యగా వెళ్లుచుండెను.

11. And it was do, the while Jhesus wente in to Jerusalem, he passide thorou the myddis of Samarie, and Galilee.

12. ఆయన యొక గ్రామములోనికి వెళ్లుచుండగా పది మంది కుష్ఠ రోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి
లేవీయకాండము 13:46

12. And whanne he entride in to a castel, ten leprouse men camen ayens hym, whiche stoden afer,

13. యేసు ప్రభువా, మమ్ము కరుణించుమని కేకలు వేసిరి.

13. and reiseden her voys, and seiden, Jhesu, comaundoure, haue merci on vs.

14. ఆయన వారిని చూచిమీరు వెళ్లి, మిమ్మును యాజకులకు కనుపరచుకొనుడని వారితో చెప్పెను. వారు వెళ్లుచుండగా, శుద్ధులైరి.
లేవీయకాండము 13:49, లేవీయకాండము 14:2-3

14. And as he say hem, he seide, Go ye, `schewe ye you to the prestis. And it was don, the while thei wenten, thei weren clensid.

15. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి

15. And oon of hem, as he saiy that he was clensid, wente ayen, magnifiynge God with grete vois.

16. గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు, తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, ఆయన పాదములయొద్ద సాగిలపడెను; వాడు సమరయుడు.

16. And he fel doun on the face bifore hise feet, and dide thankyngis; and this was a Samaritan.

17. అందుకు యేసుపదిమంది శుద్ధులైరి కారా; ఆ తొమ్మండుగురు ఎక్కడ?

17. And Jhesus answerde, and seide, Whether ten ben not clensid, and where ben the nyne?

18. ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చినవాడెవడును అగపడలేదా అని చెప్పి

18. There is noon foundun, that turnede ayen, and yaf glorie to God, but this alien.

19. నీవు లేచిపొమ్ము, నీ విశ్వా సము నిన్ను స్వస్థపరచెనని వానితో చెప్పెను.

19. And he seide to hym, Rise vp, go thou; for thi feith hath maad thee saaf.

20. దేవుని రాజ్యమెప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయన నడిగినప్పుడు ఆయనదేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు.

20. And he was axid of Farisees, whanne the rewme of God cometh. And he answerde to hem, and seide, The rewme of God cometh not with aspiyng,

21. ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే యున్నది గనుక, ఇదిగో యిక్కడనని, అదిగో అక్కడనని చెప్ప వీలుపడదని వారికి ఉత్తరమిచ్చెను.

21. nether thei schulen seie, Lo! here, or lo there; for lo! the rewme of God is with ynne you.

22. మరియు ఆయన తన శిష్యులతో ఇట్లనెను మనుష్య కుమారుని దినములలో ఒకదినము చూడవలెనని మీరు కోరు దినములు వచ్చునుగాని మీరు ఆ దినమును చూడరు.

22. And he seide to hise disciplis, Daies schulen come, whanne ye schulen desire to se o dai of mannus sone, and ye schulen not se.

23. వారుఇదిగో యిక్కడనని అదిగో అక్కడనని మీతో చెప్పినయెడల వెళ్లకుడి, వెంబడింపకుడి.

23. And thei schulen seie to you, Lo! here, and lo there. Nyle ye go, nether sue ye;

24. ఆకాశము క్రింద ఒక దిక్కునుండి మెరుపుమెరిసి, ఆకాశముక్రింద మరియొక దిక్కున కేలాగు ప్రకాశించునో ఆలాగున మనుష్యకుమారుడు తన దినమున ఉండును.

24. for as leyt schynynge from vndur heuene schyneth in to tho thingis that ben vndur heuene, so schal mannus sone be in his dai.

25. అయితే ముందుగా ఆయన అనేక హింసలు పొంది యీ తరము వారిచేత ఉపేక్షింపబడవలెను.

25. But first it bihoueth hym to suffre many thingis, and to be repreued of this generacioun.

26. నోవహు దినములలో జరిగినట్టు మనుష్యకుమారుని దినములలోను జరుగును.
ఆదికాండము 6:5-12

26. And as it was doon in the daies of Noe, so it schal be in the daies of mannys sone.

27. నోవహు ఓడలోనికి వెళ్లిన దినమువరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లి కియ్యబడుచు నుండిరి; అంతలో జలప్రళయము వచ్చి వారినందరిని నాశనముచేసెను.
ఆదికాండము 7:7

27. Thei eeten and drunkun, weddiden wyues, and weren youun to weddyngis, til in to the dai in the whych Noe entride in to the schip; and the greet flood cam, and loste alle.

28. లోతు దినములలో జరిగి నట్టును జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచు నుండిరి.
ఆదికాండము 18:20-21, ఆదికాండము 19:1-14

28. Also as it was don in the daies of Loth, thei eeten and drunkun, bouyten and seelden, plauntiden and bildiden; but the dai that Loth wente out of Sodome,

29. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిసి వారినందరిని నాశనము చేసెను.
ఆదికాండము 19:24

29. the Lord reynede fier and brymstoon fro heuene, and loste alle.

30. ఆ ప్రకారమే మనుష్యకుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును.

30. Lijk this thing it schal be, in what dai mannys sone schal be schewid.

31. ఆ దినమున మిద్దెమీద ఉండు వాడు ఇంట ఉండు తన సామగ్రిని తీసికొనిపోవుటకు దిగ కూడదు; ఆలాగే పొలములో ఉండువాడును తిరిగి రాకూడదు.
ఆదికాండము 19:17, ఆదికాండము 19:26

31. In that our he that is in the roof, and his vessels in the hous, come he not doun to take hem awei; and he that schal be in the feeld, also turne not ayen bihynde.

32. లోతు భార్యను జ్ఞాపకము చేసికొనుడి.
ఆదికాండము 19:17

32. Be ye myndeful of the wijf of Loth.

33. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దానిని పోగొట్టుకొనును, దాని పోగొట్టుకొనువాడు దానిని సజీవముగా కాపాడుకొనును.

33. Who euer seketh to make his lijf saaf, schal leese it; and who euer leesith it, schal quykene it.

34. ఆ రాత్రి యిద్దరొక్క మంచముమీద ఉందురు; వారిలో ఒకరు కొనిపోబడును ఒకరు విడిచిపెట్టబడును.

34. But Y seie to you, in that nyyt twei schulen be in o bed, oon schal be takun, and the tothir forsakun;

35. ఇద్దరు స్త్రీలు ఒక్క తిరుగలి విసరుచుందురు; ఒకతె కొనిపోబడును ఒకతె విడిచిపెట్ట బడుననెను.

35. twei wymmen schulen be gryndynge togidir, `the toon schal be takun, and `the tother forsakun; twei in a feeld, `the toon schal be takun, and `the tother left.

36. శిష్యులు ప్రభువా, యిది ఎక్కడ (జరుగు) నని ఆయన నడిగినందుకు

36. Thei answeren, and seien to hym, Where, Lord?

37. ఆయన పీనుగు ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలును పోగవునని వారితో చెప్పెను.
యోబు 39:30

37. Which seide to hym, Where euer the bodi schal be, thidur schulen be gaderid togidere also the eglis.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Luke - లూకా సువార్త 17 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

నేరాలను నివారించడానికి, విశ్వాసం పెరగడానికి ప్రార్థించడానికి, వినయం నేర్పింది.11-19. 
ఎవరి నుండి నేరం జరిగిందో వారి అపరాధం మారదు మరియు నేరాల యొక్క అనివార్యత వారి నేరాన్ని తగ్గించదు. దేవుని క్షమించే దయపై నమ్మకం ఉంచడం ఇతరులను క్షమించడంలో ముఖ్యమైన సవాళ్లను అధిగమించడానికి మనకు శక్తినిస్తుంది. దేవునికి అసాధ్యమైనదేదీ లేనట్లే, విశ్వసించే వారు అన్నిటినీ సాధించగలరు. యేసు తన శిష్యులకు లోతైన వినయం యొక్క ప్రాముఖ్యతను ప్రదర్శించాడు. ఏదైనా మానవ దావాను అధిగమించే ప్రతి జీవి యొక్క ప్రత్యేకమైన యాజమాన్యాన్ని ప్రభువు కలిగి ఉంటాడు; వారి సేవలకు అతను వారికి రుణపడి ఉండలేడు మరియు వారు అతని నుండి ఎలాంటి ప్రతిఫలాన్ని పొందలేరు.

పది మంది కుష్ఠురోగులు శుద్ధి అయ్యారు. (1-10) 
క్రీస్తును సమీపిస్తున్నప్పుడు మన ఆధ్యాత్మిక లోపాలను గుర్తించడం లోతైన వినయాన్ని పెంపొందించుకోవాలి. క్రీస్తు యొక్క అచంచలమైన కరుణపై మన నమ్మకాన్ని ఉంచడం సరిపోతుంది. మనం విధేయతతో నడుచుకున్నప్పుడు, దేవుని దయను ఎదుర్కోవడాన్ని మనం ఊహించవచ్చు. ఆశ్చర్యకరంగా, స్వస్థత పొందిన వారిలో ఒకరు మాత్రమే కృతజ్ఞతలు తెలియజేయడానికి తిరిగి వచ్చారు. ఆయనను అనుకరిస్తూ, ప్రార్థనలలో మన దృక్పథాన్ని ప్రతిబింబిస్తూ, ప్రగాఢమైన వినయంతో కృతజ్ఞతలు తెలియజేయాలి. ఈ విధంగా నిలబడిన సమరిటన్‌ను క్రీస్తు ప్రత్యేకంగా గుర్తించాడు; మిగిలిన వారు శారీరక స్వస్థతను మాత్రమే పొందారు, అతను మాత్రమే లోతైన ఆధ్యాత్మిక ఆశీర్వాదాన్ని అనుభవించాడు.

క్రీస్తు రాజ్యం. (20-37)
దేవుని రాజ్యం యూదుల మధ్య ఉంది, లేదా మరింత ఖచ్చితంగా, వారిలో కొందరిలో ఉంది. ఇది ఒక ఆధ్యాత్మిక రాజ్యం, ఇది దైవిక దయ ప్రభావం ద్వారా హృదయంలో స్థాపించబడింది. టెక్స్ట్ పాపుల మునుపటి స్థితిని మరియు దేవుని ముందస్తుగా హెచ్చరించిన తీర్పులు వారిని కనుగొన్న స్థితిని నొక్కి చెబుతుంది. ఈ విధ్వంసం ఆత్మసంతృప్తితో మరియు ఆనందంతో జీవించేవారికి తెచ్చే దిగ్భ్రాంతికరమైన గ్రహింపును ఇది స్పష్టంగా చిత్రీకరిస్తుంది. ఈ దృశ్యం మనుష్యకుమారుడు బయలుపరచబడిన రోజున ఏమి జరుగుతుందో దానితో సమలేఖనం చేయబడింది. రోమన్ సైన్యాల ద్వారా యూదు దేశం యొక్క పతనాన్ని తీసుకురావడానికి క్రీస్తు వచ్చినప్పుడు, ఆ దేశం తప్పుడు భద్రతలో కనుగొనబడింది, వివరించిన పరిస్థితిని ప్రతిధ్వనిస్తుంది. అదేవిధంగా, యేసు క్రీస్తు ప్రపంచ తీర్పు కోసం తిరిగి వచ్చినప్పుడు, పాపులు పూర్తిగా ఉదాసీనంగా కనిపిస్తారు. ప్రతి యుగంలో తమ అంతిమ విధిని పరిగణనలోకి తీసుకోకుండా వారి చెడు మార్గాల్లో కొనసాగే పాపుల నమూనాకు ఇది అద్దం పడుతుంది. వారు నిర్వహించే సురక్షితమైన ముఖభాగంతో సంబంధం లేకుండా, దేవుని తీర్పులు శాశ్వతమైన నాశనానికి ఉద్దేశించిన దుష్టులను కనుగొంటాయి.



Shortcut Links
లూకా - Luke : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |