Luke - లూకా సువార్త 15 | View All

1. ఒకప్పుడు సమస్తమైన సుంకరులును పాపులును ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా

“సుంకం వారు”– మత్తయి 5:46. ఇక్కడ “పాపులు” అంటే పరిసయ్యుల్లాగా నీతి నిజాయితీగా పవిత్రంగా ఉన్నట్టు నటించని వారు.

2. పరిసయ్యులును శాస్త్రులును అది చూచిఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడ భోజనము చేయుచున్నాడని చాల సణుగుకొనిరి.

మత్తయి 9:11-13; మత్తయి 11:19. సరిగ్గా తాము చెయ్యవలసినదాన్ని క్రీస్తు చేస్తుంటే సణుగుతున్నారు – యెహెఙ్కేలు 34:2-4; జెకర్యా 11:16. “పరిసయ్యులు”– మత్తయి 3:7.

3. అందుకాయన వారితో ఈ ఉపమానము చెప్పెను

ఉదాహరణల గురించి నోట్స్ మత్తయి 13:1, మత్తయి 13:18-23.

4. మీలో ఏ మనుష్యునికైనను నూరు గొఱ్ఱెలు కలిగి యుండగా వాటిలో ఒకటి తప్పిపోయినయెడల అతడు తొంబది తొమ్మిదింటిని అడవిలో విడిచిపెట్టి, తప్పిపోయి నది దొరకువరకు దానిని వెదక వెళ్లడా?
యెహెఙ్కేలు 34:11, యెహెఙ్కేలు 34:16

పశ్చాత్తాపం గురించి నోట్స్ మత్తయి 3:2. మత్తయి 9:13 కూడా చూడండి. తప్పిపోయిన గొర్రెలను (పాపులు – వ 2) యేసు వెదుకుతుంటే మతనాయకులు సణుక్కున్నారు. పరలోకమంతటికీ ఆనందాన్ని తెచ్చినది వారిలో చిరాకు, విమర్శలూ రేకెత్తిచ్చింది.

5. అది దొరకినప్పుడు సంతోషముతో దానిని తన భుజములమీద వేసి కొని యింటికి వచ్చి తన స్నేహితులను పొరుగువారిని పిలిచి

6. మీరు నాతోకూడ సంతోషించుడి; తప్పిపోయిన నా గొఱ్ఱె దొరకినదని వారితో చెప్పును గదా.

7. అటువలె మారుమనస్సు అక్కరలేని తొంబది తొమ్మిదిమంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషముకంటె మారుమనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలొక మందు ఎక్కువ సంతోషము కలుగును.

“పశ్చాత్తాపపడనక్కర లేని”– ఇలాంటి వారెవరయినా ఉన్నారా? అంటే పరలోకంలో ఉన్నవారంతా. భూమిమీద కూడా తాము దారి తప్పిపోయినందుకు ఇప్పటికే పశ్చాత్తాపం చెంది క్రీస్తుదగ్గరికి వచ్చిన చాలామంది ఉన్నారు. అంతేగాక పరిసయ్యులలాగా పశ్చాత్తాపం తమకు అవసరం లేదనుకునే వారు కూడా చాలమంది ఉన్నారు.

8. ఏ స్త్రీకైనను పది వెండి నాణములుండగా వాటిలో ఒక నాణము పోగొట్టుకొంటె ఆమె దీపము వెలిగించి యిల్లు ఊడ్చి అది దొరకువరకు జాగ్రత్తగా వెదకదా?

గొర్రె అరణ్యంలో మందనుండి వేరై తప్పిపోయింది. (వ 4). ఈ నాణెం ఇంటిలోనే కనిపించకుండా ఎక్కడో పోయింది. గొర్రె మూర్ఘ స్వభావం అటూ ఇటూ వెళ్ళిపోతుంది గనుక అది తప్పిపోయింది. నాణెమైతే ఆ స్త్రీ నిర్లక్ష్యం వల్ల పోయింది. ఈ స్త్రీ క్రీస్తుకు గుర్తుగా ఉందనుకోవడానికి వీలులేదు (ఎందుకంటే క్రీస్తుకు ఇలాంటి నిర్లక్ష్యం లేదు) గాని ఈమె క్రీస్తు సంఘానికి సూచన అని చెప్పుకోవచ్చు. తప్పిపోయిన గొర్రె, పోయిన నాణెం రెండూ కూడా చెడిపోయిన పాపికి సూచన, లేక దిగజారిపోయే క్రైస్తవునికి సూచన. వాటిని తిరిగి కనుక్కోవడంవల్ల కలిగిన ఫలితం ఒక్కటే ఆనందం.

9. అది దొరకినప్పుడు తన చెలికత్తెలను పొరుగువారిని పిలిచి నాతో కూడ సంతోషించుడి, నేను పోగొట్టుకొనిన నాణము దొరకినదని వారితో చెప్పును గదా.

10. అటువలె మారుమనస్సు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతలయెదుట సంతోషము కలుగునని మీతో చెప్పు చున్నాననెను.

11. మరియు ఆయన ఇట్లనెను ఒక మనుష్యునికి ఇద్దరు కుమారులుండిరి.

గొర్రె తన మూర్ఘతవల్ల తప్పిపోయింది. నాణెం ఆ స్త్రీ నిర్లక్ష్యం వల్ల పోయింది. చిన్నకొడుకు మాత్రం తన తండ్రి ఇంటిని వదిలి సొంతగా బ్రతకాలని ఉద్దేశపూర్వకంగా నిర్ణయం తీసుకున్నాడు. యెషయా 53:6 పోల్చి చూడండి.

12. వారిలో చిన్నవాడు తండ్రీ, ఆస్తిలో నాకువచ్చు భాగమిమ్మని తన తండ్రి నడు గగా, అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను.

ఈ లోకంలో తమకు ఏవేవి లభించగలవో అవన్నీ తమకు దక్కాలనీ, అది ఇప్పుడే జరగాలనీ ఆత్రుత చూపుతారు కొందరు. ఈ చిన్నకొడుకు అలాంటివాడే. అలాంటి వారికి శాశ్వత కాలం గురించిన ఆలోచన ఉండదు.

13. కొన్నిదినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూర దేశమునకు ప్రయాణమై పోయి, అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారమువలన పాడుచేసెను.
సామెతలు 29:3

తాను చేయదలచుకున్నవాటికి అడ్డు పెట్టడానికి తండ్రి తన దగ్గర ఉండడం అతనికి ఇష్టం లేదు. దేవుడు అనే అడ్డంకి లేకుండా తమ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించాలని చూచేవారు ఇలాంటివారే. అతని విచ్చలవిడి జీవితం దేవుణ్ణి విడిచి పెట్టిన ప్రతి వ్యక్తీ ఆధ్యాత్మిక విషయాల్లో చేసేదానికి సూచనగా ఉంది (అయితే అలాంటివారు ఒకవేళ తమ ఇహలోక సంపదలను అభివృద్ధి చేసుకోవచ్చు) వారి శక్తియుక్తులు, సమయం, ఆలోచన, సామర్థ్యతలు మొదలైనవన్నీ దేవునికి ఉపయోగపడవలసింది పోయి, శూన్యమైన, వ్యర్థమైన కాలక్షేపాలకు ఉపయోగపడతాయి (యెషయా 55:1-2; ప్రసంగి 2:4-11).

14. అదంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరవు రాగా వాడు ఇబ్బంది పడ సాగి,

15. వెళ్లి ఆ దేశస్థులలో ఒకనిచెంత జేరెను. అతడు పందులను మేపుటకు తన పొలములలోనికి వానిని పంపెను.

యూదులకు పందులు పనికిమాలిన, ఆశుద్ధమైన జంతువులు (లేవీయకాండము 11:7). ఈ మనిషి నిజంగా చాలా హీనమైన స్థితికి దిగజారాడు. పాపాత్ములు కూడా అంతే. వారు నిరుపయోగమైన, అశుద్ధమైన విషయాల్లో నిమగ్నమై ఉంటారు యెషయా 64:6; మత్తయి 15:18-20; మత్తయి 23:27; రోమీయులకు 1:24; రోమీయులకు 6:19; ఎఫెసీయులకు 4:17-19; 1 పేతురు 1:18.

16. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొన అశపడెను గాని యెవడును వాని కేమియు ఇయ్యలేదు.

ఈ లోకంలో పాపులకు లభించేది నిజంగా పందుల ఆహారం కన్నా మంచిదేమీ కాదు. పౌలు అభిప్రాయం చూడండి – ఫిలిప్పీయులకు 3:8. ఈ లోకంలో ఎవరూ కూడా వారికి సహాయం చెయ్యవలసిన రీతిలో సహాయం చెయ్యరు, చెయ్యలేరు. పాపం మనుషుల్లో కలిగించే ఆధ్యాత్మిక పేదరికం ఎలాంటిదంటే దేవుడు తప్ప వేరెవరూ అతనికి సహాయం చెయ్యడం సాధ్యం కాదు – రోమీయులకు 5:6; రోమీయులకు 7:18.

17. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రియొద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవు చున్నాను.

దేవుణ్ణి వదిలి తమ ఇష్టప్రకారం జీవించేవారు ఆధ్యాత్మికంగా మతి లేనివారు (ప్రసంగి 9:3). వారు మేల్కొని తిరిగి మతి తెచ్చుకోవాలి. తన తండ్రి ఇంటిని జ్ఞాపకం చేసుకోవడం కొన్ని మంచి నిర్ణయాలు చేసుకునేందుకు అతనికి సహాయపడింది.

18. నేను లేచి నా తండ్రియొద్దకు వెళ్లి - తండ్రీ, నేను పరలోకమునకు విరోధముగాను నీ యెదుటను పాపము చేసితిని;
కీర్తనల గ్రంథము 51:4

ఇది పశ్చాత్తాప పరిభాష – మత్తయి 3:6; 1 యోహాను 1:9. ఈ అధ్యాయం ఆరంభం నుంచి కూడా యేసు మాట్లాడుతున్నది దీని గురించే – వ 1,2.

19. ఇకమీదట నీ కుమారుడనని అని పించుకొనుటకు యోగ్యుడను కాను; నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదుననుకొని, లేచి తండ్రియొద్దకు వచ్చెను.

20. వాడింక దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి, పరుగెత్తి వాని మెడమీదపడి ముద్దుపెట్టుకొనెను.

దేవుడెలాంటివాడో, తన చెంతకు వచ్చే పాపులను ఆయన ఎలా చూస్తాడో చూడండి. ఎలాంటి గద్దింపు, విమర్శలు, శిక్ష ఇవ్వడు. ప్రేమపూర్వకమైన స్వాగతం మాత్రమే ఇస్తాడు. “ముద్దుపెట్టుకున్నాడు”– తనకు న్యాయంగా పడవలసిన తన్నులు, తిట్లకు బదులుగా అతనికి ముద్దులు దొరికాయి (యెషయా 55:7; యోహాను 3:16; యోహాను 6:37; ఎఫెసీయులకు 2:4-5; తీతుకు 3:4-5; యాకోబు 4:8).

21. అప్పుడు ఆ కుమారుడు అతనితో తండ్రీ, నేను పరలోక మునకు విరోధముగాను నీ యెదుటను పాపము చేసితిని; ఇకమీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాననెను.

దేవునిపట్ల మనలో ప్రతి ఒక్కరి ప్రవర్తన విషయంలోనూ ఇది నిజం. మనమందరమూ దేవుని పిల్లలుగా ఉండే అర్హత లేకుండా ఉన్నాం (కీర్తనల గ్రంథము 51:4-5; యెషయా 64:6; రోమీయులకు 3:9-19). మనం దీన్ని గుర్తించి వినయంతో ఒప్పుకోవాలి.

22. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి, వీని చేతికి ఉంగరము పెట్టి, పాదములకు చెప్పులు తొడిగించుడి;

పశ్చాత్తాపపడే పాపికి దేవుడు తన శ్రేష్ఠమైన వస్త్రాన్ని ధరింపజేస్తాడు – యెషయా 61:10; జెకర్యా 3:4; రోమీయులకు 3:21-24. అతణ్ణి అంగీకరించి ఉన్నత స్థానంలో ఉంచిన సంగతిని ఈ ఉంగరం సూచిస్తున్నది (ఆదికాండము 41:42; ఎస్తేరు 3:10, ఎస్తేరు 3:12). ఎఫెసీయులకు 1:13-14; ఎఫెసీయులకు 2:4-7 పోల్చి చూడండి. పశ్చాత్తాపపడిన పాపిని తాను అంగీకరించానని దేవుడతనికి కొన్ని గుర్తులు ఇస్తాడు. ఎఫెసీయులకు 6:15 లో చెప్పిన సత్యాన్ని చెప్పులు సూచిస్తూ ఉండవచ్చు.

23. క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడుదము;

యూదులు మాంసాహారులు. విందుకోసం అవసరమైన అతి రుచికరమైన పదార్ధాలకు కొవ్విన దూడ గుర్తుగా ఉంది. ఆనందించడానికి తగిన ఒక ప్రత్యేక సందర్భాన్ని వింటున్న వారికి అర్థమయ్యేలా చెప్పేందుకు యేసు ఈ మాటలు వాడాడు. అంతేగాని పశ్చాత్తాపపడిన వారంతా, క్రీస్తులో నమ్మకం ఉంచిన వారంతా ఇలాంటి మాంసాహారం తినాలని గాని, తింటారని గాని దీని అర్థం కాదు.

24. ఈ నా కుమారుడు చనిపోయి మరల బ్రదికెను, తప్పిపోయి దొరకెనని చెప్పెను; అంతట వారు సంతోషపడసాగిరి.

తన కొడుకు చనిపోయాడని తండ్రి అంటున్నాడు. ఆదికాండము 2:17; ఎఫెసీయులకు 2:1, ఎఫెసీయులకు 2:5; కొలొస్సయులకు 2:13; 1 తిమోతికి 5:6 పోల్చి చూడండి. పాపం మూలంగా మనం ఆధ్యాత్మికంగా చనిపోయిన స్థితే మనకు నూతన జన్మ అంత అవసరమవ్వడానికి కారణం (యోహాను 3:3, యోహాను 3:5, యోహాను 3:7). ఈ అధ్యాయమంతా పశ్చాత్తాపపడిన పాపుల గురించి పరలోకంలో వెల్లివిరిసే ఆనందోత్సవాల గురించి నేర్పిస్తున్నది – వ 7,10; జెఫన్యా 3:17 చూడండి. ఒక పాపి దేవునివైపుకు తిరిగిన ప్రతి సందర్భమూ ఆయనకు పండగే.

25. అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలములో ఉండెను. వాడు (పొలమునుండి) వచ్చుచు ఇంటిదగ్గరకు రాగా, వాద్యములును నాట్యమును జరుగుట విని

26. దాసులలో ఒకని పిలిచి ఇవి ఏమిటని అడుగగా

27. ఆ దాసుడు అతనితో నీ తమ్ముడు వచ్చి యున్నాడు, అతడు తన యొద్దకు సురక్షితముగా వచ్చి నందున నీ తండ్రి క్రొవ్విన దూడను వధించెననెను.

28. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్లనొల్లక పోయెను గనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి (లోపలికి రమ్మని) బతిమాలుకొనెను.

యేసు పాపులను దేవుని దగ్గరికి తెస్తున్నప్పుడు (వ 2) సణుగుతూ విమర్శించిన ఇస్రాయేల్ మత నాయకులకు పెద్దకొడుకు సూచనగా ఉన్నాడు. ఈ అధ్యాయంలోని ఉదాహరణలన్నీ యేసు చెప్పినది వీరికే (వ 3,8,11). ఇలాంటి వ్యక్తులు ఈ లోకంలో ఇప్పటికీ ఉన్నారు. వ 28-30లో ఇలాంటివారి పాపాలు కొన్నింటిని చూడవచ్చు. దేవుని దృష్టిలో ఈ పాపాలు చిన్నకొడుకు చేసిన పాపాలంత చెడ్డవే (అంతకన్నా కూడా చెడ్డవే) – కరుణ చూపడం జరిగినందుకు కోపం, స్వాభిమానం, వేరొకడికి దీవెనలు కలిగాయని అసూయ, రక్తబంధువుపై ద్వేషం (చిన్నకొడుకును ఇతడు కనీసం “తమ్ముడు” అనడం లేదు – వ 30). గనుక అతడు విందులోకి వెళ్ళడానికి నిరాకరిస్తున్నాడు. లూకా 14:18; మత్తయి 23:13 పోల్చి చూడండి.

29. అందుకతడు తన తండ్రితో ఇదిగో యిన్నియేండ్లనుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నేనెన్నడును మీరలేదే; అయినను నా స్నేహితులతో సంతోషపడునట్లు నీవు నాకెన్నడును ఒక మేకపిల్లనైన ఇయ్యలేదు.

30. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తిని వేసిన యీ నీ కుమారుడు రాగానే వీనికొరకు క్రొవ్విన దూడను వధించితివని చెప్పెను.

31. అందుకతడు కుమారుడా, నీ వెల్లప్పుడును నాతోకూడ ఉన్నావు; నావన్నియు నీవి,

ఇస్రాయేల్ దేవుడేర్పరచుకున్న ప్రత్యేక జాతి – ద్వితీయోపదేశకాండము 7:6. దేవుని రాజ్యం యూదుల చేతుల్లో ఉంది – మత్తయి 21:43. రోమీయులకు 3:1-2; రోమీయులకు 9:3, రోమీయులకు 9:5 కూడా చూడండి. ఆ కాలంలో యూదుల నాయకులకు ఈ పెద్దకొడుకు సూచనగా ఉన్నాడు. ఇప్పుడు విశ్వాసుల గురించి ఏమి చెప్పబడినదో చూడండి – 1 కోరింథీయులకు 3:21-23.

32. మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే; ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రదికెను, తప్పిపోయి దొరకెనని అతనితో చెప్పెను.

వ 24.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Luke - లూకా సువార్త 15 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

తప్పిపోయిన గొర్రెల ఉపమానాలు మరియు వెండి ముక్క. (1-10) 
తప్పిపోయిన గొర్రెల ఉపమానం మానవాళి యొక్క విముక్తికి లోతైన ఔచిత్యాన్ని కలిగి ఉంది. ఈ కథనంలో, తప్పిపోయిన గొర్రె దేవుని నుండి తప్పిపోయిన పాపిని సూచిస్తుంది, ఆయన వద్దకు తిరిగి రాకపోతే ఆసన్నమైన ఆపదను ఎదుర్కొంటుంది, ఇంకా తిరిగి రావాలనే కోరిక లేదు. పాపులను రక్షించడంలో క్రీస్తు యొక్క అచంచలమైన నిబద్ధత ఈ కథలో స్పష్టంగా కనిపిస్తుంది.
అదేవిధంగా, పోయిన వెండి ముక్క యొక్క ఉపమానంలో, పోగొట్టుకున్న వస్తువు కేవలం ఒక చిన్న ముక్క మాత్రమే, మొత్తంతో పోల్చినప్పుడు చాలా తక్కువగా ఉంటుంది. అయినప్పటికీ, ఆ మహిళ దానిని తిరిగి పొందే వరకు శ్రద్ధగా వెతుకుతుంది. తప్పిపోయిన ఆత్మలను తిరిగి తన వైపుకు నడిపించడానికి దేవుడు ఉపయోగించే విభిన్న పద్ధతులు మరియు వ్యూహాలను ఇది వివరిస్తుంది, అలాగే వారు తిరిగి వచ్చినప్పుడు రక్షకుడు అనుభవించే ప్రగాఢమైన ఆనందాన్ని ఇది వివరిస్తుంది.
ఈ ఉపమానాలను బట్టి, మన పశ్చాత్తాపం మనల్ని మోక్షం వైపు నడిపించేలా చూసుకోవడం చాలా అవసరం.

తప్పిపోయిన కుమారుడు, అతని దుష్టత్వం మరియు బాధ. (11-16) 
తప్పిపోయిన కుమారుని ఉపమానం పశ్చాత్తాపం యొక్క సారాంశాన్ని ప్రకాశవంతం చేస్తుంది మరియు తన వద్దకు తిరిగి వచ్చేవారిని ఆలింగనం చేసుకోవడానికి మరియు దీవెనలు ఇవ్వడానికి ప్రభువు సంసిద్ధతను నొక్కి చెబుతుంది. ఇది సువార్తలో కనిపించే కృప యొక్క సమృద్ధిని స్పష్టంగా చిత్రీకరిస్తుంది మరియు ప్రపంచం మొత్తంలో, పశ్చాత్తాపం చెంది దేవునితో రాజీపడాలని కోరుకునే వినయపూర్వకమైన పాపులకు ఇది అపరిమితమైన మార్గదర్శకత్వం మరియు ప్రోత్సాహాన్ని అందించింది.
ఇది ఒక ప్రమాదకరమైన మార్గం, నిజానికి, వ్యక్తులు దేవుని బహుమతులను కేవలం అర్హతలుగా పరిగణించినప్పుడు. పాపుల పతనానికి మూలం వారి ఆత్మసంతృప్తి, వారి జీవితకాలంలో ప్రాపంచిక సుఖాలను పొందడంలో సంతృప్తి చెందుతుంది. మా మొదటి తల్లిదండ్రుల యొక్క విపత్కర తప్పిదం వారి స్వాతంత్ర్య ఆకాంక్ష, మరియు ఇదే ధోరణి తరచుగా వారి అతిక్రమణలలో పాపుల పట్టుదలకు ఆధారం. మనమందరం తప్పిపోయిన కొడుకు కథలో మన స్వంత పాత్రల యొక్క కొన్ని అంశాలను గుర్తించగలము.
పాపం యొక్క స్థితి దేవుని నుండి నిష్క్రమణ మరియు విడిపోవడాన్ని సూచిస్తుంది. ఇది పాపం ద్వారా వినియోగించబడే జీవితాన్ని సూచిస్తుంది, ఇక్కడ వ్యక్తులు తమ ఆలోచనలను, ఆత్మ యొక్క సామర్థ్యాన్ని, సమయం మరియు అవకాశాలను వృధా చేస్తారు. ఈ స్థితి తీవ్రమైన లేమిని సూచిస్తుంది, ఎందుకంటే పాపులు వారి ఆత్మలకు అవసరమైన వాటిని కలిగి ఉండరు, అలాగే వారి భవిష్యత్తు కోసం జీవనోపాధి మరియు సదుపాయం ఉన్నాయి.
పాపభరితమైన స్థితి బానిసత్వానికి మరియు అధోకరణానికి కూడా దారి తీస్తుంది, ఎందుకంటే ఇది శరీర కోరికలను సంతృప్తి పరచడం మరియు స్వైన్ వైపు మొగ్గు చూపడం వంటి నీచమైన కోరికలకు లొంగిపోవడాన్ని కలిగి ఉంటుంది. ఇది శాశ్వతమైన అసంతృప్తితో గుర్తించబడిన స్థితి, ఇక్కడ ప్రపంచంలోని సంపద మరియు ఇంద్రియ ఆనందాలు కూడా శరీరాన్ని సంతృప్తిపరచడంలో విఫలమవుతాయి, విలువైన ఆత్మను మాత్రమే కాకుండా.
పాపాత్మకమైన స్థితిలో, జీవుల నుండి ఉపశమనం పొందడం వ్యర్థం. ప్రపంచానికి మరియు మాంసానికి కేకలు వేయడం ఫలించదని రుజువు చేస్తుంది, ఎందుకంటే అవి ఆత్మను విషపూరితం చేయగలవు కానీ దానిని పోషించే మరియు నిలబెట్టే సామర్థ్యం లేదు. అలాంటి స్థితి ఆధ్యాత్మిక మరణాన్ని సూచిస్తుంది, పాపి ఆధ్యాత్మిక జీవితం లేని పరిస్థితి. అంతిమంగా, అది కోల్పోయే స్థితికి దారి తీస్తుంది, అక్కడ దేవుని నుండి వేరు చేయబడిన ఆత్మలు, అతని జోక్యం లేకుండా, శాశ్వతమైన శాపాన్ని ఎదుర్కొంటాయి.
తప్పిపోయిన కుమారుని దయనీయమైన పరిస్థితి పాపం ద్వారా తెచ్చిన మానవత్వం యొక్క భయంకరమైన నాశనాన్ని మాత్రమే మసకగా ప్రతిబింబిస్తుంది. దురదృష్టవశాత్తు, కొంతమంది మాత్రమే తమ స్వంత స్థితిని మరియు స్వభావాన్ని నిజంగా గుర్తిస్తారు.

అతని పశ్చాత్తాపం మరియు క్షమాపణ. (17-24) 
తప్పిపోయిన వ్యక్తిని అతని దౌర్భాగ్య స్థితిలో చూసిన తర్వాత, మనం ఇప్పుడు మన దృష్టిని అతని కోలుకునే మార్గం వైపు మళ్లించాలి. ఇది అన్ని స్వీయ-సాక్షాత్కారం యొక్క లోతైన క్షణంతో ప్రారంభమవుతుంది. ఇది పాపుల పరివర్తనలో కీలకమైన క్షణాన్ని సూచిస్తుంది. ప్రభువు వారి కన్నులు తెరచి వారి పాపములను శిక్షించును. పర్యవసానంగా, వారు తమను మరియు వారి చుట్టూ ఉన్న ప్రతిదాన్ని కొత్త కాంతిలో చూస్తారు. దేవుని యొక్క అత్యల్ప సేవకుడు కూడా తమ కంటే గొప్ప ఆనందాన్ని అనుభవిస్తున్నాడని ఒప్పించిన పాపాత్ముడు గుర్తించాడు. దేవునికి తండ్రిగా మారడం, ఆయనను తమ తండ్రిగా గుర్తించడం, వారి పశ్చాత్తాపం మరియు తిరిగి వచ్చే ప్రయాణంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
తప్పిపోయిన కుమారుడు లేచి తన ఇంటికి చేరుకునే వరకు పట్టుదలతో ఉన్నట్లే, పశ్చాత్తాపపడిన పాపాత్ముడు సాతాను బానిసత్వం నుండి మరియు వారి పాపభరితమైన కోరికల నుండి విముక్తి పొందాడు, వారి భయాలు మరియు నిరుత్సాహాలు ఉన్నప్పటికీ ప్రార్థన ద్వారా దేవుని వద్దకు తిరిగి వస్తాడు. ప్రభువు తన క్షమించే ప్రేమ యొక్క ఊహించని సంకేతాలతో వారిని స్వాగతించాడు. ఇంకా, వినయపూర్వకమైన పాపిని స్వీకరించడం తప్పిపోయిన వ్యక్తికి అద్దం పడుతుంది. వారు విమోచకుని యొక్క నీతితో అలంకరించబడి, దత్తత యొక్క ఆత్మతో నిండి ఉన్నారు మరియు పవిత్రత యొక్క మార్గాన్ని నడపడానికి అంతర్గత శాంతి మరియు సువార్త యొక్క దయతో అమర్చబడ్డారు. వారు దైవిక సౌఖ్యంతో విందు చేస్తారు, మరియు వారి లోపల, దయ మరియు పవిత్రత యొక్క విత్తనాలు నాటబడతాయి, వారు కోరికలను మాత్రమే కాకుండా దేవుని చిత్తానికి అనుగుణంగా పనిచేయడానికి కూడా వీలు కల్పిస్తారు.

అన్నయ్య మనస్తాపం చెందాడు. (25-32)
ఈ ఉపమానం యొక్క చివరి భాగం పరిసయ్యుల స్వభావాన్ని వెల్లడిస్తుంది, అయితే ఇది వారికి మాత్రమే పరిమితం కాదు. ఇది దేవుని దయను వివరిస్తుంది మరియు అతని దయగల దయ తరచుగా అహంకారంతో ఎలా ఎదుర్కొంటుందో హైలైట్ చేస్తుంది. ఈ వైఖరి పరిసయ్యులకు మాత్రమే కాదు; ఇది చాలా మంది యూదులు మార్చబడిన అన్యుల పట్ల ప్రదర్శించబడింది మరియు చరిత్ర అంతటా, అనేక మంది వ్యక్తులు అదే కారణాల వల్ల సువార్తను మరియు దాని దూతలను తిరస్కరించారు.
రక్షకుడు ఎవరి కోసం తన విలువైన రక్తాన్ని చిందించాడో, తండ్రిచే ఎన్నుకోబడిన మరియు పరిశుద్ధాత్మ ద్వారా నివసించే వారిని తృణీకరించడానికి మరియు తిరస్కరించడానికి ఒక వ్యక్తిని ఎలాంటి స్వభావం నడిపిస్తుంది? అలాంటి భావాలు గర్వం, స్వీయ ప్రాధాన్యత మరియు ఒకరి స్వంత హృదయాన్ని అర్థం చేసుకోకపోవడం వల్ల ఉత్పన్నమవుతాయి. పశ్చాత్తాపపడిన తప్పిపోయిన పాపులను స్వీకరించినప్పుడు వారు చేసే విధంగానే, క్రీస్తులోని మన దేవుని దయ మరియు దయ అతని సహనం మరియు ప్రకోపపు పరిశుద్ధులతో సున్నితంగా వ్యవహరించడంలో ప్రకాశవంతంగా ప్రకాశిస్తుంది.
వారి తండ్రి ఇంటికి దగ్గరగా ఉండే దేవుని పిల్లలందరికీ ఇది వర్ణించలేని ఆనందాన్ని కలిగిస్తుంది, వారు ఎల్లప్పుడూ ఆయన సన్నిధిలో ఉంటారు. క్రీస్తు ఆహ్వానాన్ని దయతో అంగీకరించే వారు నిజంగా ఆశీర్వదించబడతారు.



Shortcut Links
లూకా - Luke : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |