40. మార్త విస్తారమైన పని పెట్టుకొనుటచేత తొందరపడి, ఆయనయొద్దకు వచ్చిప్రభువా, నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరి నన్ను విడిచి పెట్టినందున, నీకు చింతలేదా? నాకు సహాయము చేయుమని ఆమెతో చెప్పుమనెను.
మార్కు 4:38. యేసుప్రభువుకు లోకమంతటి గురించి శ్రద్ధ వహించే మనసు, ప్రతి ఒక్కరికీ గొప్ప మేలు జరగాలని కోరే హృదయం ఉన్నాయని తెలియక ఈమె యేసుప్రభువును మందలిస్తున్నది. వంటపని, తాను పడుతున్న కష్టం గురించే ఆమె ఆలోచిస్తున్నది. “నన్ను చూడు, నేనింత కష్టపడుతున్నాను, నువ్వేమో ఎవరూ నాకు సహాయం చేయకుండా అడ్డుపడుతున్నావు” అని ఆమె మాట భావం.