Luke - లూకా సువార్త 1 | View All

1. ఘనతవహించిన థెయొఫిలా,

1. మనలో జరిగిన సంఘటల్ని మొదటి నుండి కండ్లారా చూసి, దైవ సందేశాన్ని బోధించిన వాళ్ళు మనకు వాటిని అందించారు.

2. ఆరంభమునుండి కన్ను లార చూచి వాక్యసేవకులైనవారు మనకు అప్పగించిన ప్రకారము మనమధ్యను నెరవేరిన కార్యములనుగూర్చి వివరముగ వ్రాయుటకు అనేకులు పూనుకొన్నారు

2.

3. గనుక నీకు ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలిసికొనుటకు వాటినన్నిటిని మొదటనుండి తరచి పరిష్కారముగా తెలిసికొనియున్న నేనును నీ పేరట

3.

4. వాటినిగూర్చి వరుసగా రచించుట యుక్తమని యెంచితిని.

4. మీరు నేర్చు కొన్నవి నిజమని మీరు తెలుసుకోవాలనే ఉద్దేశంతో నేను ఈ గ్రంథం మీకోసం వ్రాస్తున్నాను.

5. యూదయదేశపు రాజైన హేరోదు దినములలో అబీయా తరగతిలోనున్న జెకర్యా అను ఒక యాజకుడుండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతె; ఆమె పేరు ఎలీసబెతు.
1 దినవృత్తాంతములు 24:10

5. హేరోదు రాజు యూదయను పాలించే కాలంలో జెకర్యా అనే ఒక యాజకుడు ఉండేవాడు. ఇతడు అబీయా అనబడే యాజక శాఖకు చెందినవాడు. ఇతని భార్య అహారోను శాఖకు చెందినది. ఆమె పేరు ఎలీసబెతు.

6. వీరిద్దరు ప్రభువుయొక్క సకల మైన ఆజ్ఞలచొప్పునను న్యాయవిధుల చొప్పునను నిరప రాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై యుండిరి.

6. ఈ దంపతులు యధార్థంగా, దేవునికి ప్రీతికరంగా నుడుచుకుంటూ ప్రభువు ఆజ్ఞల్ని పాటిస్తూ ఏ అపకీర్తి లేకుండా నిష్టాపరులై జీవించే వాళ్ళు,

7. ఎలీసబెతు గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి; మరియు వారిద్దరు బహు కాలము గడచిన (వృద్ధులైరి. )

7. ఎలీసబెతు గొడ్రాలు. పైగా వాళ్ళిద్దరూ వయస్సు మళ్ళిన వాళ్ళు. వాళ్ళకు సంతానం కలుగలేదు.”

8. జెకర్యా తన తరగతి క్రమముచొప్పున దేవునియెదుట యాజక ధర్మము జరిగించుచుండగా

8. తన శాఖకు చెందిన వాళ్ళు చేయవలసిన వంతు రావటంవల్ల జెకర్యా యాజక పనులు చేస్తూ ఉన్నాడు.

9. యాజక మర్యాద చొప్పున ప్రభువు ఆలయములోనికి వెళ్లి ధూపమువేయుటకు అతనికి వంతు వచ్చెను.
నిర్గమకాండము 30:7

9. దేవాలయంలో దేవునికి ధూపం వేయటానికి వాడుక ప్రకారం చీట్లు వేసి జెకర్యాను ఎన్నుకున్నారు.

10. ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా

10. అతడు ధూపం వేస్తుండగా బయట సమావేశమైన భక్తులు ప్రార్థిస్తున్నారు.

11. ప్రభువు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా

11. ధూపవేదికకు కుడివైపున జెకర్యాకు ఒక దేవదూత ప్రత్యక్షం అయ్యాడు.

12. జెకర్యా అతని చూచి, తొందరపడి భయపడిన వాడాయెను.

12. జెకర్యా అతణ్ణి చూడగానే ఉలిక్కి పడ్డాడు. అతనికి భయం వేసింది.

13. అప్పుడా దూత అతనితోజెకర్యా భయ పడకుము; నీ ప్రార్థన వినబడినది, నీ భార్యయైన ఎలీసబెతు నీకు కుమారుని కనును, అతనికి యోహాను అను పేరు పెట్టుదువు.

13. దేవదూత అతనితో, “జెకర్యా భయపడకు. దేవుడు నీ ప్రార్థనలు విన్నాడు. నీ భార్య ఎలీసబెతు ఒక మగశిశువును కంటుంది. ఆ పిల్లవానికి యోహాను అని నామకరణం చెయ్యి.

14. అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై, ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక,

14. ఇతని పుట్టుక వల్ల నీవు చాలా ఆనందిస్తావు. నీవేకాక ప్రజలందరూ ఆనందిస్తారు.

15. తన తల్లిగర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై,
సంఖ్యాకాండము 6:3, న్యాయాధిపతులు 13:4

15. అతడు ఆధ్యాత్మికతతో గొప్పవాడౌతాడు. దేవుడతని గొప్పతనం చూసి ఆనందిస్తాడు. అతడు ద్రాక్షారసం కాని, లేక యితర రకములైన మద్యపానాల్ని కాని ముట్టడు. పుట్టినప్పటి నుండే అతనిలో పవిత్రాత్మ ఉంటాడు.

16. ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును.

16. ఇశ్రాయేలు ప్రజల ప్రభువైన దేవుని దగ్గరకు యితడు చాలా మంది ప్రజల్ని తీసుకు వస్తాడు.

17. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును, అవిధేయులను నీతి మంతుల జ్ఞానము ననుసరించుటకును త్రిప్పి, ప్రభువు కొరకు ఆయత్తపడియున్న ప్రజలను సిద్ధ పరచుటకై ఏలీయాయొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్లును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును; అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనెను.
మలాకీ 3:1, మలాకీ 4:5

17. తండ్రుల హృదయాలను పిల్లల వైపు మళ్ళించటానికి, దేవుణ్ణి నమ్మని వాళ్ళను నీతిమంతుల జ్ఞానం సంపాదించేటట్లు చెయ్యటానికి, ప్రభువు రాకకు ప్రజల్ని సిద్ధపరచటానికి ఇతడు ఏలియాలో ఉన్న ఆత్మ బలంతో ప్రభువు కన్నా ముందుగా వెళ్తాడు” అని అన్నాడు.

18. జెకర్యాయిది నాకేలాగు తెలియును? నేను ముసలివాడను, నాభార్యయు బహుకాలము గడచినదని ఆ దూతతో చెప్పగా
ఆదికాండము 18:11

18. జెకర్యా దేవదూతతో, “మీరన్న విధంగా జరుగుతుందన్నదానికి నిదర్శన మేమిటి? నేను ముసలి వాణ్ణి. నా భార్యకు కూడా వయస్సు మళ్ళింది” అని అన్నాడు.

19. దూతనేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలును; నీతో మాటలాడుట కును ఈ సువర్తమానము నీకు తెలుపుటకును పంపబడితిని.
దానియేలు 8:16, దానియేలు 9:21

19. దేవదూత ఈ విధంగా సమాధానం చెప్పాడు: “నా పేరు గాబ్రియేలు. నేను దేవుని దూతను. నీతో మాట్లాడినీకి సువార్త చెప్పుమని దేవుడు నన్ను పంపాడు.

20. మరియు నా మాటలు వాటికాలమందు నెరవేరును; నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాటలాడక మౌనివై యుందువని అతనితో చెప్పెను.

20. జాగ్రత్త! నీవు నామాటలు నమ్మటం లేదు కనుక మూగవాడవై పోతావు. తగిన సమయం వచ్చాక నా మాటలు నిజమౌతాయి. అంతదాకా నీకు మాటలు రావు.”

21. ప్రజలు జెకర్యాకొరకు కనిపెట్టుచుండి, ఆలయమునందు అతడు ఆలస్యము చేసినందుకు ఆశ్చర్యపడిరి.

21. బయట ప్రజా సమూహం జెకర్యా దేవాలయంలో యింతదాకా ఎందుకున్నాడో అని ఆశ్చర్యంతో అతని కోసం కాచుకొని ఉన్నారు.

22. అతడు వెలుపలికి వచ్చినప్పుడు వారితో మాటలాడలేక పోయినందున, ఆలయమునందు అతనికి దర్శనము కలిగినదని వారు గ్రహించిరి; అప్పుడతడు వారికి సంజ్ఞలు చేయుచు, మూగవాడై యుండెను.

22. జెకర్యా వెలుపలికి వచ్చాడు. కాని వాళ్ళతో మాట్లాడలేక పోయాడు. ఏమీ మాట్లాడలేక సంజ్ఞలు చెయ్యటం వల్ల దేవాలయంలో అతనికి దివ్య దర్శనం కలిగినదని అక్కడున్న వాళ్ళు గ్రహించారు.

23. అతడు సేవచేయు దినములు సంపూర్ణ మైనప్పుడు తన యింటికి వెళ్లెను.

23. సేవా దినములు ముగిసాక అతడు తన యింటికి వెళ్ళిపోయాడు.

24. ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలీసబెతు గర్భవతియై మనుష్యులలో నాకుండిన అవమానమును తీసి వేయుటకు

24. కొన్ని రోజుల తర్వాత అతని భార్య ఎలీసబెతు గర్భవతి అయింది. ఐదు నెలల దాకా ఆమె గడపదాటలేదు.

25. నన్ను కటాక్షించిన దినములలో ప్రభువు ఈలాగున చేసెననుకొని, అయిదు నెలలు ఇతరుల కంట బడకుండెను.
ఆదికాండము 30:23

25. “ప్రభువు ఈ దశలో నాకీ గర్భం యిచ్చి నన్ను అనుగ్రహించాడు; నలుగురిలో నాకున్న అవమానం తొలగించాడు” అని ఆమె అన్నది.

26. ఆరవ నెలలో గబ్రియేలను దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో

26. ఎలీసబెతు ఆరు నెలల గర్భంతో ఉంది. అప్పుడు దేవుడు గాబ్రియేలు అనే దేవదూతను గలిలయలోని నజరేతు అనే పట్టణంలో ఉన్న ఒక కన్య దగ్గరకు పంపాడు.

27. దావీదు వంశస్థుడైన యోసేపను ఒక పురుషునికి ప్రధానము చేయబడిన కన్యకయొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియ.

27. దావీదు వంశస్థుడైన యోసేపు అనే వ్యక్తితో ఈ కన్యకు పెళ్ళి నిశ్చయమైంది. ఈ కన్య పేరు మరియ.

28. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచిదయాప్రాప్తురాలా నీకు శుభము; ప్రభువు నీకు తోడైయున్నాడని చెప్పెను.

28. ఈ దేవదూత ఆమె దగ్గరకు వెళ్ళి ఆమెతో, “నీకు శుభం కలుగుగాక! ప్రభువు నిన్ను అనుగ్రహించాడు. ఆయన నీతో ఉన్నాడు” అని అన్నాడు.

29. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడిఈ శుభవచన మేమిటో అని ఆలోచించు కొనుచుండగా

29. దేవదూత మాటలు విని మరియ కంగారు పడి ఇతని దీవెనకు అర్థమేమిటా అని ఆశ్చర్యపడింది.

30. దూత మరియా, భయపడకుము; దేవునివలన నీవు కృపపొందితివి.

30. ఇది చూసి దేవదూత ఆమెతో యిలా అన్నాడు: “భయపడకు మరియా! దేవుడు నిన్ను అనుగ్రహించాడు.

31. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు;
ఆదికాండము 16:11, న్యాయాధిపతులు 13:3, యెషయా 7:14

31. నీవు గర్భం దాల్చి మగ శిశువును కంటావు. ఆయనకు యేసు అని పేరు పెట్టు.

32. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును; ప్రభువైన దేవుడు ఆయన తండ్రియైన దావీదు సింహాసనమును ఆయన కిచ్చును.
2 సమూయేలు 7:12-13, 2 సమూయేలు 7:16, కీర్తనల గ్రంథము 132:11, యెషయా 9:7

32. ఆయన చాలా గొప్ప వాడై సర్వోన్నతుడైన దేవుని కుమారుడని పిలువబడతాడు. ప్రభువైన దేవుడు ఆయన పూర్వికుడైన దావీదు సింహాసనాన్ని ఆయనకు యిస్తాడు.

33. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును; ఆయన రాజ్యము అంతములేనిదై యుండునని ఆమెతో చెప్పెను.
మీకా 4:7, 2 సమూయేలు 7:12-13, 2 సమూయేలు 7:16

33. యాకోబు వంశానికి చెందిన వాళ్ళందర్ని ఈయన చిరకాలం పాలిస్తాడు. ఆయన రాజ్యం ఎన్నిటికీ అంతరించదు.”

34. అందుకు మరియ నేను పురుషుని ఎరుగనిదాననే; యిదేలాగు జరుగునని దూతతో అనగా

34. “నా కింకా పెండ్లి కాలేదే! ఇది ఎట్లా సాధ్యమవుతుంది?” అని మరియ దేవదూతను అడిగింది.

35. దూతపరిశుద్ధాత్మ నీమీదికి వచ్చును; సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును.
కీర్తనల గ్రంథము 89:19

35. ఆ దేవదూత ఈ విధంగా సమాధానం చెప్పాడు: “పవిత్రాత్మ నీ మీదికి వచ్చునప్పుడు సర్వోన్నతుడైన దేవుని శక్తి నిన్ను ఆవరిస్తుంది. అందువలన నీకు పుట్టబోయే శిశువు పవిత్రంగా ఉంటాడు. ఆ శిశువు దేవుని కుమారుడని పిలువబడతాడు.

36. మరియు నీ బంధువురాలు ఎలీసబెతుకూడ తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి యున్నది; గొడ్రాలనబడిన ఆమెకు ఇది ఆరవమాసము;

36. నీ బంధువు ఎలీసబెతు తన వృద్ధాప్యంలో తల్లి కాబోతోంది. గొడ్రాలని పిలవబడే ఆమె యిప్పుడు ఆరు నెలల గర్భంతో ఉంది.

37. దేవుడు చెప్పిన యేమాటయైనను నిరర్థకము కానేరదని ఆమెతో చెప్పెను.
ఆదికాండము 18:14

37. దేవునికి సాధ్యం కానిది ఏదీ లేదు.”

38. అందుకు మరియ ఇదిగో ప్రభువు దాసురాలను; నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనెను. అంతట దూత ఆమెయొద్ద నుండి వెళ్లెను.

38. మరియ, “నేను దేవుని సేవకురాలను. మీరన్న విధంగానే జరుగనీ!” అని సమాధానం చెప్పింది. ఆ తర్వాత దేవదూత వెళ్ళిపోయాడు.

39. ఆ దినములయందు మరియ లేచి యూదా ప్రదేశ ము లోని కొండ సీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్లి

39. మరియ వెంటనే యూదా పర్వత ప్రాంతం లోని ఒక గ్రామానికి వెళ్ళటానికి ప్రయాణమైంది.

40. జెకర్యా యింటిలో ప్రవేశించి, ఎలీసబెతుకు వందనము చేసెను.

40. ఆ గ్రామంలోనున్న జెకర్యా యింటికి వెళ్ళి ఎలీసబెతును కలుసుకొని ఆమె క్షేమ సమాచారాలు అడిగింది.

41. ఎలీసబెతు మరియయొక్క వందనవచనము విన గానే, ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. అంతట ఎలీసబెతు పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా ఇట్లనెను
ఆదికాండము 25:22

41. ఎలీసబెతు ఆమె మాటలు విన్న తక్షణమే, ఆమె గర్భంలో ఉన్న శిశువు గంతులు వేసాడు. ఎలీసబెతు పవిత్రాత్మతో నిండిపోయింది.

42. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడినదానవు నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును
ద్వితీయోపదేశకాండము 28:4, న్యాయాధిపతులు 5:24

42. ఆమె బిగ్గరగా, “దేవుడు ఏ స్త్రీని దీవించనంతగా నిన్ను దీవించాడు. అదే విధంగా నీ గర్భంలో నున్న శిశువు కూడా ధన్యుడు.

43. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నా కేలాగు ప్రాప్తించెను?

43. కాని దేవుడు నా మీద యింత దయ ఎందుకు చూపుతున్నాడు. నా ప్రభువు తల్లి నా దగ్గరకు రావటమా?

44. ఇదిగో నీ శుభవచనము నా చెవినిపడగానే నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేసెను.

44. నీ మాటలు నా చెవిలో పడగానే నా గర్భంలో ఉన్న శిశువు ఆనందంతో గంతులు వేశాడు.

45. ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలనెను.

45. ప్రభువు చెప్పినట్లు జరుగుతుందని విశ్వసించావు. ధన్యురాలవు” అని అన్నది.

46. అప్పుడు మరియ యిట్లనెను నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది.
1 సమూయేలు 2:1, కీర్తనల గ్రంథము 113:7-8

46. మరియ ఈ విధంగా అన్నది:

47. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను
1 సమూయేలు 2:1

47. “నా ఆత్మ ప్రభువును కొలిచింది. దేవుడు చేసిన ఈ మంచికి నా మనస్సు ఆనందం పొందింది. ఆయనే నా రక్షకుడు.

48. నా ఆత్మ నా రక్షకుడైన దేవునియందు ఆనందించెను.
1 సమూయేలు 1:11

48. దీనురాల్ని నేను! ఆయన దాసీని నేను, నన్ను కరుణించాడు! ఇక నుండి అందరూ నన్ను ధన్యురాలంటారు!

49. సర్వశక్తిమంతుడు నాకు గొప్పకార్యములు చేసెను గనుక ఇది మొదలుకొని అన్నితరములవారును నన్ను ధన్యురాలని యందురు. ఆయన నామము పరిశుద్ధము.
కీర్తనల గ్రంథము 111:9

49. దేవుడు సర్వశక్తి సంపన్నుడు. ఆయన నాకు ఎంతో మంచి చేశాడు! ఆయన నామం పవిత్రం!

50. ఆయనకు భయపడువారిమీద ఆయన కనికరము తర తరములకుండును.
కీర్తనల గ్రంథము 103:17

50. తనంటే భయపడే వాళ్ళపై తరతరాలు దయ చూపుతాడు.

51. ఆయన తన బాహువుతో పరాక్రమము చూపెను వారి హృదయముల ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను.
2 సమూయేలు 22:28, కీర్తనల గ్రంథము 89:10

51. తన బలమైన హస్తాన్ని జాపి గర్వించే వాళ్ళను వాళ్ళ ఆలోచనల్ని అణిచి వేస్తాడు.

52. సింహాసనములనుండి బలవంతులను పడద్రోసి దీనుల నెక్కించెను
1 సమూయేలు 2:7, యోబు 5:11, యోబు 12:19

52. రాజుల్ని, వాళ్ళ సింహాసనాల నుండి దింపి వేస్తాడు. దీనులకు గొప్ప స్థానాలిస్తాడు.

53. ఆకలిగొనినవారిని మంచి పదార్థములతో సంతృప్తి పరచి ధనవంతులను వట్టిచేతులతో పంపివేసెను.
1 సమూయేలు 2:5, కీర్తనల గ్రంథము 107:9

53. పేదవాళ్ళ అవసరాలన్నీ తీరుస్తాడు. ధనవంతుల్ని వట్టి చేతుల్తో పంపేస్తాడు.

54. అబ్రాహామునకును అతని సంతానమునకును యుగాంతమువరకు తన కనికరము చూపి జ్ఞాపకము చేసికొందునని మనపితరులతో సెలవిచ్చినట్టు
కీర్తనల గ్రంథము 98:3, యెషయా 41:8-9

54. తరతరాల నుండి మన పూర్వీకులతో, అబ్రాహాముతో, అతని సంతతితో చెప్పినట్లు

55. ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలునకు సహాయము చేసెను.
ఆదికాండము 17:7, ఆదికాండము 22:17, మీకా 7:20

55. దేవుని ఇష్టానుసారం జీవించిన ఇశ్రాయేలు ప్రజలకు సహాయం చేశాడు. మరవకుండా వాళ్ళపై దయ చూపాడు.”

56. అంతట మరియ, యించుమించు మూడు నెలలు ఆమెతోకూడ ఉండి, పిమ్మట తన యింటికి తిరిగి వెళ్లెను.

56. మరియ ఎలీసబెతు యింట్లో మూడు నెలలుండి, ఆ తర్వాత యింటికి తిరిగి వెళ్ళిపోయింది.

57. ప్రసవకాలము వచ్చినప్పుడు ఎలీసబెతు కుమారుని కనెను.

57. ఎలీసబేతుకు నెలలు నిండి మగశిశువును ప్రసవించింది.

58. అప్పుడు ప్రభువు ఆమెమీద మహాకనికరముంచెనని ఆమె పొరుగువారును బంధువులును విని ఆమెతో కూడ సంతోషించిరి.

58. బంధువులు మరియు ఇరుగు పొరుగు వాళ్ళు ప్రభువు ఆమెను కనికరించినందుకు ఆనందించారు.

59. ఎనిమిదవ దినమున వారు ఆ శిశువుకు సున్నతి చేయవచ్చి, తండ్రి పేరునుబట్టి జెకర్యా అను పేరు వానికి పెట్టబోవుచుండగా
ఆదికాండము 17:12, లేవీయకాండము 12:3

59. ఎనిమిదవ రోజు వాళ్ళు పిల్లవానికి సున్నతి చేయటానికి వచ్చి అతనికి జెకర్యా అని అతని తండ్రి పేరే పెట్టబోయారు.

60. తల్లి ఆలాగు వద్దు; వానికి యోహానను పేరు పెట్టవలెనని చెప్పెను.

60. కాని తల్లి వారిస్తూ, “ఆ పేరు వద్దు! యోహాను అని పేరు పెట్టండి” అని అన్నది.

61. అందుకు వారు నీ బంధువులలో ఆ పేరు గలవాడెవడును లేడే అని ఆమెతో చెప్పి

61. వాళ్ళు, “మీ బంధువుల్లో ఆ పేరున్న వాళ్ళు ఎవ్వరూ లేరే?” అని అన్నారు.

62. వానికి ఏ పేరు పెట్టగోరు చున్నావని వాని తండ్రికి సంజ్ఞలుచేసి అడిగిరి.

62. ఆ పిల్లవాని తండ్రికి సంజ్ఞలు చేసి అతడే పేరు పెట్టదలచాడో” అని అడిగారు.

63. అతడు వ్రాతపలక తెమ్మని వాని పేరు యోహానని వ్రాసెను; అందుకు వారందరు ఆశ్చర్యపడిరి.

63. అతడు వ్రాయటానికి ఒక పలక నివ్వమని అడిగిదానిపై, “అతనికి యోహాను అని పేరు పెట్టండి” అని వ్రాసాడు. ఇది చూసి అంతా ఆశ్చర్యపోయారు.

64. వెంటనే అతని నోరు తెరవబడి, నాలుక సడలి, అతడు దేవుని స్తుతించుచు మాటలాడసాగెను.

64. వెంటనే అతని నోరు, నాలుక కదిలి బాగైపోయింది. అతడు దేవుణ్ణి స్తుతిస్తూ మాట్లాడటం మొదలు పెట్టాడు.

65. అందునుబట్టి వారి చుట్టుపట్ల కాపురమున్న వారికందరికిని భయము కలిగెను. ఆ సంగతులన్నియు యూదయ కొండసీమలయందంతట ప్రచుర మాయెను.

65. ఇరుగు పొరుగు వాళ్ళలో భక్తి, భయమూ నిండుకుపొయ్యాయి. యూదయ పర్వత ప్రాంతమంతా ఈ వార్త వ్యాపించింది.

66. ప్రభువు హస్తము అతనికి తోడైయుండెను గనుక ఆ సంగతులను గూర్చి వినినవారందరును ఈ బిడ్డ యేలాటివాడగునో అని వాటిని మనస్సులో ఉంచుకొనిరి.

66. ఈ విషయం విన్న ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపడి, “ఈ పసివాడు ఎంతగొప్పవాడౌతాడో కదా!” అని అన్నారు. ఆ బాలునికి ప్రభువు హస్తం తోడుగా ఉంది.

67. మరియు అతని తండ్రి జెకర్యా పరిశుద్ధాత్మ పూర్ణుడై యిట్లు ప్రవచించెను

67. ఆ బాలుని తండ్రి జెకర్యా పవిత్రాత్మతో నింపబడి దేవుని సందేశాన్ని ఈ విధంగా చెప్పాడు:

68. “తన ప్రజలకు స్వేచ్ఛ కలిగించి, రక్షించ వచ్చిన ప్రభువును స్తుతించండి! ఇశ్రాయేలు ప్రజల దేవుణ్ణి స్తుతించండి!

69. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి, వారికి విమోచన కలుగజేసెను
1 సమూయేలు 2:10, కీర్తనల గ్రంథము 18:2, కీర్తనల గ్రంథము 132:17, యిర్మియా 30:9

69. మహాశక్తిగల రక్షకుణ్ణి తన సేవకుడైన దావీదు వంశం నుండి మనకోసం పంపాడు.

70. తన సేవకుడైన దావీదు వంశమునందు మనకొరకు రక్షణశృంగమును, అనగా

70. గతంలో మహాత్ములైన ప్రవక్తల ద్వారా ఈ విషయం చెప్పాడు.

71. మన శత్రువులనుండియు మనలను ద్వేషించు వారందరి చేతినుండియు తప్పించి రక్షణ కలుగజేసెను.
కీర్తనల గ్రంథము 106:10

71. దేవుడు శత్రువుల బారినుండి, మనను ద్వేషించేవారినుండి, మనల్ని రక్షిస్తాడు.

72. దీనినిగూర్చి ఆయన ఆదినుండి తన పరిశుద్ధప్రవక్తల నోట పలికించెను.
ఆదికాండము 22:16-17, లేవీయకాండము 26:42, కీర్తనల గ్రంథము 105:8-9, కీర్తనల గ్రంథము 106:45-46, ఆదికాండము 17:7

72. మన తండ్రులను, తాత ముత్తాతలను కరుణిస్తానన్నాడు. పవిత్రమైన ఒడంబడిక మరిచి పోనన్నాడు!

73. ఆయన మన పితరులను కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధనను, అనగా మన తండ్రియైన
ఆదికాండము 17:7

73. శత్రువుల బారినుండి రక్షిస్తానని మన తండ్రి అబ్రాహాముతో ప్రమాణం చేశాడు.

74. అబ్రాహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసికొనుటకును

74. మనం ఏ భయం లేకుండా తనను సేవించాలి.

75. మనము శత్రువుల చేతినుండి విడిపింపబడి, మన జీవిత కాలమంతయు నిర్భయులమై, ఆయన సన్నిధిని

75. జీవితాంతం పవిత్రంగా, ధర్మంగా, తన కోసం జీవించాలని ఆయన ఉద్దేశ్యం!

76. పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగజేసెను.
యెషయా 40:3, మలాకీ 3:1

76. “ఓ శిశువా! నీవు సర్వోన్నతుని ప్రవక్తవని పిలువబడతావు! ప్రభువు కన్నా ముందు వెళ్ళి ప్రభువు రాకకు మార్గం వేస్తావు!

77. మరియు ఓ శిశువా, నీవు సర్వోన్నతుని ప్రవక్తవన బడుదువు మన దేవుని మహా వాత్సల్యమునుబట్టి వారి పాపము లను క్షమించుటవలన

77. పాప క్షమాపణ ద్వారా రక్షణ కలుగుతుందన్న జ్ఞానాన్ని ఆయన ప్రజలకు బోధిస్తావు!

78. తన ప్రజలకు రక్షణజ్ఞానము ఆయన అనుగ్రహించు నట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు.
యెషయా 9:2, యెషయా 58:8, యెషయా 60:1-2, మలాకీ 4:2

78. మన దేవుడు తన కనికరంవల్ల పరలోకం నుండి ఒక నీతిసూర్యుణ్ణి పంపించి,

79. మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించునట్లు చీకటిలోను మరణచ్ఛాయలోను కూర్చుండువారికి వెలుగిచ్చుటకై ఆ మహా వాత్సల్యమునుబట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనమనుగ్రహించెను.
యెషయా 9:2, యెషయా 58:8, యెషయా 60:1-2, మలాకీ 4:2

79. మరణమనే చీకడి నీడలో నివసించే మనపై ప్రకాశించునట్లు చేసి మనల్ని శాంతి మార్గంలో నడిపిస్తాడు!”

80. శిశువు ఎదిగి, ఆత్మయందు బలము పొంది, ఇశ్రాయేలు నకు ప్రత్యక్షమగు దినమువరకు అరణ్య ములో నుండెను.

80. ఆ బాలుడు పెరిగి పెద్దవాడై ఆత్మలో బలం పొందాడు. ఇశ్రాయేలు ప్రజలకు బోధించే సమయం వచ్చే దాకా యోహాను ఎడారుల్లో జీవించాడు.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Luke - లూకా సువార్త 1 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

ముందుమాట. (1-4) 
క్రైస్తవులు భిన్నాభిప్రాయాలు మరియు అంతర్గత సంకోచాలను కలిగి ఉండే అంశాలపై ప్రసంగించడం లూకా మానేశాడు. బదులుగా, అతను నిస్సందేహంగా నిజమైన మరియు దృఢమైన నమ్మకానికి అర్హమైన విషయాలపై దృష్టి పెడతాడు. క్రీస్తు బోధలు అత్యంత వివేచన మరియు సద్గురువులచే తిరుగులేని హామీ మరియు సంతృప్తితో స్వీకరించబడ్డాయి. ఇంకా, మన విశ్వాసం ఆధారపడిన ముఖ్యమైన సంఘటనలు మొదటి నుండి ప్రత్యక్ష సాక్షులుగా మరియు దైవిక వాక్యానికి అంకితమైన పరిచారకులుగా ఉన్న వ్యక్తులచే సూక్ష్మంగా నమోదు చేయబడ్డాయి. ఈ సంఘటనల గురించి వారి అవగాహన దైవిక ప్రేరణ ద్వారా పరిపూర్ణం చేయబడింది.

జకారియాస్ మరియు ఎలిసబెత్. (5-25) 
బాప్టిస్ట్ జాన్ యొక్క తల్లిదండ్రులు, అందరిలాగే, పాపులు, మరియు వారు సమర్థించబడ్డారు మరియు ఇతరుల మాదిరిగానే రక్షించబడ్డారు. అయినప్పటికీ, వారు ముఖ్యంగా భక్తిపరులు మరియు నిటారుగా ఉన్నారు. పిల్లలు లేనప్పటికీ, ఎలిసబెత్ తన వృద్ధాప్యంలో పిల్లలు పుట్టడం అసంభవం అనిపించింది. జకర్యా దేవాలయంలో ధూపం వేస్తుండగా, బయట ప్రజలు పెద్ద సంఖ్యలో ప్రార్థనలు చేస్తున్నారు. దేవునికి మన ప్రార్థనలన్నీ అంగీకరించబడతాయి మరియు పరలోక దేవాలయంలో క్రీస్తు మధ్యవర్తిత్వం ద్వారా మాత్రమే ప్రభావవంతంగా ఉంటాయి. మనం మన ఆత్మలతో మరియు శ్రద్ధతో హృదయపూర్వకంగా ప్రార్థిస్తే తప్ప మన ప్రార్థనలు వినబడతాయని మనం ఆశించలేము.
మన ప్రార్థనల అంగీకారం మరియు నెరవేర్పు, ఉత్తమమైనవి కూడా, నిరంతరం మధ్యవర్తిత్వం వహించే మరియు జీవించే క్రీస్తు మధ్యవర్తిత్వంపై ఆధారపడి ఉంటాయి. జకారియా ప్రార్థనలకు శాంతియుత స్పందన లభించింది. విశ్వాసం యొక్క ప్రార్థనలు స్వర్గంలో నమోదు చేయబడ్డాయి మరియు ఎప్పటికీ మరచిపోలేవు. యవ్వనంలో చేసిన ప్రార్థనలు వృద్ధాప్యంలో సమాధానం పొందవచ్చు. ప్రార్థనకు ప్రతిస్పందనగా పొందిన ఆశీర్వాదాలు ముఖ్యంగా మధురమైనవి.
తన వృద్ధాప్యంలో, జకారియాకు ఒక కుమారుడు ఉంటాడు, అతను చాలా మంది ఆత్మలను దేవునికి మార్చడంలో మరియు క్రీస్తు సువార్తను స్వీకరించడానికి వారిని సిద్ధం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాడు. ఈ కొడుకు ధైర్యం, ఉత్సాహం, పవిత్రత మరియు ప్రాపంచిక ఆసక్తులు మరియు ఆనందాల నుండి వేరు చేయబడిన హృదయంతో క్రీస్తు ముందు వెళ్తాడు. అవిధేయులు మరియు తిరుగుబాటుదారులు తమ నీతిమంతుల పూర్వీకుల జ్ఞానం వైపు మళ్లుతారు మరియు మరింత ముఖ్యంగా, రాబోయే జస్ట్ వన్ యొక్క జ్ఞానాన్ని గమనించండి.
దేవదూత చెప్పినదంతా జకారియా విన్నాడు, కానీ అతని అవిశ్వాసం బిగ్గరగా మాట్లాడింది. దేవుడు, తన న్యాయం ప్రకారం, అతను దేవుని వాక్యాన్ని అనుమానించినందున అతనిని మూగగా కొట్టాడు. దేవుడు మనపట్ల చూపిన ఓర్పు విశేషమైనది. అతను జకారియాస్‌ని నిశ్శబ్దం చేయడంలో దయతో వ్యవహరించాడు, అవిశ్వాస పదాలను నిరోధించాడు. ఇది జకారియా విశ్వాసాన్ని బలపరచడానికి కూడా ఉపయోగపడింది. దేవుడు మన పాపాలకు మనలను గద్దించినప్పుడు, మరియు ఇది అతని మాటపై ఎక్కువ నమ్మకానికి దారితీసినప్పుడు, మనం ఫిర్యాదు చేయడానికి ఎటువంటి కారణం లేదు.
నిజమైన విశ్వాసులు కూడా అవిశ్వాసంతో పోరాడవచ్చు మరియు దేవుణ్ణి అవమానించవచ్చు. అయినప్పటికీ, వారి నిశ్శబ్దం మరియు గందరగోళం, దేవుని క్రమశిక్షణ ద్వారా తీసుకురాబడి, చివరికి సంతోషంతో మరియు కృతజ్ఞతతో ఆయనను స్తుతించేలా చేస్తుంది. మనపట్ల దేవుని దయ మరియు శ్రద్ధను మనం గమనించాలి. ఆయన కనికరం మరియు అనుగ్రహం మనపై ఉన్నాయి, ఆయన మనతో వ్యవహరించే విధానాన్ని నడిపిస్తున్నారు.

క్రీస్తు జననం ప్రకటించబడింది. (26-38) 
ఇక్కడ, మన ప్రభువు తల్లికి సంబంధించిన ఖాతా ఉంది. మనం ఆమెకు ప్రార్థించనప్పటికీ, క్రీస్తు పుట్టుకలో ఆమె పాత్ర కోసం మనం ఖచ్చితంగా మన స్తోత్రాన్ని దేవునికి సమర్పించాలి. క్రీస్తు జననం ఒక అద్భుతం కావాలి. దేవదూత యొక్క శుభాకాంక్షల యొక్క ముఖ్య ఉద్దేశ్యం, "యూదు తల్లులు చాలా కాలంగా కోరుకునే గౌరవాన్ని సాధించడానికి సర్వోన్నతునిచే ప్రత్యేకంగా ఎంపిక చేయబడిన మరియు ఆదరణ పొందిన మీకు నమస్కారాలు."
ఈ అసాధారణ వందనం మరియు దేవదూత రూపాన్ని అర్థం చేసుకోగలిగే విధంగా మేరీ ఇబ్బంది పెట్టింది. దేవదూత ఆమెకు అభయమిచ్చాడు, ఆమె దేవుని దయను పొందిందని మరియు ఒక కుమారునికి తల్లి అవుతానని, ఆమె ప్రభువైన దేవుని స్వభావాన్ని మరియు పరిపూర్ణతను పూర్తిగా పంచుకుంటూ, అత్యున్నత కుమారుడైన యేసు అని పేరు పెట్టింది. యేసు! ఈ పేరు వినయపూర్వకమైన పాపులకు ఓదార్పు మరియు ఆశను కలిగిస్తుంది, మాట్లాడటానికి మరియు వినడానికి మధురంగా ఉంటుంది. యేసు, రక్షకుడా! కొన్నిసార్లు, మేము అతని సంపదలను మరియు మన స్వంత పేదరికాన్ని అర్థం చేసుకోవడంలో విఫలమవుతాము మరియు అందువల్ల, మనం ఆయనను వెతకము. మన కోల్పోయిన మరియు నశిస్తున్న స్థితి యొక్క లోతులను మనం గుర్తించలేకపోవచ్చు, కాబట్టి "రక్షకుడు" అనే పదం మనకు పెద్దగా ప్రాముఖ్యతను కలిగి ఉండకపోవచ్చు. మనపై ఉన్న అపారమైన అపరాధ భారం గురించి మరియు రాబోయే కోపం గురించి మనకు పూర్తిగా తెలిసి ఉంటే, "రక్షకుడు నావాడా?" అని మనం నిరంతరం ఆలోచిస్తాము. మరియు ఆయనను మన స్వంత వ్యక్తిగా గుర్తించేందుకు, ఆయనకు మన మార్గానికి ఆటంకం కలిగించే దేనినైనా మనం అధిగమిస్తాము.
దేవదూతకు మేరీ యొక్క ప్రతిస్పందన ఆమె విశ్వాసం మరియు వినయపూర్వకమైన అద్భుతం యొక్క అభివ్యక్తి. ఆమె తన విశ్వాసాన్ని ధృవీకరించడానికి సంకేతాన్ని వెతకలేదు. నిస్సందేహంగా, దైవభక్తి యొక్క మర్మము గొప్పది-దేవుడు శరీరములో ప్రత్యక్షమయ్యాడు 1 తిమోతికి 3:16 క్రీస్తు యొక్క మానవ స్వభావాన్ని దైవిక స్వభావంతో దాని ఐక్యతకు తగిన విధంగా ఉనికిలోకి తీసుకురావాలి. మేరీ లాగా, మన పోరాటాలన్నిటిలో మన కోరికలను దేవుని వాక్యంతో సమలేఖనం చేయాలి. ప్రతి సవాలులో, దేవునితో, అసాధ్యం ఏదీ లేదని గుర్తుంచుకోండి. ఆయన వాగ్దానాలను మనం చదువుతూ, వింటున్నప్పుడు, "ఇదిగో, నేను ప్రభువుకు ఇష్టపూర్వకమైన సేవకుడను, నీ మాట ప్రకారం నాకు జరుగునుగాక" అని చెప్పి వాటిని ప్రార్థనలుగా మారుద్దాము.

మేరీ మరియు ఎలిసబెత్ యొక్క ఇంటర్వ్యూ. (39-56) 
వారి ఆత్మలలో దయ యొక్క పని ప్రారంభించిన వారు తమ అనుభవాలను ఒకరితో ఒకరు పంచుకోవడం చాలా ప్రయోజనకరం. మేరీ వచ్చినప్పుడు, ఎలిసబెత్ గొప్ప విమోచకుడికి తల్లి కాబోయే స్త్రీ ఉనికిని గ్రహించింది. అదే సమయంలో, ఆమె పరిశుద్ధాత్మతో నిండిపోయింది మరియు అతని ప్రభావంతో, మేరీ మరియు ఆమె ఆశించిన బిడ్డ అత్యంత ఆశీర్వాదం మరియు దయతో ఉన్నారని, సర్వోన్నతుడైన దేవునికి లోతైన గౌరవం ఉందని ప్రకటించింది.
ఎలిసబెత్ మాటల నుండి ప్రేరణ పొంది, అలాగే పరిశుద్ధాత్మచే మార్గనిర్దేశం చేయబడి, మేరీ ఆనందం, ఆశ్చర్యం మరియు కృతజ్ఞతతో పొంగిపోయింది. వాగ్దానము చేయబడిన మెస్సీయతో తనకున్న సంబంధము ద్వారానే దేవునిలో తన సంతోషము కలుగునని గ్రహించి, రక్షకుని అవసరమున్న పాపిగా ఆమె తనను తాను గుర్తించింది. క్రీస్తుపై తమ ఆధారపడటాన్ని గుర్తించి, నీతి కోసం ఆరాటపడి, ఆయనలో జీవాన్ని కోరుకునే వారు, ఆయన అందించే అత్యుత్తమ బహుమతులతో తమను తాము సమృద్ధిగా ఆశీర్వదిస్తారు. ఆత్మీయ ఆశీర్వాదాల కోసం తహతహలాడే ఆత్మలో నిరాడంబరుల కోరికలను ఆయన తీరుస్తాడు, స్వయం సమృద్ధిగా ఉన్నవారు ఖాళీ చేతులతో వెళ్లిపోతారు.

జాన్ ది బాప్టిస్ట్ జననం. (57-66) 
ఈ వచనాలు జాన్ బాప్టిస్ట్ యొక్క పుట్టుక మరియు అతని కుటుంబ సభ్యులు అనుభవించిన అపారమైన ఆనందాన్ని అందిస్తాయి. అతనికి జోహానాన్ అని పేరు పెట్టాలి, అంటే "దయగలవాడు" అని అర్థం, అతను క్రీస్తు సువార్తను పరిచయం చేస్తాడు, అక్కడ దేవుని కృప చాలా అద్భుతంగా ప్రకాశిస్తుంది. అవిశ్వాసం కారణంగా మాట్లాడే సామర్థ్యాన్ని కోల్పోయిన జకారియస్, అతను నమ్మినప్పుడు తన గొంతును తిరిగి పొందాడు. నమ్మకం మనల్ని మాట్లాడేలా చేస్తుందని ఇది వివరిస్తుంది. దేవుడు మన నోరు తెరిచినప్పుడు, ఆయనను స్తుతించడానికి మనం వాటిని ఉపయోగించాలి. దేవుని స్తుతించడం మానుకోవడం కంటే మౌనంగా ఉండడం మేలు. చిన్నప్పటి నుండి యోహానులో ప్రభువు హస్తం పని చేస్తుందని ప్రస్తావించబడింది. శిశువులను ప్రభావితం చేయడానికి దేవుడు రహస్యమైన మార్గాలను కలిగి ఉన్నాడు మరియు మనం దేవుని చర్యలపై శ్రద్ధ వహించాలి మరియు ఫలితం కోసం ఓపికగా ఎదురుచూడాలి.

జకారియాస్ పాట. (67-80)
మెస్సీయ రాజ్యం మరియు మోక్షానికి సంబంధించి జకారియా ప్రవచనం చెప్పాడు. సువార్త ప్రకాశాన్ని తెస్తుంది; ఇది కొత్త రోజు రాకను తెలియజేస్తుంది. జాన్ ది బాప్టిస్ట్ విషయానికొస్తే, అది తెల్లవారడం ప్రారంభించింది మరియు దాని పూర్తి ప్రకాశం వైపు క్రమంగా పురోగమించింది. సువార్త ఒక ఆవిష్కరణ; ఇది మునుపు చీకటిలో కప్పబడి ఉన్నదానిని వెల్లడిస్తుంది, యేసుక్రీస్తు వ్యక్తిలో కనుగొనబడిన దేవుని మహిమ గురించిన జ్ఞానపు వెలుగును అందిస్తుంది. ఇది పునరుజ్జీవింపజేయడం; మృత్యువు నీడలో నివసించే వారికి, చెరసాలలో శిక్ష విధించబడిన ఖైదీల వలె వెలుగునిస్తుంది. ఇది మార్గదర్శకం; అది మన అడుగులను శాంతి మార్గం వైపు మళ్లిస్తుంది, మనలను అంతిమ శాంతికి నడిపిస్తుంది రోమీయులకు 3:17 జాన్ దృఢమైన విశ్వాసం, దృఢమైన మరియు నీతివంతమైన భావోద్వేగాలు మరియు ప్రపంచం యొక్క భయం మరియు ఆప్యాయత నుండి నిర్లిప్తతను ప్రదర్శించాడు. అతను మెస్సీయకు పూర్వగామిగా ఉద్భవించే వరకు అతను నిశ్శబ్దంగా జీవించినప్పటికీ, ఇది అతనిని ఉద్దేశపూర్వక జీవితానికి సిద్ధం చేసింది. మనం ప్రజలందరితో సామరస్యంగా జీవించడానికి ప్రయత్నించాలి, అదే సమయంలో దేవునితో మరియు మన స్వంత మనస్సాక్షితో శాంతిని కోరుకోవాలి. మన కొరకు దేవుని ప్రణాళిక లోకంలో అస్పష్టంగా ఉండిపోయినప్పటికీ, మనం యేసుక్రీస్తు కృపలో ఎదుగుదలను శ్రద్ధగా కొనసాగించాలి.



Shortcut Links
లూకా - Luke : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |