Matthew - మత్తయి సువార్త 14 | View All

1. ఆ సమయమందు చతుర్థాధిపతియైన హేరోదు యేసునుగూర్చిన సమాచారము విని

1. aa samayamandu chathurthaadhipathiyaina hērōdu yēsunugoorchina samaachaaramu vini

2. ఇతడు బాప్తిస్మమిచ్చు యోహాను; అతడు మృతులలోనుండి లేచి యున్నాడు; అందువలననే అద్భుతములు అతనియందు క్రియారూపకములగుచున్నవని తన సేవకులతో చెప్పెను.

2. ithaḍu baapthismamichu yōhaanu; athaḍu mruthulalōnuṇḍi lēchi yunnaaḍu; anduvalananē adbhuthamulu athaniyandu kriyaaroopakamulaguchunnavani thana sēvakulathoo cheppenu.

3. ఏలయనగానీవు నీ సోదరుడైన ఫిలిప్పు భార్యయగు హేరోదియను ఉంచుకొనుట న్యాయము కాదని యోహాను చెప్పగా,
లేవీయకాండము 18:16, లేవీయకాండము 20:21

3. yēlayanagaaneevu nee sōdaruḍaina philippu bhaaryayagu hērōdiyanu un̄chukonuṭa nyaayamu kaadani yōhaanu cheppagaa,

4. హేరోదు ఆమె నిమిత్తము యోహానును పట్టుకొని బంధించి చెరసాలలో వేయించి యుండెను.
లేవీయకాండము 18:16, లేవీయకాండము 20:21

4. hērōdu aame nimitthamu yōhaanunu paṭṭukoni bandhin̄chi cherasaalalō vēyin̄chi yuṇḍenu.

5. అతడు ఇతని చంపగోరెను గాని జనసమూహము ఇతనిని ప్రవక్తయని యెంచినందున వారికి భయపడెను.

5. athaḍu ithani champagōrenu gaani janasamoohamu ithanini pravakthayani yen̄chinanduna vaariki bhayapaḍenu.

6. అయితే హేరోదు జన్మదినోత్సవము వచ్చినప్పుడు హేరోదియ కుమార్తె వారిమధ్య నాట్యమాడి హేరోదును సంతోష పరచెను

6. ayithē hērōdu janmadhinōtsavamu vachinappuḍu hērōdiya kumaarthe vaarimadhya naaṭyamaaḍi hērōdunu santhoosha parachenu

7. గనుకఆమె ఏమి అడిగినను ఇచ్చెదనని అతడు ప్రమాణపూర్వకముగా వాగ్దానము చేసెను.

7. ganuka'aame ēmi aḍiginanu icchedhanani athaḍu pramaaṇapoorvakamugaa vaagdaanamu chesenu.

8. అప్పుడామె తనతల్లిచేత ప్రేరేపింపబడినదై బాప్తిస్మమిచ్చు యోహాను తలను ఇక్కడ పళ్లెములో పెట్టి నా కిప్పించుమని యడిగెను.

8. appuḍaame thanathallichetha prērēpimpabaḍinadai baapthismamichu yōhaanu thalanu ikkaḍa paḷlemulō peṭṭi naa kippin̄chumani yaḍigenu.

9. రాజు దుఃఖపడినను తాను చేసిన ప్రమాణము నిమిత్తమును, తనతో కూడ భోజనమునకు కూర్చున్నవారి నిమిత్తమును ఇయ్యనాజ్ఞాపించి

9. raaju duḥkhapaḍinanu thaanu chesina pramaaṇamu nimitthamunu, thanathoo kooḍa bhōjanamunaku koorchunnavaari nimitthamunu iyyanaagnaapin̄chi

10. బంట్రౌతును పంపి చెరసాలలో యోహాను తల గొట్టించెను.

10. baṇṭrauthunu pampi cherasaalalō yōhaanu thala goṭṭin̄chenu.

11. వాడతని తల పళ్లెములోపెట్టి తెచ్చి ఆ చిన్నదానికిచ్చెను; ఆమె తన తల్లియొద్దకు దాని తీసికొని వచ్చెను.

11. vaaḍathani thala paḷlemulōpeṭṭi techi aa chinnadaanikicchenu; aame thana thalliyoddhaku daani theesikoni vacchenu.

12. అంతట యోహాను శిష్యులు వచ్చి శవమును ఎత్తికొనిపోయి పాతి పెట్టి యేసునొద్దకువచ్చి తెలియజేసిరి.

12. anthaṭa yōhaanu shishyulu vachi shavamunu etthikonipōyi paathi peṭṭi yēsunoddhakuvachi teliyajēsiri.

13. యేసు ఆ సంగతి విని దోనె యెక్కి, అక్కడనుండి అరణ్యప్రదేశమునకు ఏకాంతముగా వెళ్లెను. జనసమూహములు ఆ సంగతి విని, పట్టణములనుండి కాలినడకను ఆయనవెంట వెళ్లిరి.

13. yēsu aa saṅgathi vini dōne yekki, akkaḍanuṇḍi araṇyapradheshamunaku ēkaanthamugaa veḷlenu. Janasamoohamulu aa saṅgathi vini, paṭṭaṇamulanuṇḍi kaalinaḍakanu aayanaveṇṭa veḷliri.

14. ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి, వారిమీద కనికరపడి, వారిలో రోగులైన వారిని స్వస్థపరచెను.

14. aayana vachi aa goppa samoohamunu chuchi, vaarimeeda kanikarapaḍi, vaarilō rōgulaina vaarini svasthaparachenu.

15. సాయంకాలమైనప్పుడు శిష్యు లాయనయొద్దకు వచ్చిఇది అరణ్యప్రదేశము, ఇప్పటికే ప్రొద్దుపోయెను, ఈ జనులు గ్రామములలోనికి వెళ్లి భోజనపదార్థములు కొనుక్కొనుటకై వారిని పంపివేయమని చెప్పిరి.

15. saayaṅkaalamainappuḍu shishyu laayanayoddhaku vachi'idi araṇyapradheshamu, ippaṭikē proddupōyenu, ee janulu graamamulalōniki veḷli bhōjanapadaarthamulu konukkonuṭakai vaarini pampivēyamani cheppiri.

16. యేసువారు వెళ్లనక్కరలేదు, మీరే వారికి భోజనము పెట్టుడని వారితో చెప్పగా

16. yēsuvaaru veḷlanakkaralēdu, meerē vaariki bhōjanamu peṭṭuḍani vaarithoo cheppagaa

17. వారు ఇక్కడ మనయొద్ద అయిదు రొట్టెలును రెండు చేపలును తప్ప మరేమియు లేదని ఆయనతో చెప్పిరి.

17. vaaru ikkaḍa manayoddha ayidu roṭṭelunu reṇḍu chepalunu thappa marēmiyu lēdani aayanathoo cheppiri.

18. అందు కాయన వాటిని నాయొద్దకు తెండని చెప్పి

18. andu kaayana vaaṭini naayoddhaku teṇḍani cheppi

19. పచ్చికమీద కూర్చుండుడని జనులకాజ్ఞాపించి, ఆ అయిదు రొట్టెలను రెండు చేపలను పట్టుకొని ఆకాశమువైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకిచ్చెను, శిష్యులు జనులకు వడ్డించిరి.

19. pachikameeda koorchuṇḍuḍani janulakaagnaapin̄chi, aa ayidu roṭṭelanu reṇḍu chepalanu paṭṭukoni aakaashamuvaipu kannuletthi aasheervadhin̄chi aa roṭṭelu virichi shishyulakicchenu, shishyulu janulaku vaḍḍin̄chiri.

20. వారందరు తిని తృప్తిపొందిన తరువాత మిగిలిన ముక్కలు పండ్రెండు గంపల నిండ ఎత్తిరి
2 రాజులు 4:43-44

20. vaarandaru thini trupthipondina tharuvaatha migilina mukkalu paṇḍreṇḍu gampala niṇḍa etthiri

21. స్త్రీలును పిల్లలును గాక తినినవారు ఇంచుమించు అయిదు వేలమంది పురుషులు.

21. streelunu pillalunu gaaka thininavaaru in̄chumin̄chu ayidu vēlamandi purushulu.

22. వెంటనే ఆ జనసమూహములను తాను పంపివేయునంతలో తన శిష్యులు దోనె యెక్కి తనకంటె ముందుగా అద్దరికి వెళ్లవలెనని ఆయన వారిని బలవంతము చేసెను.

22. veṇṭanē aa janasamoohamulanu thaanu pampivēyunanthalō thana shishyulu dōne yekki thanakaṇṭe mundhugaa addariki veḷlavalenani aayana vaarini balavanthamu chesenu.

23. ఆయన ఆ జనసమూహములను పంపివేసి, ప్రార్థనచేయుటకు ఏకాంతముగా కొండయెక్కి పోయి, సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను.

23. aayana aa janasamoohamulanu pampivēsi, praarthanacheyuṭaku ēkaanthamugaa koṇḍayekki pōyi, saayaṅkaalamainappuḍu oṇṭarigaa uṇḍenu.

24. అప్పటికాదోనె దరికి దూరముగనుండగా గాలి యెదురైనందున అలలవలన కొట్ట బడుచుండెను.

24. appaṭikaadōne dariki dooramuganuṇḍagaa gaali yedurainanduna alalavalana koṭṭa baḍuchuṇḍenu.

25. రాత్రి నాలుగవ జామున ఆయన సముద్రముమీద నడుచుచు వారియొద్దకు వచ్చెను

25. raatri naalugava jaamuna aayana samudramumeeda naḍuchuchu vaariyoddhaku vacchenu

26. ఆయన సముద్రముమీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి, భూతమని చెప్పుకొని భయముచేత కేకలువేసిరి.

26. aayana samudramumeeda naḍuchuṭa shishyulu chuchi tondharapaḍi, bhoothamani cheppukoni bhayamuchetha kēkaluvēsiri.

27. వెంటనే యేసుధైర్యము తెచ్చుకొనుడి; నేనే, భయపడకుడనివారితో చెప్పగా

27. veṇṭanē yēsudhairyamu techukonuḍi; nēnē, bhayapaḍakuḍanivaarithoo cheppagaa

28. పేతురు ప్రభువా, నీవే అయితే నీళ్లమీద నడిచి నీయొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను.

28. pēthuru prabhuvaa, neevē ayithē neeḷlameeda naḍichi neeyoddhaku vachuṭaku naaku selavimmani aayanathoo anenu.

29. ఆయన రమ్మనగానే పేతురు దోనెదిగి యేసునొద్దకు వెళ్లుటకు నీళ్లమీద నడచెను గాని

29. aayana rammanagaanē pēthuru dōnedigi yēsunoddhaku veḷluṭaku neeḷlameeda naḍachenu gaani

30. గాలిని చూచి భయపడి మునిగిపోసాగి-ప్రభువా, నన్ను రక్షించుమని కేకలువేసెను.

30. gaalini chuchi bhayapaḍi munigipōsaagi-prabhuvaa, nannu rakshin̄chumani kēkaluvēsenu.

31. వెంటనే యేసు చెయ్యిచాపి అతని పట్టుకొని అల్పవిశ్వాసీ, యెందుకు సందేహపడితివని అతనితో చెప్పెను.

31. veṇṭanē yēsu cheyyichaapi athani paṭṭukoni alpavishvaasee, yenduku sandhehapaḍithivani athanithoo cheppenu.

32. వారు దోనె యెక్కినప్పుడు గాలి అణిగెను.

32. vaaru dōne yekkinappuḍu gaali aṇigenu.

33. అంతట దోనెలో నున్నవారు వచ్చినీవు నిజముగా దేవుని కుమారుడవని చెప్పి ఆయనకు మ్రొక్కిరి.
యెహోషువ 5:14-15

33. anthaṭa dōnelō nunnavaaru vachineevu nijamugaa dhevuni kumaaruḍavani cheppi aayanaku mrokkiri.

34. వారద్దరికి వెళ్లి గెన్నేసరెతు దేశమునకు వచ్చిరి.

34. vaaraddariki veḷli gennēsarethu dheshamunaku vachiri.

35. అక్కడి జనులు ఆయనను గుర్తుపట్టి, చుట్టుపట్లనున్న ఆ ప్రదేశమంతటికి వర్తమానము పంపి, రోగులనందరిని ఆయన యొద్దకు తెప్పించి

35. akkaḍi janulu aayananu gurthupaṭṭi, chuṭṭupaṭlanunna aa pradheshamanthaṭiki varthamaanamu pampi, rōgulanandarini aayana yoddhaku teppin̄chi

36. వీరిని నీ వస్త్రపుచెంగు మాత్రము ముట్టనిమ్మని ఆయనను వేడుకొనిరి; ముట్టినవారందరును స్వస్థతనొందిరి.

36. veerini nee vastrapucheṅgu maatramu muṭṭanimmani aayananu vēḍukoniri; muṭṭinavaarandarunu svasthathanondiri.


Shortcut Links
మత్తయి - Matthew : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |

Support & Donate Us | Google Play Store | సజీవ వాహిని - Sajeeva Vahini 2009-2022. info@sajeevavahini.com
Sajeeva Vahini, Hyderabad & Chennai, India. SajeevaVahini.org Email: , . Whatsapp: 8898 318 318 or call us: +918898318318
Content on this website is prepared manually by Sajeeva Vahini, India. Our Content is free and open to use for any kind of distrubution. We request to carry a physical bible to churches rather than using bible on mobile or tablets. Please email any information for any suspected content/audio subject to piracy/copyright act on this website can be considered/removed. Which can help us to improve better. Note: we dont have any data/content related to Life Way Study Bible as a part of Sajeeva Vahini Notes or Verse Explanations.