Numbers - సంఖ్యాకాండము 27 | View All

1. అప్పుడు యోసేపు కుమారుడైన మనష్షే వంశస్థులలో సెలోపెహాదు కుమార్తెలు వచ్చిరి. సెలోపెహాదు హెసెరు కుమారుడును గిలాదు మనుమడును మాకీరు మునిమనుమడునై యుండెను. అతని కుమార్తెల పేళ్లు మహలా, నోయా, హొగ్లా, మిల్కా, తిర్సా అనునవి.

1. Then the daughters of Tz'lof'chad the son of Hefer, the son of Gil'ad, the son of Machir, the son of M'nasheh, of the families of M'nasheh, the son of Yosef, approached. These were the names of his daughters: Machlah, No'ah, Hoglah, Milkah and Tirtzah.

2. వారు ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునొద్ద మోషే యెదుటను యాజకుడైన ఎలియాజరు ఎదుటను ప్రధానుల యెదుటను సర్వసమాజము యెదుటను నిలిచి చెప్పినదేమనగామా తండ్రి అరణ్యములో మరణమాయెను.

2. They stood in front of Moshe, El'azar the [cohen], the leaders and the whole community at the entrance to the tent of meeting and said,

3. అతడు కోరహు సమూహములో, అనగా యెహోవాకు విరోధముగా కూడినవారి సమూహములో ఉండలేదు గాని తన పాపమును బట్టి మృతిబొందెను.

3. Our father died in the desert. He wasn't part of the group who assembled themselves to rebel against ADONAI in Korach's group, but he died in his own sin, and he had no sons.

4. అతనికి కుమారులు కలుగలేదు; అతనికి కుమారులు లేనంత మాత్రముచేత మా తండ్రిపేరు అతని వంశములోనుండి మాసిపోనేల? మా తండ్రి సహోదరులతో పాటు స్వాస్థ్య మును మాకు దయచేయుమనిరి.

4. Why should the name of our father be eliminated from his family just because he didn't have a son? Give us property to possess along with the brothers of our father.'

5. అప్పుడు మోషే వారి కొరకు యెహోవా సన్నిధిని మనవిచేయగా

5. Moshe brought their cause before [ADONAI.]

6. యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను. సెలోపెహాదు కుమార్తెలు చెప్పినది యుక్తము.

6. ADONAI answered Moshe,

7. నిశ్చయముగా వారి తండ్రి సహోదరులతో పాటు భూస్వాస్థ్యమును వారి అధీనము చేసి వారి తండ్రి స్వాస్థ్యమును వారికి చెందచేయవలెను.

7. The daughters of Tz'lof'chad are right in what they say. You must give them property to be inherited along with that of their father's brothers; have what their father would have inherited pass to them.

8. మరియు నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లు చెప్పవలెను ఒకడు కుమారుడు లేక మృతి బొందినయెడల మీరు వాని భూస్వాస్థ్యమును వాని కుమార్తెలకు చెందచేయవలెను.

8. Moreover, say to the people of Isra'el, 'If a man dies and does not have a son, you are to have his inheritance pass to his daughter.

9. వానికి కుమార్తె లేనియెడల వాని అన్నదమ్ములకు వాని స్వాస్థ్యము ఇయ్యవలెను.

9. If he doesn't have a daughter, give his inheritance to his brothers.

10. వానికి అన్నదమ్ములు లేని యెడల వాని భూస్వాస్థ్యమును వాని తండ్రి అన్న దమ్ములకు ఇయ్యవలెను.

10. If he has no brothers, give his inheritance to his father's brothers.

11. వాని తండ్రికి అన్నదమ్ములు లేని యెడల వాని కుటుంబములో వానికి సమీపమైన జ్ఞాతికి వాని స్వాస్థ్యము ఇయ్యవలెను; వాడు దాని స్వాధీనపరచుకొనును. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇది ఇశ్రాయేలీయులకు విధింపబడిన కట్టడ.

11. If his father doesn't have brothers, give his inheritance to the closest relative in his family, and he will possess it. This will be the standard for judgment to be used by the people of Isra'el, as ADONAI ordered Moshe.''

12. మరియయెహోవా మోషేతో ఇట్లనెను నీవు ఈ అబారీము కొండయెక్కి నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చిన దేశమును చూడుము.

12. ADONAI said to Moshe, 'Climb this mountain in the 'Avarim Range, and look out at the land which I have given the people of Isra'el.

13. నీవు దాని చూచిన తరువాత నీ సహోదరుడైన అహరోను చేర్చబడినట్లు నీవును నీ స్వజనులలో చేర్చబడుదువు.

13. After you have seen it, you too will be gathered to your people, just as Aharon your brother was gathered;

14. ఏలయనగా సీను అరణ్యములో సమాజము వాదించినప్పుడు ఆ నీళ్లయొద్ద వారి కన్నుల యెదుట నన్ను పరిశుద్ధపరచక నామీద తిరుగబడితిరి. ఆ నీళ్లు సీను అరణ్యమందలి కాదేషులోనున్న మెరీబా నీళ్లే.
అపో. కార్యములు 7:51

14. because in the Tzin Desert, when the community was disputing with me, you rebelled against my order to uphold my holiness by means of the water, with them looking on.' (This was M'rivat-Kadesh Spring, in the Tzin Desert.)

15. అప్పుడు మోషే యెహోవాతో ఇట్లనెను యెహోవా, సమస్త మానవుల ఆత్మలకు దేవా, యెహోవా సమాజము కాపరిలేని గొఱ్ఱెలవలె ఉండకుండునట్లు ఈ సమాజముమీద ఒకని నియమించుము.

15. Moshe said to ADONAI,

16. అతడు వారి యెదుట వచ్చుచు, పోవుచునుండి,
హెబ్రీయులకు 12:9

16. 'Let ADONAI, God of the spirits of all human beings, appoint a man to be over the community,

17. వారికి నాయకుడుగా ఉండుటకు సమర్థుడై యుండవలెను.
మత్తయి 9:36, మార్కు 6:34

17. to go out and come in ahead of them, to lead them out and bring them in, so that ADONAI's community will not be like sheep without a shepherd.'

18. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెనునూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు. నీవు అతని తీసికొని అతనిమీద నీ చెయ్యియుంచి

18. ADONAI said to Moshe, 'Take Y'hoshua the son of Nun, a spiritual man, and lay your hand on him.

19. యాజకుడగు ఎలియాజరు ఎదుటను సర్వసమాజము ఎదుటను అతని నిలువబెట్టి వారి కన్నుల యెదుట అతనికి ఆజ్ఞ యిమ్ము;

19. Put him in front of El'azar the [cohen] and the whole community, and commission him in their sight.

20. ఇశ్రాయేలీయుల సర్వ సమాజము అతని మాట వినునట్లు అతని మీద నీ ఘనతలో కొంత ఉంచుము.

20. Delegate to him some of your authority, so that the entire community of Isra'el will obey him.

21. యాజకుడైన ఎలియాజరు ఎదుట అతడు నిలువగా అతడు యెహోవా సన్నిధిని ఊరీము తీర్పువలన అతనికొరకు విచారింపవలెను. అతడును అతనితో కూడ ఇశ్రాయేలీయులందరును, అనగా సర్వసమాజము అతని మాటచొప్పున తమ సమస్త కార్యములను జరుపుచుండవలెను.

21. He is to present himself to El'azar the [cohen], who is to find out by means of the [urim] what ADONAI's will is for Y'hoshua's decisions[.] Then, at his word they will go out, and at his word they will come in, both he and all the people of Isra'el with him, the whole community.'

22. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేసెను. అతడు యెహోషువను తీసికొని యాజకుడైన ఎలియాజరు ఎదుటను సర్వసమాజము ఎదుటను అతని నిలువ బెట్టి

22. Moshe did as ADONAI had ordered him. He took Y'hoshua, put him before El'azar the [cohen] and the whole community,

23. అతనిమీద తన చేతులుంచి యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినట్లు అతనికి ఆజ్ఞ యిచ్చెను.

23. laid his hands on him, and commissioned him, as ADONAI had said through Moshe.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Numbers - సంఖ్యాకాండము 27 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible
జెలోపెహాదు కుమార్తెలు వారసత్వం కోసం దరఖాస్తు చేస్తారు, వారసత్వ చట్టం. (1-11) 
ఐదుగురు సోదరీమణులు ఉన్నారు, వారి తండ్రి మరణించారు మరియు వారికి ఎటువంటి భూమిని వారసత్వంగా ఇవ్వడానికి సోదరులు లేరు. వాగ్దానం చేసిన భూమిలో దేవుడు తమకు న్యాయమైన వాటాను ఇస్తాడని వారు విశ్వసించారు మరియు వారు దానిని మర్యాదగా మరియు నిజాయితీగా కోరారు. వారు తమ పరిస్థితి గురించి ఫిర్యాదు చేయకుండా లేదా కలత చెందకుండా మంచి ఉదాహరణగా ఉన్నారు. 1. ఇశ్రాయేలు ప్రజలకు కనాను అనే ప్రత్యేక స్థానాన్ని ఇవ్వడంతో కూడిన దేవుని బలం మరియు వాగ్దానాలను విశ్వసించడం. 2. ల్యాండ్ ఆఫ్ ప్రామిస్ అనే ప్రత్యేక ప్రదేశంలో ఎదిర్నేష్ అనే వ్యక్తి ఉండేవాడు. ఈ ప్రదేశం స్వర్గంలా ఉండేది. 3. పోయిన తండ్రి పట్ల పిల్లలు గౌరవం మరియు ప్రేమను ప్రదర్శించారు. అతను తన పిల్లలు న్యాయబద్ధంగా వారికి చెందిన వాటిని వారసత్వంగా పొందకుండా నిరోధించే ఏ తప్పు చేయలేదు. తమ పిల్లలకు హాని కలిగించే తీవ్రమైన పాపాలు చేయలేదని తెలిసి తల్లిదండ్రులు చనిపోతే వారికి శాంతి కలుగుతుంది. కుటుంబాలు మరియు దేశాలకు ఏమి జరుగుతుందో దేవుడే నిర్ణయిస్తాడు. వారి వారసత్వం కోసం పిల్లల అభ్యర్థన మంజూరు చేయబడింది మరియు వారికి మరింత ఆశీర్వాదాలు ఇవ్వబడ్డాయి. 

మోషే తన మరణం గురించి హెచ్చరించాడు. (12-14) 
మోషే చనిపోతాడు, కానీ అతను చనిపోయే ముందు, అతను తన ప్రజలకు వాగ్దానం చేయబడిన ప్రత్యేక స్థలాన్ని చూస్తాడు. దీనర్థం అతను స్వర్గం వంటి మంచి ప్రదేశాన్ని నమ్ముతాడు. అతను చనిపోయినప్పుడు, అతను తన ముందు మరణించిన ఇతర మంచి వ్యక్తులతో విశ్రాంతి తీసుకుంటాడు. వారు శాంతియుతంగా ముగించారు, కాబట్టి మనం కూడా చనిపోతామని భయపడాల్సిన అవసరం లేదు. 

మోషే స్థానంలో జాషువా నియమించబడ్డాడు. (15-23)
తరువాతి తరానికి మంచిని కోరుకోని కొన్ని చెడు ఆత్మలు ఉన్నాయి, కానీ మోషే అలా కాదు. మనం భవిష్యత్తు గురించి శ్రద్ధ వహించాలి మరియు మనం పోయిన తర్వాత కూడా మతం బలంగా ఉండేలా కృషి చేయాలి. దేవుడు మోషే తర్వాత నాయకుడిగా జాషువా అనే వ్యక్తిని ఎన్నుకున్నాడు. యెహోషువ ధైర్యవంతుడు, వినయం మరియు సత్యవంతుడు, మరియు అతనితో దేవుని ఆత్మ ఉంది. దేవుణ్ణి ప్రేమించి సరైనది చేసే మంచి వ్యక్తి నిజంగా ఉన్నాడు. అతను నాయకత్వం వహించడంలో మరియు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో మంచివాడు. అతను కూడా ధైర్యవంతుడు మరియు ఇతరులు చూడలేని వాటిని చూడగలడు. ఎవరైనా దేవుని కోసం పని చేయాలనుకుంటే, వారు తెలివైన వారైనా, వారికి పరిశుద్ధాత్మ సహాయం అవసరం. దేవుని చట్టాలను అనుసరించిన జాషువా అనే నాయకుడిని మనకు గుర్తుచేస్తాము, అయితే మనలను రక్షించడానికి మనకు యేసు అవసరం. 



Shortcut Links
సంఖ్యాకాండము - Numbers : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |