Numbers - సంఖ్యాకాండము 26 | View All

1. ఆ తెగులు పోయిన తర్వాత యెహోవా మోషేకును యాజకుడగు అహరోను కుమారుడైన ఎలియాజరుకును ఈలాగు సెలవిచ్చెను

1. After the LORD had stopped the deadly disease from killing the Israelites, he said to Moses and Eleazar son of Aaron,

2. మీరు ఇశ్రాయేలీయుల సర్వసమాజములోను ఇరువది ఏండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి ఇశ్రాయేలీయులలో సేనగా బయలు వెళ్లువారందరి సంఖ్యను వారి వారి పితరుల కుటుంబములను బట్టి వ్రాయించుడి.

2. 'I want you to find out how many Israelites are in each family. And list every man twenty years and older who is able to serve in Israel's army.'

3. కాబట్టి యిరువది ఏండ్లు మొదలుకొని పైప్రాయముగల వారిని లెక్కింపుడని యెహోవా మోషేకును ఐగుప్తుదేశమునుండి వచ్చిన ఇశ్రాయేలీయులకును ఆజ్ఞాపించినట్లు మోషేయు యాజకుడగు ఎలియాజరును ఇశ్రాయేలీయులు

3. Israel was now camped in the hills of Moab across the Jordan River from the town of Jericho. Moses and Eleazar told them

4. మోయాబు మైదానము లలో యెరికోయొద్దనున్న యొర్దాను దగ్గర నుండగా జన సంఖ్యను చేయుడని వారితో చెప్పిరి.

4. what the LORD had said about counting the men twenty years and older, just as Moses and their ancestors had done when they left Egypt.

5. ఇశ్రాయేలు తొలిచూలు రూబేను. రూబేను పుత్రులలో హనోకీయులు హనోకు వంశస్థులు;

5. There were 43,730 men from the tribe of Reuben, the oldest son of Jacob. These men were from the clans of Hanoch, Pallu, Hezron, and Carmi.

6. పల్లువీయులు పల్లువంశస్థులు; హెస్రోనీయులు హెస్రోను వంశస్థులు; కర్మీయులు కర్మీ వంశస్థులు;

6. (SEE 26:5)

7. వీరు రూబేనీయుల వంశస్థులు, వారిలో లెక్కింపబడినవారు నలుబది మూడువేల ఏడువందల ముప్పదిమంది.

7. (SEE 26:5)

8. పల్లు కుమారుడు ఏలీయాబు. ఏలీయాబు కుమారులు నెమూయేలు దాతాను అబీరాము.

8. Pallu was the father of Eliab

9. కోరహు తన సమూహములో పేరు పొందినవాడు; అతని సమాజము యెహోవాకు విరోధముగా వాదించినప్పుడు సమాజములో మోషే అహరోనులకు విరోధముగా వాదించిన దాతాను అబీరాములు వీరు.

9. and the grandfather of Nemuel, Dathan, and Abiram. These are the same Dathan and Abiram who had been chosen by the people, but who followed Korah and rebelled against Moses, Aaron, and the LORD.

10. ఆ సమూహపువారు మృతిబొంది నప్పుడు అగ్ని రెండువందల ఏబది మందిని భక్షించినందు నను, భూమి తన నోరు తెరచి వారిని కోరహును మింగి వేసినందునను, వారు దృష్టాంతములైరి.

10. That's when the LORD made the earth open up and swallow Dathan, Abiram, and Korah. At the same time, fire destroyed two hundred fifty men as a warning to the other Israelites.

11. అయితే కోరహు కుమారులు చావలేదు.

11. But the Korahite clan wasn't destroyed.

12. షిమ్యోను పుత్రుల వంశములలో నెమూయేలీయులు నెమూయేలు వంశస్థులు; యామీనీయులు యామీను వంశస్థులు; యాకీనీయులు యాకీను వంశస్థులు;

12. There were 22,200 men from the tribe of Simeon; they were from the clans of Nemuel, Jamin, Jachin, Zerah, and Shaul.

13. జెరహీయులు జెరహు వంశస్థులు; షావూలీయులు షావూలు వంశస్థులు.

13. (SEE 26:12)

14. ఇవి షిమ్యోనీయుల వంశములు. వారు ఇరువదిరెండువేల రెండువందల మంది.

14. (SEE 26:12)

15. గాదు పుత్రుల వంశములలో సెపోనీయులు సెపోను వంశస్థులు; హగ్గీయులు హగ్గీ వంశస్థులు; షూనీయులు షూనీ వంశస్థులు,

15. There were 40,500 men from the tribe of Gad; they were from the clans of Zephon, Haggi, Shuni, Ozni, Eri, Arod, and Areli.

16. ఓజనీయులు ఓజని వంశస్థులు; ఏరీయులు ఏరీ వంశస్థులు;

16. (SEE 26:15)

17. ఆరోదీయులు ఆరోదు వంశస్థులు; అరేలీయులు అరేలీ వంశస్థులు.

17. (SEE 26:15)

18. వీరు గాదీయుల వంశస్థులు; వ్రాయబడినవారి సంఖ్య చొప్పున వీరు నలుబది వేల ఐదువందలమంది.

18. (SEE 26:15)

19. యూదా కుమారులు ఏరు ఓనాను; ఏరును ఓనానును కనాను దేశములో మృతి బొందిరి.

19. There were 76,500 men from the tribe of Judah; they were from the clans of Shelah, Perez, Zerah, Hezron, and Hamul. Judah's sons Er and Onan had died in Canaan.

20. యూదావారి వంశములలో షేలాహీయులు షేలా వంశస్థులు; పెరెసీయులు పెరెసు వంశస్థులు జెరహీయులు జెరహు వంశస్థులు;

20. (SEE 26:19)

21. పెరెసీయులలో హెస్రోనీయులు హెస్రోను వంశస్థులు హామూలీయులు హామూలు వంశస్థులు

21. (SEE 26:19)

22. వీరు యూదీయుల వంశస్థులు; వ్రాయ బడినవారి సంఖ్యచొప్పున వీరు డెబ్బదియారువేల ఐదు వందలమంది.

22. (SEE 26:19)

23. ఇశ్శాఖారు పుత్రుల వంశస్థులలో తోలా హీయులు తోలావంశస్థులు; పువీ్వయులు పువ్వా వంశస్థులు; యాషూబీయులు యాషూబు వంశస్థులు; షిమ్రో నీయులు షిమ్రోను వంశస్థులు; వీరు ఇశ్శాఖారీయుల వంశస్థులు.

23. There were 64,300 men from the tribe of Issachar; they were from the clans of Tola, Puvah, Jashub, and Shimron.

24. వ్రాయబడినవారి సంఖ్యచొప్పున వీరు అరువది నాలుగువేల మూడువందలమంది.

24. (SEE 26:23)

25. జెబూలూను పుత్రుల వంశస్థులలో సెరెదీయులు సెరెదు వంశస్థులు;

25. (SEE 26:23)

26. ఏలోనీయులు ఏలోను వంశస్థులు; యహలేలీయులు యహలేలు వంశస్థులు;

26. There were 60,500 men from the tribe of Zebulun; they were from the clans of Sered, Elon, and Jahleel.

27. వ్రాయబడినవారి సంఖ్యచొప్పున వీరు అరువదివేల ఐదువందలమంది.

27. (SEE 26:26)

28. యోసేపు పుత్రుల వంశస్థులు అతని కుమారులు మనష్షే ఎఫ్రాయిము.

28. There were 52,700 men from the tribe of Manasseh son of Joseph; they were from the clan of Machir, the clan of Gilead his son, and the clans of his six grandsons: Iezer, Helek, Asriel, Shechem, Shemida, and Hepher. Zelophehad son of Hepher had no sons, but he had five daughters: Mahlah, Noah, Hoglah, Milcah, and Tirzah.

29. మనష్షే కుమారులలో మాకీరీయులు మాకీరు వంశస్థులు; మాకీరు గిలాదును కనెను; గిలాదీయులు గిలాదు వంశస్థులు; వీరు గిలాదుపుత్రులు.

29. (SEE 26:28)

30. ఈజరీయులు ఈజరు వంశస్థులు; హెలకీయులు హెలకు వంశస్థులు;

30. (SEE 26:28)

31. అశ్రీయేలీయులు అశ్రీయేలు వంశస్థులు; షెకెమీయులు షెకెము వంశస్థులు;

31. (SEE 26:28)

32. షెమీదాయీయులు షెమీదా వంశస్థులు; హెపెరీయులు హెపెరు వంశస్థులు.

32. (SEE 26:28)

33. హెపెరు కుమారుడైన సెలోపెహాదుకు కుమార్తెలేగాని కుమారులు పుట్టలేదు. సెలోపెహాదు కుమార్తెల పేరులు మహలా నోయా హొగ్లా మిల్కా తిర్సా.

33. (SEE 26:28)

34. వీరు మనష్షీయుల వంశస్థులు; వ్రాయబడినవారి సంఖ్యచొప్పున వీరు ఏబది రెండువేల ఏడు వందలమంది.

34. (SEE 26:28)

35. ఎఫ్రాయిము పుత్రుల వంశములు ఇవి; షూతలహీయులు షూతలహు వంశస్థులు; బేకరీయులు బేకరు వంశస్థులు; తహనీయులు తహను వంశస్థులు,

35. There were 32,500 men from the tribe of Ephraim son of Joseph; they were from the clans of Shuthelah, Becher, Tahan, and Eran the son of Shuthelah.

36. వీరు షూతలహు కుమారులు; ఏరానీయులు ఏరాను వంశస్థులు.

36. (SEE 26:35)

37. వీరు ఎఫ్రాయిమీయుల వంశస్థులు. వ్రాయబడినవారి సంఖ్యచొప్పున వీరు ముప్పదిరెండువేల ఐదువందలమంది; వీరు యోసేపుపుత్రుల వంశస్థులు.

37. (SEE 26:35)

38. బెన్యామీను పుత్రుల వంశములలో బెలీయులు బెల వంశస్థులు; అష్బేలీయులు అష్బేల వంశస్థులు;

38. There were 45,600 men from the tribe of Benjamin; they were from the clans of Bela, Ashbel, Ahiram, Shephupham, Hupham, as well as from Ard and Naaman, the two sons of Bela.

39. అహీరామీయులు అహీరాము వంశస్థులు;

39. (SEE 26:38)

40. షూపామీయులు షూపాము వంశస్థులు; బెల కుమారులు ఆర్దు నయమాను; ఆర్దీయులు ఆర్దు వంశ స్థులు; నయమానీయులు నయమాను వంశస్థులు.

40. (SEE 26:38)

41. వీరు బెన్యామీనీయుల వంశస్థులు; వారిలో వ్రాయబడిన లెక్కచొప్పున నలుబదియయిదువేల ఆరువందల మంది.

41. (SEE 26:38)

42. దాను పుత్రుల వంశములలో షూషామీయులు షూషాము వంశస్థులు;

42. There were 64,400 men from the tribe of Dan; they were all from the clan of Shuham.

43. వీరు తమ వంశములలో దానీయుల వంశస్థులు. వ్రాయబడినవారి సంఖ్యచొప్పున వీరు అరువది నాలుగువేల నాలుగువందల మంది.

43. (SEE 26:42)

44. ఆషేరు పుత్రుల వంశములలో యిమీ్నయులు యిమ్నా వంశస్థులు, ఇష్వీ యులు ఇష్వీ వంశస్థులు; బెరీయులు బెరీయా వంశస్థులు;

44. There were 53,400 men from the tribe of Asher; they were from the clans of Imnah, Ishvi, and Beriah, and from the two clans of Heber and Malchiel, the sons of Beriah. Asher's daughter was Serah.

45. బెరీయానీయులలో హెబెరీయులు హెబెరు వంశస్థులు; మల్కీయేలీయులు మల్కీయేలు వంశస్థులు;

45. (SEE 26:44)

46. (SEE 26:44)

47. వ్రాయబడినవారి సంఖ్య చొప్పున వీరు ఆషేరీయుల వంశస్థులు; వీరు ఏబది మూడువేల నాలుగు వందలమంది.

47. (SEE 26:44)

48. నఫ్తాలీ పుత్రుల వంశములలో యహసయేలీయులు యహసయేలు వంశస్థులు; గూనీ యులు గూనీ వంశస్థులు;

48. There were 45,400 men from the tribe of Naphtali; they were from the clans of Jahzeel, Guni, Jezer, and Shillem.

49. (SEE 26:48)

50. వీరు నఫ్తాలీయుల వంశస్థులు; వ్రాయబడిన వారి సంఖ్యచొప్పున వీరు నలుబదియయిదువేల నాలుగు వందలమంది

50. (SEE 26:48)

51. ఇశ్రాయేలీయులలో లెక్కింపబడిన వీరు ఆరులక్షల వెయ్యిన్ని ఏడు వందల ముప్పదిమంది.

51. The total number of Israelite men listed was 601,730.

52. యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను వీరి పేళ్ల లెక్క చొప్పున ఆ దేశమును వీరికి స్వాస్థ్యముగా పంచిపెట్టవలెను.

52. The LORD said to Moses,

53. ఎక్కువమందికి ఎక్కువ స్వాస్థ్యము ఇయ్యవలెను;

53. 'Divide the land of Canaan among these tribes, according to the number of people in each one,

54. తక్కువమందికి తక్కువ స్వాస్థ్యము ఇయ్య వలెను. దాని దాని జనసంఖ్యనుబట్టి ఆయా గోత్రములకు స్వాస్థ్యము ఇయ్యవలెను.

54. so the larger tribes have more land than the smaller ones.

55. చీట్లువేసి ఆ భూమిని పంచిపెట్టవలెను. వారు తమ తమ పితరుల గోత్రముల జనసంఖ్యచొప్పున స్వాస్థ్యమును పొందవలెను.

55. I will show you what land to give each tribe, and they will receive as much land as they need, according to the number of people in it.'

56. ఎక్కువ మందికేమి తక్కువమందికేమి చీట్లు వేసి యెవరి స్వాస్థ్య మును వారికి పంచిపెట్టవలెను.

56. (SEE 26:55)

57. వారివారి వంశములలో లెక్కింపబడిన లేవీయులు వీరు. గెర్షోనీయులు గెర్షోను వంశస్థులు; కహాతీయులు కహాతు వంశస్థులు; మెరారీయులు మెరారి వంశస్థులు.

57. The tribe of Levi included the clans of the Gershonites, Kohathites, Merarites,

58. లేవీయుల వంశములు ఏవనగా, లిబ్నీయుల వంశము హెబ్రోనీయుల వంశము మహలీయుల వంశము మూషీ యుల వంశము కోరహీయుల వంశము.

58. as well as the clans of Libni, Hebron, Mahli, Mushi, and Korah. Kohath the Levite was the father of Amram,

59. కహాతు అమ్రామును కనెను; అమ్రాము భార్యపేరు యోకెబెదు. ఆమె లేవీ కుమార్తె; ఐగుప్తులో ఆమె లేవీకి పుట్టెను. ఆమె అమ్రామువలన అహరోనును మోషేను వీరి సహోదరియగు మిర్యామును కనెను.

59. the husband of Levi's daughter Jochebed, who was born in Egypt. Amram and Jochebed's three children were Aaron, Moses, and Miriam.

60. Aaron was the father of Nadab, Abihu, Eleazar, and Ithamar.

61. నాదాబు అబీహులు యెహోవా సన్నిధికి అన్యాగ్ని తెచ్చినప్పుడు చనిపోయిరి.

61. But Nadab and Abihu had died when they offered fire that was unacceptable to the LORD.

62. వారిలో నెల మొదలుకొని పైప్రాయము కలిగి లెక్కింపబడినవారందరు ఇరువది మూడు వేలమంది. వారు ఇశ్రాయేలీయులలో లెక్కింపబడినవారు కారు గనుక ఇశ్రాయేలీయులలో వారికి స్వాస్థ్యమియ్య బడలేదు.

62. In the tribe of Levi there were 23,000 men and boys at least a month old. They were not listed with the other tribes, because they would not receive any land in Canaan.

63. యెరికో ప్రాంతములయందలి యొర్దానునొద్దనున్న మోయాబు మైదానములలో మోషేయు యాజకుడగు ఎలియాజరును ఇశ్రాయేలీయుల జనసంఖ్య చేసినప్పుడు లెక్కింపబడినవారు వీరు.

63. Moses and Eleazar counted the Israelites while they were camped in the hills of Moab across the Jordan River from Jericho.

64. మోషే అహరోనులు సీనాయి అరణ్యములో ఇశ్రాయేలీయుల సంఖ్యను చేసి నప్పుడు లెక్కింపబడినవారిలో ఒక్కడైనను వీరిలో ఉండ లేదు.

64. None of the people that Moses and Aaron had counted in the Sinai Desert were still alive,

65. ఏలయనగా వారు నిశ్చయముగా అరణ్యములో చనిపోవుదురని యెహోవా వారినిగూర్చి సెలవిచ్చెను. యెపున్నె కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యెహోషువయు తప్ప వారిలో ఒక్కడైనను మిగిలి యుండలేదు.

65. except Caleb son of Jephunneh and Joshua son of Nun. The LORD had said that everyone else would die there in the desert.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Numbers - సంఖ్యాకాండము 26 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible
మోయాబు మైదానాలలో ఇశ్రాయేలు సంఖ్య. (1-51) 
ప్రజలను లెక్కించమని దేవుడు మోషేతో చెప్పాడు, కానీ దేవుడు అతనికి చెప్పినప్పుడు మాత్రమే అతను దానిని అన్ని సమయాలలో చేయలేదు. ఈ కథలో, మేము అన్ని విభిన్న కుటుంబాలు మరియు వ్యక్తుల సమూహాల జాబితాను కలిగి ఉన్నాము. సీనాయి పర్వతం అనే ప్రదేశంలో లెక్కించబడినప్పుడు ఇంతకు ముందు ఉన్నంత మంది ప్రజలు దాదాపుగా ఉన్నారు. దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన ఇతర వ్యక్తుల వలె మరణించని కోరహు పిల్లలు అని పిలువబడే కొంతమంది వ్యక్తులను కూడా కథ ప్రస్తావిస్తుంది. చెడు ప్రవర్తనను అనుసరించకుండా ఉండటం చాలా ముఖ్యం ఎందుకంటే అలా చేసే వారిలాగా మనం అదే పరిణామాలను ఎదుర్కోవాల్సిన అవసరం లేదు.

భూమి విభజన. (52-56) 
తెగలను విభజించేటప్పుడు, దానిని న్యాయంగా చేయడం ముఖ్యం. కొన్ని తెగలు ఇతరులకన్నా ఎక్కువ భూమిని పొందవచ్చు, కానీ అన్నింటినీ దేవుడు నిర్ణయించాడు మరియు ప్రతి ఒక్కరూ ఫలితంతో సంతోషంగా ఉండాలి.

లేవీయుల సంఖ్య. (57-62) 
లేవీ దేవునిచే ఎన్నుకోబడిన ప్రత్యేక సమూహం, కాబట్టి వారు ఇతరుల నుండి వేరుగా లెక్కించబడ్డారు. కాలేబు మరియు యెహోషువ మాత్రమే కనాను అనే ప్రదేశానికి వెళ్లగలరని చెప్పిన నియమం వారు ప్రభావితం కాలేదు.

మొదటి నంబరింగ్‌లో ఏదీ మిగిలి లేదు. (63-65)
అంటే కొంతమంది తప్పు చేసి శిక్ష అనుభవించారు. సంఖ్యాకాండము 14:29 కాలేబు మరియు జాషువా అనే ఇద్దరు పురుషులు మాత్రమే అప్పుడు మరియు ఇప్పుడు లెక్కించబడ్డారు. దేవుడు ఎల్లప్పుడూ న్యాయంగా ఉంటాడని మరియు తన వాగ్దానాలను నిలబెట్టుకుంటాడని ఇది చూపిస్తుంది. మరణం కుటుంబాలు మరియు దేశాలలో పెద్ద మార్పులకు కారణం అయినప్పటికీ, ప్రతిదీ ఒక కారణంతో జరుగుతుంది మరియు దేవునిచే ప్రణాళిక చేయబడింది. చెడు విషయాలు జరిగినప్పుడు, అది చాలా చెడ్డది అయిన పాపం అని పిలువబడుతుంది. మన తప్పులకు క్షమించాలి, క్షమాపణ అడగాలి మరియు యేసును అనుసరించడం ఎంత ముఖ్యమో గుర్తుంచుకోవాలి. జీవితం చిన్నదని మనం గుర్తుంచుకోవాలి మరియు ఇతరులకు సహాయం చేయడం ద్వారా మరియు దేవుడు మనం ఏమి చేయాలనుకుంటున్నామో అది చేయడం ద్వారా మన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. 



Shortcut Links
సంఖ్యాకాండము - Numbers : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |