Numbers - సంఖ్యాకాండము 22 | View All

1. తరువాత ఇశ్రాయేలీయులు సాగి యెరికోకు ఎదురుగా యొర్దాను తీరముననున్న మోయాబు మైదానములలో దిగిరి.

1. THE ISRAELITES journeyed and encamped in the plains of Moab, on the east side of the Jordan [River] at Jericho.

2. సిప్పోరు కుమారుడైన బాలాకు ఇశ్రాయేలీయులు అమోరీయులకు చేసినదంతయు చూచెను.

2. And Balak [the king of Moab] son of Zippor saw all that Israel had done to the Amorites.

3. జనము విస్తారముగా నున్నందున మోయాబీయులు వారిని చూచి మిక్కిలి భయపడిరి; మోయాబీయులు ఇశ్రాయేలీయులకు జంకిరి.

3. And Moab was terrified at the people and full of dread, because they were many. Moab was distressed and overcome with fear because of the Israelites.

4. మోయాబీయులు మిద్యాను పెద్దలతో ఎద్దు బీటి పచ్చికను నాకివేయునట్లు ఈ జనసమూహము మన చుట్టు ఉన్నది యావత్తును ఇప్పుడు నాకివేయు ననిరి. ఆ కాలమందు సిప్పోరు కుమారుడైన బాలాకు మోయాబీయులకు రాజు.

4. And Moab said to the elders of Midian, Now will this multitude lick up all that is round about us, as the ox licks up the grass of the field. So Balak son of Zippor, the king of the Moabites at that time,

5. కాబట్టి అతడు బెయోరు కుమారుడైన బిలామును పిలుచుటకు అతని జనుల దేశమందలి నదియొద్దనున్న పెతోరుకు దూతలచేత ఈ వర్తమానము పంపెను చిత్తగించుము; ఒక జనము ఐగుప్తులోనుండి వచ్చెను; ఇదిగో వారు భూతలమును కప్పి నా యెదుట దిగియున్నారు.

5. Sent messengers to Balaam [a foreteller of events] son of Beor at Pethor, which is by the [Euphrates] River, even to the land of the children of his people, to say to him, There is a people come out from Egypt; behold, they cover the face of the earth and they have settled down and dwell opposite me.

6. కాబట్టి నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించుము; వారు నాకంటె బలవంతులు; వారిని హతము చేయుటకు నేను బలమొందుదునేమో; అప్పుడు నేను ఈ దేశములోనుండి వారిని తోలివేయుదును; ఏలయనగా నీవు దీవించువాడు దీవింపబడుననియు శపించువాడు శపించబడుననియు నేనెరుగుదును.

6. Now come, I beg of you, curse this people for me, for they are too powerful for me. Perhaps I may be able to defeat them and drive them out of the land, for I know that he whom you bless is blessed, and he whom you curse is cursed.

7. కాబట్టి మోయాబు పెద్దలును మిద్యాను పెద్దలును సోదె సొమ్మును చేత పట్టుకొని బిలామునొద్దకు వచ్చి బాలాకు మాటలను అతనితో చెప్పగా
2 పేతురు 2:15, యూదా 1:11

7. And the elders of Moab and of Midian departed with the rewards of foretelling in their hands; and they came to Balaam and told him the words of Balak.

8. అతడు వారితోయీ రాత్రి ఇక్కడనే ఉండుడి; యెహోవా నాకు సెలవిచ్చిన మాటలను నేను తిరిగి వచ్చి మీతో చెప్పెదననెను. అప్పుడు మోయాబు అధికారులు బిలాము నొద్ద బసచేసిరి.

8. And he said to them, Lodge here tonight and I will bring you word as the Lord may speak to me. And the princes of Moab abode with Balaam [that night].

9. దేవుడు బిలామునొద్దకు వచ్చినీ యొద్దనున్న యీ మనుష్యులు ఎవరని అడుగగా

9. And God came to Balaam, and said, What men are these with you?

10. బిలాము దేవునితో యిట్లనెనుసిప్పోరు కుమారుడైన బాలాకను మోయాబు రాజు

10. And Balaam said to God, Balak son of Zippor, king of Moab, has sent to me, saying,

11. చిత్తగించుము; ఒక జనము ఐగుప్తునుండి బయలుదేరి వచ్చెను; వారు భూతల మును కప్పుచున్నారు; నీవు ఇప్పుడేవచ్చి నా నిమిత్తము వారిని శపింపుము; నేను వారితో యుద్ధముచేసి వారిని తోలివేయుదునేమో అని వీరిచేత నాకు వర్తమానము పంపెను.

11. Behold, the people who came out of Egypt cover the face of the earth; come now, curse them for me. Perhaps I shall be able to fight against them and drive them out.

12. అందుకు దేవుడు నీవు వారితో వెళ్లకూడదు, ఆ ప్రజలను శపింపకూడదు, వారు ఆశీర్వదింపబడినవారు అని బిలాముతో చెప్పెను.

12. And God said to Balaam, You shall not go with them; you shall not curse the people, for they are blessed.

13. కాబట్టి బిలాము ఉదయమున లేచి బాలాకు అధికారులతోమీరు మీ స్వదేశమునకు వెళ్లుడి; మీతో కూడ వచ్చుటకు యెహోవా నాకు సెలవియ్యనని చెప్పుచున్నాడనగా

13. And Balaam rose up in the morning, and said to the princes of Balak, Go back to your own land, for the Lord refuses to permit me to go with you.

14. మోయాబు అధికారులు లేచి బాలాకు నొద్దకు వెళ్లిబిలాము మాతో కూడ రానొల్లడాయెననిరి.

14. So the princes of Moab rose up and went to Balak, and said, Balaam refuses to come with us.

15. అయినను బాలాకు వారి కంటె బహు ఘనతవహించిన మరి యెక్కువ మంది అధికారులను మరల పంపెను.

15. Then Balak again sent princes, more of them and more honorable than the first ones.

16. వారు బిలామునొద్దకు వచ్చి అతనితోనీవు దయచేసి నాయొద్దకు వచ్చుటకు ఏమియు అడ్డము చెప్పకుము.

16. And they came to Balaam, and said to him, Thus says Balak son of Zippor, I beg of you, let nothing hinder you from coming to me.

17. నేను నీకు బహు ఘనత కలుగజేసెదను; నీవు నాతో ఏమి చెప్పుదువో అది చేసెదను గనుక నీవు దయచేసి వచ్చి, నా నిమిత్తము ఈ జనమును శపించుమని సిప్పోరు కుమారుడైన బాలాకు చెప్పెననిరి.

17. For I will promote you to very great honor and I will do whatever you tell me; so come, I beg of you, curse this people for me.

18. అందుకు బిలాముబాలాకు తన యింటెడు వెండి బంగారములను నాకిచ్చినను కొద్దిపనినైనను గొప్పపనినైనను చేయునట్లు నేను నా దేవుడైన యెహోవా నోటిమాట మీరలేను.

18. And Balaam answered the servants of Balak, If Balak would give me his house full of silver and gold, I cannot go beyond the word of the Lord my God, to do less or more.

19. కాబట్టి మీరు దయచేసి యీ రాత్రి ఇక్కడ నుండుడి; యెహోవా నాతో నిక నేమి చెప్పునో నేను తెలిసికొందునని బాలాకు సేవకులకు ఉత్తరమిచ్చెను.

19. Now therefore, I pray you, tarry here again tonight that I may know what more the Lord will say to me.

20. ఆ రాత్రి దేవుడు బిలామునొద్దకు వచ్చి ఆ మనుష్యులు నిన్ను పిలువ వచ్చినయెడల నీవు లేచి వారితో వెళ్లుము; అయితే నేను నీతో చెప్పిన మాటచొప్పుననే నీవు చేయవలెనని అతనికి సెలవిచ్చెను.

20. And God came to Balaam at night, and said to him, If the men come to call you, rise up and go with them, but still only what I tell you may you do.

21. ఉదయమున బిలాము లేచి తన గాడిదకు గంత కట్టి మోయాబు అధికారులతో కూడ వెళ్లెను.

21. And Balaam rose up in the morning and saddled his donkey and went with the princes of Moab.

22. అతడు వెళ్లుచుండగా దేవుని కోపము రగులుకొనెను; యెహోవా దూత అతనికి విరోధియై త్రోవలో నిలిచెను. అతడు తన గాడిదనెక్కి పోవుచుండగా అతని పనివారు ఇద్దరు అతనితోకూడ నుండిరి.

22. And God's anger was kindled because he went, and the Angel of the Lord stood in the way as an adversary against him. Now he was riding upon his donkey, and his two servants were with him.

23. యెహోవా దూత ఖడ్గము దూసి చేత పట్టుకొని త్రోవలో నిలిచి యుండుట ఆ గాడిద చూచెను గనుక అది త్రోవను విడిచి పొలములోనికి పోయెను. బిలాము గాడిదను దారికి మలుపవలెనని దాని కొట్టగా

23. And the donkey saw the Angel of the Lord standing in the way and His sword drawn in His hand, and the donkey turned aside out of the way and went into the field. And Balaam struck the donkey to turn her into the way.

24. యెహోవా దూత యిరుప్రక్కలను గోడలుగల ద్రాక్షతోటల సందులో నిలిచెను.

24. But the Angel of the Lord stood in a path of the vineyards, a wall on this side and a wall on that side.

25. గాడిద యెహోవా దూతను చూచి గోడమీద పడి బిలాము కాలును గోడకు అదిమెను గనుక అతడు దాని మరల కొట్టెను.

25. And when the donkey saw the Angel of the Lord, she thrust herself against the wall and crushed Balaam's foot against it, and he struck her again.

26. యెహోవా దూత ముందు వెళ్లుచు కుడికైనను ఎడమకైనను తిరుగుటకు దారిలేని యిరుకు చోటను నిలువగా

26. And the Angel of the Lord went further and stood in a narrow place where there was no room to turn, either to the right hand or to the left.

27. గాడిద యెహోవా దూతను చూచి బిలాముతోకూడ క్రింద కూలబడెను గనుక బిలాము కోపముమండి తన చేతి కఱ్ఱతో గాడిదను కొట్టెను.

27. And when the donkey saw the Angel of the Lord, she fell down under Balaam, and Balaam's anger was kindled and he struck the donkey with his staff.

28. అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్కు నిచ్చెను గనుక అది నీవు నన్ను ముమ్మారు కొట్టితివి; నేను నిన్నేమి చేసితినని బిలాముతో అనగా
2 పేతురు 2:16

28. And the Lord opened the mouth of the donkey, and she said to Balaam, What have I done to you that you should strike me these three times?

29. బిలాము నీవు నామీద తిరుగబడితివి; నాచేత ఖడ్గమున్న యెడల నిన్ను చంపియుందునని గాడిదతో అనెను.

29. And Balaam said to the donkey, Because you have ridiculed and provoked me! I wish there were a sword in my hand, for now I would kill you!

30. అందుకు గాడిద నేను నీదాననైనది మొదలుకొని నేటివరకు నీవు ఎక్కుచు వచ్చిన నీ గాడిదను కానా? నేనెప్పుడైన నీకిట్లు చేయుట కద్దా? అని బిలాముతో అనగా అతడులేదనెను.

30. And the donkey said to Balaam, Am not I your donkey, upon which you have ridden all your life long until this day? Was I ever accustomed to do so to you? And he said, No.

31. అంతలో యెహోవా బిలాము కన్నులు తెరచెను గనుక, దూసిన ఖడ్గము చేతపట్టుకొని త్రోవలో నిలిచియున్న యెహోవా దూతను అతడు చూచి తల వంచి సాష్టాంగ నమస్కారము చేయగా

31. Then the Lord opened Balaam's eyes, and he saw the Angel of the Lord standing in the way with His sword drawn in His hand; and he bowed his head and fell on his face.

32. యెహోవా దూత యీ ముమ్మారు నీ గాడిదను నీవేల కొట్టితివి? ఇదిగో నా యెదుట నీ నడత విపరీతమైనది గనుక నేను నీకు విరోధినై బయలుదేరి వచ్చితిని.

32. And the Angel of the Lord said to him, Why have you struck your donkey these three times? See, I came out to stand against and resist you, for your behavior is willfully obstinate and contrary before Me.

33. ఆ గాడిద నన్ను చూచి యీ ముమ్మారు నా యెదుట నుండి తొలిగెను; అది నా యెదుట నుండి తొలగని యెడల నిశ్చయముగా నేనప్పుడే నిన్ను చంపి దాని ప్రాణమును రక్షించి యుందునని అతనితో చెప్పెను.

33. And the ass saw Me and turned from Me these three times. If she had not turned from Me, surely I would have slain you and saved her alive.

34. అందుకు బిలాము నేను పాపముచేసితిని; నీవు నాకు ఎదురుగా త్రోవలో నిలుచుట నాకు తెలిసినది కాదు. కాబట్టి యీ పని నీ దృష్టికి చెడ్డదైతే నేను వెనుకకు వెళ్లెదనని యెహోవా దూతతో చెప్పగా

34. Balaam said to the Angel of the Lord, I have sinned, for I did not know You stood in the way against me. But now, if my going displeases You, I will return.

35. యెహోవా దూత నీవు ఆ మనుష్యులతో కూడ వెళ్లుము. అయితే నేను నీతో చెప్పు మాటయేకాని మరేమియు పలుకకూడదని బిలాముతో చెప్పెను. అప్పుడు బిలాము బాలాకు అధికారులతో కూడ వెళ్లెను.

35. The Angel of the Lord said to Balaam, Go with the men, but you shall speak only what I tell you. So Balaam went with the princes of Balak.

36. బిలాము వచ్చెనని బాలాకు విని, ఆ పొలిమేరల చివరనున్న అర్నోను తీరమునందలి మోయాబు పట్టణమువరకు అతనిని ఎదుర్కొన బయలువెళ్లగా

36. When Balak heard that Balaam had come, he went out to meet him at the city of Moab on the border formed by the Arnon [River], at the farthest end of the boundary.

37. బాలాకు బిలాముతో నిన్ను పిలుచుటకు నేను నీయొద్దకు దూతలను పంపియుంటిని గదా. నాయొద్దకు నీవేల రాకపోతివి? నిన్ను ఘనపరచ సమర్థుడను కానా? అనెను.

37. Balak said to Balaam, Did I not [earnestly] send to you to ask you [to come] to me? Why did you not come? Am not I able to promote you to honor?

38. అందుకు బిలాము ఇదిగో నీయొద్దకు వచ్చితిని; అయిన నేమి? ఏదైనను చెప్పుటకు నాకు శక్తి కలదా? దేవుడు నా నోట పలికించు మాటయే పలికెదనని బాలాకుతో చెప్పెను.

38. And Balaam said to Balak, Indeed I have come to you, but do I now have any power at all to say anything? The word that God puts in my mouth, that shall I speak.

39. అప్పుడు బిలాము బాలాకుతో కూడ వెళ్లెను. వారు కిర్యత్‌ హుచ్చోతుకు వచ్చినప్పుడు

39. And Balaam went with Balak, and they came to Kiriath-huzoth.

40. బాలాకు ఎడ్లను గొఱ్ఱెలను బలిగా అర్పించి, కొంతభాగము బిలాముకును అతని యొద్దనున్న అధికారులకును పంపెను.

40. And Balak offered oxen and sheep, and sent [portions] to Balaam and to the princes who were with him.

41. మరునాడు బాలాకు బిలామును తోడు కొనిపోయి, బయలు యొక్క ఉన్నత స్థలములమీదనుండి జనులను చివరవరకు చూడవలెనని అతనిని అచ్చోట ఎక్కించెను.

41. And on the following day Balak took Balaam and brought him up into the high places of Bamoth-baal; from there he saw the nearest of the Israelites.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Numbers - సంఖ్యాకాండము 22 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible
ఇశ్రాయేలు పట్ల బాలాకు భయపడి బిలామును పిలిపించాడు. (1-14)
ఒకప్పుడు బాలాకు అనే రాజు ఉండేవాడు, ఇశ్రాయేలు ప్రజలపై దేవునికి కోపం తెప్పించి వారిని బాధపెట్టాలనుకున్నాడు. వారి గురించి చెడుగా చెప్పడానికి మరియు అతని గురించి మరియు తన సైన్యం గురించి మంచి మాటలు చెప్పడానికి ప్రత్యేకమైన వ్యక్తిని కనుగొంటే, అతను వారిని సులభంగా ఓడించగలడని అతను అనుకున్నాడు. అతను తనకు సహాయం చేయడానికి దూరంగా నివసించే బిలాము అనే ప్రసిద్ధ ప్రవక్తను ఎంచుకున్నాడు. ఈ కథకు ముందు దేవుడు బిలాముతో మాట్లాడాడో లేదో మనకు తెలియదు, కానీ అది సాధ్యమే. అయితే, అతను దేవుణ్ణి మరియు అతని ప్రజలను ఇష్టపడని చెడ్డ వ్యక్తి అని మనకు తెలుసు. కొందరు వ్యక్తులు దేవుని ప్రజల గురించి చెడుగా చెప్పడానికి బిలాముకు చెల్లించాలని ప్రయత్నించారు, కానీ దేవుడు అతనితో చేయకూడదని చెప్పాడు. తనను శపించమని అడిగే ప్రజలను దేవుడు ఆశీర్వదించాడని బిలాముకు తెలుసు, కాబట్టి అతను వెంటనే వద్దు అని చెప్పాలి. కొన్నిసార్లు మనం కష్టమైన ఎంపికలను ఎదుర్కొన్నప్పుడు, మనం ఏమి చేయాలో ఆలోచించడానికి సమయం కావాలి. మనం ఏదైనా తప్పు చేయాలని శోదించబడినప్పుడు జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం ఎందుకంటే మనం చెడు నిర్ణయం తీసుకోవచ్చు. దేవుని నుండి సందేశం ఇవ్వమని అడిగినప్పుడు బిలాము సరైన పని చేయలేదు. దేవుని నియమాలను పాటించని వ్యక్తులు చెడు విషయాల ద్వారా శోదించబడే అవకాశం ఉంది. బాలాకు కోసం పని చేస్తున్న దూతలు బిలాము చెప్పిన దాని గురించి అతనికి నిజం చెప్పలేదు. కొన్నిసార్లు మన చుట్టూ ఉన్న వ్యక్తులు మనకు నిజం చెప్పకపోవచ్చు మరియు అది మన స్వంత తప్పులను గ్రహించకుండా ఆపవచ్చు. 

 బిలాము బాలాకు వద్దకు వెళ్లాడు. (15-21) 
ఎవరో మళ్ళీ బిలాముకి సందేశం పంపారు. అనుకున్నది అనుకున్నట్లు జరగకపోయినా మంచి పనులు చేస్తూనే ఉండటం ముఖ్యం. బాలాకు బిలాముకు డబ్బు, అధికారం వంటి వాటిని అందించాడు. అలాంటివి కోరుకోకుండా సహాయం చేయమని మనం ప్రతిరోజూ దేవుణ్ణి అడగాలి. ఇది తప్పు అయినప్పటికీ, కొంతమంది తమకు కావలసినది పొందడానికి ఏదైనా చేస్తారు. మనం ఎల్లప్పుడూ సరైనది చేయడానికి ప్రయత్నించాలి. దేవుడు ఏమి చేయాలనుకుంటున్నాడో బిలాముకు తెలుసు, కాని కొంతమంది నిజంగా చేయనప్పుడు తాము దేవుణ్ణి అనుసరిస్తామని చెప్పారు. ఒక వ్యక్తి హృదయంలో ఏముందో దేవునికి తెలుసు, కాబట్టి వారు చెప్పేదానిని బట్టి మనం వారిని అంచనా వేయకూడదు. అది దేవుని ఆజ్ఞకు విరుద్ధమని తెలిసినప్పటికీ, బిలాము ఏదైనా చెడు చేయాలని శోధించబడ్డాడు. అయినప్పటికీ, అతను ఈ ఆలోచనను ద్వేషిస్తున్నట్లు చెప్పలేదు. అతను నిజంగా దీన్ని చేయాలనుకున్నాడు మరియు దేవుడు అతన్ని అనుమతిస్తాడని ఆశించాడు. ఏం చేయాలో దేవుడు ముందే చెప్పాడు కూడా. ఎవరైనా తప్పు చేయడానికి అనుమతిని అడిగినప్పుడు, వారు తమ చెడు ఆలోచనలు మరియు కోరికలచే నియంత్రించబడుతున్నారని చూపిస్తుంది. బిలాము స్వార్థపరుడు మరియు దేవుని మాట వినడు కాబట్టి దేవుడు బిలాము కోరుకున్నది చేయడానికి అనుమతించాడు. కొన్నిసార్లు, దేవుడు మన ప్రార్థనలకు జవాబివ్వడు, ఎందుకంటే అది మన మంచి కోసమే, కానీ ఇతర సమయాల్లో, చెడ్డ వ్యక్తులు శిక్షగా కోరుకునే వాటిని పొందనివ్వవచ్చు. 

మార్గం ద్వారా బిలాముకు వ్యతిరేకత. (22-35) 
దేవుడు ఎల్లప్పుడూ చెడు పనులు చేయకుండా ప్రజలను ఆపడు కాబట్టి, అతను ఆ చెడ్డ పనులను ఇష్టపడుతున్నాడని లేదా వారు సరైందని భావిస్తున్నాడని మనం అనుకోకూడదు. దేవదూతలు చెడు విషయాలు జరగకుండా ఆపడానికి ప్రయత్నిస్తారు, మనం ఎల్లప్పుడూ గుర్తించలేకపోయినా. ఈ కథలో, దేవదూత అతనికి సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నందున ఒక దేవదూత బిలామును చెడు చేయకుండా ఆపాడు. కొన్నిసార్లు, వ్యక్తులు నిజంగా ఏదైనా చెడు చేయాలనుకున్నప్పుడు, వారు కష్టమైనప్పటికీ ప్రయత్నిస్తూనే ఉంటారు. ఈ కథలో, బిలాము చేస్తున్నది తప్పు అని ఒక జంతువు (గాడిద)కు కూడా తెలుసు, మరియు దేవుడు అతన్ని హెచ్చరించడానికి జంతువును మాట్లాడేలా చేసాడు. దేవుడు చాలా ప్రత్యేకమైన అద్భుతం చేసాడు, అక్కడ అతను ఒక గాడిదను ఒక వ్యక్తిలా మాట్లాడేలా చేసాడు. బిలాము తన పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నందుకు గాడిద కలత చెందింది. మనుషులు బలహీనంగా ఉన్నా లేదా తక్కువ ప్రాముఖ్యత కలిగి ఉన్నా ఇతరులతో అసభ్యంగా ప్రవర్తించడం దేవుడు ఇష్టపడడు. కొన్నిసార్లు దేవుడు చెడుగా ప్రవర్తించిన వారికి తమ కోసం మాట్లాడటానికి సహాయం చేస్తాడు లేదా ఇతర మార్గాల్లో వారి కోసం మాట్లాడతాడు. బిలాము చివరికి తన తప్పును గ్రహించాడు. ప్రజలు తప్పు చేస్తున్నప్పుడు గ్రహించడంలో సహాయం చేయడానికి దేవునికి అనేక మార్గాలు ఉన్నాయి. మన తప్పులను మనం గ్రహించినప్పుడు, చెడు పనులు చేయడం వల్ల కలిగే ప్రమాదాన్ని మనం అర్థం చేసుకోవచ్చు మరియు బదులుగా మంచి పనులు చేయడం ఎలా మంచిదో తెలుసుకోవచ్చు. బిలామ్ తాను ఏదో తప్పు చేశానని చెప్పాడు, కానీ అది ఎంత చెడ్డదో అతనికి నిజంగా అర్థమైనట్లు లేదా దానిని అంగీకరించాలని అనిపించడం లేదు. తను చేయాలనుకున్నది చేయలేక పోతే వదిలేసి వెనక్కి వెళ్లిపోతాడు. ఒక దేవదూత అతనికి ఇజ్రాయెల్ గురించి చెడుగా చెప్పలేనని మరియు బదులుగా మంచి విషయాలు చెప్పాలని చెప్పాడు. ఇది దేవునికి మంచిది మరియు బిలామును వెర్రివాడిగా అనిపించింది. 

బిలాము మరియు బాలాకు కలుసుకున్నారు. (36-41)
బిలాము ఇంతకుముందు రాలేదని బాలాకు బాధపడతాడు, కానీ ఇప్పుడు అతనికి ఫిర్యాదు చేయడానికి ఏమీ లేదు. తనపై ఎక్కువగా ఆధారపడవద్దని బిలాము బాలాకుతో చెప్పాడు. బిలాముకు చిరాకుగా అనిపించినా, దేవుణ్ణి సంతోషపెట్టాలని నటించినట్లే, అతను ఇంకా బాలాకును సంతోషపెట్టాలని కోరుకుంటున్నాడు. ప్రలోభాలకు లొంగిపోకుండా సహాయం చేయమని దేవుణ్ణి కోరుతూ మనం ప్రతిరోజూ ఎందుకు ప్రార్థించాలో ఇది చూపిస్తుంది. మనం మన స్వంత ఆలోచనలు మరియు చర్యల గురించి కూడా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే మనకు దేవుని గురించి చాలా తెలిసినప్పటికీ, ఆయనను నిజంగా అనుసరించడానికి మనకు ఇంకా ఆయన దయ అవసరం. 



Shortcut Links
సంఖ్యాకాండము - Numbers : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |