Numbers - సంఖ్యాకాండము 15 | View All

1. మరియయెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను

1. And the Lord said to Moses,

2. నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము - నేను మీ కిచ్చుచున్న దేశనివాసములలో మీరు ప్రవేశించిన తరువాత

2. Say to the children of Israel, When you have come into the land which I am giving to you for your resting-place,

3. యెహోవాకు ఇంపైన సువాసన కలుగునట్లుగా గోవులలోనిదానినేకాని, గొఱ్ఱె మేకలలోనిదానినేకాని, దహనబలిగానైనను, బలిగానైనను తెచ్చి, మ్రొక్కుబడి చెల్లించుటకనియో, స్వేచ్ఛార్పణగాననియో, నియామక కాలమందు అర్పించునదియనియో, దేనినైనను మీరు అర్పింపగోరినయెడల

3. And are going to make an offering by fire to the Lord, a burned offering or an offering in connection with an oath, or an offering freely given, or at your regular feasts, an offering for a sweet smell to the Lord, from the herd or the flock:

4. యెహోవాకు ఆ అర్పణము నర్పించువాడు ముప్పావు నూనెతో కలుపబడిన రెండు పళ్ల పిండిని నైవేద్యముగా తేవలెను.

4. Then let him who is making his offering, give to the Lord a meal offering of a tenth part of a measure of the best meal mixed with a fourth part of a hin of oil:

5. ఒక్కొక్క గొఱ్ఱెపిల్లతో కూడ దహనబలిమీదనేమి బలిమీదనేమి పోయుటకై ముప్పావు ద్రాక్షారసమును పానార్పణ ముగా సిద్ధపరచవలెను.

5. And for the drink offering, you are to give with the burned offering or other offering, the fourth part of a hin of wine for every lamb.

6. పొట్టేలుతోకూడ పడి నూనెతో కలుపబడిన నాలుగు పళ్ల పిండిని నైవేద్యముగా సిద్ధపరచ వలెను.

6. Or for a male sheep, give as a meal offering two tenth parts of a measure of the best meal mixed with a third part of a hin of oil:

7. పడి ద్రాక్షారసమును పానార్పణముగా తేవలెను; అది యెహోవాకు ఇంపైన సువాసన.

7. And for the drink offering give a third part of a hin of wine, for a sweet smell to the Lord.

8. మ్రొక్కుబడిని చెల్లించుటకైనను యెహోవాకు సమా ధానబలి నర్పించుటకైనను నీవు దహనబలిగానైనను బలిగా నైనను కోడెదూడను సిద్ధపరచినయెడల

8. And when you make ready a young ox for a burned or other offering, or for the effecting of an oath, or for peace-offerings to the Lord:

9. ఆ కోడెతో కూడ పడిన్నరనూనె కలుపబడిన ఆరుపళ్ల గోధుమపిండిని నైవేద్యముగా అర్పింపవలెను.

9. Then with the ox give a meal offering of three tenth parts of a measure of the best meal mixed with half a hin of oil.

10. మరియయెహోవాకు ఇంపైన సువాసనగల హోమముగా

10. And for the drink offering: give half a hin of wine, for an offering made by fire for a sweet smell to the Lord.

11. పడిన్నర ద్రాక్షా రసమును పానీయార్పణముగా తేవలెను; ఒక్కొక్క కోడెతోకూడను ఒక్కొక్క పొట్టేలుతోకూడను, గొఱ్ఱెలలోనిదైనను మేకలలోనిదైనను ఒక్కొక్క పిల్లతో కూడను, ఆలాగు చేయవలెను.

11. This is to be done for every young ox and for every male sheep or he-lamb or young goat.

12. మీరు సిద్ధపరచువాటి లెక్కనుబట్టి వాటి లెక్కలో ప్రతిదానికిని అట్లు చేయవలెను.

12. Whatever number you make ready, so you are to do for every one.

13. దేశములో పుట్టినవారందరు యెహోవాకు ఇంపైన సువాసనగల హోమార్పణమును తెచ్చునప్పుడు ఆలాగుననే చేయవలెను.

13. All those who are Israelites by birth are to do these things in this way, when giving an offering made by fire of a sweet smell to the Lord.

14. మీయొద్ద నివసించు పరదేశి గాని మీ తరతరములలో మీ మధ్యనున్నవాడెవడు గాని యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము అర్పింప గోరినప్పుడు మీరు చేయునట్లే అతడును చేయవలెను.

14. And if a man from another country or any other person living among you, through all your generations, has the desire to give an offering made by fire of a sweet smell to the Lord, let him do as you do.

15. సంఘమునకు, అనగా మీకును మీలో నివసించు పరదేశికిని ఒక్కటే కట్టడ; అది మీ తరతరములకుండు నిత్యమైన కట్టడ; యెహోవా సన్నిధిని మీరున్నట్లే పరదేశియు ఉండును.

15. There is to be one law for you and for the man of another country living with you, one law for ever from generation to generation; as you are, so is he to be before the Lord.

16. మీకును మీయొద్ద నివసించు పరదేశికిని ఒక్కటే యేర్పాటు, ఒక్కటే న్యాయవిధి యుండవలెను.

16. The law and the rule are to be the same for you and for those from other lands living with you.

17. యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెనునీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము
రోమీయులకు 11:16

17. And the Lord said to Moses,

18. నేను మిమ్మును కొని పోవుచున్న దేశములో మీరు ప్రవేశించిన తరువాత

18. Say to the children of Israel, When you come into the land where I am guiding you,

19. మీరు ఆ దేశపు ఆహారమును తినునప్పుడు ప్రతిష్ఠార్పణ మును యెహోవాకు అర్పింపవలెను.

19. Then, when you take for your food the produce of the land, you are to give an offering lifted up before the Lord.

20. మీరు మీ మొదటి పిండిముద్ద రొట్టెను ప్రతిష్ఠార్పణముగా అర్పింపవలెను; కళ్లపు అర్పణమువలె దాని అర్పింపవలెను.

20. Of the first of your rough meal you are to give a cake for a lifted offering, lifting it up before the Lord as the offering of the grain-floor is lifted up.

21. మీ తరతరములకు మీ మొదటి పిండిముద్దలోనుండి ప్రతిష్ఠార్పణమును యెహోవాకు అర్పింపవలెను.

21. From generation to generation you are to give to the Lord a lifted offering from the first of your rough meal.

22. యెహోవా మోషేతో చెప్పిన యీ ఆజ్ఞలన్నిటిలో, అనగా

22. And if in error you go against any of these laws which the Lord has given to Moses,

23. యెహోవా ఆజ్ఞాపించిన దినము మొదలుకొని అటుపైని మీ తరతరములకు యెహోవా మోషే ద్వారా మీకు ఆజ్ఞాపించినవాటిలో పొరబాటున దేనినైనను మీరు చేయకపోయినప్పుడు, అది సమాజమునకు తెలియ బడనియెడల

23. All the laws which the Lord has given you by the hand of Moses, from the day when the Lord gave them, and ever after from generation to generation;

24. సర్వసమాజము యెహోవాకు ఇంపైన సువాసనగా నుండుటకై దహనబలిగా ఒక కోడెదూడను, విధిచొప్పున దాని నైవేద్యమును దాని పానీయార్పణమును పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను సిద్ధపరచ వలెను.

24. Then, if the wrong is done in error, without the knowledge of the meeting of the people, let all the meeting give a young ox as a burned offering, a sweet smell to the Lord, with its meal offering and its drink offering, as is ordered in the law, together with a he-goat for a sin-offering.

25. యాజకుడు ఇశ్రాయేలీయుల సర్వసమాజము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను; తెలియకయే దాని చేసెను గనుక క్షమింపబడును. వారు పొరబాటున చేసిన పాపములను బట్టి తమ అర్పణమును, అనగా యెహో వాకు చెందవలసిన హోమమును పాపపరిహారార్థబలిని యెహోవా సన్నిధికి తీసికొని రావలెను.

25. So the priest will make the people free from sin, and they will have forgiveness; for it was an error, and they have given their offering made by fire to the Lord, and their sin-offering before the Lord, on account of their error:

26. అప్పుడు ఇశ్రాయేలీయుల సర్వసమాజమేమి, వారి మధ్యను నివ సించు పరదేశి యేమి క్షమాపణ నొందును; ఏలయనగా ప్రజలందరు తెలియకయే దాని చేయుట తటస్థించెను.

26. And all the meeting of the children of Israel, as well as those from other lands living among them, will have forgiveness; for it was an error on the part of the people.

27. ఒకడు పొరబాటున పాపము చేసినయెడల వాడు పాప పరిహారార్థబలిగా ఏడాది ఆడుమేక పిల్లను తీసికొని రావలెను.

27. And if one person does wrong, without being conscious of it, then let him give a she-goat of the first year for a sin-offering.

28. పొరబాటున యెహోవా సన్నిధిని దాని చేసెను గనుక తెలియకయే పాపము చేసిన వాని నిమిత్తము యాజకుడు ప్రాయశ్చి త్తము చేయును; వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటవలన వాడు క్షమాపణ నొందును.

28. And the priest will take away the sin of the person who has done wrong, if the wrong was done unconsciously, and he will have forgiveness.

29. ఇశ్రాయేలీయులలో పుట్టినవాడేగాని వారి మధ్యను నివసించు పరదేశి యేగాని పొరబాటున ఎవడైనను పాపము చేసినయెడల వానికిని మీకును విధి ఒక్కటే ఉండవలెను.

29. The law in connection with wrong done unconsciously is to be the same for him who is an Israelite by birth and for the man from another country who is living among them.

30. అయితే దేశమందు పుట్టినవాడేగాని పర దేశియే గాని యెవడైనను సాహసించి పాపము చేసిన యెడల

30. But the person who does wrong in the pride of his heart, if he is one of you or of another nation by birth, is acting without respect for the Lord, and will be cut off from his people.

31. వాడు యెహోవాను తృణీకరించినవాడగును గనుక అట్టివాడు నిశ్చయముగా జనులలో నుండకుండ కొట్టి వేయబడును; వాడు యెహోవా మాటను అలక్ష్యము చేసి ఆయన ఆజ్ఞను మీరినందున నిశ్చయముగా కొట్టివేయ బడును; వాని దోషశిక్షకు వాడే కారకుడు.

31. Because he had no respect for the word of the Lord, and did not keep his law, that man will be cut off without mercy and his sin will be on him.

32. ఇశ్రాయేలీయులు అరణ్యములో ఉన్నప్పుడు ఒకడు విశ్రాంతిదినమున కట్టెలు ఏరుట చూచిరి.

32. Now while the children of Israel were in the waste land, they saw a man who was getting sticks on the Sabbath day.

33. వాడు కట్టెలు ఏరుట చూచినవారు మోషేయొద్దకును అహరోనునొద్ద కును సర్వసమాజమునొద్దకును వానిని తీసికొనివచ్చిరి.

33. And those who saw him getting sticks took him before Moses and Aaron and all the people.

34. వానికి ఏమి చేయవలెనో అది విశదపరచబడలేదు గనుక వానిని కావలిలో ఉంచిరి.

34. And they had him shut up, because they had no directions about what was to be done with him.

35. తరువాత యెహోవాఆ మనుష్యుడు మరణశిక్ష నొందవలెను.

35. Then the Lord said to Moses, Certainly the man is to be put to death: let him be stoned by all the people outside the tent-circle.

36. సర్వసమాజము పాళెము వెలుపల రాళ్లతో వాని కొట్టి చంపవలెనని మోషేతో చెప్పెను. కాబట్టి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సర్వ సమాజము పాళెము వెలుపలికి వాని తీసికొనిపోయి రాళ్లతో వాని చావగొట్టెను.

36. So all the people took him outside the tent-circle and he was stoned to death there, as the Lord gave orders to Moses.

37. మరియయెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను

37. And the Lord said to Moses,

38. నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము. వారు తమ తర తరములకు తమ బట్టల అంచులకు కుచ్చులు చేసికొని అంచుల కుచ్చులమీద నీలిసూత్రము తగిలింపవలెను.
మత్తయి 23:5

38. Say to the children of Israel that through all their generations they are to put on the edges of their robes an ornament of twisted threads, and in every ornament a blue cord;

39. మీరు నా ఆజ్ఞలన్నిటిని జ్ఞాపకముచేసికొని మీ దేవునికి ప్రతిష్ఠితులైయుండునట్లు మునుపటివలె కోరినవాటిని బట్టియు చూచినవాటినిబట్టియు వ్యభిచరింపక,
మత్తయి 23:5

39. So that, looking on these ornaments, you may keep in mind the orders of the Lord and do them; and not be guided by the desires of your hearts and eyes, through which you have been untrue to me:

40. దాని చూచి యెహోవా ఆజ్ఞలన్నిటిని జ్ఞాపకముచేసికొని వాటి ననుసరించుటకే అది మీకు కుచ్చుగానుండును.

40. And that you may keep in mind all my orders and do them and be holy to your God.

41. నేను మీకు దేవుడనై యుండునట్లుగా ఐగుప్తుదేశములోనుండి మిమ్మును రప్పించిన మీ దేవుడనైన యెహోవాను; మీ దేవుడనైన యెహోవాను నేనే.

41. I am the Lord your God, who took you out of the land of Egypt, so that I might be your God: I am the Lord your God.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Numbers - సంఖ్యాకాండము 15 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible
మాంసం-అర్పణ మరియు పానీయం-అర్పణ యొక్క చట్టం అదే చట్టం ప్రకారం అపరిచితుడు. (1-21) 
మాంసాహారం మరియు పానీయాలను బలిగా ఎలా సమర్పించాలో దేవుడు సూచనలను ఇచ్చాడు. ఈ బలులు దేవుని బల్లకి ఆహారం లాంటివి, కాబట్టి ఎల్లప్పుడూ తగినంత రొట్టె, నూనె మరియు ద్రాక్షారసాన్ని కలిగి ఉండటం ముఖ్యం. ఈ చట్టం ప్రతి వస్తువు ఎంత అందించాలో చెబుతుంది. మీరు ఆ దేశానికి చెందిన వారైనా లేదా అపరిచితుడైనా పర్వాలేదు, ప్రతి ఒక్కరూ ఈ నియమాలను పాటించాలి. ఈ చట్టం కూడా ఏదో ఒక రోజు అసలు ఆ దేశంలో లేని వ్యక్తులు దేవుని కుటుంబంలోకి స్వాగతించబడతారని చూపించింది. యేసు వచ్చినప్పుడు, దేవుని కుటుంబంలో అందరికీ స్వాగతం అని మరింత స్పష్టంగా చెప్పాడు. 

అజ్ఞానం యొక్క పాపం కోసం త్యాగం. (22-29) 
తప్పు అని మీకు తెలియకపోతే, మీకు తెలిసినంత ఇబ్బంది పడదు. కానీ మీరు ఏమి చేయాలో మీకు తెలిసి మరియు చేయకపోతే, మీరు ఇప్పటికీ బాధ్యత వహిస్తారు. చాలా కాలం క్రితం, డేవిడ్ అనే వ్యక్తి తనకు తెలియకుండా తప్పు చేసినందుకు క్షమించమని దేవుణ్ణి అడిగాడు. మన పాపాలన్నిటినీ క్షమించడానికి యేసు సిలువపై మరణించాడు, మనం తప్పు చేస్తున్నామని మనకు తెలియని వాటిని కూడా. ఇది ఒక నిర్దిష్ట వర్గానికి మాత్రమే కాకుండా అందరికీ శుభవార్త. 

అహంకారం యొక్క శిక్ష సబ్బాత్-బ్రేకర్ రాళ్లతో కొట్టాడు. (30-36) 
కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా దేవునికి అవిధేయతను ఎంచుకుని, ఆయన కోరుకున్నదానికి విరుద్ధంగా పనులు చేస్తారు. ఇది చాలా తప్పు మరియు దేవునికి అగౌరవం. ఎవరైనా ఇలా చేసినప్పుడు, వారు దేవుని నియమాలను పాటించరు మరియు ఆయనను అగౌరవపరుస్తారు. ఎవరైనా దేవుని నియమాల కంటే తాము గొప్పవారని భావించినప్పుడు మరియు వాటిని అనుసరించడానికి ఇష్టపడనప్పుడు ఇది చాలా చెడ్డది. సబ్బాత్ అని పిలువబడే ప్రత్యేక రోజున విశ్రాంతి తీసుకోవాలనే నియమాన్ని ప్రజలు ఉల్లంఘించడం దీనికి ఒక ఉదాహరణ. ముందురోజు ఆహారాన్ని సిద్ధం చేయకుండా నిప్పు పెట్టడానికి కర్రలను సేకరించడం ద్వారా వారు దీన్ని చేశారు. ఇది దేవునికి మరియు ఆయన నియమాలకు అగౌరవంగా ఉంది. దేవుడు నిజంగా సబ్బాత్ అని పిలువబడే తన ప్రత్యేక దినాన్ని విలువైనదిగా భావిస్తాడు మరియు ప్రజలు దానిని గౌరవంగా చూడనప్పుడు కలత చెందుతాడు. తన కోసం సమయం కేటాయించడం ఎంత ముఖ్యమో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. ఎవరైనా ఈ నియమాన్ని ఉల్లంఘిస్తే, మరింత జాగ్రత్తగా ఉండమని ఇతరులకు హెచ్చరికగా దేవుడు వారిని శిక్షిస్తాడు. ఈ ప్రత్యేకమైన రోజు కోసం అడిగే హక్కు దేవునికి ఉంది మరియు విభేదించే ఎవరైనా సత్యాన్ని వినరు. తప్పుడు విషయాలపై సమయం మరియు డబ్బు వృధా చేయడం మంచిది కాదు, ఎందుకంటే ఇది చెడు పరిణామాలకు దారి తీస్తుంది. 

వస్త్రంపై అంచుల చట్టం. (37-41)
దేవుడు యూదు ప్రజలకు వారి బట్టల అంచులపై ప్రత్యేక తీగలను వేయమని చెప్పాడు. ఇది వారి చుట్టూ ఉన్న వ్యక్తుల నుండి భిన్నంగా కనిపించింది మరియు దేవుని నియమాలను పాటించమని వారికి గుర్తు చేసింది. తీగలు కేవలం అలంకరణ కోసం మాత్రమే కాదు, యూదులుగా ఉన్నందుకు గర్వపడటానికి మరియు దేవుని బోధలను గుర్తుంచుకోవడానికి వారికి సహాయపడతాయి. 2 పేతురు 3:1 ఎవరైనా ఏదైనా తప్పు చేయాలనుకుంటే, వారి బట్టలపై ఉన్న అంచు దేవుని నియమాలను ఉల్లంఘించకూడదని వారికి గుర్తు చేస్తుంది. మనం ఎల్లప్పుడూ దేవుని బోధలను గుర్తుచేసుకుంటూ ఉండాలి, తద్వారా మనం దృఢంగా ఉండగలము మరియు ప్రలోభాలకు గురికాకుండా ఉండగలము. మనం మంచిగా మరియు దేవునికి నిజంగా అంకితభావంతో ఉండాలి. దేవుడు తన నియమాలు ఎందుకు ప్రాముఖ్యమో మనకు చాలాసార్లు గుర్తుచేస్తాడు. 



Shortcut Links
సంఖ్యాకాండము - Numbers : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |