Numbers - సంఖ్యాకాండము 1 | View All

1. వారు ఐగుప్తుదేశము నుండి బయలువెళ్లిన రెండవ సంవత్సరము రెండవ నెల మొదటి తేదిని, సీనాయి అరణ్య మందలి ప్రత్యక్షపు గుడారములో యెహోవా మోషేతో ఇట్లనెను

1. THE LORD spoke to Moses in the Wilderness of Sinai in the Tent of Meeting on the first day of the second month in the second year after they came out of the land of Egypt, saying,

2. ఇశ్రాయేలీయుల వంశముల చొప్పున వారి వారి పితరుల కుటుంబములనుబట్టి వారి వారి పెద్దల చొప్పున మగవారినందరిని లెక్కించి సర్వసమాజ సంఖ్యను వ్రాయించుము.

2. Take a census of all the males of the congregation of the Israelites by families, by their fathers' houses, according to the number of names, head by head.

3. ఇశ్రాయేలీయులలో సైన్యముగా వెళ్లు వారిని, అనగా ఇరువది యేండ్లు మొదలుకొని పైప్రాయముగల వారిని, తమ తమ సేనలనుబట్టి నీవును అహరోనును లెక్కింపవలెను.

3. From twenty years old and upward, all in Israel who are able to go forth to war you and Aaron shall number, company by company.

4. మరియు ప్రతి గోత్రములో ఒకడు, అనగా తన పితరుల కుటుంబములో ముఖ్యుడు, మీతోకూడ ఉండవలెను.

4. And with you there shall be a man [to assist you] from each tribe, each being the head of his father's house.

5. మీతో కూడ ఉండవలసిన వారి పేళ్లు ఏవేవనగా రూబేను గోత్రములో షెదేయూరు కుమారుడైన ఏలీసూరు;

5. And these are the names of the men who shall attend you: Of Reuben, Elizur son of Shedeur;

6. షిమ్యోను గోత్రములో సూరీషద్దాయి కుమారుడైన షెలుమీయేలు

6. Of Simeon, Shelumiel son of Zurishaddai;

7. యూదా గోత్రములో అమ్మినాదాబు కుమారుడైన నయస్సోను

7. Of Judah, Nahshon son of Amminadab;

8. ఇశ్శాఖారు గోత్రములో సూయారు కుమారుడైన నెతనేలు

8. Of Issachar, Nethanel son of Zuar;

9. జెబూలూను గోత్రములో హేలోను కుమారుడైన ఏలీయాబు

9. Of Zebulun, Eliab son of Helon;

10. యోసేపు సంతానమందు, అనగా ఎఫ్రాయిము గోత్రములో అమీహూదు కుమారుడైన ఎలీషామాయు; మనష్షే గోత్రములో పెదాసూరు కుమారుడైన గమలీయేలు

10. Of the sons of Joseph: of Ephraim, Elishama son of Ammihud; of Manasseh, Gamaliel son of Pedahzur;

11. బెన్యామీను గోత్రములో గిద్యోనీ కుమారుడైన అబీదాను

11. Of Benjamin, Abidan son of Gideoni;

12. దాను గోత్రములో ఆమీషద్దాయి కుమారుడైన అహీయెజెరు

12. Of Dan, Ahiezer son of Ammishaddai;

13. ఆషేరు గోత్రములో ఒక్రాను కుమారుడైన పగీయేలు

13. Of Asher, Pagiel son of Ochran;

14. గాదు గోత్రములో దెయూవేలు కుమారుడైన ఎలాసాపు

14. Of Gad, Eliasaph son of Deuel;

15. నఫ్తాలి గోత్రములో ఏనాను కుమారుడైన అహీర అనునవి.

15. Of Naphtali, Ahira son of Enan.

16. వీరు సమాజములో పేరు పొందినవారు. వీరు తమ తమ పితరుల గోత్రములలో ప్రధానులు ఇశ్రాయేలీయుల కుటుంబములకు పెద్దలును.

16. These were those chosen from the congregation, the leaders of their ancestral tribes, heads of thousands [the highest class of officers] in Israel.

17. పేళ్ల చేత వివరింపబడిన ఆ మనుష్యులను మోషే అహ రోనులు పిలుచుకొని రెండవ నెల మొదటి తేదిని సర్వ సమాజమును కూర్చెను.

17. And Moses and Aaron took these men who have been named,

18. ఇరువది ఏండ్లు మొదలుకొని పై ప్రాయముగలవారు తమ తమ వంశావళులను బట్టి తమ తమ వంశములను తమ తమ పితరుల కుటుంబ ములను తమ తమ పెద్దల సంఖ్యను తెలియచెప్పగా

18. And assembled all the congregation on the first day of the second month, and they declared their ancestry after their families, by their fathers' houses, according to the number of names from twenty years old and upward, head by head,

19. యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు సీనాయి అరణ్యములో మోషే వారిని లెక్కించెను.

19. As the Lord commanded Moses. So he numbered them in the Wilderness of Sinai.

20. ఇశ్రాయేలు ప్రథమ కుమారుడైన రూబేను పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది యేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి సంఖ్యను తెలియ చెప్పగా రూబేను గోత్రములో లెక్కింపబడిన వారు నలుబది యారువేల ఐదువందలమంది యైరి.

20. The sons of Reuben, Israel's firstborn, their generations, by their families, by their fathers' houses, according to the number of names, head by head, every male from twenty years old and upward, all who were able to go to war:

21. షిమ్యోను పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువదియేండ్లు

21. Those of the tribe of Reuben numbered 46,500.

22. మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి పెద్దల సంఖ్యను తెలియచెప్పగా

22. Of the sons of Simeon, their generations, by their families, by their fathers' houses, those numbered of them according to the number of names, head by head, every male from twenty years old and upward, all who were able to go to war:

23. షిమ్యోను గోత్రములో లెక్కింపబడినవారు ఏబది తొమ్మిదివేల మూడు వందలమంది యైరి.

23. Those of the tribe of Simeon numbered 59,300.

24. గాదు పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది యేండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి సంఖ్యను తెలియచెప్పగా

24. Of the sons of Gad, their generations, by their families, by their fathers' houses, according to the number of names, from twenty years old and upward, all who were able to go to war:

25. గాదు గోత్రములో లెక్కింపబడినవారు నలుబది యయిదువేల ఆరువందల ఏబదిమంది యైరి.

25. Those of the tribe of Gad numbered 45,650.

26. యూదా పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది యేండ్లు మొదలు కొని పైప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి సంఖ్యను తెలియచెప్పగా

26. Of the sons of Judah, their generations, by their families, by their fathers' houses, according to the number of names, from twenty years old and upward, all able to go to war:

27. యూదా గోత్రములో లెక్కింపబడిన వారు డెబ్బది నాలుగువేల ఆరువందలమంది యైరి.

27. Those of the tribe of Judah numbered 74,600.

28. ఇశ్శాఖారు పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది యేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి సంఖ్యను తెలియచెప్పగా

28. Of the sons of Issachar, their generations, by their families, by their fathers' houses, according to the number of names, from twenty years old and upward, all able to go to war:

29. ఇశ్శాఖారు గోత్రములో లెక్కింపబడిన వారు ఏబది నాలుగువేల నాలుగువందల మంది యైరి.

29. Those of the tribe of Issachar numbered 54,400.

30. జెబూలూను పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువదియేండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి సంఖ్యను తెలియచెప్పగా

30. Of the sons of Zebulun, their generations, by their families, by their fathers' houses, according to the number of names, from twenty years old and upward, all able to go to war:

31. జెబూలూను గోత్రములో లెక్కింపబడిన వారు ఏబది యేడువేల నాలుగువందల మంది యైరి.

31. Those of the tribe of Zebulun numbered 57,400.

32. యోసేపు పుత్రుల వంశావళి, అనగా ఎఫ్రాయిము పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది యేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లు వారందరి సంఖ్యను తెలియచెప్పగా

32. Of the sons of Joseph: the sons of Ephraim, their generations, by their families, by their fathers' houses, according to the number of names, from twenty years old and upward, all able to go to war:

33. యోసేపు గోత్రములో లెక్కింపబడిన వారు నలుబదివేల ఐదువందల మంది యైరి.

33. Those of the tribe of Ephraim numbered 40,500.

34. మనష్షే పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది యేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి సంఖ్యను తెలియచెప్పగా

34. Of the sons of Manasseh, their generations, by their families, by their fathers' houses, according to the number of names, from twenty years old and upward, all able to go to war:

35. మనష్షే గోత్రములో లెక్కింప బడినవారు ముప్పది రెండువేల రెండు వందల మంది యైరి.

35. Those of the tribe of Manasseh numbered 32,200.

36. బెన్యామీను పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువదియేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి సంఖ్యను తెలియచెప్పగా

36. Of the sons of Benjamin, their generations, by their families, by their fathers' houses, according to the number of names, from twenty years old and upward, all able to go to war:

37. బెన్యామీను గోత్రములో లెక్కింపబడిన వారు ముప్పది యైదువేల నాలుగువందల మంది యైరి.

37. Those of the tribe of Benjamin numbered 35,400.

38. దాను పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది యేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లు వారందరి సంఖ్యను తెలియచెప్పగా

38. Of the sons of Dan, their generations, by their families, by their fathers' houses, according to the number of names, from twenty years old and upward, all able to go to war:

39. దానుగోత్రములో లెక్కింప బడినవారు అరువది రెండువేల ఏడువందల మంది యైరి.

39. Those of the tribe of Dan numbered 62,700.

40. ఆషేరు పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువదియేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి సంఖ్యను తెలియచెప్పగా

40. Of the sons of Asher, their generations, by their families, by their fathers' houses, according to the number of names, from twenty years old and upward, all able to go to war:

41. ఆషేరు గోత్రములో లెక్కింప బడినవారు నలువది యొకవేయి ఐదువందలమంది యైరి.

41. Those of the tribe of Asher numbered 41,500.

42. నఫ్తాలి పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది యేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి సంఖ్యను తెలియచెప్పగా

42. Of the sons of Naphtali, their generations, by their families, by their fathers' houses, according to the number of names, from twenty years old and upward, all able to go to war:

43. నఫ్తాలి గోత్రములో లెక్కింప బడినవారు ఏబది మూడువేల నాలుగువందలమంది యైరి.

43. Those of the tribe of Naphtali numbered 53,400.

44. వీరు లెక్కింపబడినవారు, అనగా మోషేయు అహ రోనును తమ తమ పితరుల కుటుంబములనుబట్టి ఒక్కొక్క డుగా ఏర్పడిన ప్రధానులును లెక్కించిన వారు.

44. These were numbered by Moses and Aaron, and the leaders of Israel, twelve men, each representing his father's house.

45. అట్లు ఇశ్రాయేలీయులలో తమ తమ పితరుల కుటుంబముల చొప్పున లెక్కింపబడిన వారందరు, అనగా ఇరువది యేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా బయలు వెళ్లిన ఇశ్రాయేలీయులందరు

45. So all those numbered of the Israelites, by their fathers' houses, from twenty years old and upward, able to go to war in Israel,

46. లెక్కింపబడి ఆరులక్షల మూడువేల ఐదువందల ఏబదిమంది యైరి.

46. All who were numbered were 603,550.

47. అయితే లేవీయులు తమ పితరుల గోత్రము చొప్పున వారితో పాటు లెక్కింపబడలేదు.

47. But the Levites by their fathers' tribe were not numbered with them.

48. ఏలయనగా యెహోవా మోషేతో ఈలాగు సెలవిచ్చియుండెను నీవు లేవీ గోత్రమును లెక్కింపకూడదు.

48. For the Lord had said to Moses,

49. ఇశ్రాయేలీ యుల మొత్తమునకు వారి మొత్తమును చేర్చకూడదు.

49. Only the tribe of Levi you shall not number in the census of the Israelites.

50. నీవు సాక్ష్యపు గుడారము మీదను దాని ఉపకరణము లన్నిటిమీదను దానిలో చేరిన వాటన్నిటి మీదను లేవీయులను నియమింపుము. వారే మందిరమును దాని ఉపకర ణములన్నిటిని మోయవలెను. వారు మందిరపు సేవ చేయుచు దానిచుట్టు దిగవలసిన వారై యుందురు.
అపో. కార్యములు 7:44, ప్రకటన గ్రంథం 15:5

50. But appoint the Levites over the tabernacle of the Testimony, and over all its vessels and furnishings and all things that belong to it. They shall carry the tabernacle [when journeying] and all its furnishings, and they shall minister to it and encamp around it.

51. మందిరము సాగబోవునప్పుడు లేవీయులే దాని విప్పవలెను, మందిరము దిగునప్పుడు లేవీయులే దాని వేయవలెను. అన్యుడు సమీపించిన యెడల వాడు మరణశిక్ష నొందును.

51. When the tabernacle is to go forward, the Levites shall take it down, and when the tabernacle is to be pitched, the Levites shall set it up. And the excluded [any not of the tribe of Levi] who approach the tabernacle shall be put to death.

52. ఇశ్రాయేలీయులు తమ తమ సేనల చొప్పున ప్రతివాడును తన తన పాళెములో తన తన ధ్వజము నొద్ద దిగవలెను.

52. The Israelites shall pitch their tents by their companies, every man by his own camp and every man by his own [tribal] standard.

53. ఇశ్రాయేలీయుల సమాజముమీద కోపము రాకుండునట్లు లేవీయులు సాక్ష్యపు గుడారము చుట్టు దిగవలెను; వారు సాక్ష్యపు గుడారమును కాపాడవలెను.

53. But the Levites shall encamp around the tabernacle of the Testimony, that there may be no wrath upon the congregation of the Israelites; and the Levites shall keep charge of the tabernacle of the Testimony.

54. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన వాటన్నిటిని తప్పకుండ ఇశ్రాయేలీయులు చేసిరి.

54. Thus did the Israelites; according to all that the Lord commanded Moses, so they did.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Numbers - సంఖ్యాకాండము 1 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible
ఇశ్రాయేలీయుల సంఖ్య. (1-43) 
ఎంతమంది ఉన్నారో చూడడానికి మరియు వారు యుద్ధాలకు సిద్ధంగా ఉన్నారని నిర్ధారించుకోవడానికి మరియు భూమిని విభజించడానికి దేవుడు ప్రజలను లెక్కించాడు. ఆ సమయంలో వారికి శత్రువులు లేకపోయినా, భవిష్యత్తులో జరిగే యుద్ధాలకు వారు సిద్ధంగా ఉండాలి. ప్రతిదీ శాంతియుతంగా కనిపించినప్పటికీ, మన జీవితంలో చెడు విషయాలతో పోరాడటానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని ఇది మనకు బోధిస్తుంది. 

ప్రజల సంఖ్య. (44-46) 
అరణ్యంలో జీవించడానికి అవసరమైన ప్రతిదీ ఇది. దేవుడు వారికి ప్రతిరోజు కావలసినవన్నీ ఉండేలా చూసుకున్నాడు. దేవుడు తన వాగ్దానాలను ఎలా నిలబెట్టుకుంటాడో మనం చూసినప్పుడు, అది అసాధ్యమని అనిపించినప్పుడు కూడా, తన అనుచరుల కోసం ఆయన ఇంకా ప్లాన్ చేసిన విషయాల పట్ల మనకు నిరీక్షణనిస్తుంది. 

మిగిలిన వారితో లేవీయులు లెక్కించబడలేదు. (47-54)
ప్రత్యేక గుడారాన్ని మరియు దాని ముఖ్యమైన వస్తువులను చూసుకునే ప్రజలను లేవీయులు అని పిలుస్తారు. బంగారు దూడతో అవతలి వ్యక్తులు తప్పు చేసినప్పుడు వారు గొప్ప పని చేసారు కాబట్టి వారు చాలా ప్రత్యేకంగా ఉన్నారు. లేవీయులు మాత్రమే ప్రత్యేక వస్తువులను తాకడం మరియు చూడడం చాలా ముఖ్యం ఎందుకంటే వారు వాటిని జాగ్రత్తగా చూసుకోవడానికి దేవుడు ఎన్నుకున్నారు. మనం యేసును తెలుసుకునే ముందు, మనం దేవునితో స్నేహం చేయలేము. కానీ మనం యేసును విశ్వసించి, ఆయన కుటుంబంలో భాగమైనప్పుడు, మనం దేవునికి ప్రత్యేక సహాయకులుగా లేదా పూజారులుగా ఉంటాము. దేవునికి కోపం తెప్పించే పనులు చేయకుండా జాగ్రత్తపడాలి, ఎందుకంటే అది మంచిది కాదు. మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాము మరియు ఆయన చెప్పినట్లే చేయాలని కోరుకుంటున్నాము కాబట్టి మనం ఇతరులకు భిన్నంగా ఉంటాము. మనం దేవునికి సంబంధించిన ముఖ్యమైన విషయాలలో సహాయం చేస్తే, మనం పట్టింపు లేని దైనందిన విషయాలలో ఎక్కువగా మునిగిపోకూడదు. మరియు దేవుడు మనం ఏమి చేయాలనుకుంటున్నామో అదే చేయడానికి మనం ఎల్లప్పుడూ ప్రయత్నించాలి. 



Shortcut Links
సంఖ్యాకాండము - Numbers : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |