దేవుడు ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు. బేత్‌లెహేం గ్రామం ఉన్న ప్రాంతం ఎఫ్రాతా – రూతు 1:2; రూతు 4:11; 1 సమూయేలు 17:12. బేత్‌లెహేం జెరుసలంకు 10 కి.మీ. దక్షిణంగా ఉన్న గ్రామం.
“పరిపాలించబోయేవాడు”– ఇది ఆయన కార్యకలాపాల గురించి చెప్తున్నది. ఈ భవిష్యద్వాక్కు అభిషిక్తుడైన యేసుక్రీస్తును గురించినది. ఆయన ఈ లోకానికి రాకముందు 700 సంవత్సరాలకు పూర్వమే, మానవుడుగా ఆయన జన్మ స్థలాన్ని తెలియజేస్తున్నది. మత్తయి 2:4-6 చూడండి. దేవుని కుమారుడుగా ఆయన శాశ్వతుడు. ఉత్పత్తి, ఆరంభం అంటూ ఆయనకు లేవు – యెషయా 9:6; కీర్తనల గ్రంథము 90:2; యోహాను 1:1. మానవ చరిత్ర అంతటిలోనూ ఆయన తన చర్యలు జరిగిస్తూనే ఉన్నాడు.