“మోయాబు”– మృత సముద్రానికి తూర్పుగా, ఎదోంకు ఉత్తరంగా, అమ్మోనుకు దక్షిణంగా ఉన్న దేశం. దీన్ని గురించిన ఇతర ప్రవచనాలు యెషయా 15:1-9 యెషయా 16:14; యిర్మీయా 48వ అధ్యాయం; యెహెఙ్కేలు 25:8-11; జెఫన్యా 2:8-11.
“కాల్చి”– ఆ కాలం సాంప్రదాయంబట్టి ఇది దుర్మార్గం. మోయాబు చేసిన పాపం ఇదొక్కటే కాదు గాని ఇతర జనాల పట్ల అది చూపిన ద్వేషం, తిరస్కారాలకు ఒక మచ్చు తునక.