Leviticus - లేవీయకాండము 6 | View All

1. మరియయెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను

1. ADONAI said to Moshe,

2. ఒకడు యెహోవాకు విరోధముగా ద్రోహముచేసి పాపియైనయెడల, అనగా తనకు అప్పగింపబడినదాని గూర్చియేగాని తాకట్టు ఉంచినదాని గూర్చియేగాని, దోచుకొనినదాని గూర్చియేగాని, తన పొరుగువానితో బొంకినయెడలనేమి, తన పొరుగువాని బలాత్కరించిన యెడలనేమి

2. 'Give this order to Aharon and his sons: 'This is the law for the burnt offering : it is what goes up on its firewood upon the altar all night long, until morning; in this way the fire of the altar will be kept burning.

3. పోయినది తనకు దొరికినప్పుడు దానిగూర్చి బొంకినయెడల నేమి, మనుష్యులు వేటిని చేసి పాపులగుదురో వాటన్నిటిలో దేనివిషయమైనను అబద్ధప్రమాణము చేసినయెడల నేమి,

3. When the fire has consumed the burnt offering on the altar, the [cohen], having put on his linen garment and covered himself with his linen shorts, is to remove the ashes and put them beside the altar.

4. అతడు పాపముచేసి అపరాధియగును గనుక అతడు తాను దోచుకొనిన సొమ్మునుగూర్చి గాని బలాత్కారముచేతను అపహరించినదానిగూర్చిగాని తనకు అప్పగింపబడినదానిగూర్చిగాని, పోయి తనకు దొరికినదానిగూర్చిగాని, దేనిగూర్చియైతే తాను అబద్ధప్రమా ణము చేసెనో దానినంతయు మరల ఇచ్చుకొనవలెను.

4. Then he is to remove those garments and put on others, before carrying the ashes outside the camp to a clean place.

5. ఆ మూల ధనము నిచ్చుకొని, దానితో దానిలో అయిదవ వంతును తాను అపరాధ పరిహారార్థబలి అర్పించు దినమున సొత్తుదారునికి ఇచ్చుకొనవలెను.

5. In this way, the fire on the altar will be kept burning and not be allowed to go out. Each morning, the [cohen] is to kindle wood on it, arrange the burnt offering and make the fat of the peace offerings go up in smoke.

6. అతడు యెహోవాకు తన అపరాధ విషయములో నీవు ఏర్పరచు వెలకు మందలో నుండి నిర్దోషమైన పొట్టేలును యాజకునియొద్దకు తీసికొని రావలెను.

6. Fire is to be kept burning on the altar continually; it is not to go out.

7. ఆ యాజకుడు యెహోవా సన్నిధిని అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతడు అపరాధి యగునట్లు తాను చేసిన వాటన్నిటిలో ప్రతిదాని విషయమై అతనికి క్షమాపణ కలుగును.

7. 'This is the law for the grain offering: the sons of Aharon are to offer it before ADONAI in front of the altar.

8. మరియయెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను

8. He is to take from the grain offering a handful of its fine flour, some of its olive oil and all of the frankincense which is on the grain offering; and he is to make this reminder portion of it go up in smoke on the altar as a fragrant aroma for ADONAI.

9. నీవు అహరోనుతోను అతని కుమారులతోను ఇట్లనుము ఇది దహనబలినిగూర్చిన విధి. దహనబలిద్రవ్యము ఉదయమువరకు రాత్రి అంతయు బలిపీఠముమీద దహించు చుండును; బలిపీఠముమీది అగ్ని దానిని దహించు చుండును.

9. The rest of it Aharon and his sons are to eat; it is to be eaten without leaven in a holy place- they are to eat it in the courtyard of the tent of meeting.

10. యాజకుడు తన సన్ననార నిలువుటంగీని తొడుగుకొని తన మానమునకు తన నారలాగును తొడుగు కొని బలిపీఠముమీద అగ్ని దహించు దహనబలిద్రవ్యపు బూడిదెను ఎత్తి బలిపీఠమునొద్ద దానిని పోసి

10. It is not to be baked with leaven. I have given it as their portion of my offerings made by fire; like the sin offering and the guilt offering, it is especially holy.

11. తన వస్త్రములను తీసి వేరు వస్త్రములను ధరించుకొని పాళెము వెలుపలనున్న పవిత్రస్థలమునకు ఆ బూడిదెను తీసికొనిపోవలెను.

11. Every male descendant of Aharon may eat from it; it is his share of the offerings for ADONAI made by fire forever through all your generations. Whatever touches those offerings will become holy.''

12. బలిపీఠముమీద అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. ప్రతి ఉదయమున యాజకుడు దాని మీద కట్టెలువేసి, దానిమీద దహనబలిద్రవ్యమును ఉంచి, సమాధానబలియగు పశువు క్రొవ్వును దహింపవలెను.

12. ADONAI said to Moshe,

13. బలిపీఠముమీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు.

13. 'This is the offering for ADONAI that Aharon and his sons are to offer on the day he is anointed: two quarts of fine flour, half of it in the morning and half in the evening, as a grain offering from then on.

14. నైవేద్యమునుగూర్చిన విధి యేదనగా, అహరోను కుమారులు యెహోవా సన్నిధిని బలిపీఠము నెదుట దానిని నర్పించవలెను.

14. It is to be well mixed with olive oil and fried on a griddle; then bring it in, break it in pieces and offer the grain offering as a fragrant aroma for ADONAI.

15. అతడు నైవేద్యతైలమునుండియు దాని గోధుమపిండినుండియు చేరెడు పిండిని నూనెను, దాని సాంబ్రాణి యావత్తును దాని లోనుండి తీసి జ్ఞాపక సూచనగాను వాటిని బలిపీఠముమీద యెహోవాకు ఇంపైన సువాసనగాను దహింపవలెను.

15. The anointed [cohen] who will take Aharon's place from among his descendants will offer it; it is a perpetual obligation. It must be entirely made to go up in smoke for ADONAI;

16. దానిలో మిగిలిన దానిని అహరోనును అతని సంతతివారును తినవలెను. అది పులియనిదిగా పరి శుద్ధస్థలములో తినవలెను. వారు ప్రత్యక్షపు గుడారము యొక్క ఆవరణములో దానిని తినవలెను;
1 కోరింథీయులకు 9:13

16. every grain offering of the [cohen] is to be entirely made to go up in smoke- it is not to be eaten.'

17. దాని పులియబెట్టి కాల్చవలదు; నా హోమ ద్రవ్యములలో వారికి పాలుగా దాని నిచ్చియున్నాను. పాపపరిహారార్థబలివలెను అపరాధపరిహారార్థబలివలెను అది అతిపరిశుద్ధము.

17. ADONAI said to Moshe,

18. అహరోను సంతతిలో ప్రతివాడును దానిని తినవలెను. ఇది యెహోవా హోమముల విషయ ములో మీ తరతరములకు నిత్యమైన కట్టడ. వాటికి తగిలిన ప్రతి వస్తువు పరిశుద్ధమగును.

18. 'Tell Aharon and his sons, 'This is the law for the sin offering: the sin offering is to be slaughtered before ADONAI in the place where the burnt offering is slaughtered; it is especially holy.

19. మరియయెహోవా మోషేకు ఈలాగు సెల విచ్చెను

19. The [cohen] who offers it for sin is to eat it- it is to be eaten in a holy place, in the courtyard of the tent of meeting.

20. అహరోనుకు అభిషేకముచేసిన దినమున, అతడును అతని సంతతివారును అర్పింపవలసిన అర్పణమేదనగా, ఉదయ మున సగము సాయంకాలమున సగము నిత్యమైన నైవేద్య ముగా తూమెడు గోధుమపిండిలో పదియవవంతు.

20. Whatever touches its flesh will become holy; if any of its blood splashes on any item of clothing, you are to wash it in a holy place.

21. పెనముమీద నూనెతో దానిని కాల్చవలెను; దానిని కాల్చినతరువాత దానిని తేవలెను. కాల్చిన నైవేద్యభాగములను యెహోవాకు ఇంపైన సువాసనగా అర్పింపవలెను.

21. The clay pot in which it is cooked must be broken; if it is cooked in a bronze pot, it must be scoured and rinsed in water.

22. అతని సంతతివారిలో అతనికి మారుగా అభిషే కము పొందిన యాజకుడు ఆలాగుననే అర్పింపవలెను. అది యెహోవా నియమించిన నిత్యమైన కట్టడ, అదంతయు దహింపవలెను.

22. Any male from a family of [cohanim] may eat the sin offering; it is especially holy.

23. యాజకుడు చేయు ప్రతి నైవేద్యము నిశ్శేషముగా ప్రేల్చబడవలెను; దాని తినవలదు.

23. But no sin offering which has had any of its blood brought into the tent of meeting to make atonement in the Holy Place is to be eaten; it is to be burned up completely.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Leviticus - లేవీయకాండము 6 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible
మన పొరుగువారిపై జరిగిన అతిక్రమణల గురించి. (1-7) 
మనం మన పొరుగువారికి ఏదైనా తప్పు చేసినప్పుడు, అది కూడా దేవునికి తప్పు చేసినట్లుగా పరిగణించబడుతుంది. మనం బాధపెట్టిన వ్యక్తి చాలా ముఖ్యమైనవాడు లేదా గౌరవించబడకపోయినా, అది దేవుణ్ణి బాధపెడుతుంది, ఎందుకంటే మనలాగే మన పొరుగువారిని ప్రేమించమని ఆయన ఆజ్ఞాపించాడు. ఈ నియమాన్ని ఉల్లంఘించడం దేవుని నుండి వచ్చిన చట్టాన్ని ఉల్లంఘించినట్లే. మనకు చెందని వాటిని తీసుకోవడం లేదా ఇతరులకు అబద్ధాలు చెప్పడం తప్పు. మనం దేవుని నుండి శిక్షను తప్పించుకోవాలనుకుంటే, మనం విషయాలను సరిదిద్దాలి మరియు యేసుక్రీస్తుపై మన విశ్వాసం ద్వారా క్షమాపణ కోసం అడగాలి. ఈ తప్పులు యేసు నిర్దేశించిన నియమాలకు విరుద్ధమైనవి, ఇందులో ప్రకృతి మరియు మోషే నిర్దేశించిన నియమాల వలె న్యాయంగా మరియు నిజాయితీగా ఉండటం కూడా ఉన్నాయి. 

దహనబలి గురించి. (8-13) 
ప్రతిరోజు పూజారి ఒక గొర్రెపిల్లను బలి ఇవ్వాలి. వారు బలిపీఠం మీద అగ్ని మండుతూ ఉండేలా చూసుకోవాలి. బలిపీఠం మీద మొదటి అగ్ని స్వర్గం నుండి పంపబడింది. Lev 9:24 మనం నిరంతరం దేవుని కోసం మంచి పనులు చేస్తూ ఉంటే, అది స్వర్గం నుండి వచ్చే అగ్ని మన మంచి పనులన్నింటినీ అంగీకరించినట్లే. మనం ఎల్లప్పుడూ మన చర్యలు మరియు ప్రార్థనల ద్వారా దేవుని పట్ల మనకున్న ప్రేమను చూపుతూ ఉండాలి. 

మాంసం-నైవేద్యం గురించి. (14-23) 
దేవుడు కొన్ని అర్పణలను పూర్తిగా కాల్చమని యాజకులకు చెప్పాడు, అది వారికి చాలా పని. వారు మాంసాన్ని కాకుండా చర్మాన్ని మాత్రమే ఉంచగలరు. కానీ ఇతర సమర్పణలతో, వారు తమ కోసం ఆహారాన్ని ఉంచుకోవచ్చు. పూజారులు తమ పనిని చేయడానికి అవసరమైన వాటిని కలిగి ఉండేలా చేయడానికి ఇది దేవుని మార్గం.

పాపపరిహారార్థ బలి గురించి. (24-30) 
గతంలో ఎవరైనా తప్పు చేసినప్పుడు, క్షమించమని దేవుడికి ప్రత్యేకంగా కానుకగా సమర్పించేవారు. ఆ బహుమతిలోని ఏదైనా ప్రత్యేకమైన రక్తం వారి బట్టలపైకి వస్తే, అది ముఖ్యమైనది కాబట్టి వారు దానిని చాలా జాగ్రత్తగా శుభ్రం చేయాలి. కానుక మట్టి కుండలో వండితే ఆ కుండను పగలగొట్టి పారేసేవారు. కానీ అది ఒక మెటల్ కుండలో వండినట్లయితే, బదులుగా వారు దానిని బాగా కడగవచ్చు. తప్పుడు పనులు చేయడం ఎంత చెడ్డదో మరియు విషయాలను సరిదిద్దడానికి మనకు సహాయం అవసరమని ఈ నియమాలు చూపించాయి. యేసు మనల్ని ఎంతగానో ప్రేమించాడు, మనం చేసిన చెడు పనులన్నింటిని భర్తీ చేయడానికి తనను తాను దేవునికి ఒక ప్రత్యేక బహుమతిగా సమర్పించుకున్నాడు. అతను ఏ తప్పు చేయలేదు, కానీ అతను ఇంకా మమ్మల్ని క్షమించి, తాజాగా ప్రారంభించడంలో సహాయం చేయాలనుకున్నాడు. రోమీయులకు 8:3 



Shortcut Links
లేవీయకాండము - Leviticus : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |