Leviticus - లేవీయకాండము 4 | View All

1. మరియయెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను

1. And the Lord spak to Moises, and seide, Speke thou to the sones of Israel,

2. నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేనివిషయమైనను ఎవరైన పొరబాటున చేయరాని కార్యములు చేసి పాపియైన యెడల, ఎట్లనగా

2. Whanne a soule hath do synne bi ignoraunce, and hath do ony thing of alle comaundementis `of the Lord, whiche he comaundide that tho schulen not be don; if a preest which is anoyntid,

3. ప్రజలు అపరాధులగునట్లు అభిషిక్తుడైన యాజకుడు పాపము చేసినయెడల, తాను చేసిన పాపమునకై నిర్దోషమైన కోడెదూడను యెహోవాకు పాపపరిహారార్థబలిగా అర్పింపవలెను.

3. hath do synne, makynge the puple to trespasse, he schal offre for his synne a calf without wem to the Lord.

4. అతడు ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునకు యెహోవా సన్నిధిని ఆ కోడెను తీసికొనివచ్చి కోడె తలమీద చెయ్యి ఉంచి యెహోవా సన్నిధిని కోడెను వధింపవలెను

4. And he schal brynge it to the dore of the tabernacle of witnessyng, bifor the Lord, and he schal sette hond on the heed therof, and he schal offre it to the Lord.

5. అభిషిక్తుడైన యాజకుడు ఆ కోడెదూడ రక్తములో కొంచెము తీసి ప్రత్యక్షపు గుడారమునకు దానిని తేవలెను.

5. And he schal take vp of the blood `of the calf, and schal brynge it in to the tabernacle of witnessyng.

6. ఆ యాజకుడు ఆ రక్తములో తన వ్రేలు ముంచి పరిశుద్ధ మందిరము యొక్క అడ్డ తెర యెదుట ఆ రక్తములో కొంచెము ఏడు మారులు యెహోవా సన్నిధిని ప్రోక్షింపవలెను.

6. And whanne he hath dippid the fyngir in to the blood, he schal sprenge it seuen sithis bifor the Lord, ayens the veil of the seyntuarie.

7. అప్పుడు యాజకుడు ప్రత్యక్షపు గుడారములో యెహోవా సన్నిధి నున్న సుగంధ ద్రవ్యముల ధూపవేదిక కొమ్ములమీద ఆ రక్తములో కొంచెము చమిరి ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునొద్దనున్న దహన బలిపీఠము అడుగున ఆ కోడె యొక్క రక్తశేషమంతయు పోయవలెను.

7. And he schal putte of the same blood on the corners of the auter of encense moost acceptable to the Lord, which auter is in the tabernacle of witnessyng; sotheli he schal schede al the `tother blood in to the foundement of the auter of brent sacrifice in the entryng of the tabernacle.

8. మరియు అతడు పాపపరిహారార్థబలిరూపమైన ఆ కోడె క్రొవ్వు అంతయు దానినుండి తీయవలెను. ఆంత్రములలోని క్రొవ్వును ఆంత్రములమీది క్రొవ్వంతటిని

8. And he schal offre for synne the ynnere fatnesse of the calf, as well it that hilith the entrails, as alle thingis that ben with ynne,

9. మూత్ర గ్రంథులను వాటిమీది డొక్కల పైనున్న క్రొవ్వును మూత్ర గ్రంథుల పైనున్న కాలేజముమీది వపను

9. twei litle reynes, and the calle, which is on tho bisidis ilion, and the fatnesse of the mawe,

10. సమాధాన బలియగు ఎద్దునుండి తీసినట్లు దీనినుండి తీయవలెను. యాజకుడు దహనబలిపీఠముమీద వాటిని ధూపము వేయవలెను.

10. with the litle reines, as it is offrid of the calf of the sacrifice of pesible thingis; and he schal brenne tho on the auter of brent sacrifice.

11. ఆ కోడెయొక్క శేషమంతయు, అనగా దాని చర్మము దాని మాంసమంతయు, దాని తల దాని కాళ్లు దాని ఆంత్రములు దాని పే

11. Sotheli he schal bere out of the castels the skyn, and alle the fleischis, with the heed, and feet, and entrails,

12. పాళెము వెలుపల, బూడిదెను పారపోయు పవిత్ర స్థలమునకు తీసికొనిపోయి అగ్నిలో కట్టెలమీద కాల్చివేయవలెను. బూడిదె పారపోయు చోట దానిని కాల్చివేయవలెను.

12. and dung, and the `residue bodi in to a clene place, where aischis ben wont to be sched out; and he schal brenne tho on the heep of trees, whiche schulen be brent in the place of aischis sched out.

13. ఇశ్రాయేలీయుల సమాజమంతయు పొరబాటున ఏ తప్పిదముచేసి, యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేనినైనను మీరి చేయరానిపని చేసి అపరాధులైనయెడల

13. That if al the cumpeny of the sones of Israel knowith not, and doith by vnkunnyng that that is ayens the comaundement of the Lord,

14. వారు ఆ యాజ్ఞకు విరోధముగా చేసిన ఆ పాపము తమకు తెలియబడునప్పుడు, సంఘము పాపపరిహారార్థ బలిగా ఒక కోడె దూడను అర్పించి ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునకు దానిని తీసికొని రావలెను.

14. and aftirward vndirstondith his synne, it schal offre a calf for synne, and it schal brynge the calf to the dore of the tabernacle.

15. సమాజముయొక్క పెద్దలు యెహోవా సన్నిధిని ఆ కోడెమీద తమ చేతులుంచిన తరువాత యెహోవా సన్నిధిని ఆ కోడెదూడను వధింపవలెను.

15. And the eldere men of the puple schulen sette hondis on the heed therof bifor the Lord; and whanne the calf is offrid in the siyt of the Lord,

16. అభిషిక్తుడైన యాజకుడు ఆ కోడె యొక్క రక్తములో కొంచెము ప్రత్యక్షపు గుడారములోనికి తీసికొని రావలెను.

16. the preest which is anoyntid schal bere ynne of his blood in to the tabernacle of witnessyng;

17. ఆ యాజకుడు ఆ రక్తములో తన వ్రేలు ముంచి అడ్డతెర వైపున యెహోవా సన్నిధిని ఏడుమారులు దాని ప్రోక్షింపవలెను.

17. and whanne the fyngur `is dippid, he schal sprenge seuen sithis ayens the veil.

18. మరియు అతడు దాని రక్తములో కొంచెము ప్రత్యక్షపు గుడారములో యెహోవా సన్నిధి నున్న బలిపీఠపు కొమ్ములమీద చమిరి ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునొద్దనున్న దహన బలిపీఠము అడుగున ఆ రక్తశేషమంతయు పోయవలెను.

18. And he schal putte of the same blood in the hornes of the auter, which is bifor the Lord in the tabernacle of witnessyng; sotheli he schal schede the `residue blood bisidis the foundement of the auter of brent sacrifice, which is in the dore of tabernacle of witnessyng.

19. మరియు అతడు దాని క్రొవ్వు అంతయు తీసి బలిపీఠము మీద దహింపవలెను.

19. And he schal take al the fatnesse therof, and schal brenne it on the auter;

20. అతడు పాపపరిహారార్థబలియగు కోడెను చేసినట్లు దీనిని చేయవలెను; అట్లే దీని చేయవలెను. యాజకుడు వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా వారికి క్షమాపణ కలుగును.

20. and so he schal do also of this calf, as he dide also bifor; and whanne the prest schal preye for hem, the Lord schal be merciful.

21. ఆ కోడెను పాళెము వెలుపలికి మోసికొనిపోయి ఆ మొదటి కోడెను కాల్చినట్లు కాల్చవలెను. ఇది సంఘమునకు పాపపరి హారార్థబలి.

21. Forsothe he schal bere out thilke calf, and schal brenne it, as also the formere calf, for it is for the synne of the multitude.

22. అధికారి పొరబాటున పాపముచేసి తన దేవుడైన యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేనినైనను మీరి చేయరాని పనులు చేసి అపరాధియైనయెడల

22. If the prince synneth, and doith bi ignoraunce o thing of many, which is forbodun in the lawe of the Lord,

23. అతడు ఏ పాపము చేసి పాపియాయెనో అది తనకు తెలియబడినయెడల, అతడు నిర్దోషమైన మగమేకపిల్లను అర్పణముగా తీసికొని వచ్చి

23. and aftirward vndirstondith his synne, he schal offre to the Lord a sacrifice, a `buk of geet, `that hath no wem;

24. ఆ మేకపిల్ల తలమీద చెయ్యి ఉంచి, దహనబలి పశువును వధించుచోట యెహోవా సన్నిధిని దానిని వధింపవలెను.

24. and he schal sette his hond on the heed therof. And whanne he hath offrid it in the place, where brent sacrifice is wont to be slayn, bifor the Lord, for it is for synne;

25. ఇది పాపపరిహారార్థ బలి. యాజకుడు పాపపరిహారార్థబలి పశురక్తములో కొంచెము తన వ్రేలితో తీసి, దహనబలిపీఠము కొమ్ముల మీద చమిరి, దాని రక్తశేషమును దహన బలిపీఠము అడుగున పోయవలెను.

25. the preest schal dippe the fyngur in the blood of sacrifice for synne, and he schal touche the corneris of the auter of brent sacrifice, and he schal schede the `residue blood at the foundement therof.

26. సమాధాన బలి పశువుయొక్క క్రొవ్వువలె దీని క్రొవ్వంతయు బలి పీఠముమీద దహింపవలెను. అట్లు యాజకుడు అతని పాప విషయములో అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును.

26. Sotheli the preest schal brenne the innere fatnesse aboue the auter, as it is wont to be doon in the sacrifice of pesible thingis, and the preest schal preye for hym, and for his synne, and it schal be foryouun to hym.

27. మీ దేశస్థులలో ఎవడైనను పొరబాటున పాపము చేసి చేయరాని పనుల విషయములో యెహోవా ఆజ్ఞలలో దేనినైనను మీరి అపరాధియైనయెడల

27. That if a soule of the puple of the lond synneth bi ignoraunce, that he do ony thing of these that ben forbodun in the lawe of the Lord, and trespassith,

28. తాను చేసినది పాపమని యొకవేళ తనకు తెలియబడిన యెడల, తాను చేసిన పాపము విషయమై నిర్దోషమైన ఆడు మేకపిల్లను అర్పణముగా తీసికొని వచ్చి

28. and knowith his synne, he schal offre a geet without wem;

29. పాపపరిహారార్థ బలి పశువుయొక్క తలమీద తన చెయ్యి ఉంచి, దహనబలి పశువులను వధించు స్థలమున దానిని వధింపవలెను.

29. and he schal sette hond on the heed of the sacrifice which is for synne, and he schal offre it in the place of brent sacrifice.

30. యాజకుడు దాని రక్తములో కొంచెము వ్రేలితో తీసి దహనబలిపీఠపు కొమ్ములమీద చమిరి, దాని రక్తశేషమును ఆ పీఠము అడుగున పోయవలెను.

30. And the preest schal take of the blood on his fyngur, and he schal touche the hornes of the auter of brent sacryfice, and he schal schede the residue at the foundement therof.

31. మరియు సమాధాన బలి పశువుయొక్క క్రొవ్వును తీసినట్లే దీని క్రొవ్వంతటిని తీయవలెను. యెహోవాకు ఇంపైన సువాసనగా యాజకుడు బలిపీఠముమీద దానిని దహింపవలెను. అట్లు యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును.

31. Sotheli he schal take a wei al the ynnere fatnesse, as it is wont to be don a wei of the sacrifices of pesible thingis, and he schal brenne it on the auter, in to odour of swetnesse to the Lord; and the preest schal preye for hym, and it schal be foryouun to hym.

32. ఎవడైనను పాపపరిహారార్థబలిగా అర్పించుటకు గొఱ్ఱెను తీసికొని వచ్చినయెడల నిర్దోషమైనదాని తీసి కొనివచ్చి

32. Sotheli if he offrith of litle beestis a sacrifice for synne, that is,

33. పాపపరిహారార్థబలియగు ఆ పశువు తలమీద చెయ్యి ఉంచి దహనబలి పశువులను వధించు చోటను పాపపరిహారార్థ బలియగు దానిని వధింపవలెను.

33. a scheep without wem, he schal putte the hond on the heed therof, and he schal offre it in the place where the beest of brent sacrifices ben wont to be slayn.

34. యాజకుడు పాపపరిహారార్థబలియగు పశువు రక్తములో కొంచెము తన వ్రేలితో తీసి దహనబలిపీఠపు కొమ్ములమీద చమిరి, ఆ పీఠము అడుగున ఆ రక్తశేషమంతయు పోయవలెను.

34. And the preest schal take of the blood therof in his fyngur, and he schal touche the hornes of the autir of brent sacrifice, and he schal schede the residue at the foundement therof.

35. మరియు సమాధానబలి పశువుయొక్క క్రొవ్వును తీసినట్లు దీని క్రొవ్వంతయు తీయవలెను. యాజకుడు యెహో వాకు అర్పించు హోమముల రీతిగా బలిపీఠముమీద వాటిని ధూపము వేయవలెను. అతడు చేసిన పాపము విషయమై యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును.

35. And he schal do awey al the ynnere fatnesse as the innere fatnesse of the ram which is offrid for pesible thingis, is wont to be don a wei, and he schal brenne it on the auter of encense of the Lord; and the preest schal preye for hym, and for his synne, and it schal be foryouun to hym.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Leviticus - లేవీయకాండము 4 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible
పూజారి కోసం అజ్ఞానం యొక్క పాప-బలి. (1-12) 
మన తప్పులను సరిచేసుకోవడానికి తనను తాను త్యాగం చేసి యేసు చేసిన మంచి పనికి మనం క్రెడిట్ తీసుకోవాలని దేవుడు కోరుకోడు. ఈ ఆలోచన యూదులకు కొన్ని విషయాలు నిజంగా ముఖ్యమైనవి మరియు చెడు విషయాలతో కలపకూడదని అర్థం చేసుకోవడానికి సహాయపడింది. వారు జంతువులను బలి ఇచ్చినప్పుడు అది ఎంత ప్రత్యేకమైనదో చూడటానికి కూడా వారికి సహాయపడింది. శాంతికి నాయకుడైన యేసు, సిలువపై మరణించినప్పుడు దేవునితో సమాధానమిచ్చాడు. ఆయన వల్లే ఆయనను విశ్వసించే వ్యక్తులు దేవునితో స్నేహంగా ఉండగలుగుతారు మరియు వారి హృదయాలలో శాంతిని కలిగి ఉంటారు. మనమందరం యేసులా శాంతియుతంగా ఉండేందుకు ప్రయత్నించాలి. యేసులా ఉండాలనుకునే ప్రతి ఒక్కరికీ దేవుడు చాలా ప్రేమ, దయ మరియు శాంతిని ప్రసాదిస్తాడని నేను ఆశిస్తున్నాను. చట్టం ప్రత్యేక పూజారి గురించి మాట్లాడుతుంది. అతి ముఖ్యమైన పూజారి కూడా తప్పులు చేయగలడు, కాబట్టి ఎవరూ పరిపూర్ణులు కాదు. పరిపూర్ణుడు అని చెప్పుకునే ఎవరైనా నమ్మదగినవారు కాదు. కథలో, వారు పశ్చాత్తాపానికి చిహ్నంగా ఒక చెడు విషయాన్ని కాల్చారు, అంటే మన చెడు చర్యలను కూడా వదిలించుకోవాలి. వారు కాల్చిన చెడును వదిలించుకున్నట్లుగా మన చెడు చర్యలను వదిలించుకోవాలి. హెబ్రీయులకు 13:11-13 

మొత్తం సమాజానికి. (13-21) 
నాయకులు తప్పు చేసి ప్రజలకు తప్పుడు పనులకు కారణమైతే, వాటిని సరిదిద్దడానికి మరియు అందరికీ భద్రత కల్పించడానికి ప్రత్యేక నైవేద్యాన్ని తీసుకురావాలి. వారు ఈ ప్రత్యేక బహుమతిని అందించినప్పుడు, వారు దానిని తాకి, తమ తప్పులకు చింతిస్తున్నారని చెప్పారు. దీని వలన జంతువు వారి తప్పులకు వ్యక్తులకు బదులుగా నింద పడుతుంది. నైవేద్యాన్ని పూర్తి చేసిన తర్వాత, వారి తప్పులు క్షమించబడతాయి. దేవునితో విషయాలను సరిదిద్దడం ద్వారా చర్చిలు మరియు రాజ్యాలను రక్షించడంలో యేసు సహాయం చేశాడు. 

ఒక పాలకుడికి. (22-26) 
తమ చర్యలకు ఇతరులను బాధ్యులను చేయగల అధికారంలో ఉన్న వ్యక్తులు కూడా ఉన్నత అధికారానికి సమాధానం చెప్పాలి. అత్యుత్తమ మరియు అత్యంత శక్తివంతమైన వ్యక్తులు కూడా తప్పులు చేస్తారు మరియు వారు ఏదైనా తప్పు చేసినప్పుడు అర్థం చేసుకోవడానికి సహాయం కావాలి. మనం ప్రతిరోజు దేవుని నుండి సహాయం కోసం అడగాలి, తద్వారా మనకు బాగా తెలియదు కాబట్టి మన తప్పులలో ఉండకూడదు. మన మనస్సాక్షి మరియు మన స్నేహితులు మనం తప్పు చేశామని చెప్పినప్పుడు వినడం చాలా ముఖ్యం. 

ప్రజలలో ఎవరికైనా. (27-35)
ఎవరైనా తనకు తెలియకుండా తప్పు చేస్తే, తప్పు చేయాలనే తపన వచ్చినప్పుడు ఏమి చేయాలో ఇది నియమం. యేసు మన పాపాల కోసం చనిపోయాడని మీరు నమ్మకపోతే శిక్ష నుండి తప్పించుకోవడానికి మీకు ఏమీ తెలియదని చెప్పడం సరిపోదు. చిన్న చిన్న పొరపాట్లు చేసే వ్యక్తులు కూడా దేవునితో విషయాలను సరిదిద్దడానికి త్యాగం చేయాలి. వారి తప్పులకు శిక్షించబడటానికి ఎవరూ చాలా ముఖ్యమైనవారు లేదా చాలా ముఖ్యమైనవారు కాదు. ప్రతి ఒక్కరూ తప్పులు చేస్తారు మరియు క్షమాపణ కోసం యేసును ఆశ్రయించవచ్చు. పాపపరిహారార్థబలి గురించిన ఈ చట్టాలు తప్పు చేయడాన్ని ద్వేషించాలని మరియు అలా చేయకుండా జాగ్రత్తపడాలని మనకు బోధిస్తాయి. మన పాపాలను క్షమించడానికి యేసు అంతిమ త్యాగం ఎలా చేశాడో మనం గుర్తుంచుకోవాలి, ఇది ప్రజలు చేసే జంతు బలుల కంటే చాలా శక్తివంతమైనది. మన తప్పులకు మనం బాధ్యత వహించాలి మరియు బైబిల్‌ను క్రమం తప్పకుండా చదవాలి మరియు అధ్యయనం చేయాలి మరియు మన తప్పులను గుర్తించి సరిదిద్దడానికి సహాయం చేయమని దేవుణ్ణి అడగాలి. 



Shortcut Links
లేవీయకాండము - Leviticus : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |