Leviticus - లేవీయకాండము 20 | View All

1. మరియయెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము

2. ఇశ్రాయేలీయులలోనేగాని ఇశ్రాయేలు ప్రజలలో నివసించు పరదేశులలోనేగాని యొకడు ఏమాత్రమును తన సంతానమును మోలెకుకు ఇచ్చినయెడల వానికి మరణ శిక్షవిధింపవలెను; మీ దేశప్రజలు రాళ్లతో వాని కొట్టవలెను.

“మోలెక్”– లేవీయకాండము 18:21 నోట్.

3. ఆ మనుష్యుడు నా పరిశుద్ధస్థలమును అపవిత్రపరచి నా పరిశుద్ధనామమును అపవిత్రపరచుటకు తన సంతానమును మోలెకుకు ఇచ్చెను గనుక నేను వానికి విరోధినై ప్రజలలోనుండి వాని కొట్టివేతును.

4. మరియు ఆ మనుష్యుడు తన సంతానమును మోలెకుకు ఇచ్చుచుండగా మీ దేశ ప్రజలు వాని చంపక,

5. చూచి చూడనట్లు తమ కన్నులు మూసికొనినయెడల నేను వానికిని వాని కుటుంబమునకును విరోధినై వానిని మోలెకుతో వ్యభిచరించుటకు వాని తరిమి వ్యభిచారముచేయు వారినందరిని ప్రజలలోనుండి కొట్టివేతును.

“వ్యభిచారిణిలాగా”– దేవుని ప్రజలు అబద్ధ దేవతలను, విగ్రహాలను, లేక ఈ చెడ్డ లోకంలోని విషయాలను అనుసరించడం అనే సంగతిని బైబిలు దృష్టాంత రీతిగా వ్యభిచారం, వేశ్యాప్రవర్తనతో తరచుగా పోలుస్తుంది (యెషయా 1:21 యిర్మియా 2:20 యిర్మియా 3:1 యిర్మియా 3:6 యిర్మియా 3:8 యిర్మియా 3:9 యిర్మియా 13:27 యెహోషువ 16:17 యెహోషువ 16:28 యెహోషువ 23:5 యెహోషువ 23:8 యెహోషువ 23:19 హోషేయ 2:5 హోషేయ 4:15 హోషేయ 5:3-4 యాకోబు 4:4 ప్రకటన గ్రంథం 17:5 ప్రకటన గ్రంథం 18:3). ఆధ్యాత్మిక ప్రపంచంలో దేవునిపట్ల నమ్మకంగా జీవించనివారు తమ భర్తకు విశ్వాసపాత్రంగా ఉండని స్త్రీలతో సమానం.

6. మరియు కర్ణపిశాచి గలవారితోను సోదెగాండ్ర తోను వ్యభిచరించుటకు వారితట్టు తిరుగువాడెవడో నేను వానికి విరోధినై ప్రజలలోనుండి వాని కొట్టి వేతును.

లేవీయకాండము 19:31.

7. కావున మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొని పరిశుద్ధులై యుండుడి; నేను మీ దేవుడనైన యెహోవాను.
1 పేతురు 1:16

పవిత్రత అని అనువదించిన హీబ్రూ పదానికి “వేరు చేయబడినది” లేక “ప్రత్యేకించబడినది” అని అర్థం. బైబిల్లో కొందరు వ్యక్తులు, స్థలాలు, వస్తువులు, రోజులు పవిత్రం అని రాసివుంది. దేవుని విషయంలో దీని అర్థం దుర్మార్గత, పాపం, కల్మషం అంతటినుంచీ వేరుగా దూరంగా ఉన్నవాడు అని. బైబిల్లో కనిపించే దేవునికి ఉన్న పరమాద్భుతమైన ప్రత్యేకమైన లక్షణాల్లో పవిత్రత ఒకటి. ఉనికిలో ఉన్న మరి ఇతర ఏ సాహిత్యంలోనూ మత గ్రంథాలలోనూ దేవుని పవిత్రతను గురించి ఇంత ప్రాముఖ్యంగా సంపూర్ణంగా నొక్కి చెప్పడం కనిపించదు. దేవుని పవిత్రత ఏ లోపమూ లేనిది, పరిపూర్ణమైనది, ఇంత అని చెప్పవీలుకానిది (నిర్గమకాండము 15:11 లేవీయకాండము 11:44 లేవీయకాండము 19:2 1 సమూయేలు 2:2 కీర్తనల గ్రంథము 145:17 యెషయా 6:3 హబక్కూకు 1:12 1 పేతురు 1:16 ప్రకటన గ్రంథం 15:4). సమస్తమైన చెడుతనం, అశుద్ధత, పాపం అంటే దేవునికి అసహ్యమే. బైబిలంతటిలో ముఖ్యాంశం ఏమిటంటే, పాపాత్ములైన మనుషులు క్షమాపణ పొంది పాపాలనుంచి శుద్ధులై పవిత్రులై దేవుని మహిమాన్వితమైన పవిత్ర సన్నిధానంలోకి రాగలిగే విధానం. దేవుడు మనుషులను వేరుపరచి తనకోసం వారిని ప్రత్యేకించుకుంటే వారు పవిత్రులని బైబిలు చెప్పుతుంది (నిర్గమకాండము 19:5-6 లేవీయకాండము 11:44-45 1 పేతురు 2:8-10). క్రొత్త ఒడంబడిక గ్రంథంలో విశ్వాసులందరూ పవిత్రులని రాసివుంది (రోమీయులకు 1:1 ఫిలిప్పీయులకు 1:1 మొ।।). దేవుడు వ్యక్తులను గానీ ఒక్క ప్రజను గానీ తనకోసం ప్రత్యేకించుకొంటే అలాంటివారు సమస్తమైన చెడుతనం నుంచీ పాపం నుంచీ తమను తాము వేరు చేసుకోవాలని ఆయన అధికారంతో ఆజ్ఞాపిస్తున్నాడు. ఆయన వారిని శుద్ధీకరించే పని మొదలుపెడతాడు (ఎఫెసీయులకు 5:25-27 తీతుకు 2:11-14 యోహాను 17:17-19 నోట్స్ కూడా చూడండి). ఇంతేగాక కొన్ని స్థలాలు (నిర్గమకాండము 3:5 నిర్గమకాండము 19:23 నిర్గమకాండము 26:23) వస్తువులు (నిర్గమకాండము 28:2 నిర్గమకాండము 28:38 నిర్గమకాండము 29:33-34 నిర్గమకాండము 30:10 నిర్గమకాండము 40:10), రోజులు (ఆదికాండము 2:3 నిర్గమకాండము 20:8 లేవీయకాండము 23:2 – “పవిత్ర సభల దినాలు”) కూడా పవిత్రమని రాసివుంది. ఎందుకంటే దేవుడు మనుషులపట్ల తన వ్యవహారాలలో నెరవేరవలసిన కొన్ని పవిత్రమైన ఆశయాలకోసం వాటిని ప్రత్యేకించాడు.

8. మీరు నా కట్టడలను ఆచరించి వాటిని అనుసరింపవలెను, నేను మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను

నిర్గమకాండము 31:13.

9. ఎవడు తన తండ్రినైనను తన తల్లినైనను దూషించునో వానికి మరణశిక్ష విధింపవలెను. వాడు తన తండ్రినో తల్లినో దూషించెను గనుక తన శిక్షకు తానే కారకుడు.
మత్తయి 15:4, మార్కు 7:10

నిర్గమకాండము 21:17 ద్వితీయోపదేశకాండము 27:16.

10. పరుని భార్యతో వ్యభిచరించిన వానికి, అనగా తన పొరుగు వాని భార్యతో వ్యభిచరించినవానికిని ఆ వ్యభిచారిణికిని మరణశిక్ష విధింపవలెను.
యోహాను 8:5

నిర్గమకాండము 20:14 లేవీయకాండము 18:20 ద్వితీయోపదేశకాండము 5:18.

11. తన తండ్రి భార్యతో శయనించిన వాడు తన తండ్రి మానాచ్ఛాదనమును తీసెను; వారిద్దరికిని మరణశిక్ష విధింపవలెను; తమ శిక్షకు తామే కారకులు.

లేవీయకాండము 18:7-23 ద్వితీయోపదేశకాండము 21:20-23.

12. ఒకడు తన కోడలితో శయనించినయెడల వారిద్దరికిని మరణశిక్ష విధింపవలెను. వారు వారి వరసలు తప్పిరి; వారి ప్రాణాపరాధము వారిమీదనుండును.

13. ఒకడు స్త్రీతో శయనించినట్టు పురుషునితో శయనించిన యెడల వారిద్దరు హేయక్రియనుచేసిరి గనుక వారికి మరణశిక్ష విధింపవలెను; తమ శిక్షకు తామే కారకులు.
రోమీయులకు 1:27

14. ఒకడు స్త్రీని ఆమె తల్లిని పెండ్లిచేసికొనినయెడల అది దుష్కామ ప్రవర్తన. దుష్కామప్రవర్తన మీ మధ్య నుండకుండ వానిని వారిని అగ్నితో కాల్చవలెను.

15. జంతు శయనము చేయువానికి మరణశిక్ష విధింపవలెను; ఆ జంతువును చంపవలెను.

16. స్త్రీ తన్ను జంతువు పొందునట్లు దాని సమీపించినయెడల ఆ స్త్రీకిని ఆ జంతువునకును మరణమే విధి; ఆమెను దానిని చంపవలెను; తమశిక్షకు తామే కారకులు.

17. ఒకడు తన సహోదరిని, అనగా తన తండ్రి కుమార్తెనే గాని తన తల్లి కుమార్తెనేగాని చేర్చుకొని ఆమె దిసమొలను వాడును వాని దిసమొలను ఆమెయు చూచిన యెడల అది దురనురాగము. వారికిని తమ జనులయెదుట మరణశిక్ష విధింపవలెను. వాడు తన సహోదరిని మానా చ్ఛాదనమును తీసెను; తన దోష శిక్షను తాను భరించును.

18. కడగానున్న స్త్రీతో శయనించి ఆమె మానాచ్ఛాదనమును తీసినవాడు ఆమె రక్తధారాచ్ఛాదనమును తీసెను; ఆమె తన రక్త ధారాచ్ఛాదనమును తీసివేసెను; వారి ప్రజలలోనుండి వారిద్దరిని కొట్టివేయవలెను.

19. నీ తల్లి సహోదరి మానాచ్ఛాదనమునేగాని నీ తండ్రి సహోదరి మానాచ్ఛాదనమునేగాని తీయకూడదు; తీసినవాడు తన రక్త సంబంధియొక్క మానాచ్ఛాదనమును తీసెను; వారు తమ దోషశిక్షను భరించెదరు.

20. పినతల్లితోనేగాని పెత్తల్లితోనే గాని శయనించినవాడు తన తలిదండ్రుల సహోదరుల మానాచ్ఛాదనమును తీసెను, వారు తమ పాపశిక్షను భరించెదరు; సంతానహీనులై మరణమగుదురు.

21. ఒకడు తన సహోదరుని భార్యను చేర్చుకొనినయెడల అది హేయము. వాడు తన సహోదరుని మానాచ్ఛాదనమును తీసెను; వారు సంతానహీనులై యుందురు.
మత్తయి 14:3-4

22. కాబట్టి మీరు నివసించునట్లు నేను ఏ దేశమునకు మిమ్మును తీసికొని పోవుచున్నానో ఆ దేశము మిమ్మును కక్కివేయకుండునట్లు మీరు నా కట్టడలన్నిటిని నా విధులన్నిటిని అనుసరించి నడుచుకొనవలెను.

లేవీయకాండము 18:28 తనమీద నివసించే పాపులను భరించడం నేలకు కూడా కష్టతరం.

23. నేను మీ యెదుటనుండి వెళ్లగొట్టుచున్న జనముల ఆచారములను బట్టి నడుచుకొనకూడదు. వారు అట్టి క్రియలన్నియు చేసిరి గనుక నేను వారియందు అసహ్య పడితిని.

లేవీయకాండము 18:3 లేవీయకాండము 18:25.

24. నేను మీతో చెప్పిన మాట యిదేమీరు వారి భూమిని స్వాస్థ్యముగా పొందుదురు; అది, అనగా పాలు తేనెలు ప్రవహించు ఆ దేశము, మీకు స్వాస్థ్యముగా ఉండునట్లు దాని మీకిచ్చెదను. జనములలోనుండి మిమ్మును వేరుపరచిన మీ దేవుడనైన యెహోవాను నేనే.

నిర్గమకాండము 13:5 నిర్గమకాండము 33:1-3 నిర్గమకాండము 33:16.

25. కావున మీరు పవిత్ర జంతువులకును అపవిత్ర జంతువులకును పవిత్ర పక్షులకును అపవిత్ర పక్షులకును విభజన చేయవలెను. అపవిత్రమైనదని నేను మీకు వేరుచేసిన యే జంతువువలననేగాని, యే పక్షివలననేగాని, నేల మీద ప్రాకు దేనివల ననేగాని మిమ్మును మీరు అపవిత్రపరచుకొనకూడదు.

నిర్గమకాండము 10:10 ద్వితీయోపదేశకాండము 14:3-21 లేవీయకాండము 11:2-23 నోట్.

26. మీరు నాకు పరిశుద్ధులై యుండవలెను. యెహోవా అను నేను పరిశుద్ధుడను. మీరు నావారై యుండునట్లు అన్య జనులలోనుండి మిమ్మును వేరుపరచితిని.

27. పురుషునియందేమి స్త్రీయందేమి కర్ణపిశాచియైనను సోదెయైనను ఉండినయెడల వారికి మరణ శిక్ష విధింప వలెను, వారిని రాళ్లతో కొట్టవలెను. తమ శిక్షకు తామే కారకులు.

లేవీయకాండము 19:31.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Leviticus - లేవీయకాండము 20 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible
మోలోచ్‌కు పిల్లలను బలి ఇవ్వకూడదని చట్టం, వారి తల్లిదండ్రులను శపించే పిల్లలు. (1-9) 
చాలా కాలం క్రితం, కొంతమంది చాలా నీచంగా మరియు వారి దేవతలకు తమ పిల్లలను బలి ఇవ్వడం ద్వారా భయంకరమైన పనులు చేశారు. వారు ఎంత క్రూరంగా ఉన్నారో మనం ఆశ్చర్యపోవచ్చు. కానీ నేటికీ, కొంతమంది తల్లిదండ్రులు చెడు పనులు చేస్తూ తమ పిల్లలకు కూడా చెడు పనులు చేయమని నేర్పిస్తున్నారు. ఇది నిజంగా విచారకరం ఎందుకంటే ఇది వారి పిల్లలు ఎప్పటికీ గాయపడటానికి దారితీస్తుంది. ఈ తల్లిదండ్రులు వారు చేసిన దానికి దేవునికి సమాధానం చెప్పవలసి ఉంటుంది మరియు వారు తమ పిల్లలను ఒక ప్రత్యేకమైన రోజున మళ్లీ కలుసుకున్నప్పుడు, అది చాలా బాధగా ఉంటుంది. పిల్లలు, ఎవరైనా తమ అమ్మ లేదా నాన్న గురించి నీచమైన మాటలు చెబితే, వారు గతంలో కఠినంగా శిక్షించబడ్డారని గుర్తుంచుకోవాలి. యేసు ఈ నియమాన్ని అంగీకరించాడు. అనేక ఇతర నియమాలు కూడా ఉన్నాయి మరియు ప్రజలు వాటిని అనుసరించకపోతే, వారు గాయపడవచ్చు. కానీ మంచిగా మరియు స్వచ్ఛంగా ఉండాలనే సందేశం కూడా ఉంది మరియు దేవుని సహాయంతో మనం మంచి వ్యక్తులుగా మారవచ్చు. కాబట్టి మనం మంచిగా ఉండటానికి మన వంతు ప్రయత్నం చేద్దాం మరియు దేవుడు మనకు మార్గనిర్దేశం చేద్దాం. 

చట్టాలు పునరావృతం చేయబడ్డాయి, పవిత్రత ఆజ్ఞాపించబడింది. (10-27)
ఈ శ్లోకాలు ఇంతకు ముందు చెప్పిన విషయాలనే చెబుతున్నాయి, కానీ మళ్లీ మళ్లీ వినడం ముఖ్యం. పాపం చెడ్డదని మరియు దాని నుండి ఎలా విముక్తి పొందాలో మనకు బోధించినందుకు మనం దేవునికి కృతజ్ఞులమై ఉండాలి. దేవుని బోధలను అనుసరించడానికి మన వంతు ప్రయత్నం చేయాలి మరియు తప్పు పనులు చేయకుండా ఉండాలి.



Shortcut Links
లేవీయకాండము - Leviticus : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |