Leviticus - లేవీయకాండము 20 | View All

1. మరియయెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము

1. మోషేతో యెహోవా ఇలా చెప్పాడు:

2. ఇశ్రాయేలీయులలోనేగాని ఇశ్రాయేలు ప్రజలలో నివసించు పరదేశులలోనేగాని యొకడు ఏమాత్రమును తన సంతానమును మోలెకుకు ఇచ్చినయెడల వానికి మరణ శిక్షవిధింపవలెను; మీ దేశప్రజలు రాళ్లతో వాని కొట్టవలెను.

2. “ఇశ్రాయేలు ప్రజలతో ఈ విషయాలు కూడా నీవు చెప్పాలి: మీ దేశంలో ఒక వ్యక్తి తన పిల్లలలో ఒకరిని దొంగదేవత మోలెకునకు అర్పించడం జరగవచ్చు, అప్పుడు ఆ వ్యక్తిని చంపెయ్యాలి. ఆ వ్యక్తి ఇశ్రాయేలు పౌరుడైనా నా ఇశ్రాయేలులో నివసిస్తున్న విదేశీయుడైనా సరే, ఆ వ్యక్తిమీద మీరు రాళ్లు విసిరి చంపివేయాలి.

3. ఆ మనుష్యుడు నా పరిశుద్ధస్థలమును అపవిత్రపరచి నా పరిశుద్ధనామమును అపవిత్రపరచుటకు తన సంతానమును మోలెకుకు ఇచ్చెను గనుక నేను వానికి విరోధినై ప్రజలలోనుండి వాని కొట్టివేతును.

3. నేను ఆ వ్యక్తికి విముఖుడ్ని. అతణ్ణి అతని ప్రజల్లోనుంచి నేను వేరుచేస్తాను. ఎందుచేతనంటే అతడు తన పిల్లల్ని మోలెకునకు ఇచ్చాడు. నా పవిత్ర నామం అంటే అతనికి గౌరవం లేదని అతడు వ్యక్తం చేసాడు. నా పవిత్ర స్థలాన్ని అతడు అపవిత్రం చేసాడు.

4. మరియు ఆ మనుష్యుడు తన సంతానమును మోలెకుకు ఇచ్చుచుండగా మీ దేశ ప్రజలు వాని చంపక,

4. ఒకవేళ సామాన్యులు అతణ్ణి పట్టించుకోక పోవచ్చు, ఒకవేళ తన పిల్లల్ని మోలెకునకు అర్పించినవాణ్ణి వారు పట్టించు కొనక పోవచ్చును,

5. చూచి చూడనట్లు తమ కన్నులు మూసికొనినయెడల నేను వానికిని వాని కుటుంబమునకును విరోధినై వానిని మోలెకుతో వ్యభిచరించుటకు వాని తరిమి వ్యభిచారముచేయు వారినందరిని ప్రజలలోనుండి కొట్టివేతును.

5. కానీ నేను మాత్రం అతనికి, అతని కుటుంబానికి విరోధంగా ఉంటాను. అతణ్ణి తన ప్రజల్లోనుంచి నేను వేరుచేసేస్తాను. నాకు అపనమ్మకంగా ఉండి, మోలెకును వెంబడించే ఏ వ్యక్తినైనా సరే నేను వేరు చేసేస్తాను.

6. మరియు కర్ణపిశాచి గలవారితోను సోదెగాండ్ర తోను వ్యభిచరించుటకు వారితట్టు తిరుగువాడెవడో నేను వానికి విరోధినై ప్రజలలోనుండి వాని కొట్టి వేతును.

6. “సలహాకోసం కర్ణపిశాచుల దగ్గరకు, సోదె చెప్పేవారి దగ్గరకు వెళ్ళే ఏ వ్యక్తికైనా సరే నేను విరోధంగా ఉంటాను. అలాంటి వ్యక్తి నాకు అపనమ్మకంగా ఉన్నాడు. కనుక అలాంటి వాణ్ణి తన ప్రజల్లోనుంచి నేను వేరు చేసేస్తాను.”

7. కావున మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొని పరిశుద్ధులై యుండుడి; నేను మీ దేవుడనైన యెహోవాను.
1 పేతురు 1:16

7. “ప్రత్యేకంగా ఉండండి. మిమ్మల్ని మీరు పవిత్రం చేసుకోండి. ఎందుచేతనంటే నేను పవిత్రుడను గనుక. నేను యెహోవాను మీ దేవుణ్ణి.

8. మీరు నా కట్టడలను ఆచరించి వాటిని అనుసరింపవలెను, నేను మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను

8. నా ఆజ్ఞలు జ్ఞాపకం చేసుకొని విధేయులుగా ఉండండి. నేను యెహోవాను మరియు నా ప్రత్యేక ప్రజలుగా నేను మిమ్మల్ని చేసాను.”

9. ఎవడు తన తండ్రినైనను తన తల్లినైనను దూషించునో వానికి మరణశిక్ష విధింపవలెను. వాడు తన తండ్రినో తల్లినో దూషించెను గనుక తన శిక్షకు తానే కారకుడు.
మత్తయి 15:4, మార్కు 7:10

9. “ఏ వ్యక్తిగాని తన తండ్రిని లేక తల్లిని శపించినట్లయితే ఆ వ్యక్తిని చంపేయాలి. అతడు తన తండ్రిని లేక తల్లిని శపించాడు గనుక అతణ్ణి చెంపేయాల్సిందే.”

10. పరుని భార్యతో వ్యభిచరించిన వానికి, అనగా తన పొరుగు వాని భార్యతో వ్యభిచరించినవానికిని ఆ వ్యభిచారిణికిని మరణశిక్ష విధింపవలెను.
యోహాను 8:5

10. “మగవాడు ఒకడు తన పొరుగువాని భార్యతో లైంగిక సంబంధాలు పెట్టుకొంటే ఆ మగవాడు ఆడది ఇద్దరూ వ్యభిచార అపరాధులే. అందుచేత మగవాడు, ఆడది ఇద్దరూ చంపబడాల్సిందే.

11. తన తండ్రి భార్యతో శయనించిన వాడు తన తండ్రి మానాచ్ఛాదనమును తీసెను; వారిద్దరికిని మరణశిక్ష విధింపవలెను; తమ శిక్షకు తామే కారకులు.

11. ఒక మగవాడు తన తండ్రి భార్యతో లైంగిక సంబంధాలు పెట్టుకొంటే ఆ మగవాడు చంపివేయాలి. ఆ మగవాడు, అతని తండ్రి భార్యను, ఇద్దర్నీ చంపివేయాలి. వాడు తన తండ్రికి విరుద్ధంగా పాపం చేసాడు.

12. ఒకడు తన కోడలితో శయనించినయెడల వారిద్దరికిని మరణశిక్ష విధింపవలెను. వారు వారి వరసలు తప్పిరి; వారి ప్రాణాపరాధము వారిమీదనుండును.

12. “ఒక మగవాడు తన కోడలితో లైంగిక సంబంధాలు కలిగి ఉంటే, వాళ్ళిద్దర్నీ చంపివేయాలి. వాళ్లు చాలా దారుణమైన లైంగిక పాపం చేసారు. వాళ్లు శిక్షించబడాల్సిందే.

13. ఒకడు స్త్రీతో శయనించినట్టు పురుషునితో శయనించిన యెడల వారిద్దరు హేయక్రియనుచేసిరి గనుక వారికి మరణశిక్ష విధింపవలెను; తమ శిక్షకు తామే కారకులు.
రోమీయులకు 1:27

13. “ఒక మగవాడు ఒక స్త్రీతో కలిగి ఉన్నట్టుగా మరో మగవాడితో లైంగిక సంబంధాలు కలిగి ఉంటే, వీళ్ళిద్దరు మగవాళ్లూ చాలా దారుణ పాపం చేసినట్టే. వాళ్ళను చంపివేయాల్సిందే. వాళ్ళ శిక్షకు వాళ్లే కారకులు.

14. ఒకడు స్త్రీని ఆమె తల్లిని పెండ్లిచేసికొనినయెడల అది దుష్కామ ప్రవర్తన. దుష్కామప్రవర్తన మీ మధ్య నుండకుండ వానిని వారిని అగ్నితో కాల్చవలెను.

14. “ఒక మగవాడు ఒక స్త్రీతో, ఆమె తల్లితో కూడా లైంగిక సంబంధాలు కలిగి ఉంటే అది లైంగిక పాపం. ఆ మగవాడ్ని, ఆడవాళ్లు ఇద్దర్నీ ప్రజలు కాల్చి వేయాలి. మీ ప్రజల మధ్య ఇలాంటి లైంగిక పరమైన పాపం జరగనివ్వకండి.

15. జంతు శయనము చేయువానికి మరణశిక్ష విధింపవలెను; ఆ జంతువును చంపవలెను.

15. “ఒక మగావాడు ఒక జంతువుతో లైంగిక సంబంధాలు కలిగి ఉంటే అతణ్ణి చంపివేయాల్సిందే. మరియు మీరు ఆ జంతువును గూడ చంపివేయాలి.

16. స్త్రీ తన్ను జంతువు పొందునట్లు దాని సమీపించినయెడల ఆ స్త్రీకిని ఆ జంతువునకును మరణమే విధి; ఆమెను దానిని చంపవలెను; తమశిక్షకు తామే కారకులు.

16. ఒక స్త్రీ గనుక ఒక జంతువుతో లైంగిక సంబంధం పెట్టుకొంటే, ఆ స్త్రీని, జంతువును కూడ మీరు చంపివేయాలి. వారిని చంపేయాలి, వాళ్ళ శిక్షకు వాళ్లే కారకులు.”

17. ఒకడు తన సహోదరిని, అనగా తన తండ్రి కుమార్తెనే గాని తన తల్లి కుమార్తెనేగాని చేర్చుకొని ఆమె దిసమొలను వాడును వాని దిసమొలను ఆమెయు చూచిన యెడల అది దురనురాగము. వారికిని తమ జనులయెదుట మరణశిక్ష విధింపవలెను. వాడు తన సహోదరిని మానా చ్ఛాదనమును తీసెను; తన దోష శిక్షను తాను భరించును.

17. “ఒక సోదరుడు అతని సోదరి అనగా తండ్రి కుమార్తెగాని, తల్లి కుమార్తెగాని ఒకరితో ఒకరు లైంగిక సంబంధం పెట్టుకోవటం చాలా సిగ్గుచేటు. వాళ్లను బహిరంగంగా శిక్షించాలి. వాళ్ల ప్రజల్లోనుంచి వాళ్లను వేరు చేయాలి. తన సోదరితో లైంగిక సంబంధం పెట్టుకొన్న మగవాడు అతని పాపం నిమిత్తం శిక్షపొందాలి.”

18. కడగానున్న స్త్రీతో శయనించి ఆమె మానాచ్ఛాదనమును తీసినవాడు ఆమె రక్తధారాచ్ఛాదనమును తీసెను; ఆమె తన రక్త ధారాచ్ఛాదనమును తీసివేసెను; వారి ప్రజలలోనుండి వారిద్దరిని కొట్టివేయవలెను.

18. “ఒక స్త్రీ నెలసరి రక్తస్రావ సమయంలో ఒక మగవాడు ఆమెతో లైంగిక సంబంధం పెట్టుకొంటే ఆ స్త్రీ పురుషులు ఇద్దర్నీ వాళ్ల ప్రజల్లోనుంచి వేరు చేయాలి. ఆమె రక్తస్రావ స్థానాన్ని వారు బహిర్గతం చేసారు గనుక వాళ్లు పాపం చేసారు.

19. నీ తల్లి సహోదరి మానాచ్ఛాదనమునేగాని నీ తండ్రి సహోదరి మానాచ్ఛాదనమునేగాని తీయకూడదు; తీసినవాడు తన రక్త సంబంధియొక్క మానాచ్ఛాదనమును తీసెను; వారు తమ దోషశిక్షను భరించెదరు.

19. “మీ తల్లి సోదరితో గాని, తండ్రి సోదరితో గాని లైంగిక సంబంధాలు పెట్టుకో గూడదు. అది రక్తసంబంధికుల పాపం. వాళ్ల పాపం మూలంగా వాళ్లు శిక్ష పొందాలి.

20. పినతల్లితోనేగాని పెత్తల్లితోనే గాని శయనించినవాడు తన తలిదండ్రుల సహోదరుల మానాచ్ఛాదనమును తీసెను, వారు తమ పాపశిక్షను భరించెదరు; సంతానహీనులై మరణమగుదురు.

20. “ఒకడు తన పినతల్లితో శయనించగూడదు. అతడు, అతని పినతల్లికూడ వారు చేసిన పాపం మూలంగా శిక్ష పొందుతారు. వాళ్లు పిల్లలు లేకుండా చస్తారు.

21. ఒకడు తన సహోదరుని భార్యను చేర్చుకొనినయెడల అది హేయము. వాడు తన సహోదరుని మానాచ్ఛాదనమును తీసెను; వారు సంతానహీనులై యుందురు.
మత్తయి 14:3-4

21. ఎవడైనా తన సోదరుని భార్యను చేర్చుకోవడం తప్పు. వాడు తన సోదరునికి విరోధంగా పాపం చేసాడు. వాళ్లకూ పిల్లలు ఉండరు.

22. కాబట్టి మీరు నివసించునట్లు నేను ఏ దేశమునకు మిమ్మును తీసికొని పోవుచున్నానో ఆ దేశము మిమ్మును కక్కివేయకుండునట్లు మీరు నా కట్టడలన్నిటిని నా విధులన్నిటిని అనుసరించి నడుచుకొనవలెను.

22. “నా ఆజ్ఞలు, నియమాలు అన్నీ మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. వాటికి మీరు విధేయులు కావాలి. నేను మిమ్మల్ని మీ దేశానికి నడిపిస్తున్నాను. ఆ దేశంలో మీరు నివసిస్తారు. మీరు నా ఆజ్ఞలకు, నియమాలకు విధేయులైతే ఆ దేశం మిమ్మల్ని వెళ్లగొట్టదు.

23. నేను మీ యెదుటనుండి వెళ్లగొట్టుచున్న జనముల ఆచారములను బట్టి నడుచుకొనకూడదు. వారు అట్టి క్రియలన్నియు చేసిరి గనుక నేను వారియందు అసహ్య పడితిని.

23. ఇతర ప్రజల్ని ఆ దేశంలో నుండి నేను వెళ్ల గొట్టేస్తున్నాను. ఎందుచేతనంటే వాళ్లు అలాంటి పాపాలన్నీ చేసారు. ఆ పాపాలంటే నాకు అసహ్యం. కనుక వాళ్లు జీవించినట్టు మీరు జీవించకండి.

24. నేను మీతో చెప్పిన మాట యిదేమీరు వారి భూమిని స్వాస్థ్యముగా పొందుదురు; అది, అనగా పాలు తేనెలు ప్రవహించు ఆ దేశము, మీకు స్వాస్థ్యముగా ఉండునట్లు దాని మీకిచ్చెదను. జనములలోనుండి మిమ్మును వేరుపరచిన మీ దేవుడనైన యెహోవాను నేనే.

24. “వాళ్ల దేశం మీది అవుతుంది. అని నేను మీతో చెప్పాను. వాళ్ల దేశాన్ని నేను మీకు యిస్తాను. అది మీ దేశం అవుతుంది. ఆ దేశం చాలా మంచి దేశం. పాలు, తేనెలు ప్రవహించే దేశం అది. నేను మీ దేవుడైన యెహోవాను. “నేను మిమ్మల్ని నా ప్రత్యేక ప్రజలుగా చేసుకొన్నాను. ఇతరులకంటే మిమ్మల్ని నేను వేరుగా చూసుకొన్నాను.

25. కావున మీరు పవిత్ర జంతువులకును అపవిత్ర జంతువులకును పవిత్ర పక్షులకును అపవిత్ర పక్షులకును విభజన చేయవలెను. అపవిత్రమైనదని నేను మీకు వేరుచేసిన యే జంతువువలననేగాని, యే పక్షివలననేగాని, నేల మీద ప్రాకు దేనివల ననేగాని మిమ్మును మీరు అపవిత్రపరచుకొనకూడదు.

25. కనుక పవిత్ర జంతువుల్ని అపవిత్ర జంతువులకంటె వేరుగా మీరు చూసుకోవాలి. పవిత్ర పక్షుల్ని అపవిత్ర పక్షుల కంటే వేరుగా మీరు చూసుకోవాలి. అపవిత్ర పక్షులు, జంతువులు, నేలమీద ప్రాకే వాటిలో దేన్నీ మీరు తినవద్దు. నేను వాటిని అపవిత్రంగా చేసాను.

26. మీరు నాకు పరిశుద్ధులై యుండవలెను. యెహోవా అను నేను పరిశుద్ధుడను. మీరు నావారై యుండునట్లు అన్య జనులలోనుండి మిమ్మును వేరుపరచితిని.

26. నేను మిమ్మల్ని నా ప్రత్యేక ప్రజలుగా చేసాను. అందుచేత మీరు నా కోసం పవిత్రంగా ఉండాలి. ఎందుచేతనంటే నేను యెహోవాను, నేను పవిత్రుణ్ణి.

27. పురుషునియందేమి స్త్రీయందేమి కర్ణపిశాచియైనను సోదెయైనను ఉండినయెడల వారికి మరణ శిక్ష విధింప వలెను, వారిని రాళ్లతో కొట్టవలెను. తమ శిక్షకు తామే కారకులు.

27. “కర్ణపిశాచి, సోదెచెప్పేవారు, మగవాడు గాని, స్త్రీగాని చంపబడాల్సిందే. రాళ్లతో ప్రజలు వారిని చంపివేయాలి. వాళ్లు శిక్షించబడాలి.”



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Leviticus - లేవీయకాండము 20 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible
మోలోచ్‌కు పిల్లలను బలి ఇవ్వకూడదని చట్టం, వారి తల్లిదండ్రులను శపించే పిల్లలు. (1-9) 
చాలా కాలం క్రితం, కొంతమంది చాలా నీచంగా మరియు వారి దేవతలకు తమ పిల్లలను బలి ఇవ్వడం ద్వారా భయంకరమైన పనులు చేశారు. వారు ఎంత క్రూరంగా ఉన్నారో మనం ఆశ్చర్యపోవచ్చు. కానీ నేటికీ, కొంతమంది తల్లిదండ్రులు చెడు పనులు చేస్తూ తమ పిల్లలకు కూడా చెడు పనులు చేయమని నేర్పిస్తున్నారు. ఇది నిజంగా విచారకరం ఎందుకంటే ఇది వారి పిల్లలు ఎప్పటికీ గాయపడటానికి దారితీస్తుంది. ఈ తల్లిదండ్రులు వారు చేసిన దానికి దేవునికి సమాధానం చెప్పవలసి ఉంటుంది మరియు వారు తమ పిల్లలను ఒక ప్రత్యేకమైన రోజున మళ్లీ కలుసుకున్నప్పుడు, అది చాలా బాధగా ఉంటుంది. పిల్లలు, ఎవరైనా తమ అమ్మ లేదా నాన్న గురించి నీచమైన మాటలు చెబితే, వారు గతంలో కఠినంగా శిక్షించబడ్డారని గుర్తుంచుకోవాలి. యేసు ఈ నియమాన్ని అంగీకరించాడు. అనేక ఇతర నియమాలు కూడా ఉన్నాయి మరియు ప్రజలు వాటిని అనుసరించకపోతే, వారు గాయపడవచ్చు. కానీ మంచిగా మరియు స్వచ్ఛంగా ఉండాలనే సందేశం కూడా ఉంది మరియు దేవుని సహాయంతో మనం మంచి వ్యక్తులుగా మారవచ్చు. కాబట్టి మనం మంచిగా ఉండటానికి మన వంతు ప్రయత్నం చేద్దాం మరియు దేవుడు మనకు మార్గనిర్దేశం చేద్దాం. 

చట్టాలు పునరావృతం చేయబడ్డాయి, పవిత్రత ఆజ్ఞాపించబడింది. (10-27)
ఈ శ్లోకాలు ఇంతకు ముందు చెప్పిన విషయాలనే చెబుతున్నాయి, కానీ మళ్లీ మళ్లీ వినడం ముఖ్యం. పాపం చెడ్డదని మరియు దాని నుండి ఎలా విముక్తి పొందాలో మనకు బోధించినందుకు మనం దేవునికి కృతజ్ఞులమై ఉండాలి. దేవుని బోధలను అనుసరించడానికి మన వంతు ప్రయత్నం చేయాలి మరియు తప్పు పనులు చేయకుండా ఉండాలి.



Shortcut Links
లేవీయకాండము - Leviticus : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |