Leviticus - లేవీయకాండము 20 | View All

1. మరియయెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము

1. And the LORDE talked with Moses, and saide:

2. ఇశ్రాయేలీయులలోనేగాని ఇశ్రాయేలు ప్రజలలో నివసించు పరదేశులలోనేగాని యొకడు ఏమాత్రమును తన సంతానమును మోలెకుకు ఇచ్చినయెడల వానికి మరణ శిక్షవిధింపవలెను; మీ దేశప్రజలు రాళ్లతో వాని కొట్టవలెను.

2. Tell the children of Israel: Who so euer he be amonge the children of Israel, (or eny straunger that dwelleth in Israel) which geueth of his sede vnto Moloch, the same shall dye the death: the people of the lande shal stone him,

3. ఆ మనుష్యుడు నా పరిశుద్ధస్థలమును అపవిత్రపరచి నా పరిశుద్ధనామమును అపవిత్రపరచుటకు తన సంతానమును మోలెకుకు ఇచ్చెను గనుక నేను వానికి విరోధినై ప్రజలలోనుండి వాని కొట్టివేతును.

3. & I wyll set my face agaynst that man, and wyll rote him out from amoge his people, because he hath geuen of his sede vnto Moloch, and defyled my Sanctuary, & vnhalowed my holy name.

4. మరియు ఆ మనుష్యుడు తన సంతానమును మోలెకుకు ఇచ్చుచుండగా మీ దేశ ప్రజలు వాని చంపక,

4. And though the people of the londe loke thorow the fyngers vpon that man, which hath geuen of his sede unto Moloch, so that they put him not to death,

5. చూచి చూడనట్లు తమ కన్నులు మూసికొనినయెడల నేను వానికిని వాని కుటుంబమునకును విరోధినై వానిని మోలెకుతో వ్యభిచరించుటకు వాని తరిమి వ్యభిచారముచేయు వారినందరిని ప్రజలలోనుండి కొట్టివేతును.

5. yet wyl I set my face agaynst the same man, & agaynst his generacion: And him, and all that go a whorynge with him after Moloch, wyll I rote out from amonge their people.

6. మరియు కర్ణపిశాచి గలవారితోను సోదెగాండ్ర తోను వ్యభిచరించుటకు వారితట్టు తిరుగువాడెవడో నేను వానికి విరోధినై ప్రజలలోనుండి వాని కొట్టి వేతును.

6. If eny soule turne him to ye soythsayers and expounders of tokens, so that he goeth a whorynge after them, I wyl set my face agaynst the same soule, and wyl rote him out from amonge his people.

7. కావున మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొని పరిశుద్ధులై యుండుడి; నేను మీ దేవుడనైన యెహోవాను.
1 పేతురు 1:16

7. Sanctifie youre selues therfore, & be holy: for I am holy euen youre God.

8. మీరు నా కట్టడలను ఆచరించి వాటిని అనుసరింపవలెను, నేను మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను

8. And kepe ye my statutes, and do them: for I am ye LORDE that sanctifieth you.

9. ఎవడు తన తండ్రినైనను తన తల్లినైనను దూషించునో వానికి మరణశిక్ష విధింపవలెను. వాడు తన తండ్రినో తల్లినో దూషించెను గనుక తన శిక్షకు తానే కారకుడు.
మత్తయి 15:4, మార్కు 7:10

9. Who so euer curseth his father or his mother, shall dye the death: his bloude be vpon him, because he hath cursed his father or mother.

10. పరుని భార్యతో వ్యభిచరించిన వానికి, అనగా తన పొరుగు వాని భార్యతో వ్యభిచరించినవానికిని ఆ వ్యభిచారిణికిని మరణశిక్ష విధింపవలెను.
యోహాను 8:5

10. He that breaketh wedlocke with eny mas wife, shal dye the death (both the aduouterer and ye aduouteresse) because he hath broken wedlocke with his neghbours wife.

11. తన తండ్రి భార్యతో శయనించిన వాడు తన తండ్రి మానాచ్ఛాదనమును తీసెను; వారిద్దరికిని మరణశిక్ష విధింపవలెను; తమ శిక్షకు తామే కారకులు.

11. Yf eny man lye with his fathers wife, so yt he vncouer his fathers preuyte, they shal both dye the death: their bloude be vpo the.

12. ఒకడు తన కోడలితో శయనించినయెడల వారిద్దరికిని మరణశిక్ష విధింపవలెను. వారు వారి వరసలు తప్పిరి; వారి ప్రాణాపరాధము వారిమీదనుండును.

12. Yf eny man lye wt his doughter in lawe, they shall dye both of them, for they have wrought abhominacion: their bloude be vpon them.

13. ఒకడు స్త్రీతో శయనించినట్టు పురుషునితో శయనించిన యెడల వారిద్దరు హేయక్రియనుచేసిరి గనుక వారికి మరణశిక్ష విధింపవలెను; తమ శిక్షకు తామే కారకులు.
రోమీయులకు 1:27

13. Yf eny man lye with the mankynde, as with womankynde, they haue wrought abhominacion, & shal both dye the death: their bloude be vpon them.

14. ఒకడు స్త్రీని ఆమె తల్లిని పెండ్లిచేసికొనినయెడల అది దుష్కామ ప్రవర్తన. దుష్కామప్రవర్తన మీ మధ్య నుండకుండ వానిని వారిని అగ్నితో కాల్చవలెను.

14. If eny man take a wyfe, and hir mother therto, the same hath wrought wickednes: he shalbe burnt with fyre, and so shal they also, that there be no wickednes amoge you.

15. జంతు శయనము చేయువానికి మరణశిక్ష విధింపవలెను; ఆ జంతువును చంపవలెను.

15. Yf eny man lye with a beest, he shall dye the death, and the beest shal be slayne.

16. స్త్రీ తన్ను జంతువు పొందునట్లు దాని సమీపించినయెడల ఆ స్త్రీకిని ఆ జంతువునకును మరణమే విధి; ఆమెను దానిని చంపవలెను; తమశిక్షకు తామే కారకులు.

16. If a woman medle with a beest, so yt she haue to do wt it, thou shalt put her to death, and the beest also, they shall dye the death: their bloude be vpon them.

17. ఒకడు తన సహోదరిని, అనగా తన తండ్రి కుమార్తెనే గాని తన తల్లి కుమార్తెనేగాని చేర్చుకొని ఆమె దిసమొలను వాడును వాని దిసమొలను ఆమెయు చూచిన యెడల అది దురనురాగము. వారికిని తమ జనులయెదుట మరణశిక్ష విధింపవలెను. వాడు తన సహోదరిని మానా చ్ఛాదనమును తీసెను; తన దోష శిక్షను తాను భరించును.

17. Yf eny man take his sister, his fathers doughter, or his mothers doughter, and se hir preuyte, and she agayne se his secretes, it is a wicked thinge. They shalbe roted out in the sight of their people. For he hath vncouered his sisters preuyte, he shal beare his synne.

18. కడగానున్న స్త్రీతో శయనించి ఆమె మానాచ్ఛాదనమును తీసినవాడు ఆమె రక్తధారాచ్ఛాదనమును తీసెను; ఆమె తన రక్త ధారాచ్ఛాదనమును తీసివేసెను; వారి ప్రజలలోనుండి వారిద్దరిని కొట్టివేయవలెను.

18. Yf a man lye with a woman in the tyme of hir sicknesse, and vncouer hir secretes, & open vp hir founteyne, and she vncouer the fountayne of hir bloude, they shall both be roted out from amonge their people.

19. నీ తల్లి సహోదరి మానాచ్ఛాదనమునేగాని నీ తండ్రి సహోదరి మానాచ్ఛాదనమునేగాని తీయకూడదు; తీసినవాడు తన రక్త సంబంధియొక్క మానాచ్ఛాదనమును తీసెను; వారు తమ దోషశిక్షను భరించెదరు.

19. Thou shalt not vncouer the preuytie of thy mothers sister, and of thy fathers sister: for soch one hath vncouered his nexte kynswoman, and they shal beare their synne.

20. పినతల్లితోనేగాని పెత్తల్లితోనే గాని శయనించినవాడు తన తలిదండ్రుల సహోదరుల మానాచ్ఛాదనమును తీసెను, వారు తమ పాపశిక్షను భరించెదరు; సంతానహీనులై మరణమగుదురు.

20. Yf eny man lye with his vncles wyfe, the same hath vncovered the preuytie of his uncle: they shall beare their synne, without children shal they dye.

21. ఒకడు తన సహోదరుని భార్యను చేర్చుకొనినయెడల అది హేయము. వాడు తన సహోదరుని మానాచ్ఛాదనమును తీసెను; వారు సంతానహీనులై యుందురు.
మత్తయి 14:3-4

21. Yf eny man take his brothers wyfe, yt is an vncleane thinge: they shalbe without children, because he hath vncouered his brothers secretes.

22. కాబట్టి మీరు నివసించునట్లు నేను ఏ దేశమునకు మిమ్మును తీసికొని పోవుచున్నానో ఆ దేశము మిమ్మును కక్కివేయకుండునట్లు మీరు నా కట్టడలన్నిటిని నా విధులన్నిటిని అనుసరించి నడుచుకొనవలెను.

22. So kepe now all my statutes & my lawes, & do them, yt the lode whither I brynge you to dwell therin, spewe you not out.

23. నేను మీ యెదుటనుండి వెళ్లగొట్టుచున్న జనముల ఆచారములను బట్టి నడుచుకొనకూడదు. వారు అట్టి క్రియలన్నియు చేసిరి గనుక నేను వారియందు అసహ్య పడితిని.

23. And walke not ye in ye statutes of the Heithen, which I shal cast out before you. For all soch thinges haue they done, & I haue abhorred the.

24. నేను మీతో చెప్పిన మాట యిదేమీరు వారి భూమిని స్వాస్థ్యముగా పొందుదురు; అది, అనగా పాలు తేనెలు ప్రవహించు ఆ దేశము, మీకు స్వాస్థ్యముగా ఉండునట్లు దాని మీకిచ్చెదను. జనములలోనుండి మిమ్మును వేరుపరచిన మీ దేవుడనైన యెహోవాను నేనే.

24. But I saye vnto you: Ye shall possesse their londe. For I wyll geue you to enheritaunce a lode, that floweth with mylke and hony. I am the LORDE youre God, which haue separated you from the nacions,

25. కావున మీరు పవిత్ర జంతువులకును అపవిత్ర జంతువులకును పవిత్ర పక్షులకును అపవిత్ర పక్షులకును విభజన చేయవలెను. అపవిత్రమైనదని నేను మీకు వేరుచేసిన యే జంతువువలననేగాని, యే పక్షివలననేగాని, నేల మీద ప్రాకు దేనివల ననేగాని మిమ్మును మీరు అపవిత్రపరచుకొనకూడదు.

25. that ye also shulde separate the cleane beestes fro the vncleane, and the vncleane foules from the cleane: & not to defyle youre soules vpon beestes, vpon foules & vpon all that crepeth on the grounde: which I haue separated vnto you, that they shulde be vncleane.

26. మీరు నాకు పరిశుద్ధులై యుండవలెను. యెహోవా అను నేను పరిశుద్ధుడను. మీరు నావారై యుండునట్లు అన్య జనులలోనుండి మిమ్మును వేరుపరచితిని.

26. Therfore shall ye be holy vnto me: for I the LORDE am holy, which haue separated you fro the nacions, that ye shulde be myne.

27. పురుషునియందేమి స్త్రీయందేమి కర్ణపిశాచియైనను సోదెయైనను ఉండినయెడల వారికి మరణ శిక్ష విధింప వలెను, వారిని రాళ్లతో కొట్టవలెను. తమ శిక్షకు తామే కారకులు.

27. Yf a man or woman be a soythsayer or an expounder of tokens, the same shall dye the death: they shalbe stoned, their bloude be vpon them.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Leviticus - లేవీయకాండము 20 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible
మోలోచ్‌కు పిల్లలను బలి ఇవ్వకూడదని చట్టం, వారి తల్లిదండ్రులను శపించే పిల్లలు. (1-9) 
చాలా కాలం క్రితం, కొంతమంది చాలా నీచంగా మరియు వారి దేవతలకు తమ పిల్లలను బలి ఇవ్వడం ద్వారా భయంకరమైన పనులు చేశారు. వారు ఎంత క్రూరంగా ఉన్నారో మనం ఆశ్చర్యపోవచ్చు. కానీ నేటికీ, కొంతమంది తల్లిదండ్రులు చెడు పనులు చేస్తూ తమ పిల్లలకు కూడా చెడు పనులు చేయమని నేర్పిస్తున్నారు. ఇది నిజంగా విచారకరం ఎందుకంటే ఇది వారి పిల్లలు ఎప్పటికీ గాయపడటానికి దారితీస్తుంది. ఈ తల్లిదండ్రులు వారు చేసిన దానికి దేవునికి సమాధానం చెప్పవలసి ఉంటుంది మరియు వారు తమ పిల్లలను ఒక ప్రత్యేకమైన రోజున మళ్లీ కలుసుకున్నప్పుడు, అది చాలా బాధగా ఉంటుంది. పిల్లలు, ఎవరైనా తమ అమ్మ లేదా నాన్న గురించి నీచమైన మాటలు చెబితే, వారు గతంలో కఠినంగా శిక్షించబడ్డారని గుర్తుంచుకోవాలి. యేసు ఈ నియమాన్ని అంగీకరించాడు. అనేక ఇతర నియమాలు కూడా ఉన్నాయి మరియు ప్రజలు వాటిని అనుసరించకపోతే, వారు గాయపడవచ్చు. కానీ మంచిగా మరియు స్వచ్ఛంగా ఉండాలనే సందేశం కూడా ఉంది మరియు దేవుని సహాయంతో మనం మంచి వ్యక్తులుగా మారవచ్చు. కాబట్టి మనం మంచిగా ఉండటానికి మన వంతు ప్రయత్నం చేద్దాం మరియు దేవుడు మనకు మార్గనిర్దేశం చేద్దాం. 

చట్టాలు పునరావృతం చేయబడ్డాయి, పవిత్రత ఆజ్ఞాపించబడింది. (10-27)
ఈ శ్లోకాలు ఇంతకు ముందు చెప్పిన విషయాలనే చెబుతున్నాయి, కానీ మళ్లీ మళ్లీ వినడం ముఖ్యం. పాపం చెడ్డదని మరియు దాని నుండి ఎలా విముక్తి పొందాలో మనకు బోధించినందుకు మనం దేవునికి కృతజ్ఞులమై ఉండాలి. దేవుని బోధలను అనుసరించడానికి మన వంతు ప్రయత్నం చేయాలి మరియు తప్పు పనులు చేయకుండా ఉండాలి.



Shortcut Links
లేవీయకాండము - Leviticus : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |