Ezekiel - యెహెఙ్కేలు 45 | View All

1. మీరు చీట్లువేసి దేశమును విభాగించునప్పుడు భూమిలో ఒక భాగమును ప్రతిష్ఠితార్పణముగా యెహోవాకు ప్రతిష్ఠింపవలెను. దానికి ఇరువదియైదువేల కొల కఱ్ఱల నిడివియు పదివేల కొలకఱ్ఱల వెడల్పును ఉండ వలెను, ఈ సరిహద్దులన్నిటిలోగానున్న భూమి ప్రతిష్ఠిత మగును.

“విభాగించేటప్పుడు”– యెహెఙ్కేలు 47:13; యెహెఙ్కేలు 48:29. సంఖ్యాకాండము 34:1-15; యెహోషువ 14:1-5 పోల్చి చూడండి. గతంలో దేశాన్ని ఇస్రాయేల్‌వారు పంచుకున్న విధానానికి ఈ విభజన పూర్తిగా భిన్నంగా ఉంది. “పవిత్ర ప్రదేశం”– నగరం కోసం ఏర్పాటు చేసిన భాగాన్ని కలుపుకుంటే ఈ ప్రదేశమంతా 25,000 మూరల పొడవు, అంతే వెడల్పు ఉన్న నలుచదరంగా తయారౌతుంది (25,000 మూరలంటే దాదాపు 11.5 కి.మీ). పొడవు మూర (అంటే ఒక మూర, ఒక బెత్తె) ప్రకారం ఇది దాదాపు 14 కి.మీ. వస్తుంది. (యెహెఙ్కేలు 40:3-4 లో ఉన్న కొలబద్ద ఆరు పొడవు మూరలకు సమానం).

2. దానిలో పరిశుద్ధస్థలమునకు ఐదువందల కొల కఱ్ఱల చచ్చౌకము ఏర్పడవలెను; దానికి నలుదిశల ఏబది మూరల మైదానముండవలెను,

యెహెఙ్కేలు 42:15-20.

3. కొలువబడిన యీ స్థలము నుండి ఇరువదియైదువేల కొలకఱ్ఱల నిడివియు పదివేల కొలకఱ్ఱల వెడుల్పునుగల యొకచోటు కొలిచివేయవలెను. అందులో మహా పరిశుద్ధస్థలముగా ఉన్న పరిశుద్ధస్థలముండును.

4. యెహోవాకు పరిచర్యచేయుటకై ఆయన సన్నిధికి వచ్చి పరిచర్యచేయుచున్న యాజకులకు ఏర్పా టైన ఆ భూమి ప్రతిష్ఠిత స్థలముగా ఎంచబడును; అది వారి యిండ్లకు నివేశమై పరిశుద్ధస్థలమునకు ప్రతిష్ఠితముగా ఉండును. మందిరములో పరిచర్య చేయుచున్న లేవీయులు ఇండ్లు కట్టుకొని నివసించునట్లు

యాజులకూ లేవీగోత్రికులకూ నివసించేందుకు మాత్రమే ఇళ్ళు ఉండాలి, వారి స్వంతానికి కాదు (యెహెఙ్కేలు 44:28).

5. ఇరువదియైదు వేల కొలకఱ్ఱల నిడివియు పదివేల కొలకఱ్ఱల వెడల్పును గల యొక ప్రదేశమును వారికి స్వాస్థ్యముగా ఇరువది గదులను ఏర్పాటు చేయవలెను.

6. మరియు పట్టణమునకై అయిదువేల కొలకఱ్ఱల వెడల్పును ఇరువదియైదువేల కొల కఱ్ఱల నిడివియుగల యొక ప్రదేశము ఏర్పాటు చేయ వలెను. అది ప్రతిష్ఠితమగు భాగమునకు సరిగా ఉండవలెను, ఇశ్రాయేలీయులకందరికి అది స్వాస్థ్యముగా ఉండును.

ఈ నగరంలో దేవాలయం లేదు. ఆలయ ప్రదేశానికి ప్రక్కనే నగరం ఉంది. నగరం కోసం ప్రత్యేకించిన ప్రదేశంలో పచ్చిక మైదానాలు మొదలైనవి ఉంటాయి. మనుషులు నివసించే ప్రాంతం ఇంత కంటే చిన్నది (యెహెఙ్కేలు 48:16).

7. మరియు ప్రతిష్ఠిత భాగమునకును పట్టణమునకై యేర్పడిన ప్రదేశమునకును ఎదురుగా వాటికి పడ మటగాను తూర్పుగాను, ప్రతిష్ఠితభాగమునకును పట్టణము నకై యేర్పడిన దేశమునకును ఇరుప్రక్కల అధిపతికి భూమి నేర్పాటుచేయవలెను. పడమటినుండి తూర్పు వరకు దాని కొలువగా అదియొక గోత్రస్థానమునకు సరిపడు నిడివిగలదై యుండవలెను. అధిపతి యిక నా జనులను బాధింపక వారి గోత్రములనుబట్టి భూమి అంతయు ఇశ్రాయేలీయులకు నియమించునట్లు

అధిపతికి రెండు భాగాలు ఇవ్వబడతాయి. దేవాలయం, నగరం ఉన్న ప్రాంతానికి పశ్చిమాన, ఉత్తరాన అతనికి ఆస్తి ఉంటుంది.

8. అది ఇశ్రాయేలీయులలో అతనికి భూస్వాస్థ్యముగా ఉండును.

ఇక్కడ “అధిపతి” బహువచనంలో కనిపిస్తుంది. వీరు ఇస్రాయేల్ చరిత్రలో గతంలోని అధిపతుల్లాగా ప్రవర్తించరు (9.12 వ).

9. మరియయెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు ఇశ్రాయేలీయుల అధిపతులారా, మీరు జరిగించిన బలాత్కారమును దోచుకొనిన దోపును చాలును; ఆలాగు చేయుట మాని నా జనుల సొమ్మును అపహరింపక నీతి న్యాయముల ననుసరించి నడుచుకొనుడి; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.

10. ఖరా త్రాసులను ఖరా పడిని ఖరా తూమును ఒక్కటే పడియు ఒక్కటే తూమును మీరుంచుకొనవలెను.

11. తూము పందుములో పదియవ పాలు పట్టునదై యుండవలెను, పందుము మీకు పరిమాణ ముగా నుండవలెను.

12. తులమొకటింటికి ఇరువది చిన్న ముల యెత్తును, అరవీసె యొకటింటికి ఇరువది తులముల యెత్తును, ఇరువదియైదు తులముల యెత్తును పదునైదు తులముల యెత్తును ఉండవలెను.

13. ప్రతిష్ఠితార్పణలు ఈ ప్రకారముగా చెల్లింపవలెను. నూట ఎనుబది పళ్ల గోధుమలలో మూడు పళ్లవంతునను నూట ఎనుబది పళ్లయవలలో మూడు పళ్లవంతునను చెల్లింపవలెను.

మోషే ధర్మశాస్త్రంలో కనిపించే విధులు ఈ పద్ధతికి భిన్నంగా ఉన్నాయి. మోషే ధర్మశాస్త్రం ప్రకారం అయితే ప్రజలు తమ అర్పణలను నేరుగా యాజకులకు ఇచ్చారు. ఇక్కడైతే వారు అధిపతికి ఇస్తారు, అతడు వాటిని యాజుల చేతుల్లో పెడతారు ఈ అర్పణల ఉద్దేశం “ప్రజలకోసం ప్రాయశ్చిత్తం చేయడానికి” అని గమనించండి. అంటే ప్రాయశ్చిత్తం చేయవలసిన అవసరం ఇంకా ఉన్నకాలం గురించే ఈ దర్శనం చెప్తున్నదన్నమాట. కాబట్టి కొత్త భూమి, కొత్త ఆకాశంలో నివసించే పాపవిముక్తులైన వారి పరిపాలన గురించి ఈ దర్శనం చెప్పటం లేదు. ఇది వెయ్యేళ్ళ పరిపాలన గురించినదని అనేకమంది విద్వాంసుల అభిప్రాయం. అయితే వెయ్యేళ్ళ పరిపాలనలో జంతు బలులూ ఇతర అర్పణలూ ప్రాయశ్చిత్తం చేసేందుకు అవసరంగా ఉంటాయా? వెయ్యేళ్ళ పరిపాలన సమయంలో ఈ దర్శనంలోని విషయాలు పూర్తిగా అక్షరాలా నెరవేరుతాయని అభిప్రాయపడేవారికి ఈ ప్రశ్న ఒక సమస్యగా ఉంది. అయితే ఈ అధ్యాయాలకు ఎలాంటి వివరణ ఇవ్వడానికి ప్రయత్నించిన ఇంతే కఠినమైన ప్రశ్నలు ఎదురౌతాయి. నిజానికి మోషే ధర్మశాస్త్రం కింది అర్పణలూ బలులూ కూడా ప్రాయశ్చిత్తం చేయలేకపోయాయి. అప్పుడు క్రీస్తు చేయబోయే ఒకే ప్రాయశ్చిత్తానికీ పాపపరిహారానికీ అవి సూచనలు మాత్రమే. ఇక్కడ యెహెజ్కేలు గ్రంథంలో చెప్పిన అర్పణలు కూడా క్రీస్తు చేసినదానికి సూచనలై ఉంటాయేమో.

14. తైలము చెల్లించునదెట్లనగా నూట ఎనుబది పళ్ల నూనెలో పడియు ముప్పాతికవంతున చెల్లింపవలెను. తూము నూట ఎనుబది పళ్లు పట్టునదగును.

15. మరియు ఇశ్రాయేలీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై నైవేద్యమునకును దహనబలికిని సమాధాన బలికిని మంచి మేపుతగిలిన గొఱ్ఱె లలో మందకు రెండువందలలో ఒకదానిని తేవలెను.

16. ఇశ్రాయేలీయులలోని అధిపతికి చెల్లింపవలసిన యీ అర్ప ణము ఈ ప్రకారముగా తెచ్చుటకు దేశమునకు చేరిన జనులందరును బద్ధులైయుందురు.

17. పండుగలలోను, అమా వాస్య దినములలోను, విశ్రాంతిదినములలోను, ఇశ్రా యేలీయులు కూడుకొను నియామకకాలములలోను వాడ బడు దహనబలులను నైవేద్యములను పానార్పణములను సరిచూచుట అధిపతి భారము. అతడు ఇశ్రాయేలీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై పాపపరిహారార్థ బలిపశువులను నైవేద్యములను దహనబలులను సమాధాన బలిపశువులను సిధ్దపరచవలెను.

18. ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగామొదటి నెల మొదటి దినమున నిర్దోషమైన కోడెను తీసికొని పరిశుద్ధస్థలము నిమిత్తము పాపపరిహారార్థబలి నర్పింప వలెను.

ఇక్కడినుంచి 46వ అధ్యాయం 16వ వచనం వరకు ప్రజల అర్పణల గురించి కొన్ని ఆదేశాలు ఉన్నాయి. మోషే ధర్మశాస్త్రానికి వీటికీ అనేక తేడాలు ఉన్నాయి. ఈ మార్పుల వెనుక ఉన్న రహస్యమేమిటో అర్థం చేసుకోవడం చాలా కష్టం.

19. ఎట్లనగా యాజకుడు పాపపరిహారార్థబలి పశురక్తము కొంచెము తీసి, మందిరపు ద్వారబంధములమీదను బలిపీఠవు చూరు నాలుగు మూలలమీదను లోపటి ఆవరణపు వాకిటి ద్వారబంధములమీదను ప్రోక్షింపవలెను.

20. తెలియక తప్పిపోయిన వారిని విడిపించునట్లుగా మందిరమునకు ప్రాయశ్చిత్తము చేయుటకై నెల యేడవ దినమందు ఆలాగు చేయవలెను.

21. మొదటి నెల పదునాలుగవ దిన మున పస్కాపండుగ ఆచరింపవలెను; ఏడు దినములు దాని నాచరింపవలెను. అందులో పులియని ఆహారము తినవలెను.

“పస్కా”– లేవీయకాండము 23:5 నోట్.

22. ఆ దినమున అధిపతి తనకును దేశమునకు చేరిన జనులందరికిని పాపపరిహారార్థబలిగా ఒక యెద్దును అర్పింపవలెను.

ఈ అధిపతి మెస్సీయ అయిన యేసుప్రభువు కాడు అనడానికి ఈ వచనం రుజువు. యేసు ప్రభువు పాపరహితుడు. తనకు పాపాల కోసమై ఎలాంటి బలీ అర్పించవలసిన అవసరం లేదు.

23. మరియు ఏడు దినములు అతడు నిర్దోషమైన యేడు ఎడ్లను ఏడు పొట్టేళ్ళను తీసికొని, దినమొక టింటికి ఒక యెద్దును ఒక పొట్టేలును దహనబలిగా యెహోవాకు అర్పింపవలెను; మరియు అనుదినము ఒక్కొక్క మేకపిల్లను పాపపరిహారార్థబలిగా అర్పింప వలెను.

24. మరియు ఎద్దొకటింటికిని పొట్టేలొకటింటికిని తూము పిండిపట్టిన నైవేద్యము చేయవలెను. తూము ఒకటింటికి మూడు పళ్ల నూనె యుండవలెను.

25. మరియు ఏడవ నెల పదునైదవ దినమున పండుగ జరుగుచుండగా యాజకుడు ఏడు దినములు పండుగ ఆచరించుచు పాప పరిహారార్థబలి విషయములోను దహనబలివిషయములోను నైవేద్య విషయములోను నూనె విషయములోను ఆ ప్రకారముగానే చేయవలెను.

ఈ పండుగను నిర్గమకాండము 23:16; నిర్గమకాండము 34:22 లో “ఫలసేకరణోత్సవం” అనీ, లేవీయకాండము 23:34; ద్వితీయోపదేశకాండము 16:16 లో “పర్ణశాలల పండుగ” అనీ వర్ణించారు.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Ezekiel - యెహెఙ్కేలు 45 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

ఇక్కడ పేర్కొన్న కాలంలో, దేవుని మరియు అతని మంత్రుల ఆరాధన కోసం నిబంధనలు ఉంటాయి. పాలకులు క్రీస్తు క్రింద తమ అధికారాన్ని గుర్తిస్తూ న్యాయంగా పరిపాలిస్తారు. ప్రజలు శాంతి, సౌఖ్యం మరియు దేవుని పట్ల భక్తితో కూడిన జీవితాన్ని అనుభవిస్తారు. ప్రవక్త ఈ పదాలను మొదట వ్రాసినప్పటి నుండి ఈ భావనలు భాషను ఉపయోగించి వ్యక్తీకరించబడ్డాయి. క్రీస్తు ప్రతీకాత్మకంగా మన పస్కా గొర్రె, మన విమోచన కోసం బలి అర్పించాడు. మేము ఈ త్యాగాన్ని స్మరించుకుంటాము మరియు పాపపు బానిసత్వం నుండి విముక్తి పొందడం మరియు మన పాస్ ఓవర్ పండుగగా పనిచేసే ప్రభువు భోజనంలో దైవిక న్యాయం యొక్క విధ్వంసక పరిణామాల నుండి మన రక్షణలో సంతోషిస్తున్నాము. నిజమే, క్రైస్తవ ప్రయాణం మొత్తం పులియని రొట్టెల విందుతో సమానంగా ఉంటుంది, ఇది స్వచ్ఛత మరియు సత్యాన్ని సూచిస్తుంది.


Shortcut Links
యెహెఙ్కేలు - Ezekiel : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |