Ezekiel - యెహెఙ్కేలు 40 | View All

1. మనము చెరలోనికి వచ్చిన యిరువదియైదవ సంవత్సరము మొదటి నెల పదియవ దినమున, అనగా పట్టణము కొల్లపోయిన పదునాలుగవ సంవత్సరమున ఆ దినముననే యెహోవా హస్తము నా మీదికి రాగా ఆయన నన్ను పట్టణమునకు తోడుకొని పోయెను.

1. మేము బందీలుగా ఉన్న తరువాత ఇరవై ఐదవ సంవత్సరం ఆదిలో ఆ నెల (అక్టోబరు), పదవ రోజున యెహోవా శక్తి నా మీదికి వచ్చింది. అంటే ఇది ఆ రోజుకు బబులోను (బాబిలోనియా) వారు యెరూషలేమును వశపర్చుకున్న తరువాత పద్నాలుగు సంవత్సరాలు గడిచాయి. ఒక స్వప్న దర్శనంలో యోహోవా నన్నక్కడికి తీసికొని వెళ్లాడు.

2. దేవుని దర్శనవశుడనైన నన్ను ఇశ్రాయేలీయుల దేశములోనికి తోడుకొని వచ్చి, మిగుల ఉన్నతమైన పర్వతముమీద ఉంచెను. దానిపైన దక్షిణపుతట్టున పట్టణమువంటి దొకటి నాకగు పడెను.
ప్రకటన గ్రంథం 21:10

2. ఒక దర్శనంలో దేవుడు నన్ను ఇశ్రాయేలు రాజ్యానికి తీసుకొని వెళ్లాడు. చాలా ఎత్తయిస ఒక పర్వతం దగ్గర ఆయన నన్నుదించాడు. ఆ పర్వతం మీద ఒక నగరంలా కన్పించే ఒక దివ్య భవంతి ఉంది. ఆ నగరం దక్షిణ దిశగా ఉంది.

3. అక్కడికి ఆయన నన్ను తోడుకొని రాగా ఒక మనుష్యుడుండెను. ఆయన మెరయుచున్న యిత్తడి వలె కనబడెను, దారమును కొలకఱ్ఱయు చేత పట్టుకొని ద్వారములో ఆయన నిలువబడియుండెను.
ప్రకటన గ్రంథం 11:1, ప్రకటన గ్రంథం 21:15

3. యెహోవా నన్నక్కడికి తీసుకొని వచ్చాడు. అక్కడ ఒక మనిషి ఉన్నాడు. మెరుగుదిద్దిన కంచులా అతడు మెరుస్తున్నాడు. ఆ మనిషి చేతిలో గుడ్డతో చేసిన కొలతతాడు మరియు కొలతబద్ద ఉన్నాయి. అతడు ద్వారం వద్ద నిలబడ్డాడు.

4. ఆ మను ష్యుడు నాతో ఇట్లనెను నరపుత్రుడా, నేను నీకు చూపుచున్న వాటినన్నిటిని కన్నులార చూచి చెవులార విని మనస్సులో ఉంచుకొనుము; నేను వాటిని నీకు చూపుటకై నీవిచ్చటికి తేబడితివి, నీకు కనబడు వాటి నన్నిటిని ఇశ్రాయేలీయులకు తెలియజేయుము.

4. ఆ మనిషి నాతో అన్నాడు, “నరపుత్రుడా నీ కళ్లను, చెవులను శ్రద్ధగా ఉపయోగించు. ఈ వస్తువులను చూడు. నేను చెప్పేది విను. నేను చూపించే ప్రతిదాని పట్ల నీవు శ్రద్ధ వహించు. ఎందుకనగా నేను ఇవన్నీ నీకు చూపించే నిమిత్తమే నీవిక్కడకు తేబడ్డావు. నీవు చూసినదంతా ఇశ్రాయేలు వంశం వారికి చెప్పాలి.”

5. నేను చూడగా నలుదిశల మందిరముచుట్టు ప్రాకార ముండెను, మరియు ఆ మనుష్యునిచేతిలో ఆరు మూరల కొలకఱ్ఱయుండెను, ప్రతిమూర మూరెడు బెత్తెడు నిడివి గలది, ఆయన ఆ కట్టడమును కొలువగా దాని వెడల్పును దాని యెత్తును బారన్నర తేలెను.
ప్రకటన గ్రంథం 21:15

5. ఆలయ ఆవరణ చుట్టూ నేనొక గోడ చూశాను. ఆ మనిషి చేతిలో కొలత బద్ద ఉంది. దాని పొడవు ఆరు మూరలు. ఆ మనిషి గోడ యొక్క మందాన్ని కొలిచాడు. దాని మందం పది అడుగుల ఆరంగుళాలు. తరువాత అతడు గోడ ఎత్తు కొలవగా అది పది అడుగుల ఆరంగుళాలు ఉంది.

6. అతడు తూర్పుతట్టున నున్న గుమ్మమునకు వచ్చి దాని సోపానములమీది కెక్కి గుమ్మపు గడపను కొలువగా దాని వెడల్పు, అనగా మొదటి గడప వెడల్పు బారన్నర తేలెను.

6. పిమ్మట ఆ మనిషి తూర్పు ద్వారం వద్దకు వెళ్లాడు. అక్కడ దాని మెట్లెక్కి ద్వారపు గడప వెడల్పు కొలవగా అది పది అడుగుల ఆరంగుళాలు ఉంది. మరియొక గడప వెడల్పు కూడ పది అడుగుల ఆరంగుళాలే ఉంది.

7. మరియు కావలిగది నిడివియు వెడల్పును బారన్నర, కావలి గదులకు మధ్య అయిదేసి మూరల యెడముండెను. గుమ్మముయొక్క ద్వారపు ప్రక్కకును మందిరమునకు బారన్నర యెడము.

7. అక్కడ ఒక గది ఉంది. దాని పొడవు, వెడల్పులు ఒక్కొక్కటి పది అడుగుల ఆరంగుళాలు. గదుల మధ్య ఖాళీస్థలం ఎనిమిది అడుగుల తొమ్మిది అంగుళాలు ఉంది. లోపలి వైపుకు తిరిగి ఉన్న ముఖ మండపం దిశలో ఉన్న ద్వారం యొక్క గడప వెడల్పు పది అడుగుల ఆరంగుళాలు.

8. గుమ్మపు ద్వారమునకును మందిరమునకును మధ్య కొలువగా బారన్నర తేలెను.

8. ఆలయానికి పక్కనున్న ద్వార ముఖ మంటపాన్ని ఆ మనిషి కొలిచాడు. దాని వెడల్పు పది అడుగుల ఆరంగుళాలు.

9. గుమ్మపు ద్వారము కొలువగా అది యెనిమిది మూరలై యుండెను, దానిస్తంభములు రెండేసి మూరలు; అవి గుమ్మపు ద్వారము మందిరపు దిక్కుగా చూచుచుండెను.

9. పిమ్మట అతడు ద్వార మండపాన్ని కొలవగా అది ఎనిమిది మూరలున్నది. ద్వారపు రెండు పక్కలనున్న గోడను కొలిచాడు. ఒక్కొక్క పక్క రెండు మూరల మందం ఉంది. ముఖ మంటపం ద్వారానికి చివరి కోవెలదిశగా ఉంది. మండప ద్వారం లోపలి వైపున ఉంది.

10. తూర్పు గుమ్మపు ద్వారముయొక్క కావలి గదులు ఇటు మూడును, అటు మూడును ఉండెను, మూడు గదులకు కొలత యొకటే. మరియు రెండు ప్రక్కలనున్న స్తంభములకు కొలత యొకటే.

10. ద్వారానికి ఇరు వైపుల మూడేసి చిన్న గదులున్నాయి. ఈ మూడు చిన్న గదుల నాలుగు పక్కల గోడలూ ఒకే కొలతలో ఉన్నాయి. ద్వారపు కమ్మెలు రెండు పక్కలా ఒకే కొలతలో ఉన్నాయి.

11. ఆ యా గుమ్మముల వాకిండ్లు కొలువగా వాటి వెడల్పు పది మూరలును నిడివి పదుమూడు మూరలును తేలెను.

11. ద్వారపు ప్రవేశ మార్గం పది మూరల వెడల్పు, పదమూడు మూరల నిడివి కలిగి ఉంది.

12. కావలి గదులముందర మూరెడు ఎత్తుగల గోడ ఇరుప్రక్కల నుండెను, ఆ ప్రక్కను ఈ ప్రక్కను మూరెడు ఎత్తుగల గోడ యుండెను; గదులైతే ఇరుప్రక్కలను ఆరుమూరల ఎత్తుగలవి.

12. ప్రతి గది ముందు ఒక లోతైన గోడ ఉంది. ఆ గోడ ఎత్తు ఆరు మూరలు. దాని మందం ఆరు మూరలు. గదులు చతురస్రాకారంలో ఉన్నాయి. ప్రతి గోడ ఆరు మూరలపొడుగు కలది.

13. ఒకగది కప్పునుండి రెండవదాని కప్పువరకు గుమ్మమును కొలువగా ఇరువది యయిదు మూరల వెడల్పు తేలెను, రెండు వాకిండ్లమధ్య గోడను అదే కొలత.

13. ఆ మనిషి ద్వారపు కొలతలను ఒక గది పైకప్పునుండి ఎదురుగానున్న మరి యొక గది పైకప్పు వరకు కొలిచాడు. అది ఇరవై ఐదు మూరలుంది.

14. అరువదేసి మూరలు ఎడముగా ఒక్కొక్క స్తంభము నిలువబెట్టబడెను. గుమ్మము చుట్టునున్న ఆవరణము స్తంభములవరకు వ్యాపించెను.

14. అతడు పక్కనున్న గోడల ముందు భాగంతో బాటు, మంటపం ముందున్న పక్క గోడలతో సహా కొలిచాడు. దాని పొడవు మొత్తం అరవై మూరలు. దాని వెడల్పు ముప్పయి అడుగులు. మండపం చుట్టూ ఆవరణ ఉంది.

15. బయటి గుమ్మమునొద్దనుండి లోపటి గుమ్మపుద్వారమువరకు ఏబదిమూరలు.

15. మండపం బయటి ద్వారం నుండి లోపలి ద్వారం వరకు ఏభై మూరలు ఉన్నాయి.

16. కావలి గదులకును గుమ్మములకు లోపల వాటికి మధ్యగా చుట్టు నున్న గోడలకును ప్రక్కగదులకును కమ్ములు పెట్టబడిన కిటికీలుండెను, గోడలోని స్తంభములకును కిటికీలుండెను; ప్రతి స్తంభముమీదను ఖర్జూరపు చెట్లు రూపింపబడి యుండెను.

16. కాపలాగ దులకు పైన, పక్క గోడల పైన, మంటపం మీద చిన్న కిటికిలు ఉన్నాయి. ఆ కిటికిల పెద్ద భాగాలు ద్వారాన్ని చూస్తున్నాయి. ద్వారానికి ఇరువైపుల ఉన్న గోడల మీద తాటిచెట్లు చెక్కబడి ఉన్నాయి.

17. అతడు బయటి ఆవరణములోనికి నన్ను తీసికొనిరాగా అచ్చట గదులును చప్టాయు కనబడెను. చఎ్టామీద ముప్పది చిన్నగదులు ఏర్పడియుండెను.

17. పిమ్మట ఆ మనుష్యుడు నన్ను బయటి ఆవరణలోకి తీసుకొని వచ్చాడు. అక్కడ గదులు, బాటలు రాళ్ళతో చేయబడ్డ వాటిని చూశాను. గోడల నానుకొని ఉన్న ఆ గదులు బాటకు ఎదురుగా ఉన్నాయి . అవి ఆవరణ చుట్టూ ఉన్నాయి. ముందు భాగంలో చదును చేసిన బాట మీద ముప్పయి గదులున్నాయి.

18. ఈ చప్టా గుమ్మములవరకుండి వాటి వెడల్పున సాగియుండెను. అది క్రింది చప్టా ఆయెను.

18. ద్వారం ఎంత పొడవుగా ఉందో చదును బాట కూడ అంత పొడవుంది. ఆ దారి ద్వారపు లోపలికొస వరకు చేరివుంది. ఇది దిగువ చదునుబాట.

19. క్రింది గుమ్మము మొదలుకొని లోపలి ఆవరణమువరకు ఆయన వెడల్పు కొలువగా ఇది తూర్పునను ఉత్తరమునను నూరు మూరలాయెను.

19. పిమ్మట ఆ మనుష్యుడు కింది ద్వారం నుండి లోపలి ఆవరణ వరకు గల దూరాన్ని కొలిచాడు. అది తూర్పున, ఉత్తరాన నూరు మూరలు ఉంది.

20. మరియు ఉత్తరపువైపున బయటి ఆవరణము చూచుచుండు గుమ్మపు నిడివిని వెడల్పును

20. ఉత్తర దిశకు ఉన్న వెలుపలి ఆవరణ ద్వారం యొక్క పొడవు వెడల్పులను ఆ మనిషి కొలిచాడు.

21. దాని ఇరుప్రక్కలనున్న మూడేసి కావలి గదులను వాటి స్తంభములను వాటి మధ్యగోడలను అతడు కొలువగా వాటి కొలత మొదటి గుమ్మపు కొలత ప్రకారముగా కనబడెను, అనగా నిడివి ఏబదిమూరలు వెడల్పు ఇరువదియైదుమూరలు కనబడెను.

21. ఈ ద్వారం దాని రెండు పక్కల ఉండే మూడేసి గదులు దాని ఆవరణ, మొదటి ద్వారం ప్రక్కనే ఉన్నాయి. దాని పొడవు యాభై మూరలు, వెడల్పు ఇరవై ఐదు మూరలు ఉంది.

22. వాటి కిటికీ లును వాటి మధ్యగోడలును ఖర్జూరపుచెట్లవలె రూపింప బడిన వాటి అలంకారమును తూర్పుద్వారముయొక్క కొలత ప్రకారముగా కనబడెను మరియు ఎక్కుటకై యేడు మెట్లుండెను, ఎదుటనుండి దాని మధ్యగోడలు కనబడుచుండెను.

22. దాని కిటికీలు, దాని మండపం, ఖర్జూరపు చెట్ల చెక్కడాలు, తూర్పు ద్వారపు కొలతల పనితనం పలెనే ఉన్నాయి. ద్వారం వరకు ఏడు మెట్లున్నాయి. ద్వార మండపం లోపలికి ఉంది.

23. ఉత్తరద్వారమున కెదురుగా ఒకటియు, తూర్పుద్వారమున కెదురుగా ఒకటియు, లోపటి ఆవరణమునకు పోవు రెండు గుమ్మములుండెను. ఈ గుమ్మమునకు ఆ గుమ్మమునకు ఎంతైనది అతడు కొలువగా నూరుమూరల యెడము కనబడెను.

23. లోపలి ఆవరణలో అడ్డంగా ఉత్తర ద్వారానికి ఎదురుగా ఒక ద్వారం ఉంది. అది తూర్పు ద్వారం వలెనే ఉంది. ఆ మనిషి ఈ లోపలి ద్వారం నుంచి ఆ వెలుపలి ద్వారం వరకు కొలవగా అది ద్వార ద్వారానికి నూరు మూరల వెడల్పు ఉంది.

24. అతడు నన్ను దక్షిణపుతట్టునకు తోడుకొని పోగా దక్షిణపుతట్టున గుమ్మమొకటి కనబడెను. దాని స్తంభములను మధ్యగోడలను కొలువగా అదే కొలత కనబడెను.

24. పిమ్మట ఆ మనిషి నన్ను దక్షిణానికి తీసుకొని వెళ్లాడు. అక్కడ నేను దక్షిణ ద్వారం చూశాను. అతడు ద్వారపు కమ్మీలను, మండపాన్ని కొలిచాడు. ఈ కొలతలు ఇతర ద్వారాల కొలతల మాదిరిగానే ఉన్నాయి.

25. మరియు వాటి కున్నట్టుగా దీనికిని దీని మధ్యగోడలకును చుట్టు కిటికీ లుండెను, దాని నిడివి ఏబది మూరలు దాని వెడల్పు ఇరవదియైదు మూరలు.

25. ద్వారానికి, మండపానికి చుట్టూ మిగతా వాటి మాదిరే కిటికీలున్నాయి. ద్వారం ఏభై మూరల పొడవు, ఇరవై ఐదు మూరల వెడల్పు ఉంది.

26. ఎక్కుటకు ఏడు మెట్లును ఎదురుగా కనబడు మధ్యగోడలును ఉండెను. మరియు దాని స్తంభముల ఇరుప్రక్కలను ఖర్జూరపు చెట్లను పోలిన అలంకారముండెను

26. ద్వారం వరకు ఏడు మెట్లున్నాయి. దాని మండప ద్వారం లోపల చివర వరకూ ఉంది. ద్వారానికి అటూ ఇటూ ఖర్జూరపు చెట్ల చెక్కడపు పనితనం ఉంది.

27. లోపటి ఆవరణమునకు దక్షిణపు తట్టున గుమ్మమొకటి యుండెను, దక్షిణపు తట్టును గుమ్మమునుండి గుమ్మమువరకు ఆయన కొలువగా నూరు మూరలాయెను.

27. లోపలి ఆవరణ యొక్క దక్షిణ దిశన ఒక గుమ్మం ఉంది. ఒక ద్వారానికి, మరొక ద్వారానికి మధ్య దూరాన్ని ఆ మనిషి కొలిచాడు. దాని వెడల్పు నూట డెభై ఐదు అడుగులు.

28. అతడు దక్షిణమార్గమున లోపటి ఆవరణములోనికి నన్ను తోడుకొనిపోయి దక్షిణపు గుమ్మమును కొలిచెను; దాని కొలత అదే.

28. తరువాత నన్నతడు దక్షిణ ద్వారం గుండా లోపలి ఆవరణలోకి తీసుకొని వచ్చాడు. ఇతర గుమ్మాల మాదిరిగానే దక్షిణ ద్వారం కొలతలు కూడ ఉన్నాయి.

29. మరియు దాని కావలిగదులును స్తంభములును మధ్య గోడలును పైచెప్పిన కొలతకు సరిపడెను; దానికిని దాని చుట్టు ఉన్న మధ్యగోడలకును కిటికీలుండెను, దాని నిడివి ఏబది మూరలు దాని వెడల్పు ఇరువదియైదు మూరలు

29. దక్షిణ ద్వారపు గదులు, దాని ద్వారపు కమ్మీలు, దాని మండపం కొలతలు కూడ ఇతర గుమ్మాల కొలతలవలెనే ఉన్నయి. ద్వారానికి, మండపానికి చుట్టూ కిటికీలున్నాయి. ద్వారం పొడవు ఏభై మూరలు, వెడల్పు ఇరవై ఐదు మూరలు ఉన్నాయి. లోపలి ఆవరణ చుట్టూ మండపాలున్నాయి.

30. చుట్టు మధ్యగోడల నిడివి ఇరువది యైదు మూరలు, వెడల్పు అయిదు మూరలు.

30. మండపం పొడవు ఇరవై ఐదు మూరలు, వెడల్పు ఐదు మూరలు కలిగి ఉంది.

31. దాని మధ్య గోడలు బయటి ఆవరణముతట్టు చూచుచుండెను; దాని స్తంభములమీద ఖర్జూరపుచెట్లను పోలిన అలంకారముండెను; ఎక్కుటకు ఎనిమిది మెట్లుండెను.

31. మరియు దాని మంపప ద్వారం వెలుపలి ఆవరణ తరువాత ఉంది. దాని ద్వారానికి ఇరు పక్కలనున్న గోడల మీద ఖర్జూరపు చెట్ల చెక్కడపు పనితనం ఉంది. దనిని ఎక్కటానికి ఎనిమిది మెట్లున్నాయి.

32. తూర్పుతట్టు లోపటి ఆవరణములోనికి నన్ను తోడుకొనిపోయి దాని గుమ్మమును ఆయన కొలువగా పైచెప్పిన కొలత తేలెను.

32. ఆ మనిషి నన్ను తూర్పు దిశన ఉన్న లోపలి ఆవరణలోనికి తీసుకొని వచ్చాడు. అతడు గుమ్మాన్ని కొలిచాడు. అది ఇతర గుమ్మాల మాదిరే కొలతలు కలిగిఉంది.

33. దాని కావలిగదులకును స్తంభములకును మధ్యగోడలకును కొలత అదే; దానికిని దాని చుట్టునున్న మధ్యగోడలకును కిటికీలుండెను; నిడివి యేబది మూరలు, వెడల్పు ఇరువది యైదు మూరలు.

33. తూర్పు ద్వారపు గదులు, పక్కగోడలు, మండపం ఇతర ద్వారాల మాదిరే కొలతలు కలిగి ఉన్నాయి. ద్వారానికి, మండపానికి చుట్టూ కిటికీలున్నాయి. ద్వారం పొడవు ఏభై మూరలు, వెడల్పు ఇరవై ఐదు మూరలు కలిగి ఉంది.

34. దాని మధ్యగోడలు బయటి ఆవరణము తట్టు చూచుచుండెను. ఈ ప్రక్కను ఆ ప్రక్కను దాని స్తంభములమీద ఖర్జూరపుచెట్లను పోలిన అలంకార ముండెను, ఎక్కుటకు ఎనిమిది మెట్లుండెను.

34. దాని మండపం ద్వారానికి చివర వెలుపలి ఆవరణ వైపుకు ఉంది. దాని ఇరు పక్కల ఉన్న గోడల మీద ఖర్జూరపు చెట్లు చెక్కబడి ఉన్నాయి. దానికి ఎనిమిది మెట్లున్నాయి.

35. ఉత్తరపు గుమ్మమునకు అతడు నన్ను తోడుకొనిపోయి దాని కొలువగా అదే కొలత యాయెను.

35. పిమ్మట ఆ మనిషి నన్ను ఉత్తర ద్వారం వద్దకు తీసుకొని వచ్చాడు. అతడు దానిని కొలిచాడు. దీని కొలతలు కూడా ఇతర ద్వారాలవలె ఉన్నాయి.

36. దాని కావలిగదులకును స్తంభములకును దాని మధ్యగోడలకును అదే కొలత; దానికిని దాని చుట్టునున్న మధ్యగోడలకును కీటికీలుండెను; దాని నిడివి యేబది మూరలు దాని వెడల్పు ఇరువదియైదు మూరలు.

36. ఇతర ద్వారాలు, గదుల, మండపాల కొలతల మేరకే అది కూడా ఉంది. ద్వారం మరియు మండపం చుట్టూ కిటికీలున్నాయి. అది యాభై మూరల పొడవు, ఇరవై ఐదు మూరలు వెడల్పు కలిగి ఉంది.

37. దాని స్తంభములు బయటి ఆవరణముతట్టు చూచుచుండెను; ఆ స్తంభములమీద ఈ ప్రక్కను ఆ ప్రక్కను ఖర్జూరపు చెట్లనుపోలిన అలంకారముండెను; ఎక్కుటకు ఎనిమిది మెట్లుండెను.

37. దాని మండపం ద్వారానికి చివర వెలుపలి ఆవరణ వైపున ఉంది. ఆ రెండు గొడల మీద ఖర్జూరవు చెట్లు చెక్కబడ్డాయి. దానికి ఎనిమిది మెట్లున్నాయి.

38. గుమ్మముల స్తంభములయొద్ద వాకిలిగల గదియుండెను; అక్కడ దహనబలి పశువుల మాంసము కడుగుదురు.

38. ద్వారం వద్ద తలుపువున్న ఒక గది మండపానికి చెరువగా ఉంది. యాజకులు దహన బలులు ఇవ్వటానికి బలి పశువులను కడి గే చోటు ఇదే.

39. మరియు గుమ్మపు మంటపములో ఇరుప్రక్కల రెండేసి బల్లలుంచబడెను; వీటిమీద దహనబలి పశువులును పాప పరిహారార్థ బలిపశువులును అపరాధపరిహారార్థ బలిపశు వులును వధింపబడును.

39. ద్వార మండపంలో ప్రతి పక్క రెండు బల్లలున్నాయి. అపరాధ పరిహారార్థ బలులు ఇవ్వటానికి తగిన జంతువులను ఈ బల్లల మీదనే వధిస్తారు.

40. గుమ్మముయొక్క వాకిలిదగ్గర ఉత్తరపుదిక్కున మెట్లు ఎక్కుచోటున ఇరుప్రక్కల రెండేసి బల్లలుండెను. అనగా గుమ్మపు రెండుప్రక్కల నాలుగేసి బల్లలుండెను. ఇవి పశువులను వధించుటకై ఉంచబడి యుండెను.

40. మరియు ద్వార మండ పానికి అవతలి పక్కన కూడా రెండు బల్లలున్నాయి.

41. దహనబలి పశువులు మొదలగు బలిపశువులను వధించుటకై వినియోగించు ఉపకరణము లుంచదగిన యెనిమిది బల్లలు ఈ తట్టు నాలుగు ఆ తట్టు నాలుగు మెట్లదగ్గర నుండెను.

41. గోడల లోపల నాలుగు బల్లలున్నాయి. గోడల బయట నాలుగు బల్లలున్నాయి. మొత్తం అక్కడ ఎనిమిది బల్లలున్నాయి. ఈ బల్లల మీదనే యాజకులు బలి పశువులను వధిస్తారు.

42. అవి మూరెడున్నర నిడివియు మూరెడున్నర వెడల్పును మూరెడు ఎత్తును గలిగి మలిచిన రాతితో చేయబడి యుండెను.

42. దహన బలుల నిమిత్తం నాలుగు చెక్కిన రాతి బల్లలు ఉన్నాయి. ఈ బల్లలు ఒక్కొక్కటి రెండడుగుల ఏడున్నర అంగుళాల పొడవు; రెండడుగుల ఏడున్నర అంగుళాల వెడల్పు; ఒక అడుగు తొమ్మిది అంగుళాల ఎత్తు కలిగి ఉన్నాయి. దహన బలులకు, ఇతర బలులకు వినియోగించే జంతు వులను చెంపటానికి తగిన పని ముట్లను యాజకులు ఈ బల్లల మీదనే ఉంచుతారు.

43. చుట్టుగోడకు అడుగడుగు పొడుగుగల మేకులు నాటబడియుండెను; అర్పణ సంబంధమైన మాంసము బల్లలమీద ఉంచుదురు.

43. మూడంగుళాల మాంసపు కొక్కెములు ఆలయ మంతటా ఉంచ బడ్డాయి. అర్పణకు ప్రత్యేకించిన మాంసాన్ని బల్లల మీద ఉంచుతారు.

44. లోపటి గుమ్మము బయట లోపటి ఆవరణములో ఉత్తరపు గుమ్మము దగ్గరనుండి దక్షిణముగా చూచు నొకటియు, తూర్పు గుమ్మము దగ్గరనుండి ఉత్తరముగా చూచు నొకటియు రెండు గదులుండెను.

44. లోపలి ఆవరణలోకి వెళ్లే ద్వారం బయట రెండు గదులున్నాయి. ఒకటి ఉత్తర ద్వారం వద్ద ఉంది. అది దక్షిణానికి చూస్తూ ఉంది. రెండవ గది దక్షిణ ద్వారం వద్ద ఉంది. అది ఉత్తరానికి చూస్తూంది.

45. అప్పుడతడు నాతో ఇట్లనెను దక్షిణపుతట్టు చూచు గది మందిరమునకు కావలి వారగు యాజకులది.

45. ఆ మనిషి నాతో ఇలా అన్నాడు: “దక్షిణానికి చూసే ఈ గది దేవాలయ సేవలో ఉంటూ పనిమీద ఉన్న యాజకులు ఉండటానికి ప్రత్యేకించబడింది.

46. ఉత్తరపుతట్టు చూచు గది బలిపీఠమునకు కావలివారగు యాజకులది. వీరు లేవీయులలో సాదోకు సంతతివారై సేవచేయుటకై యెహోవా సన్నిధికి వచ్చువారు.

46. కాని ఉత్తరానికి చూస్తూవున్న గదిని విధులకు వచ్చి బలిపీఠం వద్ద పనిచేసే యాజకులు ఉండటానికి ఇవ్వబడింది. ఈ యాజకులంతా సాదోకు సంతతివారు. లేవీయులలో సాదోకు సంతతివారు మాత్రమే యెహోవాకు బలులు తెచ్చి సేవచేయటానికి అర్హులు.”

47. అతడు ఆ ఆవరణమును కొలువగా నిడివియు వెడల్పును నూరుమూరలై చచ్చౌకముగా ఉండెను. మందిరమునకు ఎదురుగా బలిపీఠముంచబడెను.
ప్రకటన గ్రంథం 11:1

47. ఆ మనుష్యుడు లోపలి ఆవరణను కొలవగా అది ఖచ్చితమైన సమ చదరంగా ఉంది. దాని పొడవు, వెడల్పులు ప్రతి ఒక్కటి నూట డెభై ఐదు అడుగులు ఉంది. బలిపీఠం ఆలయానికి ముందున్నది.

48. అతడు మందిరముయొక్క మంటపములోనికి నన్ను తోడుకొని వచ్చి మంటప స్తంభములను ఒక్కొక్కదాని కొలువగా అది ఇరుప్రక్కల అయిదేసి మూరలుండెను, గుమ్మము ఇరుప్రక్కల మూడేసి మూరల వెడల్పు.

48. ఆ మనుష్యుడు నన్ను ఆలయ మండపానికి తీసుకొనివచ్చాడు. అతడు మండపం యొక్క రెండు పక్కలనున్న గోడలను కొలిచాడు. ప్రతి పక్క గోడలు ఐదు మూరల దళం, మూడు మూరల వెడల్పు కలిగి ఉన్నాయి. వాటి మధ్య పద్నాలుగు మూరల స్ధలం ఉంది.

49. మంటపమునకు నిడివి యిరువది మూరలు; ఎక్కుటకై యుంచబడిన మెట్లదగ్గర దాని వెడల్పు పదకొండు మూరలు, స్తంభములదగ్గర ఇరు ప్రక్కల ఒక్కొక్కటిగా కంబములుంచబడెను.

49. మండపం పొడవు పన్నెండు మూరలు, వెడల్పు ఇరవై మూరలు, మండపంచేరటానికి పది మెట్లు ఉన్నాయి. గోడలకు పక్కగా అటు ఒకటి, ఇటు ఒకటి రెండు స్తంభాలున్నాయి.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Ezekiel - యెహెఙ్కేలు 40 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

ఆలయ దర్శనం.
ఇక్కడ ఒక దర్శనం, 40వ అధ్యాయంలో మొదలై, పుస్తకం చివర, 48వ అధ్యాయం వరకు విస్తరించింది. ఈ విభాగం మొత్తం బైబిల్‌లోని అత్యంత సవాలుగా ఉన్న భాగాలలో ఒకటిగా విస్తృతంగా గుర్తించబడింది. అధిగమించలేనిదిగా అనిపించే ఇబ్బందులను ఎదుర్కొన్నప్పుడు, మన మోక్షం ప్రతి వివరాలను అర్థం చేసుకోవడంపై ఆధారపడి ఉండదు, కానీ ముఖ్యమైన సత్యాల స్పష్టతపై ఆధారపడినందుకు మనం దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి. ఈ క్లిష్టమైన విషయాలలో కూడా మనం దేవుని ప్రత్యక్షత కోసం ఓపికగా ఎదురుచూడాలి.
ఈ అధ్యాయం ఆలయం యొక్క రెండు బయటి ఆస్థానాలను వర్ణిస్తుంది. ఇక్కడ పేర్కొన్న వ్యక్తి దేవుని కుమారుడా లేదా సృష్టించబడిన దేవదూత అనేది అస్పష్టంగానే ఉంది. అయితే, క్రీస్తు మన బలిపీఠం మరియు త్యాగం రెండింటినీ గుర్తుంచుకోవడం చాలా అవసరం. దేవునితో మన పరస్పర చర్యలన్నిటిలో మన దృష్టిని ఆయనపై నిలిపి విశ్వాసంతో దేవుని చేరుకోవాలి. కీర్తనల గ్రంథము 74:12మనకు చెబుతున్నట్లుగా, అతను భూమి మధ్యలో మోక్షంగా ఉన్నాడు, ప్రపంచం నలుమూలల నుండి వెతకవలసిన ఒక దీపం.


Shortcut Links
యెహెఙ్కేలు - Ezekiel : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |