Ezekiel - యెహెఙ్కేలు 38 | View All

1. మరియయెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను

1. The LORD said:

2. నరపుత్రుడా, మాగోగు దేశపువాడగు గోగు, అనగా రోషునకును మెషెకునకును తుబాలునకును అధిపతియైన వానితట్టు అభిముఖుడవై అతని గూర్చి ఈ మాట యెత్తి ప్రవచింపుము
ప్రకటన గ్రంథం 20:8

2. Ezekiel, son of man, condemn Gog, that wicked ruler of the kingdoms of Meshech and Tubal in the land of Magog. Tell him:

3. ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా రోషునకును మెషెకు నకును తుబాలునకును అధిపతియగు గోగూ, నేను నీకు విరోధినై యున్నాను.

3. I, the LORD God, am your enemy,

4. నేను నిన్ను వెనుకకు త్రిప్పి నీ దవుడలకు గాలములు తగిలించి, నిన్నును నీ సైన్యమంతటిని గుఱ్ఱములను నానావిధములైన ఆయుధములు ధరించు నీ రౌతులనందరిని, కవచములును డాళ్లును ధరించి ఖడ్గములు చేతపట్టుకొను వారినందరిని, మహాసైన్యముగా బయలు దేరదీసెదను.

4. and I will make you powerless! I will put a hook in your jaw and drag away both you and your large army. You command cavalry troops that wear heavy armor and carry shields and swords.

5. నీతో కూడిన పారసీకదేశపు వారిని కూషీయులను పూతువారినందరిని, డాళ్లను శిర స్త్రాణములను ధరించు వారినందరిని నేను బయలుదేరదీసె దను.

5. Your army includes soldiers from Persia, Ethiopia, and Libya,

6. గోమెరును అతని సైన్యమంతయును ఉత్తరదిక్కు లలోనుండు తోగర్మాయును అతని సైన్యమును జనము లనేకములు నీతోకూడ వచ్చును.

6. as well as from Gomer and Beth-Togarmah in the north. Your army is enormous!

7. నీవు సిధ్దముగా ఉండుము, నీవు సిద్ధపడి నీతోకూడ కలిసిన సమూహ మంతటిని సిద్ధపరచుము, వారికి నీవు కావలియై యుండ వలెను.

7. So keep your troops prepared to fight,

8. చాలదినములైన తరువాత నీవు శిక్షనొందుదువు; సంవత్సరముల అంతములో నీవు ఖడ్గమునుండి తప్పించు కొని, ఆ యా జనములలో చెదరిపోయి యెడతెగక పాడుగా ఉన్న ఇశ్రాయేలీయుల పర్వతములమీద నివ సించుటకై మరల సమకూర్చబడిన జనులయొద్దకును, ఆ యా జనులలోనుండి రప్పించబడి నిర్భయముగా నివసించు జనులందరియొద్దకును నీవు వచ్చెదవు.

8. because in a few years, I will command you to invade Israel, a country that was ruined by war. It was deserted for a long time, but its people have returned from the foreign nations where they once lived. The Israelites now live in peace in the mountains of their own land.

9. గాలి వాన వచ్చి నట్లును మేఘము కమ్మినట్లును నీవు దేశము మీదికి వచ్చెదవు, నీవును నీ సైన్యమును నీతోకూడిన బహు జనమును దేశముమీద వ్యాపింతురు.

9. But you and your army will attack them like a fierce thunderstorm and surround them like a cloud.

10. ప్రభువైన యెహోవా సెల విచ్చునదేమనగా ఆ కాలమందు నీ మనస్సులో అభి ప్రాయములు పుట్టును,

10. When that day comes, I know that you will have an evil plan

11. నీవు దురాలోచనచేసి ఇట్లను కొందువు నేను ప్రాకారములులేని గ్రామములుగల దేశముమీదికి పోయెదను, ప్రాకారములును అడ్డగడియలును గవునులునులేని దేశము మీదికి పోయెదను, నిమ్మళముగాను నిర్భయముగాను నివసించువారి మీదికి పోయెదను.

11. to take advantage of Israel, that weak and peaceful country where people live safely inside towns that have no walls or gates or locks.

12. వారిని దోచుకొని కొల్లసొమ్ముగా పట్టుకొనుటకై, పూర్వము పాడై మరల నివసింపబడిన స్థలములమీదికి తిరిగి పోయెదను, ఆ యా జనములలోనుండి సమకూర్చబడి, పశువులును సరకులును గలిగి, భూమి నట్టనడుమ నివసించు జనుల మీదికి తిరిగి పోయెదను.

12. You will rob the people in towns that were once a pile of rubble. These people lived as prisoners in foreign nations, but they have returned to Israel, the most important place in the world, and they own livestock and property.

13. సెబావారును దదానువా రును తర్షీషు వర్తకులును కొదమసింహముల వంటివారైన దానివారందరును నిన్ను చూచిసొమ్ము దోచుకొనుటకు వచ్చితివా? దోపు దోచుకొనుటకు సైన్యము సమకూర్చి తివా? బహుగా దోపు దోచుకొని, వెండి బంగారములను పశువులను సరకులను పట్టుకొని పోవుటకు చాల దోపుడు దోచుకొనుటకు వచ్చితివా? అని నిన్నడుగుదురు.

13. The people of Sheba and Dedan, along with merchants from villages in southern Spain, will be your allies. They will want some of the silver and gold, as well as the livestock and property that your army takes from Israel.

14. కాగా నరపుత్రుడా, ప్రవచనమెత్తి గోగుతో ఇట్ల నుము ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా నా జనులగు ఇశ్రాయేలీయులు నిర్భయముగా నివసించు కాలమున నీవు తెలిసికొందువుగదా?

14. I, the LORD God, know that when you see my people Israel living in peace,

15. ఉత్తర దిక్కున దూర ముననున్న నీ స్థలములలోనుండి నీవును నీతోకూడ జనములనేకములును గుఱ్రములెక్కి బహు విస్తారమైన సైన్యముగా కూడి వచ్చి

15. you will lead your powerful cavalry from your kingdom in the north.

16. మేఘము భూమిని కమ్మినట్లు ఇశ్రాయేలీయులగు నా జనులమీద పడెదరు; అంత్య దినములందు అది సంభవించును, అన్యజనులు నన్ను తెలిసి కొనునట్లు నిన్నుబట్టి వారి యెదుట నన్ను నేను పరిశుద్ధ పరచుకొను సమయమున, గోగూ, నేను నా దేశము మీదికి నిన్ను రప్పించెదను.

16. You will attack my people like a storm-cloud that covers their land. I will let you invade my country Israel, so that every nation on earth will know that I, the LORD, am holy.

17. ప్రభువగు యెహోవా సెల విచ్చునదేమనగా నిన్ను వారిమీదికి రప్పించెదనని పూర్వ మందు ఏటేట ప్రవచించుచు వచ్చిన ఇశ్రాయేలీయుల ప్రవక్తలైన నా సేవకులద్వారా నేను సెలవిచ్చినమాట నిన్నుగూర్చి నదే గదా?

17. The LORD said to Gog: Long ago, I had my prophets warn the people of Israel that someday I would send an enemy to attack them. You, Gog, are that enemy, and that day is coming.

18. ఆ దినమున, గోగు ఇశ్రాయేలీయుల దేశము మీదికి రాబోవు ఆ దినమున, నా కోపము బహుగా రగులుకొనును; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు

18. When you invade Israel, I will become furious,

19. కాబట్టి నేను రోషమును మహా రౌద్రమును గలిగిన వాడనై యీలాగు ప్రమాణముచేసితిని. ఇశ్రాయేలీయుల దేశములో మహాకంపము పుట్టును.
ప్రకటన గ్రంథం 11:13

19. and in my anger I will send a terrible earthquake to shake Israel.

20. సముద్రపు చేపలును ఆకాశపక్షులును భూజంతువులును భూమిమీద ప్రాకు పురుగులన్నియు భూమిమీదనుండు నరులందరును నాకు భయపడి వణకుదురు, పర్వతములు నాశనమగును, కొండపేటులు పడును, గోడలన్నియు నేలపడును

20. Every living thing on earth will tremble in fear of me--every fish and bird, every wild animal and reptile, and every human. Mountains will crumble, cliffs will fall, and cities will collapse.

21. నా పర్వతములన్నిటిలో అతని మీదికి ఖడ్గము రప్పించెదను, ప్రతివాని ఖడ్గము వాని సహోదరునిమీద పడును; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.

21. I, the LORD, will make the mountains of Israel turn against you. Your troops will be so terrified that they will attack each other.

22. తెగులు పంపి హత్య కలుగజేసి అతనిమీదను అతని సైన్యపు వారి మీదను అతనితో కూడిన జనములనేకముల మీదను ప్రళయమైన వానను పెద్ద వడ గండ్లను అగ్నిగంధకములను కురిపించి నేను అతనితో వ్యాజ్యెమాడుదును.
ప్రకటన గ్రంథం 8:7, ప్రకటన గ్రంథం 14:10, ప్రకటన గ్రంథం 20:10, ప్రకటన గ్రంథం 21:8

22. I will strike you with diseases and punish you with death. You and your army will be pounded with rainstorms, hailstones, and burning sulfur.

23. నేను యెహోవానై యున్నానని అన్యజనులు అనేకులు తెలిసి కొనునట్లు నేను ఘనత వహించి నన్ను పరిశుద్ధపరచుకొని వారి యెదుట నన్ను తెలియపరచుకొందును.

23. I will do these things to show the world that I, the LORD, am holy.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Ezekiel - యెహెఙ్కేలు 38 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

గోగ్ యొక్క సైన్యం మరియు దుర్మార్గం. (1-13) 
ఈ సంఘటనలు భవిష్యత్తులో జరుగుతాయి. ఈ విరోధులు యూదయ ప్రాంతంలోకి దండయాత్ర చేయడానికి ఏకమవుతారని ఊహించబడింది, అయితే దేవుడు చివరికి వారిపై విజయం సాధిస్తాడు. దేవుడు ప్రస్తుతం తన చర్చిని వ్యతిరేకిస్తున్నవారిని గుర్తించడమే కాకుండా విరోధులుగా మారేవారిని కూడా ముందుగానే చూస్తాడు మరియు తన మాట ద్వారా తన వ్యతిరేకతను తెలియజేస్తాడు. దళారులు కలిసినా, అధర్మపరులకు శిక్ష తప్పదు.

దేవుని తీర్పులు. (14-23)
ప్రత్యర్థి ఇజ్రాయెల్ భూమిపై గణనీయమైన దాడిని ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇజ్రాయెల్ దైవిక రక్షణలో సురక్షితంగా నివసిస్తున్నప్పుడు, వారికి హాని కలిగించే ప్రయత్నాలు ఫలించవని మీరు గ్రహించలేదా? భవిష్యత్తులో ఎదుర్కొనే ప్రమాదాలు మరియు సవాళ్ల నుండి చర్చిని రక్షించడానికి భద్రతకు సంబంధించిన వాగ్దానాలు దేవుని వాక్యంలో భద్రపరచబడ్డాయి. పాపుల శిక్ష ద్వారా, దేవుడు తన గొప్పతనాన్ని మరియు పవిత్రతను ప్రదర్శిస్తాడు. "తండ్రీ, నీ నామమును మహిమపరచుము" అని మనము హృదయపూర్వకముగా కోరుకొని ప్రతిదినము ప్రార్థించాలి.



Shortcut Links
యెహెఙ్కేలు - Ezekiel : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |